తగ్గుతుందనుకుంటే పెరిగిందేంటి దేవ్‌డా..!
posted on Jun 20, 2014 @ 5:35PM
మోడీ ప్రభుత్వం బంగారం మీద దిగుమతి సుంకం తగ్గించబోతోందని, త్వరలో బంగారం ధరలు భారీగా తగ్గుతాయని చాలామంది బంగారు నగలు కొనకుండా వెయిట్ చేస్తున్నారు. రేపో మాపో బంగారం ధరలు తగ్గుతాయి.. కావలసిన నగలుకొనుక్కోవచ్చని కలలు కంటున్నారు. బట్.. జనం ఒకటి తలిస్తే బంగారం మరొకటి తలచింది. అందరూ తగ్గుతుందని అనుకున్న బంగారం ధర పెరిగింది. ప్రపంచ మార్కెట్లలో లోహపు ధరలు పెరగడంతో అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌లో బంగారం ధర ఒక నెల గరిష్ట స్థాయికి చేరుకుంది. శుక్రవారం నాటి ట్రేడింగ్ లో 10 గ్రాముల బంగారం ధర 605 పెరిగి 28,625కు చేరుకుంది. ఈ సంవత్సరంలో ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. బంగారం ధర పెరిగితే నేను మాత్రం ఎందుకు పెరగనంటూ వెండి ధర కూడా పెరిగింది. కిలో వెండి ధర 1800 పెరిగి 44,900 కు చేరుకుంది. డాలర్ బలహీనపడటం బంగారం, వెండి ధరలు పెరగడానికి కారణమని మార్కెట్ విశ్లేషకులు వెల్లడించారు.