మరోసారి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో వివాదం
posted on Sep 19, 2025 @ 5:36PM
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హెచ్ సీఏలో వివాదాలకు అంతూ దరీ కనిపించడం లేదు. తాజాగా మరో వివాదం వెలుగులోకి వచ్చింది. ఆ అసోసియేషన్ యాక్టింగ్ ప్రెసిడెంట్ దల్జీత్ సింగ్ పై అసోసియేషన్ అఫ్లియేటెడ్ క్లబ్బుల కార్యదర్శులు బీసీసీఐకి ఫిర్యాదు చేశారు. బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశానికి ముందు ఈ ఫిర్యాదు చేయడం విశేషం. బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం ఈ నెల 28న ముంబైలో జరగనుంది.
ఈ సమావేశంలో పాల్గొనేందుకు అన్ని రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్‌లకు బీసీసీఐ నుంచి ఆహ్వానాలు అందాయి. హెచ్‌సీఏకు కూడా ఈ ఆహ్వానం అందింది. అయితే ఈ సందర్భంలోనే హెచ్ సీఏ యాక్టింగ్ ప్రెసిడెంట్ పై పలు క్లబ్ ల కార్యదర్శులు బీసీసీఐకి లేఖలు రాశారు. అలాగే దల్జిత్ పై సింగిల్ మెంబర్ కమిటీ జస్టిస్ నవీన్ రావ్‌కు కూడా ఫిర్యాదు చేశారు. దల్జిత్ సింగ్ యాక్టింగ్ ప్రెసిడెంట్ గా ఉంటూ బీసీసీఐ ఏజీఎంకు హెచ్ సీఏ ప్రతినిథిగా పాల్గొనడం నిబంధనలకు వ్యతిరేకమని పేర్కొన్నారు. దీంతో హెచ్ సీఏలో మరో వివాదం రగులుకున్నట్లైంది.
బీసీసీఐ ఎన్నికలకు హెచ్ సీఏ ప్రతినిథిగా హాజరయ్యే అర్హత దల్జీత్ సింగ్ కు లేదని వారు ఆ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. ఆయనకు బీసీసీఐ ఎన్నికలలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిథిగా పాల్గొనేందుకు ఆధరైజేషన్ లేదనీ, అలా ఆథరైజేషన్ లేకుండా పాల్గొనడం లీగల్ వయలేషన్ అవుతుందనీ పేర్కొన్నారు. .