సంక్రాంతి నాగార్జునదే.. ప్రూఫ్స్ తో సహా మీ ముందు ఉంచిన నిజం

సంక్రాంతి..  ప్రజలందరు సుఖ సంతోషాలతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటు తెలుగు వాళ్ళందరు కలిసి కట్టుగా జరుపునే ఒక ముఖ్యమైన పండగ. అలాగే తమ మధ్య ఉన్న ఈర్ష్య ,అసూయ, రాగ ద్వేషాలని పోగొట్టి తామందరం కలిసి మెలిసి ఉండేలా చూడమని తమకి నచ్చిన దైవాన్ని వేడుకునే పండగ కూడా సంక్రాంతినే. ఆ పండగ యొక్క ఔన్నత్యాన్ని పరమార్ధాన్నితెలుపుతు అదే టైటిల్ తో  వెంకటేష్ హీరోగా వచ్చిన మూవీ సంక్రాంతి. మరి ఈ మూవీకి మొదట అనుకున్న హీరో వెంకటేష్ కాదని మీకు తెలుసా? విక్టరీ వెంకటేష్ సినిమా కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన చాలా చిత్రాల్లో సంక్రాంతి మూవీ కూడా ఒకటి. 2005 లో వచ్చిన ఆ  మూవీ సంచలన విజయాన్ని సాధించడంతో పాటుగా చాలా సెంటర్స్ లో సరికొత్త రికార్డు లని నెలకొల్పింది. హిట్ చిత్రాల దర్శకుడు ముప్పలనేని శివ దర్శకత్వం వహించిన సంక్రాంతిలో   మొదట హీరోగా మొదట యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున ని అనుకున్నారు. ఈ మేరకు చిత్ర కథ మొత్తాన్ని నాగార్జున కి శివ చెప్పడం నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం  జరిగింది.  దీంతో ఆర్ బి చౌదరి నిర్మాతగా నాగ్ ముప్పలనేని శివ కాంబోలో సంక్రాంతి మూవీ ప్రారంభం అవుతుందని అందరు భావించారు.కానీ నాగార్జున  తనకున్న మాస్ ఇమేజ్ కి అన్నదమ్ముల సెంటిమెంట్ తో పాటు ఫ్యామిలీ సెంటిమెంట్ వర్క్ అవుట్ అవదని బావించాడో ఏమో సంక్రాంతి  సినిమా ప్లేస్ లో వేరే సినిమాని చేసాడు. నాగార్జున నే సంక్రాంతి కి మొదటి అనుకున్న హీరో అని స్వయంగా ముప్పలేని శివే ఒక ఇంటర్వ్యూ లో చెప్పాడు. ఆ తర్వాత సంక్రాంతి సినిమా వెంకటేష్ హీరోగా తెరకెక్కడం జరిగింది.ఇంటి బాగోగులు చూసే ఇంటి పెద్దగా తమ్ముళ్ల మీద ఎంతో ప్రేమని పెంచుకున్న అన్నయ్యగా వెంకటేష్ నటన నభూతో న భవిష్యత్తు అనే రీతిలో ఉంటుంది. తమ్ముళ్లు గా శ్రీకాంత్, శర్వానంద్, శివ బాలాజీ లు నటించారు. వీళ్ళకి జోడిలుగా స్నేహ, సంగీత, రతి లు నటించగా ఆర్తి అగర్వాల్ ప్రధాన పాత్ర పోషించింది. చంద్రమోహన్, శారద లు వెంకటేష్ తల్లి తండ్రులుగా నటించారు. అలాగే మిగతా పాత్రల్లో ప్రకాష్ రాజ్, సుధాకర్, తనికెళ్ళ భరణి లు తమ పాత్రల్లో అధ్భుతంగా నటించి సినిమా విజయంలో తమ వంతు పాత్ర పోషించారు.అన్న దమ్ముల మద్య వచ్చే సెంటిమెంట్ సీన్స్ కి అయితే కంటి తడి పెట్టని ప్రేక్షకుడు ఉండడు. పరుచూరి బ్రదర్స్ మాటలు సినిమాకి అదనపు బలాన్ని ఇచ్చాయి.  70 కి పైగా  కేంద్రాల్లో శతదినోత్సవాన్ని జరుపుకున్న సంక్రాంతి మూవీ కనుక వెంకటేష్ కాకుండా నాగార్జున చేసుంటే ఎలా ఉండేదో గాని నేటికి ఈ మూవీ టీవీ లో వస్తుంటే ప్రేక్షకులు బ్రహ్మ రధం పడతారు.అలాగే ఈ మూవీలో వేణు మాధవ్, ఏవిఎస్ ల మధ్య వచ్చే కామెడీ సీన్స్ అయితే సూపర్ గా ఉంటాయి నేటికి యు ట్యూబ్ లో ఆ కామెడీ సీన్స్ చూస్తు చాలా మంది ఎంజాయ్ చేస్తుంటారు. ఉమ్మడి కుటుంబాల ఆవశ్యతని తెలిపిన సంక్రాంతి మూవీ చూసి విడిపోయిన అన్నదమ్ముల కుటుంబాలు మళ్ళీ కలిసిన సందర్బాలు ఉన్నాయి.   

ఎన్టీఆర్ కొడుకుగా చిరంజీవి నటించకుండా చేసింది వీళ్ళే!

విశ్వ విఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు కథానాయకుడిగా 1981 అక్టోబర్ 7 న విడుదలైన మూవీ కొండవీటి సింహం. ఈ మూవీలో ఇన్ స్పెక్టర్ రంజిత్ కుమార్ గా ఎన్టీఆర్ ప్రదర్శించిన నటనకి  ప్రేక్షకులు బ్రహ్మ రధం పట్టారు. అప్పటివరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న రికార్డులన్నింటిని  ఒక మూలన కూర్చోబెట్టి నయా రికార్డులని కూడా  సృష్టించింది. అసలు ఆ రోజుల్లో ప్రతి తెలుగువాడి నోటి వెంట ఈ మూవీలో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్స్ మారుమోగిపోయేవి. అంతటి ఘన కీర్తి ఉన్న కొండవీటి సింహంలో ఎన్టీఆర్ కొడుకుగా మెగాస్టార్ చిరంజీవి నటించాల్సి ఉందనే విషయం మీకు తెలుసా! ఎన్టీఆర్  కొండవీటి సింహంలో ఇన్ స్పెక్టర్ రంజిత్ కుమార్ గా  రాము గా డ్యూయల్ రోల్ పోషించాడు. రంజిత్ కుమార్ కి  ఒక కొడుకు పుట్టగానే ఆ కొడుకు ఉంటే రంజిత్ కుమార్ ప్రాణాలకి ప్రమాదమని జ్యోతిష్యుడు చెప్పడంతో రంజిత్ కుమార్ మావయ్య ఆ బిడ్డని దూరం చేస్తాడు. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఇంకో కొడుకు పుట్టి చెడ్డవాడిగా మారతాడు. ఈ క్యారక్టర్ కే  చిత్ర దర్శకుడు రాఘవేంద్ర రావు మొదట చిరంజీవిని అనుకున్నాడు. నిర్మాతలు కూడా ఆయన నిర్ణయానికి ఓకే చెప్పడంతో   రాఘవేంద్రరావు చిరంజీవిని ఎన్టీఆర్ రెండో కొడుకు పాత్రలో నటింప చెయ్యాలని  అనుకున్నాడు. కానీ  చిరంజీవి డేట్స్ లేకపోవడంతో ఆ క్యారక్టర్  మోహన్ బాబుకి వెళ్లడం జరిగింది. ఈ విషయాన్ని స్వయంగా  రాఘవేంద్రరావే ఒక ఇంటర్వ్యూ లో చెప్పాడు.ఈ విధంగా డేట్స్ కనుక అడ్డుపడకపోయి ఉంటే చిరంజీవి ఎన్టీఆర్ కొడుకుగా నటించేవాడు. అంతకు ముందు చిరంజీవి ఎన్టీఆర్ తో కలిసి తిరుగులేని మనిషి సినిమాలో నటించాడు. ఎన్టీఆర్ రెండో కొడుకుగా మోహన్ బాబు తన తండ్రిని ద్వేషించే రవి పాత్రలో చాలా అధ్బుతంగా నటించాడు. ఎన్టీఆర్ లాంటి మేరు పర్వతానికి ధీటుగా నటించి ఎంతో పేరు సంపాదించాడు. ఇక ఎన్టీఆర్ అయితే ఇన్ స్పెక్టర్ రంజిత్ కుమార్ గా తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఆయన  సంఘ విద్రోహశక్తులని  ఎదిరిస్తు ఆవేశంతో చెప్పే ఒక్కో  డైలాగ్ ఒక్కో తూటాలా పేలుతుంది. అలాగే పెద్ద కొడుకు రాము క్యారక్టర్ లో కూడా ఎంతో హుందాగా నటించారు. మూవీలోని పాటలన్ని పెద్ద హిట్. ఈ రోజుకి ఏదో ఒక చోట మారుమోగిపోతూనే ఉంటాయి.పెద్ద ఎన్టీఆర్ సరసన జయంతి చిన్నఎన్టీఆర్ సరసన శ్రీదేవి, మోహన్ బాబు సరసన గీత నటించగా రోజా మూవీస్ పతాకంపై అర్జున్ రాజు, శివరామరాజులు నిర్మించారు. 1974 లో శివాజీ గణేష్ హీరోగా తెరకెక్కిన తంగ పతక్కం అనే తమిళ చిత్ర ఆధారంగా కొండవీటి సింహం తెరకెక్కింది

ఎన్టీఆర్ పేరుతో అల్లు రామలింగయ్య రౌడీయిజం..ఇదుగో సాక్ష్యం!

అల్లు రామలింగయ్య..ఈ పేరు తెలియని తెలుగు వాడు లేడు. ఎన్నో చిత్రాల్లో తనదైన బాడీ లాంగ్వేజ్ తో కామెడీ ని పండించి ఆ పాత్రలన్నీ  ప్రేక్షకుల మనసుల్లో సజీవంగా నిలిచేలా చేసిన  గొప్ప నటుడు. ఆయన తెర మీద కనపడితే చాలు ప్రేక్షకుల ముఖాల్లో ఒక్క సారిగా నవ్వొస్తుంది. అలాంటి నవ్వొచ్చే ఎన్నో సినిమాల్లో బొబ్బిలి పులి సినిమా కూడా ఒకటి. విశ్వ విఖ్యాత నట సార్వ భౌమ నందమూరి తారకరామారావు గారు నటించిన బొబ్బిలి పులిలో అల్లు రామలింగయ్య పోషించిన కామెడీ పాత్రని చూసి నవ్వని వారు ఉండరు. ఇంతకీ ఆయన పోషించిన పాత్ర ఏంటో చూద్దాం. సమాజంలో జరుగుతున్న అన్యాయాల్ని చూడలేక  ఇండియన్ ఆర్మీ లో మేజర్ గా పని చేసిన చక్రధర్ (ఎన్ టిఆర్) బొబ్బలిపులిల మారి సంఘ విద్రోహ శక్తుల ఆటకట్టిస్తు ఉంటాడు. ఈ క్రమంలో బొబ్బిలి పులిని పట్టుకోవాలని పోలీసులతో పాటు సంఘ విద్రోహ శక్తులు కూడా ప్రయత్నిస్తుంటారు. అప్పటికే బొబ్బిలి పులి చేసిన హత్యల గురించి ప్రజలందరికి తెలియడం వలన బొబ్బిలి పులి పేరు చెప్తేనే అందరు భయపడుతు ఉంటారు. ఈ క్రమంలో అల్లు రామలింగయ్య బొబ్బిలి పులి గెటప్ వేసుకొని  రొమ్ము  ముందుకు విరిచి నడుస్తు  బొబ్బిలి పులి నేనే అని ప్రజల్ని బెదిరిస్తు తన ఆకలిని తీర్చుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలో అల్లు రామలింగయ్య ప్రదర్శించే బాడీ లాంగ్వేజ్ అండ్  డైలాగ్స్ ప్రేక్షకులని నవ్వులతో ముంచెత్తుతాయి. ఒకసారి బొబ్బిలి గెటప్ లో ఉన్న అల్లు రామలింగయ్యని  కాషాయ వస్త్రాలు ధరించి స్వామిజీ గెటప్ లో ఉండే  విలన్ సత్యనారాయణ దగ్గరకి సత్యనారాయణ మనుషులు తీసుకెళ్తారు. అప్పుడు అల్లు రామలింగయ్య చేసే కామెడీ కి  కింద పడి నవ్వని ప్రేక్షకుడు ఉండడు. అక్కడ రౌడీలు అల్లు రామలింగయ్య ని కొడతారు. ఆయనకీ వాళ్ళని కొట్టే దైర్యం లేక కాషాయ  వస్త్రాలు ధరించిన వాళ్ళని వ్రత భంగం కలుగుతుందని నేను ఏమి అనను.  రెండో సారి కొడితే మాత్రం బాగుండదు అని అంటాడు. అప్పుడు రెండో సారి కూడా కొడతారు.దాంతో రెండో సారి కూడా కొట్టారా సరే మొదటి సారి కొట్టినప్పుడు నేను మన్నిస్తాను. రెండో సారి కొడితే వేచి చూస్తాను.అని వాళ్ళని బెదిరించాలనే ఉద్దేశంతో ఇక మూడో సారి కొడితే మాత్రం రక్త పాతం అవుతుంది ఇప్పుడు  కొట్టండిరా అని అంటాడు. అప్పుడు కూడా రౌడీలు కొడతారు. దాంతో వెంటనే మూడో సారి కూడా కొట్టారా మీ పాపం మీదే పొండహే అని రామలింగయ్య అంటాడు.ఇలా ఈ సినిమాలోని రామలింగయ్య సీన్స్ అన్ని కూడా ప్రేక్షకులకి విపరీతమైన నవ్వుని తెప్పిస్తాయి. అలాగే ఒకసారి  ఎన్టీఆర్ దగ్గరికి బొబ్బిలిపులి గెటప్ లో అల్లు రామలింగయ్య నడిచి వెళ్తుంటే ఆ నడక చూసి నవ్వని ప్రేక్షకుడు ఉండడు. అలాగే ఎన్టీఆరే  నిజమైన బొబ్బిలి పులి అని తెలుసుకుని  మూర్ఛతో కింద పడి ఆ తర్వాత నేను బొబ్బలి పులిని కాదు బొబ్బిలి పిల్లి అని అనడం తో పాటు ఎన్టీఆర్ కోపంతో తన చేతులతో రామలింగయ్యని పైకెత్తుతుంటే అప్పుడు ఆయన పెట్టే ఎక్సప్రెషన్ కూడా విపరీతమైన నవ్వుని తెప్పిస్తుంది. విజయ మాధవి కంబైన్స్ పతాకంపై వడ్డే రమేష్ నిర్మించిన ఈ పవర్ ఫుల్ చిత్రానికి దాసరి నారాయణరావు రచనా దర్శకత్వం వహించారు. ఈ సినిమానే ఎన్టీఆర్  తెలుగుదేశం పార్టీ  స్థాపించేలా చేసింది.  

మూడు తరాల ప్రేక్షకుల మనస్సు గెలుచుకున్న అరుదైన నటి జయసుధ!

ఎలాంటి పాత్రలోనైనా గొప్పగా నటించేవారు కొందరు ఉంటారు. కానీ ఆ పాత్రకి తగ్గట్టుగా ప్రవర్తించే వారు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన నటే సహజ నటి జయసుధ. ఆమెకు నటించడం రాదు. నిజ జీవితంలో ఫలానా పాత్ర ఎలా ప్రవర్తిస్తుందో అలా ప్రవర్తించడమే వచ్చు. అందుకే ఆమె సహజ నటి అయ్యారు. తాను ఆరిపోతూ, తన వాళ్ళకి వెలుగివ్వాలనుకునే 'జ్యోతి' పాత్రలో జయసుధ నటనను ఎన్ని అవార్డులతో సరితూచగలం. ప్రేమ కోసం ప్రాణత్యాగం చేసిన 'శివరంజని' పాత్రలో జయసుధను తప్ప ఎవరిని ఊహించగలం. వేశ్య పాత్రకు కూడా గౌరవం తీసుకొచ్చిన ఆమె నటనకు ఎంత 'ప్రేమాభిషేకం' చేయగలం. 'మేఘ సందేశం'లో పరాయి స్త్రీ వ్యామోహంలో పడిన భర్త ప్రేమ కోసం పరితపించే పార్వతి పాత్రలో ఆమె అభినయానికి ఏమని పేరు పెట్టగలం. "రాయిని ఆడది చేసిన రాముడివా" అంటూ కళ్ళతోనే భావాలు పలికించగల ఆమె నటన గురించి ఏమని చెప్పగలం, ఎంతని చెప్పగలం. ఇలా ఎన్నో పాత్రలకు నట నటనతో ప్రాణం పోశారు జయసుధ. పాత్రల్లో వైవిధ్యం, నటనలో సహజత్వం.. ఆమెకే సొంతం. ఆమె ఏ పాత్ర పోషించినా అందులో జయసుధ కనిపించరు. ఆమె పోషించిన పాత్రే కనిపిస్తుంది. పాత్రలో అంతలా పరకాయప్రవేశం చేస్తారు జయసుధ. ఆ సమయంలో శ్రీదేవి, జయప్రద వంటి గ్లామర్ హీరోయిన్ లకు ధీటుగా అగ్ర నటిగా ఎదిగారంటే అది ఆమె నటనా ప్రతిభే. విరామం తీసుకొని సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన హీరోయిన్లను చూశాం. కానీ విరామమే తీసుకోకుండా ఐదు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్నారు జయసుధ. ప్రేయసిగా, భార్యగా, తల్లిగా, బామ్మగా ఇలా ఎన్నో పాత్రల్లో ఒదిగిపోయారు. మూడు తరాల నటులతో కలిసి నటించి.. మూడు తరాల ప్రేక్షకుల మనస్సు గెలుచుకున్నారు. ఇప్పటికీ తనదైన నటనతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. (డిసెంబర్ 17న జయసుధ పుట్టినరోజు సందర్భంగా...)

బ‌ర్త్‌డే స్పెష‌ల్‌: విక్టరీ వెంకటేష్ టాప్ 10 రీమేక్స్!

మూడున్నర దశాబ్దాలుగా తనదైన నటనా సామర్థ్యంతో ప్రేక్షకుల్ని అలరిస్తూ, ఇప్పటికీ టాప్ సీనియర్ స్టార్లలో ఒకడిగా తన స్థానానికి న్యాయం చేస్తోన్న యాక్టర్.. విక్టరీ వెంకటేష్. భిన్న జానర్ సినిమాలు, భిన్న తరహా పాత్రలతో మెప్పిస్తూ వస్తున్న ఈ స్టార్ యాక్టర్‌ను రీమేక్ కింగ్‌గా కూడా చెబుతూ ఉంటారు. 37 సంవత్సరాల సుదీర్ఘ కెరీర్‌లో చేసింది 75 సినిమాలైనా వాటిలో 30 సినిమాలు రీమేక్‌లే కావడం దీనికి నిదర్శనం. 1986లో హీరోగా కెరీర్ ఆరంభించిన వెంకటేష్, 1987లో నటించిన 4వ సినిమా 'భారతంలో అర్జునుడు' నుంచి రీమేక్స్ చేయడం మొదలుపెట్టాడు. ఆ సినిమా ఒరిజినల్ హిందీ బ్లాక్‌బస్టర్ 'అర్జున్'. అప్పట్నుంచీ కూడా ఇతర భాషల్లో వచ్చిన తనకు ఇష్టమైన సినిమాల్ని రీమేక్ చేయడాన్ని ఒక వ్యసనంగా మార్చుకున్నాడు వెంకటేష్. డిసెంబ‌ర్ 13 ఆయ‌న బ‌ర్త్‌డే. ఈ సంద‌ర్భంగా ఆయన చేసిన రీమేక్స్‌లో టాప్ టెన్ సినిమాలేవో చూద్దామా... 10. రక్తతిలకం (1988): యాక్షన్ మేళవించిన రివెంజ్ డ్రామాగా రూపొందిన ఈ మూవీని బి. గోపాల్ డైరెక్ట్ చేశాడు. అమల హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో శారద కథకు అత్యంత కీలకమైన పాత్ర చేశారు. తనను పెంచిన తల్లి కూతురిపై దారుణంగా అత్యాచారం జరిపి హత్యచేసిన వాళ్లపై ప్రతీకారం తీర్చుకొనే యాక్షన్ హీరోగా వెంకటేష్ ప్రదర్శించిన అభినయం ప్రేక్షకుల్ని మెప్పించి, సినిమాకి ఘన విజయం చేకూర్చింది. బెంగాలీ హిట్ ఫిల్మ్ 'ప్రతీకార్'కు ఇది రీమేక్. 9. నార‌ప్ప‌ (2021):  యాక్ష‌న్‌ డ్రామాగా తయారైన ఈ సినిమాని శ్రీ‌కాంత్ అడ్డాల‌ డైరెక్ట్ చేశాడు. ధ‌నుష్ హీరోగా వెట్రిమార‌న్‌ రూపొందించిన తమిళ హిట్ ఫిల్మ్ 'అసుర‌న్‌'.. ఈ మూవీకి ఆధారం. వెంకటేష్ జోడీగా ప్రియ‌మ‌ణి నటించిన ఈ సినిమాలో, రాజీవ్ క‌న‌కాల‌, కార్తీక్ ర‌త్నం, రాఖీ, అమ్ము అభిరామి, రావు ర‌మేశ్‌, శ్రీ‌తేజ్‌ కీలక పాత్రధారులు. ఒక భూ త‌గాదాలో పెద్ద‌కొడుకును కోల్పోయి, ఆవేశంలో ప్ర‌త్య‌ర్థిని హ‌త్య‌చేసిన‌ చిన్న‌కొడుకును కాపాడుకోవ‌డానికి అల‌మ‌టించిపోయిన నార‌ప్ప‌గా వెంకటేష్ అమితంగా ఆక‌ట్టుకున్నారు. థియేట‌ర్ల‌లో విడుద‌ల కాకుండా నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై రిలీజైన ఈ సినిమాకు మంచి ఆద‌ర‌ణ ల‌భించింది.  8. రాజా (1999): సెంటిమెంట్ మేళవించిన ఈ రొమాంటిక్ డ్రామాను ముప్పలనేని శివ డైరెక్ట్ చేశాడు. సౌందర్య హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో అబ్బాస్, సుధాకర్ కీలకపాత్రలు చేశారు. ఒక యువతి సాహచర్యంలో మంచివాడుగా మారిన దొంగ, ఆమె ఉన్నతికి ఎలా తోడ్పడ్డాడనే కథలో టైటిల్ పాత్ర పోషించిన వెంకటేష్, అతడిని మంచివాడుగా మార్చిన పాత్రలో సౌందర్య పోటాపోటీగా నటించి ప్రేక్షకుల్ని రంజింపజేశారు. కార్తీక్, రోజా ప్రధానపాత్రధారులుగా విక్రమన్ తమిళంలో డైరెక్ట్ చేసిన హిట్ మూవీ 'ఉన్నిదత్తిల్ ఎన్నై కొడుతేన్'కి ఇది రీమేక్. 7. అబ్బాయిగారు (1993): సెంటిమెంట్ మేళవించిన ఈ ఫ్యామిలీ డ్రామాను ఈవీవీ సత్యనారాయణ రూపొందించాడు. కె. భాగ్యరాజ్ నటించి దర్శకత్వం వహించిన తమిళ సూపర్ హిట్ సినిమా 'ఎంగ చిన్న రాస' ఈ చిత్రానికి ఆధారం. వెంకటేష్ సరసన మీనా నటించిన ఈ మూవీలో జయచిత్ర, శ్రీకాంత్, కోట శ్రీనివాసరావు కీలకపాత్రలు పోషించారు. తనపై వల్లమాలిన ప్రేమ పెంచుకున్న మారుటి కొడుకును విషమిచ్చి చంపడానికి ప్రయత్నించిన ఒక తల్లి, అది విషమని భార్య ఎంతచెప్పినా వినకుండా తల్లిమీద ప్రేమతో ఆ విషాన్ని తాగి చావును ఆహ్వానించిన ఒక కొడుకు కథలోని సెంటిమెంటుకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. నటుడిగా వెంకటేష్ కు ఈ సినిమా మంచి పేరు తెచ్చింది. 6. దృశ్యం (2014): క్రైం థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాని నటి శ్రీప్రియ డైరెక్ట్ చేశారు. వెంకీ భార్యగా మీనా నటించిన ఈ మూవీలో నదియా, రవి కాలే కీలక క్యారెక్టర్లు చేశారు. తన కూతుర్ని న్యూడ్‌గా సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి, ఆమెను, తన భార్యను బ్లాక్‌మెయిల్ చేయడానికి ప్రయత్నించిన యువకుడిని తప్పనిసరి పరిస్థితుల్లో హత్యచేసి, ఆ నేరం నుంచి తప్పించుకొనే ఒక కేబుల్ ఆపరేటర్‌గా వెంకటేష్ ప్రదర్శించిన నటన ప్రేక్షకుల్ని బాగా మెప్పించి, భారీ వసూళ్లను సాధించింది. మోహన్ లాల్, మీనా జంటగా జీతూ జోసెఫ్ డైరెక్ట్ చేసిన మలయాళ బ్లాక్‌బస్టర్ 'దృశ్యం'కు ఇది రీమేక్. 5. ఘర్షణ (2004): ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను గౌతం మీనన్ రూపొందించాడు. సూర్య, జ్యోతిక జంటగా గౌతం మీనన్ డైరెక్ట్ చేసిన సూపర్ హిట్ తమిళ మూవీ 'కాక్క కాక్క' ఈ సినిమాకు ఆధారం. వెంకటేష్ జోడీగా అసిన్ నటించిన ఈ మూవీలో విలన్ రోల్‌ను సలీ బేగ్ పోషించాడు. తను ఎంతగానో ప్రేమించి పెళ్లిచేసుకున్న భార్యను పాండా అనే క్రిమినల్ కిడ్నాప్ చేస్తే, ఆమెను రక్షించుకోడానికి డీసీపీ రామచంద్ర ఏం చేశాడనే కథతో తయారైన ఈ సినిమాలో వెంకటేష్ నటన చూసి తీరాల్సిందే. అసిన్ పర్ఫార్మెన్స్, గౌతం మీనన్ డైరెక్షన్ ఈ సినిమాకి ఘన విజయం సాధించిపెట్టాయి. 4. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు (1996): రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా తయారైన ఈ సినిమాను ఈవీవీ సత్యనారాయణ డైరెక్ట్ చేశాడు. వెంకటేష్ భార్యలుగా సౌందర్య, వినీత నటించిన ఈ సినిమాలో తండ్రిగా కోట శ్రీనివాసరావు ఒక ప్రధాన పాత్ర చేశారు. భార్యతో సంతోషంగా సంసార జీవనం సాగిస్తున్న ఒక యువకుడు బిజినెస్ టూర్ మీద నేపాల్ వెళ్లి, అక్కడ అనూహ్య పరిస్థితుల్లో మరో యువతిని పెళ్లాడి ఎలాంటి ఇక్కట్లు పడ్డాడనే కథలో వెంకటేష్ అగచాట్లు ప్రేక్షకుల్ని విపరీతంగా నవ్వించాయి, వసూళ్ల వర్షాన్ని కురిపించాయి. పాండ్యరాజన్ హీరోగా ఎన్. మురుగేష్ డైరెక్ట్ చేసిన తమిళ హిట్ ఫిల్మ్ 'దైకులమే దైకులమే'కు ఇది రీమేక్. 3. సూర్యవంశం (1998): సెంటిమెంట్ మిక్స్ చేసిన ఈ ఫ్యామిలీ డ్రామాను డైరెక్టర్ భీమనేని శ్రీనివాసరావు రూపొందించాడు. శరత్ కుమార్ తండ్రీకొడుకులుగా నటించగా విక్రమన్ డైరెక్ట్ చేసిన బ్లాక్‌బస్టర్ తమిళ్ మూవీ 'సూర్యవంశం' ఈ సినిమాకు ఆధారం. వెంకటేష్ డ్యూయల్ రోల్ చేసిన ఈ మూవీలో మీనా నాయికగా నటిస్తే, ఆనంద్ రాజ్ విలన్ రోల్ చేశాడు. తనను తప్పుగా అర్థం చేసుకొని దగ్గరకు రానీయకుండా దూరం పెట్టిన తండ్రి ప్రేమ కోసం అలమటిస్తూ, భార్య ప్రోత్సాహంతో జీవితంలో ఎదిగి అనుకున్నది సాధించిన ఒక కొడుకు కథ ఈ సినిమా. తండ్రీ కొడుకులుగా భిన్న పాత్రల్లో వెంకటేష్ ఉన్నత స్థాయి నటనతో ప్రేక్షకుల హృదయాల్ని గెలిచాడు. 2. సుందరకాండ (1992): రొమాంటిక్ కామెడీ డ్రామాగా రూపొందిన ఈ మూవీకి కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. మీనా, అపర్ణ హీరోయిన్లుగా నటిస్తే, గొల్లపూడి మారుతిరావు కీలక పాత్ర చేశారు. ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్న తన స్టూడెంట్ నుంచి తప్పించుకోడానికి నిరక్షరాస్యురాలైన ఒక యువతిని పెళ్లాడిన తెలుగు లెక్చరర్ ఎలాంటి ఇబ్బందులు పడ్డాడనే కథలో వెంకటేష్, మీనా జోడీ విపరీతంగా నవ్వులు పంచగా, సెంటిమెంట్ మేళవించిన అల్లరి పాత్రలో కొత్తమ్మాయి అపర్ణ ఆకట్టుకుంది. కె. భాగ్యరాజ్ నటిస్తూ డైరెక్ట్ చేసిన తమిళ సూపర్ హిట్ మూవీ 'సుందర కాండం'కు ఇది రీమేక్. 1. చంటి (1992): మదర్ సెంటిమెంట్ మిక్స్ చేసిన ఈ ఫ్యామిలీ డ్రామాను రవిరాజా పినిశెట్టి డైరెక్ట్ చేశాడు. ప్రభు, కుష్బూ జంటగా నటించగా పి. వాసు డైరెక్ట్ చేసిన సూపర్ హిట్ తమిళ్ ఫిల్మ్ 'చిన్న తంబి' ఈ సినిమాకు ఆధారం. వెంకటేష్ జోడీగా మీనా నటించిన ఈ సినిమాలో సుజాత, నాజర్ కీలక పాత్రధారులు. లోకజ్ఞానం తెలీని చంటి అనే యువకుడు తన యజమానుల ముద్దుల చెల్లెలి ప్రేమకు పాత్రుడై, దానివల్ల ఎలాంటి విపరిణామాలు ఎదుర్కొన్నాడు, తల్లికి జరిగిన అవమానానికి ఎలా స్పందించాడనే కథను ప్రేక్షకులు అపూర్వంగా ఆదరించారు. వెంకటేష్ నట జీవితంలో చంటి పాత్ర పోషణ ఒక కలికితురాయిగా పేరుపొందింది. ఈ సినిమాలే కాకుండా 'త్రిమూర్తులు', 'బ్రహ్మపుత్రుడు', 'వారసుడొచ్చాడు', 'బాడీగార్డ్', 'గురు' వంటి రీమేక్స్‌ కూడా వెంకటేష్ కు మంచి పేరే తెచ్చాయి. 1992లో, 1993లో వెంకటేష్ సినిమాలు మూడేసి రిలీజైతే అవన్నీ రీమేక్‌లే కావడం విశేషం.

సిల్క్ స్మితకి డాన్స్ రాదని చెప్పిన బావలు సయ్యా మరదలు సయ్యా  డాన్స్ మాస్టర్ 

తెలుగు సినిమా చరిత్ర ఉన్నంత కాలం గుర్తుండిపోయే ఆర్టిస్టుల్లో సిల్క్ స్మిత కూడా ఒకరు. యాక్టర్ గా తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన సిల్క్ స్మిత ఆ తర్వాత ఎన్నో ఐటెం సాంగ్స్ లో నటించి హీరో హీరోయిన్ల తో పాటు సమానంగా క్రేజ్ ని సంపాదించుకుంది. అసలు తమ సినిమాలో సిల్క్ స్మిత ఐటెం సాంగ్ ఉండాలని నిర్మాతలు పట్టుబట్టి మరీ ఏర్పాటుచేసేవారంటే ఆమె స్టామినా ఏపాటిదో అర్ధం చేసుకోవచ్చు.మరీ అలాంటి సిల్క్ స్మిత కి డాన్స్ రాదంటే మనం నమ్మగలమా? పైగా ఆ విషయం చెప్పింది ఆషామాషి వ్యక్తి కాదు. జెంట్ కొరియోగ్రాఫర్ల కి ధీటుగా ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలకి డాన్స్ మాస్టర్ గా పని చేసిన ఒక లేడీ కొరియోగ్రాఫర్. పైగా ఆవిడ చరిత్రలో నిలిచిపోయే  ఒక సూపర్ డూపర్ హిట్ ఐటెం సాంగ్ ని సిల్క్ స్మిత తో తెరకెక్కించింది. స్వర్ణ మాస్టర్...90 వ దశకంలో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లోని పాటలకి ఆమె కొరియోగ్రఫీని అందచేశారు.లేటెస్ట్ గా కూడా చిరంజీవి నటించిన ఆచార్య బాలకృష్ణ గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి ఇంకా ఎన్నో పెద్ద పెద్ద సినిమాలకి కూడా కొరియోగ్రాఫ్ ని అందించారు. కొన్ని రోజుల క్రితం స్వర్ణ మాస్టర్ ఒక యుట్యూబ్  ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో తన కెరీర్ స్టార్టింగ్ లో తాను కంపోజ్ చేసిన కొన్ని సినిమాల పాటల గురించి ప్రస్తావనకి వచ్చింది.ఈ క్రమంలో బావ బావమరిది సినిమాలోని బావలు సయ్యా పాట గురించి కూడా ప్రస్తావనకి వచ్చింది. ఆ సినిమాలో ఐటెం సాంగ్ గా తెరకెక్కిన ఈ పాటలో సిల్క్ స్మిత విజృంభించి నటించింది. ఈ పాటలో సిల్క్ స్మిత వేసిన స్టెప్స్ ఆమె కళ్ళతో చూసిన మత్తు చూపులు ఆరోజుల్లో తెలుగు ప్రజల మొత్తాన్ని ఒక ఊపు ఉపేలా చేసాయి.  ఇప్పుడు ఈ పాటలోనే సిల్క్ స్మిత అసలు డాన్స్ చెయ్యలేదని, అటు ఇటు చిన్నపిల్లల్లా రెండు చేతులు ఊపడం తప్ప సిల్క్ ఏం చెయ్యలేదని స్వర్ణ చెప్పింది. పైగా సిల్క్ స్మితకి అసలు డాన్స్ కూడా రాదని స్వర్ణ మాస్టర్ చెప్పింది. కానీ సిల్క్ స్మిత బాడీ ఎక్స్ ప్రెషన్స్  తన కళ్ళతో చూసే కసి చూపులు మాత్రం సూపర్ గా ఉంటాయి. వాటితోనే సిల్క్ స్మిత తన ఐటెం సాంగ్స్ ల ద్వారా ప్రభంజాన్ని సృష్టించిందని కూడా స్వర్ణ మాస్టర్ పేర్కొంది. ఇప్పుడు సోషల్ మీడియాలో స్వర్ణ మాస్టర్ సిల్క్ స్మిత గురించి మాట్లాడిన వీడియోని చూసిన వాళ్లంతా  ఆ ఇంటర్వ్యూ చేసిన యాంకర్ చెప్పిన డైలాగ్ నే చెప్పుకుంటున్నారు. సిల్క్ స్మిత పెద్ద పెద్ద స్టెప్స్ వెయ్యకుండా  కామన్ ఆడియన్ ని కూడా ఓన్  చేసుకునేలా డాన్స్ చేసింది కాబట్టే బాగా పాపులర్ అయ్యిందని యాంకర్ చెప్పడంతో  స్వర్ణ మాస్టర్ కూడా ఆ విషయాన్ని ఒప్పుకుంది.  

తెలుగు సినిమాకి పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చిన మొట్టమొదటి హీరో నాగార్జున అని మీకు తెలుసా

  అక్కినేని నాగార్జున...అక్కినేని నాగేశ్వరరావు  నట వారసుడుగా సినీ రంగ ప్రవేశం చేసిన నాగార్జున తన తండ్రికి తెలుగు సినిమా రంగంలో ఉన్న ఇమేజ్ కి బిన్నంగా సినిమాలు చేసి తన కంటు సొంతంగా  లక్షలాది మంది అభిమానులని సంపాదించుకున్నాడు. నాగార్జున నటనకి, స్టైల్ కి అలాగే ఆయన విలన్స్ ని కోపంగా చూసే చూపుకి ఫిదా కానీ తెలుగు ప్రేక్షకుడు లేడంటే అతిశయోక్తి కాదు. అలాగే  పాతికేళ్ల క్రితమే నాగార్జున  తెలుగు సినిమాని పాన్ ఇండియా మార్చాడనే   విషయం మీకు తెలుసా? నాగార్జున విక్రమ్ సినిమాతో తన సినీ జర్నీ ని ప్రారంభించాడు. మొదటి సినిమా అయినా కూడా ఎలాంటి బెరుకు లేకుండా  నటించి తండ్రికి తగ్గ వారసుడు అని అనిపించుకున్నాడు. ఆ తర్వాత నాగార్జున నటించిన  చాలా సినిమాలు పెద్దగా ప్రేక్షక ఆదరణకి నోచుకోలేదు. ఏ నటుడైన తన సినిమాలు ప్లాప్ అవుతుంటే తన సినిమాల విషయంలో ఎలాంటి ప్రయోగాలు చెయ్యడు. తాను ఇండస్ట్రీ లో నిలబడటం కోసం సేఫ్ జోన్ లో సినిమాలు చేస్తాడు .అంటే అప్పటికే ఇండస్ట్రీ లో పేరు ఉన్న డైరెక్టర్ ని పెట్టుకొని సినిమా చెయ్యవచ్చు. నాగార్జున నాగేశ్వరరావు కొడుకు కాబట్టి తను అడిగితే ఎవరైనా ఒప్పుకుంటారు. కానీ నాగార్జున ఆ పని చెయ్యలేదు. ఎందుకంటే మూస పద్దతిలో నాగార్జున సినిమాలు చెయ్యాలని అనుకోలేదు.  అలాగే  దక్షిణ భారతీయ చిత్ర సీమలో ఏ హీరో కూడా చెయ్యని సాహసానికి నాగార్జున పూనుకున్నాడు. అది సాహసం అనే కంటే తెలుగు సినిమా ఖ్యాతిని భారతదేశ వ్యాప్తంగా విశ్వవ్యాప్తం చెయ్యడానికి నాగార్జున  సంకల్పించాడని చెప్పవచ్చు. తమిళ. మలయాళ, కన్నడ ,హిందీ భాషలకి చెందిన దర్శకులని నాగార్జున  తెలుగు తెరకు పరిచయం చేసాడు. 1989 లో వచ్చిన గీతాంజలి మూవీ ద్వారా మణిరత్నం, ప్రేమయుద్ధం ద్వారా రాజేంద్ర సింగ్ బాబు,నిర్ణయం తో ప్రియ దర్శన్, చైతన్య చిత్రంతో ప్రతాప్ పోతన్,  శాంతి క్రాంతి తో రవిచంద్రన్, కిల్లర్ చిత్రంతో ఫాజిల్, క్రిమినల్ సినిమాతో మహేష్ భట్ ఇలా పాతికేళ్ళక్రితమే పలు భాషలకి చెందిన   గ్రేటెస్ట్  డైరెకర్స్ ని నాగార్జున తెలుగు సినిమా రంగానికి పరిచయం చేసాడు.అప్పటివరకు తెలుగు హీరో ఎవరు కూడా ఇతర బాషా దర్శకుల సినిమాల్లో నటించలేదు.కేవలం  నాగార్జున ఒక్కడే  ఎంతో దైర్యంగా వాళ్ళని తెలుగు చిత్ర పరిశ్రమకి తీసుకొచ్చి సినిమాలు చేసాడు. దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు నాగార్జున తెలుగు సినిమాని 25  ఏళ్ళ క్రితమే  పాన్ ఇండియా లెవల్ కి తీసుకెళ్లాడని. అలాగే మనీషాకొయిరాలా,జుహీ చావ్లా లాంటి  ఇతర భాషలకి చెందిన  నటీమణులని కూడా నాగార్జునే తెలుగుతెరకి పరిచయం చేసాడు.   కళకి సంబంధించిన అన్ని జోనర్స్ లోను  నాగార్జున నటించారు. తెలుగు సినీ పరిశ్రమలో ఎవరైనా భక్తి కి సంబంధించిన సినిమా తియ్యాలంటే నాగార్జున మాత్రమే ఛాయిస్. అలాగే తన నట జీవితంలో తొమ్మిదిసార్లు నంది  అవార్డ్స్,ని  మూడు సార్లు ఫిలిం ఫేర్ అవార్డ్స్ ని సాధించారు. ఇప్పుడు నా సామి రంగ సినిమాతో త్వరలో  ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.  యువ సామ్రాట్, కింగ్, మన్మధుడు లాంటి పేర్లతో ఆయన్ని అభిమానులు పిలుచుకుంటారు. ఆయన  నటించిన అన్నమయ్య సినిమా ఆస్కార్ కి ఎంట్రీ  పొందటానికి ఒక్క ఓటుతో మిస్ అయ్యింది.    

ఎన్టీఆర్, ఏఎన్నార్ లను డామినేట్ చేసిన ఏకైక నటి జయంతి నేడు!

డిసెంబర్ 6 మహానటి సావిత్రి పుట్టిన రోజు. ఆ మహానటి పుట్టి ఈ రోజుకి  సరిగ్గా 89 సంవత్సరాలు. గుంటూరు జిల్లా తెనాలి కి దగ్గరలో ఉన్న చిర్రావూరు ఆమె స్వగ్రామం. ఆమె తల్లితండ్రుల పేర్లు గురవయ్య ,సుభ్రదమ్మ. చిన్న వయసులోనే తల్లితండ్రుల్ని కోల్పోయిన సావిత్రి ఆ తర్వాత తన పెదనాన్న దగ్గరకి చేరింది. ఆయన ప్రోత్సాహంతో సాంప్రదాయ నృత్యాన్ని నేర్చుకున్న సావిత్రి  ఆ తర్వాత నటన మీద మక్కువతో  వీధి నాటకాలు వెయ్యడం ప్రారంభించింది. ఆ సమయంలో సావిత్రి వేసిన ఒక వీధి నాటకాన్ని చూసిన భారతీయ సినిమా అగ్ర నటుడైన పృథ్వీ రాజ్ కపూర్ సావిత్రి నటనని చూసి మెచ్చుకోవడమే కాకుండా ఒక అవార్డు ని బహుకరించాడు. అలాగే సినిమాల్లోకి వెళ్తే మంచి నటివి కూడా అవుతావని ఆశీర్వదించాడు. సావిత్రి కి కూడా సినిమాలంటే విపరీతమైన పిచ్చి. ఏ కొత్త సినిమా రిలీజ్ అయినా సరే తన ఊరి టూరింగ్ టాకీస్ లో సావిత్రి సినిమాలు చూసేది. అలాగే అక్కినేని నాగేశ్వరరావు ని విపరీతంగా ఇష్టపడే సావిత్రి సినిమాల్లో నటించాలనే ఆశతో తన పెదనాన్నని తీసుకొని చెన్నై వెళ్లి సినిమా ప్రయత్నాలు చెయ్యడం ప్రారంభించింది.  ఈ క్రమంలో 1950 వ సంవత్సరం లో వచ్చిన సంసారం అనే చిత్రం ద్వారా  సావిత్రి తెలుగు కళామతల్లి ఒడిలో అడుగుపెట్టడం జరిగింది. ఆ సినిమాలో తను హీరోయిన్ కాకపోయినా తన పాత్ర మేరకు చక్కగా నటించి అందరి ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్ లోనే పెళ్లి చేసి చూడు అనే సినిమాలో నటించింది. ఈ రెండింటిలోను ఎన్టీఆర్ కధానాయకుడుగా చేసాడు.  ఇక ఆ తర్వాత సావిత్రి చేసినది మామూలు సినిమా కాదు. బహుశా ఈ సినిమాలో చేసేముందు సావిత్రి కూడా అనుకోని ఉండరు.. 100  సంవత్సరాలైనా ఈ సినిమా గురించి అలాగే ఈ సినిమాలోని తన క్యారక్టర్ గురించి చెప్పుకుంటూనే ఉంటారని..ఆ సినిమానే దేవదాసు. పార్వతిగా ఆ సినిమాలో సావిత్రి నటన నభూతో న భవిష్యత్ అన్న విధంగా ఉంటుంది. ఒక దశలో ఆ చిత్ర దర్శకుడుతో చాలా మంది మెచ్యూరిటీ తో కూడుకున్న పార్వతి క్యారక్టర్ ని  సావిత్రి  లాంటి  చిన్న పిల్ల చెయ్యలేదు సినిమా ప్లాప్ అవుతుందని చెప్పినా  కూడా సావిత్రి నటనా శక్తీ మీద ఉన్న నమ్మకంతో  ఆ చిత్ర దర్శకుడు సావిత్రితోనే తెరకెక్కించడం జరిగింది.సినిమా రిలీజ్ అయిన తర్వాత సావిత్రి నటనని చూసి ఆమెని విమర్శించిన వాళ్ళందరు ముక్కు మీద వేలేసుకున్నారు. ఆ సినిమాలో ఏయన్ఆర్ నటనకి ధీటుగా నటించి అందర్నీ మెప్పించింది. ఇక ఆ తర్వాత వచ్చిన దొంగ రాముడు, మిస్సమ్మ చిత్రాలతో సావిత్రిని అభిమానించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. వాటి తర్వాత వచ్చిన మాయాబజార్ సినిమా అయితే ఆ సినిమాలో నటించిన హీరోలకంటే సావిత్రికే ఎక్కువ పేరు వచ్చింది. శశిరేఖగా అలాగే ఘటోత్కచుడు ఆవహించినప్పుడు సావిత్రి ప్రదర్శించిన నటనని చూసి సినీ మేధావులే ఆశ్చర్య పోయారు. ఒక కంటిలో నుంచి కన్నీరు, ఇంకో కంటిలో నుంచి ప్రేమని వ్యక్తం చేసే సన్నివేశంలో సావిత్రి నటనకి దక్షిణ భారతీయ చిత్ర పరిశ్రమ మొత్తం దాసోహమయ్యింది.  ఆ చిత్ర దర్శకుడు కె.వి.రెడ్డి సావిత్రిని ఉద్దేశించి ఇంకో పది తరాల దాకా సావిత్రిని తలదన్నే హీరోయిన్ రాదనీ చెప్పడంతో పాటు తెలుగు సినిమా ఉన్నంత కాలం సావిత్రి గురించి ప్రస్తావనకి వస్తూనే ఉంటుందని చెప్పడం జరిగింది. ఆయన చెప్పినట్టుగానే సావిత్రి పేరు నేటికీ తెలుగు చలన చిత్ర సీమలో మారుమోగిపోతూనే ఉంది.  ఒక సినిమాలో మాత్రమే సావిత్రి బాగా నటిస్తే ఆ సినిమా పేరు చెప్పుకుంటాం. కానీ అన్ని సినిమాల్లోని పాత్రలకి తను ప్రాణం పోసి నటిస్తే.. ఎన్ని సినిమాల గురించి చెప్పుకుంటాం. ఎవరైనా పుట్టాక నటన నేర్చుకుంటారు కానీ నటనే సావిత్రి దగ్గర నేర్చుకోవడానికి పుట్టిందేమో అనిపిస్తుంది. హీరోలని చూసి థియేటర్ల కి వెళ్లే జనం పలానా సినిమాలో  సావిత్రి ఉందా అని అడిగి మరీ జనం థియేటర్స్ కి వెళ్లే వాళ్ళు. గుండమ్మకథ, దేవత, మూగమనసులు, తోడికోడళ్లు, మాంగళ్య బలం, వెలుగు నీడలు, అప్పుచేసిపప్పుకూడు, సుమంగళి, డాక్టర్ చక్రవర్తి, సుమంగళి, పూజాఫలం ఇలా ఒకటి కాదు ఎన్నో చిత్రాల్లో నటించి సావిత్రిని తల దన్నే నటి లేదని నిరూపించడం తో పాటు కొన్ని లక్షల మంది అభిమానులని సావిత్రి సంపాదించారు.  అలాగే తమిళ, కన్నడ భాషల్లో కూడా తన నటన ద్వారా ఎంతో మంది అభిమానులని సంపాదించుకున్నారు.  సినిమా పరిశ్రమలో అందరికి ఎదురయినట్టే సావిత్రికి కూడా కొన్ని ఎత్తు పల్లాలు ఎదురయ్యాయి. సావిత్రి బాగా లావుగా ఉన్నారని ఇక సినిమాల్లోకి పనికి రాదని అన్నారు. కానీ అకుంఠ దీక్షతో మళ్ళీ సినిమాల్లో అవకాశాలు పొంది తన ఆకారాన్ని ప్రేక్షకులు పట్టించుకోని విధంగా నటించి తెలుగు సినిమా అంటే సావిత్రి అని అందరు అనుకునేలా చేసింది.   సావిత్రి సినిమాలోనే  కరుణరసాన్ని పండించడం కాదు నిజ జీవితంలో కూడా ఎంతో మంది పేదవాళ్ళని ఆదుకొని ఎంతో మందికి డబ్బు సాయం చేసింది. అలాగే తను ఏ సినిమా షూటింగ్ లో ఉండే ఆ సినిమాలో పని చేసే కార్మికులందరికీ తన ఇంటి దగ్గరనుంచి భోజనాలు వండుకొని తీసుకెళ్లేవారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లతో ఎన్నో సినిమాల్లో నటించిన సావిత్రి తన సినీ కెరీర్ మొత్తంలో సుమారు 250 కి పైగా సినిమాల్లో నటించింది. అలాగే నిర్మాతగా కూడా కొన్ని సినిమాలని  నిర్మించిన సావిత్రి అప్పటి తమిళనాడు ప్రభుత్వం చేత కలైమామణి అవార్డు అందుకున్న ఏకైక  తెలుగు నటిగా కూడా రికార్డుని నెలకొల్పింది. అలాగే ఆరుసార్లు ఫిలిం ఫేర్ అవార్డుని కూడా గెలుచుకుంది. ఒక పులిని పెంచుకొని పులితో షికార్లు కూడా చేసిన సావిత్రి తన జీవితంలో ఎన్ని దెబ్బలు తగిలినా కూడా పులిలాగే బతికి అనారోగ్య కారణాలతో 19  నెలలు కోమాలో ఉండి చివరికి ఆమె పుట్టిన డిసెంబర్ నెలలోనే  ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది.   

‘మాయాబజార్’ సినిమాకి మొదట అనుకున్న టైటిల్  వేరే అని మీకు తెలుసా?

ఈ విశ్వంలో తెలుగు వారి ఆనవాళ్లు ఉన్నంత కాలం మాయాబజార్  చిత్రం  ఆనవాళ్లు కూడా సజీవంగా ఉంటాయి. తెలుగు సినిమా కీర్తి పతాకంలో ఇమిడిన ఒక అపురూపమైన దృశ్యకావ్యం  మాయాబజార్. ఎవరైనా తమకి నచ్చిన అభిమాన హీరో కోసం ఆ హీరో నటించిన సినిమాని రిపీటెడ్ గా చూస్తారేమో కానీ మాయాబజార్ ని మాత్రం ఆ సినిమా మీద అభిమానంతో చూసిన వాళ్ళు నేటికీ చూస్తున్న వాళ్ళు  కోకోల్లలు. మరి ఇంతటి ఘన కీర్తిని సాధించిన ఈ మాయాబజార్ కి మొదట అనుకున్న టైటిల్ వేరే అని మీకు తెలుసా? విజయ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బి.నాగిరెడ్డి చక్రపాణి లు నిర్మించిన  సినిమా మాయాబజార్ ని సినిమా అని సంబోధించే కంటే మహా కళాఖండం అని భావించవచ్చు. 1957 లో  దర్శక పితామహుడు కె వి రెడ్డి  దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ నేటికీ  ఎంతో మంది తెలుగు వారి ఇళ్లల్లో మారుమోగిపోతూనే ఉంది. ఎన్టీఆర్ కృష్ణుడిగా, ఏఎన్ఆర్ అభిమన్యుడుగా,ఎస్వీ రంగారావు  ఘటోత్కచుడుగా సావిత్రి  శశిరేఖగా ఇలా హేమాహేమీలు కలిసి ప్రాణ ప్రతిష్ట చేసిన ఈ దృశ్యకావ్యం తెలుగు నటన కి సంబంధించిన ఒక నిఘంటువు. ఈ సినిమాలోని ప్రతి పాత్ర, ప్రతి మాట,ప్రతి షాట్  ఎందరో  ఔత్సాహిక   దర్శకులకి మార్గదర్శకం. ఏ సినిమాకైనా టైటిల్ అనేది కొత్తగా పెళ్లి జరుపుకునే వధువరులిద్దరు ఒకరి నెత్తిన ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకునేంత గొప్పది. ఎందుకంటే జీలకర్ర బెల్లం పెట్టుకున్న వధువరులిద్దరికి సగం పెళ్లి అయ్యినట్టుగా భావించి  మీరు చల్లగా ఉండండి అని పెళ్ళికి వచ్చిన వారు ఎలా అయితే అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారో ఒక సినిమాకి పెట్టే మంచి టైటిల్ తో ఆ సినిమా మీద  ప్రేక్షకులు ఒక అంచనాకి వచ్చి  ఆ సినిమాని ఆశీర్వదించడానికి థియేటర్స్ కి వెళ్తారు. ఈ చిత్ర కథ కృషుని అగ్రజుడు అయినటువంటి బలరాముని కుమార్తె శశిరేఖ కళ్యాణం చుట్టు తిరిగే కథ. శశిరేఖ తన చిన్న వయసునుంచే తన మేనమామ అర్జునుడు కొడుకు అభిమన్యుడ్ని ప్రేమిస్తు ఉంటుంది. అభిమన్యుడికి కూడా శశిరేఖ అంటే చాలా ప్రేమ. వారివురుకి  యుక్త వయసు వచ్చాక పెళ్లి చెయ్యాలని ఇరువైపు పెద్దలు భావిస్తారు. ఇలా కొంత కాలం తర్వాత  శశిరేఖ, అభిమన్యులిద్దరు  పెళ్లీడుకి వస్తారు. ఈ క్రమంలో కౌరవులు పన్నిన కుట్ర వల్ల  పాండవులు తమ ఆస్థి మొత్తాన్ని పోగొట్టుకుంటారు. ఫలితంగా బలరాముడు భార్య రేణుక దేవి తన కూతుర్ని పేదవాడైన అభిమన్యుడికి ఇవ్వడానికి ససేమిరా ఒప్పుకోదు. పైగా బలరాముడ్ని ఒప్పించి దుర్యోధునుడి కొడుకుతో తన కూతురు శశిరేఖ వివాహం జరిపించడానికి  నిశ్చయిస్తుంది. దీంతో కృష్ణుడు తన అన్న  బలరాముడ్ని నొప్పించడం ఇష్టం లేక  ఘటోత్కచుడు సహాయంతో శశిరేఖ ,అభిమన్యుల వివాహాన్ని జరిపిస్తాడు. ఇలా మాయాబజార్ కథ మొత్తం శశిరేఖ వివాహం చుట్టూనే తిరుగుతుంది. దాంతో మాయాబజార్ కి మొదట శశిరేఖ పరిణయం అనే టైటిల్ ని నిర్మాతలు  ఫిక్స్ చెయ్యడం జరిగింది. చిత్ర యూనిట్ మొత్తం  కూడా కథకి సరైన టైటిల్ శశిరేఖ పరిణయం అని భావించారు. ఎన్టీఆర్ ,ఏఎన్ఆర్ లు కూడా ఆ టైటిల్ నే పెట్టమని కేవిరెడ్డి గారికి సజిషన్ చేసారు.   కానీ  దర్శక పితామహుడు  మాత్రం తన పూర్తి సినిమా స్క్రిప్ట్ ని అవగాహన  చేసుకొని ఉండటం చేత తన సినిమా కథ యొక్క సుష్మాన్ని ఆయన  బాగా పసిగట్టారు. ఈ చిత్ర కథ లోని ప్రతి క్యారక్టర్ ని  గమనిస్తే ఒక్క కృష్ణుడు తప్ప మిగతా  అన్ని క్యారక్టర్ లు కూడా తమ తెలివిని ప్రదర్శించకుండా ఎవరు ఏది చెప్తే అది నమ్ముతారు. అలాగే తమ కళ్ళ ముందు జరిగిందని నిజ నిజాలు తెలుసుకోకుండా నమ్ముతారు  అంటే తమని మాయ ఎటువైపు తీసుకెళ్తే అటు వైపు వెళ్తారు. పైగా మాయ చేసే కృష్ణుడే ఈ కథకి సేనాని. కృష్ణుడు ఏర్పరిచిన మాయ చుట్టు ఈ సినిమా  కథ అంతర్లీనంగా తిరుగుతుంది కాబట్టే  కెవి రెడ్డి ఈ చిత్రానికి మాయాబజార్ అనే టైటిల్ ని పెట్టడం జరిగింది. ఈ  చిత్ర కథ కొన్ని వందల సాంఘిక చిత్రాలకి స్ఫూర్తిగా నిలిచింది. అలాగే ఈ మాయ బజార్ కథకి సంబంధించిన ఇంకో కొసమెరుపు ఏంటంటే మాయబజార్ కథ మొత్తం పాండవులు చుట్టు తిరుగుతుంది. కానీ పాండవులు మాత్రం సినిమాలో ఎక్కడ కనపడరు.  

ఈ సినిమా ఆడితే మహేష్ ప్రేక్షకుల దృష్టిలో హీరోనే కాదు అని చెప్పిన  కృష్ణ  

   సూపర్ స్టార్ కృష్ణ ఒక సినిమా చూసి ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద నిలబడుతుందా పోతుందా  అని ముందుగానే చెప్తారు. తన నటవారసుడు మహేష్ సినిమాల విషయంలో ఇది చాలా సార్లు రుజువయ్యింది. అలాగే కృష్ణ గారు ఇంకో వైవిధ్యమైన  జడ్జిమెంట్ ని కూడా మహేష్ కి సంబందించిన ఒక సినిమా విషయంలో చెప్పాడు.కృష్ణ గారు చెప్పిన  ఆ మహేష్ సినిమా ఏంటో చూద్దాం. 1999  లో వచ్చిన  రాజకుమారుడు సినిమాతో మహేష్  తెలుగు చలన చిత్ర పరిశ్రమలో పూర్తి స్థాయి కధానాయకుడుగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత యువరాజు ,వంశీ ,మురారి ,టక్కరిదొంగ ,బాబీ ,నిజం ,ఒక్కడు లాంటి విభిన్నమైన చిత్రాల్లో నటించి సూపర్ స్టార్ ఇమేజ్ ని సంపాదించాడు. ముఖ్యంగా మురారి ,ఒక్కడు లాంటి సినిమాలు తెలుగు బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులని సృష్టించడంతో పాటు కొన్ని లక్షల మంది అభిమానులని మహేష్ కి సంపాదించి పెట్టాయి. ఆ తర్వాత నాని అనే ఒక  సినిమా వచ్చింది. అప్పటి వరకు ఉన్న భారతీయ చిత్రపరిశ్రమలో అంతకుముందెప్పుడు తెరకెక్కని ఒక  సరికొత్త ప్రయోగాత్మక కథ తో నాని రూపుదిద్దుకుంది. తమిళ చిత్ర దర్శకుడు ఎస్ జె సూర్య దర్శకత్వంలో 2003 లో ఈ నాని చిత్రం విడుదల అయ్యింది. అప్పటికే సూర్య పవన్ కళ్యాణ్ తో ఖుషి లాంటి సూపర్ డూపర్ హిట్ చేసుండటంతో నాని మీద మహేష్ ఫాన్స్ లోను, సినీ ప్రేక్షకులలోను భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా రిలీజ్ కి ముందు  కృష్ణ గారు నాని ప్రివ్యూ వేయించుకుని చూసారు. సినిమా మొత్తం చూసిన కృష్ణ గారు ఏమని చెప్తారు అనే టెన్షన్  మహేష్ తో పాటు చిత్ర యూనిట్ మొత్తంలో ఉంది. పైగా ఈ సినిమాని మహేష్ సోదరి మంజుల  తన తల్లి ఇందిరా దేవి పేరు మీద నిర్మించింది. సినిమా చూసిన కృష్ణ గారు సినిమా అయితే చాలా బాగుంది. మహేష్ కూడా చాలా అధ్బుతంగా చేసాడు. కానీ ఒక్క విషయం మాత్రం చెప్తున్నాను. ఈ సినిమా ఆడితే మహేష్ ప్రేక్షకుల దృష్టిలో స్టార్ హీరో కాదని అర్ధం. ప్లాప్ అయితే మహేష్ స్టార్ హీరో అని అర్ధం అని చెప్పారు .ఆయన చెప్పినట్లే మహేష్ ని ప్రేక్షకులు  స్టార్ గా కొలుస్తున్నారు కాబట్టే నాని సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ చిత్రంగా మిగిలిపోయింది.ఎందుకు కృష్ణ గారు ఆ విధంగా చెప్పారో ఈ కథ చూస్తే అర్ధం అవుతుంది ఒక సైంటిస్ట్ ద్వారా ఏడు సంవత్సరాల వయసు ఉన్న నాని  (మహేష్ బాబు) పెద్ద వాడిగా మారాలనే కోరికతో  28 ఏళ్ల యువకుడిగా మారతాడు. కానీ నడవడిక, మెంటాలిటీ మాత్రం చిన్న పిల్లాడిలాగే ఉంటుంది.  ఆ తర్వాత  ఒక  కంపెనీలో ఉద్యోగం సంపాందించి ఆ కంపెనీ  ఓనర్ కూతురితో( అమీషా పటేల్ ) ప్రేమలో పడతాడు. కానీ తల్లి బాధని చూడలేక  మళ్ళీ చిన్నపిల్లవాడిగా మారతాడు. ఆ తర్వాత మళ్ళీ ప్రేమించిన అమ్మాయి కోసం  పెద్ద వాడిగా మారి తనని పెళ్లి చేసుకొని చివరికి తండ్రి అవ్వడంతో చిత్రం ముగుస్తుంది .వాస్తవానికి ఈ  కథ చాలా ఫ్రెష్ గా ప్రేక్షకులకి సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది. నవయువకుడుగా ,పిల్లవాడిగా మహేష్ చాలా అత్యద్భుతంగా నటిస్తాడు. అలాగే సినిమాలో మహేష్ నటన చూసి మైమరిచిపోని ప్రేక్షకుడు ఉండడు.కానీ ప్రేక్షకులు మహేష్ ని  కృష్ణ గారిలా ఒక సూపర్ పవర్ ఉన్న హీరోల భావిస్తూ ఉండటం వల్ల కృష్ణ గారు చెప్పినట్టు నాని పరాజయం పాలయ్యింది.  

దాసరి నారాయణరావుకి తన గత జన్మ గురించి తెలుసు!

దాసరి నారాయణరావు..తెలుగు సినిమా రంగంలో ఈ పేరు ఒక సంచలనం. రైటర్ గా తన సినీ కెరీర్ ని ప్రారంభించి దర్శకుడుగా,నటుడుగా,పాటల రచయితగా,నిర్మాతగా ,డిస్ట్రిబ్యూటర్ గా ,సినీ ఫెడరేషన్ అధ్యక్షుడుగా ,పత్రికాధిపతిగా,రాజకీయనేతగా ఇలా అన్నింటిలోను విజృంభించి  తనకెవరూ పోటీ కాదని నిరూపించిన గొప్ప దీక్షాపరుడు . మరి అంతటి బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఆయన రాణించడానికి కారణం ఏంటి? అసలు  అంతటి అపారమైన తెలివితేటలు ఆయనకీ ఎక్కడ నుంచి వచ్చాయి. ఆయన గత జన్మ వల్లే  దాసరి కి అన్ని తెలివితేటలు వచ్చాయా? పైగా దాసరికి తన గత జన్మ గురించి ముందుగానే తెలుసా ?  కళ అనేది చాలా గొప్పది. కథ ని పుట్టించి ఆ కథకి ఒక రూపాన్ని తీసుకురావాలంటే  రచయిత కావాలి. ఆ తర్వాత ఆ కథకి సరికొత్త హంగులని చేర్చి తెర మీద అందంగా చూపించడానికి ఒక దర్శకుడు కావాలి. కథలోని పాత్రలని అర్ధం చేసుకొని వాళ్ళ సంతోషాన్ని,ఆలోచనని ,బాధని పాట రూపంలో వ్యక్తం చెయ్యడానికి ఒక పాటల రచయిత కావాలి. ఈ మూడింటిలోను ఎవరు రాణించలేరు. ఎందుకంటే కొన్ని లక్షల మందిని మెప్పించే కళ  విషయంలో ఎవరికీ అంత జ్ఞాపక శక్తి ఉండదు. కానీ దాసరి ఆ మూడింటిలోను అధ్భుతమైన ప్రదర్శన కనపరిచారు. ఆయన  అంతలా ప్రతిభ కనపర్చడానికి కారణం ఆయన గత జన్మ.  ఆయన గత జన్మ వల్లే దాసరికి అంతటి అపారమైన తెలివితేటలు వచ్చాయి.  దాసరి గత జన్మలో కేరళలోని నంబూద్రి గా పిలవబడే ఒక మహా పండితుల వంశంలో జన్మించారు. ఈ నంబూద్రి వంశం వారు కళకి సంబంధించిన అన్ని విషయాల్లోను ఆరితేరిన వారు. మిగతా వారి కంటే చాలా ఎక్కువగా తెలివితేటల్ని కలిగి మహా స్ఫురద్రుష్టితో ఉంటారు. అలాగే  ఎవరికైనా వీరిని చూస్తే చాలు అమాంతం కాళ్ళ మీద పడి నమస్కారం చెయ్యాలనే విధంగా ఉంటారు. ఈ  నంబూద్రి వంశంలోనే  దాసరి తన గత జన్మలో జన్మించాడు. అందుకే ఆయనకి ఈ జన్మలో అన్ని తెలివి తేటలు వచ్చాయి. ఈ గత జన్మ విషయాన్ని దాసరితో స్వయంగా ఒక కోయదొర చెప్పాడు. విచిత్రం ఏంటంటే దాసరి సినీ కెరీర్ స్టార్టింగ్ లోనే కోయదొర దాసరికి గత జన్మ విషయం చెప్పాడు.  

నాని ఉంటేనే సినిమా చేస్తానన్న డైరెక్టర్!

సినీ పరిశ్రమలో యాక్టర్ గా అయినా, డైరెక్టర్ గా అయినా మొదటి అవకాశం రావడం అంత తేలిక కాదు. ఎన్నో కష్టాలు, అవమానాలు ఎదురవుతాయి. అవకాశాల కోసం కాళ్ళు అరిగేలా తిరగాలి. అలాంటిది రాక రాక అవకాశమొస్తే.. తన ఫ్రెండ్ ని హీరోగా పెట్టుకుంటేనే సినిమా చేస్తాను అనే సాహసం కొత్త డైరెక్టర్ చేస్తారా?. నేచురల్ స్టార్ నాని కోసం డైరెక్టర్ నందిని రెడ్డి అలాంటి సాహసమే చేశారు. నాని, నిత్యా మీనన్ జంటగా నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందిన సినిమా 'అలా మొదలైంది'. కె.ఎల్. దామోదర ప్రసాద్ నిర్మించిన ఈ మూవీ 2011 జనవరిలో విడుదలై ఘన విజయం సాధించింది. అయితే ఈ సినిమా మొదలై పూర్తి కావడం వెనుక ఓ చిన్న పాటి యుద్ధమే జరిగింది. 2010-11 సమయంలో రొమాంటిక్ కామెడీ సినిమాల ట్రెండ్ లేదు. అందుకే నందిని రెడ్డి 'అలా మొదలైంది' కథ పట్టుకొని తిరుగుతుంటే నిర్మాతల రిజెక్ట్ చేసేవారు. అయితే స్వప్న దత్ మాత్రం ఈ కథ ఎంతగానో నచ్చి ప్రొడ్యూస్ చేయడానికి ముందుకొచ్చారు. కానీ ఆమె తండ్రి, ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ మాత్రం వెనకడుగు వేశారు. కథలో కొన్ని మార్పులు చెప్పారు. అప్పటికే నందిని రెడ్డి తీవ్ర నిరాశలో ఉన్నారు. అలాంటి సమయంలో సంగీత దర్శకుడు కల్యాణి మాలిక్.. ఓ కొత్త నిర్మాత దామోదర ప్రసాద్ ను కలిసి కథ చెప్పమన్నారు. ఇదంతా జరిగే పని కాదని, అయిష్టంగానే వెళ్ళి కథ చెప్పారు నందిని. కథ విన్న దామోదర ప్రసాద్ సింగిల్ సిట్టింగ్ లోనే ఓకే అన్నారు. దాంతో నందిని ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అయితే హీరోగా ఎవరిని అనుకుంటున్నారని దామోదర ప్రసాద్ అడగగా.. నాని పేరు చెప్పారు నందిని. అప్పటికి నాని 'అష్టా చమ్మా', 'రైడ్', 'స్నేహితుడా' వంటి సినిమాలు చేసి ఉన్నారు. "నాని ఇలాంటి రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ కి సెట్ అవుతాడా?" అని దామోదర ప్రసాద్ సందేహం వ్యక్తం చేయగా.. "నేను నా ఫ్రెండ్ నానిని ఊహించుకొనే ఈ కథ రాశాను. అతన్ని హీరోగా తీసుకుంటేనే సినిమా చేస్తాను" అని నందిని చెప్పేశారట. కథ నచ్చి, ఆమె కాన్ఫిడెన్స్ చూసి.. నానినే హీరోగా పెట్టి సినిమా చేశారు దామోదర ప్రసాద్. కథలో ఎలాంటి మార్పులు చెప్పకుండా దామోదర ప్రసాద్ సినిమా ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వచ్చారని నందిని చెప్పడంతో.. స్వప్న దత్ ఎంతో సంతోషించి ఆల్ ది బెస్ట్ చెప్పారు. 'అలా మొదలైంది' కథను చాలా కొద్ది మాత్రమే నమ్మారు. షూటింగ్, ఎడిటింగ్ సమయంలో ఈ సినిమా ఆడదని చాలామంది డిస్కరేజ్ చేసేవారట. కానీ వారి అంచనాలను తలకిందులు చేస్తూ ఈ మూవీ ఘన విజయం సాధించి కొత్త ట్రెండ్ ని సృష్టించింది. ఆ తర్వాత 'అలా మొదలైంది' విషయంలో తన జడ్జ్ మెంట్ తప్పని తెలుసుకున్న అశ్వనీదత్.. నందినికి సారీ చెప్పడంతో పాటు, ప్రశంసించడం విశేషం.

సి.నా.రె పాటను మహదేవన్‌ ట్యూన్‌ చెయ్యలేనన్నారు.. తర్వాత అదే పది కాలాలపాటు నిలిచే పాట అయింది!

కళాతపస్వి కె.విశ్వనాథ్‌ తీసిన సినిమాలన్నీ ఆణిముత్యాలే. వాటిలో ఒక ఆణిముత్యం ‘చెల్లెలి కాపురం’. ఈ చిత్రం గురించి చెప్పాల్సి వస్తే.. ఆరోజుల్లో విభిన్నమైన కథాంశంతో రూపొందిన సినిమాగా పేరు తెచ్చుకుంది. శోభన్‌బాబు, వాణిశ్రీ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాను నటుడు, నిర్మాత ఎం.బాలయ్య నిర్మించారు. 1971లో వచ్చిన ఈ సినిమా ప్రథమ ఉత్తమ చిత్రంగా బంగారు నందిని గెలుచుకుంది. ఈ చిత్రానికి కె.వి.మహదేవన్‌ అందించిన సంగీతం పెద్ద హైలైట్‌గా నిలిచింది. ‘కనుల ముందు నీవుంటే.. కవిత పొంగి పారదా..’, ‘ఆడవే మయూరి.. నటనమాడవే మయూరీ..’ అనే పాటలు అత్యంత ప్రేక్షకాదరణ పొందాయి. ముఖ్యంగా ‘ఆడవే మయూరి..’ పాట గానగంధర్వుడు ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం కెరీర్‌లో చెప్పుకోదగ్గ పాటల్లో ఒకటిగా నిలుస్తుంది.  ఈ పాట రూపొందే క్రమంలో కొన్ని ఆసక్తికరమైన అంశాలు చోటు చేసుకున్నాయి.  పాటను డా. సి.నారాయణరెడ్డి రచించారు. పాటకు ట్యూన్‌ కట్టించేందుకు మహదేవన్‌ దగ్గరికి వెళ్లారు. ఈ పాట చివరి చరణం కొన్ని కఠినమైన సంస్కృత పదాలతో నిండి ఉంటుంది. ‘ప్రళయ కాల సంకలిత భయంకర.. జలధరార్బుటుల చలిత దిక్కుటుల.. జటిత దిక్కురుల వికృత ఫీుంకృతుల .. సహస్రఫణ సంచలిత భూకృతుల..’... ఇలా సాగుతుందా పాట. ఆ పదాలను నారాయణరెడ్డిగారు వినిపించగానే ‘ఇది పాటకు పనికిరాదు. ఇన్ని సంస్కృత పదాలు, ఇంత జఠిలమైన పదాలతో పాటను ఎలా ట్యూన్‌ చేస్తాం’ అన్నారు మహదేవన్‌. దానికి నారాయణరెడ్డిగారు ‘మామా.. ఒక కవికి, డాన్సర్‌కి మధ్య జరిగే పోటీ అది. దానికి ఇలాంటి పదాలు పడితేనే గానీ కిక్కు రాదు’ అని మహదేవన్‌ని కన్విన్స్‌ చేశారు. ఆ తర్వాత ఆయన ఆ పాటను ట్యూన్‌ చేయడం జరిగింది. ఆ పాట చాలా పెద్ద హిట్‌ అయిపోయింది. ఎవరైనా గాయకుడు అవ్వాలని ప్రయత్నించేవారు తప్పకుండా ఈ పాట పాడి అందర్నీ అలరించాలని కోరుకుంటారు. ఘంటసాల పాడిన ‘చంద్రకళాధరి ఈశ్వరి’ పాట, ఎస్‌.పి.బాలు పాడిన ‘ఆడవే మయూరి.. ’ ఈ రెండు పాటలను నేర్చుకోకుండా ఏ గాయకుడూ ఉండడు. అయితే ఈ రెండు పాటలను పర్‌ఫెక్ట్‌గా పాడే సింగర్స్‌ తక్కువే అయినప్పటికీ అటెమ్ట్‌ చేయకుండా ఉండరు. ‘ఆడవే మయూరి’ పాట ఇప్పటికీ ఆదరణ పొందుతోంది అంటే దానికి సి.నారాయణరెడ్డి కలం నుంచి జాలువారిన అందమైన సాహిత్యం, కె.వి.మహదేవన్‌ పాటను స్వర పరిచిన విధానం, ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం అకుంఠిత దీక్షతో పాట పాడిన తీరు.. వెరసి ఒక అద్భుతం ఆవిష్కృతమైంది. 

ఎన్టీఆర్ కి కృష్ణ వ్యతిరేకంగా మారడానికి  కారణం ఇదే 

నందమూరి తారకరామరావు, ఘట్టమనేని కృష్ణ  ఈ ఇద్దరు అప్పటివరకు ఉన్న తెలుగు చిత్ర సీమ పోకడల్ని సమూలంగా మార్చి వేసి సూపర్ స్టార్ లుగా ఎదిగిన  గొప్ప నటులు. ఇద్దరికీ కొన్ని లక్షల మంది అభిమానులు ఉన్నారు. కృష్ణ గారికి ఎన్టీఆర్ అన్నా ఎన్టీఆర్ కి కృష్ణ గారు అన్నా చాలా అభిమానం. ఎన్టీఆర్ కి కృష్ణ వీరాభిమాని అవ్వడంతో పాటు దేవుడుగా కూడా ఎన్టీఆర్ ని కృష్ణ కొలుస్తాడు. మరి అలాంటి ఇద్దరి మధ్య ఎందుకు గొడవలు వచ్చాయి. పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఆ ఇద్దరి మధ్య  ఎందుకొచ్చింది? నందమూరి తారక రామారావు.. ఈ పేరు వింటే పులకరించిపోని తెలుగు వారు ఉండరు. సాంఘిక, పౌరాణిక ,జానపద చిత్రాల్లో తనదయిన శైలి లో నటించి తెలుగు సిల్వర్ స్క్రీన్ ముందు కాసుల వర్షాన్ని కురిపించిన గొప్ప నటుడు. రాముడు గా నటించి తన రూపాన్నే జనం రాముడుగా కొలిచేలా చేసుకున్న గొప్ప పుణ్యమూర్తి. అలాగే  సినిమా రంగంలో ఎంతో మంది కొత్త వాళ్ళని కూడా  ప్రోత్సహించిన గొప్ప వ్యక్తి . విశ్వ విఖ్యాత నట సార్వభౌమ కైకాల సత్యనారాయణ తన కెరీర్ మొదట్లో హీరో గా ఫెయిల్ అయ్యి సినిమాలు వదిలేసి ఇంటికి వెళ్లబోతుంటే ఎన్టీఆర్ సత్యనారాయణ గారిని పిలిచి సినిమా అంటే  కేవలం హీరోనే కాదని ఇంకా ఎన్నో పాత్రలు ఉన్నాయని చెప్పి సత్యనారాయణ గారు తెలుగు సినీ పరిశ్రమలో మహా నటుడు గా ఎదగడానికి ఎన్టీఆర్ నే కారణం. ఇలా ఎంతో మందిని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో నిలబెట్టిన ఘనత ఎన్టీఆర్ సొంతం. అలాగే ఎన్టీఆర్  రాజకీయాల్లో సృష్టించిన సంచలనం నడుస్తున్న యుగానికి ప్రత్యక్ష  సాక్ష్యం. కృష్ణ ..తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా సౌత్ చిత్ర పరిశ్రమలోనే మొట్టమొదటి సూపర్ స్టార్ గా అవతరించిన నటుడు. లవర్ బాయ్ గా, జేమ్స్ బాండ్ గా,మధ్యతరగతి యువకుడిగా,విప్లవ యోధుడిగా ఉద్యమకారుడిగా, గూఢచారిగా,రాజుగా  ఇలా ఎన్నో పాత్రల్లో నటించి  కృష్ణ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. తెలుగు సినిమాకి నూతన  సొగసులుని, టెక్నాలజీ ని అద్ది తెలుగు సినిమాని వేగంతో పరుగెత్తేలా చేసి తెలుగు సినిమా కి ఎంతగానో సేవ చేసారు.ఎంతో మంది నిర్మాతలని  కూడా ఆదుకొని వాళ్ళకి  ఫ్రీ గా సినిమాలు కూడా చేసి కృష్ణ  రీల్ హీరో నే కాదు రియల్ హీరో కూడా అని అనిపించుకున్నారు.  మరి ఇంత మంచివాళ్లు అయిన ఎన్టీఆర్ కృష్ణల మధ్య గొడవలు ఎందుకొచ్చాయని అనుకుంటున్నారా..  తెలుగు దేశం పార్టీ ని స్థాపించిన ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో అధ్భుతమైన మెజారిటీ ని ముఖ్య మంత్రి పీఠాన్ని అధిరోహించారు. ఆ తర్వాత జరిగిన కొన్ని  పరిణామాలవల్ల నాదెండ్ల భాస్కరరావు ఎన్టీఆర్ అనుమతి లేకుండా  ముఖ్యమంత్రి అయ్యాడు .ఆ టైంలో పద్మాలయ స్టూడియో నుంచి నాదెండ్ల భాస్కర్ రావు ని సమర్థిస్తూ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ అయ్యింది. దాంతో ఎన్టీఆర్ అభిమానులు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కృష్ణ గారికి వ్యతిరేకంగా  ఆందోళనలు చేపట్టి కృష్ణ గారి ఫోటోలు ,సినిమా వాల్ పోస్టర్స్ ని తగలపెట్టారు. చాలా చోట్ల కృష్ణ గారి ఫ్యాన్స్ కి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మధ్య గొడవలు కూడా జరిగాయి. ఈ విషయం షూటింగ్ లో ఉన్న కృష్ణ గారికి  తెలిసింది. దాంతో మొదట నుంచి పట్టుదలకి మారుపేరైన కృష్ణ  ఎక్కడ  తగ్గకూడదని నిర్ణయించుకొని ఎన్టీఆర్ ని వ్యతరేకిస్తు కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఆ తర్వాత కృష్ణ గారు కాంగ్రెస్ కి మద్దతుగా  కొన్ని సినిమాల్లో నటించడమే కాకుండా కొన్ని సినిమాలని కూడా నిర్మించారు. ఏలూరు నుంచి కాంగ్రెస్ ఎంపీ గా కూడా పోటీ చేసి గెలిచారు.కానీ ఎన్టీఆర్ ,కృష్ణ లకి  కూడా తెలియని విషయం ఏంటంటే ఇద్దరి మంచి వాళ్ళ మధ్య అపార్ధాలు కలకాలం నిలబడలేవు. కొన్ని సంవత్సరాల తర్వాత  ఎన్టీఆర్, కృష్ణ లు విబేధాలన్నీ మర్చిపోయి కలిసిపోయారు.

అక్కినేని సాంఘిక  హీరో ఏంటి అని హేళన..ఆ సినిమాతోనే రికార్డు 

ఏఎన్ఆర్ అంటేనే నటనకి ఒక డిక్షనరీ..ఎవరైనా మంచి నటుడు అవ్వాలని అనుకుంటే ఆయన నటించిన సినిమాలు చూస్తు నటనని  నేర్చుకోవచ్చు.సిల్వర్ స్క్రీన్ మీద ఆయన పోషించని పాత్ర లేదు పోషించిన అన్ని పాత్రల్లోను  జీవించి ప్రేక్షకుల దృష్టిలో ఆయా పాత్రలని సజీవంగా నిలిచేలా చెయ్యడం అక్కినేని నటనకి ఉన్న స్టైల్. మరి అలాంటి అక్కినేనిని  సాంఘిక చిత్రాల్లో నటించడానికి పనికిరాడని అన్న వారు ఉన్నారు. ఇది నిజం..నాగేశ్వరరావు అసలు సోషల్ సినిమాలకి పనికి రాడు అని అన్నారు .ఆ మాటలని పట్టుదలగా  తీసుకొని తన మొదటి సాంఘిక చిత్రంలో అత్యద్భుతంగా నటించడమే కాకుండా ఆ సినిమాలో తను  స్టైల్ గా ధరించిన కళ్ళజోడుకే స్టైల్ ని తెచ్చి కొన్ని వేల మంది చేత ఆ కళ్లజోడు కొనేలా చేసిన నటుడు  అక్కినేని నాగేశ్వరరావు గారు. నాగేశ్వరరావు గారు తన కెరీర్ తొలినాళ్లలో జానపద ,పౌరాణిక చిత్రాలల్లోనే నటించారు. ఆయన తెలుగు చిత్ర సీమకి పరిచయమయ్యింది కూడా పౌరాణిక చిత్రం ద్వారానే. అలా అక్కినేని  అంటే కేవలం పౌరాణిక, జానపద చిత్రాల హీరోనే అనే ఒక ముద్ర ప్రేక్షకుల దృష్టిలో ఇండస్ట్రీ వర్గాల దృష్టిలో ఉండిపోయింది. కాలం తనకి కావలసింది తానే సృష్టించుకుంటుంది అనేలా ఏఎన్ఆర్ కి ఎల్ వి ప్రసాద్ డైరక్షన్ లో సంసారం అనే మూవీలో తొలిసారిగా  సాంఘిక చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఎల్ వి ప్రసాద్ తో చాలా మంది మీ సినిమాలో నాగేశ్వరరావు ని తీసుకున్నారేంటి అతను సోషల్ సినిమాలకి పనికి రాడని అన్నారు. కానీ ఎల్ వి ప్రసాద్ గారు ఎవరెన్ని చెప్పినా వినకుండా అక్కినేని మీద ఉన్న నమ్మకంతో ముందుకు వెళ్లారు.  అలా సంసారం మూవీ స్టార్ట్ అయ్యింది.ఏఎన్ఆర్  తన మీద వస్తున్న విమర్శలకి చెక్ పెట్టి తానంటే ఏంటో నిరూపించుకోవాలని సినిమాలోని తన పాత్ర కోసం  ఎంతగానో కష్టపడ్డారు. ఒక దశలో జానపదాల నటుడికి   ప్యాంటు  షర్ట్ ఏంటి అని ఎగతాళి చేసిన వాళ్ళు లేకపోలేదు.సంసారం సినిమాలో నాగేశ్వరరావు  గారు వేణు అనే ఒక  పల్లెటూరి యువకుడు క్యారెక్టర్లో  ఫస్ట్ ఆఫ్ లో అమాయకంగా కొంచం మొరటుగా కనపడతాడు. అదే క్యారక్టర్ సెకండ్ ఆఫ్ వచ్చే సరికి పూర్తిగా మారిపోతుంది. వేష భాషలుతో పాటు ముఖ కవళికలు కూడా మారిపోయి పూర్తి క్లాస్ గా మారిపోతుంది.అలాంటి వేణు క్యారెక్టర్ కి అక్కినేని నూటికి నూరుపాళ్ళు  న్యాయం చేసారు.   అంతే కాకుండా సెకండ్ ఆఫ్ లో వచ్చే  కల నిజామాయేగా కోరిక తీరేగా అనే పాటని  ఏఎన్ఆర్ మీద చిత్రకరించడానికి మేకర్స్ సిద్ధం అవుతున్నారు.పైగా ఈ పాటలో అక్కినేని చాల గ్లామరస్ గా కనిపించాలి వెంటనే అక్కినేని తనే సొంతంగా  మద్రాస్ లోని మౌంట్ రోడ్ లో ఉన్న మయో ఆప్టికల్స్ కి వెళ్లి అప్పటివరకు ఉన్న గుండ్రని అద్దాలకు భిన్నంగా ఎందుకంటే అప్పటివరకు హీరోలు గుండ్రని కళ్ళద్దాలనే వాడేవాళ్లు. అలా కాకుండా తన ముఖకవలకి సరిపోయే విధంగా నలుచదరం కళ్ళద్దాలని  నాగేశ్వరరావు గారు ఎంపిక చేసుకొని తన మీద చిత్రీకరించిన పాటలో   ధరించారు.   ఇక అంతే  సంసారం సినిమా రిలీజ్ అయిన తర్వాత  అక్కినేని ధరించిన కళ్ళజోడు బాగా ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత చాలా మంది అక్కినేని ఆ కళ్ళజోడు మయో ఆప్టికల్స్ లో కొన్నాడని తెలుసుకొని అక్కినేనిలా స్టైల్ గా ఉండాలని  5000 కళ్లజోడులు దాకా కొన్నారు. అందుకే అక్కినేని అభిమానులు నేటికీ ఒక మాట అంటూ ఉంటారు. తెలుగు సినిమాకి స్టైల్ ని నేర్పిందే  మా అక్కినేని నాగేశ్వరరావు అని..  ఆ తర్వాత మయో ఆప్టికల్స్ వాళ్ళు అక్కినేని కి కృతజ్ఞతలు చెప్పుకోవడమే కాకుండా చాలా సంవత్సరాలు అక్కినేనికి మాయో నుంచే  కళ్ళజోడు మోడల్స్ ని పంపించే వాళ్ళు.  ఇలా పౌరాణిక, జానపద చిత్రాలకి  తప్ప సాంఘిక చిత్రాలకి పనికి రాడని అన్న వాళ్ళ నోరుమూయించిన ఏఎన్ ఆర్ ఆ తర్వాత ఎన్నో సాంఘిక చిత్రాల్లో నటించి ఎంతగా చరిత్ర సృష్టించారో అందరికి తెలిసిందే. అన్నట్టు 1950 లో  వచ్చిన  ఈ సంసారం మూవీలో  అక్కినేని  రెమ్యునరేషన్ తీసుకోకుండా నటించాడు. ఈ మూవీలో ఎన్టీఆర్, లక్ష్మి రాజ్యం, రేలంగి తదితరులు నటించారు

చిరు కారణంగా చరణ్ చేయాల్సిన 'జోష్' చైతన్య చేశాడు!

సినీ పరిశ్రమలో ఒక హీరోకి అనుకున్న కథ మరో హీరో దగ్గరకు వెళ్ళడం సహజం. అక్కినేని వారసుడు నాగ చైతన్య హీరోగా పరిచయమైన 'జోష్' విషయంలో కూడా అదే జరిగింది. నిజానికి మొదట ఈ కథని మెగా హీరో రామ్ చరణ్ తో చేయాలని ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రయత్నించాడు. అయితే చరణ్ కి కథ నచ్చినప్పటికీ, చిరంజీవి కారణంగా ఈ ప్రాజెక్ట్ లోకి చైతన్య వచ్చాడు. దిల్, ఆర్య, భద్ర, బొమ్మరిల్లు వంటి సినిమాలతో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్న దిల్ రాజు.. అక్కినేని వారసుడు నాగ చైతన్యని తమ బ్యానర్ ద్వారా హీరోగా పరిచయం చేయాలనుకున్నాడు. ఈ క్రమంలోనే శ్రీకాంత్ అడ్డాల సిద్ధం చేసిన 'కొత్త బంగారు లోకం' కథని తీసుకెళ్ళి నాగార్జునకు వినిపించాడు దిల్ రాజు. కథ నచ్చినప్పటికీ, తన కుమారుడి మొదటి సినిమా అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా మాస్ ఎలిమెంట్స్ తో ఉంటే బాగుంటుందనే ఆలోచనతో నాగార్జున ఆ కథని వద్దన్నాడు. దాంతో ఆ అవకాశం వరుణ్ సందేశ్ ని వరించింది. కొంతకాలానికి దర్శకుడు వాసు వర్మ 'జోష్' కథని దిల్ రాజు కి చెప్పాడు. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రాసుకున్న ఈ కథ.. అప్పటికే 'చిరుత'తో హీరోగా పరిచయమైన చరణ్ కి బాగుంటుందని దిల్ రాజు భావించాడు. చరణ్ ని కలిసి కథ వినిపించగా అతనికి బాగా నచ్చింది. అయితే చిరంజీవి మాత్రం ఈ ప్రాజెక్ట్ కి బ్రేక్ వేశాడు. ప్రస్తుతం చరణ్ 'మగధీర' వంటి భారీ సినిమా చేస్తున్నాడని, ఈ టైంలో ఇలాంటి కథ చేయడం కరెక్ట్ కాదని చిరు అభిప్రాయపడ్డాడు. దాంతో చేసేదేం లేక దిల్ రాజు వెనుదిరిగాడు. అయితే 'జోష్' కథని ఎంతగానో నమ్మిన దిల్ రాజు.. ఆ వెంటనే నాగార్జునని కలిసి కథ వినిపించాడు. కాస్త 'శివ' తరహా కథ కావడంతో బాగా ఎక్సైట్ అయిన నాగ్.. ఈ స్టోరీనే చైతన్య డెబ్యూకి కరెక్ట్ అని భావించి, వెంటనే ఓకే చెప్పాడు. అలా చైతూని హీరోగా పరిచయం చేస్తూ దిల్ రాజు జోష్ చిత్రాన్ని నిర్మించాడు. 2009 సెప్టెంబర్ లో విడుదలైన జోష్.. మంచి సినిమాగా పేరు తెచ్చుకున్నప్పటికీ ఆశించిన స్థాయి విజయాన్ని మాత్రం సాధించలేకపోయింది. అలా చైతన్య చేయాల్సిన 'కొత్త బంగారు లోకం' వరుణ్ సందేశ్ దగ్గరకు వెళ్తే.. చరణ్ చేయాల్సిన 'జోష్'తో చైతన్య హీరోగా పరిచయమయ్యాడు.

చంద్రమోహన్‌ జీవితాన్నే మార్చేసిన యాక్సిడెంట్‌!

జీవితంలో ఏదైనా ఊహించని సంఘటన జరిగినపుడు.. యాక్సిడెంటల్‌గా జరిగింది అంటుంటాం. ఇలా యాక్సిడెంటల్‌గా జరిగిన ఘటనల వల్ల కొందరికి లాభం చేకూరవచ్చు, మరికొందరు నష్టాన్ని చవిచూడవచ్చు. ఏది ఏమైనా నటుడు చంద్రమోహన్‌ విషయంలో యాక్సిడెంటల్‌గా జరిగిన ఓ ఘటన అతని జీవితాన్నే మార్చేసింది. చంద్రమోహన్‌ బావ వేరెవరికో సినిమా అవకాశం కోసం ప్రముఖ దర్శకుడు బి.ఎన్‌.రెడ్డి దగ్గరికి వెళ్లారు. తను చేస్తున్న సినిమాలోని నటుడికి ఎలాంటి లక్షణాలు ఉండాలి అనే విషయాలను గురించి అతనికి వివరించాడు. దాంతో తన మా బావమరిది ఉన్నాడని, మీరు చెప్పిన లక్షణాలన్నీ అతడిలో ఉన్నాయంటూ చంద్రమోహన్‌ను ఆ ప్రముఖ దర్శకుడికి పరిచయం చేశారు. అలా రంగులరట్నం చిత్రంతో చంద్రమోహన్‌ తెరంగేట్రం చేశారు. హీరో అంటే మంచి ఎత్తు, రంగు, ఆకర్షణీయమైన ముఖం ఉండడం కనీస అర్హత. కానీ, చంద్రమోహన్‌ విషయానికి వస్తే .. పొడుగు కాదు, మరీ పొట్టిగా ఉన్నాడు, రంగు, రూపు కూడా అంతంత మాత్రమే. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా హీరోకి ఉండాల్సిన లక్షణాల్లో ఒక్కటి కూడా చంద్రమోహన్‌కి లేదు.  అలాంటి చంద్రమోహన్‌.. కేవలం తనలోని ప్రతిభను మాత్రమే నమ్ముకొని.. 55 ఏళ్ల పాటు సుదీర్ఘమైన కెరీర్‌ను కొనసాగింది 932 చిత్రాల్లో నటించారు. 175 సినిమాల్లో ఆయన హీరోగా నటించి.. తన నటనతో ప్రేక్షకుల మనస్సును కత్తిరించి  చోరీ చేసిపారేశారు. ఆయన చేసిన క్యారెక్టర్ల గురించి ప్రస్తావించాల్సి వస్తే... ఐఎన్‌ మూర్తి దర్శకత్వంలో వచ్చిన సుఖదు:ఖాలు చిత్రంలో తన సోదరి వాణిశ్రీని ప్రేమించి, వంచించిన వ్యక్తిని హత్య చేసి.. ఆ తర్వాత.... అతడి ఇంట్లోనే దాక్కోవడం.. అలాగే బాపు దర్శకత్వంలో తెరకెక్కిన బంగారు పిచుకలో తల్లి చాటు కొడుకుగా ఉన్న చంద్రమోహన్‌ను కన్న తండ్రి బయట ప్రపంచం చూడరా బాబు అంటూ ఇంటి నుంచి పంపిచేయడం.. ఇక కళాతపస్వి కె. విశ్వనాథ్‌ దర్శకత్వంలో విడదలైన సిరిసిరిమువ్వ చిత్రంలో సాంబయ్యగా.. సవతి తల్లి చేతిలో అవమానాలకు గురవుతున్న మూగ అమ్మాయి జయప్రద.. మోసగాడితో పెళ్లి అవుతుంటే.. ఆ పెళ్లిని ఆపేందుకు.. రా దిగి రా.. దివి నుంచి భువికి దిగా రా.. అంటూ డప్పు కొడుతూ ఊగిపోతు పాడడం.. అదే విశ్వనాథ్‌ దర్శకత్వంలో నటించి మరో చిత్రం సితామహాలక్ష్మీ. ఈ చిత్రంలో సీతాలు సింగారం.. మాలచ్చిమి బంగారు.. బంగారు కొండయ్య అంటే భగవంతుడవతారం అంటూ తాళ్లురి రామేశ్వరితో చంద్రమోహనుడి చట్టాపట్టాలు.. మళ్లీ ఆదే విశ్వనాథ్‌ దర్శకత్వంలోనే వచ్చిన చిత్రం శంకరాభరణం. ఈ చిత్రంలో కామేశ్వరరావుగా అన్నవరంలో దేవుడి మెట్ల మీద... మర చెంబు, గ్లాసు, రాజ్యలక్ష్మీతో చూపులు కలిసిన శుభవేళ.. సీన్లు ఎలా ఉంటాయంటే... అన్నవరం సత్యదేవుని ప్రసాదంలా.. రుచిగా, శుచిగా మనస్సును ఇట్టే కట్టి పడేస్తాయి.   ఇక దర్శకేంద్రుడు రాఘవేంద్రుడి దర్శకత్వంలో తెరకెక్కిన పదహరేళ్ల వయస్సు చిత్రంలో.. అమాయక దివ్యాంగుడి పాత్రలో చంద్రమోహన్‌ ఒదిగిపోయి నటిస్తే.. అప్పటికి జగదేక సుందరి పేరు సంపాదించుకోని శ్రీదేవితో కలిసి నటించిడం.. మరో విశేషం. బీరం మస్తాన్‌ రావు దర్శకత్వంలో వచ్చిన చిత్రం సువర్ణసుందరి. ఈ చిత్రంలో భార్యనే ప్రేయసి భావించి.. ఆమెనే ఆరాధిస్తూ.. కవిత్వాన్ని రాసే భర్తగా చంద్రమోహన్‌ నటన నభూతో న భవిష్యత్‌.     అలాగే ప్రముఖ దర్శకుడు బాపు దర్శకత్వంలో చెక్కిన శిల్పం రాధాకల్యాణం. ఈ చిత్రంలో అరవ అబ్బాయి పాల్ఘాటి మాధవన్‌గా చంద్రమోహన్‌.. అతడిని ప్రేమించే అమ్మాయిగా రాధిక నటన.. ఈ చిత్రంలో ప్రతీ సన్నివేశం, పాటలు అన్ని ముగ్ద మనోహర గీతంలా ఉంటాయి. ఇక దర్శకేంద్రుడు రాఘవేంద్రుడి దర్శకత్వంలో వచ్చిన చిత్రం అల్లుడు గారు. ఇందులో లాయర్‌ పాత్రలో నటించిన చంద్రమోహన్‌ను పిప్పళ్ల బస్తా అంటూ మోహన్‌ బాబు ఆట పట్టించడం.. ఆ క్రమంలో చంద్రమోహన్‌ ప్రతిస్పందించే సన్నివేశాలు.. సరదా సరదాగా ఉంటాయి.  సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ఆదిత్య 369లో వికట కవి తెనాలి రామకృష్ణగా ఆయన నటన ఆమోఘం. అలాగే కలికాలం, ఆమె, మన్మధుడు, 7/జీ బృందావన్‌ కాలనీ, వర్షం, గులాబీ, అతనొక్కడే.. ఇలా చెప్పుకొంటు పొతే చంద్రమోహన్‌ నటించిన ప్రతీ చిత్రం సినీ వినీలాకాశంలో చంద్రహాసమే. అదే విధంగా అయన పక్కన నటించిన ప్రతీ హీరోయిన్‌ ఆ వినీనాకాశంలో స్టార్‌ కాదు.. సూపర్‌ స్టార్‌ కాదు.. సూపర్‌ డూపర్‌ లేడి స్టార్స్‌గా ఎదిగి.. పేరు ప్రఖ్యాతి గాంచారు. అందుకు శ్రీదేవి, జయప్రద, జయసుధ, విజయశాంతి, రాధిక, రాజ్యలక్ష్మీ, ముంజల, తాళ్లూరి రామేశ్వరి భానుప్రియ, శాంతిప్రియ ఇలా జాబితా చాలా పెద్దదే. 

ఇప్పట్లో చంద్రమోహన్‌ రికార్డును ఎవ్వరూ బ్రేక్‌ చెయ్యలేరు!

1966లో ‘రంగులరాట్నం’ చిత్రంతో ప్రారంభమైన చంద్రమోహన్‌ సినీ జీవితం 50 సంవత్సరాలపాటు అప్రతిహతంగా కొనసాగింది. పాత్రల ఎంపిక విషయంలో ఒక స్థిర అభిప్రాయం ఏర్పరుచుకోకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలోనే ఎక్కువ సంతృప్తిని పొందేవారు. అందుకే తను హీరోగా బిజీగా ఉన్న టైమ్‌లో కూడా రెండో హీరోగా, సహాయనటుడిగా, హాస్యనటుడిగా... ఏ క్యారెక్టర్‌ అయినా చేసేవారు. ఈ విషయంలో చంద్రమోహన్‌ దర్శకనిర్మాతల పాలిట వరంగా మారారు. ఇదిలా ఉంటే.. ఓ అరుదైన రికార్డు చంద్రమోహన్‌ పేరు మీద ఉంది. దాన్ని బ్రేక్‌ చెయ్యడం ఇప్పట్లో ఎవ్వరి వల్లా కాదు. అదేమిటంటే ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, కృష్ణ, శోభన్‌ బాబు, కృష్ణంరాజు వంటి అలనాటి స్టార్‌ హీరోల నుంచి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌ వంటి తర్వాతి తరం హీరోల వరకు అందరితోనూ కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. ఈతరం హీరోలైన మహేష్‌బాబు, అల్లు అర్జున్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌, రవితేజ, గోపీచంద్‌, మంచు విష్ణు, మంచు మనోజ్‌ చేసిన సినిమాల్లో కూడా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటించారు. మూడు తరాల హీరోలతో కలిసి నటించిన ఘనత చంద్రమోహన్‌ది. ఇది ఒక రికార్డుగా చెప్పొచ్చు. ఇప్పట్లో ఈ రికార్డును బ్రేక్‌ చేసే ఛాన్స్‌ ఎవ్వరికీ లేదు.   

డబ్బు దాచుకున్నవారికే సమాజంలో విలువ ఉంటుంది : చంద్రమోహన్‌

నటుడు చంద్రమోహన్‌ జీవితంలోని కొన్ని విశేషాలను తెలుసుకుందాం. మేడూరు, బాపట్లలో ఆయన విద్యాభ్యాసం జరిగింది. కళాతపస్వి కె.విశ్వనాథ్‌, ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం ఆయనకు సమీప బంధువులు. చంద్రమోహన్‌ భార్య జలంధర, కుమార్తెలు మధుర మీనాక్షి, మాధవి. ఇద్దరికీ పెళ్ళిళ్లు జరిగాయి. మధుర మీనాక్షి సైకాలజిస్టుగా అమెరికాలో స్థిరపడ్డారు. మాధవి చెన్నైలో వైద్యవృత్తిలో కొనసాగుతున్నారు.  చంద్రమోహన్‌ తన తొలి సినిమా ‘రంగులరాట్నం’లోని నటనకుగాను ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. ‘పదహారేళ్ళ వయసు’ చిత్రంలోని విలక్షణమైన నటనకు ఉత్తమ నటుడుగా ఫిలింఫేర్‌ అవార్డుకు ఎంపికయ్యారు. 1987లో ‘చందమామ రావే’ చిత్రానికి, ‘అతనొక్కడే’ చిత్రంలో సహాయనటుడిగా నంది అవార్డులు అందుకున్నారు.  తొలిచిత్రం ‘రంగులరాట్నం’ సక్సెస్‌ అయి, ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న తర్వాత సినిమాల్లో కొనసాగాలా, ప్రభుత్వ ఉద్యోగానికి వెళ్లాలా.. అని ఆలోచించిన చంద్రమోహన్‌ సినిమా రంగంవైపే అడుగులు వేశారు. ఆయన తీసుకున్న నిర్ణయంతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక అద్భుతమైన నటుడు దొరికనట్టయింది. సినిమాల్లోకి రాకపోయి ఉంటే డబ్బులు లెక్కపెట్టే ఉద్యోగం చేసుకునే వాడ్ని అని చాలా సందర్భాల్లో ఆయన చెప్పారు. చంద్రమోహన్‌ మంచి భోజనప్రియుడు. శాకాహారం, మాంసాహారం అనే తేడా లేకుండా రుచికరమైన వంటకాలను ఎంతో ఇష్టంగా తినేవారు. ఈ విషయాన్ని అనేక ఇంటర్వ్యూల్లో స్వయంగా తెలియజేశారు. చుట్టూ వున్న సమాజంపై ఎంతో అవగాహనతో ఉండే చంద్రమోహన్‌ ఎప్పుడూ ఒక మాట చెబుతుండేవారు.. డబ్బు దాచుకున్న వారికే సమాజంలో విలువ ఉంటుందని.