థాంక్యూ చంద్రబాబూ: నిర్మలా సీతారామన్
posted on Jun 20, 2014 @ 6:15PM
కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్ క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తాను రాజ్యసభకు ఎన్నిక కావడానికి మద్దతు ఇచ్చినందుకు చంద్రబాబుకు ఆమె ఈ సందర్భంగా థాంక్స్ చెప్పారు. నిర్మలా సీతారామన్ శనివారం నాడు రాజ్యసభ స్థానానికి నామినేషన్ వేసే అవకాశం వుందని తెలుస్తోంది. దీనికోసం ఆమె శుక్రవారం నాడు హైదరాబాద్‌కి వచ్చారు. అటు లోక్‌సభలోగానీ, ఇటు రాజ్యసభలో గానీ సభ్యురాలు కాని నిర్మలా సీతారామన్‌ను మోడీ తన ప్రభుత్వంలోకి మంత్రిగా తీసుకున్నారు. మంత్రి పదవి చేపట్టిన ఆరు నెలలలోగా ఆమె ఉభయ సభల్లో ఏదో ఒకదానికి ఎంపిక కావలసి వుంటుంది. మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి మరణంతో ఆంధ్రప్రదేశ్‌లో ఒక రాజ్యసభ స్థానానికి ఖాళీ ఏర్పడింది. ఈ స్థానం ద్వారా నిర్మలా సీతారామన్ రాజ్యసభకు వెళ్ళడానికి తెలుగుదేశం మద్దతు ప్రకటించింది.