భర్త వేధింపులు తాళలేక దారుణానికి ఒడిగట్టిన ఇల్లాలు
posted on Sep 19, 2025 @ 3:38PM
పొట్టకూటి కోసం రాష్ట్రాలన్నీ దాటుకుంటూ వచ్చి హైదరాబాద్ నగరం లో స్థిరపడ్డారు ఓ దంపతులు... కూలి పనులు చేసు కుంటూ జీవనం కొనసాగించారు. ఆ తర్వాత భర్త... ప్రతి రోజు భార్యను వేధింపులకు గురి చేస్తూ ఉండేవాడు. అతని వేధింపులు తాళలేక భార్య కూరగాయలు కట్ చేసే కత్తితో కచకచ పొడిచి చంపేసింది. ఇంతటి దారుణ మైన ఘటన హైదరాబాద్ నగరంలోని కోకాపేటలో చోటుచేసుకుంది.
అస్సాం కు చెందిన భారాకా బోరా, జ్యోతి బోరా దంపతులు... పొట్ట కూట్టి కోసం అస్సాం నుండి హైదరాబాదు నగరానికి వచ్చి కోకాపేట పరిధిలో కార్మికులుగా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. గత కొన్ని రోజుల నుండి భార్య జ్యోతి ని భర్త భారాకా బోరా వేధింపులకు గురి చేయడం మొదలుపెట్టాడు. చిన్న చిన్న విషయా లకే పెద్ద ఎత్తున గొడవ చేసి నానా హంగామా సృష్టిం చేవాడు.
అయినా కూడా జ్యోతి అన్ని సహిస్తూ వచ్చింది... భర్తలో మార్పు కోసం ఎదురు చూసింది. అయితే నిన్న అర్ధరాత్రి సమయంలో ఓ చిన్న విషయంపై ఇద్దరి మధ్య గొడవ చెలరేగింది. చిలికి చిలికి గాలివాన పెద్దదైనట్లుగా దంపతుల మధ్య ఆ గొడవ కాస్త పెద్ద దయింది. ఇప్పటికే జ్యోతి భర్త వేధిం పులు భరించలేక సహనం కోల్పోయి ఉంది. మళ్లీ గొడవ జరుగుతూ ఉండ డంతో ఓపిక నశించి పోయిన జ్యోతి ఒక్కసారిగా కిచెన్ లోకి వెళ్లి కూరగా యల కత్తి తీసుకు వచ్చి భర్త పై దాడి చేసి పొడిచింది.
దీంతో భర్త భారాకా బోరా గట్టి గట్టిగా అరవడంతో స్థానికులు ఇంటి లోపలికి వచ్చి చూడగా... భర్త రక్తపు మడుగులో పడి ఉన్నాడు. వెంటనే స్పందించిన స్థానికులు భర్తను స్థానిక హాస్పిటల్ కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ భర్త భారాకా బోరా మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని భార్య జ్యోతిని అరెస్టు చేసి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.