'హనీమూన్' లేదు..ప్రజల కోసమే: మోడీ

  నరేంద్రమోడీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటికి సరిగా నెలరోజులు పూర్తయింది. ఈ నెల రోజుల్లో తన ప్రభుత్వం కనబరిచిన పనితీరు పట్ల నరేంద్రమోడీ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎన్డీఏ పాలనలో విశేషాలను తెలియజేస్తూ ఐదున్నర నిమిషాల వీడియోను యూట్యూబ్ లో విడుదల చేశారు.       ప్రభుత్వానికి కొంతకాలం విమర్శలు ఎదుర్కోని విధంగా 'హనీమూన్ కాలం' ఉంటుందని మీడియా మిత్రులు చెబుతుంటారు. గత ప్రభుత్వాలు వందరోజులు, అంతకంటే పైగానే ఈ సౌలభ్యాన్ని అనుభవించాయి. కానీ, మా ప్రభుత్వం దీనికి నోచుకోలేదు. వంద రోజులు పక్కనపెడితే... వంద గంటల్లోనే తీవ్రమైన ఆరోపణలు మొదలయ్యాయి. కానీ... దేశ ప్రయోజనాల కోసం పూర్తి నిబద్ధతతో, ఆత్మసాక్షిగా సేవ చేస్తున్నప్పుడు ఇలాంటి విమర్శలేవీ లెక్కలోకి రావు. మేం తీసుకున్న కఠిన నిర్ణయాలు మాపట్ల ఈ దేశ ప్రజలకున్న ఘనమైన అభిమానాన్ని కొంత తగ్గించి ఉండొచ్చు. కానీ, మేం తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలు ఇచ్చిన రోజున ఈ ప్రేమాభిమానాలు పూర్వస్థాయిలోకి వస్తాయి. 67 సంవత్సరాల గత పరిపాలనను ఈ ఒక నెల పాలనతో పోల్చలేం. అయితే... మేమంతా గత నెలరోజుల్లో ప్రతి క్షణం ప్రజల సంక్షేమంగురించే ఆలోచించామని, ప్రతి నిర్ణయం దేశ ప్రయోజనాల కోసమే తీసుకున్నామని చెప్పగలను. నెలరోజుల క్రితం పాలనా పగ్గాలు చేపట్టినప్పుడు అంతా కొత్తగా అనిపించింది. కేంద్రప్రభుత్వ పనితీరు గురించి తెలుసుకోవడానికి నాకు కనీసం ఏడాది, రెండేళ్లు పట్టవచ్చునని కొందరు భావించారు. కానీ, అదృష్టవశాత్తూ ఇప్పుడు నా మదిలో ఆ (కొత్త అనే) ఆలోచనే లేకుండా పోయింది. ఈ నెల రోజుల వ్యవధిలో ఆత్మవిశ్వాసం, అంకితభావం గణనీయంగా పెరిగాయి. మంత్రివర్గ సహచరుల తెలివితేటలు, అనుభవజ్ఞానం, నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఇందుకు తోడ్పడ్డాయి.  

బీజేపీ గూటికి కిరణ్‌కుమార్ రెడ్డి?

  రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచడానికి విఫలయత్నం చేసి, రాష్ట్రం విడిపోయిన తర్వాత ‘జై సమైక్యాంధ్ర’ పార్టీ పెట్టి, ఎన్నికలలో ప్రజల చేత తిరస్కారానికి గురైన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి త్వరలో బీజేపీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం తన పార్టీకి సంబంధించి ఏ కార్యక్రమాన్నీ నిర్వహించకుండా, అసలు బయట ఎక్కడా కనిపించకుండా వున్న కిరణ్‌కుమార్‌ రెడ్డి మీద బీజేపీ కన్ను పడినట్టు తెలుస్తోంది. ఆయన్ని బీజేపీలోకి తీసుకోవడం ద్వారా సీమాంధ్రలో బీజేపీని మరింత బలోపేతం చేయాలని బీజేపీ నాయకత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. సీమాంధ్ర ప్రాంతంలో ప్రజలు కిరణ్ కుమార్ రెడ్డి పార్టీని పట్టించుకోలేదుగానీ, రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచడం కోసం పోరాటం చేశారన్న సానుభూతి మాత్రం ఆయన మీద వుంది. ఈ నేపథ్యంలో కిరణ్ కుమార్‌ని పార్టీలోకి తీసుకోవడం ద్వారా లాభం పొందాలని బీజేపీ ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఈ ఆలోచనలో భాగంగా కిరణ్ కుమార్ రెడ్డితో సన్నిహిత సంబంధాలున్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆయన్ని కలిశారు. గంటకు పైగా కిరణ్‌తో కిషన్ రెడ్డి సంభాషించారు. ఈ సంభాషణలో కిషన్ రెడ్డి కిరణ్ కుమార్‌రెడ్డిని బీజేపీలో చేరాల్సిందిగా ఆహ్వానించినట్టు తెలుస్తోంది. కిరణ్ కుమార్ బీజేపీలో చేరితే ఆయనకు ఎలాంటి గౌరవం లభిస్తుందో కిషన్ రెడ్డి వివరించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బంతి కిరణ్ కుమార్ కోర్టులోనే వుంది. తమ ప్రతిపాదనకు కిరణ్ కుమార్ రెడ్డి త్వరలోనే అనుకూలంటా స్పందించే అవకాశాలున్నాయని బీజేపీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

తూర్పుగోదావరిలో గ్యాస్ పైప్ లైన్ ప్రేలుడు, పది మంది మృతి

    తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం ‘నగరం’ గ్రామం వద్ద ఈరోజు తెల్లవారుజామున గ్యాస్ అధారిటీ ఆఫ్ ఇండియా (గెయిల్)కి చెందిన గ్యాస్ పైప్ లైన్ ప్రేలిపోవడంతో దాదాపు పది మంది మరణించినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఇరవై మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఓ.యన్.జీ.సి. నుండి గ్యాస్ కనెక్టింగ్ స్టేషన్ కు గ్యాస్ సరఫరా అయ్యే పైప్ లైన్ పేలిపోవడంతో దాదాపు 20మీటర్ల ఎత్తు మంటలు ఎగిసిపడుతున్నాయి. ఎనిమిది ఫైర్ ఇంజన్లు మంటలను అదుపు చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. గ్యాస్ కనెక్టింగ్ స్టేషన్ కి కేవలం పది-పదిహేను మీటర్ల దూరంలో ఈ పైప్ లైన్ ప్రేలుడు జరిగినప్పటికీ, అదృష్టవశాత్తు వర్షం పడుతున్న కారణంగా మంటలు గ్యాస్ కనెక్టింగ్ స్టేషన్ వరకు వ్యాపించలేదు. మంటలు స్టేషన్ వరకు వ్యాపించి ఉంటే మరింత భారీ స్థాయిలో ప్రేలుళ్ళు జరిగి, ప్రమాద తీవ్రత పెరిగేది. ఈ గ్యాస్ పైప్ లైన్ నగరం గ్రామం సమీపం నుండి వెళుతున్నందున, ఈ గ్యాస్ సంస్థతో ఎటువంటి సంబందమూ లేని సామాన్య ప్రజలు కూడా ఈ ప్రమాదంలో గాయపడ్డారు. మరణించారు. ఇంతవరకు ఓ.యన్.జీ.సీ. అధికారులు కానీ లేదా పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకోలేదని సమాచారం. రాష్ట్ర హోం మంత్రి చిన రాజప్ప సంబంధిత అధికారులను అప్రమత్తం చేసి తాను స్వయంగా ఘటనా స్థలికి బయలుదేరుతున్నారు.

సోనియా, రాహుల్ కు కోర్టు సమన్లు.. 2000 కోట్ల దుర్వినియోగం

  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలకు ఢిల్లీ హైకోర్టు గురువారం నోటీసులు జారీ చేసింది. ఆగస్ట్ 7 న కోర్టులో హాజరుకావలసిందిగా సమన్లలో కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. 2010లో నేషనల్ హెరాల్డ్ పబ్లిషింగ్ హౌజ్ కొనుగోలు వ్యవహారంలో దాదాపు రూ.2000 కోట్ల అక్రమాలు చోటుచేసుకున్నాయంటూ బీజేపి నేత సుబ్రహ్మణ్య స్వామి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ విచారణకు స్వీకరించిన కోర్టు సోనియా, రాహుల్‌తో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండేజ్, శ్యామ్ పిట్రోదాలకు కోర్ట్ సమన్లు జారీ చేసింది.

తెలంగాణకు సాయం కోరిన చ౦ద్రబాబు

  గురువారం ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వరుస భేటిలతో బిజీబిజీగా గడుపుతున్నారు. విద్యుత్ సమస్యపైన విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ తో చర్చించిన తరువాత బాబు మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో విద్యుత్ సమస్యలను తీర్చాలని మంత్రిని కోరినట్లు ఆయన తెలిపారు. ఎపిలో ఐదువందల మెగావాట్ల విద్యుత్ అదనంగా ఉత్పత్తి అవుతుందని ఆయన చెప్పారు. వచ్చే ఐదేళ్లలో విద్యుత్ రంగంలో సంస్కరణలు చేపడతామని తెలిపారు. విభజన తరువాత రెండు రాష్ట్రాల్లో సమస్యలున్నాయని, 24/7 సిస్టంతో 24గంటల పాటు గృహాలకు, పరిశ్రమలకు విద్యుత్ ఇవ్వాలని, అలాగే రైతులకు క్వాలిటీతో కూడిన విద్యుత్ ఇవ్వాలని కోరడం జరిగిందన్నారు. విద్యుత్ విషయంలో తెలంగాణకు కూడా సాయం చేయాలని కోరామని బాబు అన్నారు.

నటి పనిమనిషిని రేప్ చేసిన షారుఖ్ డ్రైవర్

  బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ డ్రైవర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. బాలీవుడ్ కి చెందిన నటి పనిమనిషిని రేప్ చేసినందుకు షారుఖ్ ఖాన్ డ్రైవర్ రాజేంద్ర కుమార్ గౌతమ్ అలియాస్ పింటూ మిశ్రా అనే 34 ఏళ్ల డ్రైవర్ బాంద్రా పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు విషయం ఏమిటంటే... షారుఖ్ ఖాన్ డ్రైవర్ లలో ఒకరైన గౌతమ్ నటి సంగితా బిజ్లానీ ఇంట్లో పనిచేస్తున్న పనిమనిషిపైన కన్నేశాడు. అతని స్నేహితుడి ద్వార ఆమె ఫోన్ నంబర్ సంపాదించాడు. సెలిబ్రిటీకి చెందిన ఇంటిలో పని ఇప్పిస్తానని అమ్మాయికి అతను హామీ ఇచ్చాడు. బాంద్రాలోని ఒక హోటల్ కు రమ్మని చెప్పి ఆమెపైన అత్యాచారం చేశాడు. ఈ విషయం బయటకి చెబితే అంతే వార్నింగ్ కూడా ఇచ్చాడట. కానీ అతని మాటలకి బయపడని యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతన్ని అరెస్ట్ చేశారు. బాధితురాలు అయిదు నెలల క్రితమే తన సొంతూరు అయిన లాతూరు నుంచి ముంబాయికి వచ్చింది. ఆమె కుంటుంబానికి ఆమె ఆదాయమే ఆధారం.

తెరాసలోకి వలసలు..బాబుపై కేసిఆర్ విమర్శలు

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన 9 మంది ఎమ్మెల్సీలు, ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం కేసిఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు చేశారు. చంద్రబాబు స్పష్టమైన ఎజెండాతోనే తెలంగాణకు వ్యతిరేకంగా కుట్రలుపన్నుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణకు కరెంట్ ఇవ్వరాదని ఆయన అంటున్నారు. ఖమ్మంలోని ఏడు మండలాలను దక్కించుకునేందుకు దొడ్డిదారిన ఆర్డినెన్స్ తెచ్చుకున్నారు. చంద్రబాబు ఎంత తెలంగాణ వ్యతిరేకి కాకపోతే గవర్నర్ ప్రసంగంలో తెలంగాణ ఏర్పాటు మాయని మచ్చ అని చెప్పిస్తారు? అని కేసీఆర్ ప్రశ్నించారు. తెలుగుదేశం నాయకులకు చీమూ నెత్తురు ఉంటే వెంటనే ఆ పార్టీని వదిలి రావాలని అన్నారు. తెలంగాణ అభివృద్ధిపై చిత్తశుద్ధి లేని టీడీపీలో ఇంకా ఎందుకు కొనసాగుతారని ప్రశ్నించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 11 మంది ప్రజాప్రతినిధులు ఒకేసారి మరో పార్టీలో చేరడం ఒక చరిత్ర అన్నారు.

చంద్రబాబు డిల్లీ పర్యటన ఫలించేనా?

  ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు ఉదయం డిల్లీకి బయలుదేరి వెళ్ళారు. అంతకుముందు, ఆయన నిన్న తన లేక్ వ్యూ క్యాంప్ ఆఫీసులో వివిధ శాఖల అధికారులతో సమావేశమయ్యి ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారం కోసం కేంద్రంతో చర్చించవలసిన అంశాల గురించి వివరాలను అడిగి తెలుసుకొన్నారు. చంద్రబాబు తన రెండు రోజుల డిల్లీ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సహా వివిధ శాఖల కేంద్రంమంత్రులను కలిసినప్పుడు వారితో ఈ విషయాలు చర్చించి వాటి పరిష్కారం కోసం ప్రయత్నించవచ్చును.   ఈరోజు ఆయన ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ, జలవనరుల శాఖా మంత్రి ఉమా భారతి, మానవ వనరుల శాఖా మంత్రి స్మృతీ ఇరానీ తదితరులను కలిసేందుకు వారి అపాయింట్ మెంటు తీసుకొన్నారు. ఈ పర్యటనలో ప్రధానంగా రాష్ట్రానికి ఆర్ధిక సహాయం వ్యవసాయ రుణాల మాఫీపై కేంద్రప్రభుత్వ సహకారం కోరబోతున్నట్లు సమాచారం. పోలవరం ప్రాజెక్టుపై తెలంగాణా ప్రభుత్వం అభ్యంతరాలు చెపుతున్న దృష్ట్యా దానిపై కేంద్రం చేత నిర్దిష్ట ప్రకటన చేయామని ఒత్తిడి చేసే అవకాశం ఉంది. ఇక విద్యుత్ మరియు నదీ జలాల పంపకాలపై తెలంగాణా ప్రభుత్వం వ్యవహార శైలి గురించి కేంద్రానికి పిర్యాదు చేసి ఈ సమస్యను శాశ్విత ప్రాతిపదికన పరిష్కరించేందుకు తగిన ఏర్పాట్లు చేయమని కోరవచ్చును.   హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్రం రూ.3000 కోట్లు వెచ్చించిదని, కానీ ఇప్పుడు హైదరాబాదును వదులుకొన్నందున ఆ మొత్తాన్ని తిరిగి తమకు చెల్లించమని కోరబోతున్నట్లు సమాచారం. అదేవిధంగా హైదరాబాదులో నెలకొల్పిన వివిధ ఉన్నత విద్యా, వైద్య, ప్రభుత్వ రంగ సంస్థలను, కొత్తగా నిర్మించే ఆంద్రప్రదేశ్ రాజధానిలో కూడా ఏర్పాటు చేయమని కోరబోతున్నట్లు తెలుస్తోంది.   అందువల్ల ఈసారి చంద్రబాబు పర్యటన రాష్ట్రానికి సంబంధించినంతవరకు చాలా కీలకమయిందని చెప్పవచ్చును. ఇప్పటికే రాష్ట్రం ఏర్పడి నెల రోజులు గడిచిపోయింది. కానీ నేటికీ రాష్ట్ర పునర్నిర్మాణం, కొత్త రాజధాని విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. కనుక ఈసారి చంద్రబాబు డిల్లీ పర్యటనలో కేంద్రం నుండి ఏమయినా నిధులు, హామీలు సాధించవలసిన ఆవశ్యకత చాలా ఉంది. ముఖ్యంగా వ్యవసాయ రుణాల మాఫీపై వెంటనే ఒక నిర్ణయం తీసుకోవలసి ఉన్నందున, కేంద్రం నుండి తప్పనిసరిగా భారీ ఆర్ధిక ప్యాకేజి సాధించవలసి ఉంది. లేకుంటే ఆయనకు ప్రతిపక్షాల నుండి విమర్శలు తప్పవు.

తెరాసలో చేరిన ఇద్దరు ఎమ్మెల్యేలు, 9 మంది ఎమ్మెల్సీలు

  తెలంగాణలో ఇతర పార్టీలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ సమక్షంలో ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ ఎమ్మెల్యే ఇంద్రకరణ్‌రెడ్డి, సిరిపూర్ కాకజ్‌నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గులాభీ కండువా కప్పుకున్నారు. వీరిద్దరి చేరికతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల బలం 65కు చేరింది. మరోవైపు పీఆర్‌టీయూ, కాంగ్రెస్‌కు చెందిన తొమ్మిది మంది ఎమ్మెల్సీలు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఆమోస్, యాదవరెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, భానుప్రసాద్, గోపాల్ రెడ్డి, రాజలింగం. పీఆర్టియూ ఎమ్మెల్సీలు జనార్థన్‌రెడ్డి, పూల రవీందర్ మరో మాజీ టీడీపీ ఎమ్మెల్సీ ఉన్నారు. పీఆర్టీయూ మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి కూడా గులాబీ గూటికి చేరారు.

కవితమ్మా ఎక్కడున్నవమ్మా..!!

      మాదాపూర్ అయ్యప్ప సొసైటీ, గురుకుల ట్రస్ట్ భూముల్లో అక్రమ కట్టడాల కూల్చివేత కొనసాగుతున్నాయి. ఆ కట్టడాలను కూల్చేయాల్సిందేనని ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్ర శేఖరరావుపైన బాధితులు మండిపడుతున్నారు. ఆయనతోపాటు పనిలో పనిగా ఆయన కూతురు నిజామాబాద్ ఎంపీ కవితపైన కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలో లేనప్పుడు తప్పుగా కనిపించిన పని తన తండ్రి ముఖ్యమంత్రి అయ్యేసరికి ఒప్పయిపోయిందా అని భాదితులు నిలదీస్తున్నారు.   ఇంతకీ అసలు సంగతి ఏమిటంటే...2011లో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా వున్నప్పుడు అప్పటి జీహెచ్ఎంసీ కమిషనర్ కృష్ణబాబు ఇదే అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాల తొలగింపు కార్యక్రమం చెప్పట్టారు. అప్పుడు కేసిఆర్ కుమార్తె, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత వెంటనే ఘటన స్థలానికి వచ్చి..రాజకీయ, సినీ ప్రముఖుల ఇళ్లజోలికి పోకుండా బడుగుల ఇళ్లను కూల్చివేస్తున్నారని ఆందోళనకు దీగారు. చివరకు అరెస్ట్ కూడా అయ్యారు. కానీ ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది. అప్పుడు అంత హడావుడి చేసిన కవిత ఇప్పుడు నోరు మెదపకపోవడంపై వారి మండిపడుతున్నారు. గతంలో ఇళ్లుకూల్చవద్దని అడ్డుకున్న కవితమ్మ ఇప్పుడు ఎందుకు అడ్డుకోవడంలేదని ప్రశ్నిస్తున్నారు?

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు చంద్రబాబు ప్లాన్

  ఆంధ్రప్రదేశ్‌లోకి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకట్టుకునేందుకు చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం వేగాన్ని పెంచింది. భారత దేశానికి ముంబై వాణిజ్య రాజధానిగా పేరొందిన విధంగా విశాఖను ఆంధ్రప్రదేశ్ వాణిజ్య రాజధానిగా మార్చాలన్న యోచనలో చంద్రబాబు ప్రభుత్వం ఉంది. గంగవరం పోర్టు పరిధిలో గ్యాస్ స్టోరేజ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. విదేశాల నుంచి గ్యాస్‌ను దిగుమతి చేసుకుని నిల్వ చేసే ఈ ప్లాంట్ కోసం 5,000 కోట్ల రూపాయలను పెట్టుబడి పెట్టేందుకు కొన్ని సంస్థలు ముందుకు వస్తున్నాయి. కాకినాడ వద్ద కూడా మరో గ్యాస్ స్టోరేజ్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఫ్లోటింగ్ స్టోరేజీ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఈ రెండు ప్లాంట్ల వల్ల ప్రభుత్వానికి పన్నుల ద్వారా 5000 కోట్లకు పైబడి రాబడి లభిస్తుందని ప్రభుత్వం వివరిస్తోంది. అదే విధంగా మూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితో పెట్రోలియం, కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్ ఇన్వెస్టిమెంట్ రీజియన్‌కు (పిసిపిఐఆర్) మార్గం సుగమం అయిందని చెబుతోంది.

ఐటీలో తెలంగాణను టాప్ గా నిలుపుతా౦: కేటీఆర్

      తెలంగాణ రాష్ర్టాన్ని ఐటీ రంగంలో దేశంలోనే అగ్రగామిగా నిలుపుతామని రాష్ట్ర ఐటీ, పంచాయత్‌రాజ్‌శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు స్పష్టం చేశారు. ఇవాళ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఒరాకిల్ ప్రతినిధులతో ఆయన సమావేశమైన అనంతరం మాట్లాడారు. ఐటీ రంగంలో తెలంగాణను దేశంలోనే టాప్-5గా నిలుపుతామని తెలిపారు. ఈనెల 27న హోటల్ తాజ్ బంజారాలో 150 ఐటీ కంపెనీలతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. రాబోయే ఐదేళ్లలో 15 ఏళ్లకు సరిపడా టెక్నాలజీని సమకూరుస్తామని తెలిపారు. ఈ-పంచాయతీ, ఈ-ఎడ్యుకేషన్, ఈ-హెల్త్ సేవలను మెరుగుపరుస్తామని స్పష్టం చేశారు. ఐటీఐఆర్‌కు ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకొస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో అనర్హులకు కూడా రేషన్‌కార్డులు ఉన్నాయని, ఫించన్లూ అందుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిపై సరియైన చర్యలు తీసుకుంటామని అన్నారు.

టిడిపికి రాజీనామా చేయను: ఆర్.కృష్ణయ్య

      తెలంగాణ తెలుగుదేశం ఎమ్మెల్యే, బిసి సంఘం అద్యక్షుడు ఆర్.కృష్ణయ్య టిడిపి పార్టీని వీడుతున్నట్టు వస్తున్న వార్తలను ఖండించారు. ఆయన పార్టీని వీడి వెళ్లే అవకాశం ఉందని మీడియాలో ప్రచారం జరగడంతో ఆయన దీనిపై వివరణ ఇచ్చారు. తాను తెలుగుదేశం పార్టీని వదిలి వెళ్లే ప్రసక్తే లేదని, పార్టీని వీడుతున్నట్టు వస్తున్న వార్తలు కేవలం కల్పితం మాత్రమేనని అన్నారు. టీడీపీలో తనకు ఎలాంటి ఇబ్బందులు లేవని, పార్టీ అధినేత బీసీల కోసం పాటుపడుతున్నారని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు జరిగేలా చూడాలని సీఎం కేసిఆర్ ని కోరినట్లు తెలిపారు. ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వమే ఫీజులు చెల్లించాలని కోరినట్టు చెప్పారు.

పట్టాలు తప్పిన రాజధాని ఎక్స్‌ప్రెస్: 4మృతి

      ఢిల్లీ నుంచి డిబ్రుగఢ్ వెళుతున్న రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు ఈరోజు ఉదయం బీహార్ లోని చప్రా గోల్డెన్ గంజ్ వద్ద పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. మావోయిస్టులే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని రైల్వే అధికారులు భావిస్తున్నారు. రైలు పట్టాలు తప్పడంతో 12బోగీలు పడిపోయాయి. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకొని గాయపడినవారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై స్పందించిన రైల్వేశాఖ మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించింది. అలాగే తీవ్రంగా గాయపడిన వారికి రూ. లక్ష , స్వల్పంగా గాయపడిన వారికి రూ.20 వేల పరిహారం చెల్లిస్తామని రైల్వే అధికారులు వెల్లడించారు.

తను తీసిన గోతిలో తానే పడిన జగన్

  చెడపకురా చెడేవు అన్నారు పెద్దలు. అయితే ఈ మంచిమాటను కొంత మంది చెవులకి ఎక్కించుకోకుండా ఎదుటవారి కోసం గోతులు త్రవ్వి చివరికి అందులో తామే పడతారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ మన ముందు ఒక సజీవ ఉదాహరణగా నిలిచి ఉండగా, ఈరోజు శాసనసభలో నల్లధనంపై జరిగిన చర్చలో అధికార పార్టీని ఇరుకున పెట్టబోయి జగన్మోహన్ రెడ్డి అడ్డుగా దొరికిపోయారు. జగన్, చంద్రబాబు నాయుడుపై తీవ్ర ఆరోపణలు చేస్తున్న సమయంలో ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు వేసిన ప్రశ్నలతో కాసేపు జగన్ నోట మాట రాలేదు. యనమల ఏమ్మన్నారంటే, “ఈ సభలో ఏ ఒక్క సభ్యుడయిన జైలులో 16నెలలు గడిపి వచ్చిన వారున్నారా? ఈ సభలో రూ.1100 కోట్ల ఆస్తులు ఈ.డీ. చేత జప్తు చేయబడిన సభ్యుడు ఎవరయినా ఉన్నారా? ఈ సభలో ఎవరయినా లక్ష కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారున్నారా? ఈ సభలో ఎవరయినా సీబీఐ కోర్టులో రూ.43,000 కోట్ల అక్రమార్జనపై కేసులు ఎదుర్కొంటున్న వారున్నారా?” అని ప్రశ్నల వర్షం కురిపించేసరికి జగన్ కాసేపు బిత్తరపోయారు. గవర్నర్ ప్రసంగంపై చర్చ మొదలయిన తొలిరోజునే జగన్మోహన్ రెడ్డి అధికార పక్షం నుండి ఇటువంటి అవమానకర ప్రశ్నలను ఎదుర్కొన్నప్పటికీ, మరింత అప్రమత్తంగా మెలగకపోగా రెండవరోజు కూడా అదే దూకుడు ప్రదర్శించి నిండు సభలో అవమానం పాలయ్యారు.

డిగ్గీ, అమృత పెళ్ళిపై మరదలి వెటకారం ట్విట్

  టీవీ యాంకర్ అమృతారాయ్‌తో దిగ్వింజయ్ సింగ్ సంబంధం బయటపడినప్పటి నుంచి ఆయన బంధువర్గంతో దిగ్విజయ్ సింగ్ విలువ పోయింది. అంతకుముందు వరకూ ఎంతో బిల్డప్పుగా వుండే దిగ్విజయ్ సింగ్ అంటే ఆయన బంధుగణం మొత్తం భయపడిపోయేవారు. ఇప్పుడు ఆయన్ని ఎవరూ అంతగా లెక్కచేయడం లేదు. త్వరలో దిగ్విజయ్ సింగ్, అమృతా రాయ్ పెళ్ళి పీటల మీద కూర్చోబోతున్నారంటూ దిగ్విజయ్ సింగ్ మరదలు రుబీనా ట్విట్టర్‌లో వెటకారం కామెంట్ పెట్టారు. రుబీనా శర్మ దిగ్విజయ్ సింగ్ తమ్ముడు లక్ష్మణ్ సింగ్‌కి భార్య. గతంలో లక్ష్మణ్ సింగ్ రుబినా శర్మని ప్రేమించి పెళ్ళి చేసుకున్నప్పుడు దిగ్విజయ్ సింగ్ ఆమెని ఆమోదించకుండా కుటుంబానికి దూరంగా పెట్టాడట. తమ్ముడి ప్రేమ పెళ్ళిని తీవ్రంగా వ్యతిరేకించడట. ఆ కోపాన్ని మనసులో పెట్టుకున్న రుబీనా ఇప్పుడు దిగ్విజయ్ మీద వెటకారాలు పోతోంది.