మహారాష్ట్రలో డ్రగ్ రాకెట్ గుట్టు రట్టు
posted on Sep 9, 2025 @ 8:54PM
డ్రగ్స్ ముఠాలపై ఈగల్ టీమ్ ఉక్కు పాదం మోపింది... ఎలాగైనా సరే డ్రగ్స్ స్మగ్లింగ్ చేసే ముఠా లపై కొరడా ఝళిపిస్తూ... డ్రగ్స్ అనే మహమ్మారిని పూర్తిగా రూపుమా పేందుకు ఈగల్ టీం నడుం బిగించింది... ఈ నేపథ్యంలోనే మహారాష్ట్రలో హవాలా రాకెట్ గుట్టురట్టు చేశారు. రాచకొండ నార్కోటిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈగల్ ఫోర్స్ విదేశీ పౌరుడు ఒన్యేసి ఎసోం కెన్నెత్ మ్యాక్స్వెల్ ఇమ్మన్యుయెల్ బెడియాకో డ్రగ్స్ అమ్ముతూ పట్టు పడ్డాడు.
అయితే ఈగల్ టీం మ్యాక్స్వెల్ ను అదుపులోకి తీసుకొని విచారణ చేయడంతో.... 150 అకౌంట్లో ద్వారా నైజీరియాకు డబ్బులు పంపిస్తు న్నట్లుగా వెల్లడైంది. మాక్స్వెల్ సుమారు రూ.68 లక్షల కమిషన్ సంపాదించాడని ఆ డబ్బును తన భార్య, మరిది అకౌంట్లోకి తరలించాడని వెల్లడైంది. ఒకే ఒక నైజీరియన్ ఇంత పెద్ద స్థాయిలో వ్యాపారం చేయడం ఏంటా అని ఈగల్ టీం కూపిలాగడంతో చాలా విషయాలు బయట పడ్డాయి. దీంతో 24 ప్రత్యేక ఈగల్ టీంలు మహారాష్ట్ర, ఢిల్లీ, ముంబై ,గోవా, రాజస్థాన్ ,గుజరాత్ రాష్ట్రాలలో ఆపరే షన్ నిర్వహించారు.
ఈ క్రమంలోనే ఉత్తమ్ సింగ్, చేతన్ మమా నియా, దుర్గా రామ్,చేతన్ సింగ్,చగన్ లాల్ ఆధ్వర్యంలో ఒక పటిష్టమైన హవాలా నెట్వర్క్ బయట పడింది. ఉత్తమ్ సింగ్ , భరత్ కుమార్ గోవాలోని నైజీరియన్ల వద్ద నుండి ప్రతిరోజు 25 లక్షల మనీ వసూలు చేసి వారానికి రూ.2.1 కోట్ల హవాలా ఆపరేటర్ల ద్వారా డబ్బుల పంపిణీ చేసేవారు.
అయితే నైజీరియన్లు బేబీ ఫ్రాక్స్, కుర్తాలు, టీ- షర్ట్ లు, మానవ కేశం, కిరాణా సరుకుల ఎక్స్ పోర్ట్ పేరుతో ముంబై మరియు చెన్నై పోర్టు ల ద్వారా లాగోస్ కి సముద్ర మార్గం ద్వారా డబ్బులు రవాణా చేసేవారు. ఈ విషయం గుర్తించిన 24 ప్రత్యేక ఈగల్ టీములు మహా రాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, గోవా, ఢిల్లీ రాష్ట్రాలలో దాడులు చేసి 20 మంది డ్రగ్ మనీ లాండర్లను అరెస్టు చేసి వారి వద్ద నుండి మూడు కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు ఈగల్ టీం ఈ కేసులో 50 మంది నిందితులను పట్టుకున్నారు.