ఈ పిట్రోడాకి ఏమైంది?

పాక్ కి వెళ్తే  సొంతింటికి వెళ్లిన‌ట్టు ఉంటుంద‌న్నారు కాంగ్రెస్ విదేశీ వ్య‌వ‌హారాల స‌ల‌హాదారు శ్యాంపిట్రోడా. కొంప‌దీసి పిట్రోడా కూడా అద్వానీలా పాకిస్థాన్ లో పుట్ట‌లేదు క‌దా అన్న అనుమానంతో ఆయ‌న బ‌యోగ్ర‌ఫీ త‌ర‌చి చూసిన వారికి పిట్రోడా ఒడిశాలో పుట్టిన గుజ‌రాతీ అని తెలిసింది. హ‌మ్మ‌య్య బ‌తికిపోయాం లేకుంటే ఈ ర‌చ్చ ఎక్క‌డెక్క‌డికో వెళ్లిపోయేద‌న్న ఆందోళ‌న  నుంచి వారు ఒక్కసారిగా బయటపడ్డారు. నిజానికి ఒక ప్రాంతం ప‌ట్ల పైకి క‌నిపించేది వేరు లోప‌లికి క‌నిపించేది వేరు. టెన్ మిత్స్ అబౌట్ పాకిస్తాన్ అంటూ ఎప్పుడో రామ‌చంద్ర గుహ వంటి వారు రాసిన వ్యాసాల సంగ‌తి తెలిసిందే. పాకిస్థాన్ కి సంబంధించి  ఎన్నో అపోహ‌లు ఉంటూనే ఉంటాయి. అక్క‌డ పైకి మ‌న‌కు ఉగ్ర‌వాద‌మే క‌నిపిస్తుంది. లోప‌ల మ‌రోలా ఉంటుంది. ఉండొచ్చు కూడా.  కానీ పిట్రోడా ఈ కామెంట్ చేయాల్సిన  టైం మాత్రం ఇది కాదంటారు పరిశీలకులు. మొన్న ఆప‌రేష‌న్ సిందూర్ విష‌యంలో ఏం జ‌రిగిందో అంద‌రికీ తెలిసిందే. పాక్ వ‌ల్ల భార‌త్, అమెరికా మధ్య  త‌గువులొచ్చిన సీన్ క‌నిపిస్తోంది. ఇప్ప‌టికీ పాక్, అమెరికా సాయంతో థ‌ర్డ్ పార్టీ మీడియేష‌న్ తో భార‌త్ తో స‌యోధ్య‌కు ప్ర‌య‌త్నం చేస్తోంది. అందుకు భార‌త్ స‌సేమిరా అంటోంది. దానికి తోడు అమెరికా చేయి విడిచి చైనా, ర‌ష్యాల‌తో చెలిమి చేస్తోంది భార‌త్. దీనంత‌టికీ కార‌ణం పాకిస్థానే. ఎప్పుడైతే ట్రంప్ త‌న కుటుంబ పెట్టుబ‌డులు పాక్ లో పెడుతున్నారో,  అప్పటి నంచీ గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ ని ద‌గ్గ‌ర‌కు చేర్చుకుంటున్నారు. అప్ప‌టి  నుంచీ అమెరికాకు మ‌న‌కూ మ‌ధ్య దూరం  పెరుగుతూ వ‌స్తోంది. భార‌త్, పాక్ ఘ‌ర్ష‌ణ‌లు ఆపింది ట్రంపే అన్న కోణంలో పాక్ ఆయ‌న‌కు నోబుల్ శాంతి బ‌హుమ‌తికి ప్ర‌తిపాదించ‌డం, భార‌త్ ఇందుకు ఒప్పుకోక పోవ‌డం వంటి కార‌ణాల రీత్యా ప్ర‌స్తుతం భార‌త్, అమెరికా మ‌ధ్య సంబంధాలు  దిగ‌జారుతూ వ‌స్తున్నాయ్. దీనంత‌టికీ కార‌ణం పాకిస్థానే. ఈ క్ర‌మంలో పిట్రోడా ఈ పిచ్చి ప్రేలాప‌న చేయ‌డంతో అంద‌రిలోనూ అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం అవుతున్నాయి. పిట్రోడ్ పాక్ విషయంలో చేసిన కామెంట్లతో ఊరుకోకుండా..   నేపాల్, బంగ్లా  ఎంత ప్ర‌శాంతంగా ఉన్నాయో చూడ‌మంటున్నారు. ఇటీవ‌లే  నేపాల్ మొత్తం త‌గ‌ల‌బ‌డగా.. ఇక బంగ్లా లో మిల‌ట‌రీ వ‌ర్సెస్ తాత్కాలిక ప్ర‌భుత్వంగా  మారింది  ప‌రిస్థితి. తాత్కాలిక బంగ్లా ప్ర‌ధాని తో బంగ్లా ఆర్మీ ప‌డ‌లేక పోతోంది. కొత్త‌గా ఎన్నిక‌లు జ‌రిపి తీరాల్సిందే అని ప‌ట్టుబ‌డుతోంది  బంగ్లాదేశ్ సైన్యం. మొన్నా మ‌ధ్య విద్యార్ధులంతా రోడ్ల‌పైకి వ‌చ్చారు కూడా. పాత‌ ప్ర‌భుత్వం దిగిపోయేట‌పుడు బంగ్లాలో జ‌రిగిన హింస  కూడా ఏమంత త‌క్కువ కాదు. అలాంటి నేపాల్, బంగ్లా ల్లో ఆయ‌న‌కు అంత‌టి శాంతి సౌభ్రాతృత్వాలు ఎక్క‌డ క‌నిపిస్తున్నాయో చెప్పాల‌ని నిల‌దీస్తున్నారు నెటిజ‌న్లు. ఇదంతా భార‌త్ వ్య‌తిరేక వాద‌న‌లో భాగ‌మ‌ని అంటారు చాలా మంది. వీరు మోడీ  ప్ర‌భుత్వాన్ని వ్య‌తిరేకించ‌డానికి ఇక్క‌డున్న స‌మ‌స్య‌ల‌పై విమ‌ర్శ‌లు చేయాలిగానీ మ‌న బ‌ద్ధ శ‌తృవు పాకిస్తాన్ సొంతిల్లు లాంటిద‌న‌డం.. పొరుగున ఉన్న నేపాల్, బంగ్లాదేశ్ లు.. ప్ర‌శాంతంగా ఉంటాయ‌న‌డం స‌రికాద‌న్న స‌ల‌హాలు అందుతున్నాయి.

తెలుగుదేశంలోకి అలాంటి వారికి నో ఎంట్రీ!

తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సమక్షంలో వైసీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్సీలు టీటీపీ గూటికి చేరారు. శుక్రవారం (సెప్టెంబర్ 19) ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, మర్రిరాజశేఖర్, బల్లి కల్యాణ చక్రవ్తరిలు తెలుగుదేశం తీర్ధం పుచ్చుకున్నారు.  వీరి చేరికకు ముందు చంద్రబాబు వారితో విడివిడిగా మాట్లాడారు. ఒక్కొక్కరితో పదే నిముషాల సేపు మాట్లాడిన ఆయన వారు తెలుగుదేశం గూటికి చేరడానికి కారణం, వారు పార్టీలో ఏ స్థానం కోరుకుంటున్నారు. ప్రజలలో వారికి ఉన్న ఆదరణ ఏంత అన్న విషయాలపై చంద్రబాబు వారితో మాట్లాడినట్లు తెలుగుదేశం వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే.. గ‌తానికి బిన్నంగా తాజాగా పార్టీలో చేరేందుకు ముందుకు వ‌చ్చిన వారితో ఆయ‌న 10 నిమిషాల చొప్పున చ‌ర్చించారు. అలాగే తెలుగుదేశం కూటమి ప్రభుత్వ పని తీరుపై వారి అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. వారి వారి నియోజకవర్గాలలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారన్న విషయాన్ని ఆరా తీశారు.  ఆ తరువాతే వారికి తెలుగుదేశం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.  ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ ఏమీ పుష్పకవిమానం  కాదన్నారు. ప్రజల కోసం పని చేసే వారికి మాత్రమే పార్టీలోకి ఎంట్రీ ఉంటుందని కుండబద్దలు కొట్టారు. ఎవరినిబడితే వారిని పార్టీలో చేర్చుకునే ప్రశక్తే లేదన్నారు. వైసీపీ హయాంలో ప్రజాకంటకులుగా వ్యవహరించిన  ఆ పార్టీ నేతలకు ఎంట్రీ ఉండదని స్పష్టం చేశారు. 

జగన్ సోదరుడి కంపెనీల్లో సిట్ సోదాలు

సిట్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బిగ్ షాక్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో ఆయన సోదరుడు వైఎస్ అనిల్ రెడ్డి కంపెనీలు, నివాసాలలో సోదాలు నిర్వహించింది. ఈ అనిల్ రెడ్డి ఎవరంటే జగన్ రెడ్డి పెదనాన్న వైఎస్ జార్జిరెడ్డి రెండో కుమారుడు.  చెన్నైలోని   మైలాపూర్, టీనగర్, పేరంగుడి, అరప్పుకొట్టాయ్ తో పాటు హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఉన్న అనిల్‌రెడ్డికి సంబంధించిన కంపెనీల కార్యాలయాలు, ఇంజంబాక్కం, చెన్నై అళ్వార్‌పేట్ ల్లోని అనిల్‌రెడ్డి  నివాసాల్లో సిట్ ఏకకాలంలో సోదాలు చేసింది. దాదాపు పది ప్రాంతాలలో ఈ సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో సిట్ కీలక డాక్యుమెంట్లు, హర్డ్ డిస్క్ లు స్వాధీనం చేసుకుంది మద్యం ముడుపుల సొమ్మును ఈ కంపేనీల ద్వారా విదేశాలకు తరలించారని భావిస్తున్న సిట్ అందుకు సంబంధించి ఆధారాల సేకరణకు ఈ సోదాలు నిర్వహించింది.   శుక్రవారం (సెప్టెంబర్ 19)న ఏకకాలంలో పది చోట్ల సిట్ చేపట్టిన ఈ సోదాలు రాత్రి పొద్దుపోయే వరకూ సాగాయి.   కాగా సిట్‌ సోదాలు చేసిన కంపెనీల్లో  షిలో ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, ఫోరెస్‌ ఇంపెక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌  తదితర కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలన్నీ కూడా  2019లో  జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఏర్పాటు అయినవే కావడం గమనార్హం. మద్యం ముడుపుల సొమ్ము మళ్లింపు కోసమే ఈ కంపెనీలను ఏర్పాటు చేసినట్లు సిట్ అనుమానిస్తోంది.  అసలు ఈ సంస్థలు ఎందుకు పెట్టారు? , వీటి కార్యకలాపాలేంటి? అన్నదిశగా సిట్ దర్యాప్తు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.  ఇటీవలే అనిల్‌రెడ్డి పీఏ దేవ రాజ్‌ సిట్‌ విచారించిన సంగతి తెలిసిందే. ఆ విచారణలో దేవరాజ్ ఇచ్చిన సమాచారం ఆధారంగానే ఇప్పుడు అనిల్ రెడ్డి నివాసాలు, కంపెనీలలో సిట్ సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది.  సిట్‌    షిలో ఇన్‌ఫ్రా వెంచర్స్‌ ఎల్‌ఎల్‌పీ, షిలో ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ , క్వన్న ఎగ్జిమ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ , వర్క్‌ ఈజీ స్పేస్‌ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ , ఇండోరాక్స్‌ ఎల్‌ఎల్‌పీ , ఫోరెస్‌ ఇంపెక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ,శ్రీ గోవిందరాజా మిల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌  ట్రాన్‌సెల్‌ బయోలాజిక్స్‌ ప్రైవేట్‌ లిమి టెడ్, హైదరాబాద్‌ తదితర కంపెనీల్లో సోదాలు చేసింది.  

ఫిరాయింపులపై ఎవరి భాష్యం వారిదే!

ఫిరాయింపుల మీద తెలంగాణ రాష్ట్రంలో చిత్ర విచిత్ర‌మైన వాద‌న‌లు తెర మీద‌కు వ‌స్తున్నాయ్. ఓట్ల చోరీ  కంటే ఎమ్మెల్యేల చోరీ అతి పెద్ద నేరమంటారు  కేటీఆర్. ఇదిలా ఉంటే సీఎం రేవంత్.. అస‌లు ఫిరాయింపు ఎక్క‌డుంది?  ఒక సీఎం అన్నాక‌.. ఎంద‌రో ఎమ్మెల్యేలు  వ‌స్తుంటారు పోతుంటారు. ఆ టైంలో వారికి కండువాలు క‌ప్పుతుంటాం. కండువా కప్పుకున్నంత మాత్రాన ఫిరాయింపు కాదని భాష్యం చెబుతారు. అబ్బే తెలంగాణలో ఫిరాయింపులేం లేవంటారాయన.  ఇదే విష‌యంలో..   క‌డియం శ్రీహ‌రి మరో చిత్రమైన వాదనను తెరపైకి తీసుకువచ్చారు. తాను ఏ పార్టీ అన్నది అసెంబ్లీ స్పీకర్ తేలుస్తారు. ఈ విషయంలో తాను చెప్పేదేం లేదంటున్నారు కడియం శ్రీహరి.  ఒక ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నారో స్పీక‌ర్ తేల్చ‌డ‌మేంటి?  అంటూ విస్తుపోవడం పరిశీలకుల వంతు అవుతోంది. ఆయ‌న  ఏ పార్టీ ద్వారా బీఫాం తీసుకుని పోటీ చేసి గెలిచారో ఆ పార్టీ ఎమ్మెల్యే అవుతారు కదా. మరి కడియం మాట్లలోని వితండం ఎక్కడిది అంటే.. ఇక్క‌డ మ‌రో విచిత్ర‌మైన ప‌రిస్థితి అదేంటంటే.. ఇదే స్టేష‌న్ ఘ‌న్ పూర్ సీటు త‌న‌కు ద‌క్కాల్సింది పోయి.. శ్రీహ‌రి త‌న్నుకుపోయార‌ని అంటారు రాజ‌య్య‌. టికెట్ ఇవ్వ‌కుంటే తాను కాంగ్రెస్ లోకి వెళ్తాన‌ని బెదిరించి మ‌రీ క‌డియం ఈ టికెట్ బ‌ల‌వంతానా తీసుకున్నారని చెబుతున్నారాయన.   ఇక పోతే ఇదే క‌డియం.. ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన వెంట‌నే అన్న మాట‌.. ఏంటంటే, ఏదైనా జ‌ర‌గొచ్చు. కాంగ్రెస్ అధికారం వెంట‌నే కోల్పోవ‌చ్చు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొంద‌రు మా ట‌చ్ లో ఉన్నార‌ంటూ ఫీలర్లు వదిలారు.  ఆ వెంట‌నే వెళ్లి కాంగ్రెస్ లో చేరిపోయారు. అదే మంటే నియోజ‌క‌ర్గం కోస‌మే ఇదంతా చేస్తున్నానంటారు. కావాలంటే చూడండీ ఇప్ప‌టి వ‌ర‌కూ వెయ్యి కోట్ల‌కు పైగా నిధులు ప‌ట్టుకొచ్చానని చెప్పుకుంటున్నారు.  ఇటు చూస్తే సీఎం అస‌లు ఫిరాయింపులే లేవంటున్నారు. అటు చూస్తే అస‌లు ఓట్ల చోరీక‌న్నా  ఎమ్మెల్యేల చోరీ అతి పెద్ద‌ద‌ని కేటీఆర్ అంటారు. ఇక అటు ఇటు కాని సందిగ్దావ‌స్త ఈ ఎమ్మెల్యేల‌ది. మొన్న‌టికి మొన్న బీఆర్ఎస్ గ‌ద్వాల్ స‌భ జ‌రిగితే ఎమ్మెల్యే బండ్ల త‌న ఫ్లెక్సీల‌కు ప‌ర‌దాలు క‌ప్పుకున్న దృశ్యం క‌నిపించింది. దీంతో తెలంగాణ‌లో ఫిరాయింపులపై తెలంగాణలో ఎవరికి వారు తమ సొంత భాష్యం చెప్పుకుంటున్నట్లు కనిపిస్తోంది. 

శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల క్షేత్రం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచీ, విదేశాల నుంచీ కూడా భక్తులు వెంకటేశ్వరుడి దర్శనం కోసం వస్తుంటారు. శనివారం (సెప్టెంబర్ 20) శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 31 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి.  టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి  18 గంటల సమయం పడుతోంది.ఇక శుక్రవారం(సెప్టెంబర్ 19) శ్రీవారిని మొత్తం 71 వేల 249 మంది దర్శించుకున్నారు. వారిలో 22 వేల 901 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 4 లక్షల  రూపాయలు వచ్చింది.

రాజకీయ పార్టీలపై ఈసీ కొరడా... 474 పార్టీల గుర్తింపు రద్దు

  చట్టబద్ధ నిబంధనలను ఉల్లంఘిస్తూ, చురుకైన రాజకీయ కార్యకలాపాలు లేని పార్టీలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రక్షాళన చేపట్టింది. జూన్ నుంచి కొనసాగుతున్న స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా యాక్టీవ్‌గా లేని 808 పార్టీల నమోదును ఈసీ రద్దు చేసింది. 2019 తర్వాత జరిగిన ఏకైనా ఎన్నికల్లో పాల్గొనని పార్టీలను ఈసీ గుర్తించి చర్యలు తీసుకుంది. పేరుకు మాత్రమే నమోదు చేసుకున్నా, వీటికి స్థిరమైన కార్యాలయాలు కూడా లేవని కమిషన్ వెల్లడించింది.  ఇంతకుముందు 334 పార్టీలను రద్దు చేసిన ఈసీ, మరో విడతలో 474 పార్టీలను కూడా వేటు వేసింది. రెండు నెలల్లో మొత్తం 808 పార్టీల నమోదును రద్దు చేసింది. ఇప్పటి వరకు దేశంలో 2,520 గుర్తింపు లేని నమోదిత రాజకీయ పార్టీలు ఉండగా, తాజా నిర్ణయంతో ఆ సంఖ్య 2,046కు తగ్గింది. ప్రస్తుతం భారత్‌లో ఆరు జాతీయ పార్టీలు, 67 రాష్ట్ర స్థాయి పార్టీలు మాత్రమే చురుకుగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని ఈసీ స్పష్టం చేసింది.

ఉల్లి రైతులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్

  ఉల్లి రైతులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. హెక్టారుకు రూ.50 వేల పరిహారం ఇవ్వనున్నట్లు సీఎం ప్రకటించారు. రైతుల నుంచి ఉల్లి కొనుగోళ్లపై  సచివాలయంలో ముఖ్యమంత్రి ఇవాళ సమీక్షా సమావేశం నిర్వహించారు.  నేటి నుంచే క్వింటాకు రూ.1,200 చొప్పున రైతుల వద్ద నుంచి ఉల్లిని కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.  ఉల్లి పంటను తక్షణమే కొనుగోలు చేసి నిల్వ చేయాలని సూచించారు. కమ్యూనిటీ హాళ్లను అద్దెకు తీసుకుని ఉల్లిని ఆరబెట్టాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం .ఉల్లికి గిట్టుబాటు ధర వచ్చే వరకూ కమ్యూనిటీ హాళ్లల్లో నిల్వ చేయడానికి రైతులకు అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి మార్గనిర్దేశం చేశారు. వచ్చే పది రోజుల్లో ఐదువేల మెట్రిక్ టన్నుల ఉల్లి పంట వస్తుందని అధికారులు వివరించారు.  కొనుగోలు చేసి ఆరబెట్టిన ఉల్లిని రైతు బజార్లల్లో విక్రయించేలా చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. తక్షణం ఉల్లిని కొనుగోలు చేసి అన్నదాతకు నష్టం రాకుండా చూడాలని ఆదేశించారు. అన్ని పంటల ధరల స్థిరీకరణ కోసం వేర్ హౌసింగ్ సదుపాయం కల్పించాలని సూచించారు. రైతుబజార్ల సంఖ్యను పెంచటంతోపాటు ఆధునికీకరణకు వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు  

సీఎం రిలీఫ్ ఫండ్ స్కామ్‌లో మరో ఏడుగురు అరెస్ట్

  సీఎం రిలీఫ్ ఫండ్ స్కామ్ వెలుగులోకి వచ్చింది... దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఏడుగురు నిందితులను అరెస్టు చేసి కటక టాల వెనక్కి పంపించారు... మాజీ మంత్రివ ర్యులు ఆఫీసులో పనిచేసిన ఓ నిందితుడికి దురాశ పుట్టింది... దీంతో మరి కొంత మంది తో చేతులు కలిపి నకిలీ లబ్ధిదారులను పుట్టించి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను జారీ చేసి వాటిని తమ ఖాతాలో జమ చేసుకొని డబ్బులు విత్ డ్రా చేసుకుని ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో లక్షల రూపాయలు స్వాహా చేశారు.... ఈ కేసు కాస్త వెలు గులోకి రావడంతో జులై 15వ తేదీన పోలీసులు జోగులా నరేష్ కుమార్, బాలగుని వెంకటేష్, కొర్ల పతి వంశీ, పులిపాక ఓంకార్... అనే నలుగురు నిందితులను అరెస్టు చేసి ... జైలు కు పంపించారు. ఒకవైపు ప్రభుత్వం మరోవైపు నిజమైన బాధితులను మోసం చేసిన ఈ నిందితులపై ఐపిసి సెక్షన్ ప్రకారం 409,417,419,467,120(b) సెక్షన్లుIT act 66(c) కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగించారు. అయితే ఈరోజు ఈ కేసులో పోలీసులు  పొట్ల రవి, జంగమ్మ నాగరాజు, మట్టేటి భాస్కర్, ధర్మవరం రాజు, కాంపల్లి సంతోష్, చిట్యాల లక్ష్మి, అసంపెల్లి లక్ష్మి మరో ఏడుగు రిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. అయితే నిందితులు ఇప్పటివరకు  మొత్తం 8.71 లక్షల రూపాయలు అక్రమంగా  విత్‌డ్రా చేసినట్లు పోలీ సులు గుర్తించారు.  అయితే నిందితుల్లో ఒకరు మాజీ మంత్రి వర్యులు ఆఫీసులో పనిచేసేవారు. అతనిలో దురాశ పుట్టి... సీఎం ఆఫీస్ చెక్కులను దుర్విని యోగం చేసినట్లుగా పోలీసులు గుర్తిం చారు. ఈ నిందితు లందరూ పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రాంతానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. వీరందరూ కలిసి నకిలీ లబ్ధిదారులు గా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను తమ ఖాతాలో జమ చేసుకొని డబ్బులు విత్‌డ్రా చేసుకుని వారి ఇష్టానికి డబ్బు లను వాడుకు న్నారు. 2023 ఎన్నికల తర్వాత 230 చెక్కులను అక్రమంగా తీసు కొని గుట్టు చప్పుడు కాకుండా సీఎం రిలీఫ్ ఫండ్19 చెక్కులను నకిలీ లబ్ధిదారుల పేర్లతో వారి ఖాతాలో జమ చేసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు... ఇంకా మిగతా నిందితుల కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వారిని పట్టుకునేం దుకు  గాలింపు చర్యలు చేపట్టారు.  

టీడీపీలో చేరిన ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీలు

  వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ముగ్గురు ఎమ్మెల్సీలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం సీఎం చంద్రబాబు  ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, బల్లి కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీలు  పార్టీ కండువాలు కప్పి సీఎం సాదరంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన నేతలకు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు.  ఇప్పటికే ఆ పార్టీకి, పదవులకు ఈ ముగ్గురు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. రాజీనామాలపై మండలి ఛైర్మన్‌ ఇంకా నిర్ణయం తీసుకోలేదు.  ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు సునీల్, విజయశ్రీ, పులివర్తి నాని, ఎమ్మెల్సీలు పేరాబత్తుల రాజశేఖర్, అనురాధ, చిరంజీవి, ఆలపాటి రాజేంద్రప్రసాద్, బీటీ నాయుడు, రామ్‌గోపాల్ రెడ్డి, కంచర్ల శ్రీకాంత్, సీఎం కార్యక్రమాల సమన్వయకర్త మంతెన సత్యనారాయణ రాజు, ఫారెస్ట్ డెవలెప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సుజయ్ కృష్ణరంగారావు, తదితరులు పాల్గొన్నారు.  

ఏపీ లిక్కర్ కేసులో ఈడీ భారీ నగదు స్వాధీనం

  ఏపీ లిక్కర్ స్కామ్‌లో దేశవ్యాప్తంగా 20 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. హైదరాబాద్,  బెంగళూరు, చెన్నై, తంజావూరు, సూరత్, రాయ్‌పుర్, ఢిల్లీ, ఏపీలలో అధికారులు తనిఖీలు చేపట్టారు. లెక్కల్లో చూపని రూ.38 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.   ఏపీ మద్యం కుంభకోణం కేసులో ప్రభుత్వ  ఖజానాకు రూ.4వేల కోట్ల నష్టం వాటిల్లిందని సీఐడీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఈడీ దర్యాప్తు చేపట్టింది. సోదాల్లో పలు కీలకమైన దస్త్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ప్రధాన మద్యం బ్రాండ్ల స్థానంలో నిందితులు కొత్త మద్యం బ్రాండ్లు తీసుకొచ్చారని ఎఫ్‌ఐఆర్‌లో సీఐడీ పేర్కొంది. దీని ఆధారంగా ఈడీ దర్యాప్తు చేపట్టింది.   

పానీపూరీ కోసం వెక్కివెక్కి ఏడుస్తూ.... మహిళ నిరసన

  గుజరాత్‌ రాష్ట్రంలోని వడోదరకు చెందిన ఓ మహిళ సాయంత్రం వేళ బయట తిరుగుతూ పానీపూరీ బండి దగ్గరకు వెళ్లింది. రూ.20 ఇచ్చి ప్లేట్ కావాలని అడగగా, బండి యజమాని సాధారణంగా ఇస్తున్న ఆరు పూరీల బదులు కేవలం నాలుగు పూరీలు మాత్రమే ఇచ్చాడు. ధరలు పెరిగాయని, ఇకపై ఒక ప్లేట్‌లో నాలుగు పూరీలే ఇస్తున్నట్టు చెప్పాడు. దీనికి ఆ మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది.  “పూర్తి ప్లేట్ ఇవ్వకపోతే కదలను” అంటూ రోడ్డుపైనే కూర్చుంది. రెండు పూరీలు ఇచ్చేదాకా లేవనని పట్టుబట్టింది. దీంతో ఆ ప్రాంతంలో వాహనాలు నిలిచిపోయి, కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. విషయం తెలిసి పోలీసులు అక్కడికి చేరుకుని ఆమెను ప్రశాంతపరిచారు. స్థానికులు కూడా ఆమెను అర్థం చేసుకునేలా ప్రయత్నించారు. చివరికి ఆ మహిళ బండి యజమానిని క్షమించమని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది.ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది.  పానీపూరీ కోసం ట్రాఫిక్ నిలిపివేయడం సరైనదా కాదా అన్న దానిపై నెటిజన్లు వాదోపవాదాలు చేస్తున్నారు. కొందరు “ఇది చిన్న విషయం కోసం హడావిడి” అని వ్యాఖ్యానిస్తే, మరికొందరు “ధరలు పెరిగినా ముందే కస్టమర్లకు చెప్పాలి” అంటున్నారు.ఘటన అనంతరం బండి యజమాని “ధరలు పెరగడంతో నాలుగు పూరీలకే పరిమితం చేయాల్సి వచ్చింది, కానీ కస్టమర్లకు ముందే చెప్పకపోవడమే తప్పు” అని అంగీకరించాడు.

నో ఫ్లై జోన్ గా తెలంగాణ సెక్రటేరియట్

  తెలంగాణ సచివాలయంపై భద్రతా చర్యలను మరింత పటిష్టం చేస్తూ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. సచివాలయాన్ని నో ఫ్లై జోన్‌గా ప్రకటిస్తూ, ఆ ప్రాంతంలో డ్రోన్లు, ఇతర ఎగురే పరికరాలను నిషేధించింది. భద్రతా విభాగం సూచనల మేరకు ఈ ఆదేశాలు వెలువడ్డాయి. బతుకమ్మ పండుగ సమీపిస్తున్న నేపధ్యంలో, ప్రజల రాకపోకలు పెరగనుండటంతో ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.  సచివాలయం చుట్టూ స్పష్టంగా కనిపించేలా సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. పండుగ సమయంలో  బతుకమ్మలను తీసుకువచ్చే మహిళలు, కుటుంబాలు అధికంగా తరలివచ్చే అవకాశం ఉండటంతో, పోలీసులు ప్రత్యేక భద్రతా బందోబస్తు ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే సచివాలయం పరిసరాల్లో సీసీ కెమెరాల సంఖ్యను పెంచి, పర్యవేక్షణను 24 గంటలూ కొనసాగిస్తున్నారు. డ్రోన్ నిషేధాన్ని ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రజల భద్రతే ముఖ్యమని, అందరూ ఈ ఆంక్షలకు సహకరించాలని విజ్ఞప్తి చేసింది.  

ఒక ఆడబిడ్డపై నలుగురు కలిసి దాడి చేస్తున్నారు : సీఎం రేవంత్

  సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించారు. పలు అంశాలపై మాట్లాడారు. మాజీ ఎమ్మెల్సీ కవితపై కేసీఆర్, కేటీఆర్, హారీశ్‌రావులు కలిసి ఆడపిల్లపై దాడి చేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు. ఇది వారి ఇంటి సమస్య. వారిని ప్రజలు బహిష్కరించేవారు. కాళేశ్వరం విచారణ బాధ్యతను సీబీఐకి అప్పగించి చాలా రోజులైనా కిషన్‌రెడ్డి ఎందుకు మాట్లాడలేదు. కేటీఆర్ ఏం చేప్తే కిషన్‌రెడ్డి అది చేస్తారు అని తెలిపారు. కండువాలు కప్పినంత మాత్రాన పార్టీ మారినట్లు కాదని ముఖ్యమంత్రి తెలిపారు.  నేను కూడా ఈరోజు ప్రోగ్రాంలో ఎంతో మందికి కండువాలు కప్పాను ఆ కండువా ఏంటో కూడా వాళ్ళు చూసుకోకుండా కప్పించుకున్నారని ఆయన పేర్కొన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని ముఖ్యమంత్రి తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని సీఎం తెలిపారు. ‘‘బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించి మూడు బిల్లులు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. రాష్ట్రపతి నిర్ణయం తీసుకునే గడువు అంశం సుప్రీంకోర్టులో ఉంది. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం ఏం చెప్తుందో వేచి చూస్తున్నాం. న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. మళ్లీ కోర్టుకు వెళ్లాలా? వద్దా? అనేది అప్పుడే నిర్ణయం తీసుకుంటాం’’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 2014-19 బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో  కేసీఆర్‌ కేబినెట్‌లో ఒక్క మహిళ కూడా మంత్రిగా అవకాశం కల్పించలేదని పేర్కొన్నారు.లేరు. తెలంగాణ ఉద్యమం పేరుతో కేసీఆర్ కొన్ని వందల మంది పిల్లల ఉసురు పోసుకున్నారు.. అది ఊరికే పోదని అన్నారు.ఇక హైదరాబాద్‌ మెట్రో విషయంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, కేటీఆర్‌ కలిసి అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఎల్‌అండ్‌టీతో ఒప్పందం చేసుకుంటేనే అనుమతులు ఇస్తామని కేంద్రం చెబుతోంది. కేంద్రంలో ఉన్న కిషన్‌రెడ్డి ఇలాంటి మెలికలు పెడుతున్నారు రేవంత్‌రెడ్డి తెలిపారు.

మరోసారి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో వివాదం

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హెచ్ సీఏలో వివాదాలకు అంతూ దరీ కనిపించడం లేదు. తాజాగా మరో వివాదం వెలుగులోకి వచ్చింది. ఆ అసోసియేషన్ యాక్టింగ్ ప్రెసిడెంట్ దల్జీత్ సింగ్ పై అసోసియేషన్ అఫ్లియేటెడ్ క్లబ్బుల కార్యదర్శులు బీసీసీఐకి ఫిర్యాదు చేశారు. బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశానికి ముందు ఈ ఫిర్యాదు చేయడం విశేషం.  బీసీసీఐ   వార్షిక సర్వసభ్య సమావేశం   ఈ నెల 28న ముంబైలో జ‌ర‌గ‌నుంది. ఈ స‌మావేశంలో పాల్గొనేందుకు అన్ని రాష్ట్రాల క్రికెట్ అసోసియేష‌న్‌ల‌కు బీసీసీఐ నుంచి ఆహ్వానాలు అందాయి. హెచ్‌సీఏకు కూడా ఈ ఆహ్వానం అందింది. అయితే ఈ సందర్భంలోనే హెచ్ సీఏ యాక్టింగ్ ప్రెసిడెంట్ పై పలు క్లబ్ ల కార్యదర్శులు బీసీసీఐకి లేఖలు రాశారు. అలాగే  ద‌ల్జిత్ పై సింగిల్ మెంబ‌ర్ కమిటీ జస్టిస్ నవీన్ రావ్‌కు కూడా ఫిర్యాదు చేశారు. దల్జిత్ సింగ్ యాక్టింగ్ ప్రెసిడెంట్ గా ఉంటూ బీసీసీఐ ఏజీఎంకు హెచ్ సీఏ ప్రతినిథిగా పాల్గొనడం నిబంధనలకు వ్యతిరేకమని పేర్కొన్నారు.   దీంతో హెచ్ సీఏలో మరో వివాదం రగులుకున్నట్లైంది. బీసీసీఐ ఎన్నికలకు హెచ్ సీఏ ప్రతినిథిగా హాజరయ్యే అర్హత దల్జీత్ సింగ్ కు లేదని వారు ఆ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. ఆయనకు బీసీసీఐ ఎన్నికలలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిథిగా పాల్గొనేందుకు ఆధరైజేషన్ లేదనీ, అలా ఆథరైజేషన్ లేకుండా పాల్గొనడం లీగల్ వయలేషన్ అవుతుందనీ పేర్కొన్నారు.  .

రేవంత్ చెప్పిన తెలంగాణ ట్రంప్ ఎవరంటే?

తెలంగాణముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును తెలంగాణ ట్రంప్ గా అభివర్ణించారు. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్ననిర్ణయాలు ఏ విధంగా అయితే అమెరికాకు నష్టం చేకూరుస్తున్నాయో.. అలాగే గతంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు తెలంగాణకు తీరని నష్టాన్ని చేకూర్చాయన్నారు. అయితే ఈ సందర్భంగా ఆయన నేరుగా కేసీఆర్ పేరును ప్రస్తావించకుండా గతంలో తెలంగాణలోనూ ఓ ట్రంప్ ఉండేవారని అంటూ.. ఆయన పాలన నచ్చకే తెలంగాణ జనం ఓడించి ఫామ్ హౌస్ లో కూర్చోబెట్టారని పేర్కొన్నారు. ఢిల్లీలో శుక్రవారం (సెప్టెంబర్ 19) జరిగిన బిజినెస్ స్టాండర్డ్స్ యాన్యువల్ ఫోరం సదస్సులో రేవంత్ మాట్లాడారు.  ఈ సందర్భంగా ఆయన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అవలంబిస్తున్న విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు.  ట్రంప్ విధానాల కారణంగానే పలు సంస్థలు అమెరికాను కాదంటున్నాయన్నారు. అలా అమెరికా వద్దనుకుంటున్న సంస్థలు తెలంగాణకు రావాలని రేవంత్ పిలుపునిచ్చారు. ఈ విషయంలో హార్వర్డ్, స్టాన్ ఫెర్డ్ సంస్థలతో తాను మాట్లాడతానని చెప్పారు.   తెలంగాణకు వచ్చే సంస్థలకు అవసరమైన అన్ని మౌలిక వసతులూ కల్పిస్తామన్న రేవంత్.. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఇష్టారాజ్యంగా పాలన చేసే అవరైనా ట్రంపే అవుతారన్న రేవంత్ రెడ్డి.. అటువంటి వారి పాలన ఎక్కువ రోజులు నడవదన్నారు.  

భర్త వేధింపులు తాళలేక దారుణానికి ఒడిగట్టిన ఇల్లాలు

  పొట్టకూటి కోసం రాష్ట్రాలన్నీ దాటుకుంటూ వచ్చి హైదరాబాద్ నగరం లో స్థిరపడ్డారు ఓ దంపతులు... కూలి పనులు చేసు కుంటూ జీవనం కొనసాగించారు. ఆ తర్వాత భర్త... ప్రతి రోజు భార్యను వేధింపులకు గురి చేస్తూ ఉండేవాడు. అతని వేధింపులు తాళలేక భార్య కూరగాయలు కట్ చేసే కత్తితో కచకచ పొడిచి చంపేసింది. ఇంతటి దారుణ మైన ఘటన హైదరాబాద్ నగరంలోని కోకాపేటలో చోటుచేసుకుంది.  అస్సాం కు చెందిన భారాకా బోరా, జ్యోతి బోరా దంపతులు... పొట్ట కూట్టి కోసం అస్సాం నుండి హైదరాబాదు నగరానికి వచ్చి కోకాపేట పరిధిలో కార్మికులుగా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. గత కొన్ని రోజుల నుండి భార్య జ్యోతి ని భర్త భారాకా బోరా వేధింపులకు గురి చేయడం మొదలుపెట్టాడు. చిన్న చిన్న విషయా లకే పెద్ద ఎత్తున గొడవ చేసి నానా హంగామా సృష్టిం చేవాడు.  అయినా కూడా జ్యోతి అన్ని సహిస్తూ వచ్చింది... భర్తలో మార్పు కోసం ఎదురు చూసింది. అయితే నిన్న అర్ధరాత్రి సమయంలో ఓ చిన్న విషయంపై ఇద్దరి మధ్య గొడవ చెలరేగింది. చిలికి చిలికి గాలివాన పెద్దదైనట్లుగా దంపతుల మధ్య ఆ గొడవ కాస్త పెద్ద దయింది. ఇప్పటికే జ్యోతి భర్త వేధిం పులు భరించలేక సహనం కోల్పోయి ఉంది. మళ్లీ గొడవ జరుగుతూ ఉండ డంతో ఓపిక నశించి పోయిన జ్యోతి ఒక్కసారిగా కిచెన్ లోకి వెళ్లి కూరగా యల కత్తి తీసుకు వచ్చి భర్త పై దాడి చేసి పొడిచింది.  దీంతో భర్త భారాకా బోరా గట్టి గట్టిగా అరవడంతో స్థానికులు ఇంటి లోపలికి వచ్చి చూడగా... భర్త రక్తపు మడుగులో పడి ఉన్నాడు. వెంటనే స్పందించిన స్థానికులు భర్తను స్థానిక హాస్పిటల్ కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ భర్త భారాకా బోరా మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని భార్య జ్యోతిని అరెస్టు చేసి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

తిరుమల బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి

  తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరితో కలిసి ఆయన శుక్రవారం (సెప్టెంబర్ 19) మీడియాతో మాట్లాడారు. తిరుమల తిరుపతిలోని అన్ని విభాగాలతో పాటు తిరుపతి జిల్లా యంత్రాంగంతో కూడా పూర్తి సమన్వయం చేసుకుంటూ  సామాన్య  భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయని వివరించారు.   ఈ నెల 24న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారన్నారు. తిరుమల పవిత్రతను కాపాడుతూ భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించాలన్న సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లూ చేస్తున్నట్లు తెలిపారు.   బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి అలంకరించే ఆభరణాలు శుభ్రపచటం పూర్తయ్యిందన్నారు. అలాగే విద్యుత్ దీపాలంకరణలు, ఇంజినీరింగ్ పనులూ చేపట్టామని వివరించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా 9 రోజుల పాటు 60 టన్నుల పూతలో అలంకరణకు ఏర్పాట్లు చేశామన్నారు. బ్రహ్మోత్సవాలలో తిరుమలలో పారిశుద్ధ్యం, పరిశుభ్రతకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా 960 మంది అదనపు శానిటరీ సిబ్బందిని వినియోగిస్తున్నామన్నారు.  గరుడ గరుడ సేవ రోజు రెండు లక్షల మందికి అన్నప్రసాదాలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు.  అత్యవసర వైద్య సేవల కోసం అదనంగా 50 మంది వైద్యులు, 60 మంది సేవకులను నియమిస్తున్నట్లు వివరించారు.   ఇక బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులకు సేవలందించేందుకు 3500 మంది శ్రీవారి సేవకులను నియమించినట్లు అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుమలలో నాలుగువేల వాహనాలకు పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశామనీ, అంతకంటే ఎక్కువగా వాహనాలు వస్తే వాటికి తిరుపతిలో పార్కింగ్ ఏర్పాట్లు చేశామన్నారు.  బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజులూ ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు చెప్పిన టీటీడీ ఈవో.. సిఫారసు లేఖలను కూడా అనుమతించబోమని చెప్పారు.     

ఆ కేసు కూడా సీబీఐకి?

తెలంగాణ ప్రభుత్వం మరో కీలకమైన, అత్యంత ప్రధానమైన కేసును సీబీఐకి అప్పగించనుంది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు, అవకతవకలు, అవినీతికి సంబంధించిన  కేసును సీబీఐకి అప్పగించిన రేవంత్ సర్కార్.. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసును కూడా సీబీఐకి అప్పగించాలని భావిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించే విషయంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై కొందరు అధికారులతో ఇప్పటికే చర్చించినట్లు విశ్వస నీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. అలాగే మంత్రివర్గ సహచరులతో కూడా ఈ విషయమై చర్చించి వారి అభిప్రాయం తీసుకున్నట్లు చెబుతున్నారు.  ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్మమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ సహా పలువురు బీఆర్ఎస్ నేతలపై ఆరోపణలు ఉన్న సంగతి విదితమే. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఇప్పటికీ దర్యాప్తు కొనసాగిస్తున్నది. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కేసును సీబీఐకి అప్పగించాలని నిర్ణయించడం ప్రాధాన్యత సంతరించుకుంది. సిట్ దర్యాప్తునకు నిందితులు ముఖ్యంగా ఈ కేసులో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు సహకరించడం లేదని, అందుకే కేసు దర్యాప్తు ఏళ్ల తరబడి ఒక కొలిక్కి రాకుండా సుదీర్ఘంగా సాగుతోందనీ రేవంత్ భావిస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాల ద్వారా తెలుస్తోంది. అదే దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తే.. విషయం మరింత సీరియస్ అవుతుందనీ, అధికారులు సహకరించకుండా ఉండే పరిస్థితి ఉండదని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారంటున్నారు.