కలెక్టర్ల పనితీరు బాగలేకపోతే వేటే : సీఎం చంద్రబాబు

  కలెక్టర్ల పనితీరు బాగుంటేనే కొనసాగిస్తానని లేదంటే, కలెక్టర్లు అయిన సరే వేటు తప్పదని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి పాల్గోన్నారు. ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతు జిల్లా రూపు రేఖలు మార్చే అవకాశం కలెక్టర్లకు ఉంది. పాలసీ ఇవ్వడమే కాదు అమలు చేయడం ముఖ్యం పేదరిక నిర్మూలన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇంతకు ముందు హార్డ్ వర్క్ ఉండేది. ఇప్పుడు స్మార్ట్ వర్క్ చేయాలి. పాత కలెక్టర్లు కూడా తమ పని తీరును నిరూపించుకోవాలి అని పేర్కొన్నారు.   సర్వర్ణాంధ్ర విజన్-2047 పత్రమే అధికారులకు భగవద్గీత, బైబిల్, ఖురాన్ కావాలని హూకుం జారీ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ పథకాల ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరాలంటే క్షేత్రస్థాయి అనుభవమే కీలకమని ఆయన నొక్కి చెప్పారు. అధికారులకు తన సంపూర్ణ మద్దతు ఎప్పుడూ ఉంటుందని భరోసా ఇస్తూనే, పనితీరు విషయంలో కఠినంగా వ్యవహరిస్తానని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. “పనితీరు చక్కగా ఉన్న అధికారులను నేను ఎప్పుడూ మార్చలేదు.  గతంలో ఇక్కడ పనిచేసిన అధికారులు రిజర్వ్ బ్యాంక్ వంటి ఉన్నత సంస్థలకు వెళ్లారు. మీకు నా పూర్తి మద్దతు ఉంటుంది. కానీ, నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమైతే మాత్రం కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి వెనుకాడను. ప్రభుత్వం అందించే ప్రతి సేవలోనూ ప్రజల సంతృప్తే మనకు కొలమానం కావాలి. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు శాంతిభద్రతల పరిరక్షణకు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి,” అని ఆయన హెచ్చరించారు. ఈ కలెక్టర్ల సదస్సు రాష్ట్ర పాలనలో ఒక కొత్త ఒరవడిని సృష్టించాలని ఆయన ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై, అధికారులపై ఉందని చంద్రబాబు గుర్తుచేశారు.

రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్

    తెలంగాణలో మరోసారి ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. మంగళవారం రాత్రి నుంచి సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రైవేట్ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్  ప్రకటించింది. రూ.1400 కోట్ల బకాయిల చెల్లింపు ప్రక్రియలో జాప్యంపై ఎలాంటి ప్రకటన రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, హెల్త్ మినిస్టర్ దామోదరకు లేఖలు ఇచ్చారు. గత 20 రోజులుగా పెండింగ్‌లో ఉన్న బకాయిలపై ప్రభుత్వంతో అంతర్గత చర్చలు జరిపింది.  ఇప్పటికే చిన్న, మధ్య తరహా ఆసుపత్రులు ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాయని, ఈ పరిస్థితుల్లో సేవలు కొనసాగించడం అసాధ్యమైందని ఆసోసియేషన్ తెలిపింది. గత జనవరిలో 10 రోజుల పాటు ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోగా, ఆందోళనల అనంతరం అప్పటి ఆరోగ్య మంత్రి “బకాయిలను నాలుగు నెలల్లో క్లియర్ చేస్తాం, క్రమం తప్పకుండా చెల్లింపుల కోసం కమిటీ ఏర్పాటు చేస్తాం” అని హామీ ఇచ్చారు. కానీ ఆ హామీలు అమల్లోకి రాకపోవడంతో మరోసారి సేవలు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నామని అసోసియేషన్ స్పష్టం చేసింది.  

టీటీడీకి విరాళాలు

తిరుమల తిరుపతి దేవస్థానంకు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాణదానం ట్రస్ట్ కు మంగళగిరికి చెందిన మన్యం శ్రీనివాసరావు దంపతులు 20 లక్షల రూపాయలు విరాళంగా అందజేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడిని ఆయన క్యాంప్ కార్యాలయంలో కలిసి ఈ విరాళం అంద చేశారు. తమ కుమార్తె మన్యం హరిత పేరున ఎస్వీ ప్రాణదాణ ట్రస్ట్ కు 10లక్షల 116 రూపాయలు, మరో కుమార్తె  మన్యం హారిక పేరు పై ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్ కు రూ 10,00,116లు విరాళంగా అందజేశారు.  విరాళాన్ని అంద చేశారు. టీటీడీ బోర్డు సభ్యురాలు జానకీ దేవి సమక్షంలో ఈ విరాళం అందజేశారు. అన్నదాన, ప్రాణదాన ట్రస్ట్ లకు  విరాళం అందజేసిన దాతలను టీటీటీ చైర్మన్ బీఆర్ నాయుడు అభినందించారు. ఇలా ఉండగా బెంగళూరుకు చెందిన  టివోల్ట్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తిరుమల శ్రీవారికి విద్యుత్ వాహనాన్ని విరాళంగా అందజేసింది. సోమవారం (సెప్టెంబర్ 15) మొంట్రా ఎలక్ట్రిక్ ఏవియేటర్ వాహనాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం  అధికారులకు కంపెనీ ప్రతినిధులు అందజేశారు.  15 లక్షల 94 వేల 962 రూపాయల విలువైన ఈ వాహనానికి సోమవారం శ్రీవారి ఆలయం ముందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సంస్థ ప్రతినిధులు వాహనం తాళాలను శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో  లోకనాథంకు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యుడు   భాను ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు.

దేవాన్ష్ కు ఫాస్టెస్ట్ చెక్ మేట్ సాల్వర్ పురస్కారం

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనవడు దేవాన్ష్  వరల్డ్ రికార్డ్ సాధించారు. అది అలాంటిలాండ్ అంశంలో కాదు. మేధస్సుకు పదును పెట్టి ఎత్తులకు పై ఎత్తులువేసే ఛెస్ గేమ్ లో.  చెస్‌లో అత్యంత క్లిష్టమైన 175 పజిల్స్‌ను అత్యంత వేగంగా వేగంగా పరిష్కరించి మరీ ఫాస్టెస్ట్ చెక్‌మేట్ సాల్వర్ గా వరల్డ్ రికార్డ్ సాధించి.. లండన్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ రికార్డు అందుకున్నాడు దేవాన్ష్.  మెదడుకు పదును పెట్టి మేథస్సును పెంచే   ఛెస్ లో  దేవాన్ష్ పిన్న వయస్సులోనే సత్తా చాటాడు.  చాటు తున్నాడు.    లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో  లోకేష్ ఫాస్టెస్ట్ చెక్ మేట్ సాల్వర్ పురస్కారాన్ని అందుకున్నాడు. దేవాన్ష్ తల్లిదండ్రులు లోకేష్, బ్రహ్మణిలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.   దేవాన్ష్ గతంలోనే చెస్‌లో రెండు ప్రపంచ రికార్డులు సాధించారు. 7-డిస్క్ టవర్ ఆఫ్ హనోయిని కేవలం 1.43 సెకన్లలో పూర్తి చేశారు. అంతేకాదు, 9 చెస్ బోర్డులపై 32 పావులను 5 నిమిషాల్లో సరిగ్గా అమర్చారు.   దేవాన్ష్ 'ఫాస్టెస్ట్ చెక్‌మేట్ సాల్వర్'గా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు-2025 గెలుచుకున్న సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మనవడికి అభినందనలు తెలిపారు. దేవాన్ష్ అతి తక్కువ సమయంలో 175 చెక్‌మేట్ పజిల్స్‌ను పరిష్కరించి  లండన్‌లో పురస్కారం అందుకున్నందుకు గర్విస్తున్నానంటూ ట్వీట్ చేశారు. ఇక నాయనమ్మ నారా భువనేశ్వరి కూడా దేవాన్ష్ ను  అభినందించి ఆశీర్వదిస్తూ ట్వీట్ చేశారు. నారా లోకేష్  అయితే దేవాన్ష్ ను అభినందిస్తూ తన లిటిల్ చాంపియన్ గా అభివర్షించారు. తల్లి బ్రహ్మణి కూడా దేవాన్ష్ పట్ల గర్వంగా ఉందంటూ ట్వీట్ చేశారు.  ఇది ప్రారంభం మాత్రమే.. పెద్ద కలలు కంటూ ఉండు అంటూ పేర్కొన్నారు. 

మత్స్యకారుల వలకు చిక్కిన పులిమచ్చల టేకు చేప

సముద్రం అంటేనే మత్స్య సంపదకు నిలయం. నిత్యం మత్స్యకారుల వలలకు ఎన్నో రకాల చేపలు  చిక్కుతూ ఉంటాయి. అప్పుడప్పుడు అత్యంత అరుదైన, భారీ చేపలు కూడా మత్స్యకారుల వలలో పడుతుంటాయి. అలాంటి అరుదైన భారీ చేప కోససీమ జిల్లా అంతర్వేది వద్ద సముద్రంలో మత్స్యకారులకు చిక్కింది. ఈ చేప రూపంలోనే కాదు.. సైజులోనూ భారీయే. ఈ చేప పేరు పులి మచ్చల టేకు చేప అని మత్స్యకారులు తెలిపారు. దీని ఒంటిపై పులిమచ్చలు ఉంటాయి. దీని బరులు పది కిలోకలకు పైనే.  ఈ చేప పొట్టభాగంలోని బ్లాడర్ లో అత్యంత అరుదైన ఔషధ గుణాలు ఉండటంతో దీనిని మందుల తయారీలో కూడా ఉపయోగిస్తారు. ఈ చేపలు  నిత్యం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సంచరిస్తూనే ఉంటాయి. అందుకే ఇది అప్పుడప్పుడు మత్స్యకారుల వలలకు చిక్కి వారికి అదృష్టాన్ని తెచ్చి పెడుతుంటాయి.  

న్యూయార్క్ లో145 కోట్ల రూపాయలతో భవంతిని కొనుగోలు చేసిన అపరకుబేరుడు

అపర కుబేరుడు, దేశంలోనే అత్యంత ధనవంతుడు అయిన రియలయ్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ విదేశాలలో అత్యంత  ఖరీదైన ఆస్తుల కొనుగోలులో భాగంగా తాజాగా అమెరికాలో విలాలవంతమైన భవంతిని కొనుగోలు చేశారు.  న్యూయార్క్ నగరంలోని ట్రైబెకా ప్రాంతంలో ఉన్న భవంతిని దాదాపు 17.4 మిలియన్ డాలర్లు పెట్టి కొనుగోలు చేశారు. భారత కరెన్సీ ప్రకారం ఆ విలువ దాదాపు 145 కోట్ల రూపాయలు ఉంటుంది.  'ద రియల్ డీల్' నివేదిక ప్రకారం ఈ లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాపర్టీని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్  అమెరికా విభాగం కొనుగోలుచేసింది. ఈ భవంతిని టెక్ బిలియనీర్ రాబర్ట్ పెరా 2018లో దాదాపు 20 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసి, లగ్జరీ హోమ్‌గా అభివృద్ధి చేయాలని భావించారు. కానీ ఆ ప్రణాళికలు కార్యరూపం దాల్చకపోవడంతో 2021లో ఆయన దాన్ని   విక్రయానికి పెట్టారు. తాజాగా, ముకేశ్ అంబానీ కుటుంబం ఈ భవంతిని సొంతం చేసుకుంది.   బ్లూంబర్గ్ బిలియనీర్ల ఇండెక్స్ ప్రకారం. ప్రస్తుతం ముకేశ్ అంబానీ  సుమారు రూ.8.2 లక్షల కోట్ల నికర ఆస్తులతో దేశంలోని అత్యంత సంపన్నుడిగా, ప్రపంచంలో సంపన్నులు జాబితాలో 18వ స్థానంలో ఉన్నారు.  

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరులు కొలువై ఉన్న తిరుమల క్షేత్రం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచీ, విదేశాల నుంచీ కూడా భక్తులు వెంకటేశ్వరుడి దర్శనం కోసం వస్తుంటారు. సోమవారం (సెప్టెంబర్ 15) శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 31 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి  15 గంటల సమయం పడుతోంది. ఇక ఆదివారం శ్రీవారిని మొత్తం 77 వేల 893 మంది దర్శించుకున్నారు. వారిలో 24 వేల 604 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కాన ుకల ఆదాయం 3 కోట్ల 53 లక్షల  రూపాయలు వచ్చింది. 

అస్సాంలో భారీ భూకంపం

   అస్సాంలో భూకంపనలు కలకలం రేపాయి. సోనిత్‌పుర్‌ జిల్లాలో రిక్టర్‌ స్కేల్‌పై 5.8 తీవ్రతగా నమోదైంది. 5.కి.మీ లోతులో ఇది సంభవించిందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. భూకంప తీవ్రతకు పలు ఇళ్లు స్వల్పంగా ఊగినట్టు సమాచారం.  అయితే, ఇప్పటివరకు ప్రాణ, ఆస్తినష్టం జరగలేదని అధికారులు పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రాలతో పాటు బంగ్లాదేశ్‌, నేపాల్‌, భూటాన్‌, మయన్మార్‌, చైనాలోనూ భూ ప్రకంపనలు వచ్చినట్లు తెలిసింది. అస్సాంలోని ఇదే ప్రాంతంలో వారం క్రితం 3.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. ప్రధాని మోదీ ప్రస్తుతం అస్సాం పర్యటనలోనే ఉన్న విషయం తెలిసిందే.  

యోగా గురువుపై హానీ ట్రాప్...50 లక్షలు స్వాహా

  గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న రంగారెడ్డి అనే వ్యక్తి యోగాశ్రమంలో యోగా గురువుగా పనిచేస్తున్నాడు. అయితే ఓ ఇద్దరు మహిళలు అనా రోగ్య సమస్యల పేరుతో రంగారెడ్డి యోగాశ్రమంలో చేరారు... అలా చేరిన ఆ ఇద్దరు మహిళలు యోగా గురువు రంగా రెడ్డితో సన్నిహితంగా ఉండడం మొదలుపెట్టారు. అయితే ఈ ఇద్దరు మహిళలు రంగా రెడ్డి తో సన్నిహితం గా ఉన్న సమయం లో రహస్యంగా ఫోటోలు, వీడియోలు తీసుకు న్నారు... ఇంకేముంది మాస్టారు కాస్త హనీ ట్రాప్ లో చిక్కుకుపోయాడు. దీంతో అమర్ గ్యాంగ్ రంగంలోకి దిగి ఇద్దరు మహిళలతో యోగా గురువు రంగారెడ్డి సన్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడి యోలు చూపించి బ్లాక్ మెయిల్ చేయడం మొద లుపెట్టారు. మేము అడిగినన్నిడబ్బులు ఇవ్వకపోతే ఈ ఫోటోలు, వీడి యోలు సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తామంటూ బెదిరింపులకు గురి చేశారు.  వారి బెది రింపులకు భయ పడి పోయిన యోగా గురువు రంగారెడ్డి వెంటనే వారికి 50 లక్షల రూపాయల చెక్కును ఇచ్చాడు. కొద్ది రోజులు గడి చిన అనంతరం మళ్లీ అమర్ గ్యాంగ్ యోగ గురువు రంగారెడ్డి కి ఫోన్ చేసి రెండు కోట్లు కావాలని డిమాండ్ చేశారు.... డబ్బులు త్వరగా ఇవ్వా లంటూ ప్రతిరోజు యోగా గురువుకు ఫోన్ చేసి వేధిం పులకు గురి చేస్తూ ఉన్నారు.  రోజు రోజుకీ వారి వేధింపులు మితి మీరిపోవడంతో భరించలేక యోగా గురువు రంగారెడ్డి గోల్కొండ పోలీ సులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగించిన అనంతరం అమర్ గ్యాంగ్ కీ చెందిన ఇద్దరు మహిళల తోపాటు ముగ్గురు పురుషులను... మొత్తం ఐదుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుండి చెక్కులు మరియు ఐదు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.  

చెస్‌లో దేవాన్ష్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌ అవార్డు

  ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేశ్ తనయుడు నారా దేవాన్ష్ అరుదైన ఘనత సాధించారు. వరల్డ్ స్థాయి అవార్డును అందుకున్నారు. ఫాస్టెస్ట్ చెక్‌మెట్ సాల్వర్‌గా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌ను  దేవాన్ష్ సొంతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో లండన్‌‌లోని వెస్ట్ మినిస్టర్ హాల్లో ప్రముఖుల చేతుల మీదుగా దేవాన్ష్‌ అవార్డు స్వీకరించారు. అవార్డ్ ప్రదానోత్సవానికి మంత్రి నారా లోకేశ్, బ్రాహ్మణి హాజరయ్యారు .ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ.. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డును దేవాన్ష్ అందుకోవడం చాలా గర్వంగా ఉందని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.  ఇదో ప్రత్యేకమైన ఘనతని వ్యాఖ్యానించారు. ఒక తండ్రిగా పుత్రోత్సాహం పొందుతున్నానని ఆయన హర్షం వ్యక్తం చేశారు. అటు దేవాన్ష్ అవార్డ్ సాధించడంపై టీడీపీ శ్రేణులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు వరల్డ్ లీడర్, ఆయన మనవడు వరల్డ్ రికార్డ్ హోల్డర్ అంటూ టీడీపీ వర్గాలు సంబరాలు చేసుకుంటున్నాయి. గతేడాది డిసెంబర్ నెలలో దేవాన్ష్ చదరంగంలో ప్రపంచ రికార్డ్ నెలకొల్పిన విషయం తెలిసిందే. చదరంగంలో అత్యంత క్లిష్టమైన 175 పజిల్స్‌ను వేగంగా పరిష్కరించడం ద్వారా కేవలం తొమ్మిదేళ్ల వయస్సులోనే ఫాస్టెస్ట్ చెక్‌మేట్ సాల్వర్-175 పజిల్స్ రికార్డును సొంతం చేసుకున్నారు. వ్యూహాత్మకమైన ఆటతీరుతో 11 నిమిషాల 59 సెకన్లలో చెక్‌మేట్ పజిల్స్‌ను దేవాన్ష్ పూర్తి చేసి ప్రపంచ రికార్డును నెలకొల్పాడు.   

యూరియా కోసం క్యూ లైన్‌లో మాజీ మంత్రి

  తెలంగాణలో యూరియా కోసం రైతులు అరిగోస ప‌డుతున్నారు. నెల‌ల త‌ర‌బ‌డి కేంద్రాల చుట్టూ తిరిగిన‌ప్ప‌టికీ ఒక్క బ‌స్తా కూడా దొర‌క‌డం లేదు. దీంతో యూరియా ఇస్తార‌నే స‌మాచారం తెలిసిన వెంట‌నే కేంద్రాల‌కు వెళ్లి అర్ధ‌రాత్రి నుంచే ప‌డిగాపులు కాస్తున్నారు. ఈ క్ర‌మంలోనే మాజీ మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్‌కు కూడా యూరియా తిప్ప‌లు త‌ప్ప‌లేదు. ఆమె కూడా యూరియా కోసం క్యూలైన్‌లో గంట‌ల త‌ర‌బ‌డి వేచివున్నారు. మ‌హ‌బూబాబాద్ జిల్లా కుర‌వి మండ‌లం పెద్ద‌తండాలో స‌త్య‌వ‌తి రాథోడ్‌కు ఐదున్న‌ర ఎక‌రాల భూమి ఉంది.  దానికోసం యూరియా బ‌స్తాల కోసం ఆమె గుండ్రాతిమ‌డుగు రైతు వేదిక వ‌ద్ద‌కు ఆదివారం నాడు వ‌చ్చారు. యూరియా బ‌స్తాల కోసం క్యూలైన్‌లో నిల్చున్నారు. తీరా ఆమె లైన్ వ‌చ్చేస‌రికి ఒక్క బ‌స్తా మాత్రమే అధికారులు ఇచ్చారు. దీనిపై మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ఐదున్న‌ర ఎక‌రాల భూమికి ఒక్క బ‌స్తా మాత్ర‌మే ఎలా స‌రిపోతుంద‌ని ప్ర‌శ్నించారు.  రైతులు నాట్లు వేసి నెల దాటినా ఒక యూరియ బస్తా కోసం వారాలు తరబడి క్యూ లైన్లో ఎదురు చూడటం సిగ్గు చేటని అన్నారు. పది ఎకరాలు, ఐదు ఎకరాలు భూమి ఉన్న రైతులకు ఒక యూరియ బస్తా ఇవ్వడం దుర్మార్గమని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రైతులకు సరిపడ యూరియ సరఫరా చేయాలని ప్రభుత్వన్ని ఆమె డిమాండ్ చేశారు.  

ఇక హైడ్రాకు సూప‌ర్ ప‌వ‌ర్స్

  హైడ్రాకు సూప‌ర్ ప‌వ‌ర్స్ రానున్నాయా? అంటే మున్సిప‌ల్ శాఖ అదే నిజ‌మ‌ని అంటోంది. కార‌ణ‌మేంటంటే జీహెచ్ఎంసీలో చాలా మంది కాంట్రాక్ట‌ర్లు చేయ‌ని ప‌నుల‌కు కూడా బిల్లులు తీస్కుంటున్న‌ట్టు క‌నిపిస్తోంది. వీట‌న్నిటినీ క‌ట్ట‌డి చేయ‌డానికి హైడ్రా ఒక క్రాస్ చెక్ చేసేలా ఏర్పాటు చేస్తున్నారు. కాంట్రాక్ట‌ర్లు ఎక్క‌డెక్క‌డ ఏయే ప‌నులు చేస్తున్నారు? ఎంత శాతం మేర చేస్తుంటే.. ఎంత శాతం చేసిన‌ట్టు చెబుతున్నారు? వారికి ఎంత మేర బిల్లులు ఇస్తే బావుంటుంది? వంటి అంశాల‌తో కూడిన నియ‌మావ‌ళిని రూపొందిస్తున్నారు. వీట‌న్నిటిపై హైడ్రా అధికార గ‌ణం ఒక రిపోర్ట్ త‌యారు చేయాల్సి ఉంటుంది. ఆ రిపోర్ట్ ద్వారా.. జీహెచ్ఎంసీ నిధులు చెల్లించేలా ఒక ఏర్పాటు చేస్తోంది మున్సిప‌ల్ శాఖ‌. ఇప్ప‌టి వ‌ర‌కూ ఒక లెక్క ఇప్ప‌టి  నుంచి మ‌రోలెక్క‌గా జ‌ర‌గ‌నుంది. ఇక‌పై హైడ్రా నివేదిక‌ల్లేకుండా జీహెచ్ఎంసీ ఎలాంటి బిల్లులూ చెల్లించ‌రాదు. ఇక్క‌డ మ‌రో ట్విస్ట్ ఏంటంటే.. హైడ్రా మీద కూడా ఒక విజిలెన్స్ టీం ప‌ని చేస్తుంది. వీరు హైడ్రా ఇస్తున్న రిపోర్ట్స్ క‌రెక్టా కాదా? అని చూస్తారు. ఒక వేళ హైడ్రా గానీ త‌ప్పుడు లెక్క‌లు చెప్పి ఉంటే.. సంబంధిత అధికారుల‌ను సైతం బాధ్యుల‌ను చేస్తారు. అంటే డ‌బుల్ చెక్ మోడ‌ల్ అన్న‌మాట‌.మ‌రి ఈ మొత్తం క్రాస్ చెక్ లోంచి ఇక కాంట్రాక్ట‌ర్లు త‌ప్పించోలేరా? వారి  త‌ప్పుడు బిల్లుల బాగోతం బ‌ట్ట‌బ‌య‌లు అయిన‌ట్టేనా?? అన్న‌ది తేలాల్సి ఉంది.  

బడిలో బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడిన కీచక టీచర్

  నేటి సమాజంలో ఆడపిల్లలకి రక్షణ లేకుండా అయిపో యింది. కామాంధు లకు కళ్ళు మూసు కుపోయి చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఆడపిల్ల కనిపిస్తే చాలు లైంగిక వేధిం పులకు గురి చేస్తు న్నారు. ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు పిల్లల్ని బయటకి పంపించాలంటేనే భయంతో వణికి పోతున్నారు. అయితే దేవాలయం లాంటి బడిలో కూడా కామాంధులు అభం శుభం తెలియని చిన్నారు లను కాటు వేసేం దుకు సిద్ధమవుతు న్నారు. అక్కడ కూడా రక్షణ లేకుండా పోయింది.  సిద్దిపేట జిల్లాలోని ఓ గ్రామంలో ఓ కీచక టీచర్ కన్ను ఓ విద్యార్థిని పై పడింది. దీంతో ఆ విద్యార్థిని పై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తల్లి దండ్రులు పోలీసు లను ఆశ్రయించడం తో ఈ ఘటన వెలు గులోకి వచ్చింది. సిద్దిపేట జిల్లాలోని ములుగు మండలంలో ఉన్న లక్ష్మక్క పల్లి గ్రామంలోని వెరీటాస్ సైనిక్ స్కూల్లో ప్రణయ్ అనే వ్యక్తి తెలుగు టీచర్ గా పని చేస్తున్నాడు.  అదే స్కూల్లో బాధిత బాలిక 8వ తరగతి చదువుతున్నది. సెప్టెంబర్ 4వ తేదీన టీచర్స్ డే సెలబ్రే షన్స్ ప్రోగ్రాం జరిగిన అనంతరం తెలుగు టీచర్ ప్రణయ్ క్లాస్ రూమ్ కి వచ్చాడు.  బాధిత బాలికను మాత్రమే క్లాస్ రూమ్ లో ఉండాలని ఆదేశించాడు. క్లాస్ రూమ్ లో ఉన్న మిగతా విద్యార్థులం దరినీ బయటకు పంపించాడు. అనంతరం క్లాస్ రూమ్ డోర్ మూసి వేసి సదరు బాలికపై అత్యా చారం యత్నానికి పాల్పడ్డాడు.  దీంతో బాలిక గట్టి గట్టిగా అరవడంతో ఎవరైనా వస్తారే మోనని... భయపడి పోయిన తెలుగు టీచర్ ప్రణయ్ అక్కడి నుండి పారిపోయాడు. అనంతరం బాలిక ప్రిన్సిపాల్ కి ఫిర్యాదు చేసింది. అయినా కూడా స్కూల్ యజమా న్యం ఈ విషయాన్ని బయటికి రాకుండా జాగ్రత్త పడ్డారు. అయితే స్కూల్లో ప్రిన్సిపల్ ఎటువంటి చర్యలు తీసుకోక పోవడంతో బాలిక జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది... దీంతో తల్లిదండ్రులు వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేశారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని కీచక టీచర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు...

కన్న తండ్రే కాలయముడు... బాలుడిని హత్య చేసిన తండ్రి

  అమ్మ ప్రేమ..... అయితే నాన్నా బాధ్యత..... అమ్మ తన ప్రేమ నంత రంగడించి పిల్లల్ని పెంచి పెద్ద చేస్తుంది. కానీ పైపైకి కఠినంగా కనిపించే నాన్నా బాధ్యతతో వ్యవహరిస్తాడు. తన పిల్లలు మంచి ఉద్యోగంలో చేరి ఉన్నత స్థాయికి చేరాలని ఆకాం క్షిస్తూ అందుకొరకు పగలు, రాత్రి అనే తేడా లేకుండా అహర్నిశలు శ్రమిస్తూ ఉంటాడు. తన పిల్లలు  బాగా చదువుకొని ఉన్నత స్థాయిలోకి వచ్చాక ఆ తండ్రి లోలోపల పడే ఆనందం అంతా ఇంతా కాదు.  ప్రతి పిల్లలకి తండ్రి ఒక హీరో.... అలాంటి తండ్రి తన పిల్లలకి ఏదైనా రోగం వచ్చిందంటే తన ప్రాణాలను సైతం లెక్కచేయ కుండా తన పిల్లల్ని రక్షించుకునేందుకు విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో అయితే డబ్బు లేకపోతే దాతలను అర్ధించి మరి తన పిల్లల్ని రక్షించుకుం టున్న ఘటనలు ఎన్నో జరుగుతు న్నాయి. కానీ పాతబస్తీ పరిధిలో జరిగిన ఓ ఘటన మాత్రం పలువురిని కంటతడి పెట్టిం చింది. ఓ తండ్రి తన కొడుకును  హత్య చేసి మూసి నదిలో పడేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపు తుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ పాతబస్తీ బండ్ల గూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని నూరి నగర్ లో మహ మ్మద్ అక్బర్(35), సనా బేగం దంపతులు... వీరికి పెద్దబాబు (07), చిన్నబాబు మహమ్మద్ అనాస్(03) అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. మహమ్మద్ అక్బర్ కూరగాయల వ్యాపారం చేస్తూ ఉండగా... సనా బేగం నీలోఫర్ కేర్ టేకర్ గా పనిచేస్తుంది. కొడుకు గత కొన్ని నెలలుగా అనారోగ్య సమస్యతో బాధ పడుతున్నాడు.  ఎన్నెన్నో హాస్పిటల్ లో చూపించాడు. అయినా కూడా కొడుకు అనారోగ్య సమస్య పరిష్కారం కాలేదు. అయితే దీనిపై భార్యాభర్తల మధ్య తరచూ గొడవ జరుగుతూ ఉండేది. దీంతో మహమ్మద్ అక్బర్ అనారోగ్య సమ స్యతో బాధపడు తున్న తన కొడుకు ని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు.. ఈ నేపథ్యంలోనే తన భార్య సనా బేగం శుక్రవారం రాత్రి డ్యూటీ కి వెళ్ళిన తర్వాత శనివారం తెల్లవారుజామున అనారోగ్య సమస్యతో బాధపడుతున్న చిన్న కొడుకు తలపై దిండితో ఊపిరాడకుండా చేసి చంపాడు.  అనంతరం బాలుడి మృతదేహాన్ని సంచిలో పెట్టుకొని బైక్ పై తీసుకెళ్లి నయాపూల్ బ్రిడ్జి పై నుంచి మూసిలో పడేసాడు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్కు వెళ్లి తన కొడుకు కనిపించడం లేదంటూ... బంధువులు తీసుకువెళ్లి బిడ్డను తిరిగి ఇంటి దగ్గర దింపినట్లు ఫోన్ చేశారని... కానీ తన కొడుకు అప్పటి నుండి కనిపించడం లేదని బోరున విలపిస్తూ ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్న సమయంలో తండ్రి అక్బర్ ఫోన్ ని చెక్ చేయడంతో ఎటువంటి కాల్ రాలేదని పోలీసు లకు అర్థమైంది.  అంతేకాకుండా అతను చేసే ఓవర్ యాక్షన్ చూసి పోలీసులకు అనుమానం కలిగింది. దీంతో పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించగా తెల్లవారుజామున బైక్ పై ఏదో పెద్ద సంచి పెట్టుకొని తీసుకువెళ్లినట్లుగా దృశ్యాలు కనిపించాయి. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని తమదైన స్టైల్ లో విచారణ చేయడంతో అసలు నిజం బయటికి వచ్చింది. తన కొడుకుని తానే హత్య చేశానని తర్వాత మృతదే హాన్ని తీసుకువెళ్లి మూసిలో పడేసా నని మహమ్మద్ అక్బర్ పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. దీంతో బండ్లగూడ పోలీ సులతో పాటు హైడ్రా ఎన్డీఆర్ఎఫ్ అధికారులు మూసి లో బాలుడి మృత దేహం కోసం జల్లెడ పడుతున్నారు.

డ్రగ్స్ తయారీ కేసులో సంచలన విషయాలు

  ఒకపక్క స్కూలు.. మరోపక్క మత్తు మందు తయారీ.. స్కూల్ బిజినెస్ లో లాభాలు లేవు అనుకున్న కరస్పాండెంట్..  ఏకంగా మత్తు మందు తయారు చేయడం మొదలుపెట్టాడు.. ఒకవైపు విద్యార్థు లకు పాఠాలు చెబుతూనే ..మరో రూంలో మత్తు పదార్థులు  తయారుచేసి అమ్మేస్తున్నాడు ..అత్యంత ప్రమాదకర మైన ఆల్ఫా జోలం డ్రగ్ ను  తయారు చేసి మార్కెట్లో ఏదేచ్ఛగా విక్రయిస్తున్నాడు..  ఏపీ, తెలంగాణ, తమిళనాడు తో పాటు హైదరాబాదు లోని కల్లు కాంపౌండ్లకి ఈ ఆల్ఫా జోలం అమ్మేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.. సికింద్రాబాద్ లోని బోయిన్ పల్లి  పరిధిలో ఉన్న మేధా హై స్కూల్ క్యాంపస్ ల మాదక ద్రవ్యాలు తయారు చేస్తు న్నట్లు అధికారుకు సమాచారం రావడంతో వెంటనే సోదాలు నిర్వహించారు.  ఈ సోదాల్లో ఆల్ఫా జోలం డ్రగ్  తయారీకి కావల సిన ముడిసరకు లభ్యమయింది ..మరోవైపు దాదాపు 10 కిలోల ఆల్ఫా జోలంను ఈగల్ అధికారులు పట్టుకున్నారు.. ఆల్ఫా జోలం ను బయటికి తీసుకువెళ్లి అమ్మే సమయంలో ఈగల్ టీం దాడి చేసి నలుగురు వ్యక్తులను రెడ్ హ్యాండెడ్ గా  పట్టుకున్నారు. అంతేకాకుండా ఈగల్ టీం స్కూల్ నిర్వాహకుడు జయప్రకాష్ గౌడ్ ను అదుపులోకి తీసుకున్నారు. బోయిన్పల్లి లోని అస్మత్ పేటలో మెగా హై స్కూల్ ని జయప్రకాష్ గౌడ్ నడుస్తున్నాడు. ఈ స్కూల్లో ఉదయం సమయంలో విద్యార్థులకు క్లాసులు... సాయంత్రం ట్యూషన్ లు జరుగుతూనే ఉన్నాయి.  అంతేకాకుండా దేవాలయం లాంటి ఈ స్కూల్లో గుట్టు చప్పుడు కాకుండా రెండవ అంతస్తులో ఏకంగా మత్తు మందు తయారీ ఫ్యాక్టరీ పెట్టాడు.. మాదక ద్రవ్యాలు తయారు చేయా లంటే కనీసం ఆరు రోజుల సమయం పడుతుంది. ఇందుకు సంబం ధించి  .6 రియాక్టర్ల ఏర్పాటుచేసి డ్రగ్ను తయారు చేస్తు న్నాడు.. ప్రతి నెలకు దాదాపు 20 నుంచి 30 కిలోల ఆల్ఫా జోలం తయారుచేసి కల్లు కాంపౌండ్లకి సరఫరా చేస్తున్నా రని ఈగల్ టీం ప్రతినిధులు చెప్పారు..  స్కూల్లో విద్యార్థులకు పాఠాలు చెప్పేదాని కంటే  అమ్మకాల ద్వారే పెద్ద ఎత్తున డబ్బులు వస్తున్నాయని జయప్రకాష్ గౌడ్ అధికారులకు తెలిపాడు.. స్కూల్లోని ఈ చిన్నపాటి కంపెనీలో సోదాలు చేసినప్పుడు మొత్తం కలిపి పది కిలోల ఆల్ఫా జోలం డ్రగ్‌ను స్వాధీన పరుచుకున్నారు.. దీనికి తోడు పెద్ద ఎత్తున రా మెటీరియల్ కూడా స్వాధీనం చేసుకున్నారు.. ఈ డ్రగ్ మొత్తాన్ని కూడా వివిధ ప్రాంతాల్లో ఉన్న బ్రోకర్స్ కి సరఫరా చేస్తున్నట్లు తెలిపారు.. సికింద్రాబాద్ బోయినపల్లి పరిధిలో ఉన్న మేధా హై స్కూల్ లో ఈగిల్ స్వాధీనం చేసు కున్న ఆల్ప్రా జోలామ్ తయారీ యూనిట్‌పై ప్రాథమిక నివేదిక ఇచ్చింది.మహబూబ్‌నగర్ కు చెందిన మలేలా జయప్రకాశ్ గౌడ్ బోవెనపల్లి, హైదరాబాద్‌లోని మెధా స్కూల్ నిర్వహిస్తున్నాడు. కానీ స్కూల్ పెట్టి నష్టపోయాడు. అయితే జయప్ర కాష్ గౌడ్ కి దాదాపు సంవత్సరం క్రితం శేఖర్‌ ద్వారా గురువారెడ్డి అనే వ్యక్తిని కలిశాడు. డబ్బు దాహంతో, గురువారెడ్డి అతనికి ఆల్ప్రాజోలామ్ తయారీ విధానం మరియు ఫార్ము లాను అందించాడు. దీంతో జయప్రకాశ్ స్కూల్ ప్రాంగణం వెనుకభాగంలో ఆల్ప్రాజోలామ్ తయారీ యూనిట్‌ ను ఏర్పాటు చేశాడు. అనంతరం, బూత్‌పూర్, మహబూబ్‌నగర్ జిల్లా బూత్ పూర్ పరిసర గ్రామాల లోని తాటి కల్లు లకు ఆల్ప్రాజో లామ్ సరఫరా చేయడం ప్రారంభించాడు.విశ్వసనీయమైన సమాచారం రావడంతో ఈగిల్ టీమ్ దాడి నిర్వహించి, నిందితుడితో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేసి... వారి వద్ద నుండి 3.5 కేజీల ఆల్ప్రాజోలామ్. 4.3 కేజీల అర్థసిద్ధమైన ఆల్ప్రాజోలామ్,రూ. 21 లక్షల నగదు తో పాటు భారీ స్థాయిలో ముడి సరుకు స్వాధీనం చేసుకున్నారు.డ్రగ్స్ రాకెట్ లో మిగిలిన నిందితుల వ్యవహారంపై ఈగల్ టీం దర్యాప్తు కొనసాగించారు..

అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం, ఐకానిక్ వంతెనపై సీఎం సమీక్ష

  తెలుగువారి ఆత్మగౌరవం- ఆత్మవిశ్వాసం కలగలిపి తెలుగు వైభవంగా అమరావతిలో నిర్మించే ఎన్టీఆర్ స్మృతివనం  ప్రాజెక్టును చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశా నిర్దేశం చేశారు. తెలుగు సంస్కృతీ సంప్రదాయాలు, భాష, సాహిత్యం, కళలు, ప్రాచీన చరిత్ర తదితర అంశాలకు పెద్దపీట వేస్తూ దీనిని చేపట్టాలని సూచించారు. శనివారం తన క్యాంపు కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై సీఎం సమీక్షించారు.  అమరావతిలోని నీరుకొండ వద్ద చేపట్టనున్న ఈ ప్రాజెక్టులోని అంశాలను అధికారులు సీఎంకు వివరించారు.  ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రాచీన తెలుగు చరిత్రతో పాటు ప్రజల మనస్సుల్లో నిలిచిపోయిన అల్లూరి, పొట్టిశ్రీరాములు లాంటి విశిష్ట వ్యక్తుల విగ్రహాలు, సంస్కృతీ సంప్రదాయాలు, భాష, లిపికి చెందిన వివరాలను కూడా తెలియచెప్పేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. తెలుగు ప్రజల ప్రతీకగా ప్రజా రాజధాని అమరావతిని కూడా ప్రతిబింబించేలా ప్రాజెక్టు చేపట్టాలన్నారు.  182 మీటర్ల ఎత్తైన ఎన్టీఆర్ విగ్రహ స్మృతి వనం ప్రాజెక్టుకు అనుబంధంగా నీరుకొండ రిజర్వాయర్ ను తీర్చిదిద్దాలన్నారు.  ప్రత్యేకించి పర్యాటకులు పెద్ద ఎత్తున సందర్శించేందుకు అనువుగా ఆకర్షణల్ని ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. గుజరాత్ లో నిర్మించిన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ప్రాజెక్టును కూడా పరిశీలించాలని సీఎం పేర్కొన్నారు. అమరావతిని అనుసంధానిస్తూ కృష్ణా నదిపై చేపట్టనున్న ఐకానిక్ వంతెన డిజైన్లను కూడా సీఎం పరిశీలించారు.  అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో కన్వెన్షన్ సెంటర్ నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. అంతకముందు ఎన్టీఆర్ విగ్రహ నమూనాలను పరిశీలించారు.  

తిరుమలలో వీఐపీల సందడి... కొనసాగుతున్న భక్తుల రద్దీ

    తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం వరకు సాధారణంగా ఉన్న రద్దీ.. శని, ఆదివారం వరుస సెలవులు రావడంతో.. ఒక్కసారిగా తాకిడి పెరిగిపోయింది. దీంతో ఆదివారం తెల్లవారుజామున శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. దీంతో ప్రస్తుతం తిరుమల కొండపై ఉన్న అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి.. కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్నారు. ఈ క్రమంలో టోకెన్ ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనానికి 5 గంటల సమయం పడుతుండగా.. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.   తిరుమల శ్రీవారిని ఆదివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌, ఏపీ శాసనసభ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు, రాష్ట్ర మంత్రులు పయ్యావుల కేశవ్‌, అనిత, సవిత, సంధ్యారాణి, ఎంపీ పురందేశ్వరి, మాజీ మంత్రి పరిటాల సునీత, మహారాష్ట్ర ఎంపీ రోహిణి,ఎంపీ సుధా నారాయణమూర్తి, మాజీ గవర్నర్ తమిళ సై, ఎంపీ పురందేశ్వరి, తమిళనాడు మంత్రి గాంధీ శ్రీవారి దర్శించుకున్నారు. ప్రముఖులకు ఆలయ పండితులు వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇదిలా ఉంటే శనివారం తిరుమల శ్రీవారిని 82149 భక్తులు దర్శించుకోగా.. 3.85 కోట్ల హుండీ ఆదాయం వచ్చినట్లు టీటీడీ ప్రకటించింది.