టీడీపీలోకి కాంగ్రెస్ ఎమ్మెల్సీల క్యూ!
ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది. కాంగ్రెస్ డెడ్ బాడీ కాలగర్భంలో కలసిపోవడమే తప్ప మళ్ళీ లేచే అవకాశం నూటికి వెయ్యిశాతం లేదు. ఈ వాస్తవాన్ని గ్రహించిన కాంగ్రెస్ ఎమ్మెల్సీలు తెలుగుదేశం పార్టీలోకి క్యూ కడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలతోపాటు కొంతమంది స్వతంత్రంగా గెలిచిన ఎమ్మెల్సీలు కూడా తెలుగుదేశంలో చేరే అవకాశం వుందని తెలుస్తోంది. శనివారం సాయంత్రం వీరంతా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరబోతున్నారని సమాచారం. ప్రస్తుతం కాంగ్రెస్‌కి చెందిన ఎమ్మెల్సీలు చైతన్యరాజు, రవివర్మ, హుస్సేన్, పుల్లయ్య, శ్రీనివాసులురెడ్డి, రెడ్డప్పరెడ్డి వున్నారు. శనివారం సాయంత్రం లోపు ఈ సంఖ్య పెరిగే అవకాశం వుంది.