శార‌ద ఒక సీన్ చేయ‌డానికి 20 టేకులు తీసుకున్నారంటే స‌ర్‌ప్రైజ్ అవ్వాల్సిందే!

  జాతీయ ఉత్త‌మ‌న‌టిగా మూడుసార్లు జాతీయ అవార్డు అందుకున్న శార‌ద ఒక సినిమాలో ఒక సీన్ చేయ‌డానికి 20 టేకులు తీసుకున్నారంటే ఎవ‌రైనా ఆశ్చ‌ర్య‌పోక త‌ప్ప‌దు. ఆమె న‌ట జీవితంలో ఒకే ఒక సినిమాకు ఇలాంటి సంద‌ర్భం త‌ట‌స్థించింది. ఆ సినిమా టైటిల్ కూడా 'శార‌ద' కావ‌డం ఒక విశేషం. ఆ సినిమాకు ద‌ర్శ‌కుడు క‌ళాత‌ప‌స్వి కె. విశ్వ‌నాథ్‌. ఇందులో శార‌ద భ‌ర్త‌గా, డాక్ట‌ర్‌గా శోభ‌న్‌బాబు ద్విపాత్ర‌భిన‌యం చేశారు. శార‌ద 20 టేకులు తీసుకున్న ఆ సీన్ ఏమిటంటే.. క‌థ ప్ర‌కారం శార‌ద‌కు మ‌తిస్థిమితం త‌ప్పుతుంది. ఆమె అన్న ప‌ట్నంవెళ్లి డాక్ట‌ర్‌తో మాట్లాడి, "నా చెల్లెలిని హాస్పిట‌ల్‌కు తీసుకుర‌మ్మంటే తీసుకువ‌స్తాను" అని చెప్తాడు. దానికి ఆ డాక్ట‌ర్, "మీరున్న చోటికే నేను వ‌స్తాను" అని, శార‌ద ఉంటున్న ఊరికి వ‌చ్చి, ఆమె ఇంటిలో అడుగుపెట్టిన‌ప్పుడు అత‌న్ని చూసిన శార‌ద త‌న భ‌ర్తేన‌ని భావిస్తుంది.  Also read:  "స‌గం దోసె తింటారా.. సిగ్గు లేదూ మీకు?" ఎన్టీఆర్ మాట‌ల‌కు స్ట‌న్న‌యిన ల‌క్ష్మి! ఆ సంద‌ర్భంలో అత‌ని కాళ్ల‌మీద ప‌డి, "న‌న్నెందుకిలా చేశారు, నేనేం త‌ప్పుచేశాన‌ని మీరు న‌న్ను వ‌దిలి వెళ్లిపోయారు. ఏదో నావ‌ల్ల త‌ప్పు జ‌రిగినా, న‌న్ను తిట్టొచ్చుక‌దండీ".. అని భోరున విల‌పిస్తుంది. Also read:  ఎవ‌ర్‌గ్రీన్ బ్యూటీ రేఖ గురించి మీకు తెలీని ఏడు విష‌యాలు! ఈ సీన్‌ను ఇర‌వై సార్లు తీశారు విశ్వ‌నాథ్‌. ప్ర‌తిసారీ ఆయ‌న శార‌ద‌తో, "మీ నుంచి ఇంకా ఏదో ఎక్స్‌ప్రెష‌న్ వ‌స్తోంది. నేను ఎదురుచూస్తున్న ఎక్స్‌ప్రెష‌న్ రావ‌డం లేదు" అని అనేవారు త‌ప్ప‌, "నువ్వు బాగా చెయ్య‌డం లేదు" అని మాత్రం అన‌లేదు. అది ఆయ‌న త‌త్వం. న‌టీన‌టుల‌తో చాలా ప్రోత్సాహ‌క‌రంగా మాట్లాడుతూ, త‌న‌కు కావాల్సిన ఎక్స్‌ప్రెష‌న్ వ‌చ్చేవ‌ర‌కూ వ‌దిలేవారు కాదు. ఏమాత్రం విసుగులేకుండా, ఎంతో స‌హ‌నంగా, ఆర్టిస్టుని నిరుత్సాహ‌ప‌ర్చ‌కుండా, త‌న‌కు కావాల్సిన విధంగా న‌ట‌న‌ను రాబ‌ట్టుకునేవారు.  Also read:  ముచ్చ‌ర్ల అరుణ పెళ్లి ఎవ‌రితో, ఎలా జ‌రిగిందో తెలుసా? 20 టేకులైన త‌ర్వాత‌, ఆఖ‌రి టేక్‌ను ఓకే చేసి, అప్పుడు చెప్పారు - "ఇదీ నాకు కావాల్సిన ఎక్స్‌ప్రెష‌న్" అని. శార‌ద న‌ట జీవితంలో 20 టేకులు తీసుకున్న మొద‌టి చిత్రం, చివ‌రి చిత్రం 'శార‌ద‌'.

'పుష్ప' విల‌న్ ఎవ‌రి కొడుకో తెలుసా? అత‌ని తండ్రి నాగార్జునను డైరెక్ట్ చేశాడు!

  అల్లు అర్జున్ టైటిల్ రోల్ పోషించిన 'పుష్ప' మూవీ ద్వారా ఒక మ‌ల‌యాళం న‌టుడు మెయిన్ విల‌న్‌గా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. అత‌ను.. ఫ‌హ‌ద్ ఫాజిల్‌. మ‌ల‌యాళంలో అత‌నొక స్టార్ యాక్ట‌ర్‌. హీరో పాత్ర‌ల‌తో పాటు విభిన్న పాత్ర‌ల‌తో న‌టునిగా గొప్ప పేరు సంపాదించుకున్నాడు. అత‌ను న‌టించిన కొన్ని సినిమాలు కొవిడ్ టైమ్స్‌లో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై విడుద‌లై ఆడియెన్స్‌కు వినోదాన్నివ్వ‌డంతో పాటు భిన్న అనుభ‌వాల‌ను, అనుభూతుల‌ను ఇచ్చాయి. వాటిలో 'ట్రాన్స్' మొద‌ట థియేట‌ర్ల‌లో రిలీజైనా, త‌ర్వాత ఓటీటీలో మంచి పాపులారిటీ సాధించింది. ఆ త‌ర్వాత వ‌రుస‌గా నాలుగు సినిమాలు.. 'సి యు సూన్‌', 'ఇరుళ్‌', 'జోజి', 'మాలిక్'.. డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ‌య్యాయి. ఇవ‌న్నీ ఆడియెన్స్‌ను మెప్పించాయి.   అత‌నికీ, తెలుగు సినిమాకీ ప‌రోక్షంగా ఒక క‌నెక్ష‌న్ ఉంది. అవును. అత‌ని తండ్రి తెలుగులో ఒక సినిమాని, అదీ.. అక్కినేని నాగార్జున సినిమాని డైరెక్ట్ చేశాడు. ఆ సినిమా.. 'కిల్ల‌ర్' (1991). ఆ డైరెక్ట‌ర్‌.. ఫాజిల్‌! మ‌ల‌యాళ చిత్ర‌సీమ‌లోని అగ్ర‌గ‌ణ్యులైన ద‌ర్శ‌కుల్లో ఫాజిల్ ఒక‌రు. ఆయ‌న వార‌సుడిగా డైరెక్ట‌ర్ కాకుండా యాక్ట‌ర్ అయ్యాడు ఫ‌హద్‌. 2002లో 'కైయేతుమ్ దూర‌త్' మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఫ‌హ‌ద్‌, ఆ త‌ర్వాత రెండో సినిమా చేయ‌డానికి ఏడేళ్లు నిరీక్షించాల్సి వ‌చ్చింది. 'కేర‌ళ కేఫ్' (2009) త‌ర్వాత అత‌ను వెనుతిరిగి చూసుకోవాల్సిన అవ‌స‌రం క‌ల‌గ‌లేదు. 2011లో 'చాప్ప కురిషు' చిత్రంలో న‌ట‌న‌కు గాను తొలిసారి కేర‌ళ ప్ర‌భుత్వం నుంచి బెస్ట్ స‌పోర్టింగ్ యాక్ట‌ర్ అవార్డును అందుకున్నాడు ఫ‌హ‌ద్‌. Also read:  చివ‌రి రోజుల్లో కుటుంబ పోష‌ణ కోసం సీరియ‌ల్స్‌లో న‌టించిన సుత్తి వేలు! ఆ త‌ర్వాత రెండేళ్ల‌కే 'ఆర్టిస్ట్', 'నార్త్ 24 కాథ‌మ్' (2013) సినిమాల్లో చేసిన క‌థానాయ‌కుడి పాత్ర‌ల‌కు ఈసారి బెస్ట్ యాక్ట‌ర్‌గా స్టేట్ అవార్డ్ సాధించాడు. దిలీష్ పోత‌న్ డైరెక్ట్ చేసిన 'తొండిముత‌లుమ్ దృక్‌సాక్షియుమ్' (2017)లో చేసిన ప్ర‌సాద్ అనే దొంగ‌పాత్ర‌కు గాను బెస్ట్ స‌పోర్టింగ్ యాక్ట‌ర్‌గా జాతీయ అవార్డు అందుకున్నాడు ఫ‌హ‌ద్‌. ఇప్పుడు 'పుష్ప' మూవీతో టాలీవుడ్‌కు విల‌న్‌గా ప‌రిచ‌య‌మ‌వుతున్న‌ట్లే కాలీవుడ్‌కు సైతం ఇదివ‌ర‌కే అత‌ను విల‌న్‌గా ఇంట్ర‌డ్యూస్ అయ్యాడు. ఆ సినిమా.. శివ‌కార్తికేయ‌న్ హీరోగా న‌టించిన 'వేలైక్కార‌న్' (2017).  'పుష్ప‌'లో మెయిన్ విల‌న్ రోల్‌కు సుకుమార్ మొద‌ట ఎంచుకున్న‌ది విజ‌య్ సేతుప‌తిని. మొద‌ట గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన సేతుప‌తి.. ఆ త‌ర్వాత కొవిడ్ కార‌ణంగా త‌ను అదివ‌ర‌కే న‌టిస్తోన్న మిగ‌తా సినిమాల షెడ్యూళ్లు దెబ్బ‌తినడంతో వాటికోసం 'పుష్ప‌'ను వ‌దులుకున్నాడు. అలా 'భ‌న్వ‌ర్‌సింగ్ షెకావ‌త్ ఐపీఎస్' క్యారెక్ట‌ర్‌లోకి ప‌ర‌కాయ ప్ర‌వేశం చేశాడు ఫ‌హ‌ద్ ఫాజిల్‌. ఎర్ర‌చంద‌నం స్మ‌గ్ల‌ర్ పుష్ప‌రాజ్ (అల్లు అర్జున్‌)ను ఢీకొట్టే పాత్ర‌లో గుండుతో వైవిధ్య‌మైన లుక్‌తో అత‌ను క‌నిపిస్తున్నాడు. ప‌ర్ఫార్మెన్స్‌ప‌రంగా బ‌న్నీకి ఫ‌హ‌ద్ స‌రైన జోడీ అన‌డంలో సందేహం లేదు. తెర‌పై ఆ ఇద్ద‌రు న‌టుల అభిన‌యం సినీ ప్రియుల‌కు క‌నువిందు కావ‌డం ఖాయం. Also read:  ఫ‌హ‌ద్ ఫాజిల్‌, న‌జ్రియా న‌జీమ్ బ్యూటిఫుల్ ల‌వ్ స్టోరీ.. రీల్ క‌పుల్ నుంచి రియ‌ల్ క‌పుల్ దాకా! అన్న‌ట్లు.. ఫ‌హ‌ద్‌కు సంబంధించిన మ‌రో ముఖ్య‌మైన విష‌యం.. అత‌ను తోటి మ‌ల‌యాళం తార న‌జ్రియా న‌జీమ్‌ను ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. ఆమె కూడా త్వ‌ర‌లో నాని స‌ర‌స‌న నాయిక‌గా 'అంటే.. సుంద‌రానికి' సినిమా ద్వారా టాలీవుడ్‌కు ప‌రిచ‌యం కాబోతోంది!

ఈ లోకం నీకు తుపాకి ఇచ్చింది.. నాకు గొడ్డలి ఇచ్చింది.. 'పుష్ప' ట్రైల‌ర్‌ బెస్ట్ మూమెంట్స్‌!

  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టైటిల్ రోల్ పోషిస్తుండ‌గా, సుకుమార్ డైరెక్ట్ చేస్తోన్న‌ రెండు భాగాల 'పుష్ప' మూవీలోని ఫ‌స్ట్ పార్ట్ 'పుష్ప: ది రైజ్' ట్రైల‌ర్ ఎట్ట‌కేల‌కు మ‌న ముందుకు వ‌చ్చేసింది. ప్రొడ‌క్ష‌న్ హౌస్ అయిన మైత్రి మూవీ మేక‌ర్స్ ముందుగా ప్ర‌క‌టించిన‌ట్లు సోమ‌వారం సాయంత్రం 6:03 గంట‌ల‌కు కాకుండా రాత్రి 9:18 గంట‌ల‌కు యూట్యూబ్‌లో ట్రైల‌ర్‌ను రిలీజ్ చేశారు. హైవోల్టేజ్ ఇంటెన్స్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా త‌యార‌వుతున్న ఈ సినిమాలో ఎర్ర‌చంద‌నాన్ని స్మ‌గ్లింగ్ చేసే లారీ డ్రైవ‌ర్ పుష్ప‌రాజ్‌గా నెవ‌ర్ బిఫోర్ 'రా లుక్‌'లో క‌నిపిస్తున్నాడు బ‌న్నీ. ఇప్ప‌టికే "త‌గ్గేదే లే" అంటూ ఆయ‌న చెప్పిన ఊత‌ప‌దం ఎంత వైర‌ల్‌ అయ్యిందో మాట‌ల్లో చెప్ప‌లేం. టీవీ షోల‌లోనూ, బ‌య‌టా కూడా ఆ ప‌దాన్ని విప‌రీతంగా వాడుతూ ర‌చ్చ ర‌చ్చ చేస్తున్నారు. అలాగే ఈ సినిమాలో భుజాన్ని పైకెగ‌రేస్తూ బ‌న్నీ ప్ర‌ద‌ర్శించిన మేన‌రిజం కూడా ఆడియెన్స్‌ను తెగ అల‌రించింది. రెండున్న‌ర నిమిషాల నిడివి వున్న పుష్ప ట్రైల‌ర్ "భూమండ‌లం మీద యాడా పెర‌గ‌ని సెట్టు మ‌న శేషాచ‌లం అడ‌వుల్లో పెర‌గ‌తా ఉండాది.." అంటూ అజ‌య్ ఘోష్ వాయిస్ ఓవ‌ర్ వినిపిస్తుండ‌గా మొద‌లైంది. శేషాచ‌లం అడవుల్లో జరిగే ఎర్ర చందనం స్మగ్లింగ్‌కు సంబంధించి వచ్చే విజువల్స్ వేరే లెవ‌ల్లో ఉన్నాయి. సీమ యాస‌లో అల్లు అర్జున్ చెప్పే డైలాగ్స్ కానీ, ఆయ‌న ప‌ర్ఫార్మెన్స్ కానీ అల్టిమేట్ అనే రేంజ్‌లో క‌నిపిస్తున్నాయి. ఆయన న‌వ్వు కానీ, ఆయ‌న కోపం కానీ, హీరోయిన్ ర‌ష్మిక‌తో ఆయ‌న రొమాన్స్ కానీ అమితంగా ఆక‌ట్టుకుంటున్నాయి. Also read:  సీక్రెట్‌గా వీడియో తీస్తున్న ఫ్యాన్‌.. ఫోన్ లాగేసుకున్న యాక్ష‌న్ స్టార్‌! పుష్ప‌రాజ్‌ను పోలీసులు స్టేష‌న్‌లో బంధించి, లాఠీల‌తో కొడుతుండ‌గా, య‌స్సై పాత్ర‌ధారి శ‌త్రు "యాడ‌దాచినావ్ స‌రుకు.. సెప్పు" అని అడుగుతాడు. "సెబితే మా బాస్ సంపేస్తాడు" అంటాడు పుష్ప‌. "ఎవ‌డాడు.. ఎవ‌డా బాసూ" అని కోపంగా అడిగాడు య‌స్సై. దాందో అదోలా న‌వ్వాడు పుష్ప‌. క‌ట్ చేస్తే.. త‌న సామ్రాజ్యంలో బాస్‌గా ద‌ర్శ‌న‌మిచ్చాడు పుష్ప‌. అంటే పుష్ప‌రాజే ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ ముఠాకు బాస్ అన్న‌మాట‌. ట్రైల‌ర్ చివ‌ర‌లో "పుష్ప అంటే ఫ్ల‌వ‌ర్ అనుకుంటివా.. ఫైరు" అని బ‌న్నీ చెప్పిన విధానం ఆక‌ట్టుకుంది. Also read:  'జై ప‌వ‌ర్‌స్టార్' అని అన‌లేక‌పోయిన బ‌న్నీ 'జై బాల‌య్య' అని ఎలా అన‌గ‌లిగాడు? మెయిన్ విల‌న్‌గా గుండుతో స్ట‌న్నింగ్ లుక్‌లో ద‌ర్శ‌న‌మిచ్చినాడు మ‌ల‌యాళం స్టార్ యాక్ట‌ర్ ఫ‌హాద్ ఫాజిల్‌. సునీల్‌, అన‌సూయ‌, ధ‌నుంజ‌య్‌, అజ‌య్ ఘోష్‌, అజ‌య్‌, రావు ర‌మేశ్ లాంటి ఉద్ధండులు ఈ ట్రైల‌ర్‌లో క‌నిపించారు. ప్ర‌తి ఒక్క‌రూ ఇదివ‌ర‌కు వారెప్పుడూ క‌నిపించ‌ని త‌ర‌హాలో డిఫ‌రెంట్ లుక్‌తో క‌నిపిస్తుండ‌టం గ‌మ‌నించ‌ద‌గ్గ అంశం. ఒక సీన్‌లో సునీల్‌ను మంచంపైకి తోసి, అత‌నిపై కూర్చొంది అన‌సూయ‌. ఆమె నోరు ఒక బ్లేడును ప‌ళ్ల‌తో బిగించి ప‌ట్టుకొని ఉండ‌టం ఇక్క‌డ ఆస‌క్తిక‌రం. అలాగే ట్రైలర్‌లో బన్నీ, రష్మిక మధ్యే వచ్చే రెండు మూడు సన్నివేశాలు కూడా చాలా బాగున్నాయి. ఒక సీన్‌లో "నేను నిన్ను సూళ్లేద‌ని ఓ పులుపెక్కి పోతుండావ‌ట క‌దా" అని శ్రీ‌వ‌ల్లి (ర‌ష్మిక‌) తిప్పుకుంటా అంటే, "పులుపెక్కిపోతుండానా!" అని పుష్ప ఆశ్చ‌ర్య‌పోవ‌డం భ‌లే ఉండాది.  Also read:  ప్ర‌భాస్ 'ఆదిపురుష్' డైరెక్ట‌ర్ ఓం రౌత్ గురించి మీకెంత తెలుసు? ఈ ట్రైల‌ర్‌తో 'పుష్ప‌'పై అంచ‌నాలు డెఫినెట్‌గా ఓ రేంజ్‌కు వెళ్లిపోయాయి. త‌న టేకింగ్‌తో సుకుమార్ 'పుష్ప‌'ను ఒక అసాధార‌ణ చిత్రంగా మ‌లిచాడ‌నే న‌మ్మ‌కాన్ని ఈ ట్రైల‌ర్ క‌లిగిస్తోంది. మిరోస్లావ్ క్యూబా బ్రోజెక్ సినిమాటోగ్ర‌ఫీ గురించి ఎంత ఎక్కువ‌గా చెప్పినా త‌క్కువే. దేవి శ్రీ‌ప్ర‌సాద్ బీజిఎం కూడా ఇంట‌ర్నేష‌న‌ల్ స్టాండ‌ర్డ్స్‌ను త‌ల‌పిస్తోంది. డిసెంబ‌ర్ 17న థియేట‌ర్ల‌లో రిలీజ‌వుతోన్న 'పుష్ప: ది రైజ్‌' బాక్సాఫీస్ ద‌గ్గ‌ర చేసే బీభ‌త్సాన్ని చూడ్డ‌మే మిగిలుంది.

'అఖండ' క‌లెక్ష‌న్ల‌ను త‌ట్టుకోలేక దిగాలుప‌డ్డ వ్య‌తిరేక వ‌ర్గం!

  నంద‌మూరి బాల‌కృష్ణ టైటిల్ రోల్ పోషించిన 'అఖండ' మూవీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర విజ‌య ఢంకా మోగిస్తోంది. ఈ ఏడాది ఇప్ప‌టివ‌ర‌కూ థియేట‌ర్ల‌లో రిలీజైన సినిమాల‌లో 'వ‌కీల్ సాబ్' త‌ర్వాత సెకండ్ ప్లేస్‌ను ఆక్ర‌మించేందుకు ఉర‌క‌లు వేస్తోన్న 'అఖండ' మూవీ ఓవ‌ర్సీస్‌లోనూ గ‌ర్జిస్తుండ‌టం విశేషంగా చెప్పుకుంటున్నారు. టైటిల్ రోల్‌లో బాల‌య్య ప్ర‌ద‌ర్శించిన న‌ట‌న‌కు మాస్ ఆడియెన్స్ నీరాజ‌నాలు ప‌డుతున్నార‌నేందుకు క‌లెక్ష‌న్లే సాక్ష్యంగా నిలుస్తున్నాయి.  'అఖండ' ఈ స్థాయిలో బాక్సాఫీస్‌ను దున్నేయ‌డానికి కార‌ణ‌మేంటి?  బాల‌య్య బాక్సాఫీస్ వ‌ద్ద సృష్టిస్తోన్న ప్ర‌భంజనాన్ని చూసి ఓర్వ‌లేక‌పోతున్న వ్య‌తిరేక వ‌ర్గం ఇదంతా ఒక కులం ఆ సినిమాపై తీసుకొచ్చిన హైప్ ప్ర‌భావ‌మంటూ ప్ర‌చారం చేయ‌డానికి ఆప‌సోపాలు ప‌డుతోంది. ఆన్‌లైన్‌లో ఈ మేర‌కు పోస్టులు కూడా పెడుతోంది. ఇండ‌స్ట్రీలో ఆ కులానికి చెందిన ఒక యంగ్ ప్రొడ్యూస‌ర్ దీని వెనుక ఉన్నాడ‌ని కూడా ప్ర‌చారం చేసింది.  Also read:  'అఖండ' జాత‌ర‌.. నాలుగు రోజుల్లోనే తెలంగాణ‌లో లాభాలు! అయితే ఆ ప్ర‌చారం చూసి ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు న‌వ్వుకుంటున్నాయి. 'అఖండ' దెబ్బ‌కు వ్య‌తిరేక వ‌ర్గం ఎంత ఫ్ర‌స్ట్రేష‌న్‌లో ఉంద‌నేందుకు ఆ రాత‌లే నిద‌ర్శ‌న‌మ‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు. 'అఖండ' విజ‌యాన్ని జీర్ణంచేసుకోలేక పోవ‌డం వ‌ల్లే ఇలాంటి హైప్ క‌థ‌నాలు వండి వారుస్తున్నార‌నీ, అయితే అలాంటి రాత‌లు చూసి వారిపై జాలి క‌లుగుతోంద‌ని అంటున్నారు. Also read:  నాలుగో రోజు క‌లెక్ష‌న్‌లో 'వ‌కీల్ సాబ్‌'ను దాటేసిన 'అఖండ'! ఒక సినిమాపై ఎవ‌రెంత హైప్ క్రియేట్ చేసినా, దాని ప్ర‌భావం మొద‌టి రోజు ఒక‌ట్రెండు షోల‌కు ప‌రిమిత‌మ‌వుతుంద‌నీ, ఆ త‌ర్వాత ఆ సినిమా ఎలా ఉంద‌నే దానిపై ఆధార‌ప‌డి క‌లెక్ష‌న్లు ఉంటాయ‌నే వాస్త‌వాన్ని కూడా ఆ ప్ర‌చార‌క‌ర్త‌లు గ్ర‌హించ‌లేక‌పోతున్నారు. ఆ ర‌కంగా చూసుకుంటే మొద‌టి రోజు బ్ర‌హ్మాండ‌మైన ఓపెనింగ్స్ సాధించిన 'అఖండ‌', రెండో రోజు కూడా కేవ‌లం తెలుగు రాష్ట్రాల్లోనే రూ. 6 కోట్ల‌కు పైగా షేర్ సాధించ‌డం, మూడో రోజు, నాలుగు రోజుల్లో అంత‌కంటే ఎక్కువ వ‌సూళ్లు రావ‌డం ఆ సినిమా ప్ర‌భంజ‌నం ఎలా ఉందో చెప్ప‌డానికి నిద‌ర్శ‌న‌మ‌నీ విశ్లేష‌కులు అంటున్నారు. Also read:  బాలీవుడ్ బాట‌లో బాల‌య్య `అఖండ‌`? ఇప్ప‌టికే తెలంగాణ ఏరియాలో ప్రాఫిట్‌లోకి వ‌చ్చేసిన 'అఖండ‌', రానున్న కొద్ది రోజుల్లోనే మిగ‌తా అన్ని ఏరియాల్లోనూ లాభాల్లోకి వ‌స్తుంద‌ని చెప్ప‌డానికి సందేహించాల్సిన ప‌నిలేదు.

'అఖండ‌'లో మెయిన్ విల‌న్ రియ‌ల్ లైఫ్‌లో మాజీ ఆర్మీ ఆఫీస‌ర్ అని మీకు తెలుసా?

  'అఖండ‌'గా నంద‌మూరి బాల‌కృష్ణ తెలుగు రాష్ట్రాల‌తో పాటు ఓవ‌ర్సీస్‌లోనూ ప్ర‌భంజ‌నం సృష్టిస్తున్నారు. ఆయ‌న కెరీర్‌లోనే అత్య‌ధిక ఓపెనింగ్స్‌తో మొద‌లైన క‌లెక్ష‌న్ల జాత‌ర‌, రెండో రోజు కూడా కొన‌సాగింది. ఈ సినిమాలో మైనింగ్ కింగ్ వ‌ర‌ద‌రాజులుగా శ్రీ‌కాంత్ విల‌నిజాన్ని పండించి ఆక‌ట్టుకోగా, ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ క్రిమిన‌ల్ అయిన గ‌జేంద్ర సాహు అనే మెయిన్ విల‌న్ క్యారెక్ట‌ర్‌ను ఇంత‌దాకా తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం లేని ఓ న‌టుడు పోషించాడు. ఆజానుబాహు రూపం, చ‌క్క‌ని న‌ట‌న‌తో ఆ పాత్ర‌కు పూర్తి న్యాయం చేసిన ఆ న‌టుని పేరు నితిన్ మెహ‌తా.  'అఖండ‌'తోటే టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన నితిన్ మెహ‌తా ఒక మాజీ ఆర్మీ ఆఫీస‌ర్ అనే విష‌యం అతి త‌క్కువ‌మందికే తెలుసు. ఏకంగా ఆయ‌న 21 సంవ‌త్స‌రాలు ఒక సైనికునిగా దేశానికి సేవ చేశారు. ఆయ‌న తండ్రి కూడా ఆర్మీ ఆఫీస‌ర్ కావ‌డం గ‌మ‌నార్హం. ఒక యాక్సిడెంట్‌లో అయిన గాయం కార‌ణంగా నితిన్ ఆర్మీకి స్వ‌చ్ఛంద ప‌ద‌వీ విర‌మ‌ణ చేయాల్సి వ‌చ్చింది. అయితే ఆయ‌న‌కు అదృష్టం మ‌రో రూపంలో క‌లిసొచ్చి, ఇప్పుడున్న సెల‌బ్రిటీ స్థాయికి తీసుకొచ్చింది. Also read:  బాల‌కృష్ణ కెరీర్‌లో నంబ‌ర్ వ‌న్‌గా 'అఖండ' రెండు రోజుల క‌లెక్ష‌న్‌! గ‌డ్డం లుక్‌తో ఎయిర్‌పోర్టులో క‌నిపించిన నితిన్ మెహ‌తాను చూసి ఒక సినిమా నిర్మాతో, ద‌ర్శ‌కుడో త‌న సినిమాలో ఓ క్యారెక్ట‌ర్‌ను ఆఫ‌ర్ చేశాడు. అయితే ఆ సినిమాను నితిన్ చేయ‌లేదు. కానీ ఆ ఘ‌ట‌న ఆయ‌న‌లో ఆలోచ‌న‌ను రేకెత్తించింది. మోడ‌లింగ్ రంగంలోకి అడుగుపెట్టాడు. అయితే మొద‌ట ఇందుకు ఆయ‌న తండ్రి ఒప్పుకోలేదు. సైన్యంలో ప‌నిచేసిన నువ్వు ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఫీల్డులోకి వెళ్ల‌డ‌మేంట‌ని ఆయ‌న అడ్డుచెప్పారు. పోర్ట్‌ఫోలియో షూట్ కోసం వెళ్తున్న కొడుకును చూసి, డ‌బ్బు వేస్ట్ చేస్తున్నావ‌ని కోప్ప‌డ్డారు కూడా. Also read:  తెలుగు రాష్ట్రాల్లో 'అఖండ' జాత‌ర‌.. అంచ‌నాల‌ను మించిన ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్‌! నితిన్ కుర్రాడేమీ కాదు, న‌డి వ‌య‌సులో ఉన్న వ్య‌క్తి. అందువ‌ల్ల మోడ‌ల్‌గా కొడుకు రాణించ‌లేడ‌ని కూడా తండ్రి భ‌య‌ప‌డ్డారు. కానీ ఒక‌సారి ట్రైచేసి చూస్తాన‌ని చెప్పాడు నితిన్‌. ఆయ‌న‌ పోర్ట్‌ఫోలియో చూసి, ముంబై లాక్మే ఫ్యాష‌న్ వీక్ నుంచి ఆహ్వానం అందింది. అలా 44 ఏళ్ల వ‌య‌సులో మోడ‌లింగ్ రంగంలోకి అడుగుపెట్టాడు నితిన్‌. కెరీర్ ఆరంభంలో ఆయ‌న బ‌రువు 85 కిలోలు. రోజు రెండు గంట‌లు జిమ్‌లో వ‌ర్క‌వుట్స్ చేయ‌డం ద్వారా బ‌రువును త‌గ్గించుకోవ‌డ‌మే కాకుండా, దృఢంగా త‌యార‌య్యాడు. మోడ‌ల్‌గా స‌క్సెస్ అయిన నితిన్ మెహ‌తాకు సినిమా ఆఫ‌ర్లు రావ‌డం మొద‌లైంది. అక్ష‌య్ కుమార్‌తో క‌లిసి 'ఫిలాల్‌', 'ఫిలాల్ 2' మ్యూజిక్ వీడియోల్లో న‌టించాడు. 50 సంవ‌త్స‌రాల వ‌య‌సులో 'అఖండ' మూవీలో డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను ఇచ్చిన‌ గ‌జేంద్ర సాహు క్యారెక్ట‌ర్‌ను స‌మ‌ర్థ‌వంతంగా పోషించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ సినిమాతో మ‌రో టాలెంటెడ్ విల‌న్ టాలీవుడ్‌కు ల‌భించాడ‌ని చెప్పాలి. Also read:  అమ్మానాన్న‌ల‌తో 'అఖండ‌'ను థియేట‌ర్‌లో చూసిన ప్ర‌గ్యా! 'అఖండ' సినిమాను నోయిడాలోని పీవీఆర్‌లో త‌న పేరెంట్స్‌తో క‌లిసి చూసిన నితిన్ మెహ‌తా ఆ ఫొటోల‌ను త‌న ట్విట్ట‌ర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసి, త‌న ఆనందాన్ని పంచుకున్నాడు. సినిమాకు వ‌చ్చిన అఖండ ఆద‌ర‌ణ‌తో పాటు త‌న న‌ట‌న‌కూ ప్ర‌శంస‌లు ల‌భిస్తుండ‌టంతో ఆనందంతో త‌బ్బిబ్బ‌వుతున్నాడు.

"స‌గం దోసె తింటారా.. సిగ్గు లేదూ మీకు?" ఎన్టీఆర్ మాట‌ల‌కు స్ట‌న్న‌యిన ల‌క్ష్మి!

  విశ్వ‌విఖ్యాత నంద‌మూరి తార‌క‌రామారావు స‌ర‌స‌న నాయిక‌గా 'ఒకే కుటుంబం'లో తొలిసారి న‌టించారు ల‌క్ష్మి. ఆ త‌ర్వాత 'బంగారు మ‌నిషి' సినిమాలో క‌లిసి న‌టించారు. ఆ స‌మ‌యంలో జ‌రిగిన సంఘ‌ట‌న ఇప్ప‌టికీ ల‌క్ష్మికి బాగా గుర్తు. ఎన్టీఆర్‌కు సాయంత్రం ఉపాహారం ఇంటినుంచి వ‌స్తుంది. రెండు పోళీలు, రెండు దోసెలు, హ‌ల్వా, రెండు యాపిల్ జ్యూస్ సీసాలు, కార‌ప్పూస వ‌గైరా ఉంటాయి. ఇదీ ఆయ‌న ఫ‌ల‌హారం. ల‌క్ష్మి స‌గం దోసె తిని లేచి వెళ్లిపోతూ ఉంటే, "ఏవండీ ల‌క్ష్మిగారూ! ఇటు రండి" అని పిలిచారు రామారావు. ఆయ‌న ఎప్పుడూ చిన్న‌వారినైనా, పెద్ద‌వారినైనా "అండీ" అని స‌గౌరవంగా మాట్లాడ‌తారే త‌ప్ప‌, ఏక‌వ‌చ‌న ప్ర‌యోగం చేయ‌రు. అంత మ‌ర్యాద ఇస్తారు. ఆయ‌న అలా మ‌ర్యాద ఇస్తున్న‌ప్పుడు ఎదుటివాళ్ల‌కు ఒక‌ర‌క‌మైన భ‌యం, గౌర‌వం ఏర్ప‌డి ఠ‌క్కున లేచి నిల్చుంటారు. Also read:  ఎన్టీఆర్‌తో న‌టించ‌డానికి మూడు నెల‌ల ముందే డైలాగ్స్ ప్రాక్టీస్ చేసిన రాధ‌! ఆయ‌న‌లా పిలిచేస‌రికి ల‌క్ష్మి ఆయ‌న ద‌గ్గ‌ర‌కు వెళ్లారు. "ఏం తిన్నా జీర్ణించుకునే వ‌య‌సు మీది. అలాంటి వ‌య‌సులో మీరు అర్ధ దోసె తింటారా?  సిగ్గు లేదూ మీకు?" అన్నారు. "ఏమిటండీ.. మ‌ర్యాద‌గా పిలిచి మ‌రీ తిడుతున్నారు" అన్నారు ల‌క్ష్మి, న‌వ్వుతూ. Also read:  సింగ‌పూర్ వ్య‌క్తితో 'శంక‌రాభ‌ర‌ణం' రాజ్య‌ల‌క్ష్మి పెళ్లి ఎలా కుదిరిందో మీకు తెలుసా? "లేక‌పోతే ఏమిటండీ! చిన్న‌పిల్ల‌లు మీరు. బాగా తినాలి. ఉద‌యాన్నే లేచి వ్యాయామం చెయ్యాలి. ఆరోగ్యాన్ని జాగ్ర‌త్త‌గా చూసుకోవాలి. పెద్ద హీరోయిన్‌గా ఈ సినీ ప‌రిశ్ర‌మ‌లో గొప్ప పేరు తెచ్చుకోవాలి" అని బుద్ధులు చెప్పారు. 

అమ్మ మంద‌లించింద‌ని తుంట‌రిప‌ని చేసి చిన్న‌ప్పుడే ప్రాణాల మీద‌కు తెచ్చుకున్నారు!

  "నేను బ‌ల‌హీన‌మైన పాట‌లు రాశానేమో కానీ, ఒక్క చెడ్డ‌పాట కూడా రాయ‌లేదు" అని ఒక సంద‌ర్భంలో చెప్పారు సీతారామ‌శాస్త్రి. అక్ష‌రాలా ఆ మాట‌లు నిజాలు. ఆయ‌న తండ్రి చెంబోలు వెంక‌ట‌యోగి. హోమియో వైద్యుడు. ఆయ‌న‌ ప‌ద‌మూడు భాష‌ల్లో.. అందులోనూ రెండు విదేశీ భాష‌ల్లో నిష్ణాతులు. ఆయా భాష‌ల్లో విద్యార్థుల‌కు ట్యూష‌న్లు చెప్ప‌గ‌లిగినంత ప్ర‌తిభావంతులు. 1955 మే 20న సీతారామ‌శాస్త్రి జ‌న్మించారు. అప్పుడు తండ్రికి 19 ఏళ్లు, త‌ల్లి సుబ్బ‌ల‌క్ష్మికి 17 ఏళ్లు. త‌ల్లితండ్రుల‌కు ఆయ‌నే పెద్ద‌కుమారుడు. ప‌దేళ్ల‌కే తండ్రి నుంచి సంస్కృత భాష‌ను ఔపోస‌న ప‌ట్టారు శాస్త్రి. చిన్న‌ప్పుడు చంద‌మామ పుస్త‌కాలు బాగా చ‌ద‌వ‌డం వ‌ల్ల అమ్మ అంటే దేవ‌త అనీ, అమృత హ‌స్తాల‌తో ఉంటుంద‌నే భావ‌న‌లో ఉండేవారాయ‌న‌. పిల్ల‌లు అల్ల‌రి ప‌నులు చేస్తుంటే అమ్మ కోప్ప‌డ‌కుండా ఉండ‌దు క‌దా. అలా ఒక‌సారి అమ్మ మంద‌లించింద‌ని ఈయ‌న ఏదో తుంట‌రి ప‌ని చేశారు. దాని ప‌ర్య‌వ‌సానంగా హాస్పిట‌ల్ పాల‌య్యారు కూడా. రెండు రోజుల పాటు స్పృహ‌లేకుండా ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఆ రెండు రోజులూ వాళ్ల నాన్న‌గారు కంటికి కునుక‌నేది లేకుండా శాస్త్రి ప‌డుకుని ఉన్న మంచం చుట్టూ తిరుగుతూ, ఎప్పుడు గండం గ‌డిచి బ‌య‌ట‌ప‌డ‌తాడా అని ఆదుర్దా ప‌డుతూ వ‌చ్చారు. Also read:  సీతారామ‌శాస్త్రి చేతిరాత‌.. 'కంచె'లోని పాట‌! శాస్త్రికి స్పృహ వ‌చ్చాక తండ్రి చెప్పారు, "అరే అబ్బాయ్‌.. అమ్మంటే క‌థ‌ల్లో రాసివున్న‌ట్లుగా, ఊహ‌ల్లో ఊహించుకున్న‌ట్లుగా ఉండ‌దు. అమ్మ కూడా మామూలు మ‌నిషే. అమ్మ‌త‌నం అంటే క‌నిపించేదీ, వినిపించేదీ కాదురా.. అనిపించేది! రెండు రోజులుగా నువ్వు హాస్పిట‌ల్లో ప‌డుకొని వుంటే, మీ అమ్మ ఒక్క చుక్క నీళ్లు కూడా తాగ‌కుండా విల‌విల‌లాడుతూ ఉంద‌ని నీకు తెలీదు. నువ్వు ఇంటికి వెళ్లాక కూడా 'చాల్లేరా వెధ‌వ ప‌ని' అని అంటుందే కానీ, నిన్ను గుండెల‌కు హ‌త్తుకొని సినిమాల్లో లాగా డైలాగులు చెప్ప‌దు. మామూలు అమ్మ‌లు ఇలాగే ఉంటారు" అని. ఆ త‌ర్వాత కాలంలో ఒక పాట‌లో తాను అమ్మంటే ఎవ‌రంటే చూపించే వేలుంటే, ఆ వేలుకి తెలిసేనా అమ్మంటే అనే మాట‌లు రాశాన‌ని సీతారామ‌శాస్త్రి చెప్పుకున్నారు.

'జై ప‌వ‌ర్‌స్టార్' అని అన‌లేక‌పోయిన బ‌న్నీ 'జై బాల‌య్య' అని ఎలా అన‌గ‌లిగాడు?

  బాల‌కృష్ణ 'అఖండ' మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్‌లో అల్లు అర్జున్ స్పీచ్ ఇప్పుడు వివాదాన్ని రేకెత్తించింది. ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ అత‌నిపై గ‌ర‌మ్ గ‌ర‌మ్‌గా చ‌ర్చించుకుంటున్నారు. 'అఖండ' ఈవెంట్‌కు అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్‌గా అటెండ్ అవ‌డ‌మే ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తే.. త‌న స్పీచ్‌లో బాల‌య్య‌ను బ‌న్నీ పొగిడిన తీరు మ‌రింత ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించింది. ఇక త‌న స్పీచ్‌ను అత‌ను "జై బాల‌య్య" అని ముగించ‌డం బాల‌కృష్ణ ఫ్యాన్స్‌ను ఆనంద‌డోలిక‌ల్లో ముంచెత్త‌గా, మెగా ఫ్యాన్స్‌కు మాత్రం షాక్‌నిచ్చింది. కొంత కాలంగా మెగా క్యాంప్ నుంచి బ‌య‌ట‌కొచ్చి 'అల్లు ఆర్మీ'ని త‌యారుచేసుకున్న బ‌న్నీపై మెగా ఫ్యాన్స్ గుర్రుమంటూనే ఉన్నారు. ఇండ‌స్ట్రీలో త‌న‌దైన ముద్ర వేయ‌డంతో పాటు ఇమేజ్ ప‌రంగా టాప్‌లో ఉండ‌టానికి తీవ్రంగా కృషి చేస్తున్నాడు బ‌న్నీ. గ‌తంలో ఒక‌సారి ఒక ఈవెంట్‌లో బ‌న్నీ మాట్లాడుతున్న‌ప్పుడు 'జై ప‌వ‌ర్‌స్టార్' అనాల్సిందిగా ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్ గ‌ట్టిగా అర‌వ‌డం, 'చెప్ప‌ను బ్ర‌ద‌ర్' అని బ‌న్నీ అన‌డం వార్త‌ల్లో నిలిచింది. అప్ప‌ట్నుంచీ మెగా ఫ్యాన్స్‌.. మ‌రీ ముఖ్యంగా ప‌వ‌ర్‌స్టార్ ఫ్యాన్స్ బ‌న్నీ మీద గుస్సా అవుతున్నారు.  అలాంటిది ఇప్పుడు 'అఖండ' ప్రి రిలీజ్ ఈవెంట్‌లో "జై బాల‌య్య" అని బ‌న్నీ నినాదాన్నివ్వ‌డం ప‌వ‌ర్‌స్టార్ ఫ్యాన్స్‌ను మ‌రింత ఆగ్ర‌హానికి గురిచేసింద‌ని అంటున్నారు. త‌న ప్ర‌సంగం చివ‌ర‌లో "మీ అంద‌రి ప్రేమ‌, మీ అంద‌రి అభిమానం కోసం జై బాల‌య్య‌!" అంటూ చేయెత్తి చెప్పాడు బ‌న్నీ. అలాగే బాల‌య్య డైలాగ్ డిక్ష‌న్ గురించి విప‌రీతంగా పొగిడేశాడు అర్జున్‌. "ఎన్టీఆర్ గారి త‌ర్వాత బాల‌కృష్ణ‌గారు అంతే అద్భుతంగా డైలాగ్స్ చెప్ప‌గ‌లుగుతారు. ఇందులో ఏమాత్రం అతిశ‌యోక్తి లేదు." అని అత‌ను చెప్పాడు. Also read:  "మీ అంద‌రి ప్రేమ‌, అభిమానం కోసం జై బాల‌య్య‌!" అల్లు అర్జున్ నినాదం!! అంతేనా.. "సెకండ్ లాక్‌డౌన్ త‌ర్వాత ఫ‌స్ట్ వ‌స్తోన్న పెద్ద సినిమా 'అఖండ‌'. ఇదొక అఖండ జ్యోతిలాగా మొత్తం సినిమా ప‌రిశ్ర‌మకే వెలుగునివ్వాల‌ని మ‌న‌స్ఫూర్తిగా ప్ర‌తి ఒక్క‌ళ్లం కోరుకుంటున్నాం. ఈ ఉత్సాహంతో జ‌నాలను అలా థియేట‌ర్ల‌కు ర‌ప్పించి, ఇదే ఉత్సాహాన్ని ఇంకో రెండు వారాల త‌ర్వాత 'పుష్ప' సినిమాతో మ‌రింత ఉత్సాహప‌ర్చి, అంతే ఉత్సాహంతో మ‌రో రెండు మూడు వారాల త‌ర్వాత వ‌స్తున్న 'ఆర్ఆర్ఆర్' సినిమాకు వ‌చ్చి, అంతే ఉత్సాహంతో ఆ త‌ర్వాత వ‌చ్చే సినిమాల‌కు వ‌చ్చి, చిన్నా పెద్దా తేడా లేకుండా అన్ని సినిమాల‌నూ గెలిపించాల‌ని కోరుకుంటున్నాను." అన్నాడు బ‌న్నీ. 'అఖండ‌'తో పాటు త‌న సినిమా 'పుష్ప‌', ఆ త‌ర్వాత వ‌చ్చే రాజ‌మౌళి సినిమా 'ఆర్ఆర్ఆర్' సినిమాల గురించి ప్ర‌స్తావించిన బ‌న్నీ, ఫిబ్ర‌వ‌రి 4న వ‌స్తున్న 'ఆచార్య' పేరును ప్ర‌స్తావించ‌క‌పోవ‌డంపై కూడా మెగా ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. త‌న‌దైన ఎరాను సృష్టించాల‌నే ల‌క్ష్యంతోనే బ‌న్నీ ముందుకు వెళ్తున్నాడ‌ని కొన్ని సంవ‌త్స‌రాలుగా అత‌డి క‌ద‌లిక‌ల‌ను గ‌మ‌నిస్తున్న విశ్లేష‌కులు అంటున్నారు.

ఏపీలో గ‌వర్న‌మెంట్ కంట్రోల్‌లో సినిమా.. టాలీవుడ్ పెద్ద‌లు ఇప్పుడేం చేస్తారు?

  ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సినిమా క‌థ మ‌ళ్లీ మొద‌టికొచ్చింది. త‌మ‌తో స‌మావేశం సంద‌ర్భంగా టికెట్ ధ‌ర‌ల పెంపుపై సినిమాటోగ్ర‌ఫీ మంత్రి పేర్ని నాని సానుకూలంగా స్పందించార‌ని చంక‌లు గుద్దుకున్న టాలీవుడ్ సినిమా పెద్ద‌ల ముఖంలో ఇప్పుడు క‌త్తివాటుకు నెత్తురుచుక్క లేదు. పెద్ద సినిమాలు విడుద‌లైన‌ప్పుడు టిక్కెట్ ధ‌ర‌ల‌ను పెంచుకోవ‌చ్చ‌ని ఆనంద‌ప‌డ్డ ప్రొడ్యూస‌ర్స్‌, డిస్ట్రిబ్యూట‌ర్స్‌, బ‌య్య‌ర్స్‌కు నిన్న అసెంబ్లీలో ప్ర‌వేశ‌పెట్టిన‌ ఏపీ సినిమాస్ రెగ్యుల‌రైజేష‌న్ అమెండ్‌మెంట్ బిల్లు షాక్‌నిచ్చింది. టిక్కెట్ ధ‌రల పెంపు మాత్ర‌మే కాదు.. బెనిఫిట్ షోలు, ఎక్స్‌ట్రా షోలకు కూడా ఈ బిల్లు ప్ర‌కారం చెక్ పడింది. పైగా టికెట్ల‌ను ప్ర‌భుత్వ‌మే ఆన్‌లైన్‌లో అమ్ముతుంది కాబ‌ట్టి ఏపీలో సినిమా ఎగ్జిబిష‌న్ అనేది పూర్తిగా గ‌వ‌ర్న‌మెంట్ కంట్రోల్‌లో వెళ్లిపోయిన‌ట్లేన‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. కొవిడ్ సెకండ్ వేవ్ త‌ర్వాత బిగ్ బ‌డ్జెట్ సినిమాలేవీ విడుద‌ల కాలేదు కాబ‌ట్టి, ఇంత‌దాకా ఏదో విధంగా ఇండ‌స్ట్రీ నెట్టుకొచ్చింది. ఇప్పుడు నంద‌మూరి బాల‌కృష్ణ మూవీ 'అఖండ‌'తో థియేట‌ర్ల‌లో పెద్ద సినిమాల విడుద‌ల‌లు మొద‌ల‌వుతున్నాయి. డిసెంబ‌ర్ 2న 'అఖండ' రిలీజ‌వుతోంది. బోయ‌పాటి శ్రీ‌ను డైరెక్ట్ చేసిన ఈ మూవీకి సినీ గోయ‌ర్స్‌లో ఉన్న క్రేజ్ అసాధార‌ణం. బాల‌య్య‌-బోయ‌పాటి కాంబినేష‌న్‌లో ఇదివ‌ర‌కు వ‌చ్చిన 'సింహా', 'లెజెండ్' సినిమాలు ఒక‌దాన్ని మించి మ‌రొక‌టి బ్లాక్‌బ‌స్ట‌ర్ కావ‌డంతో పాటు, ఇప్ప‌టిదాకా వ‌చ్చిన ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్ 'అఖండ' మూవీకి విప‌రీత‌మైన క్రేజ్ తెచ్చాయి. తెలంగాణ‌లో ఈ మూవీ బెనిఫిట్ షోల‌కు ఫ్యాన్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ ఏపీలో ఇందుకు పూర్తి విరుద్ధ‌మైన వాతావ‌ర‌ణం ఉంది. అక్క‌డ బెనిఫిట్ షోల‌కు చాన్స్ లేక‌పోవ‌డంతో ఫ్యాన్స్ తీవ్ర నిరుత్సాహంతో ఉన్నారు. పైగా ఇప్పుడున్న టికెట్ రేట్ల‌నే కొన‌సాగించాల్సిన ప‌రిస్థితి ఉండ‌టంతో క‌లెక్ష‌న్ల‌పై ఇది పెను ప్ర‌భావాన్ని చూపే ప్ర‌మాదం ఉంది.  'అఖండ' త‌ర్వాత డిసెంబ‌ర్ 17న 'పుష్ప‌', జ‌న‌వ‌రి 7న 'ఆర్ఆర్ఆర్‌', జ‌న‌వ‌రి 12న 'భీమ్లా నాయ‌క్‌', జ‌న‌వ‌రి 14న 'రాధే శ్యామ్' లాంటి భారీ బ‌డ్జెట్ సినిమాలు వ‌స్తున్నాయి. వీటి ఆంధ్ర‌ప్ర‌దేశ్ డిస్ట్రిబ్యూట‌ర్స్‌, బ‌య్య‌ర్స్ ఇప్పుడు తీవ్ర ఆందోళ‌న‌లో మునిగిపోయారు. ఇప్పుడున్న టికెట్ ధ‌ర‌ల‌నే కొన‌సాగిస్తే, ఎక్స్‌ట్రా షోస్‌కు అనుమ‌తి లేక‌పోతే తాము తీవ్రంగా న‌ష్ట‌పోతామ‌ని వారు భ‌య‌ప‌డుతున్నారు. వెంకీ, బాల‌య్య‌, నాగ్, చిరు.. వ‌రుస నెలల్లో భ‌లే ఎంట‌ర్టైన్మెంట్! ఒక‌వైపు నిత్యావ‌స‌ర వ‌స్తువుల నుంచి అన్ని వ‌స్తువుల ధ‌ర‌లు ఇబ్బ‌డి ముబ్బ‌డిగా పెరుగుతుంటే, వాటిని కంట్రోల్ చేయ‌లేని ప్ర‌భుత్వం సినిమా టికెట్ ధ‌రల‌ను మాత్ర‌మే ఎందుకు కంట్రోల్‌లో పెట్టాల‌నుకుంటోంద‌ని ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు. నిత్యావ‌స‌రాలు లేనిదే జ‌నం బ‌త‌క‌లేరు. కానీ వాటి ధ‌ర‌ల‌పై ప్ర‌భుత్వానికి నియంత్ర‌ణ ఉండ‌ట్లేదు. ఎంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా నిత్యావ‌స‌రాలు కొన‌క త‌ప్పుదు. సినిమా విష‌యానికొస్తే అదేమీ నిత్యావ‌స‌రం కాదు. ఇష్ట‌మున్నవాళ్లే సినిమాకు వెళ్తారు. త‌మ తాహ‌తుకు త‌గ్గ టికెట్‌నే కొనుగోలు చేస్తారు. త‌మ తాహ‌తుకు మించిన రేట్లు వుంటే జ‌న‌మే సినిమాల‌కు వెళ్ల‌రు. అలాంట‌ప్పుడు సినిమా విడుద‌లైన స‌మ‌యంలో టికెట్ ధ‌ర‌ల‌ను పెంచుకోవ‌డానికి ఎందుకు ప్ర‌భుత్వాలు అడ్డం ప‌డుతున్నాయ‌నేది డిస్ట్రిబ్యూట‌ర్ల, ఎగ్జిబిట‌ర్ల‌ ప్ర‌శ్న‌.  ప‌రిస్థితి ఇలాగే ఉంటే ఏపీలో థియేట‌ర్లు న‌డ‌ప‌డం క‌ష్ట‌మ‌ని ఎగ్జిబిట‌ర్లు వాపోతున్నారు. ఫ‌లితంగా వాటిని మూసుకోక త‌ప్ప‌ద‌ని వారు ఆందోళ‌న చెందుతున్నారు. సినిమా విష‌యంలో తెలంగాణ‌లో లేని స‌మ‌స్య ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనే ఎందుకుంటోంది? అని వారు ప్ర‌శ్నిస్తున్నారు. కేవ‌లం రాజ‌కీయ కార‌ణాల‌తోనే సినిమాపై కూడా ఏపీ ప్ర‌భుత్వం క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతోంద‌ని అంటున్నారు. 'భీమ్లా నాయక్' రీషూట్.. 'ఆర్ఆర్ఆర్'కు రూట్ క్లియర్!

'బంగార్రాజు' ఆడితే స‌రే.. ఆడ‌క‌పోతే నాగ్ ఏం చేస్తారు?.. ఎక్స్‌క్లూజివ్ స్టోరీ!

  "నేను చేసే సినిమాలు ఎటు తీసుకెళితే అటు వెళ్తాను. ప్రేక్ష‌కులు ఏం కోరుకుంటున్నారో తెలుసుకొని అటు వెళ్ల‌డానికి ప్ర‌య‌త్నిస్తాను".. అని ఒక ఇంట‌ర్వ్యూలో చెప్పారు నాగార్జున‌. కానీ ఆయ‌న నాలుగేళ్ల నుంచీ ఎటు వెళ్తున్నారో అర్థం కావ‌ట్లేద‌ని ఆయ‌న అభిమానులే అంటున్నారు. 2016లో వ‌చ్చిన 'సోగ్గాడే చిన్నినాయ‌నా' త‌ర్వాత ఆ రేంజి హిట్ కావాల‌ని, ఆ త‌ర‌హా ఎంట‌ర్‌టైన‌ర్ కావాల‌ని వారు సోష‌ల్ మీడియా వేదిక‌గా కోరుతున్నారు. క‌ల్యాణ్ కృష్ణ డైరెక్ట్ చేసిన ఆ మూవీలో తండ్రీ కొడుకులుగా నాగార్జున డ‌బుల్ రోల్ చేసి ఆక‌ట్టుకున్నారు. ముఖ్యంగా తండ్రి బంగార్రాజు క్యారెక్ట‌ర్‌లో ఆయ‌న అమిత వినోదాన్ని పండించారు. ర‌మ్య‌కృష్ణ‌తో ఆయ‌న చేసే స‌ర‌సాలు పెద్ద‌వాళ్ల‌నే కాకుండా యూత్‌ను కూడా అల‌రించాయి. కొడుకు క్యారెక్ట‌ర్ జోడీగా లావ‌ణ్యా త్రిపాఠి స‌రిగ్గా స‌రిపోయి, విశ్లేష‌కుల్ని సైతం విస్మ‌యానికి గురిచేసింది. ఆ క‌పుల్ స్క్రీన్‌మీద ఎలాగుంటుందోన‌ని సందేహించిన వాళ్ల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రుస్తూ నాగ్‌-లావ‌ణ్య జంట ఆక‌ట్టుకుంది. నాగ్ కెరీర్‌లోనే 'సోగ్గాడే చిన్నినాయ‌నా' బిగ్గెస్ట్ గ్రాస‌ర్‌గా నిలిచింది. ఆయ‌న‌లో వాడి ఏమాత్రం త‌గ్గ‌లేద‌ని బంగార్రాజుగా ఆయ‌న ప్ర‌ద‌ర్శించిన అభిన‌యం తెలిపింది. కానీ ఆ మూవీ త‌ర్వాత ఆయ‌న త‌న ఫ్యాన్స్‌ను అల‌రించే సినిమాని ఇంత‌వ‌ర‌కూ అందించ‌లేక‌పోయారు. వంశీ పైడిప‌ల్లి డైరెక్ష‌న్‌లో చేసిన సినిమా 'ఊపిరి'.. నాగ్ కంటే కార్తీకే ఎక్కువ మైలేజ్‌నిచ్చింది. వీల్‌చైర్‌కి అంకిత‌మైన క్యారెక్ట‌ర్‌లో నాగ్ ప‌ర్ఫార్మెన్స్‌ను ఫ్యాన్స్ ఎంజాయ్ చెయ్య‌లేక‌పోయారు. విమ‌ర్శ‌కులు మెచ్చిన ఆ సినిమా త‌న‌కు ఆర్థికంగా న‌ష్టాన్ని చేకూర్చిందని ఆ సినిమా ప్రొడ్యూస‌ర్ పొట్లూరి వ‌ర‌ప్ర‌సాద్ స్వ‌యంగా ప్ర‌క‌టించారు. దాని త‌ర్వాత శ్రీ‌కాంత్ త‌న‌యుడు రోష‌న్ హీరోగా ప‌రిచ‌య‌మైన 'నిర్మ‌లా కాన్వెంట్' సినిమాలో త‌న నిజ జీవిత పాత్ర‌నే పోషించారు నాగ్‌. దాని వ‌ల్ల ఆయ‌న‌కు కాస్త కూడా లాభం క‌ల‌గ‌లేదు. 2017లో హాథీరామ్ బాబా జీవిత క‌థ‌తో కె. రాఘ‌వేంద్ర‌రావు రూపొందించిన 'ఓం న‌మో వేంక‌టేశాయ' సినిమాలో హాథీరామ్‌గా నాగార్జున న‌టించారు. అదెంత డిజాస్ట‌ర్ అయ్యిందంటే విడుద‌లైన తొలి రోజే థియేట‌ర్ల‌కు మెయిన్‌టెనెన్స్ డ‌బ్బులు కూడా రాలేదు. ఇది నాగార్జున ఏమాత్రం ఊహించ‌ని విష‌యం. దాని త‌ర్వాత ఓంకార్ డైరెక్ష‌న్‌లో 'రాజుగారి గ‌ది 3' చేశారాయ‌న‌. అందులోనూ ఆయ‌న హీరో క్యారెక్ట‌ర్ కాకుండా స్పెష‌ల్ రోల్ చేశారు. అదీ ఆడ‌లేదు. అప్పుడు వ‌చ్చింది 'శివ' కాంబినేష‌న్ మూవీ 'ఆఫీస‌ర్‌'. రామ్‌గోపాల్ వ‌ర్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి తొలిరోజు తొలి ఆట‌కే ఈగ‌లు తోలుకున్నారు థియేట‌ర్ల వాళ్లు. కొన్ని చోట్ల ఫ‌స్ట్ షో నుంచి వేరే సినిమా వేసుకున్నారంటే.. ఈ సినిమా క్రియేట్ చేసిన రికార్డ్ అలాంటిద‌న్న మాట‌. నాగ్ కెరీర్‌లోనే అత్యంత చెత్త‌, అతిపెద్ద డిజాస్ట‌ర్ మూవీగా నిలిచింది 'ఆఫీస‌ర్‌'. మ‌ల్టీస్టార‌ర్ సినిమాల్లో న‌టిస్తే త‌మ ప్రాధాన్యం త‌గ్గిపోతుంద‌నో, ఇంకొక‌రితో స‌క్సెస్ షేర్ చేసుకోవ‌డం ఇష్టంలేక‌నో, ఇమేజ్ చ‌ట్రంలో ఇరుక్కొనో చాలామంది స్టార్లు మొన్న‌టి దాకా ఆ త‌ర‌హా సినిమాలు చేయ‌డానికి ముందుకు రాలేదు. కానీ చాలా కాలం నుంచీ ఇద్ద‌రు హీరోల సినిమాల్లో న‌టిస్తూ త‌న‌కు ఎలాంటి ఇగో లేద‌ని నాగార్జున తెలియ‌జేస్తూ వ‌స్తున్నారు. అందుకు ఆయ‌న‌ను అభినందించాల్సిందే. అదే కోవ‌లో నానితో తెర‌ను పంచుకుంటూ 'దేవ దాస్' మూవీ చేశారు. అందులో గ్యాంగ్‌స్ట‌ర్ దేవాగా న‌టించారు. కానీ ఆ సినిమా కూడా ఫ్లాప‌యింది. ఇక గ‌త ఏడాది 'ఐ డు' అనే ఫ్రెంచ్ ఫిల్మ్‌కు రీమేక్‌గా 'మ‌న్మ‌థుడు 2' సినిమా చేశారు నాగ్‌. శోచ‌నీయ‌మైన విష‌య‌మేమంటే ఆ సినిమా ద్వారా ఆయ‌న తిట్లు తింటే, హీరోయిన్‌గా చేసిన ర‌కుల్‌ప్రీత్ ప్ర‌శంస‌లు అందుకుంది. అలాంటి అడ‌ల్ట్ కంటెంట్ ఉన్న సినిమాని, కాస‌నోవా టైప్ క్యారెక్ట‌ర్‌ను అర‌వై ఏళ్ల వ‌య‌సులో చేస్తే ప్రేక్ష‌కులు ఎలా రిసీవ్ చేసుకుంటార‌నే క‌నీస ఆలోచ‌న లేకుండా చేసి, తీవ్ర విమ‌ర్శ‌ల పాల‌య్యారు నాగార్జున‌. ఇంక ఆయ‌న ఏమాత్ర‌మూ 'మ‌న్మ‌థుడు' కాడంటూ అక్షింత‌లు ప‌డ్డాయి. దాని త‌ర్వాత 'ఊపిరి' రైట‌ర్ అహిషోర్ సాల్మ‌న్ డైరెక్ష‌న్‌లో 'వైల్డ్ డాగ్' మూవీ చేశారు నాగ్‌. 2020 ఫిబ్ర‌వ‌రిలోనే షూటింగ్ కంప్లీట్ అయిన‌ప్ప‌టికీ మ‌హ‌మ్మారి కార‌ణంగా విడుద‌ల వాయిదా ప‌డుతూ, ఎట్ట‌కేల‌కు ఈ ఏడాది ఏప్రిల్‌లో థియేట‌ర్ల‌లో విడుద‌లైంది 'వైల్డ్ డాగ్‌'. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందిన‌ప్ప‌టికీ, ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌ను మాత్రం ఈ సినిమా పొంద‌లేక‌పోయింది. ఏసీపీ విజ‌య్‌వ‌ర్మ‌గా నాగ్ రాణించిన‌ప్ప‌టికీ, సినిమాపై బ‌జ్ లేని కార‌ణంగా ఆడియెన్స్ ఆస‌క్తి చూప‌లేదు.  ప్రేక్ష‌కులు ఏం కోరుకుంటున్నార‌నే విష‌యంలో త‌ప్పులో కాలువేసి, ఒక‌దాని త‌ర్వాత ఒక‌టిగా త‌ప్పులు చేస్తూ, రాంగ్ స్క్రిప్ట్స్ ఓకే చేస్తూ, ఫ్యాన్స్‌ను డిజ‌ప్పాయింట్ చేస్తూ వ‌స్తున్న నాగార్జున‌.. ఇప్పుడు 'బంగార్రాజు' మూవీని చేస్తున్నారు. 2016 సంక్రాంతికి విడుద‌లై నాగ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ గ్రాస‌ర్‌గా నిలిచిన 'సోగ్గాడే చిన్నినాయ‌నా' మూవీతో డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌య‌మైన క‌ల్యాణ్ కృష్ణ కుర‌సాల ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే 'సోగ్గాడే..'కు 'బంగార్రాజు' ప్రిక్వెల్ కావ‌డం. ఈ సినిమాలో నాగ‌చైత‌న్య కూడా న‌టిస్తున్నాడు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రొమాంటిక్ కామెడీగా రూపొందుతోన్న ఈ సినిమాతో సూప‌ర్‌హిట్ కొడ‌తాన‌నే న‌మ్మ‌కాన్ని నాగ్ వ్య‌క్తం చేస్తున్నారు. 2022 సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. "ప్రేక్ష‌కులు ఎన్నాళ్లు నన్ను హీరోగా చూస్తారో అంత‌దాకా చేస్తాను. వాళ్లు చూడ‌లేం, వ‌ద్దు.. అన్న‌ప్పుడు వేరే దోవ చూసుకుంటాను" అని ఒక‌ప్పుడు చెప్పిన నాగ్‌.. మునుముందు ఏం చేస్తారో చూడాల్సిందే.

ప్ర‌భాస్ 'ఆదిపురుష్' డైరెక్ట‌ర్ ఓం రౌత్ గురించి మీకెంత తెలుసు?

  ప్రేక్షకుల ముందుకు 2022 ఆగ‌స్ట్ 11న‌ 'ఆదిపురుష్'గా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రానున్నాడు. బాలీవుడ్ డైరెక్ట‌ర్‌ ఓం రౌత్‌ దర్శకత్వంలో ప్రముఖ మ్యూజిక్ లేబుల్ టీ సిరీస్ నిర్మాణంలో, టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ నిర్మాతగా మన బాహుబలి ఈ సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ను ఇటీవ‌లే కంప్లీట్ చేశారు. రెట్రోఫిల్స్ నిర్మాణ భాగ‌స్వామి. భూష‌ణ్ కుమార్‌, క్రిష‌న్ కుమార్‌, ఓం రౌత్‌, ప్ర‌సాద్ సుతార్‌, రాజేశ్ నాయ‌ర్ నిర్మాత‌లు.  'ఆదిపురుష్' ప్ర‌భాస్ నేరుగా బాలీవుడ్‌లో న‌టిస్తోన్న ఫ‌స్ట్ ఫిల్మ్‌. ఈ సినిమా ఎనౌన్స్‌మెంట్ టైమ్‌లోనే చెడుపై మంచి సాధించిన విజయాన్ని సెలబ్రేట్ చేసుకుందామని అత‌ను చెప్పాడు. రామ‌య‌ణ గాథ‌తో త‌యార‌వుతున్న 'ఆదిపురుష్‌'లో శ్రీ‌రామునిగా ప్ర‌భాస్‌, జాన‌కి (సీత‌)గా కృతి స‌న‌న్ న‌టిస్తుండ‌గా, లంకేశు (రావ‌ణుడు)నిగా సైఫ్ అలీఖాన్‌, ల‌క్ష్మ‌ణునిగా స‌న్నీ సింగ్ క‌నిపించ‌నున్నారు. తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం భాషల్లో సినిమా రూపొందుతున్న ఈ సినిమాని వివిధ ప్ర‌పంచ భాష‌ల్ల‌నోనూ రిలీజ్ చేస్తార‌ని తెలుస్తోంది. జపాన్‌లో ప్రభాస్ ఫాలోయింగ్ బాగానే ఉంది. అలాగే మరికొన్ని దేశాల్లోనూ ఆయ‌న భారీ సంఖ్య‌లో అభిమానులు ఉన్నారు. అందుకనే వ‌ర‌ల్డ్ వైడ్‌గా భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.  'ఆదిపురుష్' డైరెక్ట‌ర్ ఓం రౌత్ అదివ‌ర‌కు తీసింది రెండంటే రెండు సినిమాలే. 2020 సంక్రాంతి సీజ‌న్‌లో విడుద‌లై బ్లాక్‌బ‌స్ట‌ర్ అయిన‌ 'తానాజీ' రెండో సినిమా కాగా, దానికి ఐదేళ్ల ముందు 2015లో 'లోక్‌మాన్య‌: ఏక్ యుగ్‌పురుష్' అనే మ‌రాఠీ సినిమాతో డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌య‌మ‌య్యాడు. అది జాతీయ‌, అంత‌ర్జాతీయ స్థాయిలో ప‌లు అవార్డుల‌ను పొందింది. స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు, సంఘ సంస్క‌ర్త లోక‌మాన్య బాల‌గంగాధ‌ర్ తిల‌క్ బ‌యోపిక్‌గా దాన్ని తీశాడు రౌత్‌. దాని త‌ర్వాత ఐదేళ్ల‌కు ఛ‌త్ర‌ప‌తి శివాజీ సైన్యాధిప‌తి తానాజీ జీవితం ఆధారంగా బ‌యోగ్రాఫిక‌ల్ పీరియ‌డ్ యాక్ష‌న్ ఫిల్మ్ 'తానాజీ: ది అన్‌సింగ్ వారియ‌ర్‌'ను తీశాడు. ఈ రెండు సినిమాల‌ను బ‌ట్టి రౌత్ జాతీయ భావాలు పుష్క‌లంగా ఉన్న వ్య‌క్తిగా, మ‌న భార‌తీయ సంస్కృతీ సంప్ర‌దాయాల‌పై అమిత గౌర‌వాభిమానాలు ఉన్న వ్య‌క్తిగా మ‌నం అర్థం చేసుకోవ‌చ్చు. ఇప్పుడు ప్ర‌భాస్‌తో అత‌ను 'ఆదిపురుష్‌'ను తెర‌కెక్కిస్తున్నాడు. ఇది రామాయ‌ణం క‌థ‌. అంటే త‌న భావ‌జాలానికి త‌గ్గ క‌థాంశాల‌తోనే అత‌ను సినిమాలు తీయ‌డాన్ని కొన‌సాగిస్తున్నాడు. ప్ర‌భాస్‌ను తెర‌పై రౌత్ ఎలా ప్రెజెంట్ చేస్తున్నాడ‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. డైరెక్ట‌ర్ కాక‌ముందు రౌత్ ప్రొడ్యూస‌ర్‌. 2010లో మ‌హేశ్ మంజ్రేక‌ర్ డైరెక్ష‌న్‌లో 'సిటీ ఆఫ్ గోల్డ్‌', 2011లో విక్ర‌మ్ భ‌ట్ డైరెక్ష‌న్‌లో 'హాంటెడ్ 3డి' ఫిల్మ్‌ను అత‌ను ప్రొడ్యూస్ చేశాడు. అయితే అత‌ని పేరు అంద‌రి నోళ్ల‌లో నానింది మాత్రం అజ‌య్ దేవ్‌గ‌ణ్‌ను టైటిల్ రోల్‌లో చూపిస్తూ రూపొందించిన 'తానాజీ' మూవీతోటే. ఇప్పుడు అత‌ని డైరెక్షన్‌లో టి సిరీస్ భూష‌ణ్ కుమార్ భారీ బ‌డ్జెట్‌తో ఏక కాలంలో హిందీ, తెలుగు భాష‌ల్లో 3డి ఫార్మ‌ట్‌లో 'ఆదిపురుష్‌'ను నిర్మిస్తున్నారు. 'బాహుబ‌లి'గా ప్ర‌పంచ‌వ్యాప్తంగా అభిమానుల‌ను అల‌రించిన ప్ర‌భాస్ 'ఆదిపురుష్‌'గా ఏ స్థాయిలో అల‌రిస్తాడో వెయిట్ అండ్ సీ.

కంప్యూట‌ర్ సైన్స్ నుంచి థియేట‌ర్ ఆర్ట్స్‌కు మారిన ల‌క్ష్మీ మంచు!

  ల‌క్ష్మీ మంచు యు.ఎస్‌.లో చ‌దువుకున్నార‌నే విష‌యం చాలా మందికి తెలీదు. డిగ్రీ కోసం అమెరికా వెళ్లిన‌ప్పుడు అంద‌రు ద‌క్షిణాది అమ్మాయిల్లాగే ఆమె కూడా ఒక్ల‌హామా సిటీ యూనివ‌ర్సిటీలో కంప్యూట‌ర్ సైన్స్‌లో చేరారు. క్లాస్‌లో కూర్చుంటే నిద్ర వ‌చ్చేసేది. ఒక్క ముక్క అర్థ‌మ‌య్యేది కాదు. మాథ్స్ అస్స‌లు ఎక్కేది కాదు. ఫ‌స్ట్ సెమిస్ట‌ర్‌లో ఉండ‌గానే ఒక‌సారి కాలేజీలో ఏదో నాట‌కం వేస్తుంటే వెళ్లారు. అక్క‌డి స్టేజ్ త‌న‌ను పిలుస్తున్న‌ట్లే అనిపించింది. త‌నేం కోల్పోయిందో ఆ క్ష‌ణంలోనే అర్థ‌మైంది. మ‌రుస‌టి రోజు త‌న కౌన్సిల‌ర్ ద‌గ్గ‌ర‌కు వెళ్లి "న‌న్ను థియేట‌ర్ ఆర్ట్స్‌లోకి మార్చేయండి" అని అడిగారు ల‌క్ష్మి. ఆమె "పిచ్చా, వెర్రా" అని తిట్టింది. "అది కంప్లీట్‌గా ఇంగ్లీష్ ఓరియంటెడ్ థియేట‌ర్. షేక్‌స్పియ‌ర్ ద‌గ్గ‌ర్నుంచి ఇప్ప‌టిదాకా ప్ర‌పంచ‌వ్యాప్తంగా చేసిన నాట‌కాల‌న్నీ నేర్చుకోవాలి. పైగా ఇక్క‌డ నువ్వొక్క‌దానివే ఇండియ‌న్ స్టూడెంట్‌వి. చాలా క‌ష్టం" అని చెప్పింది. కానీ ల‌క్ష్మి విన‌లేదు. థియేట‌ర్ ఆర్ట్స్‌కి మారింది. ఆ త‌ర్వాత కాలేజీలో ప్ర‌తి నాట‌కంలోనూ ఆమె పార్టిసిపేట్ చేస్తూ వ‌చ్చారు. నిజానికి అది సుల‌భం కాదు. అంద‌రినీ సెల‌క్ట్ చేయ‌రు. ప్ర‌తి నాట‌కానికీ ఆడిష‌న్స్ జ‌రుగుతాయి. దాన్ని బ‌ట్టే న‌ట‌న‌లో ఆమె ప్ర‌తిభ ఏమిట‌నేది అర్థం చేసుకోవ‌చ్చు. కాబ‌ట్టే తెలుగులో న‌టించిన తొలి సినిమా 'అన‌గ‌నగా ఓ ధీరుడు'లో చేసిన ఐరేంద్రి క్యారెక్ట‌ర్‌తోటే ఉత్త‌మ విల‌న్‌గా నంది అవార్డు అందుకున్నారు. తెలుగులో నటించ‌డానికంటే ముందు 'ది ఓడ్‌', 'డెడ్ ఎయిర్' అనే ఇంగ్లీష్ సినిమాల్లో ఆమె న‌టించారు. నిజానికి సినిమాల కంటే ముందు అమెరిక‌న్ టెలివిజ‌న్ సిరీస్‌ల‌లో న‌టించారు ల‌క్ష్మి. మొద‌ట‌గా 2004లోనే 'లాస్ వేగాస్' సిరీస్‌లో చేసిన స‌ర‌స్వతి క్యారెక్ట‌ర్ ఆమెకు మంచి పేరు తెచ్చింది.

ఎవ‌ర్‌గ్రీన్ బ్యూటీ రేఖ గురించి మీకు తెలీని ఏడు విష‌యాలు!

  అంద‌చందాలు, అభిన‌య సామ‌ర్థ్యంతో అరుదైన తార‌గా పేరుపొందారు రేఖ‌. జెమినీ గ‌ణేశ‌న్‌, పుష్ప‌వ‌ల్లి దంప‌తుల కుమార్తె అయిన రేఖ మొద‌ట తెలుగులో ఒక సినిమాలో న‌టించి, ఆ త‌ర్వాత బాలీవుడ్ అవ‌కాశాల‌ను రెండు చేతులా అందిపుచ్చుకుని, వాటిని స‌ద్వినియోగం చేసుకొని, చాలా కాలం ప్రేక్ష‌కుల క‌ల‌ల‌రాణిగా వారి హృద‌యాల్లో స్థానం సంపాదించుకున్నారు. అరుదైన అందగ‌త్తె అయిన ఆమె త‌ను చేసిన ప్ర‌తి పాత్ర‌తోనూ ప్రేక్ష‌కుల అభిమానాన్ని పొందారు. ఇవాళ 67 సంవ‌త్స‌రాల వ‌య‌సులోనూ ఆమె గ్లామ‌ర్ చెర‌గ‌లేదు. బిగ్ స్క్రీన్‌పై అద్భుత‌మైన అభిన‌యాల‌ను ప్ర‌ద‌ర్శించిన రేఖ‌, ఫ్యాష‌న్ విష‌యంలోనూ ఐకాన్‌గా నిలిచారు. ఆమె గురించి చాలామందికి తెలీని నిజాలు... 1. త‌ల్లితండ్రుల త‌ర‌హాలో యాక్ట‌ర్ కావాల‌ని మొద‌ట్లో రేఖ అనుకోలేదు. ప్ర‌పంచాన్ని చుట్టి రావాల‌నేది ఆమె క‌ల‌. అందుకే ఎయిర్ హోస్టెస్ కావాల‌నుకున్నారు. యంగ్ ఏజ్‌లో ఎయిర్ హోస్టెస్‌ల‌తో స్నేహంచేసి, విదేశాల నుంచి బెస్ట్ మేక‌ప్ బ్రాండ్స్‌ను తెప్పించుకుంది. ఆమెకు మేక‌ప్ అంటే ఇష్టం. 2. నాలుగు ద‌శాబ్దాల‌కు పైగా సినీ కెరీర్‌లో అమితాబ్ బ‌చ్చ‌న్‌, ధ‌ర్మేంద్ర‌, శ‌త్రుఘ్న సిన్హా, జితేంద్ర‌, సంజ‌య్ ద‌త్ లాంటి స్టార్స్ స‌ర‌స‌న న‌టించిన ఆమెకు లెజెండ‌రీ యాక్ట‌ర్ దిలీప్ కుమార్‌తో న‌టించే అవ‌కాశం ఎప్పుడూ రాలేదు. ఆమె తీర‌ని కోరిక‌ల్లో ఒక‌టిగా ఇది మిగిలిపోయింది. 3. రేఖ గొప్ప న‌టి మాత్ర‌మే కాదు, ఆమెలో చ‌క్క‌ని మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా ఉంది. యారానా మూవీలో నీతు సింగ్‌కు, వారిస్‌లో స్మితా పాటిల్‌కు డ‌బ్బింగ్ చెప్పారు. 4. ఫ్యాష‌న్ అంటే ఇష్ట‌ప‌డేవాళ్ల‌కు ఒక ఐడ‌ల్‌గా నిలిచారు రేఖ‌. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే, ఆమె ఎన్న‌డూ సొంత‌ స్టైలిస్ట్‌ను పెట్టుకోలేదు. త‌న రూపాన్ని, స్టైల్‌ను త‌నే డిజైన్ చేసుకుంటారు. 5. హిందీ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనే ఒక జిమ్‌లో పేరు న‌మోదుచేసుకున్న తొలి తార రేఖ‌. హోట‌ల్ ర‌మీ ఇంట‌ర్నేష‌న‌ల్‌లోని జిమ్‌లో ఆమె స్విమ్మింగ్‌, బేసిక్ ఎక్స‌ర్‌సైజ్‌లు ప్రాక్టీస్ చేసేవారు. 6. సినీ రంగంలో ఇవాళ హీరోయిన్లు ప‌లువురు ఒక‌రితో ఒక‌రు ఫ్రెండ్‌షిప్ చేస్తున్నారు. కానీ ఒక‌ప్పుడు ఏ ఇద్ద‌రు హీరోయిన్లు ఫ్రెండ్స్ కాలేర‌నే నానుడి ఉండేది. కానీ రేఖ మాత్రం హేమ‌మాలినితో స‌న్నిహిత స్నేహం కొన‌సాగించారు. 7. రేఖ స‌మ‌య‌పాల‌న‌కు చాలా ప్రాధాన్యం ఇస్తారు. ప్ర‌పంచంలోని మిగ‌తా అన్ని విష‌యాల‌కంటే ఆమె అత్య‌ధిక గౌర‌వం ఇచ్చేది టైమ్‌కే.

పొర‌పాటున షాలిని మ‌ణిక‌ట్టుపై కోసిన అజిత్‌.. ఆ త‌ర్వాత మొద‌లైంది ల‌వ్ స్టోరీ!

  అది 1999వ సంవ‌త్స‌రం.. 'అమ‌ర్క‌ల‌మ్' సినిమా సెట్స్‌.. హీరోయిన్ చేతిని హీరో చాకుతో గాయ‌ప‌రుస్తున్న‌ట్లు న‌టించాల్సిన స‌న్నివేశం. ఆ హీరో అజిత్‌.. ఆ హీరోయిన్ షాలిని. ఆ సీన్‌ను డైరెక్ట‌ర్ ప్లాన్ చేశాడు. కానీ షాలిని గాయం ప్లాన్ చేసింది కాదు. అజిత్ కేవ‌లం గాయ‌ప‌రుస్తున్న‌ట్లు న‌టించాలి. కానీ పొర‌పాటున‌, ఆమె మ‌ణిక‌ట్టు కోసుకుని, ర‌క్తం చిందింది. ఆ దుర‌దృష్ట‌క‌ర పొర‌పాటు రెండు భిన్న ధ్రువాల‌ను క‌లిపింది. షాలినికి గాయమై బ్లీడింగ్‌ కావ‌డంతో బాగా ఆందోళ‌న చెందాడు అజిత్‌. కానీ షాలిని ఆ గాయాన్ని ప‌ట్టించుకోలేదు. విజాతి ధ్రువాలు ఆక‌ర్షించుకుంటాయ‌నే సూత్రం ఆ ఇద్ద‌రిపై ప‌నిచేసింది. త‌న కోసం అజిత్ ఆందోళ‌న‌ప‌డ‌టం షాలినిని క‌దిలించి, అత‌డివైపు ఆక‌ర్షితురాల‌య్యేట్లు చేసింది. మ‌రోవైపు, త‌న‌కేమీ కానట్లు ప్ర‌శాంతంగా క‌నిపించిన షాలిని చూసి ఆశ్చ‌ర్య‌పోయి, అప్ప‌ట్నుంచీ ఆమెను భిన్నంగా చూడ‌సాగాడు అజిత్‌. అలా.. త‌మిళ చిత్ర‌సీమ‌లోని ఫేవ‌రేట్ ల‌వ్ స్టోరీస్‌లో ఒక‌టి మొద‌లైంది. అజిత్‌, షాలిని తొలిసారి క‌లుసుకున్న సంద‌ర్భం అది కాదు. గ్రేడ్ 2 ఎగ్జామ్స్ కోసం షాలిని ప్రిపేర‌వుతున్న‌ప్పుడు 'అమ‌ర్క‌ల‌మ్' మూవీ కోసం నిర్మాత‌లు ఆమెను సంప్ర‌దించారు. అప్ప‌టికే ఆమె హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన 'కాద‌లుక్కు మ‌రియాదై' హిట్ట‌యింది. ఆ సినిమాలో న‌టించాక‌, చ‌దువుపై శ్ర‌ద్ధ పెట్టాల‌నుకుంది షాలిని. కానీ డైరెక్ట‌ర్ శ‌ర‌ణ్ 'అమ‌ర్క‌ల‌మ్‌'లో అజిత్‌, షాలిని జంట‌గా న‌టించాల‌ని కోరుకున్నాడు. అందుకే ఆమె నిర్ణ‌యం తెలుసుకోవ‌డం కోసం ఫోన్ చేశాడు అజిత్‌. చ‌దువుకు ఆటంకం క‌ల‌గ‌డానికి ఇష్ట‌ప‌డ‌ని షాలిని ఆ సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డానికి ఒప్పుకోలేదు. ఆమె ప్రాధాన్య‌త‌ను గుర్తించిన అజిత్‌, శ‌ర‌ణ్ ఎగ్జామ్స్ అయ్యాకే షూటింగ్ పెట్టుకుంటామ‌ని చెప్పారు.  ఇంత‌లో అజిత్‌ 'కాద‌ల్ మ‌న్న‌న్' (1998) సినిమా విడుద‌లై, దాని ప్రీమియ‌ర్‌కు రావాల్సిందిగా షాలినికి ఆహ్వానం వ‌చ్చింది. ఆ ప్రీమియ‌ర్ ద‌గ్గ‌ర అజిత్‌ను తొలిసారి క‌లుసుకున్న వైనాన్ని ఆ త‌ర్వాత ఇచ్చిన ఒక ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించింది షాలిని. "నేన‌ప్పుడు జుట్టును ఉంగ‌రాలుగా చేసుకున్నాను. నాతో క‌ర‌చాల‌నం చేసి, నాకు ఆ ఉంగ‌రాల జుట్టు న‌ప్ప‌లేద‌ని చెప్పాడు. నాకు చిరాకు అనిపించింది. నా ముఖంవంక చూసి, 'ప్లీజ్ త‌ప్పుగా అనుకోవ‌ద్దు. కాద‌ల‌క్కు మ‌రియాదై మూవీలో నీ జుట్టు స్వేచ్ఛ‌గా ఎగిరిన తీరు చాలా బాగుంది' అని చెప్పాడు. అత‌ని మాట‌ల్లోని నిజాయితీ నాకు న‌చ్చింది" అని చెప్పింది షాలిని. 'అమ‌ర్క‌ల‌మ్' సెట్స్‌పై జ‌రిగిన ఘ‌ట‌న త‌ర్వాత‌, కొద్ది కాలానికే త‌న జీవిత భాగ‌స్వామి షాలిని అని ఫిక్స‌యిపోయాడు అజిత్‌. ఆ టైమ్‌లో ఇచ్చిన ఒక ఇంట‌ర్వ్యూలో, షాలిని త‌న స‌ముద్ర‌మ‌ని చెప్పాడు. "నేను న‌ది లాంటి వాడిని. నా జీవితం చాలా మ‌లుపులు తిరిగింది. అనేక రాళ్ల‌ను ఢీకొట్టింది. నా భుజాల మీద చాలా బాధ్య‌త‌లు ఉన్నాయి. నాకోసం ఇప్పుడు స‌ముద్రాన్ని క‌నిపెట్టాను. ఆ స‌ముద్రం నాకు ప్ర‌శాంత‌త‌ను ఇచ్చి, నాకు స్ఫూర్తినివ్వ‌డంలో తోడ్ప‌డుతుంద‌ని న‌మ్ముతున్నాను." అని చెప్పాడు అజిత్‌. షాలిని క‌మిట్ అయిన ప్రాజెక్ట్స్ పూర్త‌య్యాక ఆ ఇద్ద‌రూ జీవిత భాగ‌స్వాముల‌య్యారు. బాల‌న‌టిగా పాపులారిటీ తెచ్చుకొని, హీరోయిన్‌గా స‌క్సెస్ అయిన షాలిని పెళ్లి త‌ర్వాత సినిమాల్లో ఇక న‌టించ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకుంది. ష‌నేను న‌ట‌న‌ను ఎంజాయ్ చేశాను. కానీ అజిత్ మ‌రింత టెప్టింగ్‌గా ఉన్నాడు. న‌ట‌న‌ను వ‌దిలేయ‌డానికి నాకెలాంటి సంకోచాలు లేవు. ఒక‌వైపు ఇంటినీ, ఇంకోవైపు కెరీర్‌ను మేనేజ్ చేసుకోగ‌ల ర‌కం మ‌నిషిని కాదు నేను. ప్ర‌యారిటీస్ విష‌యంలో నేను చాలా క్లియ‌ర్‌గా ఉన్నా, ఇది చాలా హాయిగా ఉంది.ష‌ అని 2009లో ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పింది షాలిని. ఎవ‌రైనా స్క్రీన్ మీద మిమ్మ‌ల్ని మిస్ అవుతున్నామ‌ని చెప్పిన‌ప్పుడు ఆమెకు బాగా అనిపిస్తుంటుంది. ష‌నేను స‌రైన ప‌నే చేశాన‌ని అనుకుంటున్నా, లేదంటే ఇలా ఉండేదాన్ని కాదు. ఇది నాకెంతో గౌర‌వాన్ని తెచ్చిపెట్టిందిష‌ అంటోందామె. ఆ దంప‌తుల‌కు ఇద్ద‌రు పిల్ల‌లు.. అనౌష్క‌, ఆధిక్‌. వారితో షాలిని-అజిత్ మ్యారీడ్ లైఫ్ చాలా చాలా హ్యాపీగా సాగిపోతోంది.

టాలీవుడ్‌లో మ‌హేశ్‌దే టాప్ ప్లేస్.. సెకండ్ ప్లేస్‌లో అల్లు అర్జున్‌!

  టాలీవుడ్ స్టార్స్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ‌వ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. వారి సినిమాలు హిందీలో డ‌బ్బ‌వ‌డం వ‌ల్ల కావ‌చ్చు, పాన్ ఇండియా రేంజ్‌లో వారి సినిమాలు విడుద‌ల‌వుతుండ‌టం కావ‌చ్చు.. వారి పాపులారిటీ ఎల్ల‌లు దాటుతోంది. ఇది సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో రిఫ్లెక్ట్ అవుతోంది. అలా సోష‌ల్ మీడియాలో మోస్ట్ పాపుల‌ర్ టాలీవుడ్ మేల్ స్టార్స్ ఎవ‌ర‌నే లిస్టును స‌ర్వే కంపెనీ ఆర్‌మాక్స్ మీడియా షేర్ చేసింది. మ‌రోసారి ఆ లిస్టులో సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ టాప్‌లో నిలిచాడు. మ‌హేశ్‌బాబు దేశంలోని అత్యంత అంద‌గాళ్ల‌లో ఒక‌డిగా పేరుపొందిన మ‌హేశ్ వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 1న 'స‌ర్కారువారి పాట' మూవీతో ఆడియెన్స్ ముందుకు వ‌స్తున్నాడు. ఆర్‌మాక్స్ మీడియా మోస్ట్ పాపుల‌ర్ టాలీవుడ్ మేల్ స్టార్స్ ఆన్ సోష‌ల్ మీడియా లిస్టులో అగ్ర స్థానంలో నిలిచాడు. అల్లు అర్జున్‌ సుకుమార్ డైరెక్ట్ చేస్తోన్న 'పుష్ప' పార్ట్ 1తో డిసెంబ‌ర్ 17న ఆడియెన్స్‌ను ప‌ల‌కరించ‌బోతున్న అల్లు అర్జున్‌.. లిస్టులో రెండో స్థానాన్ని ఆక్ర‌మించాడు. ప్ర‌భాస్‌ పాన్ ఇండియా స్టార్‌గా నీరాజ‌నాలు అందుకుంటున్న ప్ర‌భాస్ మూడో స్థానంలో నిలిచాడు. వ‌రుస‌గా రాధే శ్యామ్‌, ఆదిపురుష్‌, స‌లార్‌, ప్రాజెక్ట్ కె, స్పిరిట్ మూవీస్‌ను అత‌ను చేస్తున్నాడు. ప‌వ‌న్ క‌ల్యాణ్‌ అత్యంత పాపులారిటీ క‌లిగిన సౌత్ ఇండియ‌న్ స్టార్స్‌లో ఒక‌రైన ప‌వ‌ర్‌స్టార్‌ ప‌వ‌న్ క‌ల్యాణ్ 2022 జ‌న‌వ‌రి 12న 'భీమ్లా నాయ‌క్‌'గా ఆడియెన్స్ ముందుకు వ‌స్తున్నారు. లిస్ట్‌లో ఆయ‌న‌ది నాలుగో స్థానం. జూనియ‌ర్ ఎన్టీఆర్‌ యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు లిస్టులో ఐదో స్థానం ల‌భించింది. రాజ‌మౌళి సినిమా 'ఆర్ఆర్ఆర్‌'తో 2022 జ‌న‌వ‌రి 7న మ‌న‌ముందుకు రాబోతున్నాడు. రామ్‌చ‌ర‌ణ్‌ 'ఆర్ఆర్‌ఆర్‌'లో స‌హ న‌టుడైన జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను మెగాప‌వ‌ర్‌స్టార్‌ రామ్‌చ‌ర‌ణ్ అనుస‌రిస్తున్నాడు. లిస్టులో అతనిది ఆరో స్థానం. నాని నాచుర‌ల్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న నానికి లిస్టులో ఏడో స్థానం ల‌భించ‌డం గ‌మ‌నించ‌ద‌గ్గ అంశం. డిసెంబ‌ర్ 24న 'శ్యామ్ సింగ రాయ్‌'గా అత‌ను ఆడియెన్స్ ముందుకు వ‌స్తున్నాడు. విజ‌య్ దేవ‌ర‌కొండ‌ స్వ‌ల్ప‌కాలంలోనే అనూహ్య‌మైన పాపులారిటీ తెచ్చుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ వ‌చ్చే ఏడాది 'లైగ‌ర్‌'గా రాబోతున్నాడు. లిస్టులో అత‌నికి 8వ స్థానం ద‌క్కింది. నాగ‌చైత‌న్య‌ 'ల‌వ్ స్టోరి' మూవీతో ఇటీవ‌లే ఆడియెన్స్‌ను ఆక‌ట్టుకున్న నాగ‌చైత‌న్య‌కు లిస్టులో తొమ్మిదో స్థానం ల‌భించింది. చిరంజీవి టాలీవుడ్‌లో మెగాస్టార్‌గా రెండు ద‌శాబ్దాలు తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న చిరంజీవి ఈ లిస్టులో ప‌దో స్థానం ద‌క్కించుకున్నారు. త్వ‌ర‌లో 'ఆచార్య‌'గా ఆయ‌న ఫ్యాన్స్‌ను ప‌ల‌క‌రించ‌బోతున్నారు.

అతి త‌క్కువ చ‌దువుకున్న 9 మంది పాపుల‌ర్‌ బాలీవుడ్ యాక్ట‌ర్స్‌!

  చ‌దివింది త‌క్కువే కావ‌చ్చు, కానీ దేశ‌వ్యాప్తంగా.. ఆ మాటకొస్తే.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల‌ను వారు సంపాదించుకున్నారు. ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో స్టార్స్‌గా రాణిస్తూ, ప్ర‌జ‌ల‌కు ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందిస్తూ వ‌స్తున్నారు. ఈ విష‌యంలో బాగా చ‌దువుకున్న తోటి న‌టుల్లో చాలా మంది కంటే వారు ఇటు అభిమానుల్నీ, అటు ఆస్తుల్నీ సంపాదించుకున్నారు. టాలీవుడ్ విష‌యానికే వ‌స్తే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇంట‌ర్మీడియేట్ త‌ప్పార‌నే విష‌యం తెలిసిందే. బాలీవుడ్‌లో అలా త‌క్కువ చ‌దుకున్నా, ఎక్కువ అభిమాన గ‌ణాన్ని సంపాదించుకున్న స్టార్లు ఎవ‌రో చూద్దాం... ఆమిర్ ఖాన్‌ న‌టుడిగా మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్ అయిన ఆమిర్ చ‌దువులో మాత్రం కాదు. ముంబైలోని నార్సీ మంజీ కాలేజీలో ట్వ‌ల్త్ క్లాస్‌తో చ‌దువుకు ఫుల్‌స్టాప్ పెట్టి సినిమాల్లోకి వ‌చ్చేశాడు. అక్ష‌య్‌కుమార్‌ తైక్వాండోలో బ్లాక్‌బెల్ట్ హోల్డ‌ర్ అయిన అక్ష‌య్‌కుమార్ స్కూల్ చ‌దువు త‌ర్వాత ముంబైలోని గురునాన‌క్ ఖ‌ల్సా కాలేజీలో డిగ్రీలో చేరి ఏడాది త‌ర్వాత మ‌ధ్య‌లో మానేశాడు. ఇవాళ ఫోర్బ్స్ రిచ్చెస్ట్ ఇండియ‌న్ యాక్ట‌ర్‌గా నిలిచాడు. అర్జున్ క‌పూర్‌ బోనీ క‌పూర్ కుమారుడైన అర్జున్ క‌పూర్ చ‌దువు విష‌యంలో మ‌న ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు స‌రిజోడీ. అంటే 11వ క్లాస్ త‌ప్పి, దానిని పూర్తి చేయ‌లేక చ‌దువును వ‌దిలేశాడు. కానీ, ఇప్పుడు యాక్ట‌ర్‌గా రాణిస్తున్నాడు. హేమ‌మాలిని చెన్నైలోని ఆంధ్ర మ‌హిళాస‌భ‌లో 11వ క్లాస్ చ‌దువుతూ మ‌ధ్య‌లో మానేసినా, డ్రీమ్ గాళ్‌గా అంద‌రి హృద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర‌వేశారు. కాజోల్‌ బోర్డ‌ర్‌లో ఉన్న పంచ‌గ‌నిలోని సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ స్కూల్‌లో చ‌దువుకున్న కాజోల్ ప‌ద‌హారేళ్ల వ‌య‌సులో బేఖుడి సినిమా అవ‌కాశం రావ‌డంతో చ‌దువుకు స్వ‌స్తి చెప్పేసింది. కంగ‌నా ర‌నౌత్‌ బాలీవుడ్‌లో 'క్వీన్‌'గా అద్భుత న‌ట‌న ప్ర‌ద‌ర్శించి కాంటెంప‌రరీ యాక్ట్రెస్‌ల‌లో ఫైర్‌బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న కంగ‌నా ర‌నౌత్ చండీగ‌ఢ్‌లోని డీఏవీ మోడ‌ల్ స్కూల్‌లో ట్వ‌ల్త్ క్లాస్‌తో చ‌దువు ఆపేసి, మోడ‌లింగ్‌లోకి అడుగుపెట్టింది. క‌త్రినా కైఫ్‌ స్కూల్ చ‌దువు లేకుండానే యు.ఎస్‌.లో ఎక‌నామిక్స్‌లో డిగ్రీ పొందిన తార క‌త్రినా కైఫ్‌. ఇవాళ బాలీవుడ్‌లోని హ‌య్యెస్ట్ పెయిడ్ యాక్ట్రెస్‌ల‌లో ఆమె ఒక‌రు. స‌ల్మాన్ ఖాన్‌ బాలీవుడ్ భాయ్‌గా పేరుగాంచిన స‌ల్మాన్ ఖాన్‌ను బాలీవుడ్ ర‌జ‌నీకాంత్ అని కూడా పిలుస్తుంటారు. బాలీవుడ్ హ‌య్యెస్ట్ గ్రాస‌ర్స్‌లో ఎక్కువ సినిమాలున్న స్టార్ అయిన స‌ల్మాన్ ట్వ‌ల్త్ క్లాస్ త‌ర్వాత ముంబైలోని సెయింట్ జేవియ‌ర్స్ కాలేజీలో డిగ్రీలో చేరి, మ‌ధ్య‌లో మానేసి ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా అడుగుపెట్టాడు. శ్రీ‌దేవి క‌నీసం స్కూల్‌కు కూడా వెళ్ల‌కుండానే బాల‌న‌టిగా ఎంట్రీ ఇచ్చి, సౌత్‌, నార్త్ తేడా లేకుండా అంద‌రి ఆరాధ్య తార‌గా మారారు ఈ అతిలోక సుంద‌రి. ఇంటి ద‌గ్గ‌ర టీచ‌ర్ ద‌గ్గ‌ర ట్యూష‌న్ మాత్రం చెప్పించుకున్నారు. అంటే, దేశంలోని ఏ స్టార్‌తో కంపేర్ చేసినా, అతి త‌క్కువ చ‌దువు శ్రీ‌దేవిదే.

ఒక అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌పై మ‌హాన‌టి న‌మ్మ‌కం ఇది!

  అక్కినేని నాగేశ్వ‌ర‌రావు క‌థానాయ‌కుడిగా అన్న‌పూర్ణ పిక్చ‌ర్స్ నిర్మించిన 'చ‌దువుకున్న అమ్మాయిలు' చిత్రంలో సావిత్రి ప్ర‌ధాన పాత్ర పోషించారు. ఆ చిత్రంలో ఆమె స్నేహితురాళ్లుగా కృష్ణ‌కుమారి, ఇ.వి. స‌రోజ న‌టించారు. ఆ సినిమాలో న‌టించే స‌మ‌యంలో త‌న ద‌గ్గ‌రున్న 50 వేల రూపాయ‌ల‌ను ఆ సినిమాకు ప‌నిచేస్తున్న అసిస్టెంట్ డైరెక్ట‌ర్ చేతికిచ్చి, 'నేష‌న‌ల్ ప్రైజ్ బాండ్స్' కొన‌మ‌ని చెప్పారు. ఆరోజే ఆమె నాగార్జున సాగ‌ర్ డ్యామ్‌కు షూటింగ్ నిమిత్తం వెళ్లిపోయారు. ఆ డ‌బ్బును జాగ్ర‌త్త‌ప‌ర్చాల్సిన అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌కు రాత్రంతా నిద్ర‌ప‌ట్ట‌లేదు. బీరువాలో ఆ డ‌బ్బును దాచి, దాని తాళాలు త‌న ద‌గ్గ‌ర భ‌ద్రంగా దాచుకున్నా కూడా.. అత‌డికి నిద్ర‌ప‌ట్ట‌లేదు. మ‌రుస‌టి రోజు, ఆ డ‌బ్బును బాండ్స్‌గా మార్చి వాటిని మ‌ళ్లీ బీరువాలో దాచి, సావిత్రి ఔట్‌డోర్ షూటింగ్ నుంచి రాగానే ఐదు క‌ట్ట‌ల‌ను ఇచ్చాడు. ఒక్కో క‌ట్ట‌లో వంద రూపాయ‌ల విలువ‌క‌ల బాండ్లు వంద ఉంటాయి.  సావిత్రి ఆ క‌ట్ట‌ల‌ను మామూలు పేప‌ర్లలా తీసుకొని, లోప‌ల‌కు వెళ్ల‌బోతుంటే, "వాటిని లెక్క‌పెట్టండ‌మ్మా" అని చెప్పాడు అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌. "లెక్క పెట్టాల్సిన అవ‌స‌రం వ‌స్తుంద‌నుకుంటే ఆ డ‌బ్బు మీకు ఇవ్వ‌నుక‌దండీ" అన్నారు సావిత్రి. ఎవ‌రినైనా సావిత్రి ఎలా న‌మ్ముతారో చెప్ప‌డానికి ఇదో నిద‌ర్శ‌నం. ఆ రోజుల్లో.. అంటే 1963 రోజుల్లో.. 50 వేల రూపాయ‌లంటే చాలా పెద్ద మొత్తం కింద లెక్క‌. ఆ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ కూడా సావిత్రి త‌న మీద పెట్టిన న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చేయ‌లేదు.

డిసెంబ‌ర్ మంత్‌.. ఆడియెన్స్ ముందుకొస్తున్న 4 క్రేజీ మూవీస్‌!

  కొవిడ్ సెకండ్ వేవ్ అనంత‌రం తెలుగు రాష్ట్రాల్లో థియేట‌ర్లు తెరుచుకున్నాక ఇంత‌దాకా భారీ చిత్రాలేవీ ప్రేక్ష‌కుల ముందుకు రాలేదు. ఉన్నంత‌లో నాగ‌చైత‌న్య 'ల‌వ్ స్టోరి', అఖిల్ అక్కినేని 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్' మూవీస్ థియేట‌ర్ల‌లో విడుద‌లై, విజ‌యం సాధించాయి. అయితే మాస్ స్టార్స్ మాత్రం ఇంత‌దాకా ఆడియెన్స్‌ను ప‌ల‌క‌రించ‌లేదు. అయితే వారి నిరీక్ష‌ణ ఫ‌లించ‌బోతోంది. డిసెంబ‌ర్ మొద‌ట్లోనే నట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ 'అఖండ'గా ఆడియెన్స్ ముందుకు వ‌స్తున్నారు. నిన్న విడుద‌ల చేసిన ట్రైల‌ర్‌తో పాటు డిసెంబ‌ర్ 2న మూవీ విడుద‌ల‌వుతోంద‌ని నిర్మాత‌లు అనౌన్స్ చేశారు. బాల‌య్య‌-బోయ‌పాటి కాంబినేష‌న్ మూవీ కావ‌డంతో 'అఖండ‌'పై అంచ‌నాలు అసాధార‌ణ రీతిలో ఉన్నాయి. పైగా టైటిల్ రోల్‌లో బాల‌య్య క‌నిపించిన విధానం, ఆయ‌న చెప్పిన ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్ కార‌ణంగా ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ‌వుతుందా అని వేయిక‌ళ్ల‌తో ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఒక ఈ ఏడాది మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీగా అల్లు అర్జున్ టైటిల్ రోల్ చేసిన 'పుష్ప' పార్ట్ 1 డిసెంబ‌ర్ 17న పాన్ ఇండియా మూవీగా తెలుగు, హిందీ స‌హా ఐదు భాష‌ల్లో రిలీజ‌వుతోంది. ఇప్ప‌టికే ఈ సినిమాలో బ‌న్నీ మేన‌రిజం డైలాగ్ "త‌గ్గేదే లే" ఏ రేంజ్‌లో జ‌నాల్లోకి వెళ్లిందో తెలిసిందే. డిగ్లామ‌ర‌స్ రోల్ పుష్ప‌రాజ్‌గా అల్లు అర్జున్ చెల‌రేగి న‌టించాడ‌ని ఇంత‌దాకా రిలీజ్ చేసిన టీజ‌ర్స్ తెలియ‌జేశాయి. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర స‌రికొత్త రికార్డులు న‌మోదు చేసే స‌త్తా ఉన్న సినిమాగా 'పుష్ప‌: ద రైజ్'పై అంచ‌నాలు అంబ‌రాన్ని చుంబిస్తున్నాయి. 'పుష్ప‌', 'అఖండ' సినిమాలు కాకుండా డిసెంబ‌ర్‌లో మ‌రో రెండు సినిమాలు రిలీజ‌వుతున్నాయి. అవి మాస్ స్టార్స్ మూవీ కాక‌పోయినా, ఆడియెన్స్‌లో మంచి క్రేజ్ ఉన్న సినిమాలే. వాటిలో ఒక‌టి నాని హీరోగా రాహుల్ సాంకృత్యాన్ రూపొందిస్తోన్న 'శ్యామ్ సింగ రాయ్' కాగా, రెండోది - వ‌రుణ్ తేజ్ టైటిల్ రోల్‌లో నూత‌న ద‌ర్శ‌కుడు కిర‌ణ్ కొర్ర‌పాటి రూపొందిస్తోన్న 'గ‌ని'. ఈ రెండూ క్రిస్మ‌స్ సెల‌వుల‌ను టార్గెట్‌గా చేసుకొని డిసెంబ‌ర్ 24న రిలీజ‌వుతున్నాయి. 'శ్యామ్ సింగ రాయ్‌'లో నాని స‌ర‌స‌న సాయిప‌ల్ల‌వి, కృతి శెట్టి, మ‌డోన్నా సెబాస్టియ‌న్ నాయిక‌లుగా న‌టిస్తుండ‌గా, 'గ‌ని' సినిమాలో వ‌రుణ్ జోడీగా బాలీవుడ్ తార సాయీ మంజ్రేక‌ర్ చేస్తోంది.  ఇలా మంచి క్రేజ్ ఉన్న నాలుగు సినిమాలు వ‌స్తుండ‌టంతో డిసెంబ‌ర్ మాసం ఆడియెన్స్‌కు ట్రీట్‌గా మార‌నుంది.

సింగ‌ర్ రాజ్ సీతారామ్‌ను సూప‌ర్‌స్టార్‌ కృష్ణ ఎందుకు ఎంక‌రేజ్ చేశారు?

  సినిమాల్లో తెర‌మీద కృష్ణ ఆడిపాడుతుంటే, తెర‌వెనుక ఎస్పీ బాలు గాత్ర‌మే వినిపించాలి. కృష్ణ హీరోగా ప‌రిచ‌య‌మైన కొద్ది కాలానికే బాలు కూడా గాయ‌కునిగా ప‌రిచ‌య‌మ‌య్యారు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ల‌కు ఘంట‌సాల గాత్ర‌మిస్తుంటే కృష్ణ‌, శోభ‌న్‌బాబు లాంటివారికి బాలు గాత్రం స‌రిగ్గా స‌రిపోయింద‌న్నారు. మ‌రీ ముఖ్యంగా కృష్ణ గొంతుకు బాలు గొంతు ప‌ర్ఫెక్టుగా సూట‌య్యింద‌నేది నిజం. అలాంటిది.. 'సూర్య‌చంద్ర' చిత్రంలో తెర‌మీద కృష్ణ ఆడుతుంటే, తెర‌వెనుక వినిపిస్తున్న గొంతు చూసి చాలా మంది ఆశ్చ‌ర్య‌పోయారు. 'ఎవ‌రిదీ గొంతు?  బాలుది కాదే.. ఈ కొత్త గొంతు ఎవరిది?' అనుకున్నారు. ఆ త‌ర్వాత ద‌ర్శ‌కుడిగా మారుతూ 70 ఎంఎంలో కృష్ణ రూపొందించిన తొలి చిత్రం 'సింహాస‌నం'లోనూ అదే గొంతు. "ఆకాసంలో ఒక తార‌", "వ‌హ‌వా నీ య‌వ్వ‌నం", "ఇది క‌ల‌య‌ని నేన‌నుకోనా" లాంటి పాట‌లు వింటుంటే అచ్చు.. కృష్ణే ఆ పాట‌లు పాడుతున్నారా అనిపించింది. ఆ గొంతు బాలుది కాదు.. రాజ్ సీతారామ్ అనే ఓ యువ‌కుడిది. అంద‌రూ హీరోల‌కూ పాడేస్తూ బాలు మంచి ఊపులో ఉన్న టైమ్‌లో కృష్ణ‌తో ఆయ‌న‌కు మ‌న‌స్ప‌ర్ధ‌లు వ‌చ్చాయి. ఎంత సాహ‌సికుడో అంత అభిమాన‌వంతుడు కూడా అయిన కృష్ణ ఎలాంటి అడుగు వేయ‌డానికైనా సంకోచించ‌రు. అప్ప‌టికే న‌రేశ్ హీరోగా న‌టించిన 'అగ్ని సమాధి'తో తెలుగుచిత్ర‌సీమ‌కు గాయ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌య్యాడు త‌మిళుడైన‌ రాజ్ సీతారామ్‌. ఆయ‌న ఎస్పీ బాలు బృందంలోనివాడే. ఆయ‌న‌తో క‌లిసి ఎన్నో ప్ర‌ద‌ర్శ‌న‌ల్లో పాల్గొన్నాడు కూడా. బాలుకు, కృష్ణ‌కు మ‌ధ్య విభేదాలు రావ‌డంతో 'సూర్య‌చంద్ర' (1985) చిత్రంలోని పాట‌ల్ని రాజ్ సీతారామ్ చేత పాడించారు డైరెక్ట‌ర్ విజ‌య‌నిర్మ‌ల‌. మొద‌ట ఆ పాట‌ల్ని రాజ్ పాడిన‌ట్లు కృష్ణకు తెలీదు. ఆ పాట‌ల్ని కృష్ణ‌కు వినిపించి ఎలా ఉన్నాయ‌ని అడిగారు విజ‌య‌నిర్మ‌ల‌. బాగున్నాయ‌ని ఆయ‌న అన్న త‌ర్వాతే రాజ్ సీతారామ్‌ను కృష్ణ‌కు ఆమె ప‌రిచ‌యం చేశారు. అలా 'సూర్య‌చంద్ర' సినిమాతో కృష్ణ‌కు పాడ‌టం ప్రారంభించారు రాజ్. బాలుకు, త‌న‌కు మ‌ధ్య మ‌న‌స్ప‌ర్ధ‌లు తొల‌గిపోయి, స‌యోధ్య కుదిరేంత‌వ‌ర‌కూ ఆయ‌న చేతే త‌న పాట‌ల‌న్నీ పాడించారు కృష్ణ‌. ఆయ‌న పెద్ద కుమారుడు ర‌మేశ్‌బాబు హీరోగా ప‌రిచ‌య‌మైన 'సామ్రాట్' సినిమాలోనూ పాట‌ల్ని రాజ్‌తోనే ఆయ‌న పాడించారు. కృష్ణ అంటే బాలు, బాలు అంటే కృష్ణ అన్నంత‌గా పేరుపొంద‌డంతో మొద‌ట్లో అభిమానుల‌కు రాజ్ గొంతు కొత్త‌గా అనిపించినా, త‌ర్వాత ఆ గొంతు కృష్ణ‌కు స‌రిగ్గా స‌రిపోయింద‌ని ఫ్యాన్స్‌తో పాటు ఇండ‌స్ట్రీ కూడా ఒప్పేసుకుంది. అలా మూడేళ్ల పాటు కృష్ణ‌కు రాజ్ సీతారామ్ పాడారు. ఆ త‌ర్వాత తిరిగి కృష్ణ‌కు బాలు చేరువయ్యారు. దాంతో 'రౌడీ నెంబ‌ర్ 1' (1988) సినిమా నుంచి బాలుతోనే మ‌ళ్లీ పాట‌లు పాడించుకుంటూ వ‌చ్చారు కృష్ణ‌. మిగ‌తా హీరోలెవ‌రూ ఎంక‌రేజ్ చేయ‌క‌పోవ‌డంతో గాయ‌కుడిగా రాజ్ సీతారామ్ క్ర‌మేపీ క‌నుమ‌రుగ‌య్యారు.