నేడు ఏసిబి కోర్టులో ఈఎస్ఐ స్కామ్ విచారణ...

  ఈఎస్ఐ స్కామ్ విషయంపై రోజు రోజుకు చర్చలు కొనసాగుతున్నాయి.నేడు ఏసిబి కోర్టులో ఈఎస్ఐ స్కామ్ కేసు విచారణ జరగనుంది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన ఎనిమిది మంది నిందితులను వారం రోజుల పాటు కస్టడీకి అనుమతించాలని ఏసీబీ కోరింది. మరోవైపు బెయిల్ ను మంజూరు చేయాలని నిందితుల సైతం పిటిషన్ వేశారు. రెండు పిటిషన్ ల పై ఏసీబీ కోర్టు విచారించనుంది.  అదే విధంగా ఈ కేసులో మరికొంతమందిని కూడా అధికారులు విచారించనున్నట్లు తెలుస్తున్నది. స్కామ్ లో తీగ లాగితే డొంక కదులుతున్నట్లు  డైరక్టర్ దేవికారాణి అరెస్ట్ చేసి స్కామ్ వెనుక ఉన్న పాత్రథారులు ఒక్కరు ఒక్కరుగా తెరమీదకు వస్తున్నారు. ఈఎస్ఐ విభాగం లోని సిబ్బందితో అధికారులతో పాటు ప్రైవేటు వ్యక్తులు కుమ్మక్కై భారీగా దోచుకుంటున్నట్లు ఏసీబీ నిర్థారించింది. గడచిన నాలుగేళ్లలో ఏడాదికి రూ.రెండు వందల యాభై కోట్ల రూపాయల చొప్పున వెయ్యి కోట్ల రూపాయల మెడిసిన్ కొనుగోలు చేసినట్టు ఏసీబీ దర్యాప్తులో తేలింది. ఈ స్కామ్ కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై డిస్పెన్సరీల వివరాలు సేకరించిన అధికారులు కుంభకోణం పాత్రధారులను శరవేగంగా గుర్తిస్తోంది. విచారణలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు మెడికల్ ఏజెన్సీ కార్యాలయాల్లో అథికారులు సోదాలు కొనసాగిస్తున్నారు.  ఎక్కడెక్కడికి కీలక ఫైళ్లను స్వాధీనం చేసుకుంటున్నారు. నిన్న ఉద్యోగి నాగరాజు ఇంట్లో నలభై ఆరు కోట్ల విలువైన నకిలీ ఇండెట్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి పలువురు ఈఎస్ఐ ఉద్యోగుల సంతకాలను సైతం సేకరించారు.  ఇప్పటికే దేవికారాణి తోపాటు ఏడుగురిని అరెస్ట్ చేసిన అధికారులు మరో రెండ్రోజుల్లో స్కామ్ కు సంబంధం ఉన్న మరికొంతమందిని అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ కుంభకోణంలో డైరెక్టర్ జాయింట్ డైరెక్టర్ తరవాత శివనాగరాజునే కీలక నిందితుడిగా ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. డైరెక్టర్ జాయింట్ డైరెక్టర్ కు మధ్యవర్తిగా ఉంటూ ఎప్పటికప్పుడు పరిస్థితిని చక్కదిద్దే బాధ్యతను శివనాగరాజు స్వీకరించినట్లు తెలుస్తోంది. అతన్ని విచారిస్తే ఇండెంట్లు పర్చేజ్ ఆర్డర్ల సమాధానం రాబట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు.  ఇవాళ ఏమవుతుందో చూడాలి ఎందుకంటే ఇటు నిందితులు కూడా బెయిల్ కోసం పిటిషన్ లు వేస్తున్నారు. అటు ఏసీబీ కూడా రిమాండ్ కస్టడీ కోసం తమ వాదనలు వినిపించనుంది. కోర్ట్ ఏం నిర్ణయిస్తుందని  ఏసీబీ కోర్టులో మరికొద్దిసేపట్లో తేలే అవకాశం కన్పిస్తోంది. ఎనిమిది మంది నిందితులను ఇప్పటి వరకు అరెస్టు చేశారు. మరికొంతమందిని ఇవాళ ఎంక్వైరీ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇంకా ఎవరెవరున్నారనే విషయాల మీద ప్రస్తుతం అధికారులు కూపీలాగుతున్నట్లుగా సమాచారం.  

ప్రభుత్వ బకాయిలు చెల్లింపు పై చంద్రబాబు తీవ్ర విమర్శలు...

  హామీలు ఎన్నోఇస్తుంటారు కానీ రాను రాను వాటి బకాయిలు చెల్లించడంలో మాత్రం ప్రభుత్వం నిర్లక్షం వహిస్తోంది. ఉపాధి హామీ పథకం బకాయిల క్రింద కేంద్ర ప్రభుత్వ నిధులు ఇచ్చినా వాటిని కూలీలకు విడుదల చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం తొక్కిపెడుతోందని టిడిపి అధ్యక్షుడు మాజీ సీఎం చంద్రబాబు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కు గురువారం ఆయన లేఖ రాశారు.  కేంద్రం ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై వరకు మూడు విడతలుగా పధ్ధెనిమిది వందల నలభై ఐదు కోట్లు రాష్ట్రానికి పంపింది. ఈ డబ్బులకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు కలిపి మూడు రోజుల్లోగా రాష్ట్ర ఉపాధి హామీ నిధుల బదిలీ చేయాలి. ఇలా చేయకపోతే తదుపరి నిధులు విడుదల నిలిపివేసే అధికారం కేంద్రానికి ఉంటుంది. అలాగే జాప్యం చేసిన కాలానికి రాష్ట్ర ప్రభుత్వం పన్నెండు శాతం వడ్డీ కూడా చెల్లించాలి. పెండింగ్ బిల్లుల చెల్లింపునకు ఈ నిధులు వినియోగించాలని పాత పెండింగ్ బిల్లులకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని కూడా కేంద్రం తన ఆదేశాల్లో సూచించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇంత వరకు ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ కాంపోనెంట్ కింద చెల్లించాల్సిన బిల్లులను చెల్లించలేదు. ఈ నిధులను ఇతర అవసరాల కోసం మళ్లించిందనే ఆరోపణలు వస్తున్నాయని అందులో పేర్కొన్నారు. నెలల తరబడి బిల్లులూ పేరుకుపోవడంతో అవి రావలసిన వారు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని కొన్ని చోట్ల ఈ పరిణామం ఆత్మహత్యలకు కూడా దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి ఉపాధి హామీ పథకానికి చెడ్డ పేరు తెస్తుందని బిల్లులు పేరుకుపోవడంతో ఈ పథకంతో జత కలిపి పనులు చేయటానికి ప్రభుత్వ విభాగాలు వెనుకంజ వేస్తున్నాయని తెలిపారు.  ఉపాధి హామీ పథకం గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు ఈ పరిస్థితి పై పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రాలిచ్చారని గవర్నర్ ను కూడా కలిసి వివరించారని తెలిపారు. ఇదే పరిస్థితి రాష్ట్రంలో కొనుసాగితే అతి త్వరలోనే ప్రజలు ఈ పథకం పై విశ్వాసం కోల్పోతారని ఫలితంగా గ్రామీణాభివృద్ధి తీవ్రంగా కుంటుపడుతోందని, దీనివల్ల కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠ కూడా దెబ్బతింటుందంటున్నారు. ఉపాధి హామీ పథకం అమలులో ఏపీ గత ఐదేళ్లలో దేశంలో ప్రథమ స్థానంలో నిలిచిందని చంద్రబాబు లేఖలో గుర్తు చేశారు. ఈ పథకం నిధులతో రాష్ట్రంలో ఇరవై ఆరు వేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు, ఆరు వేల అంగన వాడీ భవనాలు, రెండు వేల రెండు వందల గ్రామ పంచాయతీ కార్యాలయ భవనాలు, పదివేల సాలిడ్ వేస్ట్ కేంద్రాలూ, ఏడు లక్షల పంటకుంటలు నిర్మించామని చంద్రబాబు పేర్కొన్నారు. పన్నెండు వేల కిలోమీటర్ల మేర గ్రామాలకు రహదారి సౌకర్యం ఏర్పాటైంది. దేశవ్యాప్తంగా ఎనభై మూడు ఉత్తమ గ్రామ పంచాయతీలను ఎంపిక చేస్తే అందులో ముప్పై మూడు ఈ రాష్ట్రం నుంచే ఉన్నాయి. మొదటి పది లో ఏడు కూడా ఈ రాష్ట్రానికి చెందినవే అని తెలియజేశారు. దీనిని పరిశీలించి పెండింగ్ బిల్లుల చెల్లింపునకు కేంద్రం చొరవ తీసుకోవాలని కోరారు. ప్రస్తుత ఆర్థిక మాంద్యంలో ఉపాధి హామీ పథకం మాత్రమే ప్రజలకు ఉపశమనం కలిగిస్తుందని రాష్ట్రం నుంచి పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ బకాయిలు చెల్లింపు పై చంద్రబాబు తన దృష్టని పెట్టారని స్పష్టంగా వెల్లడవుతోంది. 

భారీ వర్షాల కారణంగా అతలాకుతలం అవుతున్న కర్నూల్ వాసులు...

  బంగాళాఖతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రం అంతటా భారీ వర్షాలతో అల్లకల్లోలంను సృష్టిస్తున్నాయి. ఎడతెరుపు లేకుండా కురుస్తున్న వర్షాలు ఉపశమనం ఇస్తున్నాయి అనుకునేలోపే మళ్ళీ అల్ప పీడనంతో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే కర్నూలు జిల్లాను కూడా భారీ వర్షాలు వదలటం లేదు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లా మొత్తం అతలాకుతలమైంది. పలు ప్రాంతాల్లో పంట పొలాలు నీట మునిగాయి. తాజాగా బనగానపల్లె సి బెళగల్ మండలాల్లో కురిసిన వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బనగానపల్లె మండలం పసుపుల గ్రామం వద్ద రోడ్డు తెగి పోవడంతో బనగానెపల్లె ప్యాపిలి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులతో పాటు ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అటు సిబెళగల్ మండలంలోని పలు గ్రామాల ప్రజలు మంచం పట్టారు. అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. ప్రైవేటు వైద్యం చేయించుకునే స్థోమత లేని వారు సర్కారు దవాఖానాల్లో చికిత్స తీసుకోవాల్సి వస్తుంది. సి బెళగల్ ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో రోగులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. కరెంటు కోత మంచినీటి కొరత వల్ల వాళ్లు నరక యాతన అనుభవిస్తున్నారు. ఆరోగ్యం బాగోలేక వస్తే తమను పట్టించుకునే వారే లేరని అధికారుల తీరు పై రోగులు వారి బంధువులు మండిపడుతున్నారు. ఇక వరుణుడు ప్రభావం ఎలా ఉండబోతోందో చూడాలి. 

చర్చలు విఫలం... అర్ధరాత్రి నుంచి తెలంగాణలో ఆర్టీసీ బస్సులు బంద్

  తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సైరన్ మోగనుంది. ఈ అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోనున్నాయి. తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీతో ప్రభుత్వం తరపున మంతనాలు జరిపిన త్రిసభ్య కమిటీ చర్చలు విఫలమయ్యాయి. దీంతో కార్మిక సంఘాల నేతలు యథాతథంగా ఇవాళ అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మెను కొనసాగించనున్నట్టు ప్రకటించారు. ఆర్టీసీని బతికించడానికి జరుగుతున్న పోరాటం ఇదని, ఆర్టీసీని ప్రభుత్వమే కాపాడాలని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి కోరారు. ప్రభుత్వానికి కార్మికుల సమస్యను పరిష్కరించే ఉద్దేశం లేదని ఆయన ఆరోపించారు. నోటీసులకు ఆర్టీసీ కార్మికులు భయపడరని, సమ్మెకు అన్ని కార్మిక సంఘాలు మద్దతు తెలపాలని అశ్వత్థామరెడ్డి కోరారు.   ఇదిలా ఉంటే... ఆర్టీసీ కార్మికుల సమ్మెపై టీఎస్‌ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ స్పందించారు. సమ్మె చట్ట విరుద్ధం అని ఆయన చెప్పారు. సమ్మెలో ఉద్యోగులు పాల్గొంటే డిస్మిస్‌ చేస్తామని ఆర్టీసీ ఎండీ స్పష్టమైన హెచ్చరిక చేశారు. పండుగ సీజన్ కావడంతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తప్పేలా లేవు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో ఆర్టీసీ అధికారులు మునిగిపోయినట్టు తెలుస్తోంది.

కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి... మరుసటి రోజే తిరిగి కాంగ్రెస్ గూటికి

  హుజూర్ నగర్ బైపోల్ వార్ గట్టిగా నడుస్తోంది, బరిలో నిలిచే అభ్యర్థులు ఫైనలయ్యారు. చేరికలపై పార్టీలు ఫోకస్ పెట్టడంతో రాజకీయ వేడి మరింత పెరిగింది. గ్రామస్థాయిలో అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు మారేవారు చాలా మంది కనిపిస్తున్నారు. గ్రామాలు, మండలాల వారీగా నేతలు దృష్టి పెట్టడంతో జంపింగ్ సీజన్ నడుస్తోంది. హుజూర్ నగర్ ఉప ఎన్నికలలో తలపడేది ఎవరో తేలిపోయింది. నామినేషన్ ల ఉపసంహరణకు గడువు ముగిసింది, మొత్తం ఇరవై ఎనిమిది మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. డెబ్బై ఆరు మంది నామినేషన్ లు వేస్తే నలభై ఐదు మంది నామినేషన్ లు తిరస్కరణకు గురయ్యాయి. సీపీఎం, ఎఎపి తో సహా కొంత మంది నామినేషన్ లు ఓకే కాలేదు. ఉపసంహరణల వరకు ముప్పై ఒక్క మంది మిగిలారు. వారిలోను ముగ్గురు ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం బరిలో ఉన్నవారిలో టి.ఆర్.ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్యే ప్రధాన పోటీ ఉండబోతోంది. నామినేషన్ ల పర్వం కూడా ముగిసిపోవడంతో పార్టీలు ప్రచారంపై ఫోకస్ పెట్టాయి. ప్రస్తుతం చేరికలతో కేడర్ లో జోష్ పెంచాలని చూస్తున్నాయి. టీ.ఆర్.ఎస్, కాంగ్రెస్ రెండూ కిందిస్థాయిలో నేతలను చేర్చుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. ప్రత్యర్థి కేడర్ పై కన్నేశాయి, తాజాగా పాలకవీడు జడ్పీటీసీ మోతిలాల్ టి.ఆర్.ఎస్ లో చేరారు. మరుసటి రోజే తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు, ఈ సంఘటనతో చేరికలపై టీ.ఆర్.ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. హుజూర్ నగర్ లో మొదటిసారి గులాబీ జెండా ఎగురవేయటానికి వ్యూహాల్ని అమలు చేస్తోంది టి.ఆర్.ఎస్. పార్టీ ఇన్ చార్జ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నీ తానై యంత్రాంగాన్ని ముందుండి నడుపుతున్నారు. నియోజకవర్గంపై పూర్తిస్థాయిలో పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే సమయంలో చేరికలపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నారు. నేతల ఆరోపణలు ఎలా ఉన్నా ఉప ఎన్నికతో కింది స్థాయి కేడర్ లో మాత్రం ఫుల్ జోష్ కనిపిస్తోంది.

మారుమొగుతున్న హుజూర్ నగర్ ఉప ఎన్నికలు...

  సూర్యపేట జిల్లాకి చెందిన హుజూర్ నగర్ నిన్న మెన్నటి దాకా ఎవరికి తెలీదు. కానీ హుజూర్ నగర్ ఉప ఎన్నికల ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అధికార, ప్రతి పక్షాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ క్రమం లోనే ఉప ఎన్నికల పరిణామాలు కూడా అంతే వేగంగా మారిపోతున్నాయి. మొత్తం డెబ్బై ఆరు మంది నామినేషన్ వేయగా అందులో నలభై ఐదు మంది అభ్యర్థుల పత్రాలు సరిగా లేవంటూ నామినేషన్ లు తిరస్కరించింది ఈసి. దీంతో ముప్పై ఒక్క మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే తాజాగా మరో ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు తమ నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు. ఫైనల్ గా ఇరవై ఎనిమిది మంది అభ్యర్ధులు తుదిపోరులో నిలిచారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఆటో, ట్రక్ గుర్తులను డిలీట్ చేస్తూ నోటీసు బోర్డులో ఉంచారు. మొత్తం డెబ్బై నుంచి ఎనభై గుర్తులను డిస్ ప్లే చేశారు. పదమూడు మంది వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు ఉండగా మిగిలిన పదిహేను మంది స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. సీపీఐ, టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించింది. టీజేఎస్, కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించింది. టిడిపి, బిజెపి ఒంటరిగా బరిలోకి దిగాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. ఇక సీపీఎం అభ్యర్థి శేఖర్ రావు నామినేషన్ ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. దీంతో భైపోల్ లో కామ్రెడ్ లు పోటీకి దూరమయ్యారు.హుజూర్ నగర్ ఉప ఎన్నికల పై ప్రధానం చూపుతూ చంద్రబాబు సైతం నేరుగా బరిలోకి దిగడానికి సిద్దం అయినట్లు సమాచారం. ఇప్పుడు ఈ ఎన్నికల విషయం రాష్ట్రామంతా హాట్ టాపిక్ గా హల్ చల్ చేస్తోంది.

ఉపశమనాన్ని కలిగిస్తూ తగ్గుముఖం బాటలో బంగారం ధరలు...

  బంగారం అంటే ప్రీతి ఉండని వారు ఎవ్వరూ ఉండరు. ఇటీవలే తారా స్థాయికి చేరిన బంగారం ధరలు చూసి అమ్మో అని గుండెల మీద చెయ్యి వేసుకున్నారు ప్రజలు. బంగారం కొనుగోలుదారులకు దసరా కంటే ముందుగానే వారు పండగను వైభవంగా జరుపుకుంటున్నారు. దానికి కారణం తగ్గిన బంగారం ధరలే. వరుసగా మూడో రోజు బంగారం ధరలు తగ్గాయి. ఇక వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. దీంతో బంగారం కొనుగోలు చేసేందుకు షాపుల ఎదుట బారులు తీరుతున్నారు. చిన్న మొత్తంలో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది సరైన సమయం. ఈ రోజు బంగారం ధరల విషయానికి వస్తే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర హైదరాబాద్ లో ముప్పై ఎనిమిది వేల నూట తొంభై రూపాయలు, విశాఖపట్టణంలో ముప్పై తొమ్మిది వేల నూట యాభై రుపాయలు, ప్రొద్దుటూరులో ముప్పై ఏడు వేల ఆరు వందల యాభై రూపాయలు, చెన్నైలో ముప్పై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై రూపాయలుగా ఉంది. ఇక ఇరవై రెండు క్యారెట్ల ఆభరణాల బంగారం పది గ్రాముల ధర హైదరాబాద్ లో ముప్పై ఆరు వేల మూడు వందల ఎనభై రూపాలు. విశాఖపట్నంలో ముప్పై ఆరు వేల పది రూపాయలు, ప్రొద్దుటూరులో ముప్పై నాలుగు వేల ఏడు వందల అరవై రూపాయలు, చెన్నైలో ముప్పై ఆరు వేల మూడు వందల రూపాయలుగా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదు నలభై ఐదు వేల నాలుగు వందలు, విశాఖపట్నంలో నలభై ఆరు వేల రెండు వందలు, ప్రొద్దుటూరులో నలభై ఐదు వేల ఏడు వందలు, చెన్నైలో నలభై తొమ్మిది వేల మూడు వందల వద్ద ముగిసింది.ముహుర్తాలు మళ్ళీ ప్రారంభం కాబోతున్న సందర్భంగా బంగారం కొనుగోలు సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది అని నిపుణులు వెల్లడిస్తున్నారు.

బీజేపీ సరికొత్త వ్యూహం ఏమిటీ?

  బీజేపీ మళ్ళీ కొత్త వ్యూహం అలోచించబోతోందా అనే ఆలోచనలు అందరిలో వస్తున్నాయి. లోక్ సభ ఎన్నికల ముందే బెంగాల్ పై బిజెపి ఓ కన్నేసిందని, మమత పార్టీని మట్టికరిపించాలని నిర్ణయించుకున్నట్లు ఆరోపణలు వస్తున్నయి. అందుకు గాను యాభై శాతం విజయం కూడా సాధించింది. ఎన్నికల వేళ మోదీ పెద్ద బాంబే పేల్చారు. లోక్ సభ ఫలితాల తర్వాత తృణమూల్ ఎమ్మెల్యేలంతా తమతో కలిసిపోతారని దీదీ ఏకాకి అవుతారని ఆయన అన్నారు. సుమారు నలభై మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని అప్పట్లో సంచలన ప్రకటనలు చేశారు. ఎన్నికల తరువాత ఆయన చెప్పింది చాలా వరకూ జరిగిందనే చెప్పాలి. పోలింగ్ కు ముందే తృణమూల్ కీలక నేత ముకుల్ రాయ్ బీజేపీలో చేరి పోయారు. ఇప్పుడు ఎన్నికల తరువాత యాభై మందికి పైగా కౌన్సిలర్లు, ఆరుగురు ఎమ్మెల్యేలు, టీఎంసీని వీడి బీజేపీ గూటికి చేరారు. తాజాగా కోల్కత్త మాజీ మేయర్ మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడిగా ఉన్న శోభన్ చటర్జీ కమలం తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలో ముకుల్ రాయ్ తో పాటు ఇతర బీజేపీ సీనియర్ నేతల సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. శోభన్ చటర్జీ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. నారద శారద స్కాంలపై దర్యాప్తు ప్రభావం తృణమూల్ నేతల పై కన్పిస్తోంది. కేసులలో ఇరుక్కున్న వారంతా ఇపుడు బీజేపీ వైపు చూస్తున్నారు. బిజెపిలో చేరిన కోల్ కత్త మాజీ మేయర్ శోభన్ చటర్జీ పై కూడా కేసులున్నాయి. కేసులున్న వారిని భయపెట్టి బెదిరించి బీజేపీలో చేర్చుకుంటున్నారని తృణమూల్ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే కేసుల విచారణకు పార్టీలో చేరికలకు సంబంధం లేదని బిజెపి వివరణ ఇస్తోంది. పార్టీ సిద్దాంతాలు నచ్చి వచ్చిన వారిని ఆహ్వానిస్తామని వారి పై కేసులు విచారణ మాత్రం కొనసాగుతోందనీ చెబుతోంది. తృణమూల్ రౌడీయిజం తోనే శరణార్ధులకు కంటి మీద కునుకు లేకుండా పోయిందని బీజేపీ ఆరోపిస్తోంది. లోక్ సభ ఎన్నికల ముందు తృణమూల్ కార్యకర్తలు భారీ సంఖ్యలో శరణార్ధులపై దాడులు చేసినట్టు బిజెపి చెబుతోంది. దాడుల కారణంగా మాత్వా తెగస్థులు బీజేపీ వైపు మొగ్గు చూపినట్లు విశ్లేషణలూ వినిపిస్తున్నాయి. శరణార్ధులు టీఎంసీ పట్ల అనుమానంగా చూసినంతకాలం బెంగాల్లో తమ పార్టీ ఎదుగుదలకు ఢోకా లేదని బీజేపీ విశ్వసిస్తోంది. ముస్లిం శరణార్ధులను మాత్రమే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అక్కున చేర్చుకుంటోందని ఇతర మతస్థులను పట్టించుకోవడం లేదని బీజేపీ కొత్త ప్రచారం ప్రారంభించింది. ఇప్పుడు దుర్గాపూజ సభలో అమిత్ షా స్టేట్ మెంట్ తర్వాత తృణమూల్ కూడా ఎదురు దాడి చేస్తోంది. బెంగాల్ నుంచి ముస్లిం శరణార్ధులను తరిమేసేందుకు ప్రయత్నిస్తున్నారని దీదీ అనుచరులు ఆరోపిస్తున్నారు. దీంతో ఇప్పుడు రెండు పార్టీల మధ్య సంఘర్షణ ఖాయంగా కనిపిస్తోంది. పౌరసత్వ బిల్లును శక్తిమంతమైన రాజకీయ అంశంగా మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఆర్టికల్ 370 ని ధైర్యంగా రద్దు చేసినట్టుగానే పౌరసత్వ సవరణ బిల్లును కూడా ఆమోదిస్తామని దసరా నవరాత్రుల సందర్భంగా బీజేపీ హామీ ఇచ్చింది. శరణార్ధులకు న్యాయం చేయడం వారికి పౌరసత్వం కల్పించటం ఒక వంతైతే, అక్రమ వలసలను అడ్డుకోవడం రెండో వంతు. ఇప్పుడు రెండో సమస్యపై బీజేపీ దృష్టి పెట్టడం లేదన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి. అయితే రెండో అంశానికీ మొదటి అంశానికీ విడదీయరాని సంబంధం ఉందని బీజేపీ భావిస్తోంది. అస్సాం తరహా సమస్యలు బెంగాల్లో తలెత్తకుండా చూడాలంటే అక్కడ ఎన్ఆర్సి అమలుకు ముందే పౌరసత్వ సవరణ బిల్లును ఆమోదించాలని బిజెపి గుర్తించింది. అప్పుడు భారత పౌరుల జాబితాలో లేని వ్యక్తులు ఫారినర్స్ ట్రిబ్యునల్ ముందు హాజరై తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉండదు. ఇది మాత్రం అలాంటి తెగలకు ప్రయోజనకరం, అందుకే పౌరసత్వ బిల్లు ఇపుడు బిజెపికి పెద్ద ట్రంప్ కార్డ్, తృణమూల్ దెబ్బకొట్టే పెద్ద అంశం కూడా అదే. బీజేపీ వ్యూహం కొల్కత్తలో నెగ్గనుందోలేదో వేచి చూడాలి.

మళ్ళీ పొంగుతున్న గోదారమ్మ... బోటు వెలికితీత పనులు నిలిపివేత

  కచ్చులూరు వద్ద గోదావరిలో బోటు మునిగిన ఘటన జరిగి దెగ్గర దెగ్గరగా నెల కావోస్తున్న బోటు మాత్రం ఇంకా బయటకు రాలేదు. గోదావరి తీరం వద్ద బోటు వెలికితీత పనులు తాత్కాలికంగా నిలిచిపోయాయి. కచ్చులూరు దగ్గర ఆపరేషన్ నిర్వహించేదుకు వాతావరణం అనుకూలించట్లేదు. వర్షం కారణంగా పనులకు ఆటంకం ఏర్పడింది. మరోవైపు ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరికి మళ్లీ వరద ప్రవాహం పెరుగుతుంది. దాంతో బోటు వెలికితీత పనులకు ఆటంకం వచ్చిపడింది.  కచ్చులూరు వద్ద గోదావరిలో బోటు వెలికితీత పనులకు ఆటంకం కలుగుతోంది. మూడు రోజలుగా ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురవడం వరద ఉధృతి మరింత పెరగడంతో వెలికితీత పనులను నిలిపివేశారు. బోటు మునిగి పోయిన చోట సుడులు తిరుగుతున్నాయి. వరద ప్రవాహం తగ్గాకే మళ్లీ ఆపరేషన్ షురూ చేసే అవకాశం కనిపిస్తోంది. బోటును వెలికితీసేందుకే ధర్మాడి సత్యం బృందం మూడు రోజుల పాటు తీవ్రంగా శ్రమించింది. ఇరవై ఐదు మంది సిబ్బందితో ఒక పంటు ప్రొక్లయిన్ ఎనిమిది వందల మీటర్ల ఇనుప రోప్ తో వారు రంగంలోకి దిగారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి పదిహేను మీటర్ల ఎగువున మూడు యాంకర్లు వేశారు. ఆ చివరి నుంచి ఇటు ఒడ్డుకు యాంకర్లను లాగారు. మధ్యలో యాంకర్లు కొండరాయిని పట్టుకున్నాయి. రెండవరోజు ప్రయత్నం చేయగా నీటిలో ఉన్న నాలుగు వందల మీటర్ల ఇనుప రోప్ తెగి గోదావరిలో పడిపోయింది. అలా నీటిలో పడి పోయిన రోప్ విలువ నాలుగు లక్షల వరకు ఉంటుందంటున్నారు.  గోదావరిలో మునిగిపోయిన రాయల్ వశిష్ట బోటు బరువు నలభై టన్నులు. నీటిలో నాని, బురదలో కూరుకుపోయి ఉండటం వల్ల యాభై టన్నులకు పైగా బరువు పెరిగి ఉంటదని భావిస్తున్నారు. ఒకసారి కొక్కెం తగిలితే బోటును అటూ ఇటూ కదిలిస్తే బరువు తగ్గుతుందని అంచనా. గోదావరి నదీ గర్భంలో రెండు వందల పది అడుగుల లోతులో బోటు ఉన్నట్టు సత్యం టీమ్ చెబుతోంది. కిందటి నెల పదిహేనున గోదావరిలో బోటు మునిగిపోయింది. ఈ ప్రమాదంలో ఇంకా పదిహేను మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. వారి జాడ కోసం బంధువులు కళ్లుకాయలుకాచేలా ఎదురు చూస్తున్నారు. ఆశలు వదిలేసుకున్న కొందరు కనీసం డెత్ సర్టిఫికెట్లు అయిన జారీ చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. అయితే భౌతికంగా మృతదేహం దొరకనందున ఈ విషయంలో న్యాయపరంగా ముందుకెళ్లాలని ప్రభుత్వం చూస్తోంది. గోదారమ్మ కొంచం కరునిస్తే కానీ మళ్ళీ వెలికితీత పనులు మొదలు పెట్టగలమని బృందం తెలియజేస్తున్నారు.

ప్రభుత్వ వేతనాలు ఎప్పుడు వచ్చేను?

  ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఇంకా వేతనాల కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. గురువారం కొందరికే జమ కాగా, ఇంకా ఎనభై వేల మందికి పెండింగ్ లో ఉన్నాయి. నిధుల కొరత కారణంగా అక్టోబరు ఒకటో తేదీన చాలామంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాల్లో వేతనాలు పడలేదు. గురువారం జమవుతాయని వారంతా ఆశించారు. కానీ కొద్ది మందికే విడుదల చేశారు. రెగ్యులర్ ఉద్యోగులలో ఇంకా సుమారు నలభై వేల మందికి మరో నలభై వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు చెల్లించాల్సి ఉంది. వేతనాలు పెన్షన్ లు కలిపి నెలకు ఐదు వేల నాలుగు వందల కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. కొత్తగా ప్రభుత్వ ఉద్యోగుల జాబితాలోకి అక్టోబరు నుంచి గ్రామ వాలంటీర్లు కూడా చేరారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య దాదాపు ఆరు లక్షలకు చేరుకుంది. పెన్షనర్ల సంఖ్య మూడు పాయింట్ ఏడు లక్షలు ఉంది. కాగా ఉద్యోగుల వేతనాలు పెన్షన్ లకు ఇప్పుడు నెలకు ఐదు వేల నాలుగు వందల కోట్ల రూపాయల వరకు అవసరమవుతాయని ఇందులో అక్టోబర్ ఒకటిన చెల్లింపులు మూడు వేల నూట యాభై కోట్లు చెల్లించామని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ ఎస్ రావత్ వివరించారు. డబ్బుల్లేవు శీర్షికన మంగళవారం ప్రచురితమైన కథనం పై ఆయన స్పందించారు. గతంలో అన్ని నెలల్లో ఒకటో తేదిన చెల్లించిన మొత్తం కంటే అక్టోబరు ఒకటిన నూట యాభై కోట్లు ఎక్కువే చెల్లించామని ఓ ప్రకటనలో వెల్లడించారు.వారి వేతనాలు ఎప్పుడు వస్తాయా అని ఉద్యోగులు వేయ్యి కళ్ళతో వేచి చూస్తున్నారు.

హుజూర్ నగర్లో ప్రధానంగా టి.ఆర్.ఎస్, కాంగ్రెస్ ల మధ్యే పోటీ ఉండబోతోందా..?

  హుజూర్ నగర్ బైపోల్ వార్ గట్టిగా నడుస్తోంది, బరిలో నిలిచే అభ్యర్థులు ఫైనలయ్యారు. చేరికలపై పార్టీలు ఫోకస్ పెట్టడంతో రాజకీయ వేడి మరింత పెరిగింది. గ్రామస్థాయిలో అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు మారేవారు చాలా మంది కనిపిస్తున్నారు. గ్రామాలు, మండలాల వారీగా నేతలు దృష్టి పెట్టడంతో జంపింగ్ సీజన్ నడుస్తోంది. హుజూర్ నగర్ ఉప ఎన్నికలలో తలపడేది ఎవరో తేలిపోయింది. నామినేషన్ ల ఉపసంహరణకు గడువు ముగిసింది, మొత్తం ఇరవై ఎనిమిది మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. డెబ్బై ఆరు మంది నామినేషన్ లు వేస్తే నలభై ఐదు మంది నామినేషన్ లు తిరస్కరణకు గురయ్యాయి. సీపీఎం, ఎఎపి తో సహా కొంత మంది నామినేషన్ లు ఓకే కాలేదు. ఉపసంహరణల వరకు ముప్పై ఒక్క మంది మిగిలారు. వారిలోను ముగ్గురు ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం బరిలో ఉన్నవారిలో టి.ఆర్.ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్యే ప్రధాన పోటీ ఉండబోతోంది. నామినేషన్ ల పర్వం కూడా ముగిసిపోవడంతో పార్టీలు ప్రచారంపై ఫోకస్ పెట్టాయి. ప్రస్తుతం చేరికలతో కేడర్ లో జోష్ పెంచాలని చూస్తున్నాయి. టీ.ఆర్.ఎస్, కాంగ్రెస్ రెండూ కిందిస్థాయిలో నేతలను చేర్చుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. ప్రత్యర్థి కేడర్ పై కన్నేశాయి, తాజాగా పాలకవీడు జడ్పీటీసీ మోతిలాల్ టి.ఆర్.ఎస్ లో చేరారు. మరుసటి రోజే తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు, ఈ సంఘటనతో చేరికలపై టీ.ఆర్.ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. హుజూర్ నగర్ లో మొదటిసారి గులాబీ జెండా ఎగురవేయటానికి వ్యూహాల్ని అమలు చేస్తోంది టి.ఆర్.ఎస్. పార్టీ ఇన్ చార్జ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నీ తానై యంత్రాంగాన్ని ముందుండి నడుపుతున్నారు. నియోజకవర్గంపై పూర్తిస్థాయిలో పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే సమయంలో చేరికలపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నారు. నేతల ఆరోపణలు ఎలా ఉన్నా ఉప ఎన్నికతో కింది స్థాయి కేడర్ లో మాత్రం ఫుల్ జోష్ కనిపిస్తోంది.

పోలవరం పై బీజేపీ ఎలా స్పందించబోతోంది...

ఏపీలో నిన్న మెన్నటి దాకా హల్ చల్ చేసిన పోలవరం రివర్స్ టెండరింగ్ సంగతి మనందరికి తెలిసిందే .ఆంధ్రప్రదేశ్ కు జీవ నాడి వంటి పోలవరం సాగు నీటి ప్రాజెక్టుపై బిజెపి దృష్టి పెట్టింది. పోలవరం వ్యవహారంలో ఒక విధానమంటూ లేకుండా ప్రకటనలు చేస్తూ వచ్చిన బిజెపి ఇప్పుడు దానిపై స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. పోలవరం పరిహారంలో అవినీతి జరిగిందని కొందరు, రివర్సు టెండర్ల వల్ల నష్టం జరిగిందని మరి కొందరు బిజెపి నేతలు ఇప్పటి వరకూ ఆరోపణలు చేస్తూ వచ్చారు. రాష్ట్రంలో రెండు కీలక ప్రాజెక్టులలో ఒకటైన రాజధాని అమరావతిపై తమ అభిప్రాయాన్ని స్పష్టం చేసిన బిజెపి నేతలు పోలవరం విషయంలో మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. గత ఐదేళ్ల కాలంలో పరిహారం విషయంలో అక్రమాలు జరిగాయని కొందరు నేతలు ఆరోపిస్తూ వచ్చారు. ఇప్పుడు కూడా అదే వాదన వినిపిస్తున్నారు. అదే సమయంలో కేంద్రం వద్దంటున్నా రాష్ట్ర ప్రభుత్వం రివర్స్ టెండర్ లకు వెళ్లింది దీనిపై పార్టీ నేతలు విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా ఎంపీ సుజనా చౌదరి దీనిపై కేంద్ర మంత్రికి ఫిర్యాదు కూడా చేశారు. పోలవరంపై ఇప్పటి వరకూ రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేసిన బిజెపి నేతలు దానిపై స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. గతం నుంచి అవినీతి ఆరోపణలు చేస్తున్న బిజెపి ఇప్పుడు ప్రాజెక్టు విజిట్ కు ప్లాన్ చేసింది. ఈ నెల పదకొండు న బీజేపీ బృందం పోలవరం ప్రాంతాన్ని సందర్శించనుంది. ప్రాజెక్టు నిర్మాణంతో పాటు ముంపు ప్రాంతాల్లో పరిహారానికి సంబంధించి జరిగినట్లు చెబుతున్న అక్రమాలపై దృష్టి పెట్టనుంది. ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నా, అసలు బిజెపి ఇప్పుడు ఏం డిమాండ్ చేయబోతుందనేది తేలాల్సివుంది. ఓవైౖపు రివర్స్ టెండర్ల ప్రక్రియను రాష్ట్ర ప్రధాన ప్రతిపక్షంతో పాటు కేంద్రమంత్రి కూడా వ్యతిరేకించారు. అయితే ఇప్పుడు రివర్స్ టెండర్ల వ్యవహారంలో ప్రభుత్వం ఎనిమిది వందల కోట్లు ఆదా చేసినట్టు ప్రకటించింది. దీనిపై ఇప్పుడు కేంద్రం ఏం చెబుతుంది అనేది కూడా తేలాల్సి ఉంది. మరోవైపు కేంద్రం నుంచి పోలవరానికి సంబంధించి ఆరువేల కోట్లు పెండింగ్ నిధులు విడుదల కావలసి ఉంది, వాటిని ఇప్పటి వరకూ విడుదల చేయలేదు. దీంతో అసలు పోలవరం విషయంలో బిజెపి లైన్ ఏంటనేది ఆసక్తిగా మారింది. ఇదే సమయంలో కొందరు నేతలు పోలవరం నిర్మాణాన్ని కేంద్రం చేపట్టాలని కూడా డిమాండ్ చేశారు. ఈ మొత్తం పరిణామాల నేపథ్యంలో పోలవరంపై బిజెపి స్లోగన్ ఏంటి అనేది క్లారిటీ రావాల్సివుంది. పోలవరం టూర్ తర్వాత పార్టీ నేతలు రాష్ట్ర ప్రభుత్వం చర్యలను అభినందిస్తారా, గతంలో జరిగిన అవినీతిపై విచారణకు డిమాండ్ చేస్తారా, ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తారా లేదా అసలు పోలవరం అంశంపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారనే విషయం సంచలనంగా మారింది.

మందుల్లోనే కాదు...అందులోనూ దోచేశారు. ఈఎస్‌ఐ స్కామ్‌లో కొత్త కోణాలు

  ఈఎస్‌ఐ స్కామ్‌లో తవ్వేకొద్దీ అక్రమాలు బయటపడుతూనే ఉన్నాయి. కేసు దర్యాప్తును మరింత స్పీడప్ చేసిన ఏసీబీ.... ఇప్పటివరకు 8మందిని అరెస్ట్‌చేసి... వంద మందిని ప్రశ్నించింది. ఈఎస్‌ఐ డైరెక్టర్ దేవికారాణి, జాయింట్ డైరెక్టర్ పద్మ, అసిస్టెంట్‌ డైరెక్టర్ వసంత, సీనియర్ అసిస్టెంట్ సురేంద్రనాథ్‌, ఫార్మాసిస్ట్‌ రాధిక, ఓమ్నీ మెడి ఎంపీ శ్రీహరి, ఓమ్మీ మెడి నాగరాజును రిమాండ్‌‌కు రిమాండ్‌కి తరలించిన ఏసీబీ.... నిందితులందరినీ కస్టడీ ఇవ్వాలని కోరును కోరింది. నిందితులను సమగ్రంగా ఇంటరాగేషన్ చేస్తేనే, ఈ స్కామ్‌లో ఇంకా ఎవరెవరి పాత్ర ఉందో తెలుస్తుందని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. మొత్తం స్కామ్ విలువ వందల కోట్లలో ఉండటంతో నిందితుల ఆస్తుల వివరాలను సేకరిస్తోంది ఏసీబీ. భవనాలు, కార్లు... ఇలా అన్నింటి విలువను లెక్కగడుతున్నారు. అయితే, కేవలం మందులే కాకుండా, వివిధ డిస్పెన్సరీల్లో వినియోగించే స్టేషనరీ, మెడికల్ ఎక్విప్‌మెంట్‌ కొనుగోళ్లలోనూ కోట్లాది రూపాయలు గోల్‌మాల్ చేసినట్లు గుర్తించారు. దాంతో, ఆయా డిస్పెన్సరీలకు సంబంధించిన ఇండెంట్లు, పర్చేజ్ ఆర్డర్లు, బిల్లులను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. తెలంగాణవ్యాప్తంగా మొత్తం 70 డిస్పెన్సరీల్లో పర్చేజ్ ఆర్డర్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఈఎస్‌ఐ కుంభకోణంలో మాజీ ఐఏఎస్‌, ఒక ఓఎస్డీ పాత్ర ఉందన్న సమాచారంపైనా దర్యాప్తు జరుగుతోందన్న ఏసీబీ ఉన్నతాధికారులు.... వారం రోజుల్లో కీలక పరిణామాలు ఉంటాయంటూ సంకేతాలిచ్చారు.

మద్యం షాపులపై సంచలన వ్యాఖ్యలు చేసిన టిడిపి లీడర్ కొల్లు రవీంద్ర...

మీడియాతో మాట్లాడిన టిడిపి లీడర్ కొల్లు రవీంద్ర వైసిపి పాలనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మాట తప్పను, మడమ తిప్పను అని మాటలు చెప్పే జగన్ మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యపాన నిషేధం చేస్తానని చెప్పిన వ్యక్తి ఇప్పుడు మాయ మాటలు చెబుతూ పేపర్ లో మూడు వేల ఐదు వందల షాపులు పరిమితం చేశారని ప్రకటన ఇచ్చారని అన్నారు. నాలుగు వేల మూడు వందల ఎనభై షాపులుంటే ఆ షాపులకి ప్రతి సంవత్సరం రెన్యువల్ అయి, రన్నింగ్ లో ఉండేవి కేవలం మూడు వేల ఆరు వందలు మాత్రమే అని కానీ, మూడు వేల ఆరు వందలని మళ్లీ యథావిధిగా కొనసాగించి ఇవాళ ఇరవై శాతం షాపులను తగ్గిచ్చేశామని వైసిపి వాళ్ళు చెప్తున్నారని అన్నారు. మూడు వేల ఆరు వందలకి ఇరవై శాతం అంటే ఏడు వందల ఇరవై తగ్గిస్తే కేవలం రెండు వేల ఎనిమిది వందల షాపులే ఉండాలి కదా అని ప్రశ్నించారు. ప్రజల్ని తప్పు దారి పట్టిస్తూ, షాపుల్ని ఎక్కడా కూడా తగ్గించకుండా ఇష్టం వచ్చినట్లు ప్రభుత్వాధికారులతోనే ప్రభుత్వ మద్యం దుకాణాలను ఏర్పాటు చేయించి  విక్రయాలను చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగస్తులుని మద్యం దుకాణాల్లో సేల్స్ మెన్స్ కింద ఏర్పాటు చేయడం చాలా దురదృష్టకరమని అన్నారు. ఇదే కాకుండా ప్రభుత్వం చేత నడిపించబడుతున్న మద్యం దుకాణాల్లో కొన్ని బ్రాండ్ లకు మాత్రమే పరిమితం చేసి డిస్టలరీస్ నుంచి పెద్ద ఎత్తున జె టాక్స్ పేరుతో వసూలు చేస్తున్నారని అన్నారు. దాదాపు రెండు వేల కోట్లకు పైన ఈ జె టాక్స్ పేరుతో జగన్ ప్రభుత్వం వసూలు చేస్తుందన్నారు. సామాన్యుడు తాగే దానికేమో పది రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయలకి ట్యాక్స్ పెంచి, డబ్బున్నవాళ్ళు తాగే ఫారెన్ లిక్కర్ కేమో నామినల్ గా రేట్లు పెంచడం చాలా దురదృష్టకరమని అన్నారు.

మొత్తం మార్చేద్దాం... ఏం చేయాలో చెప్పండి... 

  అక్టోబర్ చివరి నాటికి మార్కెట్ కమిటీలను నియమించాలని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. క్యాంప్ ఆఫీస్‌‌లో మార్కెటింగ్ అండ్ సహకారశాఖలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన జగన్.... అధికారులకు పలు సూచనలు చేశారు. ముఖ్యంగా మార్కెట్‌ ఛైర్మన్ పదవుల్లో, కమిటీల్లో... సగం మహిళలకే ఇవ్వాలని సూచించారు. అలాగే, ఎస్సీ-ఎస్టీ-బీసీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని సూచించారు.  ఇక, సహకార రంగాన్ని సమూల ప్రక్షాళన చేయాలన్న జగన్మోహన్ రెడ్డి.... దళారి వ్యవస్థను ఆరు నెలల్లో రూపు మాపాలని ఆదేశించారు. సహకార బ్యాంకుల నష్టాలపై ఒక కమిటీ వేయాలని, అలాగే వాటిని బలోపేతం చేయడానికి అవసరమైన కార్యాచరణ సిద్ధంచేయాలని జగన్ ఆదేశించారు. సహకార రంగాన్ని పూర్తిస్థాయిలో పునర్ వ్యవస్థీకరించాలన్న జగన్మోహన్ రెడ్డి.... అవినీతి, పక్షపాతానికి తావులేని విధానం రూపొందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అలాగే, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను కంప్యూటరీకరించే దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు. ఇవన్నీ ఆరు నెలల కాలంలోనే అధ్యయనం పూర్తిచేసి సిఫార్సులు అమలు మొదలయ్యేలా యాక్షన్ ప్లాన్ సిద్ధంచేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు.  ఇక, పంట ప్రారంభంలోనే మద్దతు ధర ప్రకటించాలని అధికారులకు జగన్మోహన్ రెడ్డి సూచించారు. ధరల స్థిరీకరణ, కనీస మద్దతు ధర, మార్కెట్లో ప్రభుత్వం జోక్యం చేసుకున్నాక పరిస్థితి కచ్చితంగా మారాలని, సర్కారు భరోసా ఇచ్చిందన్న నమ్మకం రైతుల్లో కలగాలన్నారు. మొత్తం వ్యవస్థను ప్రక్షాళనచేసి బాగు చేద్దామన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి... అందుకోసం ఏంచేయాలో సూచనలు సలహాలు ఇవ్వాలని అధికారులను కోరారు.

తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ... ఢిల్లీలో మోడీతో కేసీఆర్ మీటింగ్... 

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హస్తిన బాట పట్టారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను రాబట్టుకోవడమే లక్ష్యంగా ఢిల్లీ వెళ్లిన కేసీఆర్.... తెలంగాణ సమస్యలను, అవసరాలను ప్రధాని నరేంద్రమోడీ ముందు పెట్టనున్నారు. మోడీ రెండోసారి ప్రధాని పగ్గాలు చేపట్టాక, మొదటిసారి సమావేశమవుతోన్న కేసీఆర్... ప్రధానంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులపైనే చర్చించనున్నారు. ఆర్ధిక మాంద్యం నేపథ్యంలో తక్షణమే గ్రాంట్లను రిలీజ్ చేయాలని కోరనున్నారు. అలాగే, ఆయుష్మాన్‌భవ పథకం నిధులను ఆరోగ్యశ్రీకి అనుసంధానం చేయాలని, అదేవిధంగా జలశక్తి కేటాయింపులకు మిషన్ భగీరథకు ఇవ్వాలని విజప్తి చేయనున్నారు. ఇక, బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు, జోనల్ వ్యవస్థలో మార్పులు, రిజర్వేషన్ల పెంపు, వెనుకబడిన జిల్లాలకు నిధులు, యురేనియం తవ్వకాల నిలిపివేత, హైదరాబాద్ చుట్టూ నిర్మించతలపెట్టిన రహదారికి జాతీయ హోదా, సాగునీటి ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు, ఏదోఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా, ఏపీతో కలిసి చేపడుతోన్న గోదావరి-కృష్ణా నదుల అనుసంధానానికి ఆర్ధిక సహకారం... ఇలా పలు డిమాండ్లను ప్రధాని ముందు ఉంచనున్నారు. అలాగే, తెలంగాణకి సంబంధించి పలు అంశాలపై ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు.  అయితే, ఎన్నికలకు ముందు బీజేపీని, మోడీని తిట్టిన తిట్టకుండా ఒంటికాలిపై లేచిన కేసీఆర్... నరేంద్రమోడీ రెండోసారి ప్రధాని పగ్గాలు చేపట్టాక తొలిసారి సమావేశంకాబోతుండటం, అలాగే, తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్‌ బీజేపీగా పొలిటికల్ వార్ మారుతోన్న క్రమంలో కేసీఆర్... మోడీని కలవబోతుండటం ప్రాధాన్యత కలిగిస్తోంది. మరోవైపు, కేంద్ర ప్రభుత్వ తీరుపైనా, మోడీ విధానాలపైనా కేసీఆర్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారంటూ పత్రికల్లో కథనాలు వచ్చిన నేపథ్యంలో... మోడీతో మీటింగ్‌ ఆసక్తి కలిగిస్తోంది.

కాంగ్రెస్... టీఆర్ఎస్... మధ్యలో బీజేపీ.... హుజూర్ బరిలో మిగిలింది 28మందే...

  హుజూర్ నగర్ ఉప పోరులో కీలక ప్రక్రియ ముగిసింది. ఫైనల్ గా బరిలో నిలిచిందెవరో తేలిపోయింది. నిజామాబాద్ ను తలపించేలా పోటాపోటీగా పెద్దఎత్తున నామినేషన్లు దాఖలైనా, స్క్రూటినీ, విత్ డ్రాస్ తర్వాత బరిలో 28మంది మాత్రమే నిలిచారు. హుజూర్ నగర్లో మొత్తం 76 నామినేషన్లు దాఖలు కాగా, అందులో ఏకంగా 45 తిరస్కరణకు గురయ్యాయి. మరో ముగ్గురు పోటీ నుంచి తప్పుకున్నారు. దాంతో హుజూర్ నగర్ ఉప పోరులో 28మంది మాత్రమే మిగిలారు. అయితే, గత అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్ నగర్ నుంచి 16మంది పోటీపడగా, ఉపపోరులో మాత్రం ఆ సంఖ్య అటూఇటుగా దాదాపు రెట్టింపు అయ్యింది.  అయితే, ప్రధానంగా అధికార పార్టీ టీఆర్ఎస్... ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్యే పోటీ ఉన్నప్పటికీ, బీజేపీ కూడా రేసులో ఉన్నామని చెబుతోంది. అయితే, ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశంతో అధికార టీఆర్ఎస్... అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, విచ్చలవిడిగా డబ్బు, మద్యం వెదజల్లుతోందని కాంగ్రెస్, బీజేపీ ఆరోపిస్తున్నాయి. టీఆర్ఎస్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా, గెలుపు మాత్రం తమదేనని అటు కాంగ్రెస్... ఇటు బీజేపీ చెబుతున్నాయి. అయితే, ఏదోరకంగా హుజూర్ నగర్ లో గులాబీ జెండా పాతాలని టీఆర్ఎస్ కంకణం కట్టుకుంది. మరి హుజూర్ నగర్ లో ఏ జెండా ఎగురుతుందో మరో మూడు వారాల్లో తేలిపోనుంది.

అజ్ఞాతంలో ఉన్న అజ్ఞాతవాసి...

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కనిపిస్తే చాలు,మాట్లాడితే చాలు అని ఎంతో మంది ఎదురుచూస్తుంటారు. అలాంటిది సడన్ గా పది రోజుల నుంచి ఆయన ఉనికే లేకుండా పోయింది.పవన్ కళ్యాణ్ వెన్నెనొప్పితో బాధపడుతున్నారనే విషయం ఆయన మాటల ద్వారా అందరికీ తెలిసిన విషయమే. ఓ సమావేశానికి తాను రాలేను అంటూ బహిరంగ లేఖ రాస్తూ తన వెన్నునొప్పి విషయాన్ని బయటపెట్టారు జనసేనా అధిపతి. సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం ఉన్నా తాను ప్రకృతి సిద్ధమైన వైద్యానికే మొగ్గు చూపుతున్నట్లు తెలియజేశారు. ఈ కారణం చేతనే పవన్ కల్యాణ్ ఒక్క సారిగా మాయమైపోయారు. ట్విట్టర్ లో మినహా ఆయన ఎక్కడా కనిపించడం లేదు. అక్టోబర్ రెండు గాంధీ జయంతి రోజు పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కూడా పవన్ ఎక్కడా కనిపించలేదు. సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత పవన్ కల్యాణ్ పెద్దగా కెమెరాలను ఫేస్ చేయలేదు. ఆ మధ్య వాటర్మాన్, రాజెంద్ర సింగ్ పవన్ ను కలిసారు అంటూ రెండు ఫోటోలు రిలీజ్ చేయటం మినహా పవన్ ఎక్కడున్నారు ఏం చేస్తున్నారనే విషయం బయట ప్రపంచానికి తెలియటం లేదు. రోజు పవన్ పర్సనల్ అకౌంట్ నుంచి ట్విట్టర్ పోస్టింగ్ లు వస్తున్నా ట్విటర్ లో పవన్ ఉన్న ఫొటో కనపడి పదిరోజులవుతుంది. పవన్ ఇలా హఠాత్తుగా మాయం కావడం సహజమే అనుకున్న, ఈ సారి ఆయన ఆరోగ్య పరిస్థితి జనసైనికులలో కాస్త ఆందోళన కలిగిస్తోంది. వెన్ను నొప్పి చికిత్స కోసమే పవన్ కళ్యాణ్ అజ్ఞాతంలోకి వెళ్లారని సమాచారం. ఆపరేషన్ పై ఆసక్తి చూపించని పవన్, కేరళ వైద్యం పై నమ్మకం పెట్టుకున్నట్లు వెల్లడవుతోంది. పది రోజులుగా పవన్ కళ్యాణ్ కేరళ ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్నారని అందుకే మీడియా ముందుకు రాలేకపోతున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇద్దరు నిపుణుల పర్యవేక్షణలో పవన్ కి ప్రత్యేక చికిత్స చేస్తున్నారు. వెన్నునొప్పికి తాత్కాలిక ఉపశమనం కంటే పూర్తిగా నయం కావాలంటే చికిత్స తర్వాత పవన్ కనీసం నెల రోజుల విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. వెన్ను నొప్పి తీవ్రంగా ఉండటంతో ఇన్నాళ్లూ పట్టించుకోని పవన్ కూడా ప్రస్తుతం విశ్రాంతి తీసుకోవటానికి మొగ్గుచూపుతున్నారు. అయితే అదే విషయాన్ని అధికారికంగా ప్రకటించి ఉంటే బాగుండేది ఎలాంటి ప్రకటన చేయకుండా కనిపించకపోవడంతో అటు జనసైనికులల్లోనూ ఇటు అభిమానులు కలవర చెందుతున్నారు.

సీబీఐ కోర్టులో చిదంబరానికి చుక్కెదురు...

కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి కోర్టులో కష్టాలు కొనసాగుతున్నాయి. చిదంబరం బెయిల్ పిటిషన్ ను సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం తోసిపుచ్చింది. జ్యుడిషియల్ కస్టడీని అక్టోబర్ పదిహేడు వరకు పొడిగించింది, ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. చిదంబరం బెయిల్ పిటిషన్ మళ్లీ నిరాకరించడంతో ఆయన తీవ్ర షాక్ లో ఉన్నారు. ఢిల్లీ హై కోర్టు కూడా ఇప్పటికే చిదంబరం బెయిల్ పిటిషన్ ను తోసిపుచ్చింది. ఇవాళ సుప్రీంకోర్టు లో ఆయన బెయిల్ పిటిషన్ దాఖలైంది, జస్టిస్ రమణ నేతృత్వంలోని బెంచ్ ఈ పిటిషన్ పై విచారణ జరిపింది. చిదంబరం బెయిల్ పిటిషన్ ను సిబిఐ తీవ్రంగా వ్యతిరేకించింది. బెయిల్ ఇస్తే ఆయన సాక్షులను ప్రభావితం చేస్తారని సీబీఐ తరపు న్యాయవాదులు వాదిస్తున్నారు. యుపిఎ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్న ఆయన విదేశీ పెట్టుబడులు సేకరించేందుకు ఐఎన్ఎక్స్ మీడియాకు అనుమతిచ్చారు. ఆ కంపెనీ పెట్టుబడులను సేకరించింది చిదంబరం తనయుడు కార్తీ కంపెనీల నుంచే, ఈ కంపెనీల మధ్య మూడు వందల ఐదు కోట్ల రూపాయలు చేతులు మారాయని కేసు నమోదైంది. గతంలో ఐఎన్ఎక్స్ మీడియా కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి రాజ్యసభ సభ్యుడు చిదంబరం ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఢిల్లీ హై కోర్టు తిరస్కరించింది. చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఆ హోదాలో విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక విభాగం సమావేశాలను ఆయనే నిర్వహించేవారు, ఆ సమయంలో నిబంధనలకు విరుద్ధంగా ఐఎన్ఎక్స్ మీడియా అనే సంస్థకు విదేశీ పెట్టుబడులు సేకరించేందుకు అనుమతి ఇవ్వడం ఈ కేసుకు మూలాధారం. ఐఎన్ఎక్స్ మీడియా అనే సంస్థ పీటర్ ముఖర్జియా, ఇంద్రాణి ముఖర్జీలది. అడ్వాంటేజ్ ఇండియా సింగపూర్ లోని దాని అనుబంధ సంస్థ అడ్వాంటేజ్ సింగపూర్ నుంచి ఐఎన్ఎక్స్ మీడియా పెట్టుబడులు స్వీకరించినట్లు రికార్డుల్లో చూపారు. ఈ రెండు కంపెనీలు చిదంబరం కుమారుడు ప్రస్తుత ఎంపీ కార్తీ చిదంబరానివి. తండ్రి పదవి అండతో విదేశీ పెట్టుబడులకు అనుమతులను సులభంగానే సాధించారు, ఎఫ్ఐపీబీ అనుమతులు తీసుకో కుండా ఐఎన్ఎక్స్ న్యూస్ లిమిటెడ్ అనే సంస్థను ఏర్పాటు చేసి అందులో ఇరవై ఆరు శాతం పెట్టుబడులు పెట్టారు. తండ్రి ఆర్ధిక మంత్రి కావడంతో దీన్ని అడిగేవారు లేకపోయారు. ఈ కేసులో కీలక నిందితులైన పీటర్ ముఖర్జియా, ఇంద్రాణి ముఖర్జీ దంపతులు అప్రూవర్ లుగా మారారు. తమ మీదకు కేసు రాకుండా చూసుకునేందుకు కార్తీకి వారు పది లక్షల రూపాయలు లంచం ఇచ్చారని సీబీఐ ఆరోపించింది.