ఏఎన్నార్ 'కీలుగుర్రం'ను క‌ల‌ర్‌లో చేద్దామ‌నుకున్న ఎన్టీఆర్‌!

  న‌ట‌సామ్రాట్ అక్కినేని నాగేశ్వ‌ర‌రావు పూర్తిస్థాయి జాన‌ప‌ద హీరోగా న‌టించిన తొలి చిత్రం 'కీలుగుర్రం'. శోభ‌నాచ‌ల పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో మీర్జాపురం రాజా నిర్మించిన ఈ చిత్రం 1949 ఫిబ్ర‌వ‌రి 19న విడుద‌లై ప్రేక్ష‌కాద‌ర‌ణ‌తో అఖండ‌ విజ‌యం సాధించింది. ఈ సినిమాతో అక్కినేని ఆనాటి యువ‌తుల‌కు డ్రీమ్ బాయ్‌గా అవ‌త‌రించారు. ఈ సినిమాకు అయిన బ‌డ్జెట్ రూ. 5 ల‌క్ష‌ల నుంచి 6 ల‌క్ష‌లు కాగా, అక్కినేని అందుకున్న పారితోషికం 23 ల‌క్ష‌ల రూపాయ‌లు. హీరోయిన్‌గా సూర్య‌శ్రీ న‌టించ‌గా, భువ‌న‌సుంద‌రి అనే రాక్ష‌సి పాత్ర‌ను అంజ‌లీదేవి చేశారు. 'కీలుగుర్రం'కు క‌థ‌తో పాటు మాట‌లు, పాట‌లు రాసింది తాపీ ధ‌ర్మారావు. ఈ సినిమా షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడే త‌మిళంలో దీన్ని నిర్మించ‌డానికి లంక స‌త్యం హ‌క్కులు తీసుకున్నారు. ఎంజీ రామ‌చంద్ర‌న్‌, జాన‌కి హీరో హీరోయిన్లుగా 'మాయామోహిని' పేరుతో త‌మిళంలో నిర్మాణ‌మైన ఈ సినిమా తెలుగు 'కీలుగుర్రం' కంటే ముందుగా విడుద‌ల‌వ‌డం గ‌మ‌నార్హం. అయితే బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఆ సినిమా ఫెయిల‌యింది. దాన్ని తెలుగులో డ‌బ్‌చేసి రిలీజ్ చేస్తే, మ‌న‌వాళ్లు కూడా ఆద‌రించ‌లేదు. దాని త‌ర్వాత 'కీలుగుర్రం' విడుద‌లై ఘ‌న‌విజ‌యం సాధించ‌డంతో, త‌మిళంలో 'మాయ‌క్కుదిరై' పేరుతో డ‌బ్ చేసి రిలీజ్ చేశారు. అది సూప‌ర్ హిట్ట‌యింది. విశేష‌మేమంటే త‌మిళంలో అనువాద‌మైన తొలి తెలుగు సినిమా 'కీలుగుర్రం'. అక్కినేని నాగేశ్వ‌ర‌రావుకు ఆదినారాయ‌ణ అనే త‌మిళ న‌టుడు డ‌బ్బింగ్ చెప్పారు. శ్రీ‌లంక‌లోని జాఫ్నాలో విడుద‌లైన 'మాయ‌క్కుదిరై'ని అక్క‌డివాళ్లు కూడా బాగా ఆద‌రించారు. Also read: పెళ్లి త‌ర్వాత న‌ట‌న‌కు దూర‌మైన‌ జ‌య‌మాలిని.. భ‌ర్త ఆమెపై ఆంక్ష‌లు పెట్టారా? త‌ర్వాత కాలంలో క‌ల‌ర్‌లో ఈ సినిమాని విశ్వ‌విఖ్యాత ఎన్టీ రామారావుతో చేయాల‌ని నిర్మాత‌లు అడిగితే, ఆయ‌న సంతోషంగా అంగీక‌రించారు. ఆయ‌న‌ను ఈ సినిమా చేయాల్సిందిగా అడ‌గ‌టానికి మీర్జాపురం రాజా భార్య‌, అల‌నాటి మేటి న‌టీమ‌ణి సి. కృష్ణ‌వేణి స్వ‌యంగా రామారావు ద‌గ్గ‌ర‌కు వెళ్లారు. ఆ స‌మ‌యంలో ఆయ‌న ద‌గ్గ‌ర ఓ జ‌ర్న‌లిస్టు కూడా ఉన్నారు. ఆయ‌న‌తో "నేను త్వ‌ర‌లో క‌ల‌ర్‌లో 'కీలుగుర్రం' చేస్తున్నాను" అని చెప్పారు ఎన్టీఆర్‌. అలా ఆ వార్త ప‌త్రిక‌ల్లో వ‌చ్చింది కూడా. Also read: "స‌గం దోసె తింటారా.. సిగ్గు లేదూ మీకు?" ఎన్టీఆర్ మాట‌ల‌కు స్ట‌న్న‌యిన ల‌క్ష్మి! 'కీలుగుర్రం'కు సంబంధించిన కొంత డిస్ట్రిబ్యూష‌న్ హ‌క్కుల్ని విజ‌య‌వాడ‌కు చెందిన ల‌క్ష్మీనారాయ‌ణ అనే ఆయ‌న కొన్నారు. ఆయ‌న ఎన్టీఆర్ ద‌గ్గ‌ర‌కు వెళ్లి, "మీరు మ‌ళ్లీ ఈ సినిమా చేస్తే నా డిస్ట్రిబ్యూష‌న్ దెబ్బ‌తింటుంది" అని వేడుకున్నారు. దాంతో కృష్ణ‌వేణికి ఫోన్ చేశారు ఎన్టీఆర్‌. విష‌యం వివ‌రించి, "ఎవ‌రికీ ఇబ్బంది లేకుండా కొంత గ్యాప్ త‌ర్వాత సినిమా చేద్దాం" అని చెప్పారు. ఆ గ్యాప్ అలాగే ఉండిపోయింది. ఈ విష‌యాన్ని కృష్ణ‌వేణి స్వ‌యంగా వెల్ల‌డించారు. https://www.youtube.com/watch?v=Ot6gNBmWuIg

రావ‌ణుడిని హీరోగా ఎన్టీఆర్ ఎందుకు చూపించారు?

  తెలుగులో శ్రీ‌రాముడి పాత్ర పోష‌ణ కంటే ముందే పురాణ వాఙ్మ‌యంలోనే అతి భ‌యంక‌ర‌మైన ప్ర‌తినాయ‌కుడిగా ప్ర‌సిద్ధిపొందిన రావ‌ణాసురుని పాత్ర‌ను 'భూకైలాస్' చిత్రంలో పోషించి అద్భుతం అనిపించారు న‌ట‌సార్వ‌భౌమ నంద‌మూరి తార‌క‌రామారావు. అప్ప‌టివ‌ర‌కూ ప‌ర‌మ దుర్మార్గునిగా, రాక్ష‌సునిగా చిత్రిత‌మైన రావ‌ణ పాత్రకు ఎన్టీఆర్ ధ‌రించ‌డం వ‌ల్ల హీరోయిజం వ‌చ్చింది. తొలిసారిగా తెర‌పై అంద‌మైన రావ‌ణుడు ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాడు. ఈ రావ‌ణుడు స్త్రీలోలుడు కాడు. వేద వేదాంగాలు ఔపోస‌న ప‌ట్టిన విద్యాధికుడు. ఈ పాత్ర‌ను మంచిగా చూపించ‌డం ఒక కొత్త ప్ర‌యోగం. అలా చూపించ‌డానికి కార‌ణం ఎన్టీఆర్‌తో పాటు ద‌ర్శ‌కునిలో ఉన్న ప్ర‌గాఢ‌మైన మాన‌వ‌తా దృష్టి. ఒక రకంగా అది స‌మాజానికి ఎదురీద‌డం. 'భూకైలాస్' త‌ర్వాత 'సీతారామ క‌ల్యాణం'లో మ‌రోసారి రావ‌ణ పాత్ర‌ను ధ‌రించారు ఎన్టీఆర్‌. అందులోనూ రావ‌ణుడే క‌థానాయ‌కుడు. రావ‌ణ పాత్ర‌ను పోషించ‌డానికి ఆయ‌న‌పై ప్ర‌ధానంగా ద్ర‌విడోద్య‌మ ప్ర‌భావం ఉంద‌ని సుప్ర‌సిద్ధ క‌వి దివంగ‌త‌ సి. నారాయ‌ణ‌రెడ్డి అభిప్రాయ‌ప‌డ్డారు. ద‌క్షిణాదిలో ద్ర‌విడోద్య‌మం ప్రారంభ‌మ‌య్యాక‌, రావ‌ణాసురుడు దాక్షిణాత్యుడ‌ని, ఆర్యుల‌కు వ్య‌తిరేకంగా ఉన్న ఆయ‌న‌ను దుష్ట‌పాత్ర‌గా చిత్రీక‌రించార‌ని ద్ర‌విడులు గ‌ట్టిగా వాదించారు. లంకేశ్వ‌రుడైన రావ‌ణుని వారు క‌థానాయ‌కుడిగా రూప‌క‌ల్ప‌న చేశారు. రావ‌ణుడు దుష్టుడు కాడ‌నీ, ఆత్మాభిమానం ఉన్న‌వాడ‌నీ, సొంత వ్య‌క్తిత్వం ఉన్న‌వాడ‌నీ వారు సిద్ధాంతీక‌రించారు. Also read: ఎన్టీఆర్ కారుకు పెద్ద‌పులి ఎదురైన వేళ‌..! మ‌ద్రాసులో ఉన్న ఎన్టీఆర్‌కు ద్ర‌విడ ఉద్య‌మ‌క‌ర్త‌ల‌తో ఏర్ప‌డిన ప‌రిచ‌యం ఓవైపు, పురాణ పాత్ర‌లు చ‌దివి ఆక‌ళించుకున్న విజ్ఞానం ఇంకోవైపు, స‌ముద్రాల‌-పింగ‌ళి గార్ల‌తో చ‌ర్చించి తీసుకున్న నిర్ణ‌యాలు మ‌రోవైపు.. క‌లిసి 'భూకైలాస్‌', 'సీతారామ‌ క‌ల్యాణం' చిత్రాల్లో రావ‌ణుని పాత్ర క‌ల్ప‌న‌కు దోహ‌దం చేశాయి. 'భూకైలాస్' సినిమాలో త‌ల్లిమాట‌ను శిర‌సావ‌హించే ప‌ర‌మ‌మూర్ఖ శివ‌భ‌క్తునిగా ఆత్మ‌లింగాన్ని సాధించ‌డానికి అత‌డు ప‌డ్డ అగ‌చాట్ల‌తో ఒక కొత్త రావ‌ణుడు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మ‌య్యాడు. గొప్ప శివ‌భ‌క్తునిగా ప్రేక్ష‌కుల సానుభూతిని సంపాదించాడు. Also read: 'అఖండ' క‌లెక్ష‌న్ల‌ను త‌ట్టుకోలేక దిగాలుప‌డ్డ వ్య‌తిరేక వ‌ర్గం! 'సీతారామ క‌ల్యాణం' పూర్తిగా ఎన్టీఆర్ అభిరుచి మేర‌కు తీసిన చిత్రం. త‌న త‌ల్లి కోరిక మేర‌కు "శ్రీ సీతారాముల క‌ల్యాణం చూత‌ము రారండీ" అనే జాన‌ప‌ద పాట‌ను ఈ చిత్రం ద్వారా తెలుగునాట మ‌రింత ప్రాచుర్యంలోకి తెచ్చారు. 1961లో ఈ చిత్రం విడుద‌లైతే, ఇప్ప‌టికీ ప్ర‌తి శ్రీ‌రామ‌న‌వ‌మి రోజు సీతారాముల క‌ల్యాణం స‌మ‌యంలో ఈ పాట వేయ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. (జ‌న‌వ‌రి 18 ఎన్టీఆర్ వ‌ర్ధంతి సంద‌ర్భంగా..)

ఎన్టీఆర్ న‌టించగా రూ. 4.5 ల‌క్ష‌ల‌తో త‌యారైన‌ టాలీవుడ్‌ ఫ‌స్ట్ స‌స్పెన్స్ ఫిల్మ్ ఇదే!

  న‌ట‌సార్వ‌భౌమ ఎన్టీ రామారావు తన న‌ట జీవితంలో వైవిధ్య‌భ‌రిత‌మైన ఎన్నో ర‌కాల పాత్ర‌లు పోషించారు. భిన్న త‌ర‌హా సినిమాలెన్నో చేశారు. అలాంటి వాటిలో 1963లో వ‌చ్చిన 'ల‌క్షాధికారి' సినిమా ఒక‌టి. ఇది ఎన్టీఆర్ చేసిన తొలి స‌స్పెన్స్ ఫిల్మ్ కావ‌డం విశేషం. ఈ సినిమాతోటే త‌మ్మారెడ్డి కృష్ణ‌మూర్తి నిర్మాత‌గా ప‌రిచ‌య‌మ‌య్యారు. ఆయ‌న నేటి త‌రానికి తెలిసిన ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ్ తండ్రి. ర‌వీంద్ర ఆర్ట్ పిక్చ‌ర్స్ అంటే టాలీవుడ్‌లో మంచి గుర్తింపు ఉంది. ఆ బేన‌ర్‌పై వ‌చ్చిన సినిమాలే దానికి ఆ గుర్తింపు తీసుకు వ‌చ్చాయి. 'ల‌క్షాధికారి' సినిమా మేకింగ్ ఎలా జ‌రిగిందో తెలుసుకుంటే, ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క మాన‌దు. ర‌వీంద్ర ఆర్ట్ పిక్చ‌ర్స్ నెల‌కొల్ప‌క ముందు త‌మ్మారెడ్డి కృష్ణ‌మూర్తి.. అప్ప‌టి పేరుపొందిన ప్రొడ‌క్ష‌న్ కంపెనీ అయిన సార‌థీ పిక్చ‌ర్స్‌లో చీఫ్ ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్‌గా ప‌నిచేసేవారు. త‌న టేస్ట్‌కు త‌గ్గ‌ట్లు సినిమాలు నిర్మించాల‌ను ఆలోచ‌న‌తో ఆయ‌న సార‌థీ పిక్చ‌ర్స్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. 'గీతాంజ‌లి' కావ్యంతో నోబెల్ బ‌హుమ‌తి పొందిన ర‌వీంద్ర‌నాథ్ ఠాగూర్ మీదున్న అభిమానంతో ర‌వీంద్ర ఆర్ట్ పిక్చ‌ర్స్ కంపెనీని స్టార్ట్ చేశారు కృష్ణ‌మూర్తి. హీరో కంటే మొద‌ట డైరెక్ట‌ర్‌గా వి. మ‌ధుసూద‌న‌రావును ఎంచుకున్నారు కృష్ణ‌మూర్తి. రైట‌ర్‌గా నార్ల చిరంజీవి, మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా టి. చ‌ల‌ప‌తిరావును తీసుకున్నారు. నిజానికి ఈ సినిమాకు హీరోగా మొద‌ట అనుకున్న‌ది ఎన్టీఆర్‌ను కాదు, ఏఎన్నార్‌ను. అయితే ఆ స‌మ‌యంలో వేరే చిత్రాల‌తో బాగా బిజీగా ఉన్న అక్కినేని, ఆ సినిమా తాను చేయ‌లేన‌నీ, రెండో సినిమా చేస్తాన‌నీ మాటిచ్చారు. దాంతో ఎన్టీఆర్‌ను సంప్ర‌దించారు కృష్ణ‌మూర్తి. సినిమా డిస్ట్రిబ్యూష‌న్‌కు వాణీ ఫిలిమ్స్ వాళ్లు ముందుకు రావ‌డంతో ఎన్టీఆర్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. హీరోయిన్‌గా కృష్ణ‌కుమారిని తీసుకున్నారు. అప్ప‌ట్లో ఎన్టీఆర్‌-కృష్ణ‌కుమారి హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్నారు. నాలుగున్న‌ర ల‌క్ష‌ల రూపాయ‌ల బ‌డ్జెట్‌తో ఈ సినిమాని ప్లాన్ చేశారు. అప్ప‌టికే హిందీలో వ‌చ్చిన స‌స్పెన్స్ ఫిల్మ్ 'బీస్ సాల్ బాద్‌', త‌మిళ స‌స్పెన్స్ ఫిల్మ్ 'ముత్తుమండ‌పం' త‌ర‌హాలో జంపింగ్ స‌స్పెన్స్ అంశాల‌తో ఈ సినిమా స్క్రీన్‌ప్లేను త‌యారు చేశారు. ఈ చిత్రానికి సంబంధించి ఇంకో ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన అంశం.. విల‌న్‌గా గుమ్మ‌డి ఎంపిక‌. నిజానికి ఆ క్యారెక్ట‌ర్‌కు మొద‌ట నాగ‌భూష‌ణంను ఎంపిక చేశారు. కానీ ఆయ‌న అయితే విల‌న్ ఎవ‌రో ప్రేక్ష‌కులు ఈజీగా ప‌సిగ‌డ‌తార‌నే ఉద్దేశంతో సాఫ్ట్ క్యారెక్ట‌ర్ల‌కు పేరుపొందిన గుమ్మ‌డి వెంక‌టేశ్వ‌ర‌రావును తీసుకున్నారు. త‌డిగుడ్డ‌తో గొంతులు కోసే ఆ క్యారెక్ట‌ర్‌లో గుమ్మ‌డి గొప్ప‌గా ఇమిడిపోయారు. న‌టునిగా ఈ సినిమా ఆయ‌న‌కు ప్ర‌త్యేక గుర్తింపు తీసుకొచ్చింది. హాస్య జంట‌గా రేలంగి, గిరిజ అల‌రించ‌గా, ర‌మ‌ణారెడ్డి, సూర్య‌కాంతం జోడీ చిత్రానికి ఇంకో ఆక‌ర్ష‌ణ‌. 1963 సెప్టెంబ‌ర్ 27న రిలీజైన 'ల‌క్షాధికారి'ని జ‌నం బాగా ఆద‌రించారు. మ్యూజిక‌ల్‌గానూ మంచి హిట్ట‌యింది. సి. నారాయణ‌రెడ్డి, ఆరుద్ర‌, కొస‌రాజు రాసిన పాట‌ల‌కు టి. చ‌ల‌ప‌తిరావు స‌మ‌కూర్చిన బాణీలు ఆడియెన్స్‌ను అమితంగా అల‌రించాయి. నారాయ‌ణ‌రెడ్డి రాసిన ల‌లిత గీతం 'మ‌బ్బులో ఏముంది నా మ‌న‌సులో ఏముంది' అప్ప‌టికే బాగా పాపుల‌ర్. దాన్ని సినిమా పాట‌గా మార్చి 'ల‌క్షాధికారి'లో ఉప‌యోగించారు. 'దాచాలంటే దాగ‌దులే దాగుడుమూత‌లు సాగ‌వులే' పాట‌ను కూడా ఆయ‌నే రాశారు. 'ఎలాగో ఎలాగో ఎలాగో ఉన్న‌ది' అనే పాట‌ను ఆరుద్ర‌, 'అద్దాల మేడ ఉంది అందాల భామ ఉంది' అనే పాట‌ను కొస‌రాజు రాశారు. ఈ పాట‌ల‌ను ఇప్ప‌టికీ జ‌నం ఆద‌రిస్తూనే ఉన్నారు. మొత్తానికి జంపింగ్ క్లైమాక్స్‌తో రూపొంది 'ల‌క్షాధికారి' టాలీవుడ్‌లో ఓ ట్రెండ్‌ని సృష్టించింది. విశేష‌మేమంటే ఫ‌స్ట్ రిలీజ్‌కు మించి సెకండ్ రిలీజ్‌లో ఈ సినిమా మ‌రింత క‌లెక్ష‌న్లు వ‌సూలు చేయ‌డం. అందుకే నంద‌మూరి తార‌క‌రామారావు కెరీర్‌లో 'ల‌క్షాధికారి' ఓ స్పెష‌ల్ ఫిల్మ్‌.

ర‌మేశ్‌బాబు, జుహీ చావ్లా జంట‌గా న‌టించార‌ని మీకు తెలుసా?

  అవును. ర‌మేశ్‌బాబు స‌ర‌స‌న బాలీవుడ్ బ్యూటీ జుహీ చావ్లా ఒక సినిమాలో న‌టించింది. ఆ సినిమా.. సూప‌ర్‌స్టార్ కృష్ణ డైరెక్ట్ చేసిన 'క‌లియుగ క‌ర్ణుడు'. 1988లో వ‌చ్చిన ఈ సినిమాలో కృష్ణ స‌రస‌న జ‌య‌ప్ర‌ద‌, ర‌మేశ్ స‌ర‌స‌న జుహీ చావ్లా హీరోయిన్లుగా న‌టించారు. అయితే ఆమె అస‌లు పేరుతో కాకుండా 'మీనా' పేరుతో ఈ మూవీలో న‌టించింది. పేరులో తెలుగుత‌నం ఉండాల‌నే ఉద్దేశంతో ఆమె పేరును మీనాగా మార్చారు కృష్ణ‌. అయితే ఆ త‌ర్వాత ఆమె త‌న అస‌లు పేరుతోనే 'విక్కీ దాదా', 'శాంతి క్రాంతి' లాంటి సినిమాల్లో చేసింది. కృష్ణ‌, ర‌మేశ్‌బాబు హీరోలుగా న‌టించిన తొలి సినిమా 'క‌లియుగ క‌ర్ణుడు'. ఇందులో ఆ ఇద్ద‌రూ అన్న‌ద‌మ్ములుగా న‌టించారు. టైటిల్ రోల్‌ను కృష్ణ పోషించ‌గా, న్యాయం కోసం పోరాడే ఆయ‌న త‌మ్మునిగా ర‌మేశ్ న‌టించారు.  Also read: ​నాగార్జున 'రెండు నాల్క‌ల' తీరుపై సోష‌ల్ మీడియాలో 'ర‌గ‌డ‌'! 'క‌లియుగ క‌ర్ణుడు' కంటే ముందు క‌న్న‌డ సినిమా 'ప్రేమ‌లోక'లో హీరోయిన్‌గా న‌టించింది జుహీ. ఆ సినిమా తెలుగులో 'ప్రేమ‌లోకం' పేరుతో విడుద‌లై బాగా ఆడింది. అందులో జుహీని చూసి, ర‌మేశ్ స‌ర‌స‌న చ‌క్క‌గా ఉంటుంద‌నే ఉద్దేశంతో ఆమెను తీసుకున్నారు కృష్ణ‌. 'క‌లియుగ క‌ర్ణుడు' చిత్రీక‌ర‌ణ జ‌రుగుతున్న‌ప్పుడే ఆమిర్ ఖాన్‌, జుహీ చావ్లా జంట‌గా న‌టించిన 'ఖ‌యామ‌త్ సే ఖ‌యామ‌త్ త‌క్' విడుద‌లై బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ట‌యింది. తెలుగు ప్రేక్ష‌కులు కూడా ఆ సినిమాని బాగా ఆద‌రించ‌డంతో, జుహీకి ఇక్క‌డ కూడా మంచి క్రేజ్ ఏర్ప‌డింది. అది 'క‌లియుగ క‌ర్ణుడు' సినిమాకు ప్ల‌స్స‌యింది. Also read: ​'అఖండ‌'లో మెయిన్ విల‌న్ రియ‌ల్ లైఫ్‌లో మాజీ ఆర్మీ ఆఫీస‌ర్ అని మీకు తెలుసా? క‌శ్మీరులో 12 రోజుల పాటు ఈ సినిమాకు సంబంధించిన ఒక‌ షెడ్యూల్ జ‌రిగింది. ఆ సంద‌ర్భంగా రమేశ్‌, జుహీపై రెండు పాట‌ల‌ను, కొన్ని స‌న్నివేశాల‌ను కృష్ణ చిత్రీక‌రించారు. డాల్ లేక్‌లో షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు అక్టోబ‌ర్ 13న‌ ర‌మేశ్‌బాబు బ‌ర్త్‌డే అని తెలుసుకున్న నిర్మాత కాశీవిశ్వ‌నాథ‌రావు అప్ప‌టిక‌ప్పుడు కేక్ తెప్పించి, బోట్‌లోనే దాన్ని క‌ట్ చేయించారు. త‌న పుట్టిన‌రోజు సంద‌ర్భంగా యూనిట్ స‌భ్యులంద‌రికీ స్వెట్ట‌ర్లు, బూట్లు, డాన్స‌ర్ల‌కు చీర‌కు బ‌హూక‌రించి తండ్రికి త‌గ్గ త‌న‌యునిగా ఉదార స్వ‌భావాన్ని చాటుకున్నారు ర‌మేశ్‌బాబు. తెర‌పై ర‌మేశ్‌, జుహీ జోడీ ఆడియెన్స్‌ను అల‌రించింది.

దాస‌రి డైరెక్ష‌న్‌లో టీనేజ్‌లో ర‌మేశ్ లీడ్ రోల్ చేసిన‌ 'నీడ‌'

  ఎదిగే పిల్ల‌ల‌పై వారు పెరిగే వాతావ‌ర‌ణం, ప‌రిస్థితులు, చుట్టుప‌క్క‌ల ఇళ్ల‌వారి మ‌న‌స్త‌త్వం, సినిమాలు లాంటివి ఎలాంటి ప్ర‌భావం చూపిస్తాయో క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు తెలియ‌జేసే సినిమా 'నీడ' (1979). ప‌ది రోజుల్లో విజ‌య‌వాడ ప‌రిస‌ర ప్రాంతాల్లో దాస‌రి నారాయ‌ణ‌రావు చిత్రీక‌రించిన ప‌ది రీళ్ల సినిమా 'నీడ‌'. ర‌మేశ్‌బాబు 14 ఏళ్ల వ‌య‌సులో తొలిసారిగా మెయిన్‌రోల్ చేసిన సినిమా 'నీడ‌'. ఈ మూవీలో ర‌మేశ్ చిన్న‌ప్ప‌టి పాత్ర‌ను మ‌హేశ్‌బాబు చేయ‌డం విశేషం. ఇందులో మ‌రో కీల‌క పాత్ర‌ను ఆర్‌. నారాయ‌ణ‌మూర్తి పోషించారు. ర‌మేశ్‌కు 'నీడ' మంచి పేరు తెచ్చింది. 1979 మార్చి 5న విజ‌య‌వాడ‌లోని వెంక‌టేశ్వ‌ర థియేట‌ర్ ఆవ‌ర‌ణ‌లో 'నీడ' షూటింగ్ ప్రారంభ‌మైంది. ర‌మేశ్ మీదే తొలి షాట్ తీశారు. ఈ సినిమా షూటింగ్‌లో ర‌మేశ్‌, నారాయ‌ణ‌మూర్తిపై ఓ స‌న్నివేశాన్ని చిత్రీక‌రిస్తున్న‌ప్పుడు దాస‌రి ఎంత‌గా చెప్తున్నా నారాయ‌ణ‌మూర్తి స‌రిగా చేయ‌లేక‌పోతూ వ‌చ్చారు. దాంతో దాస‌రికి ఓపిక న‌శించి ఫ‌ట్‌మ‌ని నారాయ‌ణ‌మూర్తిని కొట్టారు. అంత‌మంది ముందు త‌న‌ను కొట్టేస‌రికి ఆయ‌న‌కు ఉక్రోషం వ‌చ్చింది. "అదేంటి గురువుగారూ.. ర‌మేశ్‌బాబు అన్ని టేకులు తింటున్నా కొట్ట‌కుండా న‌న్ను మాత్ర‌మే కొట్టారు?" అనేశారు. దాంతో దాస‌రి మ‌రోసారి ఫ‌ట్‌మ‌ని కొట్టారు. Also read: ​షాకింగ్.. మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు మృతి! "ర‌మేశ్‌బాబు ఈ వేషం కావాల‌ని అడ‌గ‌లేదురా. నిర్మాత‌లు అత‌నే కావాల‌నుకొని వెళ్లి అడిగారు. అమ్మానాన్న‌లు, ఊరు వ‌దులుకుని సినిమా ఫీల్డుకి వ‌చ్చిన‌వాడివి నువ్వు. న‌టించాల‌నే త‌ప‌న‌తో నా ద‌గ్గ‌ర‌కు వచ్చిన నిన్ను మంచి న‌టునిగా తీర్చిదిద్ద‌డం నా బాధ్య‌త‌. కాదంటావా?" అన్నారు దాస‌రి. ఈ సినిమాకు క‌థ‌, మాట‌లు, స్క్రీన్‌ప్లేల‌ను దాస‌రే స‌మ‌కూర్చారు. Also read: ర‌మేశ్‌బాబు న‌ట ప్ర‌స్థానం.. 'మోస‌గాళ్ల‌కు మోస‌గాడు' నుంచి 'ఎన్‌కౌంట‌ర్' దాకా! నాలుగు కేంద్రాల్లో 'నీడ‌' శ‌త‌దినోత్స‌వం పూర్తిచేసుకున్న సంద‌ర్భంగా 1980 మార్చి 15న చెన్నైలోని హోట‌ల్ చోళాలో విజ‌యోత్స‌వాన్ని నిర్వ‌హించారు నిర్మాత రామినేని సాంబ‌శివ‌రావు. ఈ స‌భ‌కు అక్కినేని నాగేశ్వ‌ర‌రావు స‌భాధ్య‌క్ష‌త వ‌హించ‌గా, ముఖ్య అతిథిగా కృష్ణ‌, బ‌హుమ‌తి ప్ర‌దాత‌గా క‌రుణానిధి పాల్గొన్నారు.

'ఆర్ఆర్ఆర్' కార‌ణంగా రూ. 75 కోట్ల మేర న‌ష్ట‌పోయిన తార‌క్‌?

  జూనియ‌ర్ ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా య‌స్‌.య‌స్‌. రాజ‌మౌళి రూపొందించిన 'ఆర్ఆర్ఆర్' మూవీ నేడు (జ‌న‌వ‌రి 7) ప్రపంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కొవిడ్ కేసుల వ్యాప్తి, ప‌లు ప్రాంతాల్లో థియేట‌ర్లు మూసివేత‌, 50 శాతం ఆక్యుపెన్సీ త‌దిత‌ర ప‌లు కార‌ణాల‌తో నిర‌వ‌ధికంగా వాయిదాప‌డింది. దాంతో ఆ సినిమా కోసం సినిమా ల‌వ‌ర్స్ మ‌రికొంత‌కాలం ఎదురుచూడాల్సిన అగత్యం ఏర్ప‌డింది. తార‌క్ ఫ్యాన్స్ అయితే త‌మ హీరోను వెండితెర‌పై చూసి ఇప్ప‌టికే మూడేళ్ల‌కు పైగా గ‌డిచింది. చివ‌రిసారిగా 2018లో వ‌చ్చిన 'అర‌వింద స‌మేత‌.. వీర‌రాఘ‌వ' మూవీతో వారికి తెర‌పై ద‌ర్శ‌న‌మిచ్చాడు తార‌క్‌. Also read: "ఊ అంటావా మావ‌" సాంగ్ కోసం సెక్సీగా స‌మంత ఎలా మారిందంటే..! 'అర‌వింద స‌మేత' త‌ర్వాత మ‌రే సినిమాకీ ఒప్పుకోకుండా ఒక్క 'ఆర్ఆర్ఆర్' మూవీకే మూడేళ్ల‌పాటు అంకిత‌మ‌య్యాడు తార‌క్‌. మ‌రోవైపు రామ్‌చ‌ర‌ణ్ ఈ సినిమాతో పాటు 'ఆచార్య' సినిమా కూడా సినిమా చేశాడు. దీంతో తార‌క్ క‌నీసం 60 కోట్ల నుంచి రూ. 75 కోట్ల‌ రూపాయ‌ల దాకా న‌ష్ట‌పోయాడ‌ని అంచ‌నా. ఈ మూడేళ్ల కాలంలో మామూలుగా అయితే అత‌ను మూడు లేదా నాలుగు సినిమాలు చేసుండేవాడు. ఒక్కో సినిమాకు యావ‌రేజ్‌గా రూ. 30 కోట్లు తీసుకుంటాడ‌నుకుంటే రూ. 120 కోట్ల దాకా అత‌ను సంపాదించి ఉండేవాడు. కానీ ఒక్క‌ 'ఆర్ఆర్ఆర్' సినిమాకే ఈ మూడేళ్లు వెచ్చించ‌డం వ‌ల్ల అత‌నికి ద‌క్కింది రూ. 45 కోట్లేన‌ని వినిపిస్తోంది. అంటే రూ. 75 కోట్ల మేర‌కు అత‌ను ఆదాయాన్ని కోల్పోయాడ‌న్న మాట‌. ఒక అంచ‌నా ప్ర‌కారం జూనియ‌ర్ ఎన్టీఆర్ నిక‌ర ఆస్తుల విలువ రూ. 440 కోట్ల దాకా ఉంటుంది.  Also read: 'పుష్ప' కోసం అమెజాన్‌ ప్రైమ్‌ అంత చెల్లించిందా? అదే రామ్‌చ‌ర‌ణ్ విష‌యానికి వ‌స్తే, అత‌ను రాజ‌మౌళి ప‌ర్మిష‌న్ తీసుకొని త‌న సొంత సినిమా 'ఆచార్య‌'లో న‌టించాడు. ఆ సినిమాలో చిరంజీవి టైటిల్ రోల్ పోషించ‌గా, చ‌ర‌ణ్ ఒక కీల‌క పాత్ర చేశాడు.అంటే తార‌క్‌తో పోల్చుకుంటే అత‌నికి క‌లిగిన న‌ష్టం త‌క్కువ‌. 

నాగార్జున 'రెండు నాల్క‌ల' తీరుపై సోష‌ల్ మీడియాలో 'ర‌గ‌డ‌'!

  ఒక్కోసారి ఒక్కో ర‌కంగా మాట్లాడుతూ దొరికిపోతున్నారు సెల‌బ్రిటీలు. తాజాగా ఆ లిస్టులో సీనియ‌ర్ స్టార్ అక్కినేని నాగార్జున చేరారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో టికెట్ ధ‌ర‌ల‌పై లేటెస్ట్‌గా ఆయ‌న చేసిన కామెంట్లు ఇప్పుడు ఆయ‌న‌ను ట్రోల్ చేయ‌డానికి కార‌ణ‌మ‌య్యాయి. గ‌తంలో ఇదే అంశంపై ఆయ‌న మాట్లాడిన మాట‌ల‌కు సంబంధించిన పాత వీడియో ఒక‌దాన్ని సోష‌ల్ మీడియాలో షేర్‌చేస్తూ, ఆయ‌న రెండు నాల్క‌ల ధోర‌ణిపై దుమ్మెత్తిపోస్తున్నారు నెటిజ‌న్లు. అలాగే మీమ్స్‌తోనూ ఆయ‌న‌ను ట్రోల్ చేస్తున్నారు. ఇటీవ‌ల 'బంగార్రాజు' రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ ఈవెంట్‌లో ఏపీలో సినిమా టికెట్ ధ‌ర‌ల‌పై స్పందించ‌మ‌ని అడిగిన ఒక జ‌ర్న‌లిస్టుకు తాను సినిమా వేదిక‌పై రాజ‌కీయాలు మాట్లాడ‌న‌ని ఆన్స‌ర్ ఇచ్చారు నాగ్‌. అలాగే ఏపీలో సినిమా టికెట్ ధ‌ర‌ల‌తో త‌న‌కూ, త‌న సినిమాకూ ఎలాంటి ఇబ్బందీ లేద‌ని ఆయ‌న నొక్కి వ‌క్కాణించారు. అక్క‌డ ప్ర‌స్తుతం ఉన్న టికెట్ ధ‌ర‌లు త‌న సినిమాకు స‌రిపోతాయ‌ని అన్నారు. ఆయ‌న నుంచి వ‌చ్చిన ఈ వ్యాఖ్య‌లు చూసి, టాలీవుడ్ ఇండ‌స్ట్రీ అంతా ఆశ్చ‌ర్యానికి గురైంది. Also read: పెళ్లి త‌ర్వాత న‌ట‌న‌కు దూర‌మైన‌ జ‌య‌మాలిని.. భ‌ర్త ఆమెపై ఆంక్ష‌లు పెట్టారా? ఇదే సంద‌ర్భంగా 2010లో త‌న 'ర‌గ‌డ' సినిమా ఆడియో ఫంక్ష‌న్‌లో ఆయ‌న మాట్లాడిన మాట‌ల‌కు సంబంధించిన వీడియోను బ‌య‌ట‌కు లాగారు. అప్ప‌టి ముఖ్య‌మంత్రికి సినిమా టికెట్ ధ‌ర‌ల‌ను పెంచాల్సిందిగా ఆయ‌న కోరారు. ప్ర‌భుత్వాలు వ‌స్తున్నాయి, పోతున్నాయ‌నీ కానీ ఫిల్మ్ ఇండ‌స్ట్రీ స‌మ‌స్య‌ల‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌నీ ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. టికెట్ ధ‌ర‌ల అంశం త‌న ఒక్క‌డికి మాత్ర‌మే సంబంధించిన స‌మ‌స్య కాద‌నీ, అంద‌రు హీరోల సినిమాల‌కు సంబంధించిన స‌మ‌స్య అనీ, అందువ‌ల్ల కొత్త‌గా వ‌చ్చిన ముఖ్య‌మంత్రి ఈ విష‌యంలో న్యాయం చేస్తార‌ని ఆశిస్తున్నాన‌నీ ఆయ‌న అన్నారు. Also read: నాగ‌బాబు దృష్టిలో చిరు చేసిన అలాంటి రిస్కీ ఫైట్‌ను మ‌రే హీరో చేయలేదు! ఈ వీడియోను షేర్ చేసిన నెటిజ‌న్లు 'ర‌గ‌డ' ఈవెంట్ సినిమా ఈవెంటా?  పొలిటిక‌ల్ ఈవెంటా? అని ప్ర‌శ్నిస్తున్నారు. 'బంగార్రాజు' ఈవెంట్‌లో "సినిమా స్టేజ్‌పై రాజ‌కీయాలు మాట్లాడ‌కూడ‌దు, నేను మాట్లాడ‌ను" అని చెప్పిన నాగ్‌.. అప్ప‌ట్లో 'ర‌గ‌డ' సినిమా స్టేజ్‌పై రాజ‌కీయాలు, సినిమా టికెట్ల ధ‌ర‌ల గురించి ఎందుకు మాట్లాడారని వారు ప్ర‌శ్నిస్తున్నారు. ఇది ముమ్మాటికీ నాగార్జున రెండు నాల్క‌ల ధోర‌ణినీ, ఆయ‌నలోని ద్వంద్వ ప్ర‌మాణాల‌ను చూపుతోంద‌ని వారంటున్నారు.

ఎన్టీఆర్ కారుకు పెద్ద‌పులి ఎదురైన వేళ‌..!

  అల‌నాటి గొప్ప హాస్య‌న‌టుల్లో ఒక‌రైన ప‌ద్మ‌నాభం ఉత్త‌మాభిరుచి క‌లిగిన మంచి ద‌ర్శ‌కుడు, నిర్మాత కూడా. రేఖా అండ్ ముర‌ళి కంబైన్స్‌ బ్యాన‌ర్‌పై ఆయ‌న నిర్మించిన తొలి సినిమాయే ఒక క్లాసిక్‌.. అది విశ్వ‌విఖ్యాత‌ నంద‌మూరి తార‌క‌రామారావు, మ‌హాన‌టి సావిత్రి జంట‌గా న‌టించిన 'దేవ‌త‌' (1965). కె. హేమాంబ‌ర‌ధ‌ర‌రావు దానికి ద‌ర్శ‌కుడు. ఆ మూవీలో వారిపై చిత్రీక‌రించిన‌ "క‌న్నుల్లో మిస‌మిస‌లు" పాట చాలా పాపుల‌ర్ అయ్యింది. ఆ పాట‌ను ఔట్‌డోర్ లొకేష‌న్ అయిన‌ సాత‌నూరులో షూట్ చేశారు. ఆ సంద‌ర్భంగా ఓ త‌మాషా ఘ‌ట‌న జ‌రిగింది. Also read: సిరి, ష‌ణ్ణు తెలిసే చేశారు.. మాన‌స్ బ‌య‌ట‌పెట్టేశాడు! ఆ పాట పిక్చ‌రైజేష‌న్ కోసం సావిత్రిగారు ముందుగా లొకేష‌న్‌కు వెళ్లిపోయారు. రామారావుగారిని వెంట‌బెట్టుకొని ప‌ద్మ‌నాభం ఒక కారులో రాత్రి 9 గంట‌ల‌కు మ‌ద్రాసు నుంచి బ‌య‌లుదేరారు. తిరువ‌ణ్ణామ‌లై మీదుగా సాత‌నూరు వెళ్లాలి. కారు వెనుక సీట్లో కూర్చున్న ఎన్టీఆర్, "త‌మ్ముడూ నేను ప‌డుకుంటాను. తిరువ‌ణ్ణామ‌లై రాగానే లేపండి" అని ప‌డుకున్నారు. తిరువ‌ణ్ణామ‌లై వ‌చ్చాక "అన్నగారూ.. లేవండి, తిరువ‌ణ్ణామ‌లై వ‌చ్చింది" అని లేపారు ప‌ద్మ‌నాభం. ఆయ‌న లేచి, "ఆ.. వెరీ గుడ్ బ్ర‌ద‌ర్‌.. వెరీ ఫైన్‌.. కొద్దిసేపు ఉండండి." అని కారులోంచి దిగి, అటూ ఇటూ తిరిగి వ‌చ్చి "బ్ర‌ద‌ర్‌.. పోదాం ప‌దండి" అన్నారు. Also read: ​వంట‌ల‌క్క మ‌రిదిని బుట్ట‌లో వేసిన మోనిత‌ "అన్న‌గారూ.. మీరు ప‌డుకున్న‌ప్పుడు ఒక త‌మాషా జ‌రిగిందండీ" అన్నారు ప‌ద్మ‌నాభం. "ఏం జ‌రిగింది బ్ర‌ద‌ర్?" అన‌డిగారు ఎన్టీఆర్‌. "మనం చెంగ‌ల్ప‌ట్టు ద‌గ్గ‌ర‌కు వ‌స్తుండ‌గా ఒక పెద్ద‌పులి ఎదుర‌య్యింది. అది గాండ్రిస్తూ వెళ్తోంది. బ్రేక్ వేసి ఆపితే, మీరెక్క‌డ లేస్తారోన‌ని మాకు భ‌య‌మైంది. డ్రైవ‌ర్ ఏమో గ‌డ‌గ‌డా వ‌ణికాడు. పైకి నేను మామూలుగా ఉన్నా, లోప‌ల వ‌ణుకుపుట్టింది." అని చెప్పారు ప‌ద్మ‌నాభం. "అవునా.. పులి ఎదురురావ‌డం మంచి శ‌కున‌మండీ. ఏమ‌నుకున్నారు? అరే.. న‌న్నూ లేప‌క‌పోయారా.. నేనూ చూసేవాడ్ని" అన్నారు రామారావు. "తిరువ‌ణ్ణామ‌లై వ‌చ్చేదాకా లేపొద్దన్నారు క‌దా అన్న‌గారూ.. మాకేమో పులిని చూసేట‌ప్ప‌టికి మ‌తిపోయింది.. అయినా పులికి మేం పెద్ద‌గా భ‌య‌ప‌డ‌లేదండీ" అన్నారు ప‌ద్మ‌నాభం. "ఎందుకు భ‌య‌ప‌డ‌లేదు బ్ర‌ద‌ర్?" అన‌డిగారు రామారావు. "మా వెన‌కాల సింహం ప‌డుకొని ఉంటే పులికి భ‌య‌ప‌డ‌తామా అన్న‌గారూ" అన్నారు ప‌ద్మ‌నాభం. రామారావు పెద్ద‌గా న‌వ్వేసి, "వెరీ గుడ్ బ్ర‌ద‌ర్‌.. య‌స్‌.. య‌స్" అని ప‌ద్మ‌నాభం భుజం త‌ట్టారు. అలా సాత‌నూరు వెళ్లి "క‌న్నుల్లో మిస‌మిస‌లు" పాట‌ను చిత్రీకరించుకొని వ‌చ్చారు. https://www.youtube.com/watch?v=oR7tjb6FBoo

'మ‌రోచ‌రిత్ర' హీరోయిన్ స‌రిత డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ ఎలా అయ్యారు?

  లెజెండరీ డైరెక్ట‌ర్ కె. బాల‌చంద‌ర్ ప‌రిచ‌యం చేసిన ఎంతోమంది ఆర్టిస్టుల్లో స‌రిత ఒక‌రు. ఆయ‌న రూపొందించిన క్లాసిక్ ల‌వ్ స్టోరీ 'మ‌రోచ‌రిత్ర‌'లో క‌మ‌ల్ హాస‌న్ స‌ర‌స‌న నాయిక‌గా న‌టించ‌డం ద్వారా ఎంట్రీ ఇచ్చిన స‌రిత‌, ఆ సినిమా బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ట‌వ‌డంతో రాత్రికి రాత్రే స్టార్ అయిపోయారు. బాల‌చంద‌ర్ డైరెక్ష‌న్‌లోనే ఏకంగా 23 సినిమాల్లో ఆమె న‌టించ‌డం గొప్ప విష‌యం. హీరోయిన్‌గా బిజీగా ఉన్న టైమ్‌లోనే ఆమె డ‌బ్బింగ్ ఆర్టిస్టుగా మార‌డం మ‌రో విశేషం. ఆమెను అలా మార్చింది మ‌రో లెజండ‌రీ డైరెక్ట‌ర్ దాస‌రి నారాయ‌ణ‌రావు. ఆమె మొట్ట‌మొద‌ట‌గా మ‌రో తార‌కు డ‌బ్బింగ్ చెప్పిన సినిమా.. దాస‌రి రూపొందించిన 'గోరింటాకు'. అందులో హీరోయిన్ సుజాత‌కు ఆమె వాయిస్ ఇచ్చారు. "నా వాయిస్ బాగుంటుంద‌ని నాకే తెలీదు. నిజానికి మ‌రోచ‌రిత్ర డ‌బ్బింగ్ టైమ్‌లో డైరెక్ట‌ర్ బాల‌చంద‌ర్ గారు న‌న్ను వ‌ద్ద‌నేశారు. డ‌బ్బింగ్ టెక్నిక్ తెలీక పోవ‌డం వ‌ల్ల మొద‌ట స‌రిగా చెప్ప‌లేక‌పోయాను. అయితే అక్క‌డి రికార్డింగ్ ఇంజ‌నీర్ నా వాయిస్ చాలా బాగుంద‌ని డైరెక్ట‌ర్‌గారిని క‌న్విన్స్ చేశారు. కొంచెం టైమ్ తీసుకున్నాక ఆ టెక్నిక్ అల‌వ‌డింది." అని చెప్పారు స‌రిత‌. Also read: ​సిరి, ష‌ణ్ణు తెలిసే చేశారు.. మాన‌స్ బ‌య‌ట‌పెట్టేశాడు! "దాస‌రిగారు 'గోరింటాకు' సినిమాలో సుజాత‌కు డ‌బ్బింగ్ చెప్పాల్సిందిగా అడిగారు. న‌న్నెందుకు డ‌బ్బింగ్ చెప్ప‌మ‌ని అడుగుతున్నారా? అని మొద‌ట ఆశ్చ‌ర్య‌పోయాను. అయితే డ‌బ్బింగ్ ప్ర‌క్రియ నాకు నిజంగా న‌చ్చింది. దాంట్లో నాకు క్రియేష‌న్ క‌నిపించింది. హీరోయిన్‌కు ఎక్కువ డైలాగ్స్ ఉన్నాయంటే నాకు పిలుపు వ‌చ్చేది. అలా 'స్వాతి'లో సుహాసినికి చెప్పాను. న‌టిగా మూడు షిఫ్టుల‌తో బిజీగా ఉన్న‌ప్పుడు కూడా రాత్రివేళ డ‌బ్బింగ్ చెప్పేదాన్ని. ఆ ఆర్ట్‌ను నేను ఇష్ట‌ప‌డ్డాను. అయితే డ‌బ్బింగ్ చెప్పొద్ద‌ని ఆ టైమ్‌లో న‌న్ను చాలామంది డిస్క‌రేజ్ చేసేవారు. యాక్ట‌ర్‌గా ఇంత బిజీగా ఉండి డ‌బ్బింగ్ ఎందుకు చెప్తున్నారు? అనేవారు." అని చెప్పుకొచ్చారు స‌రిత‌. Also read: దీప్తి బ్రేక‌ప్ పోస్టుకు ష‌ణ్ణు రిప్లై ఇదే! విజ‌య‌శాంతి, సుహాసిని, రాధ‌, సౌంద‌ర్య‌, న‌గ్మా, ర‌మ్య‌కృష్ణ లాంటి స్టార్ హీరోయిన్లు ఆమె గాత్రం వ‌ల్లే తెర‌పై గొప్ప‌గా రాణించారు. 'క‌ర్త‌వ్యం'లో విజ‌య‌శాంతి, 'స్వాతి'లో సుహాసిని, 'ఘ‌రానా మొగుడు'లో న‌గ్మా, 'న‌ర‌సింహా'లో ర‌మ్య‌కృష్ణ పాత్ర‌లు అంత‌గా పండి, ప్రేక్ష‌కుల్ని అల‌రించాయంటే.. ఆ సినిమాల్లో వారికి తెర‌వెనుక స‌రిత చెప్పిన డైలాగ్స్‌కు కూడా ఆ క్రెడిట్ ద‌క్కుతుంది.

పెళ్లి త‌ర్వాత న‌ట‌న‌కు దూర‌మైన‌ జ‌య‌మాలిని.. భ‌ర్త ఆమెపై ఆంక్ష‌లు పెట్టారా?

  ఒక‌ప్పుడు జ‌య‌మాలిని అంటే జ‌నానికి పిచ్చ క్రేజ్‌. సినిమాలో ఆమె పాట వ‌స్తోందంటే ఊగిపోవ‌డానికి సిద్ధ‌మ‌య్యేవాళ్లు ఎంద‌రో! తెర‌పై ఆమె డాన్స్ వేస్తుంటే, తెర ముందు కేరింత‌లు కొడుతూ డాన్సులు వేసేవారు! ఆ రోజులే వేరు!! జ‌య‌మాలిని డాన్స్ అంటే అదీ. వ్యాంప్ ఆర్టిస్టుల్లో ఆమెలాంటి అంద‌గ‌త్తెలు అరుదు. చాలామంది హీరోయిన్ల‌కు కూడా ఆమె అందం ఉండ‌దు. కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా చేసినా, డాన్స‌ర్‌గానే స్థిర‌ప‌డ్డారు జ‌య‌మాలిని. చాలామందికి తెలీని విష‌యం.. బాల‌కృష్ణ హీరోగా న‌టించిన తొలి సినిమాలో ఆయ‌న స‌ర‌స‌న హీరోయిన్ జ‌య‌మాలిని! ఆ సినిమా 'అన్న‌ద‌మ్ముల అనుబంధం'. సినిమాల్లో జ‌నాల్ని క‌వ్వించి, మైమ‌ర‌పించి, వాళ్ల‌ను మ‌రో లోకంలోకి తీసుకుపోయే జ‌య‌మాలిని నిజ జీవితంలో అందుకు పూర్తి భిన్నం. కెమెరా ముందుకు వ‌చ్చిన‌ప్పుడు మాత్ర‌మే ఆమె వంపుసొంపుల ప్ర‌ద‌ర్శ‌న‌. ఒక‌సారి షాట్ అయ్యిందంటే, మ‌ళ్లీ ఒంటిని నిండుగా క‌ప్పేసుకునేవారు. చాలా చాలా డీసెంట్‌గా వ్య‌వ‌హ‌రించేవారు. అందుకే ఎవ‌రూ ఆమెతో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించేవారు కాదు. డాన్స‌ర్‌గా ఒక‌టిన్న‌ర ద‌శాబ్దానికి పైగా ఆమె ప్రేక్ష‌కుల్ని రంజింప‌జేశారు. 1994లో ఆమె పార్తీప‌న్ అనే పోలీస్ ఇన్‌స్పెక్ట‌ర్‌ను వివాహం చేసుకొని, ఆ త‌ర్వాత పూర్తిగా సంసారానికే ప‌రిమిత‌మ‌య్యారు. ఆమెకు ఇద్ద‌రు కుమార్తెలు, ఒక కుమారుడు. ఎవ‌రినీ సినీ రంగంలోకి ఆమె తీసుకురాలేదు. నిజానికి ఆమె అంద‌చందాల‌కు ఎంతోమంది మోహితులైన‌వాళ్లే. సినీ రంగంలో ఎవ‌రూ ఆమెతో ప్రేమ‌లో ప‌డ‌లేదా?  లేక ఆమె ఎవ‌రినీ ప్రేమించ‌లేదా?  చెప్పాలంటే సినిమాల్లో న‌టించినంత కాలం ఒక ప్రొఫెష‌న‌ల్‌గానే ఆమె వ్య‌వ‌హ‌రిస్తూ వ‌చ్చారు. త‌న ప‌ని చూసుకోవ‌డం, ప్యాక‌ప్ చెప్ప‌గానే క్ష‌ణం ఆల‌స్యం చెయ్య‌కుండా ఇంటికి బ‌య‌లుదేరి వెళ్లిపోవ‌డం.. ఇంతే ఆమెకు తెలుసు. అందుకే ఆమె ఎవ‌రితోనూ ప్రేమ‌లో ప‌డ‌లేదు. "కొంత‌మంది న‌న్ను ప్రేమిస్తున్నాన‌ని చెప్పారు. కానీ నాకు కుటుంబ బాధ్య‌త ఉంది. అందుకే నేను ఆ ప్రేమ‌ల్ని యాక్సెప్ట్ చెయ్య‌లేదు. నేను పెళ్లి చేసుకుందామ‌ని అనుకున్న‌ప్పుడు సినిమా వాళ్లెవ‌రూ 'నేను పెళ్లి చేసుకుంటాను' అని నా ద‌గ్గ‌ర‌కు రాలేదు. డిస్కో శాంతిని శ్రీ‌హ‌రి చేసుకున్న‌ట్లు 'నీ బ‌రువు బాధ్య‌త‌ల్ని నేను తీసుకుంటాను' అని ఎవ‌రైనా వ‌చ్చిన‌ట్ల‌యితే మా అమ్మ న‌న్ను క‌చ్చితంగా వారికిచ్చి పెళ్లి చేసేదే. కానీ అలా ఎవ‌రూ రాలేదు." అని ఒక ఇంట‌ర్వ్యూలో చెప్పారు జ‌య‌మాలిని. ఆమె పెళ్లిచేసుకున్న పార్తీప‌న్ వాళ్ల ఫ్యామిలీ ఫ్రెండే. జ‌య‌మాలిని త‌ల్లి వాళ్ల‌ను అడిగారు. వాళ్లు ఆలోచించుకొని ఓకే చెప్పారు. అలా త‌ల్లి చూసిన ఆ సంబంధం చేసుకున్నారు జ‌య‌మాలిని. పెళ్లి త‌ర్వాత కూడా భ‌ర్త ఆమెపై ఎలాంటి రెస్ట్రిక్ష‌న్స్ పెట్ట‌లేదు. న‌టించ‌వ‌ద్ద‌ని చెప్ప‌లేదు. అయిన‌ప్ప‌టికీ కుటుంబ జీవిత‌మే ముఖ్య‌మ‌నుకొని ఆమె తిరిగి సినిమాల్లోకి రాలేదు. న‌టించినంత కాలం న‌ట‌న‌ను, డాన్స్‌ను ఎంజాయ్ చేసిన జ‌య‌మాలిని, పెళ్ల‌యి పిల్ల‌లు పుట్ట‌గానే వారి ఆల‌నా పాల‌నా చూసుకోవ‌డం, భ‌ర్త‌కు అవ‌స‌ర‌మైన‌వి స‌మ‌కూర్చ‌డంలోనే ఆనందం పొందుతూ వ‌చ్చారు. ఇప్పుడు త‌న వ‌య‌సుకు త‌గ్గ మంచి పాత్ర‌లు వ‌స్తే చేయడానికి రెడీగా ఉన్నాన‌ని ఆమె చెప్తున్నారు. (డిసెంబ‌ర్ 22 జ‌య‌మాలిని జ‌న్మ‌దినం సంద‌ర్భంగా...)

'భ‌క్త క‌న్న‌ప్ప' షూటింగ్‌ను బాపు ఎక్క‌డ, ఎలా చేశారో తెలుసా?!

  రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు కెరీర్‌లో మైల్‌స్టోన్స్ అన‌ద‌గ్గ చిత్రాల్లో ఒక‌టి 'భ‌క్త క‌న్న‌ప్ప‌'. లెజెండ‌రీ డైరెక్ట‌ర్ బాపు తీర్చిదిద్దిన ఈ చిత్రాన్ని గోపీకృష్ణా మూవీస్ బ్యాన‌ర్‌పై కృష్ణంరాజు స్వ‌యంగా నిర్మించారు. కృష్ణంరాజు స‌ర‌స‌న వాణిశ్రీ న‌టించారు. 10 ల‌క్ష‌ల రూపాయ‌ల బ‌డ్జెట్ అంటేనే ఎక్కువ అనే కాలంలో ఈ సినిమా కోసం ఏకంగా 20 ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టారు. అందులో సెట్స్ నిర్మాణం కోస‌మే 9 ల‌క్ష‌ల రూపాయ‌లు ఖ‌ర్చ‌య్యాయి. సినిమాలోని కైలాసం ఎపిసోడ్ మిన‌హా మిగ‌తా స‌న్నివేశాల్ని ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని ప‌ట్టిసీమ‌, గూటాల‌, బుట్టాయ‌గూడెం ప‌రిస‌ర ప్రాంతాల్లో చిత్రీక‌రించారు బాపు. Also read:  శార‌ద ఒక సీన్ చేయ‌డానికి 20 టేకులు తీసుకున్నారంటే స‌ర్‌ప్రైజ్ అవ్వాల్సిందే! ఆ రోజుల్లో ఎలాంటి ర‌వాణా సౌక‌ర్యాలు కానీ, ఇత‌ర సౌక‌ర్యాలు కానీ లేని మారుమూల గ్రామం బుట్టాయ‌గూడెంలో రెండెక‌రాల స్థ‌లంలో రెండు వేల తాటిచెట్లు కొట్టించి, వాటిని స‌గానికి క‌ట్ చేసి వాటితో బోయవాళ్ల కోట‌ను నిర్మించడం చిన్న విష‌యం కాదు. బుట్టాయ‌గూడెం కానీ, ఆ చుట్టుప‌క్క‌ల గ్రామాల్లో కానీ షూటింగ్ చెయ్యాలంటే.. అక్క‌డ‌కు వెళ్ల‌డానికి స‌రైన రోడ్లు లేవు. అందుకే షూటింగ్ లొకేష‌న్‌కు రోడ్లు కూడా బాపు బృంద‌మే వేసుకుంటూ వెళ్లింది. అక్క‌డ సుమారు 50 రోజుల పాటు షూటింగ్ నిర్వ‌హించారు. ఏమాత్రం ఇబ్బంది అనుకోకుండా యూనిట్ మొత్తం ఓ పిక్నిక్‌లా దాన్ని ఆస్వాదించింది. Also read:  ముచ్చ‌ర్ల అరుణ పెళ్లి ఎవ‌రితో, ఎలా జ‌రిగిందో తెలుసా? గోదావ‌రి మ‌ధ్య‌లో ఉన్న ప‌ట్టిసీమ గుడిలో ఐదు రోజులు షూటింగ్ జ‌రిపారు. ధ‌వ‌ళేశ్వ‌రం నుంచి పంటు (మ‌ర‌బోటు) తెప్పించి, అందులో జ‌న‌రేట‌ర్‌ను తీసుకెళ్లి షూటింగ్ నిర్వ‌హించారు. ఈ ఐదు రోజూలూ యూనిట్ స‌భ్యుల‌కే కాకుండా, షూటింగ్ చూడ్డానికి వ‌చ్చిన వాళ్ల‌కు సైతం భోజ‌నాలు పెట్ట‌డం ఓ విశేషంగా చెప్పుకున్నారు. 1976 మే నెల‌లో విడుద‌లైన 'భ‌క్త క‌న్న‌ప్ప‌'ను చూసేందుకు జ‌నం తండోప‌తండాలుగా థియేట‌ర్ల‌కు త‌ర‌లి వ‌చ్చారు. ఆ రోజుల్లోనే సూప‌ర్ హిట్ట‌యిన ఆ చిత్రం త‌ర్వాత కాలంలో తెలుగులోని క్లాసిక్స్‌లో ఒక‌టిగా పేరు తెచ్చుకుంది. ద‌ర్శ‌కుడిగా బాపు ఖ్యాతిని మ‌రింత‌గా పెంచింది.

ఘంట‌సాల బావ‌ సుబ్బుగారు హైదరాబాద్ వచ్చారు!

  సుబ్బుగారు ఈ తరానికి తెలియక పోవచ్చు.  తెలిస్తే, ఆశ్చర్య పోవాల్సిందే!  అవును, అమర గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు గారిని సినీ పరిశ్రమకు పరిచయం చేసింది సుబ్బు గారే! ఘంటసాలకు స్వయాన బావగారు!  ఘంటసాల స‌తీమ‌ణి సావిత్రి గారి సొంత అన్నయ్యే  సుబ్బుగారు!  సుబ్బుగారి పూర్తి పేరు కొడమంచిలి సుబ్బారావు!   గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం పెదపులివర్రు  సుబ్బుగారి ఊరు! సావిత్రి గారితో ఘంటసాల వివాహం అయ్యాక, ఆయ‌న‌ గంధ‌ర్వ‌ స్వరం చూసి, ఒకరోజు సుబ్బు గారు ప్రత్యేకంగా సీనియర్ సముద్రాల (రాఘ‌వాచార్య‌) గారికి ఘంటసాలను పరిచయం చేశారు! అలా ఘంటసాల సినీ రంగ ప్రవేశానికి  అడుగులు వేయించారు! Also read:  సింగ‌ర్ రాజ్ సీతారామ్‌ను సూప‌ర్‌స్టార్‌ కృష్ణ ఎందుకు ఎంక‌రేజ్ చేశారు? సుబ్బుగారు చెన్నై (అప్పటి మద్రాస్)లో తెలుగు సినీ పరిశ్రమలో ప్రొడక్షన్ మేనేజర్! ఆ రోజుల్లో జివిఎస్ ప్రొడక్షన్స్ లో పని చేశారు! దగ్గరుండి నందమూరి తారక రామారావు గారికి సొంత‌వూరు సినిమా కోసం తొలిసారి శ్రీకృష్ణుడు వేషం వేయించింది కూడా సుబ్బు గారే! త‌న‌ను శ్రీకృష్ణుని వేషంలో చూసుకొని మురిసిపోయిన ఎన్టీఆర్ ప్రత్యేకంగా ఆ కాస్ట్యూమ్, కిరీటం తనకు కావాలని కోరితే, సుబ్బుగారిని అడిగి ఘంట‌సాల ఇచ్చేశారు. 'పాండురంగ మహాత్యం'లో మళ్ళీ అదే కాస్ట్యూమ్ ధరించారట ఎన్టీఆర్!   Also read:  పూర్ణ హీరోయిన్‌గా ర‌విబాబు వ‌రుస‌గా మూడు సినిమాలు ఎందుకు చేశాడు? అంతే కాదు, సుబ్బుగారు దిగ్ద‌ర్శకుడు క‌ళాత‌ప‌స్వి కె. విశ్వనాథ్ గారి క్లాస్మేట్‌! ఇద్దరూ ఒరే అనుకునే మిత్రులు! ఇప్పుడు సుబ్బు గారి వయసు 92.  వయసును జయించి చాలా హుషారుగా హాయిగా ఆనందంగా ఉన్నారు!  సినీ పరిశ్రమను వదిలేశాక చాలా కాలం సొంతూరులో అర్చకత్వం చేశారట!  ఇటీవ‌ల హైదరాబాద్‌లో ఉన్న‌ మనవడు కిషన్ దగ్గరకు వచ్చి, ప్ర‌స్తుతం అక్క‌డే ఉన్నారు. క‌ర్టెసీ: డా. మహ్మద్ రఫీ (ఫేస్‌బుక్ పోస్ట్ ఆధారంగా)  

కృష్ణ 'మాయదారి మ‌ల్లిగాడు' మూవీతో స‌త్యానంద్ ఎలా రైట‌ర్ అయ్యారో తెలుసా?

  ప‌ద‌మూడ‌వ ఏటే స‌త్యానంద్ క‌థార‌చ‌యిత అయ్యారు. ఆ వ‌య‌సులో ఆయ‌న రాసిన క‌థ ఆంధ్ర‌ప్ర‌భ వీక్లీలో అచ్చయింది. ఆయ‌న పుట్టిందీ, పెరిగిందీ రాజ‌మండ్రిలోనే. మ‌ద్రాస్ వెళ్లిన తొలినాళ్ల‌వ‌ర‌కూ ప‌త్రిక‌ల‌కు క‌థ‌లు రాస్తూ వ‌చ్చారు. "నేను 21వ ఏట సినీ రచయితనయ్యాను. దానికంటే ముందు ఆర్థిక అవసరాల కోసం ఒక పది దాకా డిటెక్టివ్ నవలలు కూడా రాశాను. ఆ తర్వాత విజయ బాపినీడు గారి విజయ మేగజైన్‌కు కొన్ని రాశాను. ఆ కలెక్షన్ నా దగ్గర లేదు. దాచుకొనే అలవాటు లేదు. ఏదో ఒక డిటెక్టివ్ నవల ఉండాలి. అప్పట్లో డిటెక్టివ్ అనే మేగజైన్ వచ్చేది. దానికి జీవీజీ గారు ఎడిటర్. అందులో ఒక డిటెక్టివ్ సీరియల్ రాశాను. అదివరకే ఆయన నా కథలు చదివి ఉన్నారు. మొదటిసారి కలుసుకున్నప్పుడు నన్నుచూసి ఆశ్చర్యపోయి, మీరింత చిన్నవారు అనుకోలేదు, సత్యానంద్ అనే ఆయన చాలా పెద్దవారేమోననుకున్నానని ఆయన అన్నారు." అని చెప్పారు స‌త్యానంద్‌. సినిమాల్లోకి వెళ్లాలనేది ఆయ‌న‌ కోరిక. "అప్ప‌టి ప్ర‌ఖ్యాత ద‌ర్శ‌కుడు ఆదుర్తి సుబ్బారావుగారు మా మావయ్య. ఆయ‌న‌ మొదట నన్ను ఎంకరేజ్ చెయ్యలేదు. ఆ కష్టాల్లోకి నన్ను దింపడమెందుకని ఆయన వద్దన్నారు. దాంతో ఒక రూంలో ఇంకో ముగ్గురితో పాటు ఉంటూ, డిటెక్టివ్ పుస్తకాలు రాసుకుంటూ ఏడాది పాటు గడిపేశాను. ఒక నవలకు 300 రూపాయలు ఇచ్చేవారు. ఆ తర్వాత సుబ్బారావుగారు నా గురించీ ఎంక్వైరీచేసి, నేను మద్రాసులోనే ఉన్నానని తెలుసుకున్నారు." అని ఆయ‌న తెలిపారు. Also read:  ఫొటో స్టోరీ: చంద్ర‌మోహ‌న్ డైలీ ప్రోగ్రాంను బ్లాక్ బోర్డు మీద రాస్తున్న కుమార్తె! అప్పటి దాకా సుబ్బారావు గారి బ్రదర్స్ కూడా అంతత మాత్రంగానే ఉంటూ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. "కొత్తగా మళ్లీ ఇంకొకడు ఇబ్బందులు పడటమెందుకని ఆయన నన్ను ఎంకరేజ్ చెయ్యలేదు. అయితే నేను ఊరికి వెళ్లకుండా అక్కడే ఉన్నానని తెలిసి, 'ఒక పాయింట్ చెబుతాను. దాని డెవలప్ చేసి తీసుకురా. నువ్వెలా చేస్తావో చూస్తాను' అన్నారు. ఆ పాయింట్‌ను బేస్ చేసుకొని నేనొక 200 పేజీల నవల కిందే రాసేశాను. అదే 'మాయదారి మల్లిగాడు' సినిమా. అది చదివి ఆయన 'ఇది బాగానే ఉంది. అయితే దీని స్క్రీన్‌ప్లే రూపంలో రాయాలి' అని నవలా రూపంలో ఉన్నదాన్ని ఎలా స్క్రీన్‌ప్లే చెయ్యాలో ఆయనే చెప్పారు. అప్పుడు మళ్లీ దాన్ని స్క్రీన్‌ప్లే ఆర్డర్‌లో రాశాను." అని చెప్పారు స‌త్యానంద్‌. Also read:  'అఖండ‌'లో మెయిన్ విల‌న్ రియ‌ల్ లైఫ్‌లో మాజీ ఆర్మీ ఆఫీస‌ర్ అని మీకు తెలుసా? అప్పుడు ఆదుర్తి మళ్లీ 'నేనింకా డైలాగ్ రైటర్‌ని ఎవర్నీ అనుకోలేదు. ఎల్లుండి షూటింగ్. నువ్వు స్క్రీన్‌ప్లే రాశావు కాబట్టి, ఈ రెండు సీన్లకూ డైలాగ్స్ రాసి తీసుకురా, చూద్దాం' అన్నారు. "రాసి తీసుకెళ్లి చూపిస్తే, చూసి బాగున్నాయన్నారు. దాంతో పాటు ఆయన నన్ను అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా చేరమన్నారు. సెట్స్ మీద డైలాగ్స్ విషయంలో ఏవైనా డౌట్స్ వస్తే చెప్పడానికి నేనుండాలని ఆయన అనుకున్నారు. అలా 'మాయదారి మల్లిగాడు' మూవీకి రైటర్‌గా, అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాను. కృష్ణగారికి ఆయన డైలాగ్స్ చెప్పారు. నన్ను పరిచయం చేశారు. ఆయన ఓపెన్‌గా డైలాగ్స్ చాలా బాగున్నాయని మెచ్చుకున్నారు. ఆ సినిమా రిలీజయ్యేనాటికి నాకు 22 ఏళ్లు." అని స‌త్యానంద్ వివ‌రించారు. Also read:  "స‌గం దోసె తింటారా.. సిగ్గు లేదూ మీకు?" ఎన్టీఆర్ మాట‌ల‌కు స్ట‌న్న‌యిన ల‌క్ష్మి! కృష్ణగారు తన దగ్గరకు వచ్చిన వాళ్లందరికీ 'కొత్త కుర్రాడు బాగా రాస్తున్నాడయ్యా.. మన సుబ్బారావుగారి మేనల్లుడంట' అని చెప్పడం మొదలుపెట్టారు. "ఎవరిలోనైనా చిన్న గొప్పదనం కనిపిస్తే పదిమందినీ కూర్చోబెట్టి చెప్పే గొప్ప గుణం ఆయనలో ఉంది. 'మాయదారి మల్లిగాడు' రిలీజై మంచి హిట్టయింది. ఆ వెంటనే తాతినేని రామారావుగారు, పూర్ణచంద్రరావు గారు పిలిచి తమ సినిమాకు అవకాశమిచ్చారు. అలాగే క్రాంతికుమార్ గారిదొక సినిమా, వీబీ రాజేంద్రప్రసాద్ గారి సినిమా.. ఈ మూడూ వెంటనే వచ్చాయి. వాటిలో రెండింటిలో శోభన్‌బాబు హీరో అయితే, ఒకటి శారద గారు లీడ్ రోల్ చేసిన 'ఊర్వశి' అనే సినిమా. శోభన్‌బాబు గారితో వరుసగా ఆరేడు సినిమాలు చేశానప్పుడు. నిర్మాతలు, దర్శకులకు ఆయన నన్ను రికమెండ్ చేస్తూ వచ్చారు. అలా కృష్ణ, శోభన్‌బాబు ఇద్దరూ నన్ను ఆదరించారు, ఎఫక్షనేట్‌గా చూసేవారు. అని చెప్పుకొచ్చారు స‌త్యానంద్‌.

బ‌ర్త్‌డే స్పెష‌ల్‌: విక్టరీ వెంకటేశ్ టాప్ 10 రీమేక్స్

  మూడున్నర దశాబ్దాలుగా తనదైన నటనా సామర్థ్యంతో ప్రేక్షకుల్ని అలరిస్తూ, ఇప్పటికీ టాప్ సీనియర్ స్టార్లలో ఒకడిగా తన స్థానానికి న్యాయం చేస్తొన్న యాక్టర్.. విక్టరీ వెంకటేశ్. భిన్న జానర్ సినిమాలు, భిన్న తరహా పాత్రలతో మెప్పిస్తూ వస్తున్న ఈ స్టార్ యాక్టర్‌ను రీమేక్ కింగ్‌గా కూడా చెబుతూ ఉంటారు. 37 సంవత్సరాల సుదీర్ఘ కెరీర్‌లో చేసింది 75 సినిమాలైనా వాటిలో 30 సినిమాలు రీమేక్‌లే కావడం దీనికి నిదర్శనం. ఇటీవ‌లే ఆయ‌న 75వ సినిమా 'దృశ్యం 2' నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై రిలీజ‌య్యింది. సందర్భవశాతూ అది కూడా ఒక రీమేకే. మ‌ల‌యాళంలో మోహ‌న్‌లాల్‌ నటించగా అదే పేరుతో రిలీజైన సినిమా ఆధారంగా ఒరిజిన‌ల్ డైరెక్ట‌ర్ జీతు జోసెఫ్ ఈ మూవీని రూపొందించాడు. దానికంటే ముందు వ‌చ్చిన 74వ సినిమా 'నార‌ప్ప‌', త‌మిళంలో వ‌చ్చిన హిట్ ఫిల్మ్ 'అసుర‌న్‌'కు రీమేక్‌. 1986లో హీరోగా కెరీర్ ఆరంభించిన వెంకటేశ్, 1987లో నటించిన 4వ సినిమా 'భారతంలో అర్జునుడు' నుంచి రీమేక్స్ చేయడం మొదలుపెట్టాడు. ఆ సినిమా ఒరిజినల్ హిందీ బ్లాక్‌బస్టర్ 'అర్జున్'. అప్పట్నుంచీ కూడా ఇతర భాషల్లో వచ్చిన తనకు ఇష్టమైన సినిమాల్ని రీమేక్ చేయడాన్ని ఒక వ్యసనంగా మార్చుకున్నాడు వెంకటేశ్. డిసెంబ‌ర్ 13 ఆయ‌న బ‌ర్త్‌డే. ఈ సంద‌ర్భంగా ఆయన చేసిన రీమేక్స్‌లో టాప్ టెన్ సినిమాలేవో చూద్దామా... 10. రక్తతిలకం (1988): యాక్షన్ మేళవించిన రివెంజ్ డ్రామాగా రూపొందిన ఈ మూవీని బి. గోపాల్ డైరెక్ట్ చేశాడు. అమల హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో శారద కథకు అత్యంత కీలకమైన పాత్ర చేశారు. తనను పెంచిన తల్లి కూతురిపై దారుణంగా అత్యాచారం జరిపి హత్యచేసిన వాళ్లపై ప్రతీకారం తీర్చుకొనే యాక్షన్ హీరోగా వెంకటేశ్ ప్రదర్శించిన అభినయం ప్రేక్షకుల్ని మెప్పించి, సినిమాకి ఘన విజయం చేకూర్చింది. బెంగాలీ హిట్ ఫిల్మ్ 'ప్రతీకార్'కు ఇది రీమేక్. Also read:  ఈ లోకం నీకు తుపాకి ఇచ్చింది.. నాకు గొడ్డలి ఇచ్చింది.. 'పుష్ప' ట్రైల‌ర్‌ బెస్ట్ మూమెంట్స్‌! 9. నార‌ప్ప‌ (2021):  యాక్ష‌న్‌ డ్రామాగా తయారైన ఈ సినిమాని శ్రీ‌కాంత్ అడ్డాల‌ డైరెక్ట్ చేశాడు. ధ‌నుష్ హీరోగా వెట్రిమార‌న్‌ రూపొందించిన తమిళ హిట్ ఫిల్మ్ 'అసుర‌న్‌'.. ఈ మూవీకి ఆధారం. వెంకటేశ్ జోడీగా ప్రియ‌మ‌ణి నటించిన ఈ సినిమాలో, రాజీవ్ క‌న‌కాల‌, కార్తీక్ ర‌త్నం, రాఖీ, అమ్ము అభిరామి, రావు ర‌మేశ్‌, శ్రీ‌తేజ్‌ కీలక పాత్రధారులు. ఒక భూ త‌గాదాలో పెద్ద‌కొడుకును కోల్పోయి, ఆవేశంలో ప్ర‌త్య‌ర్థిని హ‌త్య‌చేసిన‌ చిన్న‌కొడుకును కాపాడుకోవ‌డానికి అల‌మ‌టించిపోయిన నార‌ప్ప‌గా వెంక‌టేశ్ అమితంగా ఆక‌ట్టుకున్నారు. థియేట‌ర్ల‌లో విడుద‌ల కాకుండా నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై రిలీజైన ఈ సినిమాకు మంచి ఆద‌ర‌ణ ల‌భించింది.  8. రాజా (1999): సెంటిమెంట్ మేళవించిన ఈ రొమాంటిక్ డ్రామాను ముప్పలనేని శివ డైరెక్ట్ చేశాడు. సౌందర్య హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో అబ్బాస్, సుధాకర్ కీలకపాత్రలు చేశారు. ఒక యువతి సాహచర్యంలో మంచివాడుగా మారిన దొంగ, ఆమె ఉన్నతికి ఎలా తోడ్పడ్డాడనే కథలో టైటిల్ పాత్ర పోషించిన వెంకటేశ్, అతడిని మంచివాడుగా మార్చిన పాత్రలో సౌందర్య పోటాపోటీగా నటించి ప్రేక్షకుల్ని రంజింపజేశారు. కార్తీక్, రోజా ప్రధానపాత్రధారులుగా విక్రమన్ తమిళంలో డైరెక్ట్ చేసిన హిట్ మూవీ 'ఉన్నిదత్తిల్ ఎన్నై కొడుతేన్'కి ఇది రీమేక్. 7. అబ్బాయిగారు (1993): సెంటిమెంట్ మేళవించిన ఈ ఫ్యామిలీ డ్రామాను ఈవీవీ సత్యనారాయణ రూపొందించాడు. కె. భాగ్యరాజ్ నటించి దర్శకత్వం వహించిన తమిళ సూపర్ హిట్ సినిమా 'ఎంగ చిన్న రాస' ఈ చిత్రానికి ఆధారం. వెంకటేశ్ సరసన మీనా నటించిన ఈ మూవీలో జయచిత్ర, శ్రీకాంత్, కోట శ్రీనివాసరావు కీలకపాత్రలు పోషించారు. తనపై వల్లమాలిన ప్రేమ పెంచుకున్న మారుటి కొడుకును విషమిచ్చి చంపడానికి ప్రయత్నించిన ఒక తల్లి, అది విషమని భార్య ఎంతచెప్పినా వినకుండా తల్లిమీద ప్రేమతో ఆ విషాన్ని తాగి చావును ఆహ్వానించిన ఒక కొడుకు కథలోని సెంటిమెంటుకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. నటుడిగా వెంకటేశ్‌కు ఈ సినిమా మంచి పేరు తెచ్చింది. Also read:  ఏపీలో గ‌వర్న‌మెంట్ కంట్రోల్‌లో సినిమా.. టాలీవుడ్ పెద్ద‌లు ఇప్పుడేం చేస్తారు? 6. దృశ్యం (2014): క్రైం థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాని నటి శ్రీప్రియ డైరెక్ట్ చేశారు. వెంకీ భార్యగా మీనా నటించిన ఈ మూవీలో నదియా, రవి కాలే కీలక క్యారెక్టర్లు చేశారు. తన కూతుర్ని న్యూడ్‌గా సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి, ఆమెను, తన భార్యను బ్లాక్‌మెయిల్ చేయడానికి ప్రయత్నించిన యువకుడిని తప్పనిసరి పరిస్థితుల్లో హత్యచేసి, ఆ నేరం నుంచి తప్పించుకొనే ఒక కేబుల్ ఆపరేటర్‌గా వెంకటేశ్ ప్రదర్శించిన నటన ప్రేక్షకుల్ని బాగా మెప్పించి, భారీ వసూళ్లను సాధించింది. మోహన్ లాల్, మీనా జంటగా జీతూ జోసెఫ్ డైరెక్ట్ చేసిన మలయాళ బ్లాక్‌బస్టర్ 'దృశ్యం'కు ఇది రీమేక్. 5. ఘర్షణ (2004): ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను గౌతం మీనన్ రూపొందించాడు. సూర్య, జ్యోతిక జంటగా గౌతం మీనన్ డైరెక్ట్ చేసిన సూపర్ హిట్ తమిళ మూవీ 'కాక్క కాక్క' ఈ సినిమాకు ఆధారం. వెంకటేశ్ జోడీగా అసిన్ నటించిన ఈ మూవీలో సలీం కీలకమైన విలన్ రోల్‌ను సలీ బేగ్ పోషించాడు. తను ఎంతగానో ప్రేమించి పెళ్లిచేసుకున్న భార్యను పాండా అనే క్రిమినల్ కిడ్నాప్ చేస్తే, ఆమెను రక్షించుకోడానికి డీసీపీ రామచంద్ర ఏం చేశాడనే కథతో తయారైన ఈ సినిమాలో వెంకటేశ్ నటన చూసి తీరాల్సిందే. అసిన్ పర్ఫార్మెన్స్, గౌతం మీనన్ డైరెక్షన్ ఈ సినిమాకి ఘన విజయం సాధించిపెట్టాయి. 4. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు (1996): రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా తయారైన ఈ సినిమాను ఈవీవీ సత్యనారాయణ డైరెక్ట్ చేశాడు. వెంకటేశ్ భార్యలుగా సౌందర్య, వినీత నటించిన ఈ సినిమాలో తండ్రిగా కోట శ్రీనివాసరావు ఒక ప్రధాన పాత్ర చేశారు. భార్యతో సంతోషంగా సంసార జీవనం సాగిస్తున్న ఒక యువకుడు బిజినెస్ టూర్ మీద నేపాల్ వెళ్లి, అక్కడ అనూహ్య పరిస్థితుల్లో మరో యువతిని పెళ్లాడి ఎలాంటి ఇక్కట్లు పడ్డాడనే కథలో వెంకటేశ్ అగచాట్లు ప్రేక్షకుల్ని విపరీతంగా నవ్వించాయి, వసూళ్ల వర్షాన్ని కురిపించాయి. పాండ్యరాజన్ హీరోగా ఎన్. మురుగేష్ డైరెక్ట్ చేసిన తమిళ హిట్ ఫిల్మ్ 'దైకులమే దైకులమే'కు ఇది రీమేక్. Also read:  టాలీవుడ్‌లో మ‌హేశ్‌దే టాప్ ప్లేస్.. సెకండ్ ప్లేస్‌లో అల్లు అర్జున్‌! 3. సూర్యవంశం (1998): సెంటిమెంట్ మిక్స్ చేసిన ఈ ఫ్యామిలీ డ్రామాను డైరెక్టర్ భీమనేని శ్రీనివాసరావు రూపొందించాడు. శరత్ కుమార్ తండ్రీకొడుకులుగా నటించగా విక్రమన్ డైరెక్ట్ చేసిన బ్లాక్‌బస్టర్ తమిళ్ మూవీ 'సూర్యవంశం' ఈ సినిమాకు ఆధారం. వెంకటేశ్ డ్యూయల్ రోల్ చేసిన ఈ మూవీలో మీనా నాయికగా నటిస్తే, ఆనంద్ రాజ్ విలన్ రోల్ చేశాడు. తనను తప్పుగా అర్థం చేసుకొని దగ్గరకు రానీయకుండా దూరం పెట్టిన తండ్రి ప్రేమ కోసం అలమటిస్తూ, భార్య ప్రోత్సాహంతో జీవితంలో ఎదిగి అనుకున్నది సాధించిన ఒక కొడుకు కథ ఈ సినిమా. తండ్రీ కొడుకులుగా భిన్న పాత్రల్లో వెంకటేశ్ ఉన్నత స్థాయి నటనతో ప్రేక్షకుల హృదయాల్ని గెలిచాడు. 2. సుందరకాండ (1992): రొమాంటికి కామెడీ డ్రామాగా రూపొందిన ఈ మూవీకి కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. మీనా, అపర్ణ హీరోయిన్లుగా నటిస్తే, గొల్లపూడి మారుతిరావు కీలక పాత్ర చేశారు. ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్న తన స్టూడెంట్ నుంచి తప్పించుకోడానికి నిరక్షరాస్యురాలైన ఒక యువతిని పెళ్లాడిన తెలుగు లెక్చరర్ ఎలాంటి ఇబ్బందులు పడ్డాడనే కథలో వెంకటేశ్, మీనా జోడీ విపరీతంగా నవ్వులు పంచగా, సెంటిమెంట్ మేళవించిన అల్లరి పాత్రలో కొత్తమ్మాయి అపర్ణ ఆకట్టుకుంది. కె. భాగ్యరాజ్ నటిస్తూ డైరెక్ట్ చేసిన తమిళ సూపర్ హిట్ మూవీ 'సుందర కాండం'కు ఇది రీమేక్. 1. చంటి (1992): మదర్ సెంటిమెంట్ మిక్స్ చేసిన ఈ ఫ్యామిలీ డ్రామాను రవిరాజా పినిశెట్టి డైరెక్ట్ చేశాడు. ప్రభు, కుష్బూ జంటగా నటించగా పి. వాసు డైరెక్ట్ చేసిన సూపర్ హిట్ తమిళ్ ఫిల్మ్ 'చిన్న తంబి' ఈ సినిమాకు ఆధారం. వెంకటేశ్ జోడీగా మీనా నటించిన ఈ సినిమాలో సుజాత, నాజర్ కీలక పాత్రధారులు. లోకజ్ఞానం తెలీని చంటి అనే యువకుడు తన యజమానుల ముద్దుల చెల్లెలి ప్రేమకు పాత్రుడై, దానివల్ల ఎలాంటి విపరిణామాలు ఎదుర్కొన్నాడు, తల్లికి జరిగిన అవమానానికి ఎలా స్పందించాడనే కథను ప్రేక్షకులు అపూర్వంగా ఆదరించారు. వెంకటేశ్ నట జీవితంలో చంటి పాత్ర పోషణ ఒక కలికితురాయిగా పేరుపొందింది. ఈ సినిమాలే కాకుండా 'త్రిమూర్తులు', 'బ్రహ్మపుత్రుడు', 'వారసుడొచ్చాడు', 'బాడీగార్డ్', 'గురు' వంటి రీమేక్స్‌ కూడా వెంకటేశ్‌కు మంచి పేరే తెచ్చాయి. 1992లో, 1993లో వెంకటేశ్ సినిమాలు మూడేసి రిలీజైతే అవన్నీ రీమేక్‌లే కావడం విశేషం.

బ‌ర్త్‌డే స్పెష‌ల్ స్టోరీ: సౌత్ ఇండియా సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ కెరీర్‌లో టాప్ టెన్ హిట్స్‌!

  1975లో కె. బాల‌చంద‌ర్ డైరెక్ష‌న్‌లో 'అపూర్వ రాగంగ‌ళ్' మూవీలో స‌పోర్టింగ్ రోల్ చేయ‌డం ద్వారా కెరీర్ ఆరంభించిన ఒక న‌టుడు, అనంత‌ర కాలంలో ఒక్క కోలీవుడ్‌నే కాకుండా ద‌క్షిణ భార‌తావ‌ని అంత‌టా.. ఆ మాట‌కొస్తే దేశ‌వ్యాప్తంగా.. అమేయ‌మైన ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకొని సూప‌ర్‌స్టార్‌గా ఎదిగిన వైనం అసాధార‌ణం, అపూర్వం. ఆ న‌టుడు ర‌జ‌నీకాంత్‌! 46 సంవ‌త్స‌రాలుగా కెరీర్‌ను కొన‌సాగిస్తూ, 70 ఏళ్ల వ‌య‌సులోనూ 'అణ్ణాత్తే' మూవీతో తిరుగులేని స్టార్‌గా రాణించ‌డం దేశ సినీ చ‌రిత్ర‌లోనే ఓ అరుదైన విష‌యం. దేశం మొత్తం మీద ఇవాళ జీవించి ఉన్న లెజెండ‌రీ యాక్ట‌ర్ల‌లో ఆయ‌న‌కున్న ఇమేజ్ మ‌రే యాక్ట‌ర్‌కూ లేద‌నేది నిస్సందేహం. ఆయ‌న సినిమా వ‌స్తోందంటేనే.. మాస్ ఆడియెన్స్ పూన‌కం వ‌చ్చిన‌ట్లు ఊగిపోతారు. ఎంత మందిని ఆయ‌న ఇన్‌స్పైర్ చేస్తారో ఊహించ‌లేం. ఫ్లాప‌యిన సినిమా కూడా వంద కోట్ల రూపాయ‌ల‌కు పైగానే వ‌సూళ్లు సాధించ‌డం ఆయ‌న బాక్సాఫీస్ స్టామినాకు నిద‌ర్శ‌నం. డిసెంబ‌ర్ 12 ఆ మ‌హాగొప్ప క‌మ‌ర్షియ‌ల్ స్టార్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆయ‌న కెరీర్‌లో టాప్ 10 క‌మ‌ర్షియ‌ల్ హిట్స్ ఏవో ఓ లుక్కేద్దాం... 1. బిల్లా (1980) క‌మ‌ర్షియ‌ల్‌గా ర‌జ‌నీ కెరీర్‌ దిశ‌ను మార్చిన సినిమాగా 'బిల్లా'ను పేర్కొంటూ ఉంటారు విశ్లేష‌కులు. న‌టుడిగా కెరీర్‌ను ప్రారంభించిన ఐదేళ్ల‌కు ర‌జ‌నీని స్టార్‌ను చేసిన సినిమా ఇదే. అమితాబ్ బ‌చ్చ‌న్ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ 'డాన్‌'కు ఇది రీమేక్‌. థియేట‌ర్ల‌లో ఈ మూవీ 25 వారాల పాటు న‌డిచింది. 2. రాజా చిన్నరోజా (1989) యానిమేష‌న్ మిక్స్ చేసిన లైవ్ యాక్ష‌న్ మూవీగా వ‌చ్చిన 'రాజా చిన్నరోజా' థియేట‌ర్ల‌లో సిల్వ‌ర్ జూబ్లీ జ‌రుపుకుంది. ఆబాల గోపాలాన్నీ అల‌రించి ర‌జ‌నీకాంత్ టాప్ క‌మ‌ర్షియ‌ల్ మూవీస్‌లో ఒక‌టిగా నిలిచింది. 3. బాషా (1995) ద‌క్షిణాది సినిమా బాక్సాఫీస్ చరిత్ర‌ను తిర‌గ‌రాసిన క్లాసిక్ బ్లాక్‌బ‌స్ట‌ర్ 'బాషా'. అనంత‌ర కాలంలో ఎన్ని సినిమాలు 'బాషా' ఫార్మ‌ట్‌లో వ‌చ్చాయో లెక్క‌లేదు. హీరోలు ఆ త‌ర‌హా సినిమాల్లో న‌టించాల‌ని త‌హ‌త‌హ‌లాడితే, ద‌ర్శ‌కులూ ఆ త‌ర‌హా క‌థ‌ల‌ను సృష్టించ‌డానికి వెంప‌ర్లాడుతూ వ‌చ్చారు. ఇప్ప‌టికీ ఎవ‌రికో ఒక‌రికి ఈ సినిమా ఇన్‌స్పిరేష‌న్ క‌లిగిస్తూనే ఉంది. థియేట‌ర్ల‌లో సంవ‌త్స‌రం ఆడిన ఈ సినిమా వ‌ర‌ల్డ్‌వైడ్‌గా 38 కోట్ల రూపాయ‌లు వ‌సూలు చేయ‌డం ఆ రోజుల్లో ఏ ర‌కంగా చూసినా అసాధార‌ణం. తెలుగులోనూ ఈ సినిమా బ్లాక్‌బ‌స్ట‌రే. ఈ మూవీతో ర‌జ‌నీ ఇమేజ్ ఆకాశానికి ఎగ‌సింది. 4. ముత్తు (1995) 'బాషా' వ‌చ్చిన ఏడాదే వ‌చ్చి త‌మిళంతో పాటు తెలుగులోనూ సూప‌ర్ హిట్ట‌యిన సినిమా 'ముత్తు'. థియేట‌ర్ల‌లో 175 రోజులు ఆడిన ఈ సినిమా, 1998లో జ‌పనీస్ భాష‌లో అనువాద‌మై, ఆ దేశంలో విడుద‌లై ఘ‌న విజ‌యం సాధించ‌డం పెద్ద విశేషం. అందులో ర‌జ‌నీ విన్యాసాలు చూసి జ‌ప‌నీయులు ఆయ‌న‌కు అభిమానులైపోయారు. ర‌జ‌నీ ప్ర‌తి సినిమా జ‌పాన్‌లో విడుద‌ల‌వ‌డానికి పునాదిగా నిలిచింది 'ముత్తు'. ఇప్ప‌టికీ అక్క‌డ హ‌య్యెస్ట్ గ్రాసింగ్ ఇండియ‌న్ ఫిల్మ్ ఇదే. 5. ప‌డ‌య‌ప్పా (1999) బాక్సాఫీస్ ప‌రంగా ర‌జ‌నీకాంత్ మునుప‌టి రికార్డుల‌నే కాకుండా సౌత్ ఇండియ‌న్ మూవీ రికార్డుల‌ను తుడిచిపెట్టిన సినిమా 'ప‌డ‌య‌ప్పా'. తెలుగులో 'న‌రసింహా'గా రిలీజై, ఇక్క‌డ కూడా బ్లాక్‌బ‌స్ట‌ర్ హోదాను నిలుపుకుంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా 44 కోట్ల రూపాయ‌ల‌ను వ‌సూలు చేసిన 'ప‌డ‌య‌ప్పా' మూవీ ర‌జ‌నీ ఇమేజ్‌ను మ‌రింత పైకి తీసుకెళ్ల‌డ‌మే కాకుండా, సంక్షోభ స్థితిలో ఉన్న త‌మిళ చిత్ర‌సీమ‌ను గ‌ట్టెక్కించింది. 6. చంద్ర‌ముఖి (2005) థియేట‌ర్ల‌లో ఏకంగా 890 రోజులు న‌డిచి, ఆ టైమ్‌కు అత్య‌ధిక కాలం ఆడిన సినిమాగా చ‌రిత్ర సృష్టించిన 'చంద్ర‌ముఖి', ప్ర‌పంచ‌వ్యాప్తంగా 90 కోట్ల గ్రాస్‌ను వ‌సూలు చేసి, మ‌రో చ‌రిత్ర‌ను లిఖించింది. ఓ హార‌ర్ కామెడీ జాన‌ర్ సినిమా ఈ రేంజ్ వ‌సూళ్ల‌ను సాధించ‌డం అరుదైన విష‌యం. ఆ రికార్డ్ ర‌జనీకే చెల్లింది. 7. శివాజీ: ద బాస్ (2007) 100 కోట్ల రూపాయ‌లు వ‌సూలు చేసిన తొలి సౌత్ ఇండియ‌న్ మూవీగా రికార్డుల‌కెక్కిన 'శివాజీ'.. ఓవ‌రాల్‌గా ప్ర‌పంచ‌వ్యాప్తంగా 150 కోట్ల గ్రాస్‌ను క‌లెక్ట్ చేసింది. అత్యంత భారీ బ‌డ్జెట్‌తో యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా త‌యారైన ఈ సినిమా విమ‌ర్శ‌కులను అంత‌గా మెప్పించ‌లేక‌పోయినా ప్రేక్ష‌కుల‌ను అమితంగా అల‌రించి బ్లాక్‌బ‌స్ట‌ర్ హోదాను అందుకుని, ర‌జ‌నీ ఫ్యాన్ బేస్‌ను మ‌రింత పెంచింది. 8. ఎందిర‌న్ (2010) ఆల్‌టైమ్ హ‌య్యెస్ట్ గ్రాసింగ్ ఇండియ‌న్ ఫిలిమ్స్‌లో చోటు పొందిన 'ఎందిర‌న్' మూవీ మిగ‌తా భాష‌ల్లో 'రోబో'గా రిలీజై అన్ని చోట్లా సూప‌ర్ డూప‌ర్ హిట్ట‌యింది. ఆ టైమ్‌లో దేశంలోనే అత్యంత భారీ బ‌డ్జెట్‌తో త‌యారైన సినిమాగా కూడా రికార్డు పుట‌ల్లో స్థానం పొందిన ఈ సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా 290 కోట్ల‌ను వ‌సూలు చేసి ర‌జ‌నీని పాన్ ఇండియా సూప‌ర్ స్టార్‌గా మ‌రో మెట్టు పైకెక్కించింది. 9. క‌బాలి (2016) 200 కోట్ల రూపాయ‌ల‌ను వ‌సూలు చేసిన తొలి త‌మిళ సినిమాగా నిలిచిన 'క‌బాలి', ర‌జ‌నీకాంత్ లెగ‌సీని పున‌ర్లిఖించింది. అన్ని భాష‌ల్లో క‌లిపి ప్ర‌పంచ‌వ్యాప్తంగా 286 కోట్ల రూపాయ‌ల ఓపెనింగ్ వసూళ్ల‌తో ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీని సంభ్ర‌మాశ్చ‌ర్యాల్లో ముంచెత్తిన ఈ సినిమా 'బాహుబ‌లి: ద బిగినింగ్' ఓపెనింగ్స్‌ను కూడా దాటేసింది. ర‌జ‌నీ అత్యుత్త‌మ అభిన‌యాల్లో ఒక‌టి 'క‌బాలి' పాత్ర పోష‌ణ అనేది నిస్సందేహం. 10. 2.0 (2018) 'ఎందిర‌న్‌'ను సీక్వెల్‌గా వ‌చ్చిన '2.0' వ‌ర‌ల్డ్‌వైడ్‌గా 800 కోట్ల రూపాయ‌ల గ్రాస్‌ను క‌లెక్ట్ చేసి, దేశంలో సెకండ్ హ‌య్యెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్‌గా నిలిచింది. అత్యంత భారీ వ్య‌యంతో త‌యారైన భార‌తీయ సినిమాగా ఇప్ప‌టికీ దీనిదే రికార్డ్‌. అక్ష‌య్‌కుమార్‌ను విల‌న్‌గా చూపించిన ఈ సైన్స్ ఫిక్ష‌న్ సినిమా ఇండియా నుంచి వ‌చ్చిందనేది న‌మ్మ‌లేని నిజం. 2019లో వ‌చ్చిన 'పేట‌', 2020లో వ‌చ్చిన 'ద‌ర్బార్', 2021లో వ‌చ్చిన 'అణ్ణాత్తే' సినిమాలు సైతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా 200 కోట్ల‌కు పైగా గ్రాస్ క‌లెక్ట్ చేసి ర‌జ‌నీ 45 ఏళ్ల కెరీర్‌ను మ‌రింత సుసంప‌న్నం చేశాయి.

నాగ‌బాబు దృష్టిలో చిరు చేసిన అలాంటి రిస్కీ ఫైట్‌ను మ‌రే హీరో చేయలేదు!

  చిరంజీవిలో నాగ‌బాబుకు న‌చ్చ‌ని గుణం ఒక‌టుంది. అది.. తెగింపు! అవును. సినిమాల్లో ఫైట్స్ విష‌యంలో చిరు చేసే రిస్కుకు మెగా బ్ర‌ద‌ర్‌కు కోపం వ‌చ్చేస్తుంది. ఈ విష‌య‌మై ఒక‌సారి ఆయ‌న అన్న‌య్య‌తో గొడ‌వ ప‌డ్డారు కూడా. కానీ చిరు లెక్క‌చేస్తే క‌దా! నాగ‌బాబుకు ఇప్ప‌టికీ ఆ స‌న్నివేశం బాగా గుర్తు. హోట‌ల్ అట్లాంటిక్ పైభాగాన మూడున్న‌ర అడుగుల వెడ‌ల్పు ఉన్న చిన్న‌గోడ మీద ఫైట్‌. కానీ దాన్ని స‌ద‌రు సినిమాలో డైరెక్ట‌ర్‌, సినిమాటోగ్రాఫ‌ర్ స‌రిగా ఎస్టాబ్లిష్ చేయ‌లేక‌పోయారు.  దాదాపు పదంత‌స్తుల ఆ హోట‌ల్ పిట్ట‌గోడ మీద ఫైట్ అంటే.. ఊహించ‌డానికే క‌ష్టం! అది చూసి నాగ‌బాబుకు టెన్ష‌న్‌, భ‌యం. చూడ‌లేక ఇంటికెళ్లిపోయి వాళ్ల నాన్న‌గారితో దెబ్బ‌లాడారు. చిరు వంటిని ప‌రిశీలిస్తే గాయాల తాలూకు మ‌చ్చ‌లెన్నో క‌నిపిస్తాయి. అదృష్టం ఏమంటే ఎన్ని ప్రాణాంత‌క ఫైట్స్ చేసినా చిరుకు ప్ర‌మాదం జ‌ర‌గ‌లేదు. కానీ, 'సంఘ‌ర్ష‌ణ' సినిమాలో ఒక చిన్న ఫైట్‌కు దెబ్బ త‌గిలింది. Also read: 'ల‌క్ష్య' మూవీ రివ్యూ ఫైట్స్ విష‌యంలో అన్న‌య్య‌తో దెబ్బ‌లాడే నాగ‌బాబు, సొంత చిత్రం 'త్రినేత్రుడు'లోని భ‌యంక‌ర‌మైన గ్లోబ్ ఫైట్‌ను వ్య‌తిరేకించ‌లేక‌పోయారు. "నాకు తెలిసి తెలుగు సినిమా హీరోల్లో ఎవ‌రూ అంత రిస్క్ ఫైట్ చేయ‌లేదు. ఈ ఫైట్‌ను ఆరు రోజుల పాటు తీశాం. ఆ ఫైట్ త‌ర్వాత నిర్ణ‌యించుకున్నా, క‌నీసం మా సినిమాల్లో అయినా అలాంటి రిస్క్ ఫైట్స్‌ను ఇక చెయ్య‌కూడ‌ద‌ని." అని ఒక ఇంట‌ర్వ్యూలో చెప్పారు నాగ‌బాబు. Also read:  చాన్నాళ్ళ త‌రువాత ఆ పాత్ర‌లో చిరు! చిరు చేసిన చిత్రాల్లో 'పున్న‌మినాగు' అంటే ఆయ‌న‌కు చాలా ఇష్టం. "అందులోని పాత్ర‌ను ఇప్ప‌టికీ మ‌రువ‌లేను. అందులో యాంటీ హీరోగా అన్న‌య్య అద్భుత‌మైన ప‌ర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆ త‌ర్వాత 'జ్వాల‌', 'ర‌క్త‌సిందూరం' సినిమాల్లోనూ బ్యూటిఫుల్ పాత్ర‌లు చేశారు. అలాంటి పాత్ర‌లు అన్న‌య్య మ‌ళ్లీ చెయ్య‌లేదు." అని నాగ‌బాబు అభిప్రాయ‌ప‌డ్డారు.

ఊపిరి బిగ‌ప‌ట్టించే, ఒళ్లు జ‌ల‌ద‌రింప‌జేసే సీన్ల‌తో 'ఆర్ఆర్ఆర్' ట్రైల‌ర్‌

  జూనియ‌ర్ ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా య‌స్‌.య‌స్‌. రాజ‌మౌళి డైరెక్ట్ చేసిన 'ఆర్ఆర్ఆర్' మూవీ ట్రైల‌ర్ వ‌చ్చేసింది. ప్ర‌స్తుతం నిర్మాణంలో ఉన్న సినిమాల్లోనే అత్య‌ధిక అంచ‌నాలు ఉన్న సినిమా అయిన 'ఆర్ఆర్ఆర్' వ‌చ్చే జ‌న‌వ‌రి 7న తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం భాష‌ల్లో అత్య‌ధిక థియేట‌ర్ల‌లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌వుతోంది. 3 నిమిషాల 15 సెక‌న్ల నిడివివున్న ట్రైల‌ర్ ఆద్యంతం ఊపిరి బిగ‌ప‌ట్టించేలా ఉంద‌న‌డంలో ఏమాత్రం అతిశ‌యోక్తి లేదు. హై-ఆక్టేన్ యాక్ష‌న్ సీన్స్‌, రోమాలు నిక్క‌బొడిపించే, ఒళ్లు జ‌ల‌ద‌రింప‌జేసే స‌న్నివేశాల‌తో ఎమోష‌న‌ల్‌గా ఈ ట్రైల‌ర్ సాగింది.  Also read:  'ఆర్ఆర్ఆర్' ట్రైలర్.. 'పులి'ని పట్టుకోవాలంటే 'వేటగాడు' కావాలి! ఒక్క అలీస‌న్ డూడీని మిన‌హాయిస్తే చిత్రంలోని ప్ర‌ధాన పాత్ర‌ధారులంద‌రినీ దాదాపుగా ఈ ట్రైల‌ర్‌లో మ‌న‌కు చూపించారు. జూనియ‌ర్ ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌, ఆలియా భ‌ట్‌, ఒలీవియా మోరిస్‌, అజ‌య్ దేవ్‌గ‌ణ్‌, శ్రియ‌, స‌ముద్ర‌క‌ని, రాజీవ్ క‌న‌కాల, రే స్టీవెన్‌స‌న్ లాంటి యాక్ట‌ర్లు ఈ ట్రైల‌ర్‌లో క‌నిపించారు. లార్జ‌ర్ దేన్ లైఫ్ క్యారెక్ట‌ర్ల‌లో జూనియ‌ర్ ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌లు క‌నిపించిన తీరు చూస్తుంటే, వారి పాత్ర‌ల‌ను రాజ‌మౌళి ఎంతటి వీరోచితంగా మ‌లిచాడో ఊహించుకోవ‌చ్చు.  Also read:  'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ ఎఫెక్ట్.. మా థియేటర్స్ కి సెక్యూరిటీ కావాలి! ఒక‌రికొక‌రు ప‌రిచ‌య‌మైన త‌ర్వాత ఆ ఇద్ద‌రూ మంచి మిత్రుల‌వుతార‌నీ, త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల వ‌ల్ల కొమురం భీమ్‌ను బ్రిటీష్ సైన్యంలో ప‌నిచేసే రామ‌రాజు అరెస్ట్ చేస్తాడ‌నీ తెలుస్తుంది. ఈ ఘ‌ట‌న‌తో భీమ్‌ను షాక్‌కు గురిచేస్తుంద‌ని ట్రైల‌ర్ తెలియ‌జేస్తుంది. ఒక గోండు పిల్ల‌ను బ్రిటీష్ వాళ్లు తీసుకుపోయి, ఖైదు చేయ‌డంతో ఆమెను విడిపించ‌డానికి భీమ్ వెళ్ల‌డం క‌థ‌లో కీల‌క ఘ‌ట్టం. చివ‌ర‌లో ఆ ఇద్ద‌రూ క‌లుసుకుంటార‌నీ, బ్రిటీషర్ల‌పై తిర‌గ‌బ‌డ‌తార‌నీ ట్రైల‌ర్‌ని బ‌ట్టి తెలుస్తోంది. పోలీస్ గెట‌ప్ నుంచి మారి అల్లూరి సీతారామ‌రాజుగా కాషాయ వ‌స్త్రం, విల్లంబుల‌తో క‌నిపించిన‌ చ‌ర‌ణ్ గెట‌ప్ స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌గా నిలిచింది. ట్రైల‌ర్ మొద‌ట్లో క్లోజ‌ప్‌లో ఒక‌వైపు తార‌క్‌, మ‌రోవైపు పెద్ద‌పులి త‌ల‌ల‌ను చూపిస్తూ, పులి గాండ్రిస్తే, తార‌క్ కూడా దానిలాగే పెద్ద‌గా గాండ్రించే సీన్ సూప‌ర్బ్‌. అలాగే త‌న బుల్లెట్ బండితో యాక్ష‌న్ సీన్‌లో తార‌క్ చేసే విన్యాసాలు కూడా అద‌ర‌హో అనిపించాయి. Also read:  రూ. 50 కోట్ల క్ల‌బ్‌లో 'అఖండ‌'! బాల‌య్య కెరీర్ బెస్ట్‌!! సెంథిల్‌కుమార్ సినిమాటోగ్ర‌ఫీ, ఎంఎం కీర‌వాణి బీజీఎం 'ఆర్ఆర్ఆర్‌'కు ఎస్సెట్ కానున్నాయి. డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై డి.వి.వి. దాన‌య్య ఈ మూవీని నిర్మిస్తున్నారు. ట్రైల‌ర్‌తోటే రోమాలు నిక్క‌బొడుచుకున్నాయంటే ఇక మూడు గంట‌ల సినిమాలో ప్రేక్ష‌కుల్ని రంజింప‌జేసే ఘ‌ట్టాలు ఎన్ని ఉంటాయో ఊహించుకోవాల్సిందే. 'బాహుబ‌లి 2'తో సెట్ చేసిన రికార్డుల‌ను 'ఆర్ఆర్ఆర్‌'తో బ‌ద్ద‌లుకొట్టి, స‌రికొత్త బెంచ్‌మార్క్‌ను ఏర్ప‌ర‌చ‌డానికి రాజ‌మౌళి రెడీ అవుతున్నాడ‌నేది రేప‌టి నిజం.

మారుతి గేట్లు ఓపెన్ చేస్తే ఆ క్యారెక్టర్లు పుట్టాయి!

  డైరెక్ట‌ర్ మారుతి ప్ర‌తి సినిమాలో ఏదో ఒక క్యారెక్ట‌ర్ బాగా పండుతుంది. ఆ క్యారెక్ట‌ర్ సినిమాకు లైఫ్‌నిస్తుంది. ఉదాహ‌ర‌ణ‌కు ప్ర‌తిరోజూ పండ‌గే సినిమా తీసుకుంటే సాయిధ‌ర‌మ్ తేజ్ తండ్రిగా, స‌త్య‌రాజ్ కొడుకుగా రావు ర‌మేశ్ చేసిన క్యారెక్ట‌ర్‌కు స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌లు ల‌భించాయి. ఆ క్యారెక్ట‌ర్‌ను ఆడియెన్స్ విప‌రీతంగా ఎంజాయ్ చేశారు. చక్కని టైమింగ్‌తో ఆయన చెప్పిన డైలాగ్స్, ఆయన బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకుల్ని బాగా అలరించాయి. ఆ క్యారెక్టర్‌ను ఒక ప్రత్యేక శ్రద్ధతో డైరెక్టర్ మారుతి డిజైన్ చేసినట్లు అనిపిస్తుంది. ఇదే విషయాన్నిమారుతిని అడిగితే, తను రాసుకున్న క్యారెక్టర్‌ను రావు రమేశ్ తన నటనతో మరో స్థాయికి తీసుకువెళ్లారని చెప్పాడు.  'ప్రతిరోజూ పండగే' కథలో హీరో ఫాదర్‌గా రావు రమేశ్‌నే ఊహించుకున్నాడు మారుతి. కొత్తగా ఒక కంపెనీ పెట్టుకొన్న ఒక ఎన్నారై పర్సన్ ఎలా బిహేవ్ చేస్తాడనే దానిపై ఆ క్యారెక్టర్‌ను డిజైన్ చేశాడు. ఆ క్యారెక్టర్ చెప్పినప్పుడు, "ఇంత పెద్ద క్యారెక్టర్ ఇస్తున్నారు, మరి హీరో గారికి ఓకేనా?" అని మారుతిని రావు రమేశ్ అడిగారు. "హీరోకీ, నిర్మాతలకీ చెప్పిన తర్వాతే మీకొచ్చి చెప్పానండీ" అని తెలిపాడు మారుతి. "క్యారెక్టర్ చాలా బాగుందండీ. నేను చేస్తానండీ" అన్నారాయన. ఈ సినిమా కోసం ఆయన ఏకంగా 28 రోజులు కాల్షీట్లు ఇచ్చారు. ఇన్ని రోజులు ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు కాల్షీట్లు ఇవ్వడం అరుదుగా మాత్రమే జరుగుతుంది. "అన్ని రోజులూ సెట్స్‌పై మాకొక పండగ లాగే గడిచింది. కొంత మంది బాడీ లాంగ్వేజ్ చూసి నేను ఎగ్జైట్ అవుతుంటాను. నేను రాసుకొనేటప్పుడు క్యారెక్టర్ బిహేవియర్ సగమే ఉంటుంది. సెట్‌కు వెళ్లాక అది ఎన్‌హాన్స్ అవుతుంది. వాళ్ల పర్ఫార్మెన్స్ చూశాక ఎగ్జైట్ అవుతుంటాను" అని చెప్పాడు మారుతి. Also read:  ఎమ్మెస్ చనిపోయే ముందు బ్రహ్మానందాన్ని చూడాలన్నారు! ఇలా ఒక క్యారెక్టర్‌ను తాను రాసుకున్న దానికంటే మించి తెరపై చూపించిన సందర్భాలు ఆయనకు ఇదివరకూ సంభవించాయి. వాటిలో మొదటగా చెప్పుకోవాల్సింది 'ప్రేమ కథాచిత్రం'లోని సప్తగిరి క్యారెక్టర్. అందులో హీరో సుధీర్‌బాబు ఫ్రెండ్ గిరి క్యారెక్టర్‌లో సప్తగిరి తాను భయపడుతూ మనకు ఎంతగా నవ్వులు పంచాడో తెలిసిందే. దెయ్యం పట్టిన హీరోయిన్ చేత తన్నులు తింటూ, భయపడుతూ అతడు చేసే యాక్టింగ్ కానీ, చెప్పే డైలాగ్స్ కానీ నవ్వులు పూయించాయి. ఆ సినిమా తర్వాత సప్తగిరి టాప్ కమెడియన్ల లిస్టులో జాయినైపోయాడు.  Also read:  'అన్‏స్టాపబుల్'లో ఎన్టీఆర్ వెన్నుపోటు ఘటనపై స్పందించిన బాలయ్య! నిజానికి 'ప్రేమ కథాచిత్రం'లో సప్తగిరిది మొదట పెద్ద క్యారెక్టర్ అనుకోలేదు మారుతి. ఆ క్యారెక్టర్ గురించి మారుతి చెబుతూ "అతడిని పిలిస్తే వచ్చాడు. రెండు డైలాగులు చెప్పాక అతని టైమింగ్ నేననుకున్న దానికి వేరే లెవల్లో ఉందనిపించింది. అలాంటోడ్ని దెయ్యం కొడితే ఎలా ఉంటుందనే ఆలోచనతో మాగ్జిమం అతడి చేత కామెడీ చేయించాను. అతని క్యారెక్టర్‌కు లిమిటేషన్స్ ఉండవు" అని తెలిపాడు మారుతి. అలా గేట్లు ఓపెన్ చెయ్యడంతో రెచ్చిపోయి ఆ క్యారెక్టర్‌ను బ్రహ్మాండంగా పండించాడు సప్తగిరి. Also read:  'పుష్ప' విల‌న్ ఎవ‌రి కొడుకో తెలుసా? అత‌ని తండ్రి నాగార్జునను డైరెక్ట్ చేశాడు! మారుతి డైరెక్ట్ చేయగా సూపర్ హిట్టయిన 'భలే భలే మగాడివోయ్' మూవీలో నాని క్యారెక్టర్‌కు కూడా లిమిటేషన్స్ కనిపించవు. అందులో హీరో నాని దేన్నయినా మర్చిపోతుంటాడు. అయినా అన్ని ఎమోషన్స్  ఆ క్యారెక్టర్‌లో కనిపిస్తాయి. ఒక మంచి క్యారెక్టర్‌కు ఒక మంచి ఆర్టిస్టు దొరికితే, ప్లే చెయ్యడానికి ఎక్కువ స్కోపు దొరుకుతుందని చెప్పడానికి నాని చేసిన లక్కీ క్యారెక్టర్ ఒక గుడ్ ఎగ్జాంపుల్. ఆ క్యారెక్టర్‌లో నాని చాలా ముఖ్యమైన విషయాల్ని మర్చిపోతుండటం వల్ల కలిగే సమస్యలు, ప్రమాదాలు చూస్తూ మనం భావోద్వేగాలకు గురవుతుంటాం. అతడికున్న డిజార్డర్‌కు మనలో సానుభూతి కలుగుతుంది. ఆ తర్వాత ఆ సమస్య నుంచి అతడు బయటపడే విధం చూసి, హాయిగా ఊపిరి పీల్చుకుంటాం. Also read:  అమ్మ మంద‌లించింద‌ని తుంట‌రిప‌ని చేసి చిన్న‌ప్పుడే ప్రాణాల మీద‌కు తెచ్చుకున్నారు! అలాగే 'మహానుభావుడు'లో ఓసీడీ అనే డిజార్డర్ ఉన్నసాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆనంద్ క్యారెక్టర్‌కు లిమిటేషన్స్ కనిపించవు. అతనిలోని క్లీన్‌లీనెస్‌ను పీక్‌లో చూపించాడు మారుతి. ఆ క్యారెక్టర్‌లో శర్వానంద్ చెలరేగిపోయి చేశాడు. "ప్రేక్షకుడిని నేను ఏ కోణంలో చూస్తున్నానో, ఆ కోణంలోనే ఆ క్యారెక్టర్‌ను ఫాలో అవమని చెప్తుంటా" అని ఆ పాత్రలు అంతపేరు తెచ్చుకోవడంలోని రహస్యాన్ని తెలిపాడు మారుతి. 

ఫొటో స్టోరీ: చంద్ర‌మోహ‌న్ డైలీ ప్రోగ్రాంను బ్లాక్ బోర్డు మీద రాస్తున్న కుమార్తె!

  సాధార‌ణంగా సినిమావాళ్ల‌కు ప్ర‌తి నెలా సెకండ్ సండే హాలిడే. ఆ రోజు షూటింగ్స్ పెట్ట‌రు. అలాంట‌ప్పుడు పేకాట‌, ఫ్రెండ్స్‌తో డ్రింక్స్‌తో కాల‌క్షేపం చెయ్య‌డం వెట‌ర‌న్ యాక్ట‌ర్ చంద్ర‌మోహ‌న్‌కు ఇష్టం ఉండేది కాదు. మ‌నం మాట్లాడుకుంటోంది 1980ల‌లో ఫిల్మ్‌ ఇండ‌స్ట్రీ మ‌ద్రాసులో ఉన్న‌ప్ప‌టి మాట‌. షూటింగ్‌కు హాలిడే వ‌చ్చిందంటే చంద్ర‌మోహ‌న్ త‌న ఇద్ద‌రు కూతుళ్లు.. మ‌ధుర‌మీనాక్షి, బాల‌మాధ‌వితో ఆడుకుంటూ ఉండేవారు. క్యార‌మ్స్‌, ష‌టిల్ బ్యాడ్మింట‌న్ లాంటి వాటితో పాటు మెద‌డుకు మేత‌పెట్టే చెస్ అంటే ఆయ‌న‌కు బాగా ఇష్టం. పిల్ల‌లు చెస్ ఆడుకుంటుంటే, చంద్ర‌మోహ‌న్‌, ఆయ‌న భార్య జ‌లంధ‌ర ఆడియెన్స్ అవ‌డం కూడా క‌ద్దు.  Also read:  "స‌గం దోసె తింటారా.. సిగ్గు లేదూ మీకు?" ఎన్టీఆర్ మాట‌ల‌కు స్ట‌న్న‌యిన ల‌క్ష్మి! ఇక ఫొటో విష‌యానికి వ‌స్తే.. బ్లాక్ బోర్డ్ మీద చిన్న‌మ్మాయి బాల‌మాధ‌వి ఏదో రాస్తుంటే, చంద్ర‌మోహ‌న్ ఏదో చెప్తున్నారు. దాని క‌థేమిటంటే ఆయ‌న‌ను చూడ్డానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి ఎవ‌రో ఒక‌రు వ‌స్తుండ‌టం, లేక‌పోతే ఏదో కంపెనీ వాళ్లు కాల్షీట్ అడ్జెస్ట్‌మెంట్ కోసం రావ‌డం, ఇంట్లోవాళ్ల స‌మాధానం ఆ వ‌చ్చిన‌వాళ్ల‌కు సంతృప్తి క‌లిగించ‌క‌పోవ‌డం అప్పుడ‌ప్పుడు జ‌రుగుతుండేది. ఆ గొడ‌వేం లేకుండా ఏ రోజు ప్రోగ్రాం ఆరోజు అలా బోర్డు మీద రాసి పెట్టుకుంటారు చంద్ర‌మోహ‌న్‌. ఆయ‌న ప‌ని హ‌డావిడిలో ఉంటే, బాల‌మాధ‌వి ఆ ప‌ని చేస్తుంది. ఆ ఫొటో అలాంటి సంద‌ర్భంలోనిదే. త‌ను స‌వ్యంగా రాసిందా, లేదా అని చూసి ఫినిషింగ్ ట‌చ్ ఇచ్చేవారు చంద్ర‌మోహ‌న్‌. ఆ ప‌ద్ధ‌తి అప్ప‌టికీ ఇప్ప‌టికీ మిగ‌తా ఏ న‌టీన‌టుల ఇంటి ద‌గ్గ‌రా క‌నిపించ‌దు. Also read:  సినిమాలో కొడుక్కి కొరివి పెట్టడాన్ని త‌ప్పించుకున్నారు కానీ..! ఇక‌పోతే, మ‌ద్రాసులో ఉన్న‌ప్పుడు ఇంకో సుఖం కూడా ఉండేది. షూటింగ్స్ లేన‌ప్పుడూ, సెకండ్ సండే స‌ర‌దాగా బ‌స్సుల్లోనూ, సైకిల్ మీదా ద‌గ్గ‌ర్లోని ఊళ్లు తిరుగుతుండేవారు చంద్ర‌మోహ‌న్‌. ఎక్స‌ర్‌సైజ్‌లా ఉంటుంద‌ని ఆయ‌న సైకిల్ మీద వెళ్లి చిన్న చిన్న ప‌నులు చ‌క్క‌బెట్టుకొని వ‌చ్చేవారు. హాలిడే నాడు త‌న అభిమానుల నుంచి వ‌చ్చిన ఉత్త‌రాలు చ‌దివి, స్వ‌యంగా స‌మాధానాలు రాయ‌డం ఆయ‌న‌కు గొప్ప కాల‌క్షేపం.