సెప్టెంబర్ 24 నుంచి తిరుమల బ్రహ్మోత్సవాలు

    మత మార్పిడుల నివారణకు దళిత వాడల్లో 1,000 ఆలయాలు నిర్మిస్తామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు హెచ్చరించారు. ఇవాళ టీటీడీ పాలక మండలి సమావేశమైంది. ఈ సమావేశం ముగిసిన అనంతరం  టీటీడీ చైర్మన్  చైర్మన్  మాట్లాడుతూ..తిరుమల దేవస్థానంపై తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వారిపై క్రిమినల్ కేసులు పెడతామని పేర్కొన్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పాలక మండలి సమావేశంలో తీర్మానం చేశామన్నారు. బ్రహ్మోత్సవాల వేళ.. వాహన సేవను తిలకించెందుకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ పాలక మండలి నియమించిన తర్వాత జరుగుతున్న మొదటి బ్రహ్మోత్సవమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది ఈ బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని ప్రకటించారు.   సెప్టెంబర్ 24వ తేదీ సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు స్వామి  వారికీ పట్టు వస్త్రాలు సమర్పిస్తారన్నారు. అదే రోజు.. 2026 క్యాలెండరు, డైరీలను సీఎం ఆవిష్కరిస్తారని ఆయన తెలిపారు. ఇక సెప్టెంబర్ 25వ తేదీ ఉదయం యాత్రి సముదాయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని తెలిపారు.  బ్రహ్మోత్సవాలు జరిగే 10 రోజులు..వీఐపీ సిపార్సు లేఖలను అనుమతించబోమన్నారు. ఆ రోజుల్లో ఈ లేఖలను రద్దు చేశామని చెప్పారు.  శ్రీవాణి ట్రస్టు నిధులతో కర్ణాటకలో 7ఎకరాల్లో శ్రీవారి ఆలయ నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు. అనంతవరంలోని స్వామి వారి ఆలయంలో రూ. 7.2 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.  సీఎం చంద్రబాబు ఆదేశాలు మేరకు దళిత వాడల్లో రూ.10 నుంచి రూ. 20 లక్షల నిధులతో 1000 ఆలయాలు నిర్మాణానికి ఆమోదం తెలిపినట్లు బీఆర్ నాయడు తెలిపారు. తిరుమల  బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24 నుంచి ఆక్టోబర్ 2 వరకు జరగనున్నట్లు ఆయన పేర్కొన్నారు.  ఈ కార్యక్రమం కోసం 8 లక్షల లడ్డూలు తయారు చేసి అందుబాటులో ఉంచనున్నామని వివరించారు. భక్తుల భద్రత కోసం 4500 మంది పోలీసులు, 3500 మంది వాలంటీర్లు సేవలు అందిస్తామని చెప్పారు. భక్తుల రద్దీని పర్యవేక్షించడానికి ఇస్రో సాంకేతిక సహాయం తీసుకోనున్నగట్లు వెల్లడించారు.  

యువరాజ్ సింగ్, రాబిన్ ఊతప్పలకు ఈడీ నోటీసులు

బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేసినందుకు మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, రాబిన్ ఊతప్పలకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. వీరితో పాటు సినీ నటుడు సోనూ సూద్ కు కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది.   యువరాజ్ సింగ్ తరచుగా బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేసినట్లు ఈడీ గుర్తించింది. దీంతో అతడిని ఈనెల 22న విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ ేసింది. అలాగే  ఇదే విషయంలో మరో మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్పను సెప్టెంబర్ 23న విచారణకు రావాల్సిందిగా ఆదేశిస్తూ నోటీసులు ఇచ్చింది.  బెట్టింగ్ యాప్ ల ప్రమోషన్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. పలువురు సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేసినట్లు విచారణలో నిర్ధారించుకున్న ఈడీ ఇప్పటికే మాజీ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్ లను విచారించిన సంగతి తెలిసిందే.  అలాగు టాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖ నటులను కూడా ఈడీ ఇప్పటికే బెట్టింగ్ యాప్ ల ప్రమోషన్ కేసులో విచారించింది. 

టీమిండియా జెర్సీ స్పాన్సర్‌గా అపోలో టైర్స్

  భారత క్రికెట్ జట్టుకు కొత్త జెర్సీ స్పాన్సర్‌గా అపోలో టైర్స్‌ని బీసీసీఐ ప్రకటించింది. ఈ ఒప్పందం 2027 వరకు కొనసాగనుంది. ఆన్‌లైన్ బెట్టింగ్‌కు సంబంధించిన యాప్‌లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడంతో, ఫాంటసీ గేమింగ్ ప్లాట్‌ఫామ్ డ్రీమ్11తో భారత క్రికెట్ నియంత్రణ మండలి  తన ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ఈ నేపథ్యంలో అపోలో టైర్స్ ముందుకు వచ్చింది. ఈ కొత్త ఒప్పందం ద్వారా అపోలో టైర్స్ ప్రతి మ్యాచ్‌కు బీసీసీఐకి రూ. 4.5 కోట్లు చెల్లించనుంది.  గతంలో డ్రీమ్11 ఒక్కో మ్యాచ్‌కు రూ. 4 కోట్లు చెల్లించింది. దానితో పోలిస్తే బీసీసీఐకి ఈ ఒప్పందం ద్వారా అదనపు ఆదాయం రానుంది. టీమిండియాకు రాబోయే రోజుల్లో అంతర్జాతీయంగా ఎన్నో మ్యాచ్‌లు ఉన్నందున, ఈ స్పాన్సర్‌షిప్ ద్వారా అపోలో టైర్స్‌కు ప్రపంచవ్యాప్తంగా మంచి ప్రచారం లభించనుంది. ఇటీవలి కాలంలో భారత క్రికెట్‌లో కుదిరిన అత్యంత విలువైన స్పాన్సర్‌షిప్ ఒప్పందాలలో ఒకటిగా ఇది నిలుస్తుంది.

శ్రీవారిని దర్శించుకున్న గవర్నర్ అబ్దుల్ నజీర్

    తిరుమల శ్రీవారిని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ముందుగా మహాద్వారం వద్ద టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అర్చకులు స్వాగతం పలికారు. స్వామి వారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు. టీటీడీ అధికారులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. టీటీడీపై తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆ ధార్మిక సంస్థ చైర్మన్ బీఆర్ నాయుడు హెచ్చరించారు. ఇకపై అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వారిపై క్రిమినల్ కేసులు పెడతామని తెలిపారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పాలక మండలి సమావేశంలో తీర్మానం చేశామన్నారు.

జనవరి నాటికి రెండు క్వాంటం కంప్యూటర్లు!

అమ‌రావ‌తిలో క్వాంటం వ్యాలీ పనులు అనూహ్య వేగంతో జరుగుతున్నాయి. క్వాంటం వ్యాలీ నిర్మాణం కోసం సీఆర్డీయే 50 ఎకరాల స్థలం కేటాయించింది. ఇలా ఉండగా  క్వాంటం వ్యాలీలో ఐబీఎం సంస్థ వ‌చ్చే జ‌న‌వ‌రి క‌ల్లా రెండు క్వాంటం కంప్యూట‌ర్లు ఏర్పాటు చేయ‌నుంది.  2027 నాటికి మ‌రో మూడు కంప్యూట‌ర్లు ఏర్పాటు చేయనుంది. ఈ విషయాన్ని సచివాలయంలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో ఐటీ, ఆర్టీజీ శాఖల కార్యదర్శి   భాస్క‌ర్ కాటంనేని మంగళవారం (సెప్టెంబర్ 16) వెల్ల‌డించారు. స‌చివాలయంలో జ‌రుగుతున్న జిల్లా క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సు రెండ‌వ రోజు ఆయ‌న అమ‌రావ‌తి క్వాంటం వ్యాలీ ఏర్పాటుకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.  గ్లోబ‌ల్ క్వాంటం డెస్టినేష‌న్‌గా ఏపీని మార్చాల‌నే దిశ‌గా ప‌నులు చేప‌డుతున్నామ‌న్న ఆయన  ఇందుకోసం రెండు ద‌శ‌లుగా రోడ్ మ్యాప్ రూపొందించి అందుకు అనుగుణంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.  2030 క‌ల్లా అమ‌రావ‌తి క్వాంటం వ్యాలీ నుంచి ఏటా 5వేల కోట్ల మేర క్వాంటం హ‌ర్డ్‌వేర్ ఎగుమ‌తుల‌ను సాధించాల‌న్నలక్ష్యంతో పని చేస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా  ఏటా 5 వేల మందికి క్వాంటం కంప్యూటింగ్‌లో నైపుణ్య శిక్ష‌ణ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌న్నామన్నారు.  వెయ్యి కోట్ల రూపాయల ప్రోత్స‌హ‌కాల‌తో క్వాంటం వ్యాలీలో క‌నీసం 100  స్టార్ట‌ప్‌లు  ఏర్పాటు చేయాన్న సంకల్పం పెట్టుకున్నట్లు తెలిపారు. క్వాంటం వ్యాలీ రాక‌తో రాష్ట్రంలో విప్ల‌వాత్మ‌క మార్పులు వ‌స్తాయ‌న్నారు.  వైద్య ఆరోగ్యం, బీమా, ఫైనాన్స్‌, ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్ అండ్ మిష‌న్ లెర్నింగ్‌, మెటీరియ‌ల్ సైన్స్ అండ్ కెమిస్ట్రీ, ఆప్టిమైజేష‌న్ అండ్ లాజిస్టిక్స్‌, క్లైమేట్, ఎన‌ర్జీ అండ్ ఎన్విరాన్‌మెంట స‌హా మొత్తం 14 రంగాల్లో క్వాంటం కంప్యూటింగ్ లాగ‌ర్థ‌మ్స్‌తో అద్భుత ఫ‌లితాలు రాబ‌ట్ట‌వ‌చ్చ‌ని తెలిపారు.    జిల్లా స్థాయిలో ప్రజలు, విద్యార్థుల్లో క్వాంటం రంగంపై అవగాహన కల్పించడానికి జిల్లాల్లో రాయబారులుగా వ్యవహరించాల్సింది జిల్లా కలెక్టర్లేనని భాస్కర్ కాటంనేని చెప్పారు. క్వాంటం కంప్యూటింగ్ ఆవశ్యకత, దానివల్ల కలిగే ప్రయోజనాల గురించి ఆయా జిల్లాల్లో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు.   రాజధాని అమరావతిలో నిర్మించనున్న అమరావతి క్వాంటం వ్యాలీ భవన సముదాయ నమూనాపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంత్రుప్తి వ్యక్తం చేశారు. నమూనా బాగుందని, అనేక కసరత్తులు చేసిన తర్వాత తక్కువ సమయంలోనే మంచి నమూనా రూపొందించారని ఐటీ, ఆర్టీజీ శాఖ కార్యదర్శి భాస్కర్ కాటంనేనిని అభినందించారు.

విద్యుత్ ఏడీఈ ఇంటిపై ఏసీబీ దాడి... రూ.2 కోట్ల నగదు సీజ్

  హైదరాబాద్ నగరంలో ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగించడంతో తీవ్ర కలకలం రేపు తుంది. హైదరాబాద్ నగరంతోపాటు పలు చోట్ల ఏసిబి అధికారులు సోదాలు నిర్వహించారు... మొత్తం  పదిహేను బృందాలు సోదాలు చేస్తున్నట్లు సమాచారం....హైదరాబాద్ నగరం లోని గచ్చిబౌలీ మణికొండలో ఏసీబీ రైడ్స్ కొనసాగించారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో ఏడిఈ గా పని చేస్తున్న అంబేద్కర్ అనే వ్యక్తి ఇంట్లో ఏసీబీ అధికారుల సోదాలు నిర్వహించారు.భారీగా అక్రమాలకు పాల్పడి కోట్లు కూడబెడుతున్నట్లు కొన్నేళ్లుగా అంబే ద్కర్ పై ఆరోపణలు వస్తున్నాయి.. చాలామంది బాధితులు ఏసీబీకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం...ఈ నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు... ఇంకా సోదాలు కొనసాగుతునే ఉన్నాయి.అంబేద్కర్ బినామీ సతీష్ ఇంట్లో రెండు కోట్ల రూపాయల నగదును  అధికారులు పట్టుకున్నారు. అంబేద్కర్ బంధువులు, బినామీల ఇళ్లలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగించారు.ఏడిఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అంబేద్కర్ ఇల్లు తో పాటు బినామీ ఇండ్లు మొత్తం కలిపి 18 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. దాదాపు 200 కోట్ల రూపాయల పైచిలుకు ఆస్తులు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు.అంబేద్కర్ పెద్ద ఎత్తున ఆస్తులతో పాటు వ్యవసాయ భూములు కొన్నాడు.ఆ భూముల పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంబేద్కర్ ఏ చిన్న పని చేసినా కూడా లంచం డిమాండ్ చేసేవాడు. లంచం తీసుకోకుండా పనిచేసేవాడు కాదు ఇలా ప్రతి ఒక్కరి దగ్గర లంచం తీసుకునేవాడు.ఇంకా సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి.

వివేకా హత్య కేసులో కీలక మలుపు

  మాజీ మంత్రి వివేకా హత్య కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగించేందుకు సిద్దంగా ఉన్నామని సుప్రీంకోర్టుకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తెలిపింది. సర్వోన్నత న్యాయస్థానం తగిన ఆదేశాలిస్తే ముందుకు వెళ్లామని పేర్కొంది. పిటిషనర్ ఈ కేసులో ఇంకా దర్యాప్తు చేయాలని కోరుతున్నారని చెప్పింది. ఈ మేరకు సీబీఐ అభిప్రాయాన్ని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు తెలిపారు.మా వివేకానందరెడ్డి 2019 మార్చి 15న రాత్రి తన ఇంట్లో అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. అయితే ఈ హత్యపై అనేక ఆరోపణలు చేశారు నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్. మాజీమంత్రి ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవిలపై ఆరోపణలు చేశారు. అంతేకాదు సీబీఐ డిమాండ్ సైతం చేశారు. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాడు టీడీపీ ప్రభుత్వం నియమించిన సిట్ దర్యాప్తు బృందాన్ని మార్చేసింది వైసీపీ ప్రభుత్వం. సీబీఐ దర్యాప్తుపై వైఎస్ జగన్ వెనక్కి తగ్గారు. పోలీసు అధికారులను సైతం బదిలీ చేశారు. దీంతో వైఎస్ సునీతారెడ్డి కోర్టులలోపోరాడి చివరకు సీబీఐ విచారణ సాధించారు. దీంతో ఈ కేసు విచారణను సీబీఐ దర్యాప్తు చేపట్టింది. 

డిసెంబర్ కల్లా ఏపీలో గుంతలు లేని రోడ్లు!

ఈ ఏడాది  డిసెంబర్ నాటికల్లా ఆంధ్రప్రదేశ్ లోని రోడ్లన్నీ గుంతలు లేని రహదారులుగా మారిపోనున్నాయి. ఔను నిజమే ఈ విషయం చెప్పింది స్వయంగా రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు. కలెక్టర్ల సదస్సులో భాగంగా సోమవారం (సెప్టెంబర్ 15) ఆయన రాష్ట్రంలో రహదారుల పరిస్థితిపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. డిసెంబర్ నాటికి రాష్ట్రంలో  రహదారులపై గంతలనేవీ లేకుండా చేయడమే  ప్రభుత్వ లక్ష్యమని చెప్పిన ఆయన.. ఈ లక్ష్య సాధనపై కలెక్టర్లందరూ దృష్టి సారించాలన్నారు. ఇప్ప‌టికే  రాష్ట్ర ప్రభుత్వం 860 కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్రంలో  19వేల కిలోమీట‌ర్ల రోడ్ల‌ను  గుంత‌ల ర‌హిత ర‌హ‌దారులుగా మార్చింద‌ని వివరించారు.  మ‌రో 5, 946 కిలోమీట‌ర్ల రోడ్ల‌ను గుంత‌ల ర‌హిత‌దారులుగా మార్చ‌డానికి రూ.500 కోట్లు మంజూరైనట్లు తెలిపారు.   అలాగే రాష్ట్రంలో జాతీయ ర‌హ‌దారుల నిర్మాణానికి భూసేక‌ర‌ణ ప్ర‌ధాన అవ‌రోధంగా మారింద‌న్నారు. జిల్లాల్లో క‌లెక్ట‌ర్లు ఎ భూ సేక‌ర‌ణ స‌మ‌స్య‌లపై శ్రద్ధ చూపాలన్నారు.  రాష్ట్రంలో 89 జాతీయ ర‌హ‌దారి ప్రాజెక్టుల‌కు సంబంధించి 850 హెక్టార్ల భూమి సేక‌రించాల్సి ఉంద‌ని చెప్పారు. ఈ భూ సేక‌ర‌ణ వేగ‌వంతంగా పూర్త‌య్యేలా చూడాల‌న్నారు.  

ఏపీ డిప్యూటీ సీఎం కృషి ఫలించింది.. ఎర్రమట్టి దిబ్బలకు యునెస్కో గుర్తింపు

విశాఖ జిల్లాలోని ఎర్రమట్టి దిబ్బలకు యునెస్కో గుర్తింపు లభించింది. ఈ గుర్తింపు కోసం, ఎర్రమట్టి దిబ్బల పరిరక్షణ కోసం జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కృషి ఫిలించింది.  తాజాగా యునెస్కో రూపొందించిన ప్రపంచ వారసత్వ ప్రదేశాల తాత్కాలిక జాబితాలో తిరుమల కొండలతో పాటుగా ఎర్రమట్టిదిబ్బలకు కూడా స్థానం దక్కింది.   అత్యంత సహజంగా వేల ఏళ్ల నుంచీ ఎగురుతూ వచ్చిన ఇసుక రేణువులతో ఏర్పడిన ఈ ఎర్రమట్టి దిబ్బలు విశాఖ జిల్లా భీమిలి సముద్ర తీరానికి 200 కిలో మీటర్ల దూరంలో ఉన్నాయి. ఇవి సముద్ర మట్టానికి పది నుంచి 90 మీటర్ల ఎత్తులో ఉన్నాయి ఈ ఎర్రమట్టి దిబ్బలకు యునెస్కో గుర్తింపు దక్కడం రాష్ట్రానికి గర్వకారణంగా చెప్పుకోవాలి. ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురై కనుమరుగైపోతాయన్న ఆందోళన రేకెత్తించిన ఈ ఎర్రమట్టి దిబ్బల పరిరక్షణ కోపం, వీటికి అంతర్జాతీయ గుర్తింపు కోసం పవన్ కల్యాణ్, ఆయన నేతృత్వంలోని జనసేన నేతలు, కార్యకర్తలు అలుపెరుగని కృషి చేశారు.    జనసేన   అధినేత పవన్ కళ్యాణ్  ఎర్ర మట్టిదిబ్బలను  ప్రత్యేక నిధి గా అభివర్ణించారు.   వాటిని రక్షిం చడానికి ఈ ప్రదేశాన్ని  బఫర్ జోన్‌ గా ప్రకటించాలని డిమాండ్ చేశారు.  డిమాండ్ చేసి ఊరుకోవడమే కాకుండా పర్యావరణ విధ్వంసానికి వ్యతిరేకంగా గళమెత్తారు.  ఆయన కృషి ఫలితంగా ఎర్రమట్టి దిబ్బలకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఈ ఏడాది ఆగస్టులో యునెస్కో అధికారికంగా ప్రకటిం చిన ప్రపంచ వారసత్వ ప్రదేశాల తాత్కాలిక జాబితా 2025లో ఎర్రమట్టిదిబ్బలకు చోటు దక్కింది. ఈ గుర్తింపు ఎర్రమట్టిదిబ్బల రక్షణకు ఎంతగానో దోహదపడుతుందనడంలో సందేహం లేదు.  

పెన్నా వరదలో చిక్కుకున్న పేకాటరాయుళ్లు!

పోలీసుల కళ్లు కప్పి చతుర్ముఖపారాయణంలో మునిగిపోయిన పేకాటరాయుళ్లు వరదలో చిక్కుకుని హాహాకారాలు చేసిన సంఘటన నెల్లూరులో జరిగింది. ఏ పోలీసుల కళ్లు కప్పి అయితే పేకాట ఆడుతున్నారో.. ఆ పోలీసులే రిస్క్ ఆపరేషన్ చేసి మరీ వారిని రక్షించాల్సి వచ్చింది. వివరాల్లోకి వెడితే  నెల్లూరు పెన్నానది బైపాస్ వంతెన ఫిల్లర్ ల కింద లైట్లు ఏర్పాటు చేసుకుని మరీ పేకాట ఆడుతున్న పదిహేను మంది జూదరులు ఒక్కసారిగా వచ్చిన పెన్నా నదీ ప్రవాహంలో చిక్కుకున్నారు. సోమశిల జలాశయం నుంచి నీటిని విడుదల చేయడంతో పెన్నానదికి వరద పోటెత్తింది. దీంతో బైపాస్ వంతెన ఫిల్లర్ల కింద పేకాటలో మునిగిపోయి ఉన్న పేకాట రాయుళ్లు ఆ వరదలో చిక్కుకున్నారు. గంటగంటకూ వరద ప్రవాహం పెరుగుతుండటంతో ప్రాణభయంతో హాహాకారాలు చేశారు. ఎలాగైనా తమను రక్షించమని కోరుతూ తెలిసిన వారికి ఫోన్ల మీద ఫోన్లు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. బ్రిడ్జిపైనుంచి నిచ్చెన సాయంతో ఒక్కొక్కిగా పేకాటరాయుళ్లు 15 మందినీ రక్షించారు. పోలీసులు ఇంతటి రిస్క్ ఆపరేషన్ చేసి ఉండకపోతే ప్రాణనష్టం జరిగి ఉండేదని స్థానికులు అంటున్నారు. పోలీసుల సహసాన్ని అభినందిస్తున్నారు.  

తిరుమలలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మంగళవారం (సెప్టెంబర్ 16) కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయంలోని ఆనందనిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప ఆలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజ సామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుభ్రం చేశారు. ఈ సమయంలో స్వామివారి మూలవి రాట్టును శ్వేత వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచారు. శుద్ధి పూర్తి అయిన తర్వాత నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీ గడ్డ తదితర వాటితో తయారుచేసిన పరిమళ లేపనంతో ఆలయగోడలకు సంప్రోక్షణ చేశారు. ఆలయం బయట టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మీడియాతో మాట్లాడారు. స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఆగమోక్తంగా నిర్వహించామని తెలిపారు. ఏడాదిలో నాలుగుసార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ అనీ, అందులో భాగంగానే ఆలయం అంతటా పవిత్ర సుగంధ ద్రవ్యాలతో శుద్ది నిర్వహించామనీ తెలిపారు. ఉదయం 6 నుంచి 9 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించాము. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా దర్శనం కల్పిస్తామన్నారు.   బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయని వివరించాచరు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కూడా బ్రహ్మోత్సవాలు, భక్తుల సౌకర్యాల కల్పన తదితర ఏర్పాట్లపై సమావేశమై చర్చించ నుందన్నారు.  లక్లలాది మంది భక్తులకు వాహన సేవలు తిలకించడంతో నాటె దర్శనం కూడా చేసుకునే అవకాశం కల్పిస్తామని అనిల్ కుమార్ షిండే తెలిపారు.

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటలు

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరులు కొలువై ఉన్న తిరుమల క్షేత్రం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచీ, విదేశాల నుంచీ కూడా భక్తులు వెంకటేశ్వరుడి దర్శనం కోసం వస్తుంటారు. మంగళవారం (సెప్టెంబర్ 16) శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 31 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి  15 గంటల సమయం పడుతోంది. ఇక సోమవారం(సెప్టెంబర్ 15) శ్రీవారిని మొత్తం 65 వేల 66 మంది దర్శించుకున్నారు. వారిలో 24 వేల 620 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 13 లక్షల  రూపాయలు వచ్చింది. 

ఏపీలో ఐఏఎస్‌ల బదిలీలు

ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ సీఈవోగా ఏలూరు జేసీ ధాత్రి రెడ్డిని నియమించింది. ఫైబర్‌నెట్‌ ఎండీగా కృష్ణా జిల్లా జేసీ గీతాంజలి శర్మ, మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖ ఎండీగా పాడేరు సబ్‌ కలెక్టర్‌ సౌర్య మాన్‌ పటేల్‌లను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ ఉత్తర్వులు జారీ చేశారు.  అలాగే, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ ఐపీఎస్‌ రాహుల్‌ దేవ్‌ శర్మకు పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించారు. ఎక్సైజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ డైరెక్టర్‌, ఏపీఎస్‌బీసీఎల్‌ ఎండీగా అదనపు బాధ్యతలతో పాటు డిస్టిలరీస్‌ అండ్‌ బ్రేవరీస్‌ కమిషనర్‌గా పూర్తి బాధ్యతలను అప్పగిస్తూ ఎక్సైజ్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ముఖేష్‌ కుమార్‌ మీనా జీవో జారీ చేశారు.  

కేటీఆర్ దృష్టికి మెడికల్ స్టూడెంట్స్ సమస్య

  మెడికల్ ఎంట్రన్స్ పరీక్షలలో అర్హత సాధించినప్పటికీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త స్ధానికత జీవో కారణంగా ప్రవేశాలకు అనర్హులుగా మిగిలి పోతున్న తెలంగాణ విద్యార్థుల ఆవేదనపై  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఈ సమస్యను ఆయన దృష్టికి తీసుకు రావడానికి తెలంగాణ భవన్‌కు వచ్చిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కేటీఆర్ సమావేశమయ్యారు.  కొత్తగా అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం స్థానికతకు సంబంధించి ఒక ఇబ్బందికరమైన జీవోను తీసుకు వచ్చిందని విద్యార్థులు కేటీఆర్‌కు తెలిపారు. గతంలో పదవ తరగతి వరకు 7 సంవత్సరాలు ఎక్కడ చదివితే అక్కడే స్థానికులుగా పరిగణించే నిబంధన ఉండేదని, అయితే, ఇప్పుడు 9, 10, 11, 12 తరగతులు వరుసగా చదివిన వారికే స్థానికత వర్తిస్తుందని, వారికే మెడికల్ సీట్ల అడ్మిషన్లు దక్కుతాయని కొత్తగా ఇచ్చిన ఆదేశాల వల్ల వందల మంది విద్యార్థులు నష్ట పోతున్నారని వారు వివరించారు.  పదో తరగతి వరకు తెలంగాణలో చదివిన తర్వాత, అత్యుత్తమ శిక్షణ కోసం ఆంధ్రాతో పాటు అనేక నాన్-తెలుగు రాష్ట్రాలలో కోచింగ్‌లు తీసుకుని నీట్ పరీక్షలకు సన్నద్ధమయ్యారని, ఇప్పుడు ఆ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అర్హత సాధించి నప్పటికీ, ప్రభుత్వం వారిని అనర్హులుగా ప్రకటించి ప్రవేశాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం మొండిగా సుప్రీంకోర్టు వరకు వెళ్ళిందని వారు తెలిపారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల సమస్యలను సవివరంగా విన్న కేటీఆర్, వెంటనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సమస్యను సానుకూలంగా పరిశీలించాలని ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ  దాసోజు శ్రవణ్ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక ప్రతినిధి బృందం రేపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలుస్తుందని తెలిపారు. కేటీఆర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పాలసీ పరమైన మార్పులు లేదా స్థానికతకు సంబంధించిన అర్హతలను మార్చినప్పుడు, వాటిని గతానుగతంగా కాకుండా భవిష్యత్తు కోసం ఒక కటాఫ్ డేట్ పెట్టి, రెండు లేదా మూడు సంవత్సరాల సమయం ఇచ్చి అలాంటి నిబంధనలు తీసుకు వస్తే బాగుంటుందని సూచించారు.  కానీ, విద్యార్థులు అప్పటికే తమ ఇంటర్మీడియట్ కోసం ఇతర ప్రాంతాల్లో చదువుతూ, ప్రిపేర్ అవుతున్న వారిని పరిగణన లోకి తీసుకోకుండా ఇచ్చిన ఆదేశాల వల్లనే ఈ పరిస్థితి నెలకొందని కేటీఆర్ అన్నారు. ఈ అంశంలో మానవతా కోణంలో నిర్ణయం తీసుకోవాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యపై ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకొని విద్యార్థులకు ఉపశమనం కల్పిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు  

రైల్వే రిజర్వేషన్‌లో కీలక అప్‌డేట్

  సాధారణ రిజర్వేషన్‌ రిజర్వేషన్ టికెట్లకూ ఆధార్‌ అథెంటికేషన్‌ను తప్పసరి చేస్తూ ఇండియన్ రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే బుకింగ్స్  ఓపెన్ అయిన తొలి 15 నిమిషాలు కేవలం అథార్‌ వెరిఫైడ్‌ యూజర్లు మాత్రమే ఐఆర్‌సీటీసీ లేదా అధికారిక యాప్‌లో టికెట్లు రిజర్వేషన్‌ చేసుకునేందుకు వీలుంటుంది. ప్రస్తుతం ఇది తత్కాల్‌ బుకింగ్‌ విధానంలో అమల్లో ఉంది. అక్టోబర్‌ 1 నుంచి సాధారణ రిజర్వేషన్లకు కూడా వర్తింపజేస్తున్నట్లు తెలిపింది. ఇటీవల తత్కాల్ బుకింగ్స్‌కు ఈ విధానాన్ని ప్రవేశపెట్టగా తాజాగా సాధారణ రిజర్వేషన్‌ రిజర్వేషన్‌కూ వర్తింపజేయనుంది. ఏదైనా ట్రైన్‌కు ప్రస్తుతం 60 రోజుల ముందే టికెట్‌ రిజర్వేషన్‌ చేసుకునేందుకు అవకాశం ఉంది. కానీ, తత్కాల్‌ టికెట్ల మాదిరిగానే బుకింగ్‌ ప్రారంభమైన వెంటనే అక్రమార్కులు సాఫ్ట్‌వేర్ సాయంతో టికెట్లను బుక్‌ చేసేస్తున్నారు. దీంతో సాధారణ ప్రయాణికులు నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో రిజర్వేషన్‌ టికెట్లు పక్కదోవ పట్టకుండా సామాన్య యూజర్‌కు ఆ ప్రయోజనాలు అందాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు భారత రైల్వే బోర్డు పేర్కొంది.

రూ.50 కోట్ల విలువ చేసే డ్రగ్స్ పట్టివేత

  తెలంగాణ పోలీసులు, ఈగల్ టీం, ఎక్సైజ్, కస్టమ్స్, అధికారులు ఇలా వివిధ శాఖలకు చెందిన అధికారులందరూ కలిసి డ్రగ్స్ అనే మహమ్మారిని తెలంగాణ నుండి తరిమి వేసేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఈ తరుణంలోనే డ్రగ్స్ విక్రయిస్తున్న వారిపై కొరడా ఝళిపిస్తు న్నారు .కానీ స్మగ్లర్లు మాత్రం పోలీసులు, అధికారుల చేతికి మేము చిక్కం అనే టైపులో డ్రగ్స్ సరఫరా చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ చివరకు అధి కారుల చేతికి చిక్కి కటకటాల వెనక్కి వెళ్తున్నారు. బ్యాంకాక్ నుండి ముంబై చేరుకున్న స్మగ్లర్లు కబుర్లు చెప్పుకుంటూ ముంబై అంతర్జా తీయ దాటి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు.  కానీ కస్టమ్స్ అధికారు లకు అనుమానం వచ్చి వారి లగేజ్ బ్యాగులను పరిశీ లించగా అసలు విషయం బయట పడింది. ఈ స్మగ్లర్లు కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం కలగ కుండా విదేశీ గంజా యిని లగేజీ బ్యాగ్ అడుగు భాగంలో దాచిపెట్టి దానిపైన దుస్తులు పెట్టుకొని దర్జాగా విమానం దిగి ఎయిర్పోర్ట్ నుండి బయటకు వెళ్లేందుకు ప్రయ త్నం చేశారు. కస్టమ్స్ అధికారులు వెంటనే అప్రమత్తమై ఐదుగురు సభ్యులు గల ముఠాను అరెస్టు చేసి వారి వద్ద నుండి రూ. 49.196 కోట్ల విలువ చేసే 49 కేజీల విదేశీ గంజా యిని స్వాధీనం చేసుకున్నారు. ఎన్ డి పి ఎస్ యాక్ట్ కింద వీరందరిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగించారు.

వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై సుప్రీం సంచలన తీర్పు

  వక్ఫ్‌ సవరణ చట్టం-2025లో కీలక ప్రొవిజన్‌ను నిలిపివేస్తూ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఐదేళ్లు ఇస్లాంలో ఉండాలనే నిబంధనపై అత్యున్నత న్యాయస్థానం స్టే విధింపు చేసింది. వక్ఫ్ చట్టానికి చేసిన సవరణలో భాగంగా ‘కనీసం ఐదేళ్లు ఇస్లాంను అనుసరించిన వ్యక్తి మాత్రమే ఆస్తిని వక్ఫ్‌ చేయడానికి అవకాశం ఉంటుంది’ అనే ప్రొవిజన్ ను కేంద్రం ఈ చట్టంలో చేర్చింది.ఈ ప్రొవిజన్ పై సుప్రీం కోర్టు తాజాగా స్పందిస్తూ.. ఒక వ్యక్తి ఇస్లాంను అనుసరిస్తున్నట్లు నిర్ణయించేలా నిబంధనలు తయారుచేసే వరకు దీనిని నిలిపివేస్తున్నట్లు పేర్కొంది.  కాగా, ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్‌ (సవరణ) చట్టం-2025ను పూర్తిగా నిలిపివేయాలని దాదాపు 100కు పైగా పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలైన విషయం తెలిసిందే. వక్ఫ్ సవరణ చట్టంలో కొన్ని సెక్షన్లకు కొంత రక్షణ అవసరమని కోర్టు వ్యాఖ్యానించింది. వక్ఫ్‌ బోర్డులో ముస్లిం సభ్యుల సంఖ్య కచ్చితంగా మెజార్టీలో ఉండాలని పేర్కొంది. బోర్డ్‌ లేదా కౌన్సిల్‌ సీఈవోగా ముస్లిం సభ్యుడే ఉండాలని, మొత్తం సభ్యులలో ముస్లిమేతరుల సంఖ్య ముగ్గురు లేదా నలుగురికి పరిమితం చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది. సర్వోన్నత న్యాయస్థానం పేర్కొన్నది

ఏపీ లిక్కర్ కేసులో మరో ఛార్జిషీట్

  ఏపీ మద్యం కుంభకోణం కేసులో సిట్‌ అధికారులు  విజయవాడ ఏసీబీ కోర్టులో ఇవాళ మరో ఛార్జిషీట్లు దాఖలు చేశారు. ఈ కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి(ఏ-38),  అతని మిత్రుడు సీహెచ్‌ వెంకటేశ్‌నాయుడుప్రధాన అనుచరుడు ఎం.బాలాజీకుమార్‌ యాదవ్‌ (ఏ-35), వ్యక్తిగత సహాయకుడు ఈ.నవీన్‌కృష్ణల (ఏ-36) ప్రమేయలపై వివరాలు పొందుపరిచినట్లు తెలుస్తోంది. తాజాగా దాఖలు చేసిన రెండో అనుబంధం అభియోగపత్రంతో కలిసి ఇప్పటి వరకు సిట్ మొత్తం మూడు ఛార్జ్‌షీట్లు దాఖలు చేసినట్లైంది.  లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటి వరకు కేసులో 48 మంది నిందితులుగా చేర్చారు. ఇప్పటికే 12 మంది అరెస్ట్ కాగా నలుగురికి బెయిల్ వచ్చింది. గత వైసీపీ హయాంలో మద్యం  కుంభకోణంలో రూ.వేల కోట్ల స్కామ్ జరిగింది. లిక్కర్ సరఫరా కంపెనీల నుంచి కొల్లగొట్టిన ముడుపుల సొమ్ములో కొంత మొత్తాన్ని గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు చేరవేయడంలో చెవిరెడ్డి భాస్కరరెడ్డి కర్త, కర్మ, క్రియగా వ్యవహరించినట్లు సిట్‌ దర్యాప్తులో తేల్చింది. ముడుపుల సొమ్ము తరలింపు, కలెక్షన్‌ పాయింట్‌లకు చేరవేయడంలో చెవిరెడ్డి సన్నిహితుడు వెంకటేశ్‌నాయుడు కీలకంగా ఉన్నట్లు, బాలాజీ, నవీన్‌కృష్ణలు వారికి సహకరించినట్లు సిట్‌ గుర్తించింది. దీనికోసం తుడా వాహనాలు వినియోగించినట్లు తేల్చింది. ఈ సమాచారంతో పాటు ఆ నిధులు ఎవరెవరికి చేర్చారో కూడా ఈ అభియోగపత్రంలో పొందుపరిచినట్లు తెలుస్తోంది.  

అమరావతి నడిబొడ్డున ఎన్టీఆర్ స్మృతివనం!

నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నడిబొడ్డున ఎన్టీఆర్ స్మృతివనం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నిర్ణయించారు.  ఈ స్మృతివనంలో   182 మీటర్ల ఎత్తైన   తెలుగుదేశం వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు విగ్రహాన్నిఏర్పాటు చేయాలని నిర్ణయించారు.  తెలుగు ప్రజల గౌరవం, వారసత్వ ఔన్నత్యం, ఆత్మగౌరవాలకు నిలువెత్తు ప్రతీకగా ఉండాలని చంద్ర బాబు భావిస్తున్నారు. ఈ మేరకు సచివాలయంలో రెండు రోజుల కిందట తన క్యాంప్ కార్యాలయంలో  అలాగే స్మృతివనం వద్ద ఏర్పాటు చేయనున్న విగ్రహాల నమూనాలను కూడా పరిశీలిం చారు. కాగా స్మృతి వనంప్రాజెక్టు డిజైన్ లో  తెలుగు సంప్రదాయాలు, భాష, కళలు, సాహిత్య చరిత్రను పొందుప రచాలని చంద్రబాబు ఆదేశించారు.   ఎన్టీఆర్‌ విగ్రహంతో పాటు, ఈ స్మృతి వనంలో స్వాతంత్ర్య సమర యోధులు, అల్లూరి సీతారామరాజు, పొట్టి శ్రీరాములు వంటి ప్రముఖుల  విగ్రహాలు, తెలుగు భాష మరియు లిపి పరిణామాన్ని వివరించే అంశాలూ కూడా ఉండేలా చర్యలు చేపట్టాలని చంద్రబాబు పేర్కొన్నారు.  అంశాలు కూడా ప్రదర్శించబడతాయి. ఎన్టీఆర్ స్మృతివనం డిజైన్‌ను వేగవంతం చేయాలని ఈ సందర్భంగా చంద్రబాబు అధికారులను ఆదేశించారు.