Read more!

బీజేపీవారి న‌మ్మ‌కంలో న‌మ్మ‌కం ఎంత‌?

దేశంలో భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) అన్ని ప్రాంతాల్లోకి విస్త‌రించి అంద‌రి మ‌న్న‌న‌లు పొందుతోంద న్న భావ‌న బాగా ప్రచారం చేస్తోంది. వ్యూహ‌క‌ర్త‌లు, ప్ర‌చార‌క‌ర్త‌లు చురుగ్గా ఉన్న పార్టీగా బీజేపీ ప్ర‌సిద్ధి. కేంద్రంలో ఏ నిర్ణ‌యం తీసుకున్నా, పార్టీ ప‌రంగా, ప్ర‌భుత్వ ప‌రంగా ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నా వెంట నే దాన్ని భారీ ప్ర‌చారం చేసి ప్ర‌జ‌ల్ని మ‌భ్య‌పెట్టి, అనుకున్న‌ది సాధించ‌డం, రాష్ట్రాల్లో తాము అనుకున్న విధంగానే అమ‌లు జ‌రిగేట్టు చూడ‌టం, హెచ్చ‌రించ‌డం వంటివి బీజేపీవారికే చెల్లుతోంది. 

త‌మ అభిప్రాయాల‌ను, నిర్ణ‌యాల‌ను ప్ర‌జ‌ల మీద, విప‌క్షాల మీద రుద్ద‌డానికి ఏమాత్రం సందేహించ‌ని బీజేపీ త‌మ‌కు ప్ర‌జ‌ల్లో అపార న‌మ్మ‌కం, గౌర‌వం ఉంద‌నే ప్ర‌చారం చేయించుకోవ‌డం ప‌రిపాటిగా మారిం ది. బీజేపీ చేప‌డుతున్న అన్ని ప‌థ‌కాలు, వాటి అమ‌లు, ప్ర‌జాసంక్షేమ విధానాలు గురించి ప్ర‌జ‌లు ఎంతో ఆక‌ర్షితుల‌య్యార‌ని, ప్ర‌జ‌ల‌కు త‌మ నాయ‌క‌త్వం మీద తిరుగులేని న‌మ్మ‌కం కుదిరింద‌ని, ఇక ఎల్ల‌కాలం అధికారంలోనే ఉంటామ‌న్న ధీమాతో క‌మ‌ల‌నాథులు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. బీజేపీ ప‌ట్ల దేశ‌మంత‌టా గొప్ప విశ్వాసం, న‌మ్మ‌క‌మే పెల్లుబుకుతోంద‌ని ర‌క్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. 

పార్టీకి శాయ‌శ‌క్తులా కృషి చేయాల‌ని, పార్టీని న‌మ్ముకుంటే ఎంతో అభివృద్ధి సుసాధ్య‌మ‌ని బీజేపీ కార్య‌కర్త లకు కేంద్ర మంత్రి బోధ చేశారు. కాల‌క్ర‌మంలో దేశ ప్ర‌జ‌ల్లో పార్టీ ప‌ట్ల ఆస‌క్తి పెరుగుతోందే గాని త‌గ్గ‌డం లే ద‌ని ఆయ‌న అన్నారు. 2014కి ముందు, ఆ త‌ర్వాత కాలాల‌ను ప‌రిశీలిస్తే దేశంలో బీజేపీ ప‌ట్ల ఆక‌ర్ష‌ణ స్ప‌ష్టమ‌వుతోంద‌ని, దేశాభివృద్ధి బీజేపీతోనే సాధ్య‌మ‌న్న ఆలోచ‌న విస్త‌రించింద‌ని అన్నారు. అయితే విప క్షాలు మాత్రం బీజేపీ త‌మ పార్టీ భావ‌జాలాన్ని ప్ర‌జ‌ల‌మీద బ‌ల‌వంతంగా రుద్ది మ‌రీ త‌మ‌వేపు తిప్పు కోవ డం గ‌మ‌నిస్తున్నామ‌నే ఆరోపిస్తున్నాయి. 

ఇత‌ర‌పార్టీల వ‌లె కేవ‌లం అధికార పీఠం కోసం బీజేపీ ఎన్నిక‌ల్లో పోటీప‌డ‌ద‌ని బీజేపీ సీనియ‌ర్ల మాట‌. అధి కార కాంక్ష లేన‌పుడు బీజేపీయేత‌ర రాష్ట్రాల్లో రాజ‌కీయాల్లోకి త‌ల‌దూర్చి గంద‌ర‌గోళ ప‌రిస్థితులు క‌ల్పిం చి ఆధిప‌త్యం చెలాయించ‌డానికి పూనుకోవ‌డం మ‌రి బీజేపీ వ‌ర్గాల రాజ‌కీయ‌కాంక్ష‌తో కూడిన వ్యూహాలు కాకుండా పోతాయా అని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. కానీ బీజేపీ సీనియ‌ర్లు, కొత్త‌త‌రం నాయ కు లు కూడా బీజేపీ కంటే దేశంలో దేశ ఔన్న‌త్యాన్ని కాపాడే పార్టీ మ‌రోటీ లేద‌ని బ‌హుళ ప్ర‌చారానికి పూను కుంటున్నారు. దేశంలో ఎక్క‌డ ఏ సంఘ‌ట‌న జ‌రిగినా దాన్ని అక్క‌డి ప్ర‌భుత్వ వైఫ‌ల్యంగా ప్ర‌చారం చేసి ఆ ప‌రిస్థితుల‌ను త‌మ‌కు అనుకూలం చేసుకోవ‌డంలో బీజేపీ నేత‌ల రాజ‌కీయ చ‌ద‌రంగం ప్ర‌త్యేకత  స్ప‌ష్ట మ‌వుతోంది. 

దేశంలో విప‌క్షం లేకుండా చేసుకోవ‌డానికి, పార్టీ విధానాల‌కు ఎదురుగాలి వీయ‌కుండా, విమ‌ర్శ‌ల‌కు తావు లేకుండా చేసుకోవ‌డానికి తీవ్ర‌య‌త్నాలు చేయ‌డం త‌ప్ప వాస్త‌వానికి కేంద్రం రాష్ట్రాల మ‌ధ్య స‌మ‌న్వ యం గురించి అంత‌గా ప‌ట్టించుకోవ‌డంలేద‌న్న అభిప్రాయాలు ఈస‌రికే వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రానికి సంబంధంచిన ప్ర‌తి అంశాన్ని కేవ‌లం రాజ‌కీయ‌కోణంతో చూడ‌డం గోడు పెడ‌చెవిన‌పెట్టి త‌మ మాటే నెగ్గేట్లు ప‌రిస్థితుల‌ను అనుకూలం చేసుకోవ‌డం త‌ప్ప వాస్త‌వాల‌ను నిర్ల‌క్ష్యం చేస్తున్నార‌న్న అభి ప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. బీజేపీ కేవ‌లం దేశ‌మంతా కాషాయం చేయ‌డానికే పూనుకుంది గాని సంక్షేమం దృష్ట్యా ప్ర‌త్యేకించి ప‌థ‌కాలు స‌క్ర‌మంగా అన్ని ప్రాంతాల్లో అమ‌లు చేస్తున్న‌ది శూన్యం. కానీ దేశ ప్ర‌జ‌లం తా త‌మ వెంటే ఉన్నార‌ని చెప్పుకుంటూ త‌మ‌త‌ప్పిదాల‌ను దాచుకోవ‌డానికి, గంభీరంగా ప్ర‌వ‌చ నాలు చేయ‌డానికే బీజేపీ సీనియ‌ర్లు పూనుకున్నారు. యువ‌నాయ‌కులంతా త‌మ‌ను ప్ర‌శ్నిస్తున్న‌ వారి మీద విరుచుకుప‌డ‌టం మాత్ర‌మే ప్ర‌త్యేకించి శిక్ష‌ణ పొందిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ ప‌రిస్థితుల్లో బీజేపీ  దేశంలో తమ‌ప‌ట్ల న‌మ్మ‌కం ఎంతో పెరిగింద‌ని ఎలా చెప్ప‌గ‌ల్గుతున్న‌దీ బీజేపీ సీనియ‌ర్లే చెప్పాలి.