చలికాలం ఓ తలనొప్పి

  చలికాలం అంటే ఎవరికి ఇష్టం ఉండదు. హాయిగా కాస్త చల్లగాలికి అటూఇటూ తిరిగిరావాలనో... ఎటూ పోలేనంత చలి ఉంటే వెచ్చగా పడుకోవాలనో ఎవరికి మాత్రం తోచదు. కానీ చలికాలంతో పాటుగా వచ్చే అనారోగ్యాలు మనకి నిలకడ లేకుండా చేస్తాయి. జలుబు దగ్గర్నుంచీ పొడిబారిపోయే చర్మాల వరకూ రకరకాల సమస్యలు చిరాకు పెట్టేస్తాయి. వాటిలో ఒకటి తలనొప్పి...   ఎందుకు వస్తుంది విపరీతమైన చలిగాలిలో తిరిగినప్పుడు తలనొప్పి రావడం సహజమే! దీని స్పష్టమైన కారణాలు తెలియనప్పటికీ, మన మెదడులో ఉండే కొన్ని రక్తనాళాలు చలికి కుంచించుకుపోవడం వల్ల ఈ తలనొప్పి వస్తుందని ఊహిస్తున్నారు. చాలా సందర్భాలలో ఈ తలనొప్పి ఇలా వచ్చి అలా మాయమైపోతుంది. కానీ అప్పటికే జలుబు, జ్వరం వంటి సమస్యలు ఉన్నవారిలో ఇది రోజంతా వేధించే ప్రమాదం ఉంది. ఇక మైగ్రేన్, సైనస్ వంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు ఈ కాలంలో మరింత తరచుగా తలనొప్పి బారిన పడే అవకాశం ఉంటుంది.   జాగ్రత్తలు చలిగాలి బయట తిరగాల్సి వచ్చినప్పుడు తల, గొంతు భాగాలకు గాలి తగలకుండా ఏదన్నా చుట్టుకోవడం తొలి జాగ్రత్త. ఇదే కాకుండా ఈ కింది చర్యలు తీసుకోవడం వల్ల కూడా చలికాలపు తలనొప్పులను నివారించవచ్చు. - చలికాలపు తలనొప్పి వచ్చిన వెంటనే కాసేపు విశ్రాంతి తీసుకోవడం వల్ల చాలా సందర్భాలలో వెంటనే ఉపశమనం లభిస్తుంది. వెచ్చని గదిలో, ప్రశాంతమైన మనసుతో తీసుకునే విశ్రాంతితో తలనొప్పి చిటికెలో దూరం అవుతుంది. - చలికాలపు సూర్యరశ్మిలో తగినంత తీక్షణత ఉండదు. ఫలితంగా మన జీవగడియారంలో అనేక మార్పులు వస్తుంటాయి. దీని వలన మనం నిద్రపోయే వేళలలోనూ మార్పులు సహజం. ఇలా చలికాలంలో సరైన నిద్ర లేకపోయినా, అవసరానికి మించి నిద్రపోయినా తలనొప్పులు ఖాయమంటున్నారు. - సాధారణంగా చలికాలంలో తక్కువ దాహం వేస్తుంది. పైగా ఏదన్నా పనిలో పడితే ఆ కాస్త దాహాన్నీ మనం పట్టించుకోం. దీని వలన మెదడులో కనుక ఉండాల్సినంత నీటిశాతంలో ఏమాత్రం తక్కువైనా వెంటనే మెదడు హిస్టామిన్లు అనే రసాయనాన్ని విడుదల చేయడం ద్వారా మనకు తగిన హెచ్చరికలు పంపుతుంది. ఈ హిస్టామిన్ల వలన తలనొప్పి తథ్యం. కాబట్టి ఏ పనిలో ఉన్నా, ప్రయాణంలో ఉన్నా... చెంతనే ఒక నీళ్ల బాటిల్ ఉంచుకోవడం తప్పనిసరి! నీళ్లు పక్కనే ఉంటే దాహాన్ని విస్మరించం కదా! - చలికాలంలో ఆకలి కూడా పెద్దగా కలగదు. దాంతో సమయానికి ఆహారం తీసుకోవడంలో కూడా నిర్లక్ష్యంగా ఉంటాము. ఫలితంగా శరీరంలో చక్కెర స్థాయిలు పడిపోవడం వల్ల కూడా తలనొప్పి కలిగే ప్రమాదం ఉంటుంది. - సూర్యరశ్మిలో కాసేపు నిలబడటం వల్ల శరీరం కాస్త వెచ్చదనాన్ని పొందుతుంది. పైగా సూర్యరశ్మి నుంచి లభించే డి విటమిన్లో ఎలాంటి లోటు రాదు. ఒకోసారి విటమిన్ డి శరీరానికి తగినంత లభించకపోవడం వల్ల కూడా తలనొప్పులు వస్తాయని తేలింది. రోజూ తగిన వ్యాయామం చేయడం, ఐస్ క్రీమ్ వంటి అతి చల్లటి పదార్థాలకు దూరంగా ఉండటం, చీటికీ మాటికీ మందులు వాడకపోవడం వంటి ఇతరత్రా జాగ్రత్తలు పాటించడం వల్ల కూడా చలికాలపు చిరుగాలులను ఎలాంటి తలనొప్పులూ లేకుండా హాయిగా ఆస్వాదించవచ్చు.   - నిర్జర.

Types of Olive Oil and its various uses

    Olive oil is oil that is pressed from olives, the fruits of the olive tree. The many variables that go into the production of olive oil yield dramatic differences in color, aroma, and flavor. And several names are used to differentiate all of these versions, here are a few of them:     Extra virgin olive oil is the highest quality of olive oil.Extra virgin olive oil is fairly nutritious. It contains modest amounts of Vitamins E and K and plenty of beneficial fatty acids. Extra virgin olive oil’s acidity level is less than 1 % and is rich in antioxidants. That’s what distinguish it from all the other oils and makes it the queen of oils. High heat cooking inhibits it of nutritional value, flavor and aroma. Extra virgin olive oil is best used in salads.     Virgin olive oil is slightly inferior to extra virgin olive oil. The main difference between the two oils is; virgin olive oil has an acidity level around 2.0%. Virgin olive is good for cooking purpose, mainly for sauté and baking and it can be used in salads as well.  Virgin olive oil is good for body and hair massage too.     Refined oil is treated to remove flaws from the oil, making it more usable. Refined olive oil is obtained by refining virgin olive oil. Refining virgin olive oil eliminates the acidity level. Refined olive oil is made for bulk consumption and is cheaper when compared to the rest of the olive oils. Refined olive oil is considered much inferior to the other varieties of olive oil and it does not have the characteristic flavor, taste or aroma of pure olive oil. Refined olive oil suitable for cooking purposes, but not for salads.       Pure olive oil is simple olive oil. It is a blend of refined olive oil and extra virgin olive oil. Pure olive oil has the acidity level around 2.0%, but it is very low in nutritional value in comparison to extra virgin olive oil. Pure olive oil is good for heavy duty cooking but it’s not suitable for salads, as it lacks in taste and aroma.   This is the main cooking grade oil variety. It is a light oil with neutral taste and flavour and is the most suitable oil for Indian cuisine as it does not change the flavour or taste of any preparation.This oil extracted from olive pomace carries none of the nutrition’s, taste and aroma of extra virgin olive oil. This olive pomace oil is then blended with virgin olive oil to impart some of the benefits of olive oil. Olive pomace oil is good for high heat cooking.     Extra Light Olive Oil is extra light in olive flavor, not in calories - all olive oil has the same calorie count and like Pure Olive Oil, it offers those healthy monounsaturated fats. Light olive oil is actually a very low grade of olive oil. It has the same amount of calories in it, but is low in nutrition’s, taste and aroma of olive oil.  Light or Lite olive oil is suitable for cooking or baking, where the fruity olive flavor would be objectionable. ..Divya  

ఆరోగ్యకర నూనెలు ఎంత వాడాలి?

  నూనె లేకుండా కూరలు, వినడానికి బాగానే వుంటాయి... తినడానికే కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అస్సలు నూనె లేకుండా ఎలా తినలేమో నూనె ఎక్కవయినా తినలేం. వంటలలో ఎంత నూనె వాడాలి అన్నదానికి ఇప్పటి వరకూ కచ్చితమైన కొలమానం ఏదీ లేదు. ఎవరి అలవాట్లను బట్టి వాళ్ళు కూరుల్లో నూనె వేస్తుంటారు. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు కారణంగా నూనె ఎంత తక్కువ వాడితే అంత మంచిది. ప్రధానంగా ఆహార తయారీలో వాడే నూనెలు మీ శరీరంలోని కొల్లెస్టరాల్ స్ధాయిలను నియంత్రించేవిగా ఉండాలి. అసలు పూర్తిగా కొవ్వు, నూనెలు లేని ఆహారాలు రుచి పచి లేకుండా అసంపూర్ణంగా ఉంటాయి. ఆరోగ్యకర నూనెలు, కొవ్వులు వాడేందుకు కొన్ని చిట్కాలు తెలుసుకోండి. https://www.youtube.com/watch?v=uKdp171Qksw    

PAIN - `KILLERS`

  We seem to know too much about the medicines now a day! We diagnose our health problems without any professional help and we even take medicines on our own. We experiment a lot with the pain killers that are available over the counter. But we often forget or don’t care to be vigilant of a lot of factors that are associated with the pain killers. The following might be a few of them…   The types: Pain killers (analgesics) that are available over the counter might be classified into three kinds. * Paracetamol. * Non steroidal anti-inflammatory drugs (NSAIDs) such as Aspirin and Ibuprofen. * Opioids such as Codeine. These three kinds of drugs work in three different ways. Paracetamol works as a general analgesic. It might be helpful in minor aches like headache. But in cases of inflammation like in the case of a sprain, NSAIDs work better than Paracetamol. Unlike Paracetamol, NSAIDs even work on specific nerves in the body that is the cause of pain. Opioids work on the brain to decrease the sensation of the pain. These are administered in case of severe pain. Apart from these there are `COX-2 inhibitors` that were derived from NSAIDs.       Risks of Self-medication:     * The drugs available over the counter might be a sort of combination.  For example Combiflam is a combination of `Ibuprofen and paracetamol`. We often forget that some of the ingredients in the tablet should be administered under professional advice. * Some analgesics might react with other daily medicines that we are taking in. * Some drugs might prove disastrous if we are suffering with ailments such as `gastrointestinal disorders`. * Some drugs like `Aspirin` might prove allergic to certain individuals. * When things don’t seem good… any drug can prove disastrous. Even the most common drug like paracetamol might prove injurious.   Precautions:   *  Prolonged usage of a pain killer is not desirable. Even a headache if persists for days together… should be diagnosed by a physician. * Over dosage of any drug might be harmful. Even Paracetamol which is considered to be the safest drug,  gets injurious to liver when taken in huge quantities. * Recurring pain might be a symptom of a long term ailment. They might even hint at a severe condition in our body. An expert should always be consulted in such cases. * Professionals would help us in finding a pain killer that suits our condition and health. They knew the drug to be administered as per the case. For example ` diclofenac` might suit better for the joint pain. It’s better to reveal them, our medicinal history; drugs we are using; allergies etc. so that they can pin point the best and safest drug for us. * Taking a pain killer should never be out of habit. Coping with pain is a natural process of our nervous system. Common ailments such as headache, stomach pain might get relieved within an hour. * Consuming pain killers… particularly those in the class of `Opioids` might be associated with guaranteed side effects. So it’s always a better choice to be aware of what you are taking in. - nirjara

వ్యాయామంతో ఎముకలు విరిగిపోతాయా!

వ్యాయామం వల్ల ఎముకలకి పెద్దగా లాభం ఏమీ ఉండదని ఇన్నాళ్లుగా ఓ అపోహ ఉంది. పైగా ఆస్టియోపొరోసిస్‌లాంటి వ్యాధులు ఉన్నవారు వ్యాయామాలు చేయడం వల్ల ఎముకల విరిగిపోయే ప్రమాదం ఉందన్న హెచ్చరికలూ వినిపిస్తుంటాయి. కానీ వ్యాయామంతో ఎముకలలో అసాధారణమైన మార్పులు చోటు చేసుకుంటున్నట్లు ఓ పరిశోధన నిరూపిస్తోంది. మన శరీరంలో bone marrow (మూలగ) పాత్ర అంతా ఇంతా కాదు. ఎముక ఎదగడానికీ, ఎర్ర రక్తకణాల ఉత్పత్తికీ, రోగనిరోధక శక్తికీ, హానికారక కణాలను నిర్మూలించడానికీ...  బోన్‌మేరోనే కీలకం. శరీరంలో మిగతా చోట్ల ఉన్నట్లుగానే ఈ బోన్‌మేరోలో కూడా కొవ్వు పేరుకుంటూ ఉంటుంది. అయితే ఈ కొవ్వు ఒక్కసారి పేరుకున్న తర్వాత కరగడం అసాధ్యమనీ, ఎవరెంత వ్యాయామం చేసినా దీని మీద పెద్దగా ప్రయోజనం ఉండదని... ఇన్నాళ్లూ భావించేవారు. బోన్‌మేరో మీద వ్యాయామం ప్రభావం తెలుసుకునేందుకు కాలిఫోర్నియాలోని శాస్త్రవేత్తలు ఓ పరిశోధన చేపట్టారు. దీని కోసం కొన్ని ఎలుకలకి, పుట్టిన నెల రోజుల దగ్గర్నుంచే విపరీతంగా కొవ్వు పదార్థాలని పెట్టడం మొదలుపెట్టారు. దీంతో కొన్నాళ్లకి వాటి బోన్‌మేరో కూడా కొవ్వుతో నిండిపోయింది. ఆ తర్వాత వీటి బోనులో ఓ రన్నింగ్‌ వీల్ ఉంచారు. ఈ రన్నింగ్‌ వీల్‌ మీద తిరగడం అంటే ఎలుకలకి మహా సరదా పడతాయట. సరదా సంగతి పక్కన పెడితే వాటికి మంచి వ్యాయామంగా కూడా ఉంటుంది. ఇలా ఆరు వారాలు గడిచిన తర్వాత TMRI అనే ఆధునిక పరికరం ద్వారా వీటి బోన్‌మేరోని గమనించిన పరిశోధకులు ఆశ్చర్యపోయారు. వ్యాయామంతో, ఎలుకల బోన్‌మేరోలోని కొవ్వు కణాల సంఖ్య సగానికి సగం తగ్గిపోయాయి. అంతేకాదు! వాటి ఎముకలు మరింత దృఢపడినట్లు తేలింది. బోన్‌మేరోలో పేరుకునే కొవ్వు, ఎముకల పనితీరు మీద ప్రభావం చూపుతుంది. ఇలాంటి ఎముకలు త్వరగా విరిగిపోయే ప్రమాదం కూడా ఉంది. ఇక ఒంట్లో డయాబెటిస్, ఆర్థయిటిస్‌ వంటి సమస్యలు ఉంటే ఎముకలు మరింత సున్నితంగా మారిపోతాయి. ఎముకలు ఎప్పుడైతే సున్నితంగా ఉన్నాయన్న భయం మొదలైందో అసలు వ్యాయామం జోలికే పోకుండా ఉండిపోతుంటారు. కానీ ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే.... వ్యాయామం చేస్తూ ఉంటే, ఎముకలు కోలుకుని బలపడేందుకే ఎక్కువ అవకాశం ఉందని చెబుతున్నారు. కాకపోతే ఎలాంటి వ్యాయామాలు చేయాలో ఒక్కసారి వైద్యుని సంప్రదిస్తే సరి. అంతేకానీ ఊబయాకమో, కీళ్లవ్యాధో ఉంది కదా అని స్తబ్దుగా ఉండిపోతే... మరిన్ని సమస్యలు తప్పవు.   - నిర్జర.

పెద్దవారిలో గాయలు ఎందుకు మానవు?

వయసు గడిచేకొద్దీ మనలో శక్తి కూడా తగ్గిపోతుందన్న విషయం కొత్తగా చెప్పక్కర్లేదు. అది అందరి అనుభంలోనూ గమనించే వాస్తవమే! కానీ ముసలివారికి ఏదన్నా దెబ్బ తగిలినప్పుడు, అది అంత త్వరగా ఎందుకు మానదు? దీని వెనుక ఏదన్నా కారణం ఉందా? ఉంటే ఆ లోపాన్ని సవరించే అవకాశం ఉందా?... ఇలాంటి ఆలోచనలే వచ్చాయి రాక్‌ఫెల్లర్‌ విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు పరిశోధకులకు. ఫలితం! మున్ముందు వృద్ధులకు చేసే చికిత్సలో సమూలమైన మార్పులు తేగల ఒక విషయాన్ని కనుగొన్నారు.   ఇప్పటివరకూ వృద్ధులలో గాయాలు త్వరగా మానకపోవడానికి కారణం వారిలో షుగర్‌ వంటి వ్యాధులో, రోగనిరోధకశక్తిలో మార్పులో అనుకునేవారు. ఇందులో వాస్తవాన్ని గ్రహించేందుకు పరిశోధకులు రెండు నెలల నుంచి రెండేళ్ల వయసున్న ఎలుకలలో గాయం మానే తీరు గమనించారు. ఈ వయసు మనలో 20 ఏళ్ల నుంచి 70 ఏళ్ల వయసుతో సమానం అన్నమాట. వీటికి ఏదన్నా గాయం అయినప్పుడు అక్కడి చర్మంలో జరుగుతున్న పరిణామాలను గమనించారు. సాధారణంగా గాయం అయిన మరుసటి సెకను నుంచే మన శరీరం దానిని బాగుచేసుకునేందుకు తగిన చర్యలను చేపడుతుంది.   చర్మానికి ఏదన్నా గాయం అయినప్పుడు ఆ చర్మం అడుగుభాగంలో ‘కెరటినోసైట్స్‌’ (keratinocytes) అనే కణాలు చేరుకుని కొత్త చర్మం ఏర్పడేందుకు సహకరిస్తాయట. ఈ కెరటినోసైట్స్ గాయం ఏర్పడిన భాగంలోకి చేరుకోగానే, స్కింట్స్ (Skints) అనే ప్రొటీన్లను ఉత్పత్తి చేస్తాయి. ఈ స్కింట్స్ వెంటనే అక్కడి రోగనిరోధకశక్తికి సాయపడుతున్న కణాలకు కొత్త చర్మం ఏర్పడేలా సాయం చేయమంటూ సూచనలు అందిస్తాయి. అయితే ఎలుకల వయసుమళ్లే కొద్దీ ఈ స్కింట్స్‌ ఉత్పత్తి తగ్గిపోయిందట. దాంతో గాయం మాన్పడంలో కెరటినోసైట్స్‌ సామర్థ్యం గణనీయంగా తగ్గిపోయింది. ఫలితం! గాయం చాలా నిదానంగా మానడాన్ని గమనించారు.   పెద్దవారిలో గాయాలు నిదానంగా మానడం వెనుక ఉన్న కారణం తెలిసింది సరే! మరి ఈ ఫలితం ఆధారంగా గాయాన్ని మాన్పే ప్రక్రియను గాడిలో పెట్టే అవకాశం ఉందేమో అని మరిన్ని పరిశోధనలు చేశారు. అందుకోసం వయసు మళ్లిన ఎలుకలలో గాయాన్ని మాన్పమంటూ సూచనలు అందించే ప్రొటీన్‌ ఉత్పత్తిని పెంచినప్పుడు, వాటిలోని కెరటినోసైట్స్‌ వేగంగా స్పందించడాన్ని గమనించారు. ఈ సూత్రాన్ని ఆధారం చేసుకుని మున్ముందు మన కణాల మధ్య ఉన్న సమాచార వ్యవస్థని మరింత వేగవంతం చేసే మందులను ఉత్పత్తి చేయవచ్చునని అంటున్నారు. అదే కనుక జరిగితే కేవలం గాయాలను మాన్పడంలోనే కాదు, వృద్ధాప్యం కారణంగా వచ్చే మరెన్నో సమస్యలకు పరిష్కారం దొరకవచ్చు.   - నిర్జర.

ఓ సరికొత్త సంచలనం – మెడిటేరియన్ డైట్

ఒక ప్రాంత ప్రజలు తినే ఆహారం వాళ్లు నివసించే ప్రదేశం మీద ఆధారపడి ఉంటుందన్న విషయం తెలిసిందే! కానీ ఏదో అవసరం కొద్దీ అలవాటు చేసుకున్న ఆ ఆహారమే ఒకోసారి వారి ఆరోగ్య రహస్యంగా మారుతుంది. ఇతరులు కూడా ఏరికోరి మరీ అదే తరహా ఆహారాన్ని స్వీకరించే పరిస్థితి తీసుకువస్తుంది. అలా ప్రస్తుతం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న ఆహారపు అలవాటే Mediterranean diet.   ఇదే మెడిటేరియన్ డైట్: మధ్యధరా సముద్రం (Mediterranean sea) తీర ప్రాంతాలలో నివసించే ప్రజల ఆహారాన్నే మెడిటేరియన్ డైట్ అంటారు. మరీ ముఖ్యంగా గ్రీస్, ఇటలీ, స్పెయిన్లలో ఈ తరహా ఆహారం కనిపిస్తుంది. పప్పు దినుసులు, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, పెద్దగా పొట్టు తీయని తృణధాన్యాలతో కూడిన ఆహారం మెడిటేరియన్ డైట్లో ప్రముఖంగా ఉంటుంది. వీటికి తోడు వంటలో ఆలివ్ నూనె వాడకం అధికం. సముద్రం పక్కనే ఉంటారు కాబట్టి వీరి ఆహారంలో చేపలదీ ముఖ్య పాత్రే! అయితే చేపలు కాకుండా మిగతా మాంసాహారాన్ని మాత్రం వీరు చాలా తక్కువగా తీసుకుంటారు. ఇక పాలపదార్థాలు, వైన్లనేమో మితంగా పుచ్చుకుంటారు.   సరికొత్త ఫ్యాషన్: మెడిటేరియన్ డైట్ ఎన్నో ఏళ్లుగా ఆచరణలో ఉన్నా, అందులోని ఆరోగ్యాన్ని గమనించి దానిని మిగతా ప్రపంచానికి పరిచయం చేసే ప్రయత్నాలు మాత్రం ఇటీవలే జరుగుతున్నాయి. 1990ల నాటికి ఈ తరహా ఆహారం మీద అనేక అధ్యయనాలు మొదలవడంతో పాశ్చాత్య ప్రపంచం యావత్తూ దీనిని పాటించే ప్రయత్నం చేస్తోంది. తక్కువ కార్బోహైడ్రేట్లని కలిగి ఉంటూనే ఎక్కువ ప్రొటీన్లని అందించడం మెడిటేరియన్ డైట్లోని ప్రత్యేకత. ఈ ఆహారంలో గ్లైకోమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఒంట్లోకి చక్కెర ఒక్కసారిగా విడుదల కాకుండా నిదానంగా విడుదల అవుతుందన్నమాట.   అన్ని పరిశోధనలూ అటువైపే మెడిటేరియన్ డైట్లో ఉండే ఆలివ్ ఆయిల్, పాలిష్ పట్టని తృణధాన్యాలు, చేపలు, పండ్లు... వంటి పదార్థాలన్నీ కూడా సంపూర్ణ ఆరోగ్యానికి తోడ్పడతాయని తేలింది. వీటిలోని మోనోశాటురేటెడ్ కొవ్వు, పీచు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల ఒంట్లో హానికారక కొవ్వు పేరుకోదు. దీంతో రక్తపోటు, గుండె ధమనులు మూసుకుపోవడం వంటి సమస్యలు దరిచేరవు. ఇక మెడిటేరియన్ డైట్ వల్ల చక్కెర వ్యాధి కూడా అదుపులో ఉంటుందని ఓ పరిశోధన తేల్చింది. 2008లో జరిగిన మరో పరిశోధనలో మెడిటేరియన్ డైట్ తీసుకునేవారు క్యాన్సర్తో మరణించే అవకాశం 6 శాతం తక్కువగా ఉన్నట్లు తేలింది. గత వారమే విడుదలైన ఒక పరిశోధనా ఫలితంలో ఈ తరహా ఆహారాన్ని స్వీకరించేవారి మెడదు వృద్ధాప్యంలో కూడా భేషుగ్గా ఉన్నట్లు బయటపడింది. ఇలా మెడిటేరియన్ డైట్ మీద జరుగుతున్న నానా పరిశోధనలన్నీ అందులోని ఆరోగ్య రహస్యాలను ధృవీకరిస్తూ ఉండటంతో... జనం ఆసక్తి అటువైపుగా మొగ్గుతోంది. బరువు తగ్గాలన్నా, రక్తపోటు రాకుండా ఉండాలన్నా, చక్కెర వ్యాధి అదుపులో ఉండాలన్నా... ఇలా ఏ సమస్యకైనా అటూఇటూ పరుగులెత్తకుండా మెడిటేరియన్ తరహా ఆహారాన్ని తినమని సూచిస్తున్నారు. అయినా మన పిచ్చి కానీ పాలిష్ పట్టని బియ్యం, తృణ ధాన్యాలు, ఆకు కూరలు, పండ్లు... ఇవన్నీ తీసుకుంటే మంచిదని ఒకరు పరిశోధించి మరీ చెప్పాలా. భారతీయ ఆహారంలో వాటి పాత్ర ఈనాటిది కాదు కదా! - నిర్జర.  

జలుబు రాకూడదా... డి విటమిన్ తీసుకోండి!

  చలికాలం వచ్చిందంటే చాలు... జలుబు, దగ్గులను మోసుకువస్తుంది. ఆ మూడు నెలలూ ఎలాగొలా గడిపేశాం అనుకోవడానికి లేదు. ఎండాకాలం మొదలవడంతోనే... వాతావరణంలో ఒక్కసారిగా వచ్చిన మార్పుల వల్ల మళ్లీ శ్వాసకోశ వ్యాధులు ఉక్కిరిబిక్కిరి చేసేస్తాయి. అలాంటి పరిస్థితిని సులువుగా ఎదుర్కొనే చిట్కా ఒకటి బయటపడిందని అంటున్నారు పరిశోధకులు.   14 దేశాల పరిశోధన: లండన్లోని ‘క్వీన్ మేరీ విశ్వవిద్యాలయా’నికి చెందిన పరిశోధకులు శ్వాసకోశ వ్యాధులకీ, విటమిన్ ‘డి’కి మధ్య ఉన్న సంబంధాన్ని కనుగొనే ప్రయత్నం చేశారు. ఈ పరిశోధన కోసం భారత్ సహా 14 దేశాలలోని 11 వేలమందిని ఎన్నుకొన్నారు. వీరందరికీ తగు మోతాదుల్లో విటమిన్ డిని అందించి చూశారు. అలా క్రమం తప్పకుండా విటమిన్ డి సప్లిమెంట్లను తీసుకున్నవారిలో ఉదర సంబంధ సమస్యలు తగ్గిపోవడాన్ని గమనించారు. కారణం: ఇంతకుముందు విటమిన్ డి లాభాల గురించి పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఇదేదో సూర్యకాంతి నుంచి లభిస్తుందనీ, శరీరానికి కాల్షియం ఒంటపట్టేందుకు తోడ్పడుతుందని మాత్రమే అనుకునేవారు. కానీ ఒకో పరిశోధనా జరిగేకొద్దీ డి విటమిన్ ప్రాముఖ్యత పెరిగిపోతోంది. డయాబెటిస్ దగ్గర నుంచీ రోగనిరోధక శక్తి వరకూ... శరీరంలోని అణువణువు మీదా విటమిన్ డి ప్రభావం బయటపడుతోంది. ఈ డి విటమిన్ వల్ల ఊపిరితిత్తులలో ‘యాంటీమైక్రోబియల్ పెప్టైడ్స్’ అనే కణాల ఉత్పత్తి మెరుగుపడుతుందట. ఇవి సహజమైన యాంటీబయాటిక్లాగా పనిచేసి... సూక్ష్మక్రిములను సమర్థవంతంగా ఎదుర్కొటాయట.   ప్రభావం అసమానం: విటమిన్ డి వల్ల ప్రయోజనం ఉంది అని మాత్రమే చెప్పి ఊరుకోవడం లేదు శాస్త్రవేత్తలు. ఒక ఫ్లూ వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు అది ఎంత ప్రభావవంతంగా పనిచేసిందో... విటమిన్ డి తీసుకున్నప్పుడు కూడా అంతే ప్రభావం కనిపించిందని చెబుతున్నారు. దగ్గు, జలుబు వంటి సమస్యలే కాకుండా... ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ల వల్ల ఏర్పడే ఆస్తమా వంటి తీవ్రమైన సమస్యలలో కూడా విటమిన్ డి అద్భుతం చేసినట్లు కనుగొన్నారు. అదీ సంగతి! జలుబు వల్ల పెద్దగా ప్రమాదం లేదని మనం భావించవచ్చు. కానీ అదే జలుబు ఒకోసారి ప్రాణాంతకంగా పరిణమించే అవకాశం లేకపోలేదు. 2013లో న్యూమోనియా బారిన పడి ఏకంగా 26 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారంటే... శ్వాసకోశ వ్యాధులు ఎంత ప్రమాదకరమైనవో అర్థమైపోతోంది. ముఖ్యంగా పసిపిల్లలు, వృద్ధులు కఫసంబంధమైన వ్యాధులతో పడే బాధ వర్ణనాతీతం. ఆరోగ్యవంతులైన వారు కూడా శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల బారిన పడి విలువైన పనిగంటలు వృధా చేసుకుంటూ, వైద్యానికి డబ్బులు ఖర్చుపెట్టుకుంటూ గడపాల్సిన పరిస్థితి. ఇక ఈ బాధలన్నింటికీ విటమిన్ డి సమృద్ధిగా ఉండేలా జాగ్రత్తవహించడమే తరుణాపాయం అంటున్నారు.   - నిర్జర.  

యవ్వనంగా ఉండాలన్నా, షుగర్ తగ్గాలన్నా- ఉపవాసమే మందు!

  డయాబెటిస్ అనగానే ఇప్పుడు ప్రపంచం మొత్తానికీ భారతదేశమే గుర్తుకువస్తోంది. ప్రపంచంలోనే అత్యధిక డయాబెటిక్ రోగులు ఉన్న దేశంగా అప్రదిష్ట మూటగట్టుకుంటోంది. కొన్ని సర్వేల ప్రకారం మన దేశంలో చక్కెర వ్యాధితో బాధపడే రోగుల సంఖ్య ఆరుకోట్లకి పైమాటే. మరో పదిహేనేళ్లు పోతే ఈ సంఖ్య రెట్టింపు అవుతుందని అంచనా వేస్తున్నారు.   డయాబెటిస్లో రెండు రకాలు ఉంటాయన్న విషయం తెలిసిందే! ఇందులో టైప్ 1 డయాబెటిస్ జన్యుపరంగా వస్తుంది. అందుకని ఇది చిన్నతనంలోనే దాడిచేసే ప్రమాదం ఎక్కువ. ఈ తరహా డయాబెటిస్లో శరీరంలో అసలు ఇన్సులిన్ ఉత్పత్తిలోనే లోపం ఉంటుంది. దానివల్ల మన రక్తంలోకి చేరుకున్న చక్కెర నిల్వలను శక్తిగా మార్చుకునే అవకాశం ఉండదు. ఇక టైప్ 2 డయాబెటిస్ మన తరచూ వినే తరహా లోపం. ఇందులో ఇన్సులిన్ ఉత్పత్తి జరుగుతుంది కానీ, దానిని శరీరం సరిగా ఉపయోగించుకోలేకపోతుంది. ఈ రెండు రకాల డయాబెటిస్లకు ఓ చికిత్సను కనుగొన్నామంటున్నారు శాస్త్రవేత్తలు.   కాలిఫోర్నియాలోని Leonard Davis School of Gerontologyకి చెందిన పరిశోధకులు ఈ చికిత్సను రూపొందించారు. ఇందుకోసం వారు ప్రయోగశాలలోని ఎలుకలకి పదిశాతం ఆహారాన్ని మాత్రమే అందించారు. ఇలా ఓ నాలుగురోజులు చేసిన తరువాత మరో పదిరోజుల పాటు, వాటి ఇష్టారాజ్యంగా ఆహారాన్ని తీసుకునే అవకాశాన్ని కల్పించారు. ఇలా ఓ మూడు దఫాలుగా ఆహారంలో మార్పులు చేయగానే ఎలుకలలో అద్భుతమైన మార్పులు కనిపించాయట.   ఎప్పుడైతే శరీరానికి తగినంత ఆహారం లభించలేదో... అప్పుడు అందులోని కణాలు నిశ్చలమైన స్థితికి (stand by) చేరుకున్నాయి. కొద్ది రోజుల తరువాత తిరిగి తగినంత ఆహారాన్ని అందుకోగానే తిరిగి సాధారణ స్థితికి చేరుకునే ప్రయత్నం చేశాయి. ఈ ప్రక్రియలో భాగంగా వాటిలో ఉన్న లోపాలన్నీ కూడా సర్దుకోవడాన్ని గమనించారు. ఉదాహరణకు డయాబెటిస్ టైప్ 1 వ్యాధిలో బీటా సెల్స్ అనే తరహా కణాలు తగినంత లేకపోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి జరగదు. కానీ ఉపవాసం చేయించిన ఎలుకలలో ఈ బీటా కణాలు తిరిగి ఉత్పత్తి అవ్వడాన్ని గమనించారు. అంతేకాదు! డయాబెటిస్ టైప్ 2 బారిన పడ్డ ఎలుకలలో కూడా చక్కెర వ్యాధి తిరుగుముఖం పట్టినట్లు తేలింది. కణాలకు తమని తాము బాగుపరచుకునే ఈ అవకాశం దక్కడం వల్ల కేవలం షుగర్ మాత్రమే కాదు... రక్తపోటు, ఊబకాయం వంటి సమస్యలు కూడా తగ్గిపోతాయని భావిస్తున్నారు. అంతేకాదు! వయసుతో వచ్చే మార్పులని నివారించడంలోనూ, కేన్సర్ ఏర్పడే పరిస్థితులను నిరోధించడంలోనూ కూడా ఈ తరహా ఉపవాసాలు లాభిస్తాయని చెబుతున్నారు. అందుకనే మనుషుల మీద కూడా ఈ తరహా ప్రయోగాలు చేసేందుకు అమెరికా ప్రభుత్వ అనుమతిని కోరుతున్నారు.   విచిత్రం ఏమిటంటే... ఏ ఎలుకల మీదా ప్రయోగం చేయకుండా, ఏ ప్రభుత్వ అనుమతీ లేకుండానే మన దేశంలోని ప్రకృతి వైద్యులు ఈ తరహా ఉపవాసాలను ప్రోత్సహిస్తూ వచ్చారు. ఒకవేళ వైద్యంలో భాగంగా కుదరకపోయినా కనీసం ఏకాదశి, శివరాత్రి వంటి విశేషమైన రోజులలో అయినా ఉపవాసాన్ని పాటించమని మొత్తుకుంటున్నారు. కానీ మనం వింటేనా! అందుకే ఉపవాసానికీ, ప్రకృతివైద్యానికీ పేరొందిన మన దేశంలోనే షుగర్ వ్యాధిగ్రస్తులు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్నారు. (షుగర్ వ్యాధి ఉన్నవారు ఉపవాసం చేసే ముందు నిపుణులను సంప్రదించడం మంచిది.)   - నిర్జర.

వీడియోగేమ్‌తో మతిమరపు మీద పరిశోధన

  పోకెమాన్‌గో లాంటి వీడియోగేమ్స్‌తో ఇప్పటి యువత వెర్రెత్తిపోతోందని పెద్దలు తిట్టుకోవచ్చుగాక! కానీ సాంకేతికతను ఉపయోగించుకునే నేర్పు తెలియాలే కానీ ఆ వీడియోగేమ్స్‌తోనే అద్భుతమైన పరిశోధనలు చేపట్టవచ్చునని శాస్త్రవేత్తలు నిరూపిస్తున్నారు.   దారి తప్పిపోతారు మతిమరపు అనే మాట చాలా చిన్న పదమే కావచ్చు. కానీ అది ఒక వ్యాధిగా పరిణమించినప్పుడు జీవితం నరకప్రాయమవుతుంది. ముఖ్యంగా అల్జీమర్స్ వంటి మతిమరపు వ్యాధులతో మనిషి తన జీవితాన్నే మర్చిపోయే పరిస్థితి వస్తుంది. సాధారణంగా మనిషి తను రోజూ వెళ్లే చోటుకి కూడా వెళ్లలేక దారితప్పిపోతుంటే, అతనిలోని మతిమరపు తీవ్రరూపాన్ని దాల్చిందని తెలుసుకుంటారు. అందుకనే ఇలా దారి తప్పిపోవడం/ కనుక్కోవడం అన్న సూత్రం ఆధారంగా బ్రిటన్‌ శాస్ర్తవేత్తలు ఒక వీడియోగేమ్‌ను రూపొందించారు.   Sea Hero Quest   ఇదే ఈ వీడియో గేమ్ పేరు. ఇందులో ఒక వయసు మళ్లిన నావికుడు తన గమ్యాన్ని మర్చిపోతాడు. మనం అతనికి సాయపడుతూ తిరిగిన అతని దారులన్నింటినీ గుర్తుచేయడమే ఈ ఆటలోని లక్ష్యం. ఇందులో భాగంగా ద్వీపాలను చుట్టుకుంటూ, మంచుకొండలను తప్పించుకుంటూ నావని నడిపించాల్సి ఉంటుంది. మధ్యమధ్యలో మన బంధువులకు నావ ఉనికి తెలిసేలా ఆకాశంలోకి తారాజువ్వలను వదలడం, కొన్ని సూచనల ఆధారంగా దిశను మార్చుకోవడం చేస్తుండాలి.   పాతిక లక్షలమంది ఆటగాళ్లు 3D టెక్నాలజీ ఏ వీడియోగేమ్‌కీ తీసిపోని విధంగా ఈ Sea Hero Quest సాగుతుంది. అందుకనే దీనిని ఏకంగా పాతిక లక్షలమంది డౌన్లోడ్‌ చేసుకుని ఆడారు. ఆటగాళ్లు ఈ ఆటని ఆడేటప్పుడు వారి ప్రతీ చర్యా రికార్డు అవుతుంది. అది పరిశోధకులకు చేరుతుంది. దాని ద్వారా వేర్వేరు వయసులవారిలో ‘సరైన దారులని కనుక్కోగలగడం’ అనే సామర్థ్యం ఎంతమేరకు ఉందో పరిశీలించే అవకాశం ఉంది. అంతేకాదు! దారులను గుర్తుంచుకోవడంలో స్త్రీ పురుషుల మధ్య ఏమన్నా వ్యత్యాసం ఉందేమో గ్రహించగలుగుతారు. ఇంకా వేర్వేరు దేశాల వారి మధ్య ఈ నైపుణ్యంలో ఏమన్నా తేడా ఉందేమో తెలిసిపోతుంది.   ఇవీ ఫలితాలు! మనుషులలో మతిమరపుని గమనించడం అనే అత్యంత క్లిష్టమైన పరిశోధన Sea Hero Quest ద్వారా అతి సులువుగా సాగిపోయిందంటున్నారు పరిశోధకులు. ఎందుకంటే ఈ ఆటని రెండు నిమిషాలపాటు ఆడితే అది ల్యాబొరేటరీలో 5 గంటలు పరిశోధన చేసినదానితో సమానమట. అలా దాదాపు 9,500 సంవత్సరాలతో సమానమైన ఫలితాలను శాస్త్రవేత్తలు సాధించగలిగారు. వాటిని నిశితంగా గమనించేందుకు చాలా సమయమే పడుతుంది. కానీ ప్రాథమిక ఫలితాలు మాత్రం ఇవీ...   - 19 ఏళ్ల నుంచి దారిని గుర్తుంచుకొనే సామర్థ్యం నిదానంగా తగ్గిపోతుందట. 19 ఏళ్ల వయసులో 74 శాతంగా ఉన్న ఈ సామర్థ్యం 75 ఏళ్లు వచ్చేసరికి కేవలం 46 శాతమే ఉంటుంది. - దారిని గుర్తుంచుకోవడంలో ఆడవారికంటే మగవారి నిపుణుత ఎక్కువగా ఉంటుందని తేలింది. అయితే ఇది స్వతహాగా వారు బయటతిరగడం వల్ల ఏర్పడిందా లేకపోతే తరచూ వీడియోగేమ్స్‌ ఆడటం వల్ల వాళ్లు లక్ష్యాన్ని ఛేదించగలిగారా అన్నది ఇంకా తేలాల్సి ఉంది. - నార్డిక్‌ దేశాలు అనబడే డెన్మార్క్‌, స్వీడన్‌ వంటి దేశ ప్రజలు మిగతావారితో పోలిస్తే త్వరగా దారిని పోల్చుకుంటారని బయటపడింది. బహుశా ఈ సామర్థ్యం వారి జన్యువులలోనే నిక్షిప్తం అయి ఉంటుందని భావిస్తున్నారు.   ఏది ఏమైనా ఈ Sea Hero Quest మతిమరపు మీద సరికొత్త విశ్లేషణలకు ఆస్కారం ఇస్తోంది. దీని ద్వారా అల్జీమర్స్‌ వంటి వ్యాధులను తొలిదశలోనే గుర్తించి వాటికి చికిత్సను మొదలుపెట్టే మార్గాన్ని సుగమం చేస్తోంది. అసలు మతిమరపు ఎందుకు ఏర్పడుతుంది? దానిని నివారించే అవకాశం ఏదన్నా ఉందా? అనే ప్రశ్నలకు జవాబులను వెతికే ప్రయత్నమూ ఈ పరిశోధనతో ఊపందుకున్నట్లయ్యింది.     - నిర్జర.

LET THE B 12 VITAMINS ENTER YOUR BODY!

  Do you know what it means to have weakness, fatigue or light-headedness along with rapid heartbeat, pale skin and a sore tongue? These are some symptoms of B 12 deficiency! We often don't care to check if our body is getting the right nutrition from the food we eat. This can be very dangerous. Something that can be taken care of easily could lead you to the hospital. To avoid that it is best to know the B 12 vitamins more closely. For you to understand its importance, let me first tell you what its major function is. B 12 cares for your brain and nervous system while helping in formation of blood in your body. It is advised to be taken orally for best results. Different countries have set different amounts as minimum requirements of the human body. For instance in the U.S it is suggested to have  2 to 3 µg per day where as U.K recommends 1.5 µg per day. However, the Center for Food Safety and Applied Nutrition recommends 6 µg per day, for an adult depending on his or her calorie intake each day. The nutrition measurements for an expecting mother are completely different. The recommended amount of vitamin B 12 in pregnant women is 2.6 µg per day and 2.8 µg during lactation periods. If these requirements are fulfilled, both the mother and the baby can experience the bliss of good health. Now let us see how we can prevent our body from being deprived of this essential vitamin. meat, poultry, seafood, dairy products, and eggs will not allow B 12  to escape from your body. If being a vegetarian is worrying you then I have an alternative. A bowl full of  cereal fortified with vitamin B12 for breakfast can do the magic for you! So, make B 12 you best friend and enjoy a long and healthy life.    - Kruti Beesam