మోదీ ఫోన్ చేశారు.. 15 తర్వాత రమ్మన్నారు.. చంద్రబాబు

  ఏపీ ప్రత్యేక హోదాపై ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్లు మాట్లాడుతున్నారు. ఇప్పటికే కేంద్ర ఏపీకీ ప్రత్యేక ఇవ్వడం కుదరదని చెప్పింది. దీంతో ఏపీలో ఆందోళనలు, నిరసనలు మొదల్యయ్యాయి. మరోవైపు ఏపీకీ ప్రత్యేక హోదా ఇవ్వాలని మునికోటి ఆత్మహత్యతో ఈ వివాదం ఇంకా ముదిరింది. కొంత మంది నేతలు ఏపీకి ప్రత్యేక హోదా రాదు అని కుండ బద్దలు కొట్టినట్టు చెపుతుంటే మరోవైపు కొంతమంది నేతలు ఏపీకి ప్రత్యేక హోదాకోసం తప్పకండా పోరడతామని.. ఎలాగైనా ప్రత్యేక హోదా సాధించి తీరుతామని చెపుతున్నారు. ఈ మాటలకు అందరి పరిస్థితి ఎలా ఉన్నా ఏపీ ప్రజల పరిస్థితే అయోమయంలో పడింది.   దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు కూడా కేంద్రం పై మండిపడినట్టు వార్తలు వినిపించాయి. దీనిలో భాగంగానే చంద్రబాబు ‘ప్రత్యేక హోదా విషయంలో ఏం జరుగుతుందో ప్రజలకు వాస్తవాలు తెలియజేయాల్సిన బాధ్యత నాపై ఉందని అన్నారు. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరలతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా గురించి ప్రధాని మోదీ తనకు ఫోన్ చేసి మాట్లాడారని.. అప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా విషయం గురించి చెప్పానని.. రాష్ట్రంలోని సమస్యలు గురించి ఆయనకు వివరించానని.. ఆయనకు ఆయనకు నా ఆవేదన తెలియజేశానని చెప్పారు. ఈ నెల 15 తర్వాత ఢిల్లీకి రమ్మన్నారని.. కూర్చుని మాట్లాడుకుందాం’ అని మోదీ అన్నారని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఒక్క సమస్య గురించే కాదని అనేక సమస్యల గురించి ప్రధానితో కాని.. కేంద్ర మంత్రులతో కాని చర్చిస్తునే ఉన్నానని చెప్పారు. కొంతమంది ప్రత్యేక హోదా ఒక్కటే వస్తే చాలని మభ్య పెడుతున్నారని, కానీ అదొక్కటే వస్తే సరిపోదని, విభజన బిల్లులో పేర్కొన్నవన్నీ సాధించుకోవాల్సి ఉందన్నారు.

ఇప్పుడు ఏం చేసి ఏం లాభం

  పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ రోజుతో ముగినయనున్నాయి. అసలు ఈ సమావేశాలు ప్రారంభమైన తరువాత పార్లమెంట్లో కాంగ్రెస్ నేతల ఆందోళనలు తప్ప ఇంకేం జరగలేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏ విషయాలు చర్చకు రాలేదు. కనీసం ఏపీ నేతలు ప్రత్యేక హోదా గురించి పార్లమెంట్లో చర్చించే అవకాశం కాని.. తమ రాష్ట్ర సమస్యలు గురించి కాని విన్నపించుకునే సమయం కూడా ఇవ్వలేదు కాంగ్రెస్ నేతలు . సభ అలా మొదలవుతుందో లేదో ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఆందోళనలు మొదలుపెట్టేవారు. అసలు మోదీ పార్లమెంట్ సమావేశాలు ప్రాంభమయ్యేముందు ఏర్పాటు చేసిన అఖిలపక్ష భేటీ సమావేశంలోనే కాంగ్రెస్ నేతలు తేల్చిచెప్పారు.. లలిత్ మోదీ విషయంలో సుష్మా స్వరాజ్, వసుంధరా రేజేలు రాజీనామా చేయాలని లేకపోతే సభ సజావుగా సాగనివ్వమని తేల్చి చెప్పారు. అన్నట్టుగానే మాట మీద నిలబడి సభ సజావుగా సాగనివ్వకుండా రభస రభస చేశారు.   అయితే ఒక రకంగా పార్లమెంట్ సమావేశాలు అలా జరగడానికి.. కాంగ్రెస్ నేతలు అలా రెచ్చిపోవడానికి కారణం ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అని చెప్పుకోవచ్చు. సెలవులు అంటూ కొన్ని రోజులు అజ్ఞాతంలోకి వెళ్లిన రాహుల్ గాంధీ ఇప్పుడు ప్రతిపక్షాలమీద చాలా ధీటుగా విరుచుకుపడుతున్నారు. తనను విమర్శించే వాళ్లకు సమాధానం చెప్పాలని ఈ రకంగా చేస్తున్నారన్న వార్తలూ వినిపిస్తున్నాయి. మోదీ ముందు తనెంత అని విమర్శించే వాళ్లకు తను కూడా ఏం తక్కువ కాదని చూపించాలనుకుంటున్నారేమో కాని మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు, నిరసనలు చేస్తునే ఉన్నారు. ఇప్పటికే పర్యటనలు పేరిట పాదయాత్రలు కూడా చేస్తున్నారు.   దీనిలో భాగంగానే ఇప్పుడు మళ్లీ తెలంగాణ పర్యటనపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఈ విషయంపై కాంగ్రెసు తెలంగాణ సీనియర్‌ నేత వి. హనుమంతరావు కూడా చర్చించినట్టు సమాచారం. పర్యటన తేదీలను త్వరగా ఖరారు చేస్తే జిల్లాల్లో తిరిగి విద్యార్థుల్ని చైతన్యపరుస్తామని వీహెచ్‌ చెప్పారట. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వమని కేంద్రం చెప్పిన నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ ఆంధ్రాలో ధర్నా చేయాలని రాహుల్‌ గాంధీకి వి. హనుమంతరావు సూచించారట. ప్రత్యేక హోదా కోసం ఇప్పటికే ఏపీలో ప్రజలు ఆందోళనలు చేస్తున్నారని.. వారిక మద్ధతిస్తూ ఏపీలో ఏదో ఒక ప్రదేశంలో ఉదయం నుండి సాయంత్రం వరకూ ధర్నా చేయాలని చెప్పారట. విహెచ్ ప్రతిపాదనకు రాహుల్ కూడా ఒప్పుకున్నారట. మొత్తానికి రాహుల్ గాంధీ ఏదో ఒక విధంగా ప్రజలలో పేరు సంపాదించుకోవాలని తాపత్రయపడుతున్నారు. కానీ ఇప్పుడు ఏం చేసినా ఏం లాభం కాంగ్రెస్ పార్టీ చేసిన పనికి ఏపీ ప్రజలు సోనియాను ఎప్పుడూ క్షమించలేరు. రాష్ట్రాన్ని విడదీయోద్దు అని ఎంత మొత్తుకున్నా వినకుండా తమ పార్టీ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టారు. విడగొట్టి ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం మొసలి కన్నీరు కారుస్తూ ఎన్ని ధర్నాలు చేసినా పార్టీ అధికారంలోకి రావడం కష్టం.. మరోవైపు తెలంగాణలో అధికారం పార్టీ టీఆర్ఎస్ ఉన్నంతకాలం ఇతర పార్టీలు అధికారంలోకి రావు.. పాపం రాహుల్ గాంధీకి పాదయాత్రలు చేసి చేసి కాళ్లు నొప్పులు రావడం తప్ప ఇంకేం ఉపయోగం ఉండదని తెలుసుకుంటే మంచిది.

దుర్గం చెరువు.. 1500 కోట్ల భూమి ఆక్రమణ

  హైదరాబాద్ నగరంలోని మాదాపూర్ లో ఉన్న దుర్గం చెరువు ప్రాతంలోని భూమి ఆక్రమణలకు అడ్డుకట్టవేయలేకపోతున్నారు. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న ఈ దుర్గం చెరువును ఒక పక్క భూ కబ్జాదారులు మరోపక్క రాజకీయ నాయకులు కలిసి అన్యాయంగా ఆక్రమించేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో ఎకరాల భూమిని కొన్ని కోట్లు విలువ చేసే భూమిని భూభకాసురులు నమిలేశారు. అక్కడ రిసార్టులు.. అంటూ పబ్బులు అంటూ భూమిని ఆక్రమించుకొని ఆసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. ఇంతా జరుగుతున్నా మన పట్టించుకునేవారు ఉన్నారా అంటే లేదనే వార్తలే వినిపిస్తున్నాయి. మరోవైపు దుర్గం చెరువును కాపాడేందుకు పర్యావరణ వేత్తలు, స్వచ్చంద సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నా భూ ఆక్రమణలు మాత్రం ఆగడంలేదు.   అయితే ఈ వ్యవహారంపై పరిశీలన జరపాలని నిర్ణయించుకున్న ప్రభుత్వం దీనిపై వివరాలు చేపట్టేందుకు ఒక కమిటీని ఏర్పటుచేసింది. ఈ కమిటీ తెలిపిన వివరాలు చూసి ప్రభుత్వం ఒక్కసారిగా ఖంగుతిన్నది. ఒకటి కాదు రెండు కాదు 60 ఎకరాల భూమి ఆక్రమణకు గురైందని ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తుంది. దీనిపై శాసనసభ అంచనాల కమిటీ ఛైర్మన్ రామలింగారెడ్డి తెలుపుతూ దుర్గం చెరువు ప్రాతంలో 60 ఎకరాల భూమి అన్యాయంగా ఆక్రమించారని.. ఆ భూమి ధర సుమారు రూ. 1,500 కోట్ల రూపాయలు ఉంటుందని అన్నారు. సుమారు 67 హెక్టార్లలో ఉన్న దుర్గం చెరువు ప్రాతంతో సగానికి సగంపైగా ఆక్రమణకు గురైందని తెలుపుతున్నారు. అంతేకాదు ఈ వ్యవహారం పై జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అధికారుల వద్ద కూడా వివరాలు సేకరించి అక్కడ ఉన్నభవన నిర్మణాలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే దీనిపై ప్రభుత్వ ఒక నిర్ణయంతో ఉందని అక్కడ అన్యాయంగా నిర్మించిన భవనాలను ఖచ్చితంగా కూల్చివేస్తామని స్పష్టం చేశారు. కాగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ దుర్గం చెరువు ప్రాంతాన్ని ఇకో టూరిజంగా మార్చాలని అనుకుందని.. కాని అది అప్పటికే భూకబ్జాదారుల లొసుగులో ఉందని ఆప్రాజెక్టు తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదని వివరించారు. ఈ ఆక్రమణకు గురైంది ఎంతటి వారైనా సరే ఊరుకునేది లేదని.. దీనిపై ప్రాథమిక సర్వే చేసిన తరువాత ఆక్రమణలపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని అన్నారు.  

ఏపీకి 22 వేలమంది ఉద్యోగులు తరలింపు

  ఇప్పటికే ఏపీ రాజధానిలో తాత్కాలిక రాజధానిని ఏర్పాటు చేసి హైదరాబాద్ లో ఉన్న కొన్ని శాఖలను.. ఉద్యోగులను ఏపీలోకి బదలాయించాలని ఏపీ సీఎం చంద్రబాబు చూస్తున్నారు. అమరావతికి సమీపంలో.. గుంటూరు, విజయవాడ నగరాల్లో తాత్కాలికంగా ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేయాలనీ ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు ఉద్యోగులను తరలించే విషయంపై  ప్రభుత్వం ఏర్పాటు చేసిన కెఎస్ జవహర్ కమిటీ కూడా దీనిపై నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. హైదరాబాద్ లో ఉన్న ప్రభుత్వ శాఖలను విజయవాడ, గుంటూరులకు తరలించే నేపథ్యలో జరిపిన విచారణలో దాదాపు 22, 000 ప్రభుత్వ ఉద్యోగులు వచ్చే రెండు నెలల్లో ఏపీకి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు కు అందజేసింది. దీనిలో భాగంగా ఈ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఐవైఆర్‌ కృష్ణారావు ఉద్యోగ సంఘాల నాయకులతో  సమావేశం అయి అభిప్రాయాలను సేకరించనున్నట్టు సమాచారం. అయితే ఇక్కడి వరకూ బానే ఉన్నా ఇంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఇక్కడికి రావాలంటే అందుకు తగిన కార్యలయాలు కాని, వసతి సౌకర్యాలు కాని సరిగా లేవు. ఏయే శాఖల నుంచి ఎంతమంది ఉద్యోగులు వెళ్లాలి? ఆయా శాఖలు, విభాగాల కార్యాలయాలకు ఎన్ని చదరపు అడుగుల స్థలం కావాలి అనే విషయంపై అధ్యయనం చేసి.. ఇంతమంది ఉద్యోగులు ఇక్కడికి వచ్చి ఉండటానికి మొత్తం 30 లక్షల చదరపు అడుగుల స్థలం కావాలని కమిటీ నివేదికలో పేర్కొంది. ఈ నేపథ్యంలోనే  కెఎస్ జవహర్ కమిటీ విజయవాడ, గుంటూరు నగర పరిసర ప్రాంతాలను పరిశీలించింది.  గన్నవరం విమానాశ్రయం సమీపంలోని మేధా టవర్స్‌, లైలా టవర్స్ కూడా పరిశీలించి అక్కడ కూడా ప్రభుత్వ కార్యలయాలు ఏర్పాటు చేయలనుకుంటున్నట్టు తెలుస్తోంది.

మీ చరిత్ర చదువుకో.. సుష్మా

పార్లమెంట్ సమావేశాలు కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆందోళనలతో.. అట్టుడికి పోతున్నాయి. అలా సభ ప్రారంభమవుతుందో లేదో లలిత్ మోదీ వ్యవహారంలో సమాధానం చెప్పాలంటూ నినాదాలు చేస్తూ సభ సజావుగా జరగకుండా అడ్డుకుంటూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో కనీసం ఈ వ్యవహారంపై ఆరోపణలు ఎదుర్కొంటున్న సుష్మా స్వరాజ్ వాదనను కూడా వినకుండా అదేపనిగా పార్లమెంటులో గందరగోళం సృష్టిస్తున్నారు. కాగా సుష్మా తన వాదనను వినిపించేందుకు.. లలిత్ గేట్ వ్యవహారంపై సమాధానం చెప్పేందుకు స్పీకర్  సుమిత్రా మహాజన్ అనుమతి ఇచ్చారు. దీంతో సుష్మా తన వివరణ ఇచ్చారు. తాను మానవత్వంతో లలిత్ మోదీ భార్యకు సహాయం చేశానని.. అది కూడా అందుకు వీలైతేనే.. చట్టపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకపోతేనే అనుమతించాలని బ్రిటిష్ ప్రభుత్వాన్ని కోరామని చెప్పారు. అయితే సుష్మా వివరణ ఇస్తున్నా కాంగ్రెస్ నేతలు మాత్రం తనను చెప్పనీయకుండా అడ్డుపడుతూనే ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సభకు రావాలని.. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పి తీరాలని గొడవ చేస్తుండగా.. దీంతో స్పీకర్ కాంగ్రెస్ నేతల వైఖరిపై మండిపడి సమాధానం వినాలనుకునే వాళ్లు వినండి లేనివాళ్లు బయటకు వెళ్లి పోవచ్చు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు సుష్మా కూడా గందరగోళం మధ్యే వివరణ ఇచ్చారు.    అంతేకాదు పనిలో పనిగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కి కూడా రెండు చురకలు  అంటించారు. క్విడ్ ప్రోకోకు పాల్పడింది రాజీవ్ గాంధీ ప్రభుత్వమేనని.. రాహుల్ గాంధీ ఒకసారి సెలవులు తీసుకొని విశ్రాంతి తీసుకున్నారు.. ఈసారి మరోసారి సెలవులు తీసుకొని మీ కుటుంబ చరిత్ర చదువుకో అని మండిపడ్డారు. లలిత్ మోడీకి రైట్ ఆఫ్ రెసిడెన్సీ ఎలా లభించిందని తమను అడగటం కాదని, ఆయనకు రైట్ ఆఫ్ రెసిడెన్సీ కాంగ్రెస్ హయాంలోనే వచ్చిందన్నారు.

25 ఏళ్లలో చేయనిది 7 ఏళ్లలో చేశాడు

  మంత్రి లక్ష్మా రెడ్డి, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. దీనికి గాను తెలంగాణ టీడీపీ నేతలు ఈ వ్యవహారంపై స్పందించి తెలంగాణ అధికార నేతలు రేవంత్ రెడ్డిని విమర్శించడం ఆపేసి రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెడితే బావుంటుందని విమర్శించారు. రేవంత్ రెడ్డి తన నియోజకవర్గమైన కొడంగల్ ను చాలా అభివృద్ధి చేశాడు.. 25 ఏళ్లలో సాధించలేని అభివృద్ధిని ఏడేళ్లలో తాను సాధించాడని అన్నారు. అలాంటి రేవంత్ రెడ్డిపైనా విమర్శలు చేయడం సరికాదని అన్నారు. ఎన్నికల సమయంలో టిఆర్ఎస్ హామీల మీద హామీలు ఇచ్చిందని.. ఇచ్చిన హామీలను ఎంత వరకు అమలు పర్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇక కాంగ్రెస్ పార్టీకి ‘జై హింద్’ చెప్పక తప్పదు

  రాజకీయ పార్టీ అన్నాక స్వంత బాకా ఊదుకోవడానికి దానికో న్యూస్ పేపర్, ఓ న్యూస్ ఛానల్ ఇప్పుడు తప్పనిసరయి పోయాయి. ఈ విషయాన్ని పార్టీ పెట్టక ముందే జగన్మోహన్ రెడ్డి గ్రహించగలిగిది పార్టీ పెట్టిన 130 సం.లకి గానీ ఆ జ్ఞానోదయం కాని పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే మనం ఎక్కవలసిన రైలు ఇంచుమించు ఒకట్టిన్నర శతాబ్దాలు లేటు ఇకనయినా ఓ ఛానల్ పెట్టుకోకపోతే శేషజీవితమంతా ప్రతిపక్ష బెంచీలకే పరిమితమయిపోయి పార్లమెంటుని స్తంభిస్తూ తృప్తిపడవలసి వస్తుందనే ఆందోళనతో కాంగ్రెస్ పార్టీ కూడా ఒక న్యూస్ ఛానల్ పెట్టుకొనేందుకు ఏర్పాట్లు చేసుకొంటోంది.   అయితే కాంగ్రెస్ అధిష్టానం మేల్కోవడానికి 130 సం.లు పట్టిందేమో కానీ కేరళ కాంగ్రెస్ నేతలు మాత్రం చాలా కాలం క్రితమే మేల్కొని ‘జై హింద్ టీవి’ అనే న్యూస్ ఛానల్ నడిపించుకోవడం విశేషం. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆ ఛానల్ ని జాతీయ ఛానల్ మార్చే ప్రయత్నం చేస్తున్నట్లు మాజీ కేంద్రమంత్రి ఏకె అంధోని తెలిపారు. అందుకోసం జై హింద్ టీవీకి జాతీయ కార్యవర్గాన్ని కూడా ఏర్పాటు చేసారు. త్వరలోనే ఆ ఛానల్లో సోనియా, రాహుల్ భజన కార్యక్రమాలు, స్తోత్రాలు, రాహుల్ గాంధీ మేధోసంపత్తికి అద్దం పట్టే ఆయన ప్రసంగాలు వగైరా దేశ వ్యాప్తంగా ప్రజలందరికీ అందుబాటులోకి వస్తాయి.   ఈరోజుల్లో కేవలం సాంప్రదాయ ఓటు బ్యాంకుని నమ్ముకొంటే ఎవరూ ఓట్లు వేయడంలేదని మన గురించి మనం గొప్పగా చెప్పుకోవడం ఎంతవసరమో ప్రత్యర్ధ రాజకీయ పార్టీల విమర్శలను, దుష్ప్రచారాన్ని త్రిప్పి కొట్టడం కూడా అంతే ముఖ్యమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ముఖ్యంగా యువతరాన్ని క్యాచ్ చేయడానికి టీవీ ఛానల్ చాలా అవసరమని అయన అన్నారు. కనుక కాంగ్రెస్ పార్టీకి ‘జై హింద్’ చెప్పేయడానికి ఛానల్ వచ్చేస్తోందని అందరూ గమనించ ప్రార్ధన.

చంద్రబాబు ఇల్లు.. ఏసీబీ కానిస్టేబుళ్ల ఓవరాక్షన్

  తెలంగాణ ఏసీబీ కానిస్టేబుళ్లు చేసిన ఓవరాక్షన్ కు ఏసీబీ అధికారి క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర తెలంగాణ ఏసీబీ కానిస్టేబుళ్లు చంద్రబాబు సెక్యూరిటీ నుండి రహస్యంగా వివరాలు సేకరించేందుకు ప్రయత్నించారు. దీంతో కానిస్టేబుళ్లపై సీఎం సీఎస్‌వో ఆగ్రహం వ్యక్తం చేసి.. ఈవ్యవహారంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దాంతో తెలంగాణ ఏసీబీ ఉన్నతాధికారి క్షమాపణ చెప్పారు.   మరోవైపు ఓటుకు నోటు వ్యవహారంలో ఏసీబీ అధికారులు ఇంకా విచారణ జరుపుతూనే ఉన్నారు. దీనిలో భాగంగా టీడీపీ యువనేత నారా లోకేష్‌ డ్రైవరు కొండల్‌రెడ్డిని ఏసీబీ అధికారులు విచారించనున్నారు. ఈ కేసులో నిందితుడైన రేవంత్ రెడ్డి గన్‌మెన్‌లతో కొండల్‌రెడ్డి తరచూ మాట్లాడేవాడని అందుకే విచారణ చేస్తున్నామని ఏసీబీ అధికారులు తెలిపారు.

'శ్రీమంతుడు' చూస్తే చిన్నతనం గుర్తొచ్చింది.. వెంకయ్య

  మహేశ్ బాబు నటించిన సినిమా శ్రీమంతుడు ఇప్పటికే రిలీజ్ అయి హిట్ టాక్ సంపాదించుకుంది. ఈ సినిమా ఒక్క మహేశ్ అభిమానులకే కాదు అటు రాజకీయ నాయకులకు కూడా నచ్చింది. కేంద్రం మంత్రి వెంకయ్యనాయుడికి శ్రీమంతుడు సినిమా బాగా నచ్చిందంట. తెలుగు రాష్ట్రాల ఎంపీల కోసం గుంటూరు టీడీపీ ఎంపీ ఢిల్లీలో ప్రత్యేక షో ఏర్పాటు చేశారు. టీడీపీ, కాంగ్రెస్, వైసీపీలతో పాటు టీఆర్‌ఎస్ ఎంపీలను కూడా ‘శ్రీమంతుడు' ప్రత్యేక షోకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ శ్రీమంతుడు సినిమా తనకు బాగా నచ్చిందని.. సినిమా చూస్తుంటే తనకు తన చిన్నతనం గుర్తొచ్చిందని తెలిపారు. ఈ మధ్యకాలంలో వస్తున్న చిత్రాలలో ఎక్కువగా అశ్లీలత ఎక్కువగా ఉంటుందని.. కానీ శ్రీమంతుడిలో దానికి చోటివ్వకుండా చక్కగా విజ్ఞానం.. వినోదం ఉన్నాయని అన్నారు. ఈ సినిమా ద్వారా కన్నతల్లి, జన్మభూమి, మాతృదేశాన్ని ఎవరూ మరవవద్దు అని చెప్పారని ప్రశంసించారు.

ఏపీ హోదాపై నిలదీసిన చంద్రబాబు

  ఏపీ ప్రత్యేకహోదాపై రాష్ట్రంలో ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో పరిస్థితి మరీ తీవ్రం తరం కావడంతో ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రమంత్రులతో హోదాపై ఫోన్ లో చర్చించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు కేంద్రమంత్రి అరుణ్ జైట్లీని ప్రత్యేక హోదా విషయంపై నిలదీసినట్టు తెలుస్తోంది. దీంతో అరుణ్ జైట్లీ స్పందించి ప్రత్యేక హోదాపై రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని.. తుది నిర్ణయానికి వస్తే మీతో మాట్లాడుతామని చెప్పారని తెలుస్తోంది. కాగా వెంకయ్యనాయుడు, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు కూడా చంద్రబాబు ఫోన్ చేసి ప్రత్యేక హోదా గురించి మాట్లాడినట్టు సమాచారం. అయితే ప్రత్యేక హోదా గురించి ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులను అర్ధం చేసుకున్నామని.. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని.. ఈ విషయం చర్చించడానికి కొంత సమయం ఇవ్వాలని అమిత్ షా చంద్రబాబుతో అన్నట్టు తెలుస్తోంది.   అంతేకాదు ఏపీ ప్రత్యేక హోదాపై టీడీపీ ఎంపీలు కూడా అరణ్ జైట్లీతో భేటీ కాగా రాష్ట్రాన్ని ఆర్ధికంగా ఆదుకుంటామని.. పేరుకు ఏదైనా హోదా కంటే ఎక్కువ ఇస్తామని చెప్పినట్టు తెలుస్తోంది. రాష్ట్ర అవసరాలను దృష్టిలో పెట్టుకొని సాయం చేస్తామని.. పది రోజుల్లో సమస్యలను పరిష్కరిస్తామని.. అతి త్వరలో ఏపీకి మరిన్ని ప్రకటనలు ఉంటాయని చెప్పారు జైట్లీ టీడీపీ ఎంపీలకు తెలిపినట్టు సమాచారం.

ఏపీ ప్రత్యేక హోదా.. జయలలిత వల్లే ఇవ్వడంలేదు

  ఏపీ ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరుపతి మినహా రాష్ట బంద్ కు చేపట్టారు. మరోవైపు ఈ వ్యవహారంపై టీడీపీ నేతలు కేంద్రమంత్రులతో సన్నాహాలు చేస్తున్నారు. ఇవన్నీ బానే ఇప్పుడు ప్రత్యేక హోదా పై సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కావాలనే ఎన్డీఏ ప్రభుత్వం ప్రత్యేక హోదాను ఇవ్వడం లేదని ఆరోపించారు. గతంలో యూపీఏ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు రాష్ట్ర విభజన చేసేప్పుడు ఏపీకి ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పిందని.. కానీ ఎన్డీఏ ప్రభుత్వం మాత్రం తాము అధికారంలోకి వస్తే 10 ఏళ్లపాటు ప్రత్యేక హోదా కల్పిస్తామని మాటలు చెప్పారని.. కానీ ఇప్పుడు ఇవ్వనని చెప్పడం సబబు కాదని అన్నారు. అంతేకాదు ఒకవేళ ఎన్డీఏ ప్రభుత్వం కనుక ఏపీకీ ప్రత్యేక హోదా ఇస్తే అటు తమిళనాడు కాని.. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కాని అంగీకరించరని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వానికి జయ పార్టీ మద్ధతు తప్పనిసరిగా కావల్సిన నేపథ్యంలో ఆమె కోసం ప్రత్యేక హోదా పక్కన పెట్టారని.. కావాలనే ఈ విషయంపై జాప్యం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇక చంద్రబాబు అంటే ఎలాగూ మిత్రపక్షం కాబట్టి ఇవ్వకపోయినా ఊరుకుంటారని అందుకే అందుకే కేంద్రం కూడా ఏపీకి ప్రత్యేక హోదా వ్యవహారంపై పట్టించుకోవడం లేదని అన్నారు.

అగ్రిగోల్డ్ డిపాజిటర్లు ఆందోళన పడోద్దు

  అగ్రిగోల్ట్ సంస్థ డిపాజిటర్లకు టోకరా వేసి ఉడకాయించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ కుంభకోణానికి బలైన డిపాజిటర్లకు ఏపీ ప్రభుత్వం ఒక తియ్యటి కబురు చెప్పింది. డిపాజిటర్లు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. డిపాజిటర్లకు న్యాయం చేస్తామని తెలిపారు. ఈ కుంభకోణ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం విచారణ కమిటీని నియమించిన నేపథ్యంలో విచారణ కమిటీ మంగళవారం ఉదయం విజయవాడ క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబుతో భేటీ అయింది. ఈ సమావేశంలో అగ్రిగోల్డ్‌ సంస్థ ఆస్తులు రూ.7,000 కోట్లు ఉన్నాయని.. సంస్ధ డిపాజిటర్లలకు రూ. 6,800 కోట్లు చెల్లించాల్సి ఉందని చెప్పారు. దీనిలో భాగంగా సంస్థ ఆస్తులు వేలం వేస్తే 7,000 కోట్లకు పైగా వస్తాయని దీంతో డిపాజిటర్లకు మొత్తాన్ని చెల్లించవచ్చని చెప్పారు. దీనికి చంద్రబాబు కూడా అంగీకరించి సంస్ధ ఆస్తులు అమ్మైనా సరే డిపాజిటర్ల సొమ్ము వచ్చేలా చూడాలని.. బాధితులకు రెండు, మూడు నెలల్లో పరిహారం చెల్లించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ సందర్భంగా నర్సింహమూర్తి మాట్లాడుతూ డిపాజిటర్లు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని చెప్పారు.. సంస్థకు ఉన్న అప్పుల కంటే ఆస్తుల విలువే ఎక్కువగా ఉన్నాయని.. వచ్చే నెలలోనే సంస్థ ఆస్తులను వేలం ద్వారా విక్రయించి డిపాజిటర్లకు న్యాయం చేస్తామని ఆయన చెప్పారు. కాగా దేశ వ్యాప్తంగా అగ్రిగోల్డ్‌ బాధితులు 32లక్షల మంది ఉండగా ఒక్క ఏపీలోనే 19 లక్షల మంది ఉండటం గమనార్హం.

దానికోసం జగన్ 2కోట్లు ఖర్చుపెట్టారు..

  జేసీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని వైఎస్సార్ పార్టీ ఆధినేత జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ధర్నాపై తెలుగుదేశం పార్టీ ఎంపి జేసీ దివాకర్ రెడ్డి విమర్శలు చేశారు. జగన్మోహన్ రెడ్డి ధర్నా కోసం రెండు కోట్టు ఖర్చు పెట్టారని.. ధర్నా వల్ల జగన్మోహన్ రెడ్డికి ప్రచారం వచ్చిందేమో కానీ, ఫలితం మాత్రం రాలేదని ఎద్దేవా చేశారు. అంతేకాదు నిరసనలు దీక్షలు గాంధీ కాలంలో చెల్లేవని విమర్శించారు. ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్ పార్టీ.. వైఎస్సార్ పార్టీలు మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. కాగా ఈ రోజు ఆంధ్రపదేశ్ లో తిరుపతి మినహా బంద్ చేపడుతున్న నేపథ్యంలో బంద్ ల వల్ల రాష్ట్రానికే నష్టమని.. వాటివల్ల ఎలాంటి ఉపయోగం లేదని అన్నారు.   ఇదిలా ఉండగా లోకసభలో ఏపీకి ప్రత్యేక హోదాపై తక్షణ చర్చ కోసం టిడిపి లోకసభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు నోటీసు ఇచ్చింది.

ఇక నుండి చంద్రబాబు అక్కడే..

  సీఎం చంద్రబాబు ఏపీ రాజధానిలో తాత్కాలిక రాజధానిని ఏర్పాటు చేసి అక్కడి నుండే పాలన చేద్దామని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే విజయవాడను తాత్కాలికి కేంద్రంగా ఏర్పాటు చేయడానికి పనులు ముమ్మరం చేస్తున్నారు. వారంలో 5 రోజులు అక్కడే ఉండి పాలనా కార్యక్రమాలు సీఎం చంద్రబాబు గట్టిగా నిర్ణయించుకోవడంతో మిగిలిన అధికార యంత్రాంగం కూడా దీనికి సముఖత చూపి ఆ దిశగా అడుగులు వేసినట్టు తెలుస్తోంది. మరోవైపు సీఎం ఈ నిర్ణయం తీసుకోవడంతో సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు కూడా చంద్రబాబు బాటలో తాను కూడా విజయవాడలోనే ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. దీంతో సీఎం చంద్రబాబు పాలనా కార్యక్రమాలు ఇక్కడి నుండే చేసే నేపథ్యంలో హైదరాబాద్ లోని కార్యలయాలు.. ఉద్యోగులను ఇక్కడకు తరలించడానికి సన్నాహాలు చేస్తున్నారు.   అయితే ఉద్యోగులు పనులు చేయడానికి కార్యాలయాలు, ఉండటానికి ఏం వసతులు కావాలి తదితర వివరాలు సేకరించే పనిలో పడ్డారు. దీనిలో భాగంగానే విజయవాడలో ఉన్న అద్దే ఇళ్ల లెక్కలు తీసే పనిలో పడ్డారు అధికారులు. అయితే హైదరాబాద్‌ నుంచి విజయవాడకు వెళ్లాల్సిన ఉద్యోగుల సంఖ్య సుమారు పాతిక వేలు ఉంటుందని అంచనా. అయితే ప్రస్తుతానికి విజయాడలో ఉన్న ప్రభుత్వ కార్యలయాల్లో ఇప్పటికే కొంతమంది అధికారులు ఉపయోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు హైదరాబాద్ నుండి వెళ్లే ఉద్యోగులకు కావలసిన స్థలం లేకపోవడంతో విజయవాడలోని అద్దె ఇళ్లపై ప్రభుత్వం దృష్టిసారించింది. అంతేకాదు హైదరాబాద్‌ నుంచి వెళ్లేవారికే కాకుండా అవసరమైతే ఏపీలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్లకి తాత్కాలిక ప్రాతిపదికన అద్దె ఇళ్లు సమకూర్చాలన్నది ప్రభుత్వ ఆలోచన.

సానియా మీర్జాకు జరిమానా

  ఎలాంటి వారైనా నిబంధనలు తప్పినప్పుడు పరిహారం చెల్లించక తప్పదు. అలా నిబంధనలు పాటించక జరిమానా చెల్లించాల్సి వచ్చింది తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా గుర్తింపు పొందిన ప్రముఖ టెన్నిస్ తార సానియా మీర్జా జరిమానా చెల్లించాల్సివచ్చింది. సోమవారం రాత్రి ఆమె జూబ్లిహిల్స్ నుండి వస్తుండగా పోలీసులు ఆమె వాహనాన్ని తనిఖీలు చేశారు. అయితే ఆమె కారు నంబరు ప్లేట్ నిబంధనలకు అనుగుణంగా లేని కారణంగా పోలీసులు రూ. 200 రూపాయలు జరిమానా విధించారు. సాదారణంగా  పోలీసులు విఐపి వాహనాలను చూసిచూడనట్లు వదిలివేస్తారు..కాని సానియా మీర్జా వాహనాన్ని తనిఖీ చేయడమే కాకుండా జరిమానా విధించడం విశేషమే.

ఏపీ.. లక్ష కోట్ల పెట్టుబడి.. 50,000 ఉద్యోగాలు

రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆర్ధికంగా వెనుకబడిన ఏపీ ఇంకా ఎంతో అభివృద్ది సాధించాల్సి ఉంది. దీనిలో భాగంగానే ఏపీ సీఎం చంద్రబాబు కూడా రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే సింగపూర్, జపాన్ దేశాలు మన రాష్ట్రంలో అనేక పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రాగా ఇప్పుడు మరో ధనిక దేశమైన దుబాయ్ కూడా మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపు లక్ష కోట్ల రూపాయల పెట్టుబడితో ఏపీలోని నెల్లూరు లేదా ప్రకాశం జిల్లాలో భారీ పెట్రో రిఫైనరీ, కెమికల్‌ కాంప్లెక్స్‌ లు ఏర్పాటు చేయాలని దుబాయ్ లోని ఓ కంపెనీ ఆసక్తి ఆసక్తి చూపిస్తున్నట్టు అధికారులు తెలుపుతున్నారు. అయితే ముడి చమురు ఎగుమతి, దిగుమతుల కోసం దుబాయ్ కంపెనీ సొంత పోర్టు కూడా కావాలని భావిస్తుండటంతో నెల్లూరు జిల్లాలోని సముద్రతీరానికి దగ్గరలో 3,000 ఎకరాలు కావాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరింది. అయితే ఇప్పటికే అనేక పరిశ్రమల ఏర్పాటుకు అక్కడ భూములు కేటాయించడంతో దానికి మినహాయింపుగా ప్రకాశం జిల్లాలోని భూములను సైతం పరిశీలించాలని కంపెనీని కోరడంతో కంపెనీ కూడా ఇందుకు అంగీకరించింది. ఈ ప్రాజెక్టు వల్ల దాదాపు 50,000 ఉద్యోగ అవకాశాలు కలిగే అవకాశం ఉందని ఏపీ ప్రభుత్వ అధికారులు భావిస్తున్నారు. మాములుగా అయితే ఏ రాష్ట్రంలో అయినా కంపెనీ పెట్టాలంటే కంపెనీలు పన్ను రాయితీలతో పాటు భూములను సైతం రాయితీ ధరపై ఇవ్వాలని కోరుతున్నాయి.. కానీ దుబాయ్ కంపెనీ మాత్రం మార్కెట్‌ ధర చెల్లించేందుకు సిద్ధపడినట్టు సమాచారం. దీంతో ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ ప్రాజెక్టుకు స్థలాన్ని.. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఈప్రాజెక్ట్ కనుక ఏపీలో అమలైతే దేశంలోనే అతి పెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్‌డిఐ) ప్రాజెక్టు అవుతుంది.

తెలంగాణలో భారీ టూరిజం ప్రాజెక్టులు

  రాష్ట్ర విభజన జరిగి ఏడాది అయిపోయినా.. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు అభివృద్ధి దిశగా అడుగువేయడానికి సిద్దమైనట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం అన్ని సదుపాయాలు కలిగిన మూడు అత్యంత పెద్ద టూరిజం ప్రాజెక్టులను.. సుమారు రూ. 250 కోట్లుతో కూడిన ఈ ప్రాజెక్టులను నిర్మించడానికి ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. అవి Heritage and spiritual tourism circuit,  Tribal Tourism  Circuit,  ECO Tourism Cricuit. ఈ మూడు టూరిజం ప్రాజెక్టులకు మహబూబ్ నగర్ జిల్లా మరియు, వరంగల్ జిల్లాలు అనువుగా ఉన్నట్టు తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్ మెంట్ కార్పోరేషన్(tstdc) గుర్తించింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రాజెక్టులు రావడంలో ముఖ్యపాత్ర వహించింది బి.పి ఆచార్య అని చెప్పుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వ పర్యాటక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఉన్నఈయన తెలంగాణ టూరిజం ప్రచారం కోసం అనేక దేశాలు కూడా తిరిగారు. బంగారు తెలంగాణ సాధించాలనే ఉద్దేశ్యంతో ఈ టూరిజం ప్రాజెక్టుల విషయంలో చాలా కృషిచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాది తెలంగాణ టూరిజం ప్రాజెక్టులకు 200 కోట్ల రూపాయలు వరకూ రాగా ఈ ఏడాది అది 300 కోట్ల రూపాయలు సాధించిందని తెలిపారు. హెరిటేజ్ అండ్ స్పిరిట్యుయల్ టూరిజం సర్య్కూట్: ఈ టూరిజం సర్క్యూట్ ని తెలంగాణ రాష్ట్రంలో రెండో పెద్ద నగరమైన వరంగల్ నిర్మించాలని యోచిస్తున్నారు. దీనిలో వరంగల్ జిల్లాలో చాలా ప్రముఖమైన దేవాలయాలు కొలనుపాక, జనగాన్, పాలకుర్తి దేవాలయం, బమ్మెర, ఘనపూర్, మెట్టుగుట్ట, ఏక వీర. ఇనవోలు, భద్రకాళి, పద్మాక్షి పాలంపేట్ దేవాలయాలను కలిపి ఉంటుంది. ఈ ప్రాజెక్టుకు మొత్తం అయ్యే ఖర్చు రూ. 61.63 కోట్లుగా అంచనా వేశారు. ఇకో టూరిజం: ఈ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం రెండు విభాగాలుగా నిర్మించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిలో మొదటిగా సోమశీల నది మరియు అక్క మహదేవి కేవ్స్ వరకూ ఒకటిగా.. అక్క మహదేవి గుహలనుండి ఫరహాబాద్, మల్లెలతీర్ధం, మన్ననూర్ ఉమా మహేశ్వరం దేవాలయం కలుపుకొని ఒక సర్యూట్ గా ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుకు మొత్తం అయ్యే ఖర్చు రూ. 127.27 కోట్లుగా అంచనా వేశారు.     ట్రైబల్ టూరిజం ప్రాజెక్ట్: తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ములుగు, లక్నవరం, మేడారం, తడ్వాయ్, ఏటూరునగరాలను కలుపుకొని నిర్మించాలని చూస్తుంది. కాగా లక్నవరం ఇప్పటికే మంచి టూరిజం ప్లేస్. అక్కడ man made lake with hanging bridge ఉండటంతో మంచి టూరిజం స్పాట్ గా ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు ఈ ప్రాజెక్టుతో ఇంకా మంచి టూరిజం ప్రదేశంగా తీర్చిదిద్దాలని అధికారులు యోచిస్తున్నారు.  ఈ ప్రాజెక్టుకు మొత్తం అయ్యే ఖర్చు రూ. 96.61 కోట్లుగా అంచనా వేశారు.  

పవన్ కళ్యాణ్ అందుకే మౌనంగా ఉన్నారా..!

  ఆంధ్రరాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని మునికోటి ఆత్మహత్య చేసుకోవడం అందరిని కలిచివేసింది. అసలు కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వడం కుదరని చెప్పిన దగ్గరనుండే ఆంధ్రాలో ఆందోళనలు మొదలయ్యాయి. అయితే మునికోటి చేసిన ప్రాణత్యాగానికి ఒక్కసారిగా అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మునికోటి మృతిపట్ట సానుభూతి తెలిపారు. మునికోటి మరణం చాలా బాధను కలిగించింది అని, అతని కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి అని ట్విట్టర్ ద్వారా తెలియచేశారు. ఈ సమయంలో ప్రత్యేక హోదా గురించి మాట్లాడకుండా ఉండటానికి చాలా ప్రయత్నిస్తున్నానని.. ఎంతో నిగ్రహించుకుంటున్నాను అని అన్నారు.   ఒక రకంగా పవన్ కళ్యాణ్ ఏపీ ప్రత్యేక హోదా గురించి ఎంపీలు ఏం చేస్తున్నారని గట్టిగా విమర్శించిన తరువాతే మన ఎపీ ఎంపీలు కూడా పార్లమెంట్ లో ఏపీ ప్రత్యేక హోదా గురించి అడిగడినట్టు తెలుస్తోంది. అయినా ప్రత్యేక హోదాపై పవన్ కళ్యాణ్ మాత్రం ఎప్పుడు ఏం మాట్లాడలేదు. చాలా మంది నేతలు ప్రత్యేక హోదా గురించి మాట్లాడాలి అంటూ ఎంత కోరినా పవన్ కళ్యాణ్ మాత్రం మౌనంగా ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే అభిమానులు, ప్రజలు రెచ్చిపోయే ప్రమాదం ఉందని అందుకే పవన్ కళ్యాణ్ మౌనంగా ఉన్నారని భావిస్తున్నారు.

తిరుపతి మినహా నేడు ఏపీ బంద్

  ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ శ్రీకాకుళం నుండి అనంతపురం వరకు బస్సు యాత్రలు చేప్పట్టిన సీపిఐ పార్టీ నేడు ఆంద్రప్రదేశ్ బంద్ నిర్వహిస్తోంది. కాంగ్రెస్, వైకాపాలతో సహా మరికొన్ని ఇతర పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్ధి సంఘాలు కూడా ఈ బంద్ కి మద్దతు తెలుపుతున్నాయి. ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ కార్యకర్త మునికోటి ఆత్మహత్య చేసుకొన్నందుకు సంతాపంగా నిన్న తిరుపతిలో బంద్ నిర్వహించారు కనుక నేటి బంద్ నుండి తిరుపతికి మినహాయింపునిచ్చారు. బంద్ ప్రభావంగా రాష్ట్రంలో అన్ని జిల్లాలలో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దానితో దూర ప్రాంతాల నుండి వచ్చిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.