వేసవిలో దాహం తీర్చుకోవడం ఓ కళ!

  వేసవి మొదలైపోయింది. అది కూడా ఉధృతంగా! ఇంతటి వేసవిని ఎదుర్కోవాలంటే ఒంట్లో తగినంత నీరు ఉండాలని అందరూ చెప్పేమాటే! ఒంట్లో తగినంత నీరు లేకపోతే ఇంటపట్టునే ఉన్నా సమస్యలు తప్పవు. చెమటపొక్కుల దగ్గర్నుంచీ విరేచనాల దాకా.... నీరు తాగకపోవడం అనే సమస్య ఒకోసారి ప్రాణాల మీదకు తెస్తుంది. మరి ఈ చిక్కుని విప్పాలంటే...   మద్యంతో అసలుకే మోసం – వేసవికాలం వచ్చిందంటే చాలు... చాలామంది చల్లటి బీరు తాగితే చాలనుకుంటారు. ఆల్కహాల్‌తో శరీరానికి నీరు దొరక్కపోగా, ఉన్న నీరు కూడా పోతుందంటున్నారు నిపుణులు. మద్యం మన శరీరంలో ఉండే anti-diuretic అనే హార్మోను మీద ప్రభావం చూపుతుందట. దీని వల్ల శరీరం అవసరమైనదానికంటే అదనపు నీటిని కోల్పోతుందంటున్నారు. అది డీహైడ్రేషన్‌కు దారి తీస్తుందని వేరే చెప్పాలా!   లెక్కలు పక్కన పెట్టండి – రోజుకి ఎనిమిది గ్లాసుల నీరు తాగాలా? రెండు లీటర్ల నీరు తాగాలా? లాంటి సందేహాలను పక్కన పెట్టండి. దాహం వేసినప్పుడల్లా కావల్సినంత నీరు తాగాలి. దాహం వేయనప్పుడు కూడా తరచూ నీరు తాగుతూనే ఉండాలి.   కూల్‌డ్రింక్స్‌ దండగ – ఎండాకాలం వచ్చిందంటే మనకి శీతల పానీయాలే గుర్తుకువస్తాయి. వీటిలో ఉండే చల్లదనం వల్ల, కార్బన్‌డయాక్సైడ్‌ వల్ల దాహం తీరినట్లు తోస్తుంది. కెఫిన్‌, చక్కెర వంటి పదార్థాల వల్ల తాత్కాలికంగా ఉత్సాహం కలుగుతుంది. ఫలితంగా మనల్ని మనమే మోసం చేసుకున్నట్లవుతుంది. శీతల పానీయాల వల్ల శరీరానికి తగినంత నీరు దక్కదు సరికదా... రక్తపోటు, కిడ్నీల సమస్యలు కూడా రావచ్చు.   వాటర్‌ బాటిల్‌ వెంట ఉండాల్సిందే – ఎండాకాలం బయటకి వెళ్లేటప్పుడు, పనిలో మునిగిపోయినప్పుడు దాహం వేయడం సహజం. పక్కన మంచినీళ్ల బాటిల్‌ లేకపోతే తరువాత తాగొచ్చులే అన్న నిర్లక్ష్యం ఏర్పడిపోతుంది. ఒకోసారి అప్పటికే ఒంట్లో జరగాల్సిన నష్టం కాస్తా జరిగిపోతుంది. మన ఒంట్లో మూడింట రెండు వంతులు నీరే ఉంటుంది. ఈ నీటి శాతంలో మార్పులు వచ్చినప్పుడు తిప్పలు తప్పవు.   పోషకాహారం – మంచి ఆహారం తీసుకోవడం వల్ల శరీరానికి సత్తువ ఎలాగూ ఉంటుంది. ఇక తాజా పండ్లు, కూరగాయల సలాడ్స్, వేపుళ్ల బదులు ఉడికించిన పదార్థాలు తినడం వల్ల వాటి ద్వారా కావల్సినంత నీరు కూడా ఒంట్లోకి చేరుతుంది.   సూచనలు పట్టించుకోండి – మూత్రం పచ్చగా రావడం, నోరు పొడిబారిపోవడం, తలనొప్పి, కళ్లు మంటలు, చర్మం గరుకు తేలడం వంటి సవాలక్ష సూచనల ద్వారా మన ఒంట్లో తగినంత నీరు లేదని శరీరం సూచిస్తూ ఉంటుంది. వీటిని విస్మరిస్తే మరింత తీవ్రమైన సూచనలకు సిద్ధంగా ఉండాల్సిందే!   వ్యాయామంతో జాగ్రత్త- ఎండాకాలం వ్యాయామం చేసినప్పుడు చెమటతో పాటుగా నీరు, సోడియం రెండూ కూడా బయటకు వెళ్లిపోతాయి. అందుకని వ్యాయామం చేసే ఒక గంటకు ముందు పుష్కలంగా మంచినీరు తాగాలి. అలాగే వ్యాయామం చేసిన తరువాత కాసేపటికి కూడా నీరు తాగాలి. నీటికి బదులుగా కొబ్బరినీళ్లు, పళ్లరసాలు తీసుకుంటే మరీ మంచిది. - నిర్జర.

రక్తం చూస్తే కళ్లు తిరుగుతున్నాయా?

Vasovagal syncope- ఈ పేరు మనం ఎప్పుడూ విని ఉండము. కానీ మనలో దాదాపు 15 శాతం మందికి ఈ సమస్య ఉంటుంది తెలుసా! రక్తం చూడగానే కళ్లు తిరిగి పడిపోవడం ఈ వ్యాధి లక్షణం. చూసేందుకు చాలా చిన్నగా కనిపించినా... చెప్పుకోవడానికి చాలా వివరాలే ఉన్నాయి.   ఆదిమానవుల జ్ఞాపకాలు రక్తం చూడగానే కొందరికి కళ్లు ఎందుకు తిరుగుతాయో సరైనా కారణాలు ఇప్పటికీ తెలియవు. ఒక ఊహ ప్రకారం ఈ వ్యాధి మన పూర్వీకుల నుంచి వస్తూ ఉండవచ్చు. ఆదిమానవులు వేటాడేటప్పుడో, శత్రువులతో యుద్ధం చేసేటప్పుడో తీవ్రంగా గాయపడతారు కదా! అలా గాయపడినప్పుడు వారు జంతువులు లేదా శత్రువుల బారిన చిక్కే ప్రమాదం ఉంది. ఇలాంటప్పుడు వారు స్పృహ తప్పి పడిపోవడం వల్ల చనిపోయినట్లుగా కనిపిస్తారు. వారు నిజంగానే చనిపోయారనుకుని శత్రువు తన దారిన తను వెళ్లిపోతాడు. కాలం మారినా.... రక్తానికి స్పృహ తప్పే జన్యువులు ఇంకా కొందరిలో ఉండటం వల్ల ఈ వ్యాధి వస్తోందని భావిస్తున్నారు. మరో అంచనా ప్రకారం దెబ్బ తగిలిన తర్వాత కళ్లు తిరిగిపడిపోవడం, రక్తస్రావం ఆగిపోయేందుకు దోహదపడుతుంది.   సమస్యలు లేకపోలేదు ఈ వ్యాధి ఉన్నవారిలో రక్తం చూడగానే రక్తపోటు ఒక్కసారిగా పడిపోతుంది. గుండె బలహీనంగా కొట్టుకుంటుంది. దాంతో మెదడుకి వెళ్లే రక్తప్రసారం కూడా తగ్గిపోతుంది. చర్మం పాలిపోవడం, కళ్లు బైర్లు కమ్మడం, తల భారంగా మారడం, చెమటలు పట్టడం.... లాంటి లక్షణాలు కనిపించి మనిషి ఒక్కసారిగా కూలబడిపోతాడు. ఇలా కళ్లు తిరిగి పడిపోయిన మనిషి కాసేపటిలోనే మళ్లీ మామూలు మనిషి అయిపోతాడు కాబట్టి పెద్ద సమస్యగా అనిపించకపోవచ్చు. కానీ ఒక్కసారిగా కళ్లు తిరిగి పడటం వల్ల తీవ్రమైన గాయాలు కావచ్చు, ఎదుటివారికి తీవ్ర గాయమైన సందర్భంలో వారిని ఆదుకోవాల్సిన మనమే కళ్లు తిరిగి పడిపోవచ్చు. గుండె బలహీనంగా ఉండేవారిలో ఒక్కసారిగా ఇలా రక్తపోటు పడిపోవడం వల్ల ప్రాణాంతకంగానూ మారవచ్చు. కాబట్టి ఈ వ్యాధి నిరుపాయకరం అనుకోవడానికి వీల్లేదదు.   ఇలా చేయాలి! రక్తం చూస్తే కళ్లు తిరుగుతున్నట్లు ఉంటే... వెంటనే పడుకోవడం చాలా అవసరం. దీని వల్ల రోగికి విశ్రాంతి లభించడమే కాకుండా, మెదడులోని రక్తప్రసారం సాధారణ స్థితికి చేరుకుంటుంది. అలా కాకుండా వెంటనే బలవంతంగా నిలబడే ప్రయత్నం చేస్తే... మళ్లీ కుప్పకూలిపోయే ప్రమాదం ఉంటుంది. Vasovagal syncope తాత్కాలికమే! కానీ దీని నుంచి ఉపశమనం పొందాలనుకుంటే మార్గాలు లేకపోలేదు. applied tension అనే ఒక చికిత్స ద్వారా వైద్యులు ఈ వ్యాధిని తగ్గించగలరు. ఇందులో భాగంగా ఒక 10 నుంచి 15 సెకన్ల పాటు కండరాలని బిగపట్టమని చెబుతారు. దాని వల్ల రక్తపోటు కాస్త పెరుగుతుంది. ఆ వెంటనే రక్తాన్ని గుర్తుచేసే దృశ్యాలను చూపిస్తారు. ఇలా రోగిని నిదానంగా రక్తాన్ని ‘కళ్ల చూసే’ పరిస్థితికి తీసుకువస్తారు.   మన చుట్టపక్కల ఎవరికన్నా రక్తాన్ని చూస్తే కళ్లు తిరిగే సమస్య ఉంటే... వారిని ఎగతాళి చేస్తుంటాం. వారు మానసికంగా బలహీనమైనవారని అంచనా వేస్తుంటాం. కానీ ఇది కూడా ఒక సమస్య అని గుర్తించిన రోజున వారి ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం తెలుస్తుంది.   -నిర్జర

ఎక్కిళ్ళు

చాలామందికి సడన్ గా ఎక్కిళ్ళు వస్తాయి... కానీ అవి ఎందుకు వస్తాయి...దాని పర్యవసానం ఏమిటి అన్నది చాలామందికి తెలీదు. విదాహకర పదార్ధములు, మలబంధకర పదార్ధములు, చల్లని అన్నము తినుట చల్లని నీటిని తాగటం వలన ప్రాణవాయువు కంఠమందలి ఉదానవాతముతో చేరి హిక్ అను శబ్దముతో ప్రేవుల నుండి బయటకు వస్తుంది. మూత్రపిండాలు చెడిపోయిన కారణంగా వచ్చే ఎక్కిళ్ళను కష్టసాధ్యంగా పరిగణించాలి ఇలా వచ్చిన ప్పుడు తీసుకోవలసిన ముందుజాగ్రత్తలు: స్వేదనము, వమనము, సస్యకర్మ ధూమపానము, విరేచనము, నిద్ర స్నిగ్ధములును, మ్రుదువులుపు, లవణ మిశ్రితములైన పదార్ధములను భుజించుట, పాతవియగు ఉలవలు, గోధుమలు, శాలిధాన్యము పష్టికధాన్యము, పెసలుభుజించుట. వేడినీరు, మాదీఫలము, పొట్లకాయలు, లేతముల్లంగి, వెలగపండు, వెల్లుల్లి తేనె అనునవి హిక్కారోగులకు హితము చేకూర్చును.   మందుజాగ్రత్తలు: నెమలి ఈకల భస్మము, పిప్పలీ చూర్ణములను కలిపి తేనెలో కలిపి సేవిస్తే ప్రబలమైన ఎక్కిళ్ళు శ్వాస భయంకరమైన వమనము శమిస్తాయి. పిప్పళ్ళు, ఉసిరిక వరుగు శొంఠి వీని చూర్ణమందు చక్కెర తేనె కలిపి చాలాసార్లు  సేవిస్తే హిక్కా శ్వాసలు నశిస్తాయి. అతిమధుర చూర్ణమందు తేనె కలిపి తీసుకోవచ్చు. పిప్పలీ చూర్ణమునందు తేనె కలిపి సేవించవచ్చు. వెచ్చని నేతిని గానీ వెచ్చని పాలను గాని రసాన్ని గాని పానం చేస్తే అన్నికరాల ఎక్కిళ్లు నశిస్తాయి...

అతిసార వ్యాధి

విరేచనాలు అధికముగా అయ్యేవ్యాధిని అతిసార వ్యాధి అని అంటారు. ఇది వచ్చేముందు ఉదరము, పొత్తికడుపు యందు నొప్పి, అసానవాతము బయలు వెడలకుండుట, మలబంధము, కడుపుబ్బరము, అజీర్ణము అను లక్షణాలు కలుగుతాయి. కొందరిలో నురుగుతో కూడిన విరేచనాలు మరి కొందరిలో రక్తవర్ణమలము, లేదా చిక్కని కఫముతో దుర్గంధయుక్తముగా విరేచనాలు అవుతాయి.    ముందుజాగ్రత్తలు: లంఘనము, పమనము, నిదురబోవుట, ప్రాతవియగు శాలిధాన్యము, షష్టిక ధాన్యము, విలేపి,పేలాలగంజి, చిరుశనగల కట్టు, కందికట్టు, కుందేలు, జింక, లావకపిట్ట, లేడి, కాజు వీని మాంసరసములు, చిన్నవి యాగు చేపలు దుప్పి తైలము, మేక, ఆవు, ఈ జంతువుల యొక్క నెయ్యి,పాలు, పెరుగు, మజ్జిగ, పెరుగు నుండి తీసిన వెన్న పాలలో తీసిన వెన్న, లేత అరటికాయ అరటి పువ్వు, పొట్లకాయ, తేనె, నేరేడు పండ్లు, అత్తికాయలు, అల్లము,శుంఠి, తెల్లతామరగడ్డలు, వెలగ పొగడ, మారేడు, తుమికి పండు,పుల్లదానిమ్మ. తియ్యదానిమ్మ ఎర్రతామరగడ్డ, బూరుగ, పులిచింతాకు, గంజాయి ఆకు, మంజిష్ట, జాజికాయ,నల్లమందు జీలకర్ర, కొడిశపాల, ధనియాలు, తురకవేప, వగరు గల అన్ని పదార్ధములు. అగ్ని దీప్తిని కలిగించునవి. లఘువుగ ఉండెడునవియు అగు పదార్ధములు. అన్నియు అతిసార వ్యాధి హితకరములు. మందుజాగ్రత్తలు:  మారేడు గుజ్జు చూర్ణము బెల్లముతో కలిపి సేవిస్తే కడుపునొప్పి మలబంధము, కడుపుబ్బరము, అతిసారములు హరిస్తాయి. ధనియాలు శుంఠి కషాయం ఆకలిని పెంచుతాయి. కొడిశపాలపట్ట, అతివస వీని చూర్ణము తేనెలో కలిపి సేవిస్తే అతి సారశమిస్తుంది. కరిక పిందెలు, జీలకర్ర వీనిని కొంచెము వెచ్చచేసి చూర్ణించి బియ్యము కడుగు నీళ్ళతో సేవిస్తే అతిసారం నశిస్తుంది.మారేడు గుజ్జు మామిడి జీడి దీని కషాయమందు తేనె చక్కెర కలిపి సేవిస్తే వాంతి విరేచనాలు హరిస్తాయి.  

మలబద్ధకము

           ఆకలి వేస్తే తినడానికి ఎంత ఉవ్విళ్ళూరుతామో.... తిన్నది అరిగి బయటపడకపోతే అంత అల్లాడిపోతాము. మనం తిన్నది... జీర్ణం కాక... శుష్కించి వుండలు గట్టి మలమార్గం నుండి సునాయాసంగా బయటకు రాకుండా ఉంటే దాన్ని  అనాహము మలబద్ధకము అంటారు. నడుము, వీపు యందు పట్టుకొని నట్లు ఉండటం వలన కడుపునొప్పి, ఆయాసం, వాంతి లాంటివి మలపవ్రుత్తి జరగకపోతే వస్తాయి. దప్పిక జలుబు, శిరస్సునందు మంట, కడుపునొప్పి రొమ్ము పట్టినట్టు ఉండటం, త్రేనుపులు పైకి రాకుండటం వంటి లక్షణాలు కొందరిలో ఇలా కనబడతాయి.   ముందుజాగ్రత్తలు:  ఇలా వస్తే ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సినది ఏమిటంటే.....లేతముల్లంగి, మునగ ఆకులు, మునగకాయ, కాకరకాయ, పొన్నగంటికూర, ద్రాక్ష, వెల్లుల్లి, ఆవుపాలు, ఆముదము, లవల కట్టు ఏడాది దాటిన బియ్యం హితకరములు వగరు రుచిగల పదార్ధాలు, కషాయరసము గలవి మలబద్ధకము గల వారు విసర్జించాలి. మందుజాగ్రత్తలు:    హింగుత్రిగుణ తైలం రెండుచెంచాలు తీసుకొని పాలలో కలిపి సేవిస్తే గుణకారిగా ఉంటుంది. రాత్రిపూట త్రిఫలా చూర్ణం, ఒకటి రెండు చెంచాలు వేడి నీటిలో సేవించాలి. అభయారిష్ట లేదా ద్రాక్షారిష్ట  కొద్దిరోజులు సేవించాలి. అపత్తిక చూర్ణం ఒకటిరెండు చెంచాలు సేవిస్తే బావుంటుంది.  

కడుపు నొప్పి

కడుపునొప్పి ఉన్నాదా కడుపు నొప్పి... చెప్పండి నోరు విప్పి..... శూలము గుచ్చినట్టు సడన్ గా నొప్పి కలగటం వలన... శరీరాన్ని చీల్చినట్టు బాధ కలగటం వలన.. ఈ వ్యాధికి శూలవ్యాధి అనిపేరు వచ్చింది.  పొట్ట  పై భాగంలో నాభి ప్రాంతంలో, హ్రుదయము, పార్శ్వము వీపు వెన్నెముక కింది భాగము, కంఠము, పొత్తి కడుపు ప్రాంతంలో ఎక్కడైనా నొప్పి రావచ్చు. ఆహారం తినేటప్పుడు లేదా జీర్ణమయ్యే టప్పుడు కూడా నొప్పి రావచ్చు.  ఇలా వచ్చినప్పుడు తప్పనిసరిగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ముందు జాగ్రత్తలు:  పొట్లకాయలు, కాకరకాయలు, చక్రవర్తికూర, మునగకూర, ఉప్పు వెల్లుల్లి సంవత్సరము దాటిన పాతబియ్యం ఆముదము, గోమూత్రము, వేడినీరు, నిమ్మపండ్లరసము సేవించాలి. రాత్రుల యందు నిద్రమేల్కొనుట, చేదురసం గల పదార్ధములు శీతల పదార్ధములు, వ్యాయామము, సంభోగము మద్యపానము, పప్పుదినుసులు, కారము గల పదార్ధములు తీసుకోకూడదు. దు:ఖము,కోపము, ఆవలింత, నవ్వు ఆకలి అపాన వాయువు, తుమ్ము లాంటివి నిరోధించాలి. మందుజాగ్రత్తలు:   ఆవు సంచితంలో కరక్కాయను ఉడికించి ఎండించి చూర్ణించి దాంట్లో బెల్లం, లోహభస్మం కలిపి సేవిస్తే కడుపులో మంటతో కూడిన నొప్పి వెంటనే తగ్గుతుంది. మజ్జిగలో భాస్కరలవణము, అజామోదార్కము, శంఖవటి అను ఔషధాలు బాగా పనిచేస్తాయి. హింగుత్రిగుణ తైలం ఒకటి రెండు చంచాలు వేడి నీరు గానీ లేదా పాలతో సేవిస్తే కడుపుబ్బరం, నొప్పి తగ్గి సుఖవిరేచనం అవుతుంది. ఇంటికి చూసుకొనేది వీధి శూల... ఒంటికి చూసుకొనేది వ్యాధి శూల...

కడుపులో పుండు  

     మనం తినే ఆహారం జీర్ణమయ్యే సమయంలో కుక్షి, జఠరం, నాభి, పొత్తికడుపు, స్తనమధ్య  ప్రదేశం, నడుము, పక్కటెముకలందు నొప్పి వస్తుంది. దీనినే పరిణామ శూల కడుపులో పుండు అని అంటారు.  ఇది భుజించిన వెంటనే వాంతి చేసుకున్నాప్పుడు ఆహారమంతా జీర్ణమైనప్పుడు వస్తుంది. వరి అన్నం ఎక్కువ తిన్నప్పుడు వస్తుంది. ముందు జాగ్రత్తలు:    ఇలా వచ్చినప్పుడు తీసుకోవలసిన ముందు జాగ్రత్తలు ఏమిటంటే.... మినుములు లాంటి పప్పు ధాన్యాలు, మద్యములు, స్త్రీ సంభోగాలు, శీతల పదార్ధాలు ఎండతిరుగుడు, నిద్రలో మేల్కొని కాలక్షేపం చేయటం, కోపము, దుఃఖము, ఆమ్ల పదార్ధసేవనం, అజీర్ణపదార్ధములు నువ్వులు లాంటివన్నీ నిషిద్దములు.  పొట్లకాయలు, కాకరకాయలు, చక్రవర్తి కూర, మునగకూర, ఉప్పు, వెల్లుల్లి, సంవత్సరం దాటిన పాత బియ్యం, ఆముదం, గోమూత్రం, వేడి నీరు, నిమ్మపండురసం, క్షార చూర్ణము వంటివి పధ్యములు. మందుజాగ్రత్తలు:  శొంఠి, నువ్వులు, బెల్లము తీసుకొని కలిపి ముద్దగా నూరి పాలలో కలిపి సేవిస్తే ఏడురోజులలో పరిణామాలశూల శమిస్తుంది. పిప్పళ్ళ చూర్ణానికి మండూర భస్మ, తేనె కలిపి సేవిస్తే కడుపులో పుండు వెంటనే తగ్గుతుంది. పిప్పళ్ళచూర్ణం, కరకవలపు చూర్ణం, లోహభస్మమును సమభాగాలు గా కలిపి తేనె నేతులలో సేవిస్తే తీవ్ర పరిణామశూల వెంటనే శమిస్తుంది. భోజనమైన తరువాత ధాత్రీలోహము, సూతశేఖర రసము సేవిస్తే సత్ఫలితాలు లభిస్తాయి.... ఇదే కనక అమలుచేస్తే... కడుపులో పుండు...ఇక్కడితో ఎండు...  

కడుపు మంట

కడుపుమంట అనేది వచ్చేది... ఎదుటివాడు తింటుంటే చూసి మనం తినట్లేదని కాదు.. మనం తిన్న అన్నము జీర్ణము కాకపోయినా....త్రేన్పులు వచ్చినా...మంట, దద్దుర్లు, తలనొప్పి వాంతి విరేచనాలు వచ్చేయంటే వస్తుంది కడుపుమంట.... దీనినే అమ్లపిత్త వ్యాధి అంటారు. ఇలా కడుపుమంట వ్యాధి వస్తే తీసుకోవలసిన..ముందుజాగ్రత్తలు:   యవలు,గోధుమలు, పెసలు,పాతవైన ఎర్రవడ్లు కాచి చల్లార్చిన నీరు, చక్కెర,తేనె, పేలపిండి,దోసకాయలు, కాకరకాయలు, అరటిపువ్వు, చక్రవర్తి కూర, పేము ఇగుళ్లు, బాగాపండిన గుమ్మడిపండు, పొట్లకాయలు, దానిమ్మ పండు కఫపిత్త హరములగు అన్నపానములు అన్నీ కడుపుమంట రోగులకు హితకరమైనవి. వాంతిని నిరోధించాలి. నువ్వులు, మినుములు, ఉలవలు నువ్వులతో చేసిన పిండివంటలు, గొర్రెపాలు, పుల్లగంజి, లవణామ్ల రసములు గల పదార్ధములు గురుత్వము చేయు ఆహార పదార్ధములు, పెరుగు, మద్యము వంటివి కడుపుమంట రోగులు తప్పని సరిగా విసర్జించాలి.  మందుజాగ్రత్తలు: అతిమధురం, ఎండుద్రాక్ష, గింజతీసిన కరక్కాయ  సమాన భాగాలుగా చేసి చక్కెర కలిపి నూరి ముద్దచేసి లోనికి సేవిస్తే కడుపుమంట తగ్గుతుంది. పిప్పళ్ళను చూర్ణముచేసి 1 నుండి 2 గ్రాములు తేనెలో సేవిస్తే ఆమ్లపిత్త లక్షణాలు శమిస్తాయి. నేలవేము, వేపపట్టల కషాయం తేనెలో సేవిస్తే వాంతి,మంట అను లక్షణాలు శమిస్తాయి. సూతరేఖ రసము, సుదర్శన చూర్ణము, అవిపత్తికర చూర్ణము, పంచతిక్తకషాయము, కూష్మాండలేహ్యము అను యోగాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. పిల్లి పీచర రసాన్ని తేనె లేదా చక్కెర కలిపి సేవిస్తే ఆమ్ల పిత్త వ్యాధి శమిస్తుంది. ఇవండీ కడుపుమంటకు తీసుకోవలసిన ముందు జాగ్రత్తలు, మందు జాగ్రత్తలు.

అజీర్ణం...అగ్నిమాంద్యం.. 

    పిల్లలకి అన్నం పెట్టినప్పుడల్లా....పెద్దలు జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అంటూ భోజనం పెడతారు. తిన్నది జీర్ణం అయితేనే మనం ఆరోగ్యవంతంగాను ఆనందకరంగాను ఉంటాము. మనము మితముగా భుజిస్తే ఆహారం బాగా జీర్ణం అవుతుంది. భుజించినది వెంటనే జీర్ణమైపోయి మళ్ళీ ఆకలివేసి దప్పిక,తాపము, భ్రమవంటి లక్షణాలు కలిగితే దానిని భస్మకాగ్ని అంటారు. ఈర్ష్య,భయము, క్రోధము, శోకము,లోభము, దీనత్వము, ద్వేషము వంటివుండగా వాటిని భుజించినా అన్నం సరిగా జీర్ణం కాదని ఆయుర్వేద శాస్త్రం ఎప్పుడో చెప్పింది. మానసిక కారణాల వల్ల మితంగా భుజించిన పధ్యకరమైన ఆహారం కూడా జీర్ణము కాదు.  బడలిక, శరీరము బరువు గా ఉండుట, శరీరము స్తంభించుట, తల తిరుగుట, అపానవాతము వెడలకుండుట, మలము బంధించుట లేదా అధికముగా వెడలుట అనే లక్షణాలు అజీర్ణ వ్యాధిలో కలుగుతాయి..నోట నీరూరుట, పులి త్రేన్పులు వచ్చుట, చెమట పట్టుట, కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం,  ఒళ్ళు నొప్పులు కలుగుతాయి. త్రేన్పులు, పులిత్రేన్పులు, కడుపునొప్పి,విరేచనాలు లాంటివన్నీ వస్తాయి.    ఇలా వచ్చిన వారు తీసుకోవలసిన ముందు జాగ్రత్తలు:   విలంబిక, అలసకము, దండాలసకము వ్యాధులయందు, ఆముదపాకు కాడలు మొదలైన నాళములతో గానీ ఫలవర్తులతో గానీ రేచనమును, వమనౌషధములతో వమనమును కూడా చేయించుట హితకరము. ఫలవర్తి, వమనము, స్వేదనము, ఉపవాసము,లఘు ఆహార సేవనము ఇవి ముఖ్యముగా అలసక వ్యాధియందు హితమైనవి. అగ్నిమాంద్యమునందు, అజీర్ణమునందు విరుద్ధాహార సేవనము అలవాటు లేని అన్నప్రాసనములు, గురుత్వమును, మలబంధమును చేయు పదార్ధములను వదిలేయాలి. మందుజాగ్రత్తలు: పగలు భోజనం చేసేముందు నిద్రపోతే సర్వాజీర్ణాలు నశిస్తాయి. కరక్కాయ వలుపును ముదములో వేయించిన ఆముదమును త్రాగవలను. దీనిలో నొప్పి మలబంధముతో కూడిన సమస్త వ్యాధులు శమిస్తాయి. ఒక చెంచాడు హింగ్వష్టక చూర్ణమును భోజన సమయములో మొదటతినే ముద్దలో నేతితో కలిపి సేవిస్తే అజీర్ణ వ్యాధి రాదు. భాస్కరలవణము కూడా అత్యంత అద్భుతంగా పనిచేస్తుంది. అజీర్ణం వలన విరేచనాలు అవుతుంటే కనక సంజీవనీవటి లేదా శంఖవటిలను వాడుకోవాలి. లవంగాలు, కరడవలుపు వీని కషాయమందు సైంధవ లవణము కలిపి సేవిస్తే అజీర్ణము నశించి  విరేచనమగును.  అజీర్ణంలో విరేచనాలు, వాంతులు ఎక్కువగా అవటంవల్ల దప్పిక కనక వస్తే లవంగ కషాయం గానీ, జాజికాయ కషాయం గానీ తుంగముస్తల కషాయం గానీ కాచి చల్లార్చి తాగిస్తే వెంటనే రోగవిముక్తి లభిస్తుంది. ఏ రోగం ఎందుకొస్తుంది....దానికి తీసుకోవలసిన ముందుజాగ్రత్తలు మందుజాగ్రత్తలు తెలుసుకున్నారు కద... మీకు తెలిసిన వారందరినీ కూడా తెలుసుకోమనండి.

ఆహారంలో దాగి ఉన్న ఖనిజ లవణాలు

  మనం తినే ఆహారంలోనే మన శరీరానికి కావలసిన అన్ని పోషక పదార్థాలు,ఖనిజ లవణాలు ఉంటాయి. అయితే ఏ ఆహారం తింటే ఎలాంటి లాభాలు ఉన్నాయి వాటిలో ఎలాంటి ఖనిజ లవణాలు దాగి ఉన్నాయి తెలుసుకోవటం ఎంతో  అవసరం.   ఐరన్: ఇది మన బాడికి ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రక్తం వృద్ధిచెందడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ ఇనుముని మనం గోధుమ, సజ్జలు, రాగులు, వేయించిన పల్లీలు, తోటకూరలలో ఎక్కువ మోతాదులో సంగ్రహించుకోవచ్చు పప్పుదినుసులు, జీడిపప్పులో కాస్త తక్కువ మోతాదులో ఉంటుంది ఈ ఇనుము. కాల్షియం: ఎముకలు బలంగా పెరగటానికి పళ్ళ సంరక్షణకి నరాలు చురుగ్గా పనిచేయటానికి కాల్షియం ఎంతగానో ఉపకరిస్తుంది. బాదంపప్పు, క్యాబేజీ, చీజ్, పాల ఉత్పత్తులు,ఓట్స్, సోయాబీన్స్ వంటి వాటిని తీసుకుంటే కాల్షియం సమృద్ధిగా లభిస్తుంది.   అయోడిన్: థైరాయిడ్ గ్రంథిని నియంత్రణలో ఉంచే గుణం అయోడిన్ లో పుష్కలంగా ఉంది. అయోడిన్ లోపం ఉంటె పిల్లల్లో పెరుగుదల లోపిస్తుంది. అయోడైస్డ్ చేసిన ఉప్పు, వెల్లుల్లి, మష్రూమ్స్, సముద్ర ఆహారంలో మనకు అయోడిన్ ఎక్కువ మోతాదులో  దొరుకుతుంది. విటమిన్ ఎ, సి: రోగనిరోధక శక్తిని పెంచే ఈ విటమిన్లు అధికంగా నెయ్యి, వెన్న, తియ్యని పాలు, గ్రుద్దులోని పచ్చసోన, పెరుగు ద్వారా దొరుకుతాయి. బొప్పాయి తోటకూర, మునగాకు, టమాట, క్యారెట్, పాలకూర వీటిలో విటమిన్ ఎ ఎక్కువగా లభిస్తే ఉసిరి, జామ, ఏపిల్, నిమ్మ వీటిలో విటమిన్ సి చక్కగా లభిస్తాయి. జింక్: ఈ జింకు ఆవాలు, రాజ్మా, బాదం, ఎండుకొబ్బరి, పొట్టుతో ఉన్న శనగలు, చిక్కుడు గింజలు మొదలైన వాటిలో తగిన మోతాదులో  ఉంటుంది. శరీర పోషణకి అన్ని ఖనిజలవణాలు సమపాళ్ళల్లో ఉండాలి. ఒకటి తక్కువైనా ముప్పే, ఒకటి ఎక్కువైనా ముప్పే.    - కళ్యాణి

నొప్పి తగ్గిపోయేందుకు 7 చిట్కాలు...!

      నొప్పి లేనిదే జీవితం లేదు. కాలిగోరు లేవడం దగ్గర నుంచీ, చెవిపోటు వరకూ నొప్పికి ఏదైనా కారణం కావచ్చు. భరించలేని నొప్పి కలిగినప్పుడూ, నొప్పితో పాటు జ్వరంలాంటి సమస్యలు ఉన్నప్పుడు వైద్యుని కలవాల్సిందే! కానీ నొప్పిని భరించక తప్పదని అనుకునే సమయాలలో కొన్ని చిట్కాలు పాటిస్తే ఉపయోగం ఉంటుందంటున్నారు. ఊపిరి నిదానం - ఒంట్లో నొప్పిగా ఉన్నప్పుడు శ్వాసతో దానిని అదుపుచేసుకోవచ్చు. నిదానంగా, దీర్ఘంగా ఊపిరి పీల్చుకోవడం వల్ల మనసు తేలికబడుతుంది. శరీరానికి కూడా తగినంత ఆక్సిజన్‌ అందుతుంది. నొప్పి తగ్గడంలో ఈ రెండు చర్యలూ ఉపయోగపడేవే! నీరు తాగండి - ఒంట్లో తగినంత నీరు లేకపోతే నానారకాల సమస్యలు ఎలాగూ వస్తాయి. అప్పటికే ఉన్న సమస్యలు కూడా మరింత చికాకుపెడతాయి. ముఖ్యంగా తలనొప్పి, కండరాల నొప్పులు వంటి ఇబ్బందులు ఉన్నప్పుడు నీరే ఔషధంలా పనిచేస్తుంది.   ఆకుకూరలు - ఆకుకూరలు తినడానికీ నొప్పి తగ్గడానికీ మధ్య అవినాభావ సంబంధం ఉంది. ఆకుకూరలు, సోయాబీన్స్, చేపలు వంటి ఆహారంలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి నొప్పి సత్వరం తగ్గడానికి ఉపయోగపడతాయి.   పసుపు – పసుపు ఒక నొప్పి మాత్రతో సమానమన్నది వైద్యుల మాట. పసుపులో ఉండే curcumin అనే రసాయనానికి ఒంట్లో వాపుని తగ్గించే సత్తా ఉందట. అందుకే టీలో కానీ, గోరువెచ్చటి నీటిలో కానీ చిటికెడు పసుపుని కలిపి పుచ్చుకుంటే నొప్పి, వాపులు తగ్గుతాయని సూచిస్తున్నారు. పైగా నొప్పి మాత్రలలాగా పసుపు లివర్‌, కిడ్నీలను దెబ్బతీయదు కూడా! చేతులు కట్టుకోండి – వినడానికి కాస్త విచిత్రంగా ఉన్నా ఈ చిట్కా పనిచేస్తుందనే చెబుతున్నారు. వేళ్ల దగ్గర నుంచీ భుజాల వరకూ ఎక్కడన్నా నొప్పి ఉన్నప్పుడు... కాసేపు చేతులు కట్టుకొని కూర్చుంటే ఉపశమనం లభిస్తుందని అంటున్నారు.   మనసుని మళ్లించండి – శరీరంలో ఫలానా చోటు గాయపడిందని మెదడుకి సూచంచడమే నొప్పంటే! అందుకని మనసుని కాస్త మళ్లిస్తే నొప్పి మీద ధ్యాస కూడా తగ్గుతుంది. కళ్లు మూసుకుని ధ్యానం చేయడం, ప్రకృతిని ఊహించుకోవడం, సంగీతం వినడం.... లాంటి సవాలక్ష చిట్కాలతో మనసుని మళ్లించవచ్చు.   విశ్రాంతిగా ఉండండి – విశ్రాంతి తీసుకుంటే నొప్పి సగానికి సగం తగ్గిపోతుంది. శరీరం సుఖంగా, అనువుగా ఉండే భంగిమలో కాసేపు విశ్రాంతి తీసుకునే ప్రయత్నం చేయండి. ఎలాంటి వెలుతురూ, శబ్దాలూ లేని ప్రదేశంలో విశ్రమించండి.   వీటితో పాటుగా వేడినీటితో స్నానం చేయడం, నొప్పి ఉన్న చోట కాస్త కాపడం పెట్టడం లాంటి సవాలక్ష ఉపాయాలు ఉండనే ఉన్నాయి. - నిర్జర.

చెరుకురసం తాగితే బరువు తగ్గుతారా!

ఎండాకాలం వస్తోందంటే చాలు... ఎలా దాహం తీర్చుకోవాలా అని శరీరం తపనపడిపోతుంది. అందుకోసం కూల్డ్రింక్స్ తాగుదామంటే.... అవి మన దాహాన్ని పూర్తిగా తీర్చకపోగా లేనిపోని సమస్యలని తెచ్చిపెడుతుంటాయి. వాటి బదులు కాస్త చెరుకురసాన్ని గుటకవేశామంటే దాహం ఎలాగూ తీరుతుంది, దాంతో పాటు కావల్సినంత ఆరోగ్యమూ దక్కుతుంది. ఎలాగంటారా...   బరువు తగ్గి తీరతారు:- చెరుకురసంలో కొవ్వు పదార్థాలు కొంచెం కూడా ఉండవు. పైగా ఇందులో ఉండే సహజమైన చక్కెరల వల్ల మన ఒంట్లోని చెడు కొలెస్టరాల్ తగ్గుతుంది. వీటికి తోడు చెరుకురసంలో ఉండే పీచు పదార్థాలు ఒంట్లోని మలినాలను తొలగించడంలో తోడ్పడతాయి.   షుగర్ వ్యాధిగ్రస్తులకూ మంచిదే :- షుగర్ వ్యాధి ఉన్నవారు, వస్తుందని భయపడేవారు కాస్త మోతాదులో చెరుకురసాన్ని పుచ్చుకోవచ్చునట! చెరుకురసంలోని glycemic index చాలా తక్కువ. అంటే ఇందులో ఉండే చక్కెర పదార్థాలు మన శరీరానికి ఒక్కసారిగా కాకుండా.... నిదానంగా శక్తిని అందిస్తూ ఉంటాయన్నమాట.   పళ్లకి మంచిది:- తీపి పదార్థాలు తినడం వల్ల పళ్లు పాడైపోతాయని చెబుతూ ఉంటారు. చెరుకురసం ఇందుకు మినహాయింపుగా నిలుస్తుంది. చెరుకురసంలో కాల్షియం, ఫాస్పరస్ ఉండటం వల్ల పళ్ల ఎనామిల్కు మరింత గట్టిదనం ఏర్పుడుతుంది. పైగా చెరుకురసంతో నోటి దుర్వాసన కూడా తగ్గుతుందట!   మెరిసే చర్మం కోసం :- చెరుకురసంలో Alpha Hydroxy Acids అనే పదార్థాలు ఉంటాయట. వీటి వల్ల చర్మం మృదువుగా, యవ్వనంగా కనిపిస్తుందన్నది నిపుణుల మాట. అంతేనా! చర్మంలో తేమ ఉండాలన్నా, మొటిమలు సమస్య తీరాలన్నా కూడా చెరుకురసం దివ్యౌషధంగా పనిచేస్తుందట.   జీర్ణశక్తి కోసం :- చెరుకురసంలో పొటాషియం శాతం ఎక్కువగా ఉంటుంది. ఆహారం త్వరగా జీర్ణమయ్యేందుకు, మలబద్ధకం వంటి సమస్యలు తీరిపోయేందుకు ఈ పొటాషియం దోహదపడుతుంది. చెరుకురసంలో ఆమ్లగుణం ఉండటం వల్ల ఒంట్లో జీర్ణరసాలు కూడా ఎక్కువగా స్రవించి... ఆహారం తేలికగా జీర్ణమవుతుంది.   క్యాన్సర్ను సైతం :- చెరుకురసంలో ఆమ్లగుణం ఎక్కువని చెప్పున్నాం కదా! దీంతో పాటుగా ఇనుము, కాల్షియం, పొటాషియం, సోడియం వంటి ఖనిజాలు ఉన్నాయి. ఈ కారణంగా శరీరంలో క్యాన్సర్ కణాలు మనుగడ సాగించలేవంటున్నారు నిపుణులు.   రక్తపోటుకీ ఉపయోగమే :- రక్తపోటు ఉన్నవారి శరీరంలో సోడియం నిల్వలను నియంత్రించడం చాలా అవసరం. చెరుకుసరంలోని అధిక పొటాషియం ఈ పని చేసిపెడుతుంది. ఈ పొటాషియం వల్ల ఒంట్లో అవసరానికి మించి ఉన్న సోడియం అంతా మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతుంది. - నిర్జర.  

ఆ సమయంలో అల్లం తింటే ఇక అంతే!

  అల్లం టీ... అల్లం పెసరట్టు... అల్లం చట్నీ... ఏదో ఒక రూపంలో అల్లాన్ని ఇష్టంగా తీసుకుంటూ ఉంటాం. తీసుకోవడం ఎంతో మంచిది కూడా. ఎందుకంటే అల్లం ఆహార పదార్థాలకు ఎంత రుచినిస్తుందో... అందులో ఉండే పోషక విలువలు ఆరోగ్యానికి అంతకు ఎన్నో రెట్లు మేలు చేస్తాయి. దీనిలో అత్యధిక మోతాదులో ఉండే ఎంజైమ్స్... జీర్ణశక్తిని మెరుగుపర్చడమే కాక, శరీరంలోని మలినాలను తొలగిపోయేలా చేస్తాయి. అందుకే అల్లాన్ని ప్రపంచంలోనే అత్యంత ఉత్తమమైన, ఉపయోగకరమైన దినుసుగా పరిగణిస్తుంటారు. అయితే అంత మంచిదైన అల్లం కూడా కొన్ని సమయాల్లో చేటు చేస్తుంది అంటున్నారు నిపుణులు.   అల్లం రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. అందువల్లే ఒబెసిటీ, షుగర్ వ్యాధిగ్రస్తులకు... కొన్ని రకాల నాడీపరమైన సమస్యలకు ఇది మంచి మందులా పని చేస్తుంది. అయితే హెమోఫిలియా ఉన్నవాళ్లు మాత్రం దీన్ని తీసుకోకూడదు. ఎందుకంటే ఈ వ్యాధి ఉన్నవాళ్ల రక్తం గడ్డకట్టదు. దాంతో చిన్నపాటి గాయం కూడా తీవ్ర రక్తస్రావానికి దారితీసి ప్రాణహాని సైతం సంభవిస్తుంది. కాబట్టి ఈ సమస్య ఉన్నవాళ్లు అల్లం తీసుకుంటే సమస్య మరింత తీవ్రమై పరిస్థితి చేజారే ప్రమాదం ఉంటుంది.   అలాగే బీపీ, షుగర్ లకు ఎక్కువ మోతాదులో మందులు తీసుకునేవాళ్లు కూడా అల్లం తీసుకోకపోవడం మంచిది. ముఖ్యంగా అల్లం రక్తపోటుని తగ్గిస్తుంది. దానివల్ల ఆయా మందులు పని చేయకపోవచ్చు. అదే విధంగా బరువు పెరగాలనుకునేవారు కూడా అల్లానికి కాస్త దూరంగానే ఉండాలి. కారణం... అందులో ఉండే పీచు పదార్థాలు జీర్ణశక్తిని మెరుగుపర్చి, కొవ్వుని కరిగిపోయేలా చేస్తాయి. అదే జరిగితే అసలే బరువు తక్కువ ఉన్నవాళ్లు మరింత తగ్గిపోతారు. అదే బరువు తక్కువ ఉన్న మహిళల్లో అయితే నెలసరి సమస్యలు కూడా వస్తాయి.   గర్భవతులు కూడా అల్లానికి కాస్త దూరంగా ఉండటమే మంచిది. ఎందుకంటే అల్లానికి కండరాలను బలపర్చి, వాటిని యాక్టివ్ చేసే లక్షణం ఉంది. దాంతో నెలలు నిండుతున్న సమయంలో తీసుకుంటే త్వరగా కాన్పు అయిపోవచ్చు. అందుకే వేవిళ్ల సమయంలో తప్ప గర్భవతులు అల్లం ఎక్కువ తీసుకోకూడదు.   చూశారు కదా! తీసుకోకూడని సమయంలో తీసుకుంటే మేలు చేసేవే కీడు చేస్తాయి. కాబట్టి పై సమస్యలు ఉన్నవాళ్లు అల్లం మీద ప్రీతిని కాస్త తగ్గించుకోవడమే మంచిది. అంతకీ అవసరం అనుకుంటే... ప్రముఖ న్యూట్రిషనిస్ట్ మిల్కా రైసెవిక్ చెప్పినట్టు అల్లం బదులు మిరియాలు తీసుకోండి. బ్యాలెన్స్ అయిపోతుంది. - Nirjara

Milk or Dairy is Not the only Source of Calcium

  This list is extremely long, here is a very small list of non dairy sources of calcium, many of them provide a healthier source and even more of it. It’s important to do your research, there are so many foods out there that contain a healthy and abundant source of calcium. So come out of myth how will I get my calcium if I don't consume milk products.   Kale: One cup of raw kale is loaded with calcium, approximately 90 mg to be exact. This means that a 3.5 cup of kale salad provides more calcium than a one cup class of milk Oranges: One Naval Orange contains approximately 60 mg of calcium - Beans/Soy beans - Green Peas - Chickpeas - Quinoa / Korra millet - Seeds / Almonds / Dried Figs - Hemp - Spinach   In continuation of earlier post on facts about milk read below studies as well:   In a paper published in the Journal of the American Medical Association Pediatrics, Harvard pediatrician David Ludwig emphasizes that bone fracture rates tend to be lower in countries that do not consume milk. compared to those that do, also noting that there are many other sources of calcium. Another study published in the American Journal of Public Health showed that dairy consumption might actually increase the risk of fractures by 50 percent. Studies have also shown that calcium isn’t as bone protective as we thought. Multiple studies on calcium supplementation have shown no benefit in reducing bone fracture risk. In fact, vitamin D appears to be more effective when it comes to reducing bone fracture risk. Studies have also shown that dairy products might increase males risk of developing prostate cancer by 30-50 percent. It is also interesting to note that approximately 65 to 75 percent of the total human population on our planet have a reduced ability to digest lactose after infancy. In some countries, over 90 percent of the adult population is lactose intolerant, think about that for a moment.  

ఇలాంటి డాక్టర్లు ఉంటే ఎంత బాగుండో!

  వైద్యమూ, వ్యాపారమూ ఇప్పుడు కలగాపులగం అయిపోయాయి. ఇందుకోసం మనం ప్రత్యేకించిన అధ్యయనాలు చేయనవసరం లేదు. వైద్యం మునుపటిలా నిస్వార్థంగా లేదన్నది ప్రతి ఒక్కరి అనుభవమే! ఇలాంటి సమయంలో ఓ 91 ఏళ్ల డాక్టరు విలువల గురించి సమాజానికి ఓ సరికొత్త పాఠాన్ని చెబుతున్నారు.   మొదటి డాక్టర్ ఇప్పుడంటే ఆడపిల్లల చదువు గురించి ప్రత్యేకించి పోరాడాల్సిన పని లేదు. కానీ స్వాతంత్రానికి ముందర ఈ పరిస్థితి ఎలా ఉండేదో చరిత్ర చెబుతూనే ఉంది. ఆడపిల్ల డిగ్రీ సాధించడమే గగనం అనుకునే అలాంటి పరిస్థితులలో భక్తి యాదవ్ అనే మహిళ ఏకంగా MBBS పట్టాని సాధించింది. ఇండోర్లోని MGM మెడికల్ కాలేజి నుంచి 1948లోనే ఈ ఘనతని అందుకుంది. అలా ఇండోర్లోని తొలి మహిళా వైద్యురాలిగా నిలిచింది.   పేదల కోసమే! వైద్య పట్టా చేతికి రాగానే ఎక్కడ ప్రాక్టీసు పెడదామా, ఎంత లాభపడదామా అనే ఆలోచనలు రావడం సహజం. కానీ ప్రభుత్వాసుపత్రిలో చేరమంటూ ఆహ్వానం వచ్చినా, భక్తి యాదవ్ తొందరపడలేదు. ఆ సమయంలో Nandlal Bhandari Mills అనే సంస్థ పేద మిల్లు కార్మికుల కోసం ఓ ప్రసూతి ఆసుపత్రిని నడిపేది. అందులో చేరిపోయారు భక్తి. 1978లో ఆ సంస్థ మూతబడిన తరువాత ‘వాత్సల్య’ పేరుతో ఒక ఆసుపత్రిని ప్రారంభించారు.   పైసా తీసుకోకుండా 1970లలో వైద్యం చాలా అరుదైన సౌకర్యంగా ఉండేది. అందులోనూ ప్రసూతి వైద్యం చేసే మహిళా డాకర్లు మరింత అరుదుగా ఉండేవారు. అలాంటి సమయంలో తన దగ్గరకు ఎలాంటి రోగులు వచ్చినా అక్కున చేర్చుకునేవారు భక్తి యాదవ్. రోగులు తమంతట తాముగా ఎంతోకొంత ఇస్తే తప్ప... ఇంత రుసుము చెల్లించాలి అని చేయి చాచిన సందర్భం ఎప్పుడూ లేదు. అలా వేలకొద్దీ గర్భిణీ స్త్రీలకు ఉచితంగానే పురుడు పోసారు. వాటిలో అధికశాతం నార్మల్ డెలివరీలే కావడం గమనార్హం.   విశ్రాంతి లేదు భక్తి యాదవ్‌ను ఇండోర్ వాసులు ప్రేమగా అమ్మ అని పిలుస్తారు. ఆమె హస్తవాసి గురించి విన్న రోగులు రాష్ట్ర సరిహద్దులు దాటుకుని మరి ఇండోర్‌కు చేరుకునేవారు. అలాంటివారిని చూస్తూ భక్తి యాదవ్ ఎలా విశ్రాంతిగా ఉండగలరు? అందుకే ఆరోగ్యం సహకరించకపోయినా, వయసు మీద పడినా కూడా తన నర్సింగ్‌ హోమ్‌కు చేరుకున్న రోగులని పరీక్షించేవారు. గైనకాలజీలో భక్తియాదవ్‌ది అపారమైన నైపుణ్యం. ఆమె చేతితోనే చేసే పరీక్షల ముందు ఆధునిక యంత్రాలు కూడా బలాదూర్ అన్నది రోగుల నమ్మకం.   సలహా కోసం ఏడాది క్రితం రోగులను పరీక్షిస్తుండగా, భక్తియాదవ్ కిందపడి గాయాలపాలయ్యారు. ప్రస్తుతం ఆమె పూర్తిస్థాయిలో రోగులను చూసే పరిస్థితిలో లేరు. నర్సింగ్ హోమ్ బాధ్యతలన్నీ వైద్యులైన ఆమె కొడుకు, కోడలే చూసుకుంటున్నారు. అయినా సరే! భక్తియాదవ్ సూచనల కోసమైనా జనం ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. సంతానం లేనివారు సైతం ఆమె అందించే సలహా కోసం పడిగాపులు కాస్తుంటారు.   ఇప్పటి వైద్యులని చూస్తే... తన సేవలతో కొందరి జీవితాలైనా సంతోషంగా ఉన్నాయన్న విషయం భక్తి యాదవ్కు తృప్తినిస్తుంది. భక్తి యాదవ్ సేవలను చూసి భారత ప్రభుత్వం సైతం పద్మశ్రీ పురస్కారాన్ని అందించింది. అయినా ఆమెలో ఏదో అసంతృప్తి. ఇప్పటి వైద్యులు యాంత్రికంగా మారిపోతున్నారన్న ఆవేదన. వైద్యం అంటే కేవలం శరీరాన్ని బాగుచేయడం కాదు, మనిషిలో తిరిగి తన పట్ల నమ్మకాన్ని పెంపొందించడం అన్నది భక్తియాదవ్ దృక్పథం. అందుకే తన దగ్గరకు వచ్చిన రోగులను ఆమె బంధువులా ఆదరించేవారు. వారి బాగు కోరుకునే ఆత్మీయురాలిగా మెలిగేవారు. అవసరం అనుకుంటే తన రోగులను చూసేందుకు, సైకిల్ తొక్కుకుంటూ ఎంత దూరమైనా వెళ్లేవారు. కానీ ఇప్పటి వైద్యులలో ఆడంబరం, స్వార్థం, ఉదాసీనత పెరిగిపోయాయన్నది డా॥ భక్తి యాదవ్ ఆవేదన. - నిర్జర.  

Banish puffy eyes..

    Partying, eating out late and working late in the nights has its own ill effects on the body and ends showing on the face and that too the eyes. Puffy eyes make you look like you have just got out of bed and it makes you look very sloppy at work or when you go out. Here are some great tips that will help you get over the puffiness and make you look better.   Tips to get rid of that puffiness! Water therapy: Drink plenty of water to get rid of that terrible hangover and puffiness. As alcohols dehydrates your body and robs you of your body the fluid content  , you could also cut down the alcohol quantity and if you cant do that either, eat a little before you drink to avoid binging. No coffee:  You might thing that a cup of steaming coffee will help you get over the nights hangover but on the contrary, Coffee also dehydrates the body, adding to your skin’s problems.So avoid coffee. Less salt intake:  Salt increases the tendency of your body to retain water, resulting in puffiness. Party snacks are normally laden with salt which when combined with the effect of alcohol, adds to the blotchiness on your skin.Either you cut down on the salty snacks or reduce the intake the next day. Relax your eyes:  For instant eye relief, place chilled green tea teabags on your eyes to rest them for some time. This is especially beneficial as they contain anti-inflammatory compounds known as EGCGs. You can also put some Tea bags in your freezer, if you know you are going to have a late night.  Cold water wash:  Splash your face with cold water. Not only will it cool down your burning eyes, it will help reduce the bloating of your face.You can do this once you get home before you crash and do the same the next day morning. Head up on a high pillow:  Before you go to bed, put in an extra pillow under your head. It will help reduce the accumulation of fluids under your eyes which give your eyes that baggy look. Massage the eyes:  Using circular motions, massage the eyes gently with the use your fingertips. Apart from reducing puffiness, this is also a great way to relax your eyes . Kitchen remedies:  Cool cucumber and raw potato are home remedies which work wonders for puffy eyes.  Just slice up the cucumber and place them on your eyes for about 10 minutes. As for the potatoes, grate them and place them in a cloth to make small pouches. Keep these pouches on your eyes for 15 minutes. The starch in the potato is known to have anti inflammatory properties which help to ease irritated eyes.  Cold milk on cotton swabs is also a quick and easy remedy. Put a spoon in the freezer and let it get really cold. Place it on you eyes the curve part and feel the cold spoon refresh the eyes. Cosmetics:  Try using creams with Vitamin K, E or aloe in them. Aloe Vera can work wonders on tired skin giving you that refreshed look in no time! And if that also doesn’t work you could use the instant serums available in the market to conceal the puffiness. When all fails and you still see the puffiness try giving your body what it really needs. Sleep !  If you have the luxury of sleeping for another day take the advantage and give your eyes the rest they deserve. Nothing rejuvenates your body like adequate sleep!