పెట్టుబడిదారుల చేతుల్లోకి ఆర్టీసీ.! టీఎస్-ఆర్టీసీకి పొంచివున్న ప్రమాదం

  తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె మూడో రోజుకి చేరింది. సర్కార్ మెట్టు దిగకపోవడం... కార్మికులు పట్టు డకపోవడంతో సమ్మె ‍యధావిధిగా జరుగుతోంది. సర్కార్ హెచ్చరికలను కార్మికులు ఏమాత్రం పట్టించుకోలేదు. దాంతో మూడోరోజు కూడా బస్సులు రోడ్డెక్కలేదు. రాష్ట్రవ్యాప్తంగా బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ఇక, ఇవాళ్టి నుంచి ఆందోళనలను ఉధృతం చేయాలని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నిర్ణయించింది. ఇందిరాపార్క్ ధర్నా చౌక్ దగ్గర నిరాహారదీక్షలకు యూనియన్ నేతలు సిద్ధమవుతున్నారు. అయితే, ఇందిరాపార్క్ ధర్నా దగ్గర ఎలాంటి దీక్షలకు అనుమతి లేదని పోలీసులు తేల్చిచెప్పారు. ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు అక్కడ ఎలాంటి ఆందోళనలు చేపట్టినా అదుపులోకి తీసుకుంటామని హెచ్చరించారు. అయితే, అనుమతిచ్చినా, ఇవ్వకపోయినా కుటుంబాలతో కలిసి నిరాహార దీక్షలు చేపట్టి తీరుతామని ఆర్టీసీ యూనియన్ నేతలు అంటున్నారు. అలాగే, అన్ని డిపోల ముందు కుటుంబాలతో కలిసి నిరసన తెలుపుతామని జేఏసీ కన్వీనర్ అశ్వద్దామరెడ్డి తెలిపారు. అలాగే, అద్దె బస్సులను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఆర్టీసీ పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్లిపోయే ప్రమాదముందని... ప్రజారవాణాను కాపాడుకోవడానికే సమ్మె చేస్తున్నామన్న అశ్వద్ధామరెడ్డి అన్నారు.

విశాఖపట్నంలో జనసేనకు ఏమవుతోంది...

రాజకీయ ప్రభంజనం అనుకున్న జనసేనకు సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత నిశబ్దంగా ఉంది. ఆ పార్టీకి కీలకంగా భావించిన విశాఖపట్నం జిల్లాలో నాయకులు క్యాడర్ అత్మస్థైర్యం రోజురోజుకు తగ్గిపోతుంది. ప్రశ్నించటమె లక్ష్యంగా ఎగసిన యువశక్తి స్తబ్దతగా మారిపోయింది. భవిష్యత్ పై క్లారిటీ లేకపోవడం, అధినాయకుడి అంతరంగం అర్థం కాకపోవడంతో నాయకత్వంలో అయోమయం నెలకొంది. రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం ఏర్పడినపుడు త్రిముఖ పోటీ జరిగింది. ప్రధాన ప్రతిపక్షం టిడిపి బలహీనంగా ఉండటం, సామాజిక బలం, గట్టి పట్టు కలిగిన అభ్యర్ధులు బరిలో నిలవడంతో జిల్లాలో పీఆర్పీ నాల్గు స్థానాలను ఆ పార్టీ గెలుచుకుంది. రెండు వేల పంతొమ్మిది నాటికి జనసేన పిఆర్పిని మించిన అంచనాలతో ఓటర్ల ముందుకొచ్చింది. ప్రయోగాలు కొలిక్ కి రాకుండానే ఎన్నికల బరిలో దిగి పొయింది. స్వయంగా జనసేన చీఫ్ గాజువాక నుంచి పోటీ చేశారు. సీబీఐ మాజీ అధికారి వివి లక్ష్మీ నారాయణ, ఐఆర్ఎస్ అధికారి చింతల పార్థసారథి, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట రామయ్య వంటి వారు జనసేన తరపున రంగంలోకి దిగినా ఫలితం లేకుండా పోయింది. అభ్యర్ధుల ఎంపిక నుంచి ఎలక్షన్ నిర్వహణ వరకు జనసేన స్వీయ తప్పిదాలు ఒకటీ రెండు కాదు ఇంతటి ప్రతికూల పరిస్థితులలోనూ ఆ పార్టీ పలు స్థానాల్లో గౌరవప్రదమైన ఓట్లను కైవసం చేసుకుంది. యలమంచిలిలో టిడిపి, విశాఖ సౌత్ జోన్ నియోజకవర్గంలో వైసీపీ ఓటమికి, విశాఖ ఉత్తరంలో మాజీ మంత్రి గంటా మెజార్టీ తగ్గటానికి జనసేనకు పోలైన ఓట్లే కారణం. ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టిన తొలిసారే జనసేన తరపున విశాఖ ఎంపిగా పోటి చేశారు మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీ నారాయణ. ఈ ఎన్నికలలో జనసేనా ఇరవై మూడు పాయింట్ మూడు సున్నా శాతం ఓట్లు దక్కించుకుంది. గాజువాక అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసిన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సెకండ్ ప్లేస్ కు పరిమితమయ్యారు. వ్యక్తిగత ప్రతిష్ట, పార్టీ ఇమేజ్, కమ్యునిటి ఫ్యాక్టర్, టిడిపిలో అంతర్గత రాజకీయాలు వంటి ఎన్నో ఎన్నెన్నో అంశాలు అనుకూలించినా విజయం సాధించలేకపోయారు. ఆ క్రమంలో ఎన్నికలు సమీపించే నాటికి పార్టీలు పరిస్థితులూ అంతుపట్టకుండా అయిపోగా ఇపుడు పరిస్థితి మరి గందరగోళంగా తయారైంది. అధినాయకుడితో జిల్లా నాయకులకు సంబంధాలు దాదాపు తెగిపోయాయి. సీనియర్లకు సైతం సముచిత స్థానం, భవిష్యత్ పై భరోసా లభించని పరిస్థితి. ఈ తరుణంలో రాజకీయ మనుగడ సాగించాలంటే ఏదో ఒక మార్గం వెతుక్కోక తప్పదు అనే అభిప్రాయం నాయకులలో వ్యక్తమవుతోంది. జనం ఆదరణ పొందినప్పటికీ పార్టీ కార్యాచరణ తమ భవిష్యత్ అర్థంకాకపో నాయకులు నలిగిపోతున్నారు. రాజకీయంగా సంధికాలం గడుపుతున్నవారు, తమ భవిష్యత్తును ఇతర పార్టీలో వెతుక్కునేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల తర్వాత వివి లక్ష్మీ నారాయణ సామాజిక సేవకు పరిమితమయ్యారు. జెడి ఫౌండేషన్ తో తన కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. పార్టీలోనే కొనసాగుతున్నప్పటికీ ఆ జెండా కింద ఎటువంటి యాక్టివిటీ చేయటంలేదు. అనకాపల్లి నుంచి పోటీ చేసి రచయితల పార్థసారథి బీజేపీలో చేరి పోయారు. కేంద్ర కార్యాలయ వ్యవహారాలలో కీలకమైన పార్థసారథి పార్టీకి రాజీనామా చేసి జిల్లా స్థాయిలో పార్టీని వీడిన తొలి నాయకుడయ్యారు. పార్థసారథి ఒక్కరే కాదు, సమీప భవిష్యత్తులో మరికొంతమంది జనసేనకు గుడ్ బై కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీతో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్న మాజీ మంత్రి బాలరాజుతో వైసిపి సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. అలాగే మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య డోలాయమానంలో ఉన్నట్టు కనిపిస్తున్నారు. వాస్తవానికి ప్రస్తుత పరిస్థితుల్లో వైసిపికి స్థానిక సంస్థల ఎన్నికల పెద్ద సవాల్. విశాఖ నగర పాలక సంస్థ జీవీఎంసీ ఎన్నికల్లో విజయం సాధించడం ప్రతిష్ఠాత్మకం ఈ నేపధ్యంలో సీనియర్ అవసరం కావాలి అంటున్నారు అధికార పార్టీకి చెందిన నేతలు. ఇప్పటికే టిడిపిని కాలిచేయడం పనిగా భారీగా వలసలు స్వాగతిస్తుంది వైసిపి. ఈ తరుణంలో జనసెనలో మిగిలిన నేతలతో ఎలా డీల్ చేస్తుందో చూడాలి ఇక.

సగటున ప్రతి ఆర్టీసీ కార్మికుడికి 50వేల జీతం... ఇంకా పెంచమని ఎలా అడుగుతారు?

  మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్ గఢ్, మణిపూర్ రాష్ట్రాల్లో అసలు ఆర్టీసీనే లేదని.... ఇక, బీహార్, ఒడిషా, జమ్మూకశ్మర్, పశ్చిమబెంగాల్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కేవలం నామమాత్రంగా బస్సులను నడుపుతున్నారని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. దేశంలోనే కర్నాటక తర్వాత అత్యధిక బస్సులను నడుపుతున్నది తెలంగాణ మాత్రమేనన్నారు. దాదాపు 11వేల బస్సుల్లో ప్రతిరోజూ సుమారు కోటి మంది ప్రయాణిస్తున్నారని, ఇంత మంచిగా ఆర్టీసీని చూసుకుంటుంటే, కార్మికులు ఇలా సమ్మెకు దిగడం సరికాదన్నారు. ఏటా 12వందల కోట్ల రూపాయలు నష్టం వస్తుంటే ఎప్పటికప్పుడు ఆదుకుంటూనే ఉన్నామని, పైగా హైదరాబాద్లో ఆర్టీసీ నష్టాలను ప్రభుత్వమే భరిస్తోందని, అంతేకాకుండా సగటున ఆర్టీసీ సిబ్బందికి నెలకు 50వేల రూపాయల జీతం అందుతుండగా, ఇంకా పెంచమని అడగడంలో అర్ధం లేదన్నారు కేసీఆర్. యూనియన్ల బ్లాక్ మెయిల్ రాజకీయాలకు ప్రభుత్వం తలవంచదన్న కేసీఆర్.... ఆర్టీసీని ఎట్టిపరిస్థితుల్లోనూ విలీనంచేసే ప్రసక్తే లేదన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్ పై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలన్న విపక్షాల ప్రతిపాదనను కేసీఆర్ తోసిపుచ్చారు. కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలకు అసలు ఆర్టీసీ విలీనంపై మాట్లాడే హక్కు లేదన్నారు. కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారా అంటూ ప్రశ్నించారు.

కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్‌లో అసలు ఏం జరుగుతోంది?

కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ పాలక వర్గం ఏర్పాటై రెండేళ్లు పైబడింది. కార్పొరేషన్ ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరింది. తరవాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి అధికారాన్ని కోల్పోయింది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కాకినాడ కార్పొరేషన్ లో మార్పులు చోటు చేసుకునే పరిస్థితి కనిపిస్తోంది. కాకినాడ కార్పొరేషన్ లో టీడీపీకి పూర్తి మెజార్టీ ఉన్నప్పటికీ వైసిపి ప్రభుత్వాన్ని కాదని ఎంత వరకూ పాలన సాగిస్తారు అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. కాకినాడ కార్పొరేషన్ లో పార్టీల బలాబలాలను చూస్తే రెండు వేల పదిహెడులో జరిగిన ఎన్నికల్లో టిడిపి మెజార్టీ దక్కించుకుంది. మొత్తం నలభై తొమ్మిది డివిజన్లలో అప్పటి మిత్రపక్షమైన బీజేపీ రెబల్ అభ్యర్థులతో కలిపి ముప్పై తొమ్మిది స్థానాలు కైవసం చేసుకొని ఘన విజయం సాధించింది. తర్వాత మిత్ర బంధం తెగి పోవడంతో బీజేపీకి చెందిన ఇద్దరు కార్పొరేటర్లు టీడీపీకి దూరమయ్యారు. దాంతో వారి సంఖ్య ముప్పై ఏడుకు పడిపోయింది. మేయర్ పదవి ఆశించి భంగపడిన తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ మాకినేడి శేషుకుమారి జనసేన తీర్థం తీసుకోవడంతో టీడీపీ కార్పొరేటర్ల సంఖ్య ముప్పై ఆరుకు చేరింది. ఇక కార్పొరేషన్ లో ప్రతి పక్ష వైసీపీ బలం పది మంది సభ్యులైతే అందులో ఇద్దరు సభ్యులు పార్టీ అధిష్టానంతో విభేదించి వేరు కుంపటి పెట్టుకున్నారు. దీంతో వైసీపీ కార్పొరేటర్ల సంఖ్య ఎనిమిదికి చేరుకుంది. అయితే ఇప్పుడు స్టేట్ లో వైసిపి పవర్ లోకొచ్చింది. దానిని ఉపయోగించుకొని వంద కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్ లో తనదైన సత్తా చాటుకోవాలని వైసిపి ఉబలాట పడుతున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే ఈ రూట్లో పావులు కదపటం మొదలు పెట్టింది. తూర్పుగోదావరి జిల్లాలోని అతిపెద్ద కార్పొరేషన్ గా ఉన్న కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ లో రాజకీయ యుద్దమే సాగుతోంది. కార్పొరేషన్ ఎన్నికల సమయంలో చక్రం తిప్పిన తెలుగుదేశం నేతలు తర్వాత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో సైలెంటైపోయారు. ఆ క్రమంలో మేయర్ స్థానం కైవసం చేసుకున్నప్పటికీ టిడిపి మనుగడ ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పదిహెడు మంది వరకూ తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు, లోపాయికారిగా వైసిపికి మద్దతు ప్రకటించారు. ఆ పరిస్థితికి కారణంగా కార్పొరేషన్ లో మెజార్టీ ఉన్నా పరిపాలనలో మైనార్టీగా ఉండాల్సిన పరిస్థితి టిడిపిది. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ లో ప్రతిష్ఠాత్మకమైన స్మార్ట్ సిటీ పనులు కూడా జరుగుతుండడంతో అభివృద్ధి పరంగా ఏ విధంగా ముందుకు సాగాలనే దానిపై పాలక వర్గం మల్లగుల్లాలు పడుతోంది. కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి రూరల్ ఎమ్మెల్యేగా కురసాల కన్నబాబు గెలిచిన తరువాత వారికి టీడీపీ కార్పొరేటర్ల మద్దతు పెరిగింది. కన్నబాబు మంత్రి కావడంతో కార్పొరేటర్లు కొంత మంది సన్నిహిత్యం లోకి వెళ్లారు. రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు టిడిపికి రాజీనామా చేసి వైసీపీలో చేరడంతో ఆయన వర్గీయులైన కార్పొరేటర్లు కూడా టీడీపీతో టచ్ మి నాట్ అన్నట్లుగా ఉంటున్నారు. మొత్తమీద టిడిపిలో ప్రస్తుతమున్న ముప్పై ఆరు మంది కార్పొరేటర్లలో సగానికి పైగా కార్పొరేటర్లు రాజీనామా చేసి వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే ఇందుకు ముఖ్యమంత్రి జగన్ నిరాకరించినట్లు తెలిసింది. వైసీపీలోకి వస్తే కార్పొరేటర్ పదవులకు రాజీనామా చేసి రావాలని ఆంక్షలు పెట్టినట్టు సమాచారం. దాంతో పదవులు వదులుకోవడానికి ఇష్టపడని టిడిపి కార్పొరేటర్లు కండువా మార్చకూండానే కార్పొరేషన్ లో వైసీపీ సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. మొత్తం మీద కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ లో టీడీపీ పరిస్థితి అర్థం కాకుండా తయారైందంటున్నారు.

ఆస్తులు కాపాడుకోడం కోసం బీజేపీలో చేరబోతున్నారా?

మొన్నటి వరకు సంచలనం సృష్టించిన విషయం కరకట్ట నిర్మాణాల తొలగింపు చర్యలు .కృష్ణా కరకట్ట నిర్మాణాల తొలగింపు విషయంలో ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో కొత్త చర్చ జరుగుతోంది. కరకట్ట మీద చంద్రబాబు నివాసముంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ సహా వివిధ నిర్మాణాలకు గెస్ట్ హౌస్ లకు సీఆర్డీయే నోటీసులిచ్చింది. అక్రమంగా నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేశారని, వాటిని స్వచ్ఛంధంగా తొలగించాలని లేకుంటే తామే కూల్చివేతకు దిగాల్సి వస్తుందంటూ హెచ్చరికలు జారీ చేసింది. ఆ మేరకు డెడ్ లైన్ లతో గోడలకు నోటిస్ లను అంటించి హడావుడి చేసింది. ఓ నిర్మాణంలో నది లోపలికి చొచ్చుకుని వెళ్లి నిర్మించిన ర్యాంపును కూడా సీఆర్డీయే అధికారులు తొలగించారు. దాంతో చంద్రబాబు నివాసముంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ సహా మిగిలిన అక్రమ నిర్మాణాలను కూడా తొలగించేస్తారనే చర్చ జోరుగా సాగింది. ప్రభుత్వం సీఆర్డీఏ అధికారులు కూడా అదే ఊపులో ఉన్నట్టు కనిపించారు. అయితే తనను వేధిస్తున్నారని తన గెస్ట్ హౌస్ నిర్మాణం అంతా పద్ధతి గానే జరిగిందని అన్ని నిబంధనలు ఉన్నాయంటు లింగమనేని రమేష్ కోర్టుకెక్కారు. ఇది కొన్ని రోజుల క్రితం జరిగిన పరిణామం అయితే రెండు రోజుల క్రితం చోటుచేసుకున్న పరిస్థితులను  ఏపీలో కరకట్ట కట్టడాల విషయమై ఆసక్తికర చర్చ జరుగుతోంది. రెండు రోజుల క్రితం బీజేపీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన కొందరు నేతలు చేరారు. వీరిలో చెప్పుకోదగ్గ ముఖ్యులు ఉన్న వారి సంఖ్య తక్కువే అయినా ఇటీవల కాలంలో బీజేపీలో చేరిన వారి మీద శ్రద్ధ కొద్దిగా ఎక్కువ గానే వచ్చిందని చెప్పాలి. దానికి కారణం లేకపోలేదు. తెలంగాణ టిడిపి సీనియర్ నేత దేవేందర్ గౌడ్ తనయుడు వీరేందర్ గౌడ్ తెలుగుదేశాన్ని వీడి బీజేపీలో చేరారు. అలాగే ఏపీ నుంచి శనక్కాయల అరుణ కూడా పార్టీలో చేరారు. శనక్కాయల అరుణ కొంతకాలంగా టిడిపిలో యాక్టివ్ గా లేకున్నా సెడన్ గా బీజేపీలో చేరి మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చే ప్రయత్నం చేశారు. వారితో పాటే ఇంకొంతమంది కూడా చేరి పోయారు. సందట్లో సడేమియా అన్నట్టుగా కరకట్టు మీదున్న నివాసాలకు చెందిన ఇద్దరు పెద్దలు బీజేపీలో చేరి పోయారు. పాతూరి నాగభూషణం అలాగే ఎస్ఆర్ఐ రామినేని బీజేపీ తీర్థం పుచ్చుకున్న బరిలో ఉన్నారు. ఇపుడిదే ఏపీ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది. కరకట్ట విఐపిలకు బిజెపి షెల్టర్ జోన్ గా మారినా, తమ నిర్మాణాలు కాపాడుకునేందుకు కర్కట్ట విఐపిలూ బిజెపిని ఆశ్రయిస్తున్నారు అనే చర్చ జరుగుతోంది. కరకట్టపై ఉన్న నివాసాలులో మాజీ ఎంపి బిజెపి సీనియర్ నేత గోకరాజు గంగరాజు గెస్ట్ హౌస్ ఉంది. ప్రస్తుతం ఈ భవన నిర్మాణం కూడా అక్రమమేనని సీఆర్డీయే బాధిస్తోంది. దీనికి సంబంధించిన చర్చ ఓవైౖపు జరుగుతూనే ఉండగా మరో ఇద్దరు కరకట్ట విఐపిలూ బీజేపీ పంచన చేరడం హాట్ టాపిగ్గా మారింది. దీంతో సదరు కరకట్ట పెద్దలు తమ తమ నిర్మాణాలను కాపాడుకునేందుకే బీజేపీలో చేరారు అనేది పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్. మొన్నటి వరకూ కరకట్టపై సింగిల్ స్థానానికి పరిమితమైన బిజెపి వీఐపీల సంఖ్య ఇప్పుడు మూడుకు చేరడం పై ఏపీ రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతోంది. ఆ క్రమంలో వీరి నిర్మాణాల విషయంలో కానీ, మిగిలిన కరకట్ట నిర్మాణాల విషయంలో కానీ సర్కార్ వైఖరి ఏ విధంగా ఉండబోతోందనేది ఆసక్తిగా మారింది. కరకట్ట నిర్మాణ విషయంలో మొన్నటి వరకు చూపిన దూకుడు ఇక పై కూడా చూపుతారా లేక ఎందుకొచ్చిన గొడవ అనుకుంటూ సైలెంట్ అయిపోతారా అనేది ఆసక్తిగా మారింది. బీజేపీ విధానాల పట్ల ఆకర్షితులై పార్టీలో చేరడం లేదు. కనీసం రాజకీయ పరమైన అవసరాల వల్ల కూడా కాకుండా ఇలా తమ ఆస్తులను కాపాడుకోవడానికి కమలం బాట పట్టడం చూసి ఆ సొంత పార్టీ నేతలకు ఎనలేని కోపంతో మండిపడుతున్నారు.

సైకిలెక్కుతుందా? కారులో సవారీ చేస్తుందా? హుజూర్ లో సీపీఎం దారెటు?

  హుజూర్‌నగర్‌ ఉప పోరులో గెలుపు కోసం ప్రధాన పార్టీలన్నీ నానా తంటాలు పడుతున్నాయి. ఏలాగైనా విజయం సాధించాలని సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. కులాల వారీగా నేతలను రంగంలోకి దించి ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే, అధికార టీఆర్‌ఎస్‌, ప్రతిపక్ష కాంగ్రెస్‌ మధ్యే పోటీ నెలకొనగా... బీజేపీ, టీడీపీ‌ కూడా గెలుపు కోసం తమ శక్తి మేర ప్రయత్నిస్తున్నాయి. ఇదిలాఉంటే, హుజూర్‌నగర్‌ ఉప పోరులో ప్రధాన పార్టీలకు ప్రజాసంఘాలు, ఆయా పార్టీల మద్దతు కీలకంగా మారింది. దాంతో, ఆయా పార్టీలు, వివిధ సంఘాల మద్దతు కోసం ప్రధాన పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే, అధికార టీఆర్‌ఎస్‌కు సీపీఐ మద్దతుగా ప్రకటించగా, కాంగ్రెస్ పార్టీ.... జనసేన సపోర్ట్‌ కోరింది. అయితే, సీపీఎం అభ్యర్ధి నామినేషన్‌... స్ర్కూటినీలో తిరస్కరణకు గురవడంతో... సీపీఎం సైతం టీఆర్‌ఎస్‌‌కు మద్దతిస్తుందనే ప్రచారం జరిగింది. టీఆర్‌ఎస్‌ నేతలు సైతం ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేశారు. అయితే సీపీఎం ఇప్పటివరకు ఎటూతేల్చకపోవడంతో, తెలుగుదేశం పార్టీ రంగంలోకి దిగింది. హుజూర్‌ నగర్‌ బరిలో తమ మద్దతివ్వాలంటూ సీపీఎంను టీడీపీ కోరింది. తెలంగాణ సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను సంప్రదించిన టీటీడీపీ అధ్యక్షుడు రమణ.... తెలుగుదేశానికి మద్దతివ్వాలని కోరారు.  అయితే, ఆరేళ్లుగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ నిర్ణయాలను ఎండగడుగూ పోరాటాలు చేసిన సీపీఐ... చివరికి అదే అధికార పార్టీకి మద్దతు ప్రకటించి అభాసుపాలైందన్న విమర్శలు రావడంతో... ఆచితూచి అడుగేయాలని సీపీఎం భావిస్తోంది. మరోవైపు సీపీఎం నామినేషన్ తిరస్కరణపై న్యాయపోరాటం చేస్తోంది. అయితే, హుజూర్ నగర్ లో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ నెలకొందని, మరే పార్టీకి మద్దతిచ్చినా ఉపయోగం లేదని సీపీఎం అంచనాకి వచ్చింది. దాంతో కాంగ్రెస్ కు చేయి అందించడమో... లే కారులో సవారీ చేయడమో ఏదో ఒకటి జరగొచ్చని అంటున్నారు. ఈ రెండూ కాకపోతే, మద్దతు కోరిన టీడీపీ వైపు ఉండటం.... లేకపోతే ఏ ఇబ్బందీ లేకుండా తటస్థంగా ఉంటుందో చూడాలి.

ప్రయాణికులకే కాదు కూరగాయల ధరల పై కూడా ఆర్టీసీ సమ్మే సెగ...

అసలే వర్షాలతో తీవ్ర ఇబ్బందుల పడుతున్న రైతులకు ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెతో మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామాల నుంచి పట్టణాలకు రానుపోను ఛార్జీలు లెక్కలు వేసి కూరగాయల ధరలను అమ్మే పరిస్థితి ఉందంటూ వాపోయారు రైతులు. ప్రైవేట్ వాహనాల పెంచిన ఛార్జీలతో తీవ్ర ఇక్కట్లు పడుతున్నట్టు తెలిపారు. ఆర్టీసీ చేస్తున్న సమ్మె కారణంగా కూరగాయలపై ప్రభావం కనిపిస్తోంది. అనేక మంది సుదూర ప్రాంతాల నుంచి రైతులు తాము పండించిన కూరగాయలను మార్కెట్ కు తీసుకు వచ్చి ఇక్కడ అమ్ముతూంటారు. ఉదయం ఐదు గంటలకే వాళ్లు ఇళ్లలో నుంచి బయలుదేరి మార్కెట్ కి ఏడు గంటల వరకు చేరుకొని అక్కడ సాయంత్రం వరకు కూడా పండించిన కూరగాయలను అమ్ముకుంటున్న పరిస్థితి ఉంది. కానీ ఈ రోజు ఉదయం ఆరు గంటలకు బస్టాండ్ కి వస్తే ఎక్కడ కూడా ఒక్క బస్సు లేదు, బయటికి కదలని పరిస్థితుల నేపథ్యంలో మేం ప్రైవేట్ ఏజెన్సీని అలాగే ఆటోలని మేము తీసుకొని రావాల్సి వచ్చింది. దాదాపు ఇరవై నుంచి ముప్పై రూపాయల టిక్కెట్ ఆర్టీసీ బస్సుకు పెట్టుకుంటే దాదాపు యాభై నుంచి వంద రూపాయల వరకు మేము ఆటోకి పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని తమ బాధను వ్యక్తం చేస్తున్నారు కూరగాయదారులు . ఇలాగే వాళ్ళు వాళ్ళ నిరసనని సమ్మెను కొనసాగిస్తే దాదాపు కూరగాయల రేట్లపై కూడా ఖచ్చితంగా ప్రభావం పడే అవకాశం ఉంటుందని వెల్లడించారు.ఇంకా ఎక్కువగా రేట్లు పెరిగే అవకాశం ఉంటుందన్న అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు.  మొదటి రోజు ఆర్టీసీ చేస్తున్న సమ్మె కారణంగా ఆటోలు ఒక్కరోజూ రెండ్రోజులు ఉపయోగిస్తారు కానీ ఎక్కువగా పది పదిహేను రోజుల వరకూ ఇది కొనసాగితే మాత్రం ఖచ్చితంగా కూరగాయల రేట్లు పెంచాల్సిన అవసరమైతే వస్తుంది అని చెప్పి రైతులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.  ప్రస్తుతం మెహిదీపట్నం మార్కెట్ దగ్గర ఉన్న పరిస్థితి, ఇక్కడ రంగారెడ్డి జిల్లా అలాగే మేడ్చల్ నుంచి అనేక మంది రైతులు తాము పండించిన కూరగాయాల్ని తీసుకువస్తూ ఉంటారు. ఇక్కడ ఉదయం నుంచి రాత్రి వరకు తాము  పండించిన కూరగాయలను అమ్ముతూ ఉంటాము. కానీ రాను రాను ఇదే పరిస్థితి కనుక కొనసాగితే మాత్రం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని వాపోతున్నారు.

ఆ ఊళ్ళు ఏమైపోయాయి... అసలు ఏం జరుగుతోంది...

ఎన్నొ కనిపించకుండా పోతుంటాయి కానీ అక్కడ మాత్రం ఏకంగా గ్రామాలే మాయమైతున్నాయి.వివారాళ్లోకి వెళ్తే  కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని సర్దార్ పురం, గోనెగండ్ల గ్రామంలోని బాపురావు, పత్తికొండ మండలంలోని దేవమ్మకుంట, రుద్రవరం మండలంలోని లాలాపేట ఈ నాలుగు గ్రామాలు చరిత్ర పుటల్లోంచి తుడిచిపెట్టుకు పోయాయి. రెవెన్యూ రికార్డుల్లో మాత్రమే గ్రామాలుగా ఉన్నాయి. ఆ గ్రామాల్లో అడుగుపెడితే కూలిపోయిన ఇళ్లతో నిర్మానుష్యంగా ఉంటోంది. ప్లేగు వ్యాధి అని కొందరు, మూఢ నమ్మకాలతో ఇంకొందరు ఇలా పలు కారణాలతో ప్రజలందరూ గ్రామన్ని విడిచి వెళ్లారు. ఎమ్మిగనూరు రెవెన్యూ రికార్డుల ప్రకారం ముప్పై మూడు గ్రామాలుండగా ముప్పై రెండు గ్రామాలూ కంటికి కనిపిస్తే కనిపించని గ్రామమే సర్దార్ పూర్వం. ఈ గ్రామం శ్రీకృష్ణ దేవరాయుల కాలం నాటిదని ఇక్కడి వారు చెప్తారు. ఈ గ్రామ పరిధిలో పొడవైన కోట బురుజు దాదాపు విశాలమైన రెండు వందల ఇళ్లు ఉండేవి. గ్రామం చుట్టూ నీళ్లు పుష్కలంగా ఉండటంతో కనుచూపు మేరలో పచ్చని పొలాలు కనిపించేవి. ఇలా వివిధ రకాల పచ్చని పంటలు, ఆహ్లాదకరమైన వాతావరణం, నిత్యం జనంతో ఊర్లోనే గుడిసెలు నిండి ఉండేవి. సర్దార్ పురం గ్రామ ప్రజలు పూర్తిగా వ్యవసాయంపైనే ఆధారపడి జీవించినప్పటికీ ఆర్థికంగా ఐక్యమత్యంగా ఉండేవారు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో పాడి పంటలతో అలరారుతూ ఎటువంటి కష్టాలను చవిచూడని గ్రామంగా సర్దార్ పురం అప్పట్లో ప్రత్యేకంగా నిలిచింది. సిరిసంపదల నిలయంగా ఉన్న సర్దార్ పురాన్ని రోగాలు చుట్టుముట్టాయి. కొంతకాలం పాటు ప్లేగు వ్యాధి తిష్టవేసింది, ప్లేగు వ్యాధి దెబ్బకు ఊరి జనం చాలా కాలం పాటు విలవిల్లాడారు. కొంత మంది చనిపోగా, మరి కొంత మంది రోగం బారిన పడ్డారు. దీంతో అప్పటి నుంచి సర్దార్ పురం గ్రామ ప్రజలను కష్టాలు వెంటబడ్డాయి. గ్రామ సమీపంలోని వెంకటాపురంలో వెలిసిన గుంటి రంగస్వామి సన్నిధిలో ఎలాంటి రోగాలు సోకవనే నమ్మకంతో అక్కడకు వచ్చి స్థిరపడ్డారు. మరికొంతమంది సర్ధార్ పురంకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న హనుమాపురం గ్రామానికి వెళ్లారు. ప్లేగు వ్యాధి భయంతో సర్ధార్ పురం గ్రామవాసులు ఊరు వదిలిన, ఊరికి సంబంధించిన ఆనవాళ్లు కనుమరుగైన, సర్దార్ పురం గ్రామం పేరు మాత్రం ఎమ్మిగనూరు మండల రెవెన్యూ రికార్డుల్లో నేటికి పదిలంగా ఉండటం విశేషం. రెండు వందల ఏళ్ల క్రితం సర్దార్ పురం గ్రామస్థులు ఊరు విడిచిన, వారి వంశస్థులు ఊరు చుట్టు పక్కల ఉండే పొలాలను నేటికి సాగుచేసుకుంటున్నారు. పండగలు శుభకార్యాలకు సరదాపురంలోని ఆంజనేయ స్వామి ఆలయానికి వచ్చి ఆనవాయితీగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు అక్కడి ప్రజలు.

ఆర్టీసీని ప్రైవేటుపరం చేసేస్తారా? కేసీఆర్ తన వాళ్లకు కట్టబెడతారా?

  కేసీఆర్ ప్రభుత్వ తీరుపై ఆర్టీసీ కార్మికులు, ట్రేడ్ యూనియన్ నాయకులు, విపక్షాలు మండిపడుతున్నాయి. ఆర్టీసీ ఆస్తులను ప్రభుత్వం దోచుకోవాలని ప్రయత్నిస్తోందని కార్మిక సంఘాల జేఏసీ ఆరోపించింది. కార్మికుల డిమాండ్లపై చిన్నచూపు చూస్తూ ప్రభుత్వం కావాలనే... ఆర్టీసీని సమ్మెలోకి నెట్టిందని అఖిలపక్ష నేతలు మండిపడ్డారు. ఆర్టీసీని ప్రైవేటుపరం చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో సమావేశమైన ఆర్టీసీ కార్మిక సంఘాలు, అఖిలపక్ష నేతలు.... కేసీఆర్ ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబట్టాయి. ఆర్టీసీని మూసివేసేందుకు సర్కారు కుట్ర చేస్తోందంటూ ఆరోపించారు.  ఇక, ఆర్టీసీ కార్మిక సంఘాల సమ్మెకు అన్ని విపక్షాల నుంచి మద్దతు లభించింది. ఆర్టీసీని ప్రైవేటుపరంచేసి తనకు కావాల్సిన వాళ్లకు అప్పగించేందుకు చూస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. ఆర్టీసీ కార్మిక సంఘాలకు కాంగ్రెస్ అండగా ఉంటుందన్న భట్టివిక్రమార్క... వాళ్ల న్యాయమైన డిమాండ్లను తీర్చాల్సిందేనన్నారు. మరోవైపు, సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాసిన రేవంత్ రెడ్డి... తమ ఉద్యోగాలను ఫణంగా పెట్టి నాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఆర్టీసీ కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత కేసీఆర్ ప్రభుత్వంపై ఉందన్నారు. తక్షణమే ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని, అంతేకానీ బెదిరింపులకు దిగడం సరికాదని అన్నారు.

కేసీఆర్ వస్తేనే ఎంతోకొంత ఛాన్స్... టీఆర్ఎస్ లీడర్లలో హుజూర్ టెన్షన్

  హుజూర్‌‌నగర్‌ ఉపఎన్నిక టీఆర్‌ఎస్‌లో గుబులురేపుతోంది. పార్టీ నివేదికలు, సర్వేల్లో టీఆర్‌ఎస్‌ పరిస్థితి ఏమాత్రం ఆశాజనంగా లేదని తేలడంతో అధిష్టానం ఆందోళనకు గురవుతోంది. హుజూర్‌నగర్‌లో ఎలాగైనా గులాబీ జెండా పాతాలన్న కృతనిశ్చయమంతో ముందుకెళ్తోన్న టీఆర్‌ఎస్‌కు స్థానిక సమీకరణాలు, పరిస్థితులు అంత అనుకూలంగా లేవనే మాట వినిపిస్తోంది. హుజూర్‌నగర్‌లో పార్టీ పరిస్థితిపై ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌... పార్టీ పరిస్థితి, లీడర్ల పనితీరుపై ఏమాత్రం సంతోషంగా లేరట. దాదాపు పది రోజులుగా టీఆర్‌ఎస్‌ ఇన్‌ఛార్జులంతా హుజూర్‌నగర్‌లో మకాంవేసి, మండలాల వారీగా ప్రచారం నిర్వహిస్తూ, పార్టీ పరిస్థితిపై ఎప్పటికప్పుడు హైకమాండ్‌కు రిపోర్టులు పంపిస్తున్నారు. అయితే, పార్టీ నేతలు నివేదికలు పంపిస్తున్నా, కేసీఆర్ మాత్రం ప్రైవేట్‌ సర్వేలు చేయించుకుంటూ, రోజువారీ రిపోర్టుల ఆధారంగా టీఆర్ఎస్‌ బలాన్ని అంచనా చేస్తున్నారు. అయితే, సర్వే రిపోర్టులు గులాబీ బాస్‌ను కలవరం పెట్టిస్తున్నాయట. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా టీఆర్‌ఎస్‌కు మైనస్‌గా ఉన్నట్లు తేలిందట. తాను తెప్పించుకున్న గ్రౌండ్ రిపోర్ట్ ఆధారంగా పార్టీ శ్రేణులకు గైడెన్స్ ఇస్తోన్న కేసీఆర్... క్షేత్రస్థాయిలో మరింత ఫోకస్ పెట్టాలని చెప్పారట ముఖ్యంగా టీఆర్‌ఎస్‌ అభ్య,ర్ధి సైదిరెడ్డిపై సొంత పార్టీ నేతల్లోనే వ్యతిరేకత ఉండటం హైకమాండ్‌కి తలనొప్పిగా మారిందంటున్నారు. కేసీఆర్‌తో రెండు మూడు సభలు నిర్వహిస్తేనే పరిస్థితి ఏమైనా మారొచ్చని, లేదంటే గడ్డు పరిస్థితేనని హుజూర్‌‌నగర్‌ టీఆర్‌ఎస్ లీడర్లు అంటున్నారు.

ఆరునూరైనా ఆర్టీసీ విలీనం జరగదు... యుద్ధప్రాతిపదికన కొత్త నియామకాలు

  ఆరునూరైనాసరే ఆర్టీసీని మాత్రం ప్రభుత్వంలో విలీనంచేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఆర్టీసీ సమ్మెపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన కేసీఆర్... ఆర్టీసీ చరిత్రలో ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నట్టు చెప్పారు. ఆర్టీసీని లాభాల్లోకి రావాలన్నా, సంస్థ మనుగడ కొనసాగాలన్నా, కొన్ని కఠిన చర్యలు తప్పవని అన్నారు. రెండు మూడేళ్లలోనే సంస్థ నష్టాలను ఊడ్చుకుని ఆర్టీసీ లాభాల్లోకి వస్తుందన్నారు‌. ఇక, ప్రభుత్వం విధించిన గడువులోగా విధుల్లోకి చేరని వారిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకునే ప్రసక్తే లేదని కేసీఆర్ స్పష్టంచేశారు. ఇక ఆర్టీసీలో మిగిలింది కేవలం 1200మంది లోపే సిబ్బంది అన్నారు. ఏటా 12వందల కోట్ల నష్టం... 5వేల కోట్ల రుణభారంతో... ఆర్టీసీ నడుస్తుంటే, పండుగల సీజన్లో సమ్మెకు దిగడం చట్టవిరుద్ధమని కేసీఆర్ అన్నారు. ఆర్టీసీ కార్మికులు చేసింది తీవ్రమైన తప్పిదమన్న కేసీఆర్‌.... రాజీ సమస్యే లేదని అన్నారు. ఇక వారితో ఎలాంటి చర్చలు జరిపేది లేదని ముఖ్యమంత్రి తేల్చిచెప్పారు. ఇక, భవిష్యత్ లో ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా... క్రమశిక్షణా రాహిత్యం, బ్లాక్ మెయిల్ విధానం, తలనొప్పి కలిగించే చర్యల్లేని విధానం తీసుకొస్తుందని కేసీఆర్ చెప్పుకొచ్చారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా శాశ్వత ప్రత్యామ్నాయ రవాణా విధానానికి రూపకల్పన చేయాలని కేసీఆర్‌ సూచించారు. తక్షణ చర్యగా 2వేల 500 బస్సులను అద్దె పద్ధతిలో తీసుకుని నడపాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే 4వేల బస్సులను స్టేజ్ క్యారియర్లగా నడపాలని సూచించారు. మొత్తం 15 రోజుల్లో ఆర్టీసీని పూర్వస్థితికి తీసుకురావాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. మరోవైపు, యుద్ధప్రాతిపదికన కొత్త సిబ్బంది నియామకం చేపట్టాలని కేసీఆర్ ఆదేశించారు. కొత్తగా చేర్చుకునే సిబ్బంది ....యూనియన్లలో చేరమని ఒప్పంద పత్రం మీద సంతకం చేయించుకోవాలని కేసీఆర్ సూచించారు. కొత్త సిబ్బందిది షరతులతో కూడిన నియామకం అవుతుందని, అలాగే ప్రొబేషన్ పీరియడ్ ఉంటుందని ముఖ్యమంత్రి అన్నారు.  

ఆర్టీసీ యూనియన్లకు ఆఖరి వార్నింగ్ ఇస్తున్న టీఎస్ ప్రభుత్వం

సాయంత్రం ఆరు గంటలకు ఏమి జరగబోతోంది అని అందరిలో టెన్షన్ నెలకొంది.యూనియన్ల ఉచ్చులో పడి ఉద్యోగా లు పోగొట్టుకోవద్దని ఆర్టీసీ కార్మికులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హెచ్చరించారు. చట్టబద్ధం కాని సమ్మెకు కార్మిక యూనియన్లు వెళుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం సాయంత్రం ఆరు గంటల్లోగా విధుల్లో చేరకపోతే సదరు కార్మికులు తమకు తాముగా విధుల్లోంచి తొలగినట్టుగా భావిస్తామని స్పష్టం చేశారు. అసంబద్ధమైన ప్రవర్తన తో కార్మికు లకు నాయకులూ అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ నిర్వహించిన సమీక్ష అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. మన ఆర్టీసీ కార్మికు లకు దేశంలోనే అత్యధిక వేతనాలు ఉన్నాయన్నారు. నాలుగు వేల ఉద్యోగు లను క్రమబద్దీకరించామన్నారు ఆర్టీసీ విలీనంపై టీఆర్ఎస్ ఎలాంటి హామీ ఇవ్వలేదని స్పష్టం చేశారు. లాభాలొచ్చే పండుగ రోజుల్లో సమ్మె కు దిగడం ఏమిటని ప్రశ్నించారు. యూనియన్ లతో ఇక పై చర్చలు జరిపేది లేదన్నారు. మూడు రోజులుగా ఆర్టీసీ కార్మి కుల డిమాండ్ల పై ఐఏఎస్ తో త్రిసభ్య కమిటీ చర్చించి ఆ సారాంశాన్ని సీఎంకు వివరించిందన్నారు సమ్మెపై నిషేధం కొనసాగుతున్న సమయంలో. సమ్మె కు వెళ్లడం ఎంత వరకు సమంజసమని ప్రశ్ నించారు. భవిష్యత్ లో ఎలాంటి సంఘటనలు జరిగినా కార్మిక సంఘాల నాయకులే బాధ్యత వహించాలని హెచ్చరించారు అంతకుముందు ఆర్టీసీ సమ్మె అనివార్యమైతే తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ జిల్లాల కలెక్టర్ లను మంత్రి పువ్వాడ అంజి ఆదేశించారు. ఆర్టీసీ సమ్మె ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై కలెక్టర్ లతో మంత్రి వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు ప్రైవేటు బస్సు లను స్కూల్ కళాశాల బస్సు లను నడిపిం చేలా ఏర్పాట్లు చేసుకోవా లని సూచించారు. ప్రైవేటు బస్సులను ఆర్టీసీ కార్మికులు అడ్డు కుంటే వారి పై కేసు లు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవా లని ఆదేశించారు. ఇదిలా ఉండగా ఆర్టీసీ సమ్మె నేపథ్యం లో నగరంలో ప్రయాణి కుల సౌకర్యార్ధం ప్రతి మూడు నిమిషా లకు ఒక రైలు నడిచేలా చర్యలు తీసుకోనున్నట్టు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మెట్రో రైలు ఉదయం ఐదు గంటలకు బయలుదేరతాయని చివరి రైలు రాత్రి పదకొండున్నర గంటలకు బయలుదేరి పన్నెండున్నర గంటలకు ఇతర టెర్మినల్ స్టేషన్ లకు చేరేలా ప్రణాళిక రూపొందించినట్టు చెప్పారు. రద్దీని తట్టుకోవడానికి వీలుగా అదనపు టిక్కెట్ కౌంటర్ లు యంత్రాలూ సిబ్బందిని ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు.ఇప్పటికే ఆర్టీసీ వేల మంది డ్రైవర్లను నియమించుకోగా రెండు వేల మంది కండక్టర్లను కూడా ప్రభుత్వం నియమించారు. రేపటి నుండి  యధావిధిగా బస్సులను రోడ్లపైకి తీసుకురావడానికి వీలైనంత ప్రయత్నం చేస్తున్నట్లు టీఎస్ ప్రభుత్వం వెల్లడించారు.ప్రయాణికులను ధైర్యంగా ఉండాలని వారు తమ సొంత  ప్రాంతాలకు సురక్షితంగా వెళ్ళేందుకు అధనపు పోలీసులను నియమించినట్లు తెలియజేశారు.

ఎమ్మెల్యే కోటంరెడ్డిపై కేసు నమోదు... ఘటన వెనక మరో ఎమ్మెల్యే హస్తం!!

  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డితో పాటు ఆయన అనుచరుడు శ్రీకాంత్‌రెడ్డిపై నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. లేఅవుట్‌కు అనుమతి ఇవ్వలేదన్న కారణంతో కోటంరెడ్డి దౌర్జన్యం చేశారని నెల్లూరు జిల్లా వెంకటాచలం ఎంపీడీవో సరళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కల్లూరిపల్లిలో ఉన్న తన ఇంటికి వచ్చి దౌర్జన్యం చేశారని, వాటర్‌, కేబుల్‌ కనెక్షన్‌ తొలగించి బెదిరించారని కోటంరెడ్డిపై సరళ ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై ఇలాంటి ఆరోపణలు కొత్తేమీ కాదు. కొద్ది రోజల కిందట.. జమీన్ రైతు అనే పత్రిక ఎడిటర్ ఇంటిపై దాడి చేశారు. అంతకు ముందు.. మరో జర్నలిస్టును.. అడ్డంగా నరికేస్తా.. దిక్కున్నచోట చెప్పుకో అని హెచ్చరిస్తున్న ఆడియోలు బయటకు వచ్చాయి. తాజాగా ఓ రియల్ ఎస్టేట్ వెంచర్‌కు అనుమతి ఇవ్వడం ఆలస్యం అయిందన్న కారణంగా.. తన ఇంటికి వచ్చి దౌర్జన్యం చేశారని కోటంరెడ్డిపై సరళ ఫిర్యాదు చేశారు. కాగా ఈ ఘటనపై కోటంరెడ్డి స్పందించారు. ఇంటికెళ్లి దౌర్జన్యం చేసామన్న ఆరోపణలు అబద్ధమని కొట్టిపారేశారు. ‘ నెల్లూరు జిల్లాలో ‘నుడా’, ‘రేరా’.. రెండు సంస్థల అనుమతులు ఉన్న ఏకైక లే-అవుట్  అది ఒక్కటే. అది సర్వేపల్లి నియోజకవర్గంలో ఉంది. దానికి అధికారిక అనుమతులు ఇచ్చి కూడా చాలా కాలం అయింది. మూడు నెలలుగా వాటర్ కనెక్షన్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుంటే నేను ఎంపీడీవో సరళ గారికి ఫోన్ చేసిన మాట వాస్తవమే’ అని అన్నారు. వాటర్ కనెక్షన్ ఇవ్వొచ్చుగా అని తాను అడిగితే, ‘మా ఎమ్మెల్యేగారు ఇవ్వొద్దంటున్నారు సార్’ అని ఆమె బదులివ్వడంతో.. ‘మీ ఎమ్మెల్యే గారితో నేను మాట్లాడతాను’ అని చెప్పి ఫోన్ పెట్టేశానని అన్నారు.  ‘వాళ్ల ఎమ్మెల్యేకు కూడా ఫోన్ చేశాను. వాళ్ల ఎమ్మెల్యే అంటే కాకాణి గోవర్థన్ రెడ్డి. ఎవరో కాదు స్వయానా నాకు బావే.’ అని తెలిపారు. ‘మన జీవీఆర్ కృష్ణారెడ్డి, శ్రీకాంత్ రెడ్డిల సొంత లే-అవుట్, అన్ని అనుమతులు ఉన్న లే-అవుట్. 3 నెలల నుంచి వాటర్ కనెక్షన్ ఇవ్వకుండా ఎంపీడీవో ఇబ్బంది పెడుతోంది. అదేమంటే, ‘నీ మీద చెబుతోంది’’ అని చెప్పాను. ‘దాంట్లో వేరే ఉందిలే, నీతో మెల్లిగా మాట్లాడతానులే’ అని అన్నాడు. అంత వరకే జరిగింది’ అని కోటంరెడ్డి చెప్పుకొచ్చారు. ఎంపీడీవో ఇంటికి కరెంట్, నీటి సరఫరా లేకుండా కట్ చేశారన్న ఆరోపణలపై కోటంరెడ్డి స్పందిస్తూ.. కరెంట్, నీటి సరఫరాను ఎమ్మెల్యే కట్ చేస్తారా? ఎవరైనా ఆ పనులు చేస్తారా? అని ప్రశ్నించారు. ఎంపీడీవో ఇంటికి తాను వెళ్లి దౌర్జన్యం చేసినట్టు వస్తున్న ఆరోపణలపై బహిరంగ చర్చ పెడదామని అందుకు సిద్ధమేనా? అని కోటంరెడ్డి సవాల్ చేసారు.

ఆర్టీసీ డ్రైవర్ పై చెప్పులతో దాడి చేసిన కండక్టర్...

  ఆర్టీసీ చర్చలు విఫలం కావడంతోటి ఆర్టీసీ సమ్మే మరింత ఉధృక్తం చేయనుంది తెలంగాణ ఆర్టీసీ జేఏసీ. ఎక్కడి బస్సులను అక్కడే నిలిపిసేందుకు చర్యలు చేపట్టేందుకు నిర్ణయాలు తీసుకున్నారు ఆర్టీసీ జేఏసీ. దసరా సెలవుల కారణంగా ఊళ్ళుకు వెళ్ళాలనుకున్న ప్రజలు ఎప్పటినుంచో రిజర్వేషన్లు చేయించుకుని ఎంతో ఆనందంగా సెలవులు గడపాలని కోరుకున్నారు. కానీ ఈ వార్త విన్న దెగ్గర నుండి ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అందుకే ప్రభుత్వం దీనికి ప్రత్యామ్నాయ చర్యల దిశగా అడుగులు వేస్తున్న క్రమంలో ఇప్పటికే డ్రైవింగ్ లైసెన్సు హెవీ లైసెన్స్ కలిగినటువంటి వాళ్లు పధ్ధెనిమిది నెలల అనుభవం ఉన్నటువంటి వాళ్లు వచ్చి డిపో మేనేజర్ కలవాలని పిలుపును ఇవ్వడం జరిగింది. కండెక్టర్ లుగా కావల్సినటువంటి వాళ్లు టెన్త్ మెమో తోటి, ఆధార్ కార్డు తోటి హాజరు కావాలని కూడా ప్రభుత్వం తెలియజేసింది. కానీ ఆర్టీసీ కార్మిక నేతలు మాత్రం సమ్మె దిశగా అడుగులు వేస్తున్నారు. వారు వారి నిర్ణయాన్ని వెన్నక్కు తగ్గే అవకాశమే లేదని వాదనలు వెల్లడవుతున్నయి.వారు కనక డిస్మిస్ అయితే తిరిగి మళ్ళీ ఎప్పటికి ఉద్యోగాలకు తీసుకునే అవకాశం లేదని టీఎస్ ఆర్టీసీ ప్రభుత్వం ఖరాకండిగా తెల్చేసింది.  తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగించాలని ఆర్టీసి యాజమాన్యం నిర్ణయించుకున్నారు. బస్సులు, డిపోలకే పరిమితమయ్యాయి.తాజాగా ఈ సెగ సిటీ బస్సులకు కూడా అంటుకుంది.ఇకపై సిటీ బస్సులు డ్రైవర్లు కూడా ధర్నాకు మద్దత్తును ఇవ్వనున్నారు. ధర్నాకు దిగిన కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు తాత్కాలిక డ్రైవర్ లను, కండెక్టర్ లను నియమిస్తున్నారు. దీని కోసం నిరుద్యోగులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. దొరికిందే ఛాన్స్ గా ప్రైవేట్ ట్రావెల్స్ చార్జీలను అమాంతం పెంచేశాయి. పండుగవేళ ఊరు వెళ్ళే దారి లేక నానా అవస్థలు పడుతున్నారు ప్రయాణికులు. ప్రైవేటు డ్రైవర్ లతో నడుస్తున్న ఆర్టీసీ బస్సులను కూడా కార్మిక సంఘాలు అడ్డుకుంటున్నాయి. భువనగిరి జిల్లా యాదగిరి గుట్ట నుంచి హైదరాబాద్ కు బయలుదేరిన ఆర్టీసీ బస్సును ఉద్యోగులు అడ్డుకున్నారు. తాము సమ్మె చేస్తుంటే మీరు ఎందుకు బస్సులు నడుపుతున్నారు అంటూ ఆర్టీసీ కార్మికులు ఎదురు తిరిగారు. బస్సు నడుపుతున్న ప్రైవేటు డ్రైవర్ పైకి కండెక్టర్ చెప్పు విసిరేసింది. ఈ చర్యలు ఇంకా ఎలాంటి పరిస్థితికి దారి తీయబోతోందో వేచి చూడాలి.

ప్రైవేటు వాహన యజమానులకు కాసుల పంటగా మారిన ఆర్టీసీ కార్మికులు సమ్మె...

  ఆర్టీసీ కార్మికులు సమ్మె తెలంగాణలో ప్రైవేటు వాహన యజమానులకు కాసుల పంట పండిస్తోంది. అసలు చార్జీలకు అధికంగా ఎన్నో రెట్లు ఎక్కువ సొమ్మును ప్రయాణికుల నుంచి వసూలు చేస్తూ ప్రజల దగ్గర నుంచి అందినకాడికి దండుకుంటున్నారు. ప్రైవేట్ టాక్సీలు అయితే సొంతూరుకు వెళ్లే ప్రయాణికులకు వేలల్లో చార్జీలు చెప్తూ హడలెత్తిస్తున్నాయి. కొంతమంది ఎలాగైనా ఊరికి వెళ్ళాలని తపనతో వేలకు వేలు పోసి కుటుంబాలతో సహా సొంత ఊళ్లకు చేరుకుంటున్నారు. ప్రైవేటు వాహన యజమానులకు అధికారులు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో వాళ్లు ఏకంగా బస్టాండ్ లోని ప్లాట్ ఫాంల మీద వాహనాలు నిలుపుతూ ప్రయాణికులను ఎక్కించుకుంటున్నారు. అధిక చార్జీలు వసూలు చేయొద్దన్న అధికారుల సూచనని ఏమాత్రం పట్టించుకోకుండా అధిక చార్జీలు వసూలు చేస్తున్నారు. ప్రయాణికులు గట్టిగా అడిగితే డీజిల్ రేట్లు పెరిగాయని ఎక్కువ ఛార్జీలు వసూలు చేయకపోతే చిన్న వాహనాలకు గిట్టుబాటు కాదని, ఇష్టముంటే ఎక్కండి లేకపోతే లేదు అని ఖరాఖండిగా చెప్పేస్తున్నారు దాంతో ప్రయాణికులు ఆర్థికంగా భారమైనా సరే ప్రైవేటు వాహనాలలోనే ప్రయాణం కొనసాగిస్తున్నారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఆర్టీసీ సర్వీసులు అరకొరగా నడుస్తున్నా వాటి లోని సిబ్బంది కూడా రెండు మూడు రెట్లు అధికంగా చార్జీలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి. బస్టాండ్ లో ప్రయాణికులను ఎక్కించుకుంటున్న తాత్కాలిక సిబ్బంది బస్సులు ఊరి బయటికి చేరుకోగానే ఇష్టం వచ్చినంత సొమ్ము వసూలు చేస్తున్నారని ప్రయాణికులు మండిపడుతున్నారు. బస్సు దిగి వెళ్ళిపోయే అవకాశం లేకపోవటంతో ఆ పరిస్థితిని ఆసరాగా చేసుకుని ప్రయాణికుల నుంచి భారీగా డబ్బు వసూలు చేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ మొత్తం మీద ఆర్టీసీ సమ్మెకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని అధికారులు చెబుతున్నా ఇంకా పది శాతం బస్సులు కూడా రోడ్డెక్కలేదు. దాంతో ప్రైవేట్ వాహనాలదే ఇష్టా రాజ్యం అయిపోయింది. సమ్మె విషయంలో అటు ప్రభుత్వం ఇటు కార్మికులు పంతానికి పోయి చివరికి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారని చాలా చోట్ల ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రవి ప్రకాష్ అర్రెస్ట్ వెనుక కారణాలివే...

  అసోసియేటెడ్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీకి చెందిన నిధులను రవిప్రకాష్ గోల్ మాల్ చేసినట్లు అలంద మీడియా పోలీసులకు ఫిర్యాదు చేసింది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తో పాటు షేర్ హోల్డర్స్ అనుమతి లేకుండా రవిప్రకాశ్ ఎం.కె. వీ.ఎన్ మూర్తి కంపెనీ నిధులను దారి మళ్లించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిధులను బ్యాంకు ఖాతాల నుంచి ఉపసంహరించి కంపెనీకి తీవ్ర నష్టం కలిగించారని అలంద మీడియా పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది. ఎ.బి.సి.ఎల్ కంపెనీలో తొంభై పాయింట్ ఐదు నాలుగు శాతం మెజారిటీ వాటాను అలంద మీడియా రెండు వేల పధ్ధెనిమిది ఆగస్టు ఇరవై ఏడున కొనుగోలు చేసింది. రెండు వేల పధ్ధెనిమిది సెప్టెంబర్ పధ్ధెనిమిది నుంచి రెండు వేల పధ్ధెనిమిది అక్టోబర్ ఇరవై నాలుగు మధ్య కాలంలో రవిప్రకాశ్ తో పాటు ఎం.కే.వి.ఎన్ మూర్తి కంపెనీ డబ్బును అనధికారికంగా విత్ డ్రా చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. మొత్తం పధ్ధెనిమిది కోట్ల ముప్పై ఒక్క లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలను దారి మళ్లించినట్టు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో రవి ప్రకాష్ తో పాటు మొత్తం ముగ్గురు వ్యక్తులను పోలీసులు విచారిస్తున్నారు. రవి ప్రకాష్ తో పాటు అతని వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్ళారు. రవి ప్రకాష్ పై వస్తున్న అభియోగాలపై పోలీసులు నోటీసులు పంపారు, నోటీసులకు స్పందించకపోవటంతో రవి ప్రకాష్ ను పోలీసులు అర్రెస్ట్ చేసినట్లు చెప్తున్నారు.

ప్రధానితో భేటీ... కేంద్రం ఏ నిర్ణయం తీసుకోబోతోంది?

  ప్రధానమంత్రి మోదీతో కేసీఆర్ సమావేశం దాదాపు యాభై నిమిషాల పాటు సాగింది. ఇరవై మూడు అంశాలకు సంబంధించిన లెక్కల్ని ప్రధానికి ఆయన అందించారు. విభజన చట్టంలో పేర్కొన్నట్లు ఐఐటిలు, ఐఐఎంలు ఏర్పాటు చేయటం, రోడ్ల నిర్మాణం పెండింగ్ రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేయటంతో పాటు నీతి అయోగ్ సిఫార్సుల మేరకు మిషన్ కాకతీయ పథకానికి అయిదు వేల కోట్ల రూపాయలు, మిషన్ భగీరథకు పంతొమ్మిది వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు విడుదల చెయ్యాలని ఆయన కోరారు. తెలంగాణ ప్రభుత్వం ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నా రిజర్వేషన్ ల అంశాన్ని కూడా ఈ లేఖలో ప్రస్తావించారు. ముస్లింలలోని వెనుక బడిన కులాలకు పన్నెండు శాతం రిజర్వేషన్ లతో కలిపి మొత్తం బీసీలకు ముప్పై ఏడు శాతం, ఎస్సీలకు పదిహేను శాతం, ఎస్టీలకు పది శాతం రిజర్వేషన్ లు కల్పించాలని పార్లమెంటులో, అసెంబ్లీలో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ లు కల్పించాలని కోరారు.  ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా ఇలాంటి జాబితా ప్రధానమంత్రితో పాటు ఇతర కేంద్ర మంత్రులకు ఇచ్చే అవకాశాన్ని కొట్టిపారేయలేని పరిస్థితి. కేంద్రం ఆలోచన ఎలా ఉన్నా రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ నేతలు అధికార పార్టీల మీద ఆగ్రహంతో ఉన్నారు. ఏపీ ప్రభుత్వం పాలనలో వైఫల్యం చెందిందని ఏపీలోని బిజెపి నేతలు వైసిపి ప్రభుత్వం టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తున్నారు. జగన్ పాలనా వైఫల్యాలను ఎండగడుతూ ఉన్నారు. అంతేకాదు ఏపీలో బీజేపీని బలోపేతం చేయటంకి వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన నేతలను స్వాగతిస్తున్నారు. తెలంగాణలో బీజేపీ దూకుడు ఒక ఊపులో ఉంది. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగడం కోసం వ్యూహాత్మకంగా ముందుకు అడుగులు వేస్తోంది. రెండు వేల పద్నాలుగులో అధికారం చేపట్టిన నాటి నుంచి అటు నరేంద్ర మోడీ ఇటు కేసీఆర్ పరిణితి చెందిన రాజకీయాలను ప్రదర్శించారు. పరస్పరం సహకరించుకునే ధోరణి తోనే అయిదేళ్లు గడిపారు. అయితే రెండు వేల పధ్ధెనిమిదిలో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్, బీజేపీ పైనా ఘాటైన విమర్శలకు దిగారు. కేంద్రం నుంచి ఆశించిన సహకారం లభించలేదని కుండ బద్ధలు కొట్టారు. దాంతో బిజెపి నేతలు భగ్గుమన్నారు. అప్పట్నించి మొన్నటి పార్లమెంట్ ఎన్నికల దాకా బీజేపీ టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే వచ్చింది. పార్లమెంటు ఎన్నికల్లో బిజేపీ అనూహ్యంగా నాలుగు ఎంపీ స్థానాలను గెలుచుకొని తెలంగాణలో గులాబీ పార్టీకి కమలమే ప్రత్యామ్నాయం అన్న సంకేతాలు ఇచ్చింది. కేసీఆర్ ప్రజల సొమ్మును దోచుకునేందుకే కొత్త కొత్త ప్రాజెక్టులుని తెరపైకి తీసుకువస్తున్నారని బీజేపీ నేత లక్ష్మణ్ విమర్శించారు. పోతిరెడ్డిపాడును వ్యతిరేకించిన కేసీఆర్ ఇప్పుడు గోదావరి జలాలను కృష్ణాలోకి తరలించి పోతిరెడ్డిపాడు ద్వారా శ్రీశైలం జలాలను ఏపీకి మళ్లిస్తారా అని ప్రశ్నించారు.  ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల పైనా బిజెపి తరచూ విమర్శలు ఎక్కు పెడుతోంది. కొన్ని సందర్భాల్లో కేంద్ర మంత్రులు మరి కొన్ని సందర్భాల్లో రాష్ట్రంలోని బిజెపి నేతలు జగన్ వ్యవహార శైలిని తప్పుపడుతున్నారు. అక్రమకట్టడమని ప్రజావేదికను కూల్చడాన్ని తొందరపాటు చర్య అంటూ బీజేపీ విమర్శించింది. రాజధాని మార్పు వ్యవహారంపై వివాదం చెలరేగిన సమయంలో ఏపి, బీజేపీ అధ్యక్షుడు అమరావతిలో పర్యటించారు. పోలవరంపై రివర్స్ టెండరింగ్ పీపీఏల సమీక్షా పరిశ్రమల్లో స్థానికులకు డెబ్బై శాతం ఉద్యోగాలు కల్పించాలన్న నిర్ణయాల పై కేంద్ర మంత్రులు అసహనం వ్యక్తం చేశారు. అయితే ఎవరు ఎన్ని విమర్శలు చేసినా జగన్ ఎన్నికల హామీలను నెరవేర్చేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. ఏపీలో బీజేపీతో గ్యాప్ ఏర్పడినా కేంద్రంతో సన్నిహిత సంబంధాలు ఉండటం జగన్ కు ప్లస్ పాయింట్ గా మారింది. రాజకీయ అంశాలను పక్కన పెడితే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల మధ్య సఖ్యత ఏర్పడింది. గతంలో ఏపీలో టిడిపి, తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వాల మధ్య ఈ పరిస్థితి లేకపోవటంతో విభజన చట్టంలోని అనేక సమస్యలు అపరిష్కృతంగా మిగిలాయి. హైదరాబాదు లో ఆస్తుల పంపిణీతో పాటు రెండు రాష్ట్రాల్లో నియోజక వర్గాల పెంపు కేంద్ర సంస్థల ఏర్పాటు లాంటి అంశాలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. రెండు రాష్ట్రాల మధ్య ప్రస్తుతం సన్నిహిత సంబంధాలు ఉండటంతో కేంద్రం చొరవ చూపితే చాలా సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఆస్తులూ, అప్పులూ పంపకాలూ ప్రక్రియని కొనసాగించే  అంశాలు రెండు రాష్ట్రాల మధ్య వాయిదా అయిన నీటి పంపకాలు తదితర విషయాల పై జోక్యం చేసుకోవాలని ముఖ్యమంత్రులు కేంద్రాన్ని కోరుతున్నారు. మరి కేంద్రం ఈ అంశాల పై ఎలా స్పందిస్తుందనేది వేచి చూడాలి.

నవరాత్రులలో సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న రోజా...

  నవరాత్రుల సందర్భంగా వైసీపీ ఎంఎల్ఏ రోజా కనక దుర్గ అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. అమ్మవారి దయతో వర్షాలు బాగా పడి రాష్ట్రం లోని ప్రాజెక్టులన్నీ కళకళలాడుతున్నాయని ఏపీపీఏసీ చైర్ పర్సన్ రోజా అన్నారు. సరస్వతీదేవి అలంకారంలో ఉన్న అమ్మ వారిని దర్శించుకొని భక్తులందరూ అన్ని శుభాలు పొందాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి బాగుండాలని అమ్మ వారిని కోరుకోవాలని ఆమె వెల్లడించారు. నవరాత్రుల పూజా విధానం గురించి వివరించే పుస్తకాన్ని భక్తులకు బహుమతిగా ఇస్తున్నామని రోజా చెప్పారు. అమ్మ వారిని నేను కోరుకునేది ఒక్కటేనని జగనన్నకి ఏ ఆటంకాలు లేకుండా ఈ రాష్ట్ర ప్రజలకి ఆయన అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించి, మళ్ళీ రాజన్న పరిపాలనే అందరికీ కూడా అందించే విధంగా అమ్మవారు ఆశీర్వదించాలని రోజా తెలిపారు. ఆయనకు శక్తినీ, ఆరోగ్యాన్నీ, బలాన్నీ, ఆలోచన శక్తి నివ్వాలని అమ్మవారిని కోరుకుంటున్నాను అని రోజా తెలియజేశారు. ముఖ్యంగా ఈ రోజు మూలా నక్షత్రం కావున దర్శనానికి రావాలంటే ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి అని అసలు దర్శనం చేసుకోగలమా అని భయపడుతూనే వచ్చాము అని ఆవిడ పేర్కొన్నారు. ఎందుకంటే గతంలో చాలా అనుభవాలలో ఎదురు చూశామని, కానీ ఈ సారి మన మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు దగ్గరుండి చాలా చక్కటి ఏర్పాట్లు చేయటం జరిగిందని వైసిపి ఎంఎల్ఏ రోజా తెలియజేశారు. ఎక్కడా కూడా ఎదురు చూడాల్సిన అవసరం చేయకుండా ఎంతో సాఫీగా వీఐపీ లైన్ లో దర్శనం చేసుకున్నట్టే , జనరల్ లైన్స్ కూడా మహిళలు, పిల్లలు అందరూ కూడా చాలా సంతోషంగా వెళ్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు.

కవితకు పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ పదవిని టి.ఆర్.ఎస్ అప్పగించనుందా..?

  పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తర్వాత సైలెంట్ అయిన మాజీ ఎంపీ కవిత మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. నిజామాబాద్ లోక్ సభ ఎన్నికల్లో ఊహించని పరాజయాన్ని ఎదుర్కొన్న కవిత ఒక్కసారిగా పార్టీ కార్యక్రమాలకు దూరమయ్యారు. అలాంటి కవిత తాజాగా బతుకమ్మ ఉత్సవాలతో మళ్లీ తెరపైకి వచ్చారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జాగృతి సంస్థ కమిటీలను రద్దు చేసి కార్యక్రమాలను ఆపేసిన కవిత ఇప్పుడు మళ్లీ జాగృతికి పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. గత రెండేళ్లుగా జాగృతి ఆధ్వర్యంలో ఏ కార్యక్రమానికి కూడా హాజరు కాని కవిత ఈ సారి మాత్రం జాగృతికి అన్నీ తానై కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మలి దశ తెలంగాణ ఉద్యమంలో అటు జాగృతి ఇటు కవిత పోషించిన కీలక పాత్రను వివరించేలా మంత్రులతో వీడియోలు విడుదల చేయిస్తున్నారు. జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను కవిత చేస్తున్న కృషిని ప్రశంసిస్తూ మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడడం చూస్తుంటే త్వరలోనే టీ.ఆర్.ఎస్ లో ఆమెకు ముఖ్య బాధ్యతలు అప్పగిస్తారని చర్చ గులాబీ శ్రేణుల్లో జోరందుకుంది. రెండో సారి టీ.ఆర్.ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేటీఆర్ ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేసీఆర్ నియమించారు. మొన్నటివరకు పార్టీ బాధ్యతలు నిర్వహించిన కేటీఆర్ కు ఇటీవల కేబినెట్ లో చోటు కల్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కవితకు పార్టీ పగ్గాలు అప్పగిస్తారనే టాక్ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. కేసీఆర్ సూచనల మేరకే కవిత జాగృతిని యాక్టివ్ చేస్తున్నట్లు వినికిడి. పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రజల ముందుకు రాని కవితను మళ్లీ ప్రమోట్ చేసేందుకు టీ.ఆర్.ఎస్ వర్గాలు గట్టిగానే రంగంలోకి దిగాయని పరిశీలకులు కూడా భావిస్తున్నారు. మంత్రిగా కేటీఆర్ ప్రభుత్వ పాలనపై ఫోకస్ పెట్టారు, ఇటు ప్రభుత్వం అటు పార్టీ చూసుకోవడం కేటీఆర్ కు కత్తిమీద సాములా మారుతుంది. అందుకే పార్టీ బాధ్యతలు చూసేందుకు కవితను రంగంలోకి దింపడం ఖాయమని కొందరు ముఖ్య నేతలు అభిప్రాయపడుతున్నారు. అందువల్ల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కవితకు కట్టబెట్టవచ్చన్న భావన గులాబి వర్గాల్లో ఏర్పడింది.