ఆ కాల్‌డేటా కూడా మాకు పంపండి.. హైకోర్టు
posted on Aug 8, 2015 @ 11:48AM
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సర్వీసు ప్రొవైడర్లు కాల్ డేటాను విజయావాడ కోర్టుకు సమర్పించిన సంగతి తలిసిందే. హైకోర్టు కూడా విజయవాడ కోర్టుతో పాటు మాకు కూడా ఓ ప్రత్యేక మెసెంజర్ ద్వారా పంపించమని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ పై వొడాఫోన్, టాటా టెలీ సర్వీసెస్ సంస్థల కాల్‌డేటాను సీల్డ్ కవర్లలో ఇవ్వాలన్న విజయవాడ కోర్టు ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ హోంశాఖ ముఖ్యకార్యదర్శి అజయ్ మిశ్రా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు విచారణ జరిపింది. తెలంగాణ ప్రభుత్వ తరపు న్యాయవాది మాట్లాడుతూ వొడాఫోన్, టాటా టెలీ సర్వీసులు ప్రతివాదులుగా లేవని... అందవల్ల వాటికి సంబంధించిన కాల్ డేటా సీల్డ్ కవర్ లో ఇవ్వాల్సిన అవసరం లేదని వాదించారు. అయితే ఏపీ తరపు న్యాయవాది మాట్లాడుతూ గతంలో ఇదే తరహా వ్యాజ్యంపై హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విధంగానే ఇప్పుడు కూడా చేయాలని కోరారు. అయితే ఇద్దరు వాదనలు విన్న హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలే ఈ వ్యాజ్యంలోనూ వర్తించేలా మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. వొడాఫోన్, టాటా టెలీ సర్వీసు సంస్థలు కాల్‌డేటా సీల్డు సీల్డు కవర్లను ప్రత్యేక దూతద్వారా హైకోర్టుకు తరలించి జ్యుడీషియల్ రిజిస్ర్టార్ వద్ద భద్రపర్చాలని స్పష్టం చేసింది.