Juice Fasting!!

  Juice fasting, as its name goes it is a fasting method and a detoxifying diet wherein we consume fruits and vegetables juices only. Most importantly the juices consumed are not the canned or tinned ones rather they are the freshly prepared by juicing the fruits and vegetables. Many people believe it as a way to cure most of the incurable diseases like cancer, depression, autoimmune diseases and also believe it to assist in gallstone passage. Though, none of these benefits are clinically proven. So, it might be wrong to say that it is healthy practice. Before we adopt a new habit it is always good to know it possible side effects. While following this routine one must make sure to include adequate amounts of fibre, vitamins and minerals. Moreover it adds to worrying woes to bowel movements. These juices also lack the appropriate amounts of sodium which often lead to episodes of headache nausea and irritability. These fasts aren’t supposed to long more than few weeks. Juice fasting for a week without limitations on physical strain is capable of reducing cholesterol levels significantly. Juice fasting is ideal for cleansing the body of toxins and aid in weight loss. Besides it is also a healthier and simpler way detoxifying your body.Before sticking to this program of Juice fasting we need to accustom our body to healthy foods by copious feeds of fruits and vegetables prior to fasting. Juice fasting is a package of boons and banes! Whether to follow it or not is ones own decision! Take care!! - SIRI

డాక్టర్ని నమ్మితే చాలు... నొప్పి తగ్గిపోతుంది

హాస్పిటల్‌కి వెళ్లాలంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉంటుంది? అందులోనూ ఏదన్నా నొప్పితో బాధపడుతున్నా, చిన్నపాటి సర్జరీ చేయించుకోవాలన్నా... డాక్టరుగారి నైపుణ్యం ఎలా ఉంటుందో అన్న అనుమానం మనసుని పీకుతూనే ఉంటుంది. కానీ డాక్టరుగారిది మన ఊరే అని తెలిస్తే, లేదా ఆయన హస్తవాసి బ్రహ్మాండం అన్న నమ్మకం కలిగితే! మన నొప్పి తగ్గిపోతుందా?   డాక్టరుకీ, రోగికీ మధ్య ఉండే అనుబంధం చికిత్స మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసుకోవాలనుకున్నారు పరిశోధకులు. ఈ విషయంలో ప్రయోగాలు చేసేందుకు కొంతమందిని ఎన్నుకొన్నారు. వీళ్లందరినీ ఒక ఫారం నింపమన్నారు. వీటి ద్వారా అభ్యర్థుల మతం, నమ్మకాలు, రాజకీయాల పట్ల అభిప్రాయాలు... అన్నిటినీ తెలుసుకున్నారు. ఈ వివరాల ఆధారంగా వారిని రెండు గ్రూపులుగా విభజించారు.   మొదటి గ్రూపులోని వ్యక్తికి అదే గ్రూపులో వైద్యుడి చేత చికిత్స చేయించారు. చికిత్సలో భాగంగా మోచేతి మీద కాస్త వేడి కలిగించారు. కాసేపటి తర్వాత వేరే గ్రూపులో వైద్యుడి చేత ఇదే తరహా చికిత్సని అందించారు. పరిశోధకులు ఊహించినట్లుగానే... రోగి తన గ్రూపులో వ్యక్తి నుంచి చికిత్సని తీసుకున్నప్పుడు, నొప్పి చాలా తక్కువగా ఉన్నట్లు అనిపించింది. అదే వేరే గ్రూపులోని వ్యక్తి వైద్యుడిగా మారినప్పుడు... నొప్పి ఎక్కువగా తోచింది.   ఇంతకీ నమ్మకానికీ నొప్పికీ మధ్య ఇంత సంబంధం ఏమిటి? అన్న ప్రశ్నకు సమాధానం సిద్ధంగానే ఉంది. నొప్పి తగ్గించేదుకు ఏదో ప్రయత్నం జరగబోతోందన్న నమ్మకం కలగగానే.. మెదడు కూడా తన వంతుగా నొప్పిని తగ్గించే రసాయనాలను విడుదల చేస్తుందట. అలాంటిప్పుడు ఒక చిన్న పంచదార గుళిక కూడా అద్భుతమైన ప్రభావాన్ని చూపిస్తుంది. దీన్నే మనం ప్లేసిబో ఎఫెక్ట్‌గా పిలుచుకుంటాము. త్వరగా కంగారుపడే మనుషుల విషయంలో అయితే ఈ ప్లేసిబో ఎఫెక్ట్‌ అద్భుతాలను సృష్టిస్తుంది.   అదీ విషయం! డాక్టరుగారి వైద్యం ఎంత ప్రభావమో, ఆయనకి హస్తవాసి ఉందన్న నమ్మకం కూడా అంతే ప్రభావం చూపుతుందన్నమాట.   - నిర్జర. 

నోటి దుర్వాసన పోవాలంటే

  ఎవరితోనైనా మాట్లాడుతుంటే మన నోటిలోంచి దుర్వాసన ఏమైనా వస్తోందా...... ఇది సహజంగా ఎంతో మంది మనసులో మెదిలే మాట. ఇలాంటి భయం లేకుండా హాయిగా తనివితీరా మాట్లాడాలంటే మనం కొన్ని జాగ్రత్తలు పాటించక తప్పదంటున్నారు దంత వైద్యులు. అది కూడా ఇంట్లో దొరికే వస్తువులతో ఈ భయాన్ని పోగొట్టొచ్చట. *  బ్రష్ వాడటం మొదలుపెట్టక ఎన్నో రోజుల తర్వాత గాని ఆ బ్రష్ ని మార్చరు చాలామంది. అలాంటివాళ్ళు ఎక్కువగా ఈ సమస్యని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఎలాంటి బ్రష్ అయిన నెల రోజులు వాడాకా కచ్చితంగా మార్చాలని చెప్తున్నారు ఈ వైద్యులు. *  వారానికి ఒకసారి బకింగ్ సోడాతో పళ్ళు తోముకుంటే పళ్ళల్లో  ఉన్న క్రిములు పోయి నోటి దుర్వాసన దూరమవుతుంది. *   మౌత్ వాష్ వాడితే గనక అందులో dyes మరియు ఆల్కహాల్ లేకుండా చూసుకోవాలి. *  ప్రతిసారి భోజనం అయిన తర్వాత వెంటనే మరిచిపోకుండా బ్రష్ చేసుకోవాలిట. ఇలా చేస్తే పళ్ళ మధ్య ఉండే ఆహారపదార్థాలు బయటకి పోయి బాక్టీరియా ఏర్పడకుండా ఉంటుంది. *  సన్ ఫ్లవర్ సీడ్స్ నమిలి ఒక గ్లాసు నీళ్ళు తాగితే నోటి దుర్వాసన పోతుంది. *  ఆపిల్ క్రమం తప్పకుండా తింటుంటే ఈ సమస్య దూరమవుతుంది. అది నోట్లో ఉన్న బాక్టీరియా ని తొలగిస్తుంది.     *  అవకాశం  ఉన్న వాళ్ళు  గోరు  వెచ్చటి నీళ్ళల్లో నిమ్మరసం గాని,బేకింగ్ సోడా గాని వేసి ఆ నీళ్ళు పుక్కలిస్తే నోటి దుర్వాసన పోతుంది. *  వేపపుల్లతో పళ్ళు తోముకుంటే కూడా నోరు ఫ్రెష్ గా అనిపిస్తుంది. *   పుదీనా ఆకులు కొన్ని తీసుకుని నమిలినా నోరు తాజాగా అనిపిస్తుంది. *  అన్నిటికన్నా ముఖ్యమైనది ఎక్కువగా నీళ్ళు తాగటం. నీరు ఎక్కువ శాతం తీసుకోవటం వల్ల నోటిలోని బేక్టీరియా చేరకుండా నోరు ఫ్రెష్ గా ఉంటుంది.    పూర్వకాలంలో వాళ్ళు రోజూ వేపపుల్లతో పళ్ళు తోముకుని, చెరుకుగడలు, గతి వస్తువులు తినటం వల్ల వాళ్ళ పళ్ళు గట్టిగా ఉండేవి. ఈ రోజుల్లో అలాంటివి చేయకపోవటం వల్ల ఇలాంటి సమస్యలు ఎదుర్కోవలసి వస్తోంది. మనకి వీలయినపుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలు నోటి దుర్వాసన మన జోలికి రాదు. - కళ్యాణి

టమాటాలు తింటే కేన్సర్‌ మాయం!

    అదే పనిగా టమాటాలు తింటూ ఉంటే కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉందని చెబుతుంటారు. అలాగని టమాటాలను పూర్తిగా పక్కన పెట్టేస్తే, వాటి రుచికి దూరం కాక తప్పదు. పైగా టమాటాలో సమృద్ధిగా ఉండే విటమిన్‌ ఏ, సి వంటి పోషకాలకి కూడా శరీరం దూరమైపోతుంది. టమాటాని మనం పూర్తిగా దూరం చేసుకోకూడదని హెచ్చరించేలా ఇప్పుడు మరో పరిశోధన వెలుగులోకి వచ్చింది.   కేన్సర్‌ వల్ల కలిగే మరణాలలో, పదో శాతం మరణాలకి జీర్ణాశయ కేన్సరే కారణంగా ఉంటోంది. కడుపులో కేన్సర్‌ మొదలైనప్పటికీ... అదేదో సాధారణ కడుపునొప్పో, అజీర్ణ సమస్యో, అల్సరో అనుకోవడం చేత కేన్సర్‌ ముదిరిపోయేదాకా దాన్ని ప్రజలు నిర్లక్ష్యం చేస్తుంటారు. కాబట్టి మిగతా కన్సర్లకంటే ఇది చాలా ప్రమాదకరంగా మారుతోంది.   జీర్ణాశయ కేన్సర్లకి దారితీసే చాలా పరిస్థితులు మన స్వయంకృతాపరధాలే! ఊరగాయలు, ఉప్పు ఎక్కువగా ఉన్న పదార్థాలు, వేపుళ్లు, మాంసం... ఎక్కువగా తినడం వల్ల కేన్సర్ రావచ్చు. పొగతాగడం, మద్యపానం అలవాట్లు కూడా ఈ కేన్సర్‌కు దారితీస్తాయి. మన కడుపులో ఉండే Helicobacter pylori అనే సూక్ష్మక్రిమి వల్ల కూడా ఈ కేన్సర్‌ వచ్చే ప్రమాదం ఉంది. ఇక జన్యుపరంగా వచ్చే ప్రమాదమూ లేకపోలేదు.   మెడిటేరియన్‌ (మధ్యధరా) ప్రాంతంలో ఉండేవారిలో ఈ తరహా కేన్సర్‌ చాలా తక్కువగా ఉంటోందన్న వాదన చాలా రోజుల నుంచీ ఉన్నదే! పొగతాగకపోవడం, తాజా కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం వంటి అలవాట్లే ఇందుకు కారణం అనుకునేవారు. ఇప్పుడు దానికి మరో రహస్యం కూడా తోడైది. ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్‌ వంటి దేశాల్లోని ప్రజలు టమాటాలను ఎక్కువగా తినడం వల్ల వారిలో జీర్ణాశయ కేన్సర్‌ వచ్చే ప్రమాదం తక్కువని తేల్చారు.   ఇటలీలోని National Cancer Institute of Naples సంస్థ జీర్ణాశయ కేన్సర్‌ మీద టమాటాల ప్రభావం తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఇందుకోసం దక్షిణ ఇటలీలో ఎక్కువగా కనిపించే San Marzano, Corbarino అనే జాతి టమాటాల నుంచి తీసిన రసాయనాలను జీర్ణాశయ కేన్సర్‌ రోగులకు అందించి చూశారు. ఈ రసాయనాలు రోగి శరీరంలోకి చేరినప్పుడు వారి శరీరంలోని కేన్సర్‌ కణాలు చనిపోతున్నాయనీ, వాటి అభివృద్ధి కూడా ఆగిపోతోందనీ గమనించారు. ఇదే తరహా ఉపయోగం మిగతా టమాటాల వల్ల ఉంటుందో లేదో తేల్చాల్సి ఉంది.   మితంగా తింటే ఏ ఆహారమైనా మనకు ఔషధంగానే ఉపయోగపడుతుందని ఈ పరిశోధన మరోసారి రుజువుచేస్తోంది. కాబట్టి భయాలన్నీ పక్కనపెట్టి టమాటాలని కూడా అప్పుడప్పుడూ ఓ పట్టుపడితే సరి!   - నిర్జర.  

గోళ్లు చెప్పే ఆరోగ్యం!

  పెద్దగా పట్టించుకోం అన్నమాటే కానీ ఉదయం లేచిన దగ్గర్నుంచీ ఏ పని చేయాలన్నా మనకి గోళ్లే సాయపడతాయి. గోళ్లు కేవలం మన వేళ్లకి రక్షణ, బలం మాత్రమే కాదు... అవి మన ఆరోగ్యానికి సూచనలు కూడా! గోరు ఊడిపోతే కానీ కంగారుపడని మనం, ఒకోసారి గోటి రంగుని చూసి కూడా ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. ఎందుకంటారా...   పాలిపోయి ఉంటే.. తెల్లగా తళతళలాడిపోయే గోళ్లు నిజానికి ఏమంత మంచివి కావు. శరీరంలో తగినంత రక్తం లేదన్న సూచనను ఇవి అందిస్తాయి. శరీరానికి తగినన్ని పోషకాలు అందడం లేదన్న హెచ్చరికనూ ఇవి చేస్తాయి. ఇక గుండె లేదా లివర్‌ పనితీరులో ఏదన్నా లోపం ఉన్నప్పుడు కూడా గోళ్లు పాలిపోయినట్లు కనిపిస్తాయి. కాబట్టి గోళ్లు మరీ పాలిపోయినట్లు ఉండి, దానికి తోడు తరచూ నీరసంగా అనిపిస్తూ ఉంటే బలవర్ధకమైన ఆహారాన్ని తీసుకుని చూడండి.   పసుపు: గోళ్లు పసుపుపచ్చగా ఉంటే చూసేవాళ్లకి కూడా వెగటు పుట్టిస్తాయి. సాధారణంగా గోళ్లలో కొన్ని రకాల ఫంగస్‌ చేరడం వల్ల అలా పసుపుగా మారుతుంటాయి. వాటిని ఎప్పటికప్పుడు కత్తిరించుకుంటే పరిస్థితి మెరుగుపడుతుంది. పొగతాగేవారిలో, నెయిల్‌ పాలిష్‌ను ఎడాపెడా వాడేవారిలో కూడా గోళ్లు ఇలా పసుపురంగులోకి మారిపోతుంటాయి. మీ అలవాట్లను మానుకోమంటూ హెచ్చరిస్తుంటాయి. గోరు మొత్తం చాలాకాలం పాటు పసుపురంగులోకి మారిపోయి ఉంటే అది డయాబెటిస్, ధైరాయిడ్ వంటి వ్యాధులకు సూచన కావచ్చు.   పగుళ్లతో కనిపిస్తుంటే: చాలామంది పెద్దవాళ్లలో గోళ్లు పొడిబారిపోయి... పొరలుపొరలుగా విడిపోతూ... తేలికగా విరిగిపోతూ ఉంటాయి. వయసు మీరకుండానే ఇలాంటి లక్షణాలు కనిపిస్తుంటే మాత్రం జాగ్రత్త అవసరం. తరచూ నీటిలో నానడం, ఘాటైన రసాయనాలలో చేతులు పెట్టేయడం, నెయిల్ పాలిష్‌ రిమూవర్‌ను వాడటం దీనికి కారణం కావచ్చు. అటు నీళ్లు, ఇటు బట్టల సబ్బులతో ఎక్కువసేపు గడిపే ఆడవారిలో ఇలాంటి గోళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. ఒకోసారి శరీరంలో విటమిన్ల లోపం ఏర్పడినప్పుడు కూడా గోళ్లు ఇలా మనల్ని హెచ్చరిస్తుంటాయి.   గీతలు: చాలామంది పెద్దవారి గోళ్ల మీద నిలువు గీతలు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇవేమంత కంగారుపడాల్సిన సూచనలు కావు. మహా అయితే ‘బి’ విటమిన్‌ లోపించడం వల్ల ఇవి ఏర్పడుతూ ఉంటాయి. కానీ అడ్డగీతలు కనిపిస్తే మాత్రం వైద్యుని సంప్రదించడం మంచిది. శరీరం ఏదన్నా తీవ్రమైన జబ్బుతో బాధపడుతున్నప్పుడు, గోళ్లలో ఇలాంటి అడ్డగీతలు ఏర్పడుతూ ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే గోళ్లు పెరుగుదల కూడా ఆగిపోయేంతగా శరీరంలో ఏదో లోపం ఏర్పడినట్లు లెక్క. షుగరు వ్యాధి అదుపు తప్పడం దగ్గర్నుంచీ... తీవ్రమైన జింకు లోపం వరకూ అడ్డగీతలు చాలా సమస్యలకు సూచన కావచ్చు.   మచ్చలు: గోళ్ల అడుగు భాగంలో తెల్లటి చుక్కలు కనిపించడం సర్వసాధారణమైన విషయం. గోళ్లు పెరిగేకొద్దీ, ఈ మచ్చలు కూడా కరిగిపోతూ ఉంటాయి. గోరుకి ఏదన్నా దెబ్బ తగిలినా, లేకపోతే చిన్నపాటి ఇన్ఫెక్షన్‌ వచ్చినా కూడా ఇవి ఏర్పడుతూ ఉంటాయి. ఇలాంటి మచ్చలు మరీ సుదీర్ఘకాలం ఉంటే తప్ప వీటి గురించి అంత భయపడాల్సిన పని లేదు. కానీ తెల్లగా కాకుండా గాఢమైన రంగులో ఏవన్నా మచ్చలు లేక గీతలు ఉండి నొప్పిగా ఉంటే కనుక వెంటనే వైద్యుని సంప్రదించడం మంచిది. అవి ఒకోసారి స్కిన్‌ క్యాన్సర్‌కు సూచన కావచ్చు. - నిర్జర.  

Never ignore your Heel Pain..

  Heel pain, a common foot complaint among most of us now a days. It may occur for a variety of reasons, including heel spurs. Here are few scenarios where your  heel pain  becomes unbearable : * First in the morning when you get out of bed. * After sitting at your desk or in your car for a long time. * When you exercise without warm -up activity.   In few cases if a person is diagnosed with flat feet, then  heel pain may be caused by heel spurs or an inflamed plantar fascia.  Heel spurs can only be seen on an X-ray, so consult with your foot and ankle specialist for a definitive diagnosis. If you are getting heel pain with the first few steps you take after getting out of bed in the morning or when you resume back  to another activity  after  walking   for long or  after sitting / standing for a long period, then its adivised to consult your doctor immediately. If this problem is ignored and  untreated, your heel pain will likely  to grow worse over time. It can even become disabling and might  prevent  you from enjoying your regular chores of work. However, below mentioned are few tips help you to get some relief from pain till the time you visit your mediacal expert:   * Rest your feet as much as possible for a few days. Try to refrain yourself  from activities, like running and standing or walking for long hours as this might aggravate your pain. * Use ice-pack on  your heels to reduce inflammation and pain. * Give your feet extra support with supportive shoes,  heel pads or cushions or arch supports that help relieve pressure on your plantar fascia and heel. * Stretch your calf muscles to reduce the muscle tightness that inflames your plantar fascia. Keep your calf muscles and plantar fascia stretched out overnight by using a night splint. Bhavana

ప్రాణాలు తీస్తున్న Hot Water Challenge

      జనానికి ఏమొచ్చినా పట్టడం కష్టం. మొన్నటి వరకూ Cold Water Challenge పేరుతో చల్లటి నీళ్లు ఒకరి మీద ఒకరు దిమ్మరించుకునేవాళ్లు. ఇహ ఇప్పుడు Hot Water Challenge శకం మొదలైంది. ఏడాది క్రితం మొదలైన ఈ సరదా ఇప్పుడు వెర్రి తలలు వేసి ప్రాణాల మీదకు తెస్తోంది. ఈ ఛాలెంజ్‌లో భాగంగా ఎవరన్నా తన స్నేహితుడి మీద వేడి వేడి నీళ్లు పోయడం కానీ... వేడి నీళ్లు బలవంతంగా తాగమని ఛాలెంజ్ చేయడం కానీ చేస్తారు.   ఈ ఛాలెంజ్ వల్ల వచ్చే సరదా ఏంటో కానీ వేడి నీళ్లు పడ్డ ప్రతివాళ్లకీ ఒళ్లు బొబ్బలెక్కి హాస్పిటల్‌లో చేరే పరిస్థితులు వస్తున్నాయి. ఇక వేడి నీళ్లు తాగినవాళ్లకి అయితే నోరు, గొంతు కాలిపోయి మూగ, చెవిటివాళ్లుగా మారిపోతున్నారు. వేడి వేడి నీళ్లు తాగడం వల్ల ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా రికార్డు అవుతున్నాయి. వేడి నీళ్ల వల్ల ఇంత ప్రమాదం జరుగుతుందని తెలియని పిల్లలు మాత్రం ఈ ఛాలెంజ్ మోజులో పడి స్నేహితుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.     మనం వేడి చేసే నీళ్లు సాధారణంగా 120 డిగ్రీలు దాటితే SECOND DEGREE BURNS ఖాయం. అంటే చర్మపు పై పొరతో పాటు రెండో పొర కూడా దెబ్బతింటుంది. ఇలా ఏర్పడే గాయాలు ఓ పట్టాన తగ్గకపోగా చాలా బాధని కూడా మిగులుస్తాయి. ఇక 150 డిగ్రీలు దాటితే THIRD DEGREE BURNS తప్పవు. అంటే చర్మం లోపల ఉండే కొవ్వు కూడా దెబ్బతిని, నరాలు కూడా పాడైపోతాయి. ధర్డ్‌ డిగ్రీ బర్న్స్ వల్ల ఒకోసారి ఎముకలు కూడా బయటపడవచ్చు.     హాట్ వాటర్ ఛాలంజ్ వెనకాల ఇంత బాధ ఉందన్నమాట! ఇలాంటి సంఘటనలు జరిగాక తెగ బాధపడే కంటే ముందే ఇంట్లో పిల్లలకి వేడి నీళ్లతో ఎప్పుడూ చెలగాటం ఆడొద్దని ఓ గట్టి వార్నింగ్‌ ఇవ్వాలి. యూట్యూబ్‌లో వేడి నీళ్లు పడటం వల్ల కలిగే అనర్థాలు ఓసారి చూపిస్తే ఇక వాటి జోలికే పోకుండా ఉంటారు. - నిర్జర.  

మెదడుకి దెబ్బ తగిలితే ఇక CT SCAN అక్కర్లేదు

  మనుషులన్నాక దెబ్బలు సహజం. పిల్లవాడు ఆడుకుంటూ తల బొప్పి కట్టించుకున్నా, పెద్దవాళ్లు బండి మీద నుంచి జారిపడినా... ఒంటి మీద దెబ్బ పడకుండా జీవితాన్ని ఈదలేం. కాకపోతే తల మీద దెబ్బ తగిలితే ఆ అనుమానమే వేరబ్బా! ఆ దెబ్బ వల్ల మెదడులో ఏదన్నా బ్లడ్‌ క్లాట్‌ అయిందేమో అని మనసు ఒకటే పీకుతూ ఉంటుంది. ఇక ఆ అనుమానాన్ని క్యాష్‌ చేసుకునేందుకు మన హాస్పిటల్స్ ఎలాగూ సిద్ధంగా ఉంటాయి. మెదడుకి కాస్త దెబ్బ తగిలి కళ్లు బైర్లు కమ్మాయని చెప్పగానే వెంటనే CT SCAN తీయించుకోమని భయపెడతారు డాక్టర్లు.   సీటీ స్కాన్ అంటే మాటలా! అది ఎక్కడ పడితే అక్కడ ఉండదు. దాన్ని ఏర్పాటు చేసుకున్న హాస్పిటల్స్ దగ్గరకి వెళ్లి తెగ నిరీక్షించాలి. ఆపై వేలకి వేలు ఫీజులు కట్టాలి. సీటీ స్కాన్ మిషన్ వల్ల వెలువడే రేడియేషన్‌కి మన శరీరాన్ని అప్పగించాలి. ఇంత చేసిన తర్వాత రిపోర్టు ఎలా వస్తుందో అని దేవుడికి తెగ మొక్కాలి. మరి ఈ హడావుడి అంతా లేకుండా సింపుల్‌గా ఒకే ఒక్క రక్తపు చుక్కతో మన మెదడులో ఉన్న పరిస్థితిని తెలుసుకోగలిగితే ఎంత బాగుండో కదా!   ఇదే ఆలోచన వచ్చింది జెనీవాలో కొంతమంది శాస్త్రవేత్తలకి. మన శరీరంలో ఏదన్నా తేడా జరిగినప్పుడు రక్తప్రసారంలో కొన్ని మార్పులు వస్తాయి. కొన్ని ప్రొటీన్లు ఎక్కువగానో తక్కువగా స్రవిస్తాయి. వీటిని బయోమార్కర్స్ అంటారు. మెదడుకి దెబ్బ తగిలినప్పుడు కూడా ఇలాంటి బయోమార్కర్స్‌ ఏవన్నా విడుదల అవుతాయేమో కనుక్కుందామని ప్రయత్నించారు ఆ శాస్త్రవేత్తలు.   మెదడుకి దెబ్బ తగిలినప్పుడు అక్కడ ఉన్న కణాలు ఏవన్నా దెబ్బ తింటే H-FABP అనే ప్రొటీను రక్తంలోకి ఎక్కువగా విడుదల అవుతుందని తెలిసింది. ఒక మిల్లీలీటరు రక్తంలో 2.5 కంటే ఎక్కువగా H-FABP ఉంటే లోపల ఏదో జరిగి ఉంటుందని అనుమానించవచ్చు. అప్పుడే మిగతా పరిక్షల జోలికి వెళ్లవచ్చని తేల్చారు. ప్రెగ్నెన్సీ వచ్చిందో లేదో తెలుసుకోవడానికి ఎలాగైతే యూరిన్‌ శాంపిల్‌ ఉపయోగిస్తామో... అలాగే H-FABP ప్రొటీన్‌ ఎంత ఉందో తెలుసుకునేందుకు ఒక చిన్న స్ట్రిప్‌ మీద రక్తపు బొట్టు వేస్తే సరిపోతుందట.   సాధారణంగా ఇలాంటి పరిశోధనలు వినడానికి బాగానే ఉంటాయి కానీ మార్కెట్లోకి రావడానికి చాలాకాలం పడుతుంది. కానీ ఈ స్ట్రిప్‌ని మాత్రం వచ్చే ఏడాది నుంచి జనాలకి అందుబాటులో ఉంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. - నిర్జర.  

ఒత్తిడిలో పోషకాహారమూ దండగే!

  రోజూ మీరు తినే ప్రతి ముద్ద విషయంలోనూ చాలా అప్రమత్తంగా ఉంటున్నారా? మీరు తినే ఆహారంలో తగినన్ని పోషకపదార్థాలూ, వీలైనంత తక్కువ కొవ్వు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారా? మంచిదే! కానీ మనసులో ప్రశాంతత కరువైతే మాత్రం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఉపయోగం లేదంటున్నారు పరిశోధకులు...   మంచి ఆహారం- చెడు ఆహారం: అమెరికాలోని ఒహియోకి చెందిన కొందరు వైద్య నిపుణులు ఒక పరిశోధనను చేపట్టారు. ఇందులో భాగంగా వారు సగటున 53 ఏళ్ల వయసు ఉన్న కొందరు మహిళలను ఎన్నుకొన్నారు. వీరిలో కొందరు క్యాన్సర్‌నుంచి కోలుకున్నవారు ఉండగా, మరికొందరు ఆరోగ్యవంతమైన స్త్రీలూ ఉన్నారు. వీరికి రెండు రకాల ఆహారాన్ని అందించి... వాటిలో ఏదో ఒక ఆహారాన్ని తినమని చెప్పారు. ఇందులో ఒక రకం ఆహారంలో విపరీతమైన కొవ్వు పదార్థాలు ఉండగా, మరో రకం ఆహారంలో కొవ్వు శాతం వీలైనంత తక్కువగా ఉండేలా చూశారు.   ఒత్తిడి గురించిన వివరాలు: పరిశోధనలో పాల్గొన్నవారు పోషకాహారాన్ని తీసుకోవడం వల్ల వారి రక్తంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? అన్న విషయాన్ని తేల్చేముందు, పరిశోధకులు వారిని కొన్ని ప్రశ్నలు అడిగారు. నిన్న మీ రోజు ఎలా గడిచింది? మీలో ఒత్తిడిని విపరీతంగా పెంచే సంఘటనలు ఏవన్నా చోటు చేసుకున్నాయా? వంటి వివరాలను సేకరించారు. వీటి ఆధారంగా వారిలో ఎవరెవరు ఒత్తిడిలో ఉండి ఉంటారో గమనించారు.   ఆశ్చర్యం! పరిశోధకులు రెండు రకాల ఆహార పదార్థాలనూ తీసుకున్న అభ్యర్థుల నుంచీ రక్తాన్ని సేకరించారు. ఆ రక్తాన్ని పరీక్షించి... వారి రక్తనాళాలలో వాపునీ (inflammation), గడ్డలనీ (plaque) కలిగించే పరిస్థితులలో ఏమన్నా మార్పులు వచ్చాయేమోనని గమనించారు. ఆశ్చర్యం ఏమిటంటే, ఒత్తిడిలో ఉన్నవారు మంచి ఆహారం తిన్నా కూడా వారి రక్తంలో ఏమంత ఆరోగ్యకరమైన పరిస్థితులు కనిపించలేదు. మనసు ప్రశాంతంగా ఉండి, మంచి ఆహారాన్ని తీసుకున్నవారిలోనే కాస్త మెరుగైన ఆరోగ్యాన్ని సూచించే లక్షణాలు తేలాయి.     ఇదీ పాఠం! పోషకాహారం మీద విపరీతమైన శ్రద్ధ చూపించేవారికి ఈ పరిశోధన కాస్త నిస్తేజాన్ని కలిగించడం సహజమే! ఎలాంటి ఆహారం తింటే మాత్రం ఏంటి ఉపయోగం అన్న అభిప్రాయం వారిలో కలగవచ్చు. కానీ పరిశోధకుల ఉద్దేశం పోషకాహార విలువని తక్కువ చేయడం కాదు. ‘మీరు ఆహారాన్నే కాదు, మనసుని కూడా పట్టించుకోండి’ అన్న సూచనను అందించడమే వీరి లక్ష్యం. శారీరిక ఆరోగ్యం మీద చూపించే శ్రద్ధని, మానసిక ప్రశాంతతకి కూడా కేటాయించండి అని హెచ్చరించడమే వీరి అభిప్రాయం.   - నిర్జర.

తండ్రి తీరు... పుట్టబోయే పిల్లల్నీ వదలదు

  పిల్లల్లో ఏదన్నా లోటుపాట్లు ఉంటే వాటిని తల్లికి ఆపాదించడం చాలా తేలికే! కానీ ఆ నమ్మకాన్ని వమ్ము చేసే పరిశోధనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. పుట్టబోయే పిల్లల్లో ఎలాంటి లక్షణాలు ఉంటాయనే విషయం, వారి తల్లుల మీదే కాదు... తండ్రుల తీరు మీద కూడా ఆధారపడి ఉంటాయని స్పష్టం చేస్తున్నాయి. ఉదాహరణకు అమెరికాలోని జార్జ్‌టౌన్‌ విశ్వవిద్యాలయంలో జరిగిన ఓ పరిశోధననే తీసుకోండి. ఈ విశ్వవిద్యాలయానికి చెందిన డా॥ జోనా కిటలిన్‌స్కా పరిశోధన ప్రకారం... తండ్రిలో తాగుడు, ఆహారపు అలవాట్లు, ఒత్తిడిన ఎదుర్కొనే సామర్థ్యం, వయసు... ఇవన్నీ కూడా వాళ్ల వీర్యకణాలను ప్రభావితం చేస్తాయట. తద్వారా పుట్టబోయే పిల్లల జన్యువుల మీద ప్రభావం చూపుతాయంటున్నారు జోనా. ఈ మార్పు కేవలం ఒక్క తరానికే పరిమితం కాదట. భవిష్యత్‌ తరాలు అన్నింటి మీదా ఈ ముద్ర ఉంటుందని తేల్చి చెబుతున్నారు జోనా.   జోనా అంచనా ప్రకారం తండ్రికి మితాహారాన్ని తీసుకునే అలవాటే కనుక ఉంటే, అతని పిల్లల్లో గుండెజబ్బుల సమస్య తక్కువగా ఉంటుంది. అలా కాకుండా వాళ్లు కనుక ఊబకాయులై ఉంటే కనుక, అది వారి పిల్లల్లోని కొవ్వుకణాలను కూడా ప్రభావితం చేస్తుంది. అలాంటి కొవ్వు కణాలతో పుట్టిన పిల్లల్లో మున్ముందు చక్కెర వ్యాధి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. తండ్రుల వయసు కూడా పుట్టబోయే పిల్లల మీద ప్రభావం చూపుతుందట. మరీ లేటు వయసులో జన్మనిచ్చే తండ్రుల వల్ల, పిల్లల మెదడుకి తిప్పలు తప్పవంటున్నారు జోనా. ఆటిజం, స్కిజోఫ్రీనియాతో పాటుగా పుట్టుకలో లోపాలు కూడా ఏర్పడే ప్రమాదం ఉందంటున్నారు. దీనిని బట్టి ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలనే మన పెద్దల మాట ఎంత విలువైందో అర్థమవుతోంది కదా! చదువు, కెరీర్‌ అంటూ పెళ్లినీ పిల్లల్నీ వాయిదా వేసుకుంటూ పోతే పుట్టబోయే వారికి ఇబ్బందే!     పిల్లల మీద తండ్రుల ప్రభావం విషయంలో జోనా సూచిస్తున్న మరో ముఖ్యమైన విషయం తాగుడు. మగవాడికి తాగే అలవాటు ఉంటే కనుక అది అతని పిల్లల మెదడు పరిమాణం మీదా, మేధస్సు మీదా ప్రభావం చూపుతుందట. ఇలా కేవలం శారీరికమైన అలవాట్లే కాదు, తండ్రుల మానసిక ధోరణి కూడా పిల్లల మీద ప్రభావం చూపుతుందని జోనా పరిశోధనలో తేలింది. మగవాడిలో త్వరగా ఒత్తిడికి లోనయ్యే గుణం ఉంటే, అతనికి పుట్టబోయే పిల్లల్లో ప్రవర్తనాపరమైన ఇబ్బందులు తలెత్తుతాయని తేలింది.   దండీ విషయం! దీనిబట్టి పిల్లల్ని కనాలనుకునే తల్లులే కాదు, తండ్రులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని తేలిపోతోంది. మితమైన ఆహారం, మానసిక ప్రశాంతత, వ్యసనాలకు దూరంగా ఉండటం, వ్యాయామం... ఇవన్నీ కేవలం మన ఆరోగ్యాన్నే కాదు... మనకు పుట్టబోయే పిల్లల జీవితాన్నే ప్రభావితం చేస్తాయని గుర్తుంచుకుంటే చాలు. మంచి జీవనశైలిని గడపాలన్న లక్ష్యం ఏమంత కష్టంగా తోచదు! - నిర్జర.

Jogging – A great form of workout!

    If your New Year resolution was to improve your fitness, then here we give you the one of the best suited workout form, which besides being fun is a great form of workout. Jogging is labeled as one of the best form of exercise as tit does not require any kind of special equipments. Moreover, it exposes you to the fresh air and gives full freedom for your fitness levels! Besides being a fun filled workout, jogging also has varied health benefits. It improves your cardiovascular fitness, reduces the risk of hear diseases, builds up mental fitness, and boosts up the immune systems. Now, before resorting to jogging there certain thumb-rules to be followed: First and foremost a good pair of running shoes is needed. In fact, a pair of running shoes can make or break your workout! A good pair of shoes reduces the impact on your joints, feet and blow up your performance as well! Pick up a pair of running shoes which are comfortable for you and have considerable cushioning on sole. Jogging all alone might lead to the loss of motivation to continue jogging. So either rope in a partner for jogging who is almost at same level of fitness, such that none of you feel inferior. Not everyone is lucky to find a perfect companion, in such a case carry a good playlist of your favorite songs, a perfect companion for your jog! Further more, the dressing holds lots of importance. Dress according to the weather. Many people do say ‘you will warm up in no time’ but it does not hold good for jogging. Going for a jog with a sweatshirt and shorts in cold weather is not at all advisable, as you will end up returning with cold! Putting on few layers will not pull down with weight! Make sure you give your body adequate rest, as jogging is a high-impact exercise. You need to give your legs and joints time to rest and become robust yet again. Ideally two days off in week is advisable! Take Care!! - Siri