గ్రామ అభివృద్ధి పై కృషి చేస్తున్న వైసిపి ఎమ్మెల్యే రోజా...

  గాంధీజీని స్ఫూర్తిగా తీసుకొని గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని వైసిపి ఎమ్మెల్యే రోజా సచివాలయ ఉద్యోగులకు సూచించారు. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో గ్రామ సచివాలయాలను ఆమె ప్రారంభించారు. మరోవైపు పుత్తూరు డిగ్రీ కాలేజీలో గాంధీజీ విగ్రహానికి నివాళులు అర్పించారు. కాలేజీలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను ప్రారంభించారు, ఈ సందర్భంగానే వైసిపి ఎమ్మెల్యే రోజా కొద్ది సేపు జిమ్ చేశారు. స్వాతంత్య్రం కోసం బ్రిటీష్ వాళ్ళు ఆయనను కొట్టిన, హింసించినా, జైల్లో పెట్టినా కూడా పట్టుదలతో ఆయన సాధించాలనుకున్నది ఏ విధంగా సాధించారో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన మీద ఎన్ని కుట్రలు పన్నినా ఈ రోజు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ ఒక్కటై కేసులు పెట్టినా కూడా వారు నిలదొక్కుకున్నారు. ఈ రోజు పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను, ఎంపీలను దొంగతనంగా వాళ్లు భయబ్రాంతులకు గురిచేసి, డబ్బు ఆశ చూపి కొనుక్కున్నా కూడా ఈ రోజు మొండిగా తన పట్టుదలతో పోరాడి ముఖ్యమంత్రి అయ్యి  ప్రజలకిచ్చిన ప్రతి వాగ్దానాన్ని కూడా దాదాపుగా ఎనభై శాతం వంద రోజుల్లోనే పూర్తి చేస్తూ ముందుకు వెళ్తున్నాడు అంటే ఈయన గాంధీగారికి నిజమైన నివాళులు అర్పించారు అనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి అని వైసిపి ఎమ్మెల్యే రోజా తెలియజేశారు. ఈ రోజున యువత కూడా గాంధీ గారిని గుర్తు చేసుకుంటూ గాంధీ గారి లాగా ప్రతి ఒక్కరు కూడా పట్టుదలతో అనుకున్నది సాధించే విధంగా జగనన్న ఎలా చేశాడో అలా ప్రతి గ్రామానికి కూడా వృద్ధి చేసే విధంగా తమకిచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలని కోరుకొంటున్నానని ఎమ్మెల్యే రోజా తెలిపారు.

సరికొత్త క్యాబ్ సర్వీసును ప్రారంభించిన మంత్రి హరీష్ రావ్...

  హైదరాబాద్ లో మరో కొత్త క్యాబ్ సర్వీస్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ప్రైడో క్యాబ్స్ పేరుతో వస్తున్న సంస్థ ఆప్ ను, లోగోను మంత్రి హరీశ్ రావు లాంఛ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి హరీశ్ రావు ప్రైడో సంస్థ పక్కా హైదరాబాద్ కు చెందిన కంపెనీ అని ఇది చాలా తక్కువ సమయంలో సక్సెస్ కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రైడో క్యాబ్స్ లాభాల కోసమే కాదని సురక్షితంగా ప్రయాణికులను గమ్య స్థానాలకు చేరుస్తుంది అని అన్నారు. కంపెనీ తెలంగాణకే పరిమితం కాకుండా గ్లోబల్ కంపెనీగా ఎదగాలని మంత్రి ఆకాంక్షించారు. దీనిపై ప్రైడో క్యాబ్ ఎండీ  కోదండరాం మాట్లాడుతూ గౌరవనీయులు మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా ప్రైడోను లాంచ్ చేశామని, అయితే ఈ సర్వీసుల్ని ముందుగా పైలేట్ బేసిస్ మీద ఒకటి నుంచి రెండు నెలలు హైదరాబాద్ లో నడిపిన తరువాత మిగతా నగరాలకు విస్తరిస్తారని అన్నారు. బెంగుళూరు, ఢిల్లీ మిగతా మెట్రో సిటీలకు త్వరలోనే అందిస్తామన్నారు. మహిళలను కూడా ఈ ప్రైడో లో లేడీ డ్రైవర్లుగా భాగస్వామ్యం చేయాలనే సంకల్పంతో ఉన్నామన్నారు. కాబట్టి డ్రైవర్ అన్ బోర్డింగ్ ప్రక్రియ రెండు, మూడు నెలల నుంచి స్టార్ట్ చేయడం జరిగిందని తెలిపారు. చాలా మంది డ్రైవర్ సోదరులు తమ మీద ఉన్న నమ్మకంతో తాము ఒక కొత్త ఒరవడిని సృష్టించగలమనే నమ్మకంతో తమ మీద విశ్వాసం ఉంచారని కోదండరాం తెలిపారు.  ఆ విశ్వాసాన్ని వమ్ము చేయకుండా డ్రైవర్ సోదరులకి, కస్టమర్ లకి అందరికీ మంచి సర్వీసులను అందిస్తామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.

హుజూర్ నగర్ లో చంద్రబాబు వ్యూహం ఎలా ఉండబోతోంది?

  హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో టిడిపి అభ్యర్థినిగా చావా కిరణ్మయి ప్రచారం మొదలు పెట్టారు. అయితే ఈ ప్రచారానికి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు రావాలని కొందరు, అవసరం లేదని మరికొందరు అభిప్రాయపడుతు ఉండటం చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ముందస్తు ఎన్నికల్లో మహా కూటమి పేరుతో టిడిపి, కాంగ్రెస్, సిపిఐ, తెలంగాణ జనసమితి పార్టీలు కలిసి మహా కూటమిగా పోటీ చేశాయి. అంతేకాదు అన్ని పార్టీల నాయకులు కలిసి ప్రచారాల్లో పాల్గొన్నారు. ఆ సమయంలో చంద్రబాబు తెలంగాణలో రెండు విడతలుగా వారం రోజుల పాటు గట్టిగానే ప్రచారం నిర్వహించారు. అయితే ఖమ్మం జిల్లాలో తప్ప టీడీపీ ఎక్కడా గెలవలేకపోయింది. ఆ క్రమంలో ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబు ప్రచారం కాంగ్రెస్ కు బెడిసికొట్టిందని ఆ పార్టీ నాయకులు ఓపెన్ గానే ప్రకటించారు. దాంతో ఈ సారి హుజూరునగర్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని కోసం చంద్రబాబు ప్రచారం చేస్తారా చెయ్యరా,చేస్తే ఎలా ఉంటుంది చేయకపోతే ఏమవుతుంది అన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ముందస్తు ఎన్నికల్లో మహాకూటమిలో సీట్లు మాత్రమే పంచుకున్న టిడిపి ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దత్తు మాత్రమే చేసి పోటీకి దూరంగా ఉంది. దాంతో తెలంగాణలో టిడిపి ఉనికి ప్రశ్నార్ధకంగా తయారైంది. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశపడ్డ టిడిపి నేతలు డీలా పడిపోయారు. ఏపీలో అధికారంలో ఉన్నప్పుడు అధిష్ఠానం తెలంగాణ టిడిపిని పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. ఆ క్రమంలో ఇప్పుడు ఏపీలో టిడిపి ఓడిపోవటంతో తెలంగాణ పై దృష్టి సారించడమే కాకుండా పార్టీకి పునఃవైభవం తెస్తానని ప్రకటిస్తున్నారు చంద్రబాబు. ప్రస్తుతం హుజూర్ నగర్ ఉప ఎన్నిక విషయానికి వస్తే బాబు ప్రచారం చేస్తే ఎఫెక్ట్ ఉంటుందంటున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల సరిహద్దుగా ఉన్న హుజూర్ నగర్ లో ఆంధ్రా ప్రభావం ఉంటుందన్న అభిప్రాయం ఉంది. రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ప్రతికూల పరిస్థితుల్ని తట్టుకుని పోటీ చేసిన టిడిపికి ఇరవై ఐదు వేల ఓట్లు దక్కాయి. ఇక రెండు వేల పధ్ధెనిమిదిలో హుజూర్ నగర్ నుంచి పోటీ చేయాలని ప్రస్తుత అభ్యర్థిని కిరణమై భావించినప్పటికీ పొత్తుల కారణంగా సాధ్యపడలేదు. ఇప్పుడు ఆమెకు మద్దతుగా పార్టీ అధినేత ప్రచారం చేస్తే అంతో ఇంతో ప్లస్ అవుతుందని అంటున్నారు.ఇక పై టీడీపీ స్ట్రాటజీ ఎలా ఉండబోతోందో వేచి చూడాలి.

అంతరిక్షంలో కూడా కనిపించనున్న శ్రీవారు.....

భూమండలంలోనే కాదు  అంతరిక్షంలో కలియుగ దైవం అయిన ఏడుకొండలవాడు పేరు మార్మోగనుంది. త్వరలో అంగారకుడు పై శ్రీవారి పేరు చేరనుంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అంటే ఆయన లేని చోటు లేదు. ఆయన విశ్వవ్యాప్తంగా పేరు పొందిన వాడు. కలియుగ దైవంగా తిరుమల కొండ పై కొలువైన శ్రీవేంకటేశ్వరుడి పేరు ఇప్పుడు మార్స్ పైకి చేరనుంది. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా తలపెట్టినా మాస్ ప్రయోగానికి సంబంధించిన రోవర్ లో ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు సూచించిన పేర్లను ఓ మైక్రోచిప్ లో నిక్షిప్తం చేసి అంగారకుడి పైకి పంపనుంది. దీనికి సెండ్ యువర్ నేమ్ టూ మాస్ పేరిట సెప్టెంబర్ ముప్పై వరకు నాసా పేర్లను ఆహ్వానించింది. నాసా ఆహ్వానానికి స్పందించి కోటి మందికి పైగా ప్రజలు పలు పేర్లను పంపించారు. వాటిలో తిరుమల శ్రీ వెంకటేశ్వరుని పేరు ఉండటం విశేషం. నేషనల్ మిషన్ ఆఫ్ మ్యానుస్ర్కిప్ట్ మాజీ డైరెక్టర్ శ్రీ వెంకటరమణారెడ్డి నాసా వెబ్ సైట్ లో శ్రీ వారి పేరును ప్రతిపాదించారు. నాసా మార్స్ మిషన్ ప్రయోగం రెండు వేల ఇరవై జూలైలో జరగనుంది. ఈ వ్యోమనౌక ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఒకటిలో అంగారక గ్రహం పైకి చేరుకుంటుందని నాసా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. రోవర్ పై అతికించిన మైక్రో చెప్పులపై స్టెన్సిల్ చేసినా పది మిలియన్ల పేర్లలో వెంకటేశ్వరస్వామి పేరు ఉంటుందని అమెరికా అంతరిక్ష సంస్థ పేర్కొంది.

కర్నూల్ జిల్లా వైసిపి నేతలు హైడ్రామా...

  కర్నూల్ జిల్లా వైసిపి నేతలు టెన్షన్ పడుతున్నారు. కారణమేమంటే ఏమి మాట్లాడాలో తెలియక ఆ జిల్లా నేతల పరిస్థితి తయారైంది. ఏం చేయాలో తెలీక ఆ నేతలు సతమతమవుతున్నారు. ఏ ప్రకటన చేస్తే ఎవరి కోపానికి గురికావలసి వస్తుందోనని మథనపడుతున్నారు. ఇంతకీ వారిని వేధిస్తున్న సమస్య ఏంటి అంటే కర్నూలు జిల్లా వైసీపీకి కంచుకోట, మొన్నటి ఎన్నికల్లో జిల్లా క్లీన్ స్వీప్ చేసింది. ఇద్దరు ఎంపీలు, పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు వైసిపి నుంచి గెలిచారు, ఓ ఎమ్మెల్సీ కూడా ఉన్నారు. జిల్లాలో వైసీపీకి మొదటి నుంచీ పట్టుంది. ఇద్దరు మంత్రులు జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. రాజధాని కోసం, హై కోర్టు కోసం కర్నూలు జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు రోడ్ల పైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. విద్యార్దులు వైసీపీ నేతల ఇళ్లను ముట్టడిస్తున్నారు. విద్యార్థుల ఆందోళనను అర్థం చేసుకున్న నేతలు వారికి మద్దతిస్తున్నారు. వారి ఆవేదనలో నిజం ఉంది అని చెబుతున్నారు. రాజధానిపై విద్యార్ధుల ఆందోళన గ్రహించిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రాయలసీమలో హై కోర్టు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ఆలోచనగా ఉన్నట్లు చెబుతున్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు చేయకుండా అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. అయితే సీమలో హై కోర్టు ఎక్కడ ఏర్పాటు చేస్తారనే విషయం పై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. అయితే సీఎం జగన్ మనసులో ఏముంది అని మాత్రం తెలియడం లేదు. సీఎంకు తెలియకుండా ప్రకటన చేస్తే తాము ఇరుక్కుంటామని భావిస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు ఏమి మాట్లాడటం లేదని తెలుస్తోంది.ఇక రాజధాని విషయం ఏమైతుందో వేచి చూడాలి.

హుజూర్ నగర్ లో కనిపించని రేవంత్? కాంగ్రెస్ కు ఊహించని నష్టం తప్పదా.!

  హుజూర్ నగర్ అభ్యర్ధి ఎంపికపై తెలంగాణ కాంగ్రెస్ లో చెలరేగిన మంటలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. టీపీసీసీ ప్రెసిడెంట్ అండ్ వర్కింగ్ ప్రెసిడెంట్ మధ్య తలెత్తిన విభేదాలు, మనస్పర్ధలు ఇంకా సమిసిపోలేదు. దాంతో హుజూర్ నగర్ ప్రచారంలో రేవంత్ చప్పుడే వినిపించడం లేదు. హుజూర్ నగర్ అభ్యర్ధి ఎంపిక విషయంలో సీనియర్లంతా టార్గెట్ చేయడంతో.... రేవంత్ సైలెంట్ అయ్యారు. అదే సమయంలో తన మాటను కనీసం పరిగణనలోకి కూడా తీసుకోకుండానే, ఉత్తమ్ భార్య పద్మావతి పేరును అధిష్టానం ప్రకటించడంతో రేవంత్ అలకబూనినట్లు తెలుస్తోంది. అందుకే, రేవంత్ కనీసం హుజూర్ నగర్ వైపు కూడా చూడటం లేదంటున్నారు.  ఒకవైపు టీఆర్ఎస్, బీజేపీ ప్రచారంలో దూసుకుపోతుంటే, మరోవైపు కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్స్ మాత్రం పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా రేవంత్ ఇప్పటివరకు అస్సలు హుజూర్ ప్రచారంలో పాల్గొనలేదు. అసలు ప్రచారానికి వస్తాడో రాడో కూడా తెలియదు. ఇక, ప్రచార కమిటీ ఛైర్మన్ విజయశాంతి కూడా హుజూర్ నగర్ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. దాంతో కాంగ్రెస్ ప్రచారంలో కొంత స్తబ్దత నెలకొందనే మాట గట్టిగా వినిపిస్తోంది. ఎంతకాదన్నా, రేవంత్ రెడ్డి అంటే యూత్ లో యమ క్రేజుంది. రేవంత్ మాటలను, పంచ్ డైలాగులను వినేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తారు. అంతేకాదు రేవంత్ మాటలు జనాన్ని ఆలోచింపచేసేలా ఉంటాయ్. ఎంతకాదన్నా, రేవంత్ ప్రచారం చేశాడంటే, ఎంతోకొంత ఇంపాక్ట్ ఉండకమానదు. మరి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన హుజూర్ నగర్ ఉపఎన్నిక క్యాంపైయిన్ లో రేవంత్ ప్రచారం చేయకపోతే, అది కాంగ్రెస్ కు మైనస్ అయ్యే ప్రమాదముంది. ఒకవైపు, టీఆర్ఎస్, బీజేపీ ఏ చిన్న అవకాశాన్ని కూడా జారవిడుచుకోకుండా, పంతానికి పోకుండా, అన్ని మార్గాలను వినియోగించుకుంటూ, మండల-గ్రామ-వార్డు స్థాయిలో ప్రచారానికి, మొత్తం బలగాన్ని రంగంలోకి దింపుతుంటే, సిట్టింగ్ సీటును నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ మాత్రం ఆ స్థాయిలో ప్రయత్నం చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ ... కేంద్ర మంత్రులను సైతం రంగంలోకి దించి ప్రచారం చేయిస్తుంటే, కాంగ్రెస్ మాత్రం కనీసం తెలంగాణ ముఖ్యనేతలతో కూడా ప్రచారం చేయించలేకపోతుందనే మాట వినిపిస్తోంది. మరి, ఉత్తమ్ చొరవ తీసుకుని రేవంత్ లాంటి లీడర్లను స్వయంగా ప్రచారానికి ఆహ్వానిస్తే, వివాదానికి తెరపడటమే కాకుండా, అది పార్టీకి కూడా మేలంటున్నారు కాంగ్రెస్ శ్రేణులు. మరి ఉత్తమ్-రేవంత్ ల్లో ఎవరో ఒకరు చొరవ తీసుకోకపోతే హుజూర్ నగర్ ఉపఎన్నికలో కాంగ్రెస్ కు ఊహించని నష్టం జరగడం ఖాయమేనంటున్నారు కార్యకర్తలు.

టీఆర్ఎస్ కోసం రంగంలోకి వైసీపీ..! హుజూర్ నగర్ లో కుల రాజకీయం

  హుజూర్ నగర్ లో ఎలాగైనాసరే గులాబీ జెండా పాతి... ఉత్తమ్ కు ఝలక్ ఇవ్వాలనుకుంటోన్న టీఆర్ఎస్... ఏ ఒక్క చిన్న అవకాశాన్నీ వదులుకోవడం లేదు. గెలుపు కోసం సర్వశక్తులనూ ఒడ్డుతోంది. ఇప్పటికే సీపీఐ మద్దతు కూడగట్టిన టీఆర్ఎస్... అదే బాటలో సీపీఎంను కూడా దాదాపు తన వైపు తిప్పుకుంది. మరోవైపు, మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి ముఖ్యనేతల వరకు అందర్నీ రంగంలోకి దింపి, మండల-గ్రామ-వార్డు స్థాయిలో ప్రచారం చేయిస్తోంది. అయినా కూడా క్షేత్రస్థాయిలో పరిస్థితులు అంత అనుకూలంగా లేవని గుర్తించిన టీఆర్ఎస్ అధిష్టానం... ఏపీ లీడర్లను కూడా రంగంలోకి దించాలని డిసైడైందట. హుజూర్ నగర్లో ఆంధ్రా సెటిలర్లు ఎక్కువగా ఉండటం, అది కూడా కమ్మ, కాపు కులస్తులు గెలుపోటములను శాసించే స్థాయిలో ఉండటంతో వైసీపీ కమ్మ, కాపు నేతలతో కులాల వారీగా ప్రచారం చేయించాలని టీఆర్ఎస్ చూస్తోందట.  హుజూర్ న‌గ‌ర్ లో క‌మ్మ‌, కాపు ఓట‌ర్లు  ప్రభావం గెలుపోటములను శాసించే స్థాయిలో ఉన్నారు. హుజూర్ న‌గ‌ర్ లో 11వేల మంది కమ్మ ఓట‌ర్లు ఉండ‌గా, కాపు ఓట‌ర్లు ఏడు వేల మందికి పైగా ఉన్నారు. అయితే, కాపుల్లో టీఆర్‌ఎస్‌పై కొంత సానుకూల‌త ఉన్నా... క‌మ్మ సామాజికవ‌ర్గం ఓట‌ర్లలో మాత్రం పూర్తి వ్యతిరేక‌త ఉన్నట్లు టీఆర్ఎస్ గుర్తించిందట. దాంతో కమ్మ నేతలను రంగంలోకి దింపి... ఆ వర్గాన్ని ప్రసన్నం చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇక, రెడ్డి ఓట్లు అత్యధికంగా 27వేల వరకు ఉన్నాయి. అయితే, మెజారిటీ రెడ్డి ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గుచూపొచ్చన్న అంచనాలతో, క‌మ్మ‌, కాపు ఓట‌ర్లపైనే గులాబీ పార్టీ ఎక్కువగా దృష్టి పెట్టింది. అందుకే ఏపీ కమ్మ, కాపు వైసీపీ నేతలను ప్రచారానికి పంపాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కోరినట్లు తెలుస్తోంది. దాంతో దసరా తర్వాత, ఏపీ వైసీపీ నేతలు.... హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ కు మద్దతుగా ప్రచారం చేస్తారని చెబుతున్నారు. ఒకవేళ, ఏపీ వైసీపీ నేతలు... టీఆర్ఎస్ కు మద్దతుగా ప్రచారంచేస్తే అది కాంగ్రెస్ కు అడ్వాండేజ్ గా మారుతుందని అంటున్నారు. గతంలో చంద్రబాబు... తెలంగాణలో ప్రచారం చేయడాన్ని కేసీఆర్ ఆయుధంగా మలుచుకున్నట్టే... ఇప్పుడు టీకాంగ్రెస్ కూడా ఏపీ నేతల క్యాంపెయిన్ ను అస్త్రంగా మార్చుకునే అవకాశముందంటున్నారు. మరి, నిజంగానే ఏపీ వైసీపీ నేతలు... హుజూర్ నగర్లో ప్రచారం చేస్తారో లేదో చూడాలి.

ఒక్కరోజు గ్యాప్ లో ఇద్దరు సీఎంలు... ఆసక్తిరేపుతోన్న కేసీఆర్, జగన్ ఢిల్లీ టూర్

  తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీ బాట పట్టారు. కేవలం ఒకే ఒక్క రోజు గ్యాప్ లో కేసీఆర్ అండ్ జగన్ హస్తినకు వెళ్తున్నారు. ఒకట్రెండు ఇష్యూస్ మినహా ఇద్దరి అజెండాలు దాదాపు ఒకేలా ఉన్నాయి. ఇద్దరూ కూడా ప్రధాని మోడీతోపాటు కేంద్ర మంత్రులను కలిసి తమతమ రాష్ట్రాల సమస్యలపై వినతిపత్రాలు ఇవ్వనున్నారు. ముఖ్యంగా ఇరు రాష్ట్రాలకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులను తెచ్చుకోవడమే ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. అలాగే విభజన సమస్యలు కూడా ప్రస్తావనకు రానున్నాయి. అయితే, ఎన్నికలకు ముందు మోడీని తిట్టిన తిట్టకుండా ఒంటికాలిపై లేచిన కేసీఆర్... నరేంద్రమోడీ రెండోసారి ప్రధాని పగ్గాలు చేపట్టాక తొలిసారి సమావేశంకాబోతున్నారు. మరోవైపు తెలంగాణలో పొలిటికల్ వార్ ... టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా మారుతోన్న క్రమంలో.... కేసీఆర్... మోడీని కలవబోతుండటం ప్రాధాన్యత కలిగిస్తోంది. అయితే, రాష్ట్రానికి రావాల్సిన నిధులపైనే మోడీతో కేసీఆర్ చర్చించనున్నారు. ఆర్ధిక మాంద్యం నేపథ్యంలో తక్షణమే గ్రాంట్లను రిలీజ్ చేయాలని కోరనున్నారు. అలాగే, ఆయుష్మాన్-భవ పథకం నిధులను ఆరోగ్యశ్రీకి అనుసంధానం చేయాలని, అదేవిధంగా జలశక్తి కేటాయింపులకు మిషన్ భగీరథకు ఇవ్వాలని విజప్తి చేయనున్నారు. ఇక, బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు, జోనల్ వ్యవస్థ సవరణ, రిజర్వేషన్ల పెంపు, యురేనియం తవ్వకాల నిలిపివేత, గోదావరి-కృష్ణా నదుల అనుసంధానం... ఇలా పలు డిమాండ్లను ప్రధాని ముందు పెట్టనున్నారు.  ఇక, ఒక్క రోజు గ్యాప్ తో ఢిల్లీ వెళ్లనున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా... రాష్ట్రానికి రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని ప్రధాని మోడీని కోరనున్నారు. రెవెన్యూ లోటు, ఆర్ధిక మాంద్యం నేపథ్యంలో... ఏపీని ఆర్ధికంగా ఆదుకోవాలంటూ మెమొరాండం ఇవ్వనున్నారు. అలాగే రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలపై ప్రధానితో జగన్ చర్చించనున్నారు. అయితే, అక్టోబర్ 15న ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబోతున్న రైతు భరోసా పథకం ప్రారంభానికి ముఖ్యఅతిథిగా రావాలని మోడీని జగన్మోహన్ రెడ్డి ఆహ్వానించనున్నారు. అయితే, ఇటీవల ప్రగతి భవన్లో సమావేశమైన కేసీఆర్-జగన్... కేంద్ర ప్రభుత్వ తీరుపైనా, మోడీ విధానాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారంటూ పత్రికల్లో కథనాలు రావడం సంచలనం సృష్టించింది. ఇక, ఇఫ్పుడు ఒక్క రోజు గ్యాప్ లో కేసీఆర్, జగన్ లు ఢిల్లీ వెళ్తుండటం... అదే సమయంలో ఇద్దరికీ మోడీ అపాయింట్ మెంట్లు ఇవ్వడం ఆసక్తిరేపుతోంది.

అందుబాటులోకి గ్రామ సచివాలయాలు... జగన్‌పై మంత్రుల పొగడ్తల వర్షం...

  ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ సచివాలయ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. తూర్పుగోదావరి జిల్లా క‎రపలో పైలాన్‌ను ఆవిష్కరించిన సీఎం జగన్మోహన్ రెడ్డి.... గ్రామ సచివాలయ వ్యవస్థను లాంఛనంగా ప్రారంభించారు. ఇక, జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు... ఎక్కడికక్కడ విలేజ్ సెక్రటేరియట్స్‌‌‌‌కు ప్రారంభోత్సవాలు చేశారు. అయితే, ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పొగడ్తల వర్షం కురిపించారు. అవినీతిరహిత పాలన అందించాలన్న గొప్ప లక్ష్యం... ఉన్నత ఆశయంతోనే గ్రామ-వార్డు సచివాలయ వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారంటూ కొనియాడారు. పాలనను ప్రజలకు చేరువ చేయడమే జగన్మోహన్ రెడ్డి ఆకాంక్ష అంటూ చెప్పుకొచ్చిన మంత్రులు.... గాంధీజీ కలలుకన్న గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకెళ్తోందని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపాలన్న లక్ష్యంతోనే గ్రామ సచివాలయ వ్యవస్థను జగన్మోహన్‌ రెడ్డి అమల్లోకి తీసుకొచ్చారని మంత్రులు, ఎమ్మెల్యేలు పొగడ్తల వర్షం కురిపించారు.

తెలంగాణ ఆర్టీసీలో సమ్మె మేఘాలు... ఉక్కిరిబిక్కిరవుతోన్న కేసీఆర్ ప్రభుత్వం

  తెలంగాణలో ఆర్టీసీ సమ్మె మేఘాలు కమ్ముకుంటున్నాయి. సోమేష్ కుమార్ కమిటీతో కార్మిక సంఘాల చర్చలు విఫలం కావడంతో.... సమ్మె యథాతథంగా ఉంటుందని ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. అయితే, సమ్మె ఆలోచన విరమించుకోకపోతే... తమ దగ్గర ప్లాన్‌-బి రెడీగా ఉందంటూ సోమేష్ కమిటీ హెచ్చరికలు పంపింది. దాంతో అంతే దీటుగా రియాక్టయిన ఆర్టీసీ కార్మిక సంఘాలు.... తమ సమస్యలు పరిష్కారమయ్యేవరకు వెనక్కితగ్గేది లేదని కౌంటరిచ్చాయి. దసరా పండగవేళ ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునివ్వడంతో తెలంగాణ ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరవుతోంది. సమస్య పరిష్కారానికి ముగ్గురు ఐఏఎస్‌లతో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం.... ప్రజలకు ఇబ్బంది కలిగించే చర్యలు మానుకోవాలని ఆర్టీసీ జేఏసీకి సూచించింది. అయితే, కమిటీ చర్చల్లో తమకు ఎలాంటి నిర్దిష్టమైన హామీ రాలేదన్న ఆర్టీసీ కార్మిక సంఘాలు.... తమ డిమాండ్లు నెరవేరేవరకు వెనకడుగు వేసేది లేదని తేల్చిచెప్పాయి. సోమేష్ కుమార్ కమిటీ సమయం కావాలని కోరిందని.... కానీ ఎంత టైమ్ కావాలో చెప్పలేదన్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంతోపాటు మొత్తం 26 డిమాండ్లూ నెరవేర్చాల్సిందేనన్న ఆర్టీసీ జేఏసీ.... కార్మికుల కోణంలో ఆలోచించి సమస్య పరిష్కారం దిశగా ప్రభుత్వం, కమిటీ కృషిచేయాలన్నారు. అయితే, పండుగల సమయంలో సమ్మెకు దిగొద్దని ఆర్టీసీ కార్మిక సంఘాలను సోమేష్ కుమార్ కోరారు. ఆర్టీసీ పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్న సోమేష్‌.... కార్మికుల సమస్యలపై సీఎం కేసీఆర్ కూడా దృష్టిపెట్టారని అన్నారు. ఆర్టీసీ సమస్యను సమూలంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న సోమేష్.... ఒకవేళ కార్మికులు సమ్మెకు దిగితే... ఎలా వ్యవహరించాలో తమ దగ్గర ప్లాన్‌-బి కూడా రెడీగా ఉందంటూ హెచ్చరికలు పంపారు. సమ్మె ఆలోచన విరమించుకోకపోతే, ప్లాన్‌-బి రెడీగా ఉందంటూ సోమేష్ కుమార్ కమిటీ హెచ్చరికలు పంపడంపై కార్మిక సంఘాలు.... ఘాటుగా రియాక్టయ్యాయి. ప్రభుత్వం దగ్గర ఎలాంటి ప్లాన్‌లున్నా... సమ్మె ఆగదన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎన్ని ఆంక్షలు పెట్టినా, సకల జనుల సమ్మెను విజయవంతం చేశామని, ఇప్పుడు కూడా అదే తరహాలో తమ డిమాండ్లు నెరవేరేవరకు పోరాడతామంటూ ఆర్టీసీ జేఏసీ స్ట్రాంగ్ కౌంటరిచ్చింది. అయితే, ప్రభుత్వం ఎన్నిసార్లు చర్చలకు పిలిచినా వెళ్తామన్న కార్మిక సంఘాలు.... తమ సమస్యలు పరిష్కారమయ్యేవరకు వెనక్కి తగ్గేదే లేదన్నారు.

రెండేళ్ల తరువాత అరసవల్లి సూర్య నారాయణ స్వామి ఆలయంలో మహా అద్భుతం...

రెండేళ్ల నిరీక్షణకు ఫలితం కనిపించింది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అరసవల్లి సూర్య నారాయణ స్వామిని సూర్య కిరణాలు ముద్దాడాయి. ఈ అద్భుత ఘట్టం కోసం రెండేళ్లుగా భక్తులు ఎదురు చూస్తున్నారు. గత రెండేళ్లుగా స్వామి వారిని సూర్య కిరణాల తాకిడి ఆనవాళ్లు కనిపించక నిరాశ చెందిన భక్తులకు ఇవాల్టి ఘటన మనసును ఉత్తేజపరిచింది. సూర్యుడు ఉత్తరాయణం నుంచి దక్షిణాయనానికి దక్షిణాయనం నుంచీ ఉత్తరాయణానికి మారే సమయంలో ఇలాంటి ఘటన ఆవిష్కృతమవుతుంది. ఇలాంటిది ఏడాదిలో రెండు నెలల్లో రెండు సార్లు మాత్రమే జరుగుతుంది. ఉదయించే లేలేత సూర్య కిరణాలు స్వర్ణ కాంతులతో ఆలయంలోని గర్భగుడిలో కొలువుదీరిన స్వామి వారి మూల విరాట్ పాదాల నుంచి శిరస్సు వరకు కిరణాల తాకుతాయి. అయితే వాతావరణం అనుకూలించక మొదటి రోజున కారుమబ్బులు సూర్య కిరణాల తాకిడికి ఆటంకం కలిగినా రెండో రోజు మాత్రం ఏకంగా ఏడు నిమిషాల పాటు సూర్య కిరణాలు స్వామి వారి మూల విరాట్ ను తాకాయి. ఉదయం ఆరు గంటల ఒక నిమిషం నుంచి ఆరు గంటల ఎనిమిది నిమిషాల వరకు సూర్య కిరణాలను చూసిన భక్తులు పరవశించిపోయారు. ఎప్పుడో ఓసారి జరిగే ఈ మహాద్భుతాన్ని చూసేందుకు వచ్చిన భక్తులు మొదటి రోజును నిరాశతో వెళ్ళిపోయినా, రెండో రోజు మాత్రం ఈ సూర్య కిరణాలను కనులారా చూసి పరవశించిపోయారు. శ్రీకాకుళం జిల్లాలో కొలువుదీరిన శ్రీ అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారి ఆలయాన్ని దర్శించుకున్న భక్తులకు ఈ అదృష్టం దక్కింది. ప్రతి ఏటా మార్చి ఎనిమిది, తొమ్మిది తేదీల్లో సూర్యుడు ఉత్తరాయణం నుంచి దక్షిణాయనానికి, అక్టోబర్ ఒకటి, రెండు తేదీల్లో దక్షిణాయనం నుంచీ ఉత్తరాయణానికి మారుతుంటాడు. ఈ సమయంలో సూర్య కిరణాలు స్వామి వారి మూలవిరాట్ ను తాకుతాయి.

భర్తను హతమార్చాలకున్న భార్య...

ప్రస్తుతం ఉన్న సంబంధాలకు విలువ లేకుండా పోతుందని కొన్ని సంఘటనలు చూస్తుంటే మనకు నిజమే అనిపిస్తోంది.ప్రియుడితో తనను హతమార్చాలనుకున్న భార్య బండారాన్ని బయటపెట్టాడు భర్త ఈ సంఘటన గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జరిగింది. రజియాబేగం తన భర్త ఖాజా మొయినుద్దీన్ ను హత్య చేసేందుకు స్కెచ్ వేసింది. భర్త మిత్రుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది రజియాబేగం. భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన మొయినుద్దీన్ తన హత్యకు కుట్ర జరుగుతోందని పసిగట్టాడు. భార్య ఆమె ప్రియుడు ఫొటోలు ఆడియోలు తీసి పోలీసుల ముందు పెట్టాడు. తొమ్మిదో తారీకు పదకొండో నెల రెండు వేల పన్నెండులో పెళ్ళి అయ్యింది. వారికి పెళ్ళి అయ్యి ఇప్పటికి ఏడు సంవత్సరాలు అవుతుందని, అతనికి ఇద్దరు ఆడ పిల్లలని ఆ బాధితుడు తెలిపాడు. తన స్నేహితుడు బాజీ అనే అతను తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని అతను తెలియజేశాడు. తన భార్య తన స్నేహితుడు ఇద్దరు కలిసి తనని చంపటానికి ప్రయత్నించారని ఆ బాధితుడు పేర్కొన్నాడు. ఒకసారి కరెంట్ షాక్ ఇచ్చి చంపాలనుకున్నారని, మరొకసారి అన్నంలో విషం పెట్టి చంపాలనుకున్నారని అతను చెప్పడు. అతని ఆస్థికోసం ఇద్దరు కలిసి అతనిని చంపబోయారని అతను వాపోయాడు.ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు కేసును నమోదు చేసుకున్నారు.

హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో సి.పి.ఎం దారెటు..?

హుజూర్ నగర్ ఉప ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. హుజూర్ నగర్ లో ఎలాగైనా గులాబీ జెండాను పాతేందుకు అధికార టి.ఆర్.ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా సీపీఐ తో జతకట్టింది. సిపిఐ మద్దతుతో గులాబీ జెండాను రెపరెపలాడించాలని గులాబీ దళపతి కేసీఆర్ ఉవ్విళ్లూరుతున్నారు. కాంగ్రెస్ కంచుకోటను బద్ధలు కొట్టి హుజూర్ నగర్ లో సత్తా చాటాలని కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు. కాంగ్రెస్ ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ హస్తం పార్టీని చిత్తుగా ఓడించాలని కేసీఆర్ రాజకీయ వ్యూహాలకి పదును పెడుతున్నారు. అందులో భాగంగానే హుజూర్ నగర్ లో పట్టున్న సిపిఐ ని మద్దతివ్వాలని కోరారు. అందుకు సీపీఐ కూడా అంగీకారం తెలిపింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా హుజూర్ నగర్ లో గెలిచి తమ సత్తా చాటాలనుకుంటోంది. హుజూర్ నగర్ లో గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ టి.జె.ఎస్ మద్దతు కోరింది. అందుకు టీ.జే.ఎస్ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపింది. టి.జె.ఎస్ చైర్మన్ కోదండరాం తో జరిపిన చర్చలు ఫలించడంతో కాంగ్రెస్ పార్టీ ఫుల్ జోష్ లో ఉంది. టి.జె.ఎస్ మద్దతుతో హుజూర్ నగర్ లో కాంగ్రెస్ జెండా రెపరెపలాడడం ఖాయమని హస్తం నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే టి.ఆర్.ఎస్ కు సిపిఐ మద్దతు ఇవ్వటం చారిత్రక తప్పిదమని టి.జె.ఎస్ చైర్మన్ కోదండరాం మండిపడుతున్నారు.  హుజూర్ నగర్ లో ప్రధానంగా పోటీ కాంగ్రెస్, టి.ఆర్.ఎస్ మధ్యే కన్పిస్తోంది. కాంగ్రెస్ కి టీ.జే.ఎస్ మద్దతిస్తే అలాగే టి.ఆర్.ఎస్ సిపిఐ మద్దతిచ్చింది. అయితే సిపిఎం దారెటో తెలియాల్సి ఉంది. హుజూర్ నగర్ ఉప ఎన్నికల బరిలోకి దిగిన సిపిఎం పార్టీకి నిరాశే మిగిలింది. పార్టీ అభ్యర్థి దాఖలు చేసిన నామినేషన్ ను తిరస్కరించారు. అయితే దీనిపై న్యాయపరంగా పోరాటం చేయాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఈ నెల ఆరున రాష్ట్ర కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. మరోవైపు ఇదే అదునుగా భావించిన టీడీపీ తమ పార్టీ అభ్యర్థికి మద్దతివ్వాలని సిపిఎం ని కోరింది. టిడిపి అధ్యక్షుడు ఎల్ రమణ సిపిఎం నేతలను కలిసి విజ్ఞప్తి చేశారు. అయితే టిడిపికి మద్దతిచ్చే అంశంపై త్వరలోనే స్పష్టత ఇస్తామన్నారు తమ్మినేని వీరభద్రం.

ఇరు రాష్ట్రాల సీఎం లను కలిపిందెవరు?

తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి రెండుసార్లు కలిశారు. ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు. సాగు నీటి ప్రాజెక్టులతో పాటు రెండు రాష్ట్రాల సమస్యల పై చర్చించారు. ఎన్నికల ముందు నాటికి వీరిద్దరూ కలిసింది లేదు. కానీ ఏపీ ఎన్నికల తరువాత కేసీఆర్, జగన్ కలిసి పనిచేస్తు ఏకతాటిపై ముందుకు సాగుతున్నారు. అయితే వీరిని కలిపింది ఎవరు అనే విషయం పై ఇప్పుడు చాలా చర్చ జరుగుతోంది. వైఎస్ రాజశేఖరెడ్డి ఆత్మగా పేరున్న కెవిపి, రాష్ట్ర విభజన తరువాత తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో దాదాపు కనుమరుగయ్యారని అనుకున్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకే పరిమితమైన ఆయనా పెద్దగా పొలిటికల్ ప్లాట్ ఫాంపై కనిపించింది తక్కువ. రాష్ట్ర విభజన సమస్యల పై రాజ్య సభలో పోరాటం చేశారు. ప్లేకార్డులతో ప్రదర్శనలు చేసేవారు. వైఎస్ తో కేవీపీకి సన్నిహిత సంబంధాలున్నాయి. కానీ జగన్ తో సంబంధాలు అంతగా లేవనేది అందరూ చెప్పే మాట. కాంగ్రెస్ వదిలి వచ్చేటప్పుడు తన మాట వినలేదని కెవిపి ఆ తర్వాత జగన్ కూ దూరమయ్యాడని ఓ  ఊహ . అయితే ఇప్పుడు మళ్లీ జగన్ కే కేవీపీ దగ్గరయ్యారని ఓ గుసగుస రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. కేసీఆర్ తో జగన్ ను దగ్గర చేసింది కెవిపి అని ప్రచారం నడుస్తోంది. విభజన సమస్యలను పరిష్కరించుకోవడంతో పాటు గోదావరి, కృష్ణా జలాలను అనుసంధానం చేయడం వెనుక ఇద్దరు సీఎంలు కలిసి కూర్చోవడం వెనుక కేవీపీ ఎత్తుగడలున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రోజెక్టు రివర్స్ టెండరింగ్ విషయంలో కూడా కేవీపీ సూచన మేరకే జరిగిందని ఏపీ రాజకీయ నేతలు చర్చించుకుంటున్నారు. అయితే జగన్ కేవీపీ మధ్య సన్నిహిత సంబంధాలు లేవని కొందరు చెబుతున్నారు. కుటుంబ సభ్యుల మధ్య మాత్రమే సంభందాలు ఉన్నాయని రాజకీయ సంబంధాలూ లేవని వీరంటున్నారు. టీఆర్ఎస్ నేతల నుంచి కూడా ఇదే సమాధానం వస్తుంది. కేవీపీ నుంచి తమకు సలహాలు స్వీకరించే అవసరం లేదనేది వారి వాదన. కేవీపీ కాంగ్రెస్ నేతని ఆయన సలహాలు ఎలా తీసుకుంటారనేది గులాబీ నేతల విమ్మర్షలు చేస్తున్నారు.

జగన్ నవరత్నాలలో మద్యపాన నిషేధం పై వెనక్కు తగ్గని జగన్....

గ్రామ వాలంటీర్లు, సెక్రటేరియట్లు ఈ రెండూ కూడా అవినీతి, వివక్ష అన్నది ఎక్కడా కూడా చూపే పరిస్థితి కూడా లేకుండా ప్రతి పథకం తీసుకు వచ్చే కార్యక్రమన్ని ప్రారంభిస్తూన్నామని జగన్ వెల్లడించారు. అక్టోబరు నాలుగో తారీకున ప్రతి ఆటో తోలుకుంటూ ఉన్న ప్రతి ట్యాక్సీ కోరుకుంటావున్నా సొంత ట్యాక్సీ సొంత ఆటో ఉన్న ప్రతి తమ్ముడికి ప్రతి అన్నకు జగన్ తోడుగా ఉంటాడు. ప్రభుత్వం అండగా ఉంటుంది అని చెప్పి సంకేతమిస్తూ ఇచ్చిన మాట ప్రకారం నిజాయితీగా అవినీతి ఎక్కడ తావు లేకుండా ప్రతి ఒక్కరికీ అక్షరాలా లక్షా డెబ్బై రెండు వేల మందికి పది వేల రూపాయలు వారి అకౌంట్లల్లో జమ చేసే కార్యక్రమానికి శ్రీకారం జరుగుతుంది. ఒక్కసారి ఆలోచన చేయండి ఇంత గొప్ప కార్యక్రమం అవినీతికి తావు లేకుండా జరిపి చేయగలుగుతున్నామంటే గ్రామ వాలంటీర్లు, గ్రామ సెక్రటేరియట్లు వాళ్లు చేస్తున్న కృషి ఎంత ఉంది అన్నది  ఆలోచించాలని జగన్ కోరారు.ఈ వ్యవస్థలోకి సంపూర్ణమైన మార్పులు తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తామన్నారు.  గాంధీ జయంతి నాడు మద్యం మీద జరుగుతవున్న మనం పోరాటం కూడా ఆయన ప్రస్తావించారు. మద్యం షాపులు ఇంతకు ముందు ఎన్నున్నాయో అందరికీ తెలుసు అక్షరాల మద్యం దుకాణాలు అప్పట్లో నాలుగు వేల ఐదు వందల ఎనభై షాపులున్నాయి. మద్యం షాపులకు అనుసంధానంగా ప్రతి గ్రామంలోను బెల్టుషాపులు అక్షరాల రాష్ట్రంలో నలభై మూడు వేల బెల్టుషాపులున్న పరిస్థితి  గతంలో కనిపించేది. ఊర్లల్లో మినరల్ వాటర్ ఉందో లేదో  తెలీదు కానీ మద్యం దుకాణాల మాత్రం వీధి చివరన గుడి పక్కన బడి పక్కన ఎక్కడ పడితే అక్కడ కనిపించే పరిస్థితి మాత్రం గ్రామాల్లో ఉండేది." ఈ రోజు సగర్వంగా నేను చెబుతా ఉన్నా గాంధీ జయంతి నాడు గాంధీ గారి స్ఫూర్తిని తీసుకొని ఈ రోజు చెబుతా ఉన్నాను. ఇవాళ గర్వంగా చెబుతారాయన నలభై మూడు వేల బెల్టు షాపులు ఏ గ్రామంలోను బెల్టు షాపులు లేకుండా పూర్తిగా రద్దు చేసిన ప్రభుత్వం వైసీపీది" అని చెప్పి సగర్వంగా  జగన్ తెలియజేశారు. ఈ బెల్టు షాపులు రద్దు చేయడమే కాదు పూర్తిగా లేకుండా చేయడమే కాదు మళ్లీ ఈ బెల్టు షాపులు పుట్టుకు రాకుండా చేయడం కోసం ప్రభుత్వమే బెల్టు షాపులనేదే లేకుండా చేయడం కోసం ప్రభుత్వమే మద్యం దుకాణాలు కూడా నేరుగా ప్రభుత్వమే నడిపించే కార్యక్రమం చేస్తామని జగన్ వెల్లడించారు. ప్రైవేటు షాపులు నడిపితే ప్రైవేటు వాళ్ళు లాభాపేక్షతో బెల్టు షాపులు ప్రోత్సహిస్తారు. ఆ ప్రోత్సాహం ఉండకుండా ఉండాలంటే గవర్నమెంటే బెల్టు షాపులు నడిపితేనే ఇది సాధ్యమవుతుంది అని తెలిసి పూర్తిగా ప్రైవేటు షాపులను తీసేసి గవర్నమెంటే మధ్య షాపులు నడిపించే కార్యక్రమం కూడా చెయ్యటానికి శ్రీకారం చుట్టింది. నాలుగు వేల ఐదు వందల ఎనభై మందు షాపులు గతంలో ఉంటే ఈ రోజు మూడు వేల నాలుగు వందల యాభై షాపులకు దానిని తగ్గించారని తన నవరత్నాల పధకం అమలు గురించి ఆయన వ్యాఖ్యానించారు. పర్మిట్ రూములు అన్నది ఇంతకు ముందు మందు షాపు మంజుషా పక్కనే ఒక పర్మిట్ రూమ్ ఆ పర్మిట్ రూం పక్కనే అక్కడే తాగుబోతులు తాగుతా ఉన్నప్పుడు ఆడ వాళ్లు ఎవరైనా కూడా అక్కచెల్లెమ్మల ఎవరైనా కూడా దారిన పోవాలంటే భయపడే పరిస్థితి. ఆ పరిస్థితులను కూడా మార్చేసి గవర్నమెంటే షాపును నడుపుతోంది పక్కనే పర్మిట్ రూములు కూడా పూర్తిగా రద్దు చేసే కార్యక్రమాన్ని చేస్తున్నామని జగన్ తెలియజేశారు. మద్యం టైం పై కూడా ఆయన ప్రస్తావిస్తూ ఇంతకు ముందు రాత్రి పదైనా రాత్రి పదకొండయినా మందు అందుబాటులో ఉండే పరిస్థితి పూర్తిగా తీసేసి మంత్రి షాపు తెరవడమే మధ్యాహ్నం దిశగా పదకొండు గంటలకు తెరిచి రాత్రి ఎనిమిది అయ్యేసరికి మందు షాపులను కూడా పూర్తిగా మూసేయాలి అని చెప్పి ఆదేశాలు జారీచేశామని ఆయన వెల్లడించారు.మద్యం నిషేధం పై జగన్ చాలా గట్టి నిర్ణయంతోనే ఉన్నారని మనకు వెల్లడవుతోంది.

చర్చలు విఫలం కావడంతో సమ్మెకు సిధ్ధమంటున్న ఆర్టీసీ నాయకులు...

  ఆర్టీసీ కార్మికుల సమ్మె యోచనపై ప్రభుత్వం తీవ్రంగా దృష్టి పెట్టింది. వాళ్లు సమ్మె ఆలోచన నుంచి బయటకు వచ్చేలా ముందు గానే ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో కార్మిక సంఘాల నాయకులతో జరిపిన చర్చలు ముగిశాయి. 26 డిమాండ్ లను కమిటీ ముందుంచింది ఆర్టీసీ, జేఏసీ. ఆర్టీసీ కార్మికుల డిమాండ్ లను సానుకూలంగా విన్నామన్నారు ఆర్.జి.టి ఇన్ చార్జ్ ఎండీ సునీల్ శర్మ. సిఎం కేసిఆర్ ఆర్టీసిపై ప్రత్యేక దృష్టి పెట్టారని రాజ్యాంగ బద్ధంగా ఐ.ఏ.ఎస్ ల కమిటీ ఏర్పడిందన్నారు సోమేశ్ కుమార్, దసరా సమయంలో సమ్మె వద్దని విజ్ఞప్తి చేశామన్నారు. అన్ని సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయని కాస్త ఓపిక పట్టాలని ఆర్టీసీ ఉద్యోగులను కోరామన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందిగా ఆర్టిసికి సంబంధించినటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో ఈ నెల ఐదు నుంచి వాళ్లు సమ్మె చేయాల్సిన అవకాశం ఉంది. అయితే ఈ నేపథ్యంలో క్యాబినెట్ నుంచి త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. రెండు గంటల పాటు జరిగిన కమిటీ సమావేశంలో పూర్తిగా చర్చలైతే ఫలించలేదు. దీంతో సమ్మె బాటకు మేము సిద్ధంగా ఉన్నామంటూ ఆర్టీసికి సంబంధించినటువంటి జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. సమావేశంలో సీనియర్ ఆఫీసర్లు డిమాండ్లకు గడువు ఇవ్వని నేపథ్యంలో ఆర్టీసీకి సంబంధించిన జేఏసీ నాయకులు వాళ్ల పూర్తి నిర్ణయాన్ని మీడియాకి చెప్పడం జరిగింది.

ఇసుక రవాణాతో ఏపీ ప్రభుత్వంలో సరికొత్త ఉద్యోగ అవకాశాలు అందించనున్న సీఎం జగన్...

  గత ప్రభుత్వం ఇసుక విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో ఇసుక విధానం ప్రజలకు మద్దత్తు ఉండేలా జగన్ సర్కార్ చర్యలు తీసుకుంటోంది. ఇసుక పంపిణీ విధానంలో పెను మార్పులు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న జగన్ సర్కార్ మరో కొత్త నిర్ణయం తీసుకోబోతోంది. ప్రతి జిల్లాలోని రెండు వేల మంది నిరుద్యోగ బీసీ, ఎస్సీ, ఎస్టీ యువకులు ఆయా కార్పొరేషన్ ల ద్వారా ఇసుక రవాణా వాహనాలను ఇప్పించి వారికి ఇసుక కాంట్రాక్టు ఇవ్వాలని సీఎం అధికారులకు సూచించారని సమాచారం. దీని పై త్వరలో మార్గదర్శకాలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. ఏపిలో తీవ్ర చర్చలు జరిపిన తరువాత ఇసుక అమ్మకాలు ప్రారంభించిన జగన్ సర్కారు దీన్ని పటిష్టంగా అమలు చేసేలా అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు ఇస్తోంది. దీంతో పాటు ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడంతో పాటు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేలా సీఎం జగన్ మరో కొత్త నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారం ఇక పై ప్రతి జిల్లాలో రెండు వేల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన నిరుద్యోగుల యువకులను గుర్తించి వీరికి కాపు కార్పొరేషన్ తో పాటు సంబంధిత కార్పొరేషన్ ద్వారా ఇసుక రవాణా వాహనాలు అందించనున్నారు. వీరికే ఇసుక రవాణ కాంట్రాక్టులు ఇవ్వడం ద్వారా ఇసుక రవాణాలో అక్రమాలను పూర్తిస్థాయిలో అరికట్టాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశాలిచ్చారు. దీనికి సంబంధించిన మార్గ దర్శకాలను రూపొందించాలని సూచించారు.  ఇసుక అమ్మకాలు ప్రారంభమైన ఇంకా రాష్ట్రంలో పలుచోట్ల ఇసుక పంపిణీలో ఆటంకాలు ఏర్పడటం పై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కిలోమీటరుకు నాలుగు రూపాయల తొంభై పైసలు చొప్పున ఇసుక రవాణా చేస్తామంటూ ఎవరు ముందుకొచ్చినా వారికి అవకాశం ఇవ్వాలని జగన్ ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని రీచ్ లను తెరవాలని జిల్లాలో ఇసుక సరఫరా రవాణా బాధ్యతను జేసీ స్థాయి అధికారికి అప్పగించారని సూచించారు. ఆ ఆధికారి కేవలం ఇసుక సరఫరా రవాణాలను మాత్రమే చూడాలన్నారు. కృష్ణా, గోదావరి నదిలో వరదలు తగ్గాయి కాబట్టి ఇసుక లభ్యత ఉందని దానిని తక్కువ రేటుకు అందించారని సీఎం చెప్పారు. వచ్చే అరవై రోజుల్లో కచ్చితంగా మార్పు రావాలని జగన్ అధికారులను ఆదేశించారు. ఇక్కడ రాజకీయ జోక్యాన్ని ఎక్కడ అనుమతించరాదని సీఎం ఆదేశాలిచ్చారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా కచ్చితంగా కనిపించాలని ఆయన వెల్లడించారు. ఇసుక మాఫియా ఎట్టి పరిస్థితిల్లోనూ కనిపించకూడదని,ప్రోత్సహించకూడదని సీఎం ఆదేశాలు జారీ చేశారు.ఈ విషయంలో అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నానని వెల్లడించారు. ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు ఇసుక సరఫరా ఉండకూడదని ఈ మేరకు చెక్ పోస్టుల్లో గట్టి నిఘాను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఇప్పటికే రాష్ట్రంలో అవసరానికి తగిన ఇసుక లేదన్న విషయం గుర్తించి అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఈ అంశంపై జగన్ తనదైన గట్టి నిర్ణయాన్ని తెలియజేశారు.

ప్రధానమంత్రితో భేటీ కానున్న సీఎం కె.సి.ఆర్...

  తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్తున్నారు. రేపు ఆయన దేశ రాజధానికి వెళ్లి, ఎల్లుండి మధ్యాహ్నం ప్రధాని మోదీ తో భేటీ అవుతారు. రేపు ఢిల్లీ వెళ్లనున్న కేసీఆర్ అవసరమైతే కేంద్ర మంత్రులతో సమావేశం అవుతారు ఆ తరువాత రోజు ప్రధానమంత్రి మోడీతో భేటీ అవనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు, అదే విధంగా యురేనియం తవ్వకాలు ఇక్కడి ప్రజలు వ్యతిరేకిస్తున్నారని ప్రధాని మోడీతో స్వయంగా కలిసి కె.సి.ఆర్ వివరించనున్నారు. దీంతో పాటు పన్నులకు సంబంధించిన విషయంలో కొంత రిటిషన్ ఎఫెక్ట్ ఉంది. ఆ ఎఫెక్ట్ నేపథ్యంలో రాష్ట్రానికి వచ్చే పన్నుల వాటాలో కొంత కోత ఉంది. ఆ కోతను తగ్గించాలనో లేక రాష్ట్రానికి ప్రత్యేక అధికారాలు ఇవ్వాలని కోరే అవకాశం ఉంది. కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక పరిస్థితులు, ప్రత్యేక అవసరాలను దృష్టిలో పెట్టుకొని పన్నుల విధింపు, లేదా పన్నుల వాటా కోత లాంటివి కేంద్రం చేయాల్సి ఉంటుంది. రాష్ర్టాలకిచ్చేటువంటి కేంద్ర వాటా విషయంలో ఈ పద్ధతులను పాటించాలంటూ దీనిపై మోడీతో మాట్లాడాలని కె.సి.ఆర్ అన్నారు. దాంతో పాటు ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తైంది, కాళేశ్వరం కు జాతీయ హోదా ఇవ్వాలంటే పాలమూరు ప్రాజెక్ట్ లను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కె.సి.ఆర్ కోరారు. కాబట్టి పాలమూరు ప్రాజెక్టులలో ఏదో ఒక దానికి జాతీయ హోదా ఇవ్వాలని కోరేటువంటి అవకాశం కూడా ఉంది. జాతీయ రహదారుల విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతానికి వ్యతిరేకిస్తుంది ఎందుకంటే రాష్ట్రాలు యాభై శాతం భూ సేఖరణలు చెల్లించాలి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఉన్నటువంటి అనేక జాతీయ రహదారులను అభివృద్ధి చేయడమో లేక కొత్త జాతీయ రహదారులను నిర్మించే విషయంలో ముఖ్యమంత్రి రేపు ప్రధానమంత్రితో చర్చించే అవకాశం ఉంది.

సైంటిస్ట్ సురేష్ ను అతి దారుణంగా హత్య చేయడానికి కారణం ఏమిటి?

  సైంటిస్ట్ సురేష్ హత్య కేసులో కొత్త కోణం వెలుగు చూస్తోంది. ఈ హత్య కేసులో శ్రీనివాస్ అనే వ్యక్తిని పోలీసులు అనుమానిస్తున్నారు. సురేష్ తో ఉన్న సంబంధాల కారణంగానే శ్రీనివాస్ హత్య చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. మూడు ప్రత్యేక పోలీసు బృందాలు శ్రీనివాస్ కోసం గాలిస్తున్నాయి. సైంటిస్టు సురేష్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. రెండు నెలలుగా సురేష్ ఇంటికి వచ్చి వెళ్తున్న శ్రీనివాస్ పైనే ఆనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీనివాస్ కోసం మూడు పోలీసు బృందాలు గాలింపు నిర్వహిస్తున్నాయి.  శాస్త్రవేత్తగా పని చేస్తున్న సురేష్ కుమార్ హత్య జరిగి నలభై ఎనిమిది గంటలు కావస్తుంది. ఇప్పటి వరకు కూడా  పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. అతను అన్నపూర్ణ అపార్ట్ మెంట్స్ లోని ఎస్2 ఫ్లాట్లో ఉంటున్నాడు. ఇరవై ఏళ్ల క్రితం అతను కేరళ నుండి హైదరాబాద్ కు వచ్చి అప్పటి నుండి కూడా అతను నేషనల్ సెంచరీ రిమోట్ సెంటర్ లోనే పని చేస్తూ ఉన్నాడు. అతని భార్య వృత్తిరిత్యా బ్యాంకు మేనేజర్ కావడంతో ప్రస్తుతం ఆమె బెంగళూరులో జాబ్ చేస్తుంది. సురేష్  ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. ప్రస్తుతం వాళ్లంతా కూడా వాళ్ల వాళ్ల ఉద్యోగరీత్యా వాళ్లు ఉంటున్నారు. సురేష్ కుమార్ ఒక్కడు మాత్రమే ఎ2 లో నివాసముంటున్నాడు. సోమవారం నాడు అతను ఆఫీస్ కి రాలేదు రాకపోవటంతోటి వెంటనే అక్కడ ఉన్నవాళ్లంతా  అతను పని చేస్తున్న నేషనల్ సెన్సింగ్ రీసెర్చ్ సెంటర్  సంబంధించిన ఉద్యోగులు వెంటనే ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఫోన్ చేసినా స్విచ్చాఫ్ రావడంతోటి అతను వెంటనే అతని కుటుంబ సభ్యుల సమాచారమందిచడంతో మంగళవారం నాడు అతని భార్య అక్కడకు చేరుకున్నారు. తరువాత పోలీసులకు ఫిర్యాదు చేసి వచ్చిన తరువాత  తాళం తీసి చూసే సరికి అప్పటికే అతను విగతజీవిగా రక్తస్రావంలో పడి ఉన్నాడు. తలకు బలమైన గాయం జరిగింది. అందుకోసమే అతను చనిపోయినట్లు కూడా ప్రస్తుతమైతే పోలీసులు భావించడం జరుగుతుంది. అయితే హత్యకు గల కారణాలు మాత్రం ఇంకా తెలియలేదు. తలకు బలమైన గాయమైంది అనేది ఒకటి తెలుస్తుంది. మరొకవైపు గత కొద్ది కాలంగా ఒక యువకుడు ఇక్కడకు వస్తున్నాడు అని పోలీసులు సమాచారం సేకరించారు. ప్రస్తుతం అపార్టుమెంట్ లో మాత్రం ఎక్కడ సీసీ కెమెరాలు లేకపోవటం వల్ల కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంది.