NRI టీడీపీ పోరు

  తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు కొత్త రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే రాష్ట్రాభివృద్ధికి అహర్నిహలు కష్టపడుతూ.. రాష్ట రాజధాని కోసం.. దానిలో పెట్టుబడుల కోసం చంద్రబాబు నాయుడు చాలా ప్రయత్నిస్తున్నారు. ఈ అభివృద్ధిలో తనవంతు తానుగా సాయం అందించడానికి చంద్రబాబు తనయుడు కూడా బాగానే కష్టపడ్డారు. ఏపీ రాజధానిలో పెట్టుబడుల కొరకు అమెరికా పర్యటన చేసి ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు కొన్ని కంపెనీలతో ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. అయితే ఇప్పుడు నారా లోకేష్ పర్యటన గురించి అందరూ మరిచిపోయినా లోకేశ్ NRI ట్రిప్ తరువాత ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పేరు డా. వేమూరి రవి. తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గరనుండి లోకేశ్ కు ఆంతరంగీకుడిగా ఉన్నట్టు ప్రముఖంగా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే లోకేశ్ అమెరికా పర్యటనలో క్రియాశీల పాత్ర పోషించిన ఈయన అక్కడ లోకేశ్ అన్ని కార్యక్రమాలన్నింటిని కో-ఆర్డినేట్ చేశారు. దీనిలో భాగంగానే ఇప్పుడు వేమూరి రవికి కాబినేట్ లో పదవి కట్టబెట్టే అవకాశం ఉన్నట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే కేసీఆర్ తనయుడు కేటీఆర్ కూడా అదే సమయంలో అమెరికా పర్యటన చేశారు. ఒక విధంగా చెప్పాలంటే లోకేశ్ కంటే కేటీఆర్ పర్యటనే బాగా సక్సెస్ అయిందనే వార్తలు కూడా వచ్చాయి. అయినప్పటికీ డా. రవికి కేబినేట్ హోదా కలిగిన NRI కో-ఆర్డినేటర్ అనే ఒక పదవిని కట్టబెట్టినట్టు తెలుస్తోంది.   ఇంతవరకూ బానే ఉన్నా అసలు NRI టీడీపీ స్ఠాపించిన దగ్గరనుండి దానికోసం విశ్రాంతి లేకుండా.. కష్టపడిన TANA, NATS ప్రముఖులకు మాత్రం ఇది కాస్త చేదువార్తగానే భావిస్తున్నారు. ఎందుకంటే అప్పట్లో 2007 లో చంద్రబాబు అమెరికా పర్యటనలో కాని లోకేశ్ పర్యటనలో కాని.. మొన్న ఎలక్షన్లలో వాళ్లవంతు సహకారం అందించారు. ముఖ్యంగా జైరాం కోమటి, నాదెళ్ల గంగాధర్, సతీష్ వేమన, రవి మాదాల లాంటి వారికి ఇది శరాగతంగా తగిలింది. రాజకీయంగా ఎలక్షన్స్ లో పోటీ చేయలేని వీళ్లందరికి ఇప్పటికే NRI కోటాలో పార్టీలో ఏమాత్రం సంబంధంలేని ఆనంద్ కూచిబొట్ల కేబినేట్ పదవిలో ఉండటంతో అప్పట్లో పెదవి విరిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు డా. రవికి కూడా కాబినేట్ హోదాలో పదవిని ఇవ్వడంపై కూడా అసంతృప్తి చెందే అవకాశం కనిపిస్తుంది. మరి ఈ వార్తను వారు ఏ విధంగా తీసుకొని ముందుకెళతారో చూడాలి.

చంద్రబాబును ఇరుకునపెడుతున్నారా!

  రాష్ట్ర విభజన జరిగి ఏపీ రాష్ట్రం ఆర్ధికంగా వెనుకబడటంతో ఎలాగైనా దానిని అభివృద్ధి చేయాలనే ప్రయత్నిస్తున్న చంద్రబాబుకు పార్టీ నేతలే తలనొప్పిగా తయారయ్యారా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. చంద్రబాబుకు అండగా నిలిచి రాష్ట్రాభివృద్ధిలో పాలుపంచుకోవాల్సింది పోయి.. వారు చేసే వ్యాఖ్యలవల్ల చంద్రబాబును ఇరుకునపెడుతున్నారు. మొన్నటికి మొన్న గోదావరి పుష్కరాల వల్ల జరిగిన తొక్కిసలాటలో చాలా మంది ప్రాణాలు కోల్పారు. ఇదే అదనుచూసుకొని ప్రతిపక్షనేతలు అందుకు కారణం చంద్రబాబు అంటూ విమర్శల మీద విమర్శలు చేశారు. దీనిమీద నేషనల్ మీడియాలో చర్చ జరిగినప్పుడు పార్టీ నేతలు సరైన సమాధానం కూడా చెప్పలేక చెమటలు కక్కారు. దీంతో చంద్రబాబు నేతలమీద అసంతృప్తి చెంది ఇక నుండి ఆంగ్ల మీడియాతో మాట్లాడే బాధ్యతను గల్లా జయదేవ్ కు అప్పగించారు.   ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి కూడా అదే జరుగుతుంది. ఒకవైపు కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది. దీంతో ఎప్పటినుండో ఆశలు పెట్టుకొని ఎదురుచూస్తున్న ఏపీ ప్రజల ఆశల మీద నీళ్లు చల్లినంత పనిచేసింది. అయితే కేంద్రం చెప్పినా కూడా చంద్రబాబు సహా పలువురు ప్రత్యేకహోదా గురించి మళ్లీ ప్రయత్నిస్తామని.. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేంతవరకూ పోరాడతామని.. ఎలాగైనా ప్రత్యేక హోదా సాధిస్తామని చెపుతుంటే అదే పార్టీ నేత అయిన జేసీ దివాకర్ రెడ్డి మాత్రం ఏపీకి ప్రత్యేక హోదా రాదు అని చెప్పడం.. రాయపాటి కూడా మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా గురించి ఇంకేం చేయాలి బట్టలు ఊడదీసుకొని తిరగాలా అనడం ఇవన్నీ పార్టీని ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలే. ఒకే పార్టీలో ఉండి పార్టీకి విరుద్ధంగా వారు చేసే వ్యాఖ్యలు అటు పార్టీనే కాదు.. చంద్రబాబును కూడా ఇరుకునపెడుతున్నాయి. తాము చేసే వ్యాఖ్యలు ప్రతిపక్ష పార్టీలకు ఆయుధాలుగా మారుతాయి అన్న ఆలోచన కూడా లేకుండా వారు మాట్లాడటం గమనార్హం. కాబట్టి ఇప్పటికైనా తెదేపా నేతలందరూ ఒకే మాట మీద ఉండి ప్రత్యేక హోదా సాధించుకుంటే మంచిది. లేకపోతే ఇలాంటి విరుద్దమైన వ్యాఖ్యలవల్ల ఇతర పార్టీలు రెచ్చిపోయే ప్రమాదం ఉంటుంది.

పేదవారి ముఖాల్లో వెలుగు చూడాలి.. చంద్రబాబు

  ఏపీ సీఎం చంద్రబాబు విశాఖపట్న జిల్లా 'మీ ఇంటికి మీ భూమి' అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల భూమిని వారికి అందించాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని అన్నారు. కాగా రాష్ట్రంలో పేదవారి ముఖాల్లో వెలుగు చూడాలని.. పేదవారికి న్యాయం జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. పేదవారికి సంక్షేమ కార్యక్రమాలు అందడంలో దళారుల ప్రమేయం ఉండకూడదని స్పష్టం చేశారు. అంతేకాక రుణమాఫీ కోసం రూ. 25 వేల కోట్లు వెచ్చించామని తెలిపారు. ఉద్యోగులకు అన్నివిధాలా మేలు చేస్తామని.. ఉద్యోగులు అవినీతి రహితంగా పనిచేయాలని సూచించారు. ఎవరైనా తప్పుడు పనులు చేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. కాగా రాష్ట్రవిభజన వల్ల ఏపీ ఆర్ధికంగా బాగా దెబ్బతిందని.. దీనికి సహాయపడేందుకు కేంద్రం ఉందారంగా ముందుకు రావాలని కోరారు.

వారికోసం వీళ్లేందుకు బలవ్వాలి?

  పరిస్థితులు ఎలాంటివైనా ఆఖరికి ఆ పరిస్థితులకు సామాన్య ప్రజలే బలవ్వుతున్నారడంలో ఎలాంటి సందేహం లేదు. రాజకీయాల్లో ప్రవేశించి.. ప్రజలకు మంచి పనులు చేసినా చేయకపోయినా పదవులు అనుభవిస్తున్న రాజకీయ నాయకులు ఎంతో దర్జాగా కాలం గడుపుతుంటే వారి రాజకీయాలకు యువకులు బలవ్వడం బాధాకరమైన విషయం. నాడు రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ రాష్ట్ర వచ్చిందంటే దానికి కారణం ఎంతో మంది యువకులు పోరాట పటిమనే కారణం. అసలు ఆ యువత లేకపోతే కేసీఆర్ అనే వ్యక్తి అసలు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించే వారు కాదేమో.. ప్రత్యేక రాష్ట్రం వచ్చుండేది కాదేమో. అప్పుడు కూడా తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది యువకులు తమ ప్రాణాలు బలిదానాలు చేశారు. కానీ అమరవీరులు అన్న పేరు తప్ప వారికి ఇంకే లభించింది.. కనీసం వారి కుటుంబాలను సరిగా ఆదుకునే సమయం కూడా నేతలకు లేకుండా పోయింది.   ఇప్పుడు ఏపీ ప్రత్యేక హోదా విషయంలో కూడా ప్రాణ త్యాగాలు మొదలయ్యాయి. కేంద్రం ఏపీకీ ప్రత్యేక హోదా ఇవ్వనని చెప్పిన నేపథ్యంలో రాష్ట్రంలో ఆందోళనలు మొదలయ్యాయి. కానీ మునికోటి ఆత్మహత్యాయత్నంతో అది తారాస్థాయికి చేరింది. తన ఆత్మహత్యతో ఉద్యమానికి ఆహుతైన మొదటి ప్రమిదగా మారాడు. పదేళ్ల హయాంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామంటూ.. తమ పార్టీ ప్రయోజనాల కోసం అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించింది. అప్పట్లో బీజేపీ కూడా పదేళ్లపాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్పింది. కాలంతో పాటు మాటలు కూడా మారిపోతాయన్నట్టు అప్పుడు ఇస్తామని చెప్పినా ప్రభుత్వమే ఇప్పుడు ఇవ్వనని.. తేల్చిచెప్పేయడం.. మరోవైపు రాష్ట్రాన్ని విడదీసిన పాపం పొగట్టుకునేందుకు చాలా ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని మొసలి కన్నీరు కార్చడం.. ఇవన్నీ రాజకీయాల్లోనే సాధ్యం. వారు చేసే దొంగ రాజకీయాలకు సామాన్య ప్రజలు బలవ్వడం ఎంత వరకూ సమంజసమో వారే ఆలోచించుకోవాలి. అధికారంలోకి రావడానికి ఇష్టమొచ్చినట్టు హామీలు ఇచ్చే నేతలకు అధికారంలోకి వచ్చిన తరువాత కాని ఆ హామీలు నేరవేర్చడం అసాధ్యమని తెలియదుకాబోలు.   మొత్తానికి ఏదేమైనా అందరూ బానే ఉన్నా రాజకీయ నాటకాలలో యువకులు బలవ్వడం మాత్రం దురదృష్టకరమైన అంశం. అసలు వారికోసం వీళ్లేందుకు బలవ్వాలి.. యువత ఎందుకు ప్రాణాలు అర్పించాలి. ఇప్పుటికైనా ముని కోటి మరణంతో మన నేతలు కళ్లు తెరిచి నాటకాలాడకుండా నిజాయితీగా పోరాడితే ప్రత్యేక హోదా సాధించవచ్చు. ఇంకా ముందుముందు జరగబోయే దారుణాలను అడ్డుకోవచ్చు.

నేడు తిరుపతిలో మునికోటి అంత్యక్రియలు

  తిరుపతిలో మునికోటి అంత్యక్రియలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కాంగ్రెస్ కార్యకర్త మునికోటి కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించాడు. దీంతో ఆయనను చెన్నైలోని ఆస్పత్రికి తరలించగా మృతిచెందాడు. కాగా ఈ రోజు సాయంత్రం తిరుపతిలో మునికోటి అంత్యక్రియలు జరగనున్నాయి. ఏపీ పీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి మునుకోటి మృతదేహాన్ని తీసుకురావడానికిగాను చెన్నై వెళ్లారు. ఈ అంత్యక్రియల కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొననున్నారు.   మరోవైపు మునికోటి మృతి నిమిత్తం బంద్ కు పిలువునిచ్చారు. ఈ బంద్ లో కాంగ్రెస్ పార్టీలు.. వామపక్షాలు పాల్గొన్నాయి. సినిమా థియేటర్లు, వాణిజ్య వ్యాపార, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్‌ పాటిండంతో తిరుపతిలో ప్రశాంతంగా బంద్ కొనసాగుతోంది. అయితే దేవుని దర్శార్ధం తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని.. వారి ప్రయాణించే బస్సులను రాకపోకలను అడ్డుకోవద్దని పార్టీ నేతలు నిర్ణయించారు. రాష్ట్ర విభజన వల్ల ఏపీ ఆర్ధికంగా చాలా నష్టపోయిందని.. ఇలాంటి పరిస్థితిల్లో ఏపీకి ప్రత్యేక హోదా అవసరమని.. ఉద్యమం ద్వారనే ప్రత్యేక హోదాను సాధించాలని కాంగ్రెస్‌ నేతలు పేర్కొన్నారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పిలుపు ఇస్తామని.. దీనిపై చర్చించి ఈ రోజు సాయంత్రం లోపు అధికారికంగా ప్రకటిస్తామని సీపీఐ నేతలు తెలిపారు.

చెన్నైలో మృతి చెందిన మునికోటి

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ కాంగ్రెస్ పార్టీ తిరుపతిలో నిన్న నిర్వహించిన బహిరంగ సభలో ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్యా ప్రయత్నం చేసిన ముని కామకోటి ఆదివారం మధ్యాహ్నం చెన్నైలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మృతి చెందాడు. అతను తిరుపతిలో మంచాల వీధికికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త. గంగమ్మ తల్లి జాతర కమిటీలో సభ్యుడుగా కూడా ఉండేవాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి, వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తదితరులు అతని మృతికి సంతాపం తెలిపారు. ఈ పరిస్థితుల్లో ప్రత్యేక హోదా గురించి మాట్లాడకుండా తనను తాను నిగ్రహించుకొంటున్నట్లుగా పవన్ కళ్యాణ్ ట్వీట్ మెసేజ్ పెట్టారు.

ప్రత్యేక హోదా కోసం యువకుడు ఆత్మహత్య ప్రయత్నం

  ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఈరోజు తిరుపతిలో నిర్వహించిన ఒక బహిరంగ సభలో విషాదం చోటు చేసుకొంది. కాంగ్రెస్ పార్టీకే చెందిన కోటి అనే ఒక వ్యక్తి మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి ప్రసంగిస్తున్న సమయంలో సభ వేదిక కి కొద్ది దూరంలో నిలబడి తన ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య ప్రయత్నం చేసాడు. వెంటనే చుట్టూ ఉన్నవారు మంటలు ఆర్పి అతనిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి చాలా విషమంగా ఉందని, మరో మూడు రోజులు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమని వైద్యులు తెలిపారు. సుమారు 50 శాతం కాలిన గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు.   పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి సభలో మాట్లాడుతూ, ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న సమయంలో ఇటువంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరమని అన్నారు. ఇకపై ప్రత్యేక హోదా కోసం ఎవరూ కూడా ఇటువంటి ప్రయత్నాలు చేయవద్దని ప్రజలను కోరారు. ప్రశాంతంగా ప్రజాస్వామ్యబద్దంగా ఉద్యమించి ప్రత్యేక హోదా సాధిద్దామని ఆయన అన్నారు. ఈ సభ ముగియగానే ఆ యువకుడిని అవసరమయితే చెన్నై లేదా వేలూరుకి తరలించి ఇంకా మంచి వైద్యం అందించుతామని ప్రకటించారు.

జగన్ దీక్ష అక్కడ చేయాలి

  కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో వైఎస్సార్ పార్టీ అధ్యక్షుడు జగన్ కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం పై ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్న చేపట్టనున్నారు. ఇప్పుడు ఈ విషయంపై టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు జగన్ పై మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం జగన్మోహన్ రెడ్డి దీక్ష చేయడం విడ్డూరంగా ఉందని.. ఒక వేళ దీక్ష చేయాలనుకుంటే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇంటి ముందు చేసుకోవాలని విమర్శించారు. ఎప్పుడూ విమర్శించే పని తప్ప కనీసం రాష్ట్రం విభజించేటప్పుడు సీఎం చంద్రబాబు అభిప్రాయాలు పరిగణలోకి తీసుకున్నారా.. పైగా ఇప్పుడు విమర్శలు గుప్పించడం అనైతికం అని మండిపడ్డారు. అసలు ప్రత్యేక హోదాను బిల్లులోనే పెట్టకపోవడం దారుణమని గాలి మండిపడ్డారు. కానీ ఏపీకి ప్రత్యేక హోదా సాధించడానికి టీడీపీ ప్రయత్నిస్తూనే ఉందని చెప్పారు.

రాష్ట్రపతి ప్రణబ్ భార్య ఆరోగ్యం విషమం..!

  రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ భార్య సువ్రా ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రి అధికారులు తెలిపారు. సువ్రా ముఖర్జీ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దానికి తోడు ఆమె హార్ట్ పేషంట్. అయితే శుక్రవారం ఆమె శ్వాసక్రియకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్న నేపథ్యంలో ఆమెను ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నామని.. కానీ ఆమె పరిస్థితి కొంచెం విషమంగా ఉందని ఆసుపత్రి అధికార ప్రతినిధి ఒకరు వివరించారు. దీంతో విషయం తెలుసుకున్న ప్రణబ్ ముఖర్జీ ముఖర్జీకి విషయం తెలిసిన వెంటనే ఒడిశా పర్యటనను ముగించుకొని ఢిల్లీకి చేరుకున్నారు.

చిరంజీవి 150 సినిమాకి సిద్ధమయ్యారా?

  మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రానికి సిద్ధమయ్యారా అంటే అవుననే వార్తలే వినిపిస్తున్నాయి. ఈనెల 22వ తేదీన చిరంజీవన తన బర్త్‌డే జరుపుకోనున్న నేపథ్యంలో ఆయన ఫోట్ షూట్ జరిగింది. అలా చిరంజీవి కొత్తగా దిగిన ఫోటోలు విడుదలైన నేపథ్యంలో అందరికీ సందేహాలు వస్తున్నాయి. ఎందుకంటే ఈ ఫోటోల్లో చిరంజీవి అంత బావున్నారు మరి. ఎప్పుడూ రాజకీయ లుక్ తో కనిపించే చిరూ ఇప్పుడు ఈ ఫోటోల్లో మొత్తం ఢిపరెంట్ లుక్ తో.. ఫుల్ హీరో లుక్ తో కనిపించారు. దీంతో చిరంజీవి 150వ సినిమాకు చిరూ సిద్దమౌతున్నాడని అనుకుంటున్నారు. ఈ విషయంలో తన బర్త్‌డే రోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

వారి మాటల్లో అర్ధమయింది.. జేసీ

  కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదంటూ చెపుతుంది. దీనిపై ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఆందోళనలు మొదలయ్యాయి. ఇదిలా ఉంటే ఇంకా ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందన్న నమ్మకం ఉందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అంటున్నారు. రాష్ట్ర విభజన జరిగిన తరువాత ఆంధ్ర రాష్ట్ర ఆర్ధికంగా చాలా దెబ్బతిందని.. అయినా కూడా అభివృద్ధిపై దృష్టి పెట్టామని, అభివృద్ధి కోసం అప్పులు కూడా చేస్తున్నామని చెప్పారు.   మరోవైపు ఏపీ ప్రత్యేక హోదాపై తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు జెసి దివాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా రాదని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిషాత్, ప్రధాని నరేంద్ర మోడీ, హోం శాఖ మంత్రి రాజనాథ్‌ సింగ్‌ తో మాట్లాడినప్పుడు వారి మాటల్లో ఏపీకి ప్రత్యేకహోదా రాదన్న విషయం అర్ధమయిందని.. అయితే వారికి రాష్ట్రంపై సానుభూతి ఉందని.. రాష్ట్రాభివృద్దికి కేంద్రం డబ్బులిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

దీపక్‌మిశ్రాకు బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనం

  ముంబై వరుస పేలుళ్ల కేసులో నిందితుడైన యాకుబ్ మెమెన్ ను ఉరి తీసిన సంగతి తెలిసిందే. ఇక్కడి వరకూ బానే ఉన్నా ఇప్పుడు యాకుబ్ మెమెన్ కు శిక్ష వేసిన జడ్డి సుప్రీంకోర్టు జడ్జి దీపక్‌మిశ్రాకు అసలు చిక్కు వచ్చిపడింది. యాకుబ్ మెమెన్ క్షమాభిక్ష కోరుతూ పిటిషన్ వేసిన నేపథ్యంలో అతని పిటిషన్ ను న్యాయమూర్తులు కొట్టిపారేశారు. దీంతో యాకుబ్ మెమెన్ కు ఉరిశిక్ష వేశారు. అయితే యాకుబ్ మెమెన్ పిటిషన్‌ను కొట్టివేసిన న్యాయమూర్తుల్లో దీపక్‌ మిశ్రా ఒకరు.దాంతో ఇప్పుడు జస్టిస్‌ దీపక్‌ మిశ్రా ఇంటికి బెదిరింపు లేఖలు వస్తున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఎంత భద్రత ఏర్పాట్లు ఉన్నా వదిలిపెట్టబోమని లేఖలో పేర్కొన్నారు. మరోవైపు యాకుబ్ మెమెన్ సోదరుడు టైగర్ మెమెన్ కూడా తన సోదరుడి ఉరితీతకు ప్రతీకారం తీర్చుకుంటానని హెచ్చరించాడు.దీంతో దీపక్‌మిశ్రా ఇంటి దగ్గర గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాన్ని సమర్పించారు.

మీడియానే సమస్యలు సృష్టిస్తోంది.. నరసింహన్

  ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోయల్‌తో సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి సమస్యలు లేవని తెలిపారు. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో విద్యుత్ ఉద్యోగుల మధ్య వివాదాలు జరుగుతున్నాయి.. కానీ త్వరలోనే విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. అనవసరంగా మీడియానే మరీ ఎక్కువగా చూపిస్తుందని.. రెండు రాష్ట్రాల్లో సమస్యలు సృష్టిస్తుందని వ్యాఖ్యానించారు. అనంతరం ఆయన కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలుసుకున్నారు. గవర్నర్ నరసింహన్ పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. కాగా గవర్నర్ నరసింహన్ పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు.

కష్టాలంటే సోనియాకు రాహుల్ కు తెలుసా?

  లలిత్ మోదీ వ్యవహారంలో సుష్మా స్వరాజ్, వసుంధరా రాజేలు రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు గట్టిగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుష్మా స్వరాజ్ తను కేవలం మానవత్వంతో లలిత్ మోదీ భార్య క్యాన్సర్ తో బాధ పడుతున్న నేపథ్యంలో ఆమెకు సహాయం చేశానని.. అంతే కాని వేరే ఉద్దేశం లేదని.. అది కూడా మోడీకి వీసా ఇవ్వగలిగితేనే ఇవ్వమని బ్రిటన్ ప్రభుత్వానికి సూచించానని సమాధానమిచ్చారు. అదే నా స్థానంలో సోనియాగాంధీ ఉన్నా అలా చేసేవారు కాదా? అని ప్రశ్నించారు. అయితే దీనికి సోనియాగాంధీ.. సుష్మా మాటల గారడిలో దిట్ట అని.. బాగా నటించారని.. అదే తన స్థానంలో ఉంటే డబ్బు సాయం చేసేదాన్ని అంతే కాని చట్ట విరుద్దమైన పనులు చేసే దాన్ని కాదని సమాధానమిచ్చారు.   మరోవైపు దీనిపై అమ్మకూచి రాహుల్ గాంధీ కూడా స్పందించి తన తల్లి ఎన్నడూ అటువంటి తప్పు చేయదని అన్నారు. ఇదిలాఉండగా సుష్మాస్వరాజ్ పై చేసిన వ్యాఖ్యలను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ తప్పుబట్టారు. సుష్మాస్వరాజ్ చాలా సాధారణమైన కుటుంబం నుండి ఎన్నో కష్టాలు పడి.. ఎండకు ఎండి వానకు తడిసి ఇప్పుడు ఇలాంటి ఉన్నతస్థానంలో ఉన్నారని.. అలాంటి సుష్మా పై ఇలాంటి వ్యాఖ్యలు తగవని అన్నారు. సోనియా గాంధీ కాని రాహుల్ గాంధీలు ఉన్నత కుటుంబాల నుండి వచ్చారు కాబట్టి వాళ్లకు కష్టాలంటే ఏంటో తెలియదని.. ఎండ అంటే ఎంటో వాళ్లకు తెలుసా అని మండిపడ్డారు. ఏదో రాజకీయ వారసత్వం వల్ల ఎలాంటి కష్టాలు పడకుండానే వంశపారంపర్య రాజకీయాలు చేస్తున్న సోనియాగాంధీ, ఆమె తనయుడు రాహుల్ గాంధీకి సుష్మాపై ఆరోపణలు చేయడానికి తగరని ఆరోపించారు.

చనిపోయిన భార్యతో 5 సంవత్సరాలుగా

  నిజ జీవితంలో కాని, సినిమాల్లో కాని మనం చాలా ప్రేమ కథలు చూసుంటాం. అలాంటి ప్రేమ చాలా స్వచ్చమైనది.. ఎవరూ మరువలేనిది.. విడదీయలేనిది. కానీ ఇక్కడ ఓ భర్త భార్య మీద చూపించిన ప్రేమ అందరిని భయభ్రాంతులకు గురి చేసింది. అంతలా ఆ భర్త ఏ ప్రేమ చూపించాడనేగా మీ డౌట్.. ఈ సంఘటన చూస్తే మీకు కూడా అదే పరిస్థితి వస్తుంది. ఈ సంఘటన వియత్నంలో జరిగింది. వియత్నంలోని క్వాంగ్ నామ్ ప్రావిన్స్ వద్ద 55 ఏళ్ల ఓ వ్యక్తి భార్య చనిపోయింది. అయితే అతను మాత్రం తన భార్య చనిపోవడం ఏ మాత్రం తట్టుకోలేక పోయాడు. తన భార్యతో తాను కూడా చనిపోదామా అనుకుంటే తనకు కొడుకు ఉండటంతో అటు చావలేక బ్రతలేక తన భార్య సమాధివద్దనే దాదాపు రెండు సంవత్సరాలు గడిపాడు. అయితే ఇక్కడే ట్విస్ట్ ఉంది.. అలా ఎంతకాలం సమాధి దగ్గర ఉండాలనుకున్నాడేమో అతను తన భార్య సమాధి తవ్వి ఆమె హస్తికలు ఇంటికి తీసుకొచ్చి వాటిని కాగితం మట్టితో అచ్చు శరీరంలా తయారు చేసి ముఖానికి మాస్క్, ఇంకా డ్రస్స్ కూడా వేశాడు. అలా ఐదు సంవత్సరాలుగా అతను.. తన కొడుకు కూడా చనిపోయిన తన భర్య పక్కనే పడుకుంటున్నారట. ఒక పక్క భయం వేసిన మరోపక్క అతను చేసిన పని అతని భార్యపై ఉన్న ప్రేమ ఎంతో గొప్పదో కనిపిస్తుంది.  

ఆ కాల్‌డేటా కూడా మాకు పంపండి.. హైకోర్టు

  ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సర్వీసు ప్రొవైడర్లు కాల్ డేటాను విజయావాడ కోర్టుకు సమర్పించిన సంగతి తలిసిందే. హైకోర్టు కూడా విజయవాడ కోర్టుతో పాటు మాకు కూడా ఓ ప్రత్యేక మెసెంజర్ ద్వారా పంపించమని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ పై వొడాఫోన్, టాటా టెలీ సర్వీసెస్‌ సంస్థల కాల్‌డేటాను సీల్డ్‌ కవర్లలో ఇవ్వాలన్న విజయవాడ కోర్టు ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ హోంశాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌ మిశ్రా హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు విచారణ జరిపింది. తెలంగాణ ప్రభుత్వ తరపు న్యాయవాది మాట్లాడుతూ వొడాఫోన్‌, టాటా టెలీ సర్వీసులు ప్రతివాదులుగా లేవని... అందవల్ల వాటికి సంబంధించిన కాల్ డేటా సీల్డ్ కవర్ లో ఇవ్వాల్సిన అవసరం లేదని వాదించారు. అయితే ఏపీ తరపు న్యాయవాది మాట్లాడుతూ గతంలో ఇదే తరహా వ్యాజ్యంపై హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విధంగానే ఇప్పుడు కూడా చేయాలని కోరారు. అయితే ఇద్దరు వాదనలు విన్న హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలే ఈ వ్యాజ్యంలోనూ వర్తించేలా మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. వొడాఫోన్‌, టాటా టెలీ సర్వీసు సంస్థలు కాల్‌డేటా సీల్డు సీల్డు కవర్లను ప్రత్యేక దూతద్వారా హైకోర్టుకు తరలించి జ్యుడీషియల్‌ రిజిస్ర్టార్‌ వద్ద భద్రపర్చాలని స్పష్టం చేసింది.

అయినా కష్టాలేనా..

  ‘‘మీకు అండగా నేనుంటా'' ఇవి కాంగ్రెసపార్టీ ఉపాధ్యక్షుడు పలికిన మాటలు. ఈ మాటలు ఎవరితో చెప్పారనుకుంటున్నారా.. తెలంగాణ ఓయూ విద్యార్ధులతో.. అయితే కేవలం తమ పార్టీ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ పార్టీ ఒకటిగా ఉన్న రాష్ట్రాన్ని రెండుగా చీల్చిందని రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఎవరికైనా అర్ధమవుతుంది. అయితే ఈ రాష్ట్ర విభజన వల్ల అటు ఆంధ్రా రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి సరైన రీతిలో బుద్ధిచెప్పినా.. తెలంగాణ రాష్ట్ర ప్రజలు మాత్రం సోనియా గాంధీని ఓ దేవతలా పొగిడారు. సోనియాగాంధీనే తెలంగాణను ఇచ్చిందని.. సోనియా గాంధీ వల్లే తెలంగాణ వచ్చిందని ప్రశంసలు కురిపించారు. నాటి నుండి నేటి వరకు కూడా కేసీఆర్ కు సోనియాగాంధీ అంటే కాస్తంత గౌరవమే ఉంటుంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీనే కేసీఆర్ పై పోటీ పడటానికి బరిలోకి దిగారు.     ఉస్మానియా విద్యార్ధులు ఢిల్లీలో రాహుల్ గాంధీ, తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క, మాజీ మంత్రి డీకే అరుణ, ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌, ప్రతినిధులు అద్దంకి దయాకర్‌, శ్రావణ్‌లతో కలిసి భేటీ అయ్యారు. ఉస్మానియాలో జరగనున్న విద్యార్ధి ఆత్మగౌరవ సభకు హాజరుకావాలని వారు రాహుల్ గాంధీని ఆహ్వానించగా అందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. అయితే ఓయూ భూముల విషయంలో కేసీఆర్ కు, విద్యార్ధులకు మధ్య వివాదాలు జరుగుతున్న నేపథ్యంలో విద్యార్ధులు కేసీఆర్ తీరుపై ఫిర్యాదు చేయడంతో దీనికి స్పందించిన రాహుల్ గాంధీ.. కేసీఆర్ పై పోరాడండి మీతో నేనుంటా అని భరోసా ఇచ్చారంట. అంతేకాదు ఇంకా చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంతో పోరాడి రాష్ట్రాన్ని సాధించిన వారిలో మొదటి పాత్ర మీదేనని.. అదే విధంగా ప్రజా సమస్యలపై కూడా పోరాడండి అంటూ విద్యార్ధులతో చెప్పినట్టు తెలుస్తోంది. అంతేకాదు పనిలో పనిగా కేసీఆర్ పై కూడా విమర్శల బాణాలు విసిరారు రాహుల్.. తెలంగాణ సీఎం కేసీఆర్ నిరంకుశత్వాన్ని ఇక ఎంతమాత్రం సహించొద్దని... కేసీఆర్ లో నిరంకుశతత్వ లక్షణాలు ఎక్కువని ఎద్దేవ చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డా కూడా ఇంకా కష్టాలేనా? ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన విద్యార్థుల గోడే కేసీఆర్ కు పట్టడం లేదా ప్రశ్నించారు.   మొత్తానికి రాహుల్ గాంధీ అందరిపై పోరాడటానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. విశ్రాంతి పేరిట కొంత కాలం మాయమైన రాహుల్ గాంధీ తరువాత బయటికి వచ్చి రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నట్టు.. పోరాట పటిమ పెరిగినట్టు తెలుస్తోంది. దీంతో రాహుల్ గాంధీ పై ఉన్న అముల్ బేబి అనే బ్రాండ్ పోవడం ఖాయమని అందరూ అనుకుంటున్నారు.

సినిమా రంగం కీలక పాత్ర పోషిస్తుంది.. మోదీ

  భారత ప్రధాని నరేంద్ర మోదీ చెన్నైలోని మద్రాస్ యూనివర్శిటిలో జరిగిన జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొన్నారు. ఈయనకు ముఖ్యమంత్రి జయలలిత ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినిమాతారలకు పిలుపునిచ్చారు. సినిమా తారలు. యువత చేనేత ఉత్పత్తులు వాడాలని.. చేనేత వస్త్రాలను వాడాలని సూచించారు. సినిమా రంగం ప్రచారం కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తుందని.. సినిమా తారల వల్ల ఎక్కువ ప్రాచుర్యం పొందుతాయని అన్నారు. తాము నటింటే సినిమాల్లో చేనేత వస్త్రాలు ధరించడంవల్ల ప్రజల దృష్టిని ఆకర్షించవచ్చని తెలిపారు. ప్రస్తుతం యువత ఆన్ లైన్ షాపింగ్ పై ఎక్కువ మక్కువ చూపిస్తున్నారని కాబట్టి చేనేత ఉత్పత్తులకు కూడా ఆ సదుపాయం కల్పించాలని కోరారు.

ఆ హామీ ఇస్తే సస్పెండ్ ఎత్తివేస్తాం.. వెంకయ్యనాయుడు

  పార్లమెంట్ సమావేశాలు మొదలైన దగ్గరనుండి కాంగ్రెస్ నేతలు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. వీళ్ల ఆందోళనలతో పార్లమెంట్ అట్టుడికిపోతుంది. లలిత్ మోదీ విషయంలో సుష్మా స్వరాజ్, వసుంధరా రాజేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే సమావేశాలు ప్రారంభమైన వెంటనే స్పీకర్ పోడియం దగ్గరకు వెళ్లి ఆందోళనలు చేపట్టారు. దీంతో స్పీకర్ 25 కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేశారు. దీంతో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ.. ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు పార్లమెంట్ ఆవరణలో నిరసన చేస్తూనే ఉన్నారు. అయితే దీనిపై పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి వెంకయ్యనాయుడు స్పందించారు. దీనిపై వెంకయ్యనాయుడు మాట్లాడుతూ సస్పెన్షన్‌ ఎత్తివేసేందుకు ప్రభత్వం సిద్ధంగా ఉందని.. సస్పెన్షన్‌ ఎత్తివేయడంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని.. సభ సజావుగా సాగనిస్తామని హామీ ఇస్తే కాంగ్రెస్‌ సభ్యులపై సస్పెన్షన్‌ వేటు ఎత్తివేస్తామని అన్నారు.