సోనియాకు ఆ అర్హత లేదు.. జేసీ

  టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ పై దుమ్మెత్తి పోశారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన దగ్గర నుండి కాంగ్రెస్ పార్టీ నేతలు సభను సజావుగా సాగనివ్వకుండా అడ్డుకుంటూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో స్పీకర్ 25 మంది కాంగ్రెస్ ఎంపీలను సస్పండ్ చేశారు. దీనికి గాను సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మనోహ్మన్ సింగ్ ఇతరు కాంగ్రెస్ నేతలందరూ కలిసి పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహం ఎదుట నల్ల బ్యాడ్జీలు కట్టుకొని నిరసన తెలిపారు. అయితే ఇప్పుడు సోనియాగాంధీ చేస్తున్నధర్నాను జేసీ తప్పుబట్టారు. ఆనాడు పార్లమెంట్ తలుపులు మూసేసి.. ఎంపీలను సస్పెన్షన్ చేసి మరీ రాష్ట్ర విభజన బిల్లును పాస్ చేసిన సోనియాగాంధీకి ఇప్పుడు బ్లాక్ డే గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని.. అసలు సోనియా గాంధీకి బ్లాక్ డే గురించి మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు. అనవసరంగా ఎంపీల సస్పెన్షన్‌పై సోనియా రాద్ధాంతం చేస్తున్నారన్నారు. తమ పార్టీ స్వప్రయోజనాలకోసం రాష్ట్రాన్ని విడదీసిన సోనియాకు ఆంధ్ర రాష్ట్రం తగిన బుద్ధి చెప్పిందని.. కొన్నిసంవత్సరాలైనా కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం కష్టమని విమర్శించారు. ఎంపీలను సస్పెండ్‌ చేస్తే బ్లాక్‌ డే అంటున్నారు...మరి రాష్ర్టాన్ని విభజించిన మిమ్మల్ని ఏమనాలని జేసీ ప్రశ్నించారు.

ఏపీలో హైకోర్టు కోసం స్థలం అన్వేషణ

  రెండు రాష్ట్రాల మధ్య హైకోర్టు వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఉన్నపాటున హైకోర్టు విభజన జరగాలని మొండి పట్టుదలతో వైఖరిస్తుంది. అయితే ఈ విషయంలో గతంలోనే హైకోర్టు ఇప్పట్లో హైకోర్టు విభజన లేదని ఏపీలో హైకోర్టు నిర్మించుకునేంత వరకు విభజించేది లేదని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఏపీలో హైకోర్టు నిర్మాణానికి అనువైన స్థలాన్ని చూడాలని.. కేంద్రమే హైకోర్టు నిర్మాణానికి కావాల్సిన వ్యయం చెల్లించాలని స్పష్టం చేసింది. కానీ కేంద్రం మాత్రం ఇప్పటి వరకూ తగిన చర్యలు తీసుకోలేదు. అయితే ఈ విషయంపై 6 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ఇప్పుడు దీనిపై కేంద్రన్యాయశాఖ మంత్రి సదానందగౌడ్‌ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు ఏర్పాటుకు స్థలాన్ని అన్వేషిస్తున్నామని తెలిపారు. ఏపీకి ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలని విభజన చట్టంలో ఉందని.. ఏపీ ప్రభుత్వం ఎక్కడ కోరితే అక్కడ హైకోర్టును ఏర్పాటు చేస్తామని అన్నారు. కానీ హైకోర్టు నిర్మాణానికి అయ్యే ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించాలని చెప్పారు.

పట్టిసీమపై టీ సర్కార్ లేఖ.. ఘాటుగా స్పందించిన ఏపీ

  ఏపీ ప్రభుత్వం చేపడుతున్న పట్టిసీమ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం మొదటి నుండి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం పట్టిసీమ ప్రాజెక్టుపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ గోదావరీ యాజమాన్య బోర్డుకు లేఖ రాసింది. అయితే తెలంగాణ ప్రభుత్వం చేసిన అభ్యంతరాలకు ఏపీ ప్రభుత్వం కూడా ఘాటుగానే సమాధాన మిచ్చినట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే ఏపీ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ స్పందించి పట్టిసీమ ప్రాజెక్టు అంతర్రాష్ట్ర జల ప్రాజెక్టు కాదని, ఇది కొత్త ప్రాజెక్టూ కాదని, మేమేమి ఇతర రాష్ట్రాల నీటిని వాడుకోవడం లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. అనవసరంగా ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వం రాద్దాతం చేస్తుందని అన్నారు. సాకులు చెప్పేముందు నిజాలు తెలుసుకోవాలని సూచించారు. అసలు పట్టిసీమ ప్రాజెక్టు నిర్మిస్తున్న ప్రాంతం ఎక్కడుందనే విషయాన్ని గుర్తించాలని అన్నారు. పోలవరం ప్రాజెక్టులో30 కిలోమీటర్లు మేర నీరు సముద్రంలో కలుస్తుందని..సముద్రంలో కలిసే నీరు సద్వినియోగం చేసుకుంటే అభ్యంతరం ఎందుకని ప్రశ్నించింది.

పవన్ కళ్యాణ్ vs శివాజీ? పవన్ రోడ్డెక్కితే ఖాయం

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రం చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఏపీ ప్రత్యేక హోదా విషయంలో ఏపీ నేతలందరూ ఆందోళనలు చేపట్టారు. అయితే ఇప్పుడు ఈ వ్యవహారం రెండు హీరోల మధ్య పోరుగా సాగుతున్నట్టు తెలుస్తోంది. గతంలో ఏపీ ప్రత్యేక హోదా పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ నేతలందరినీ ఏకి పారేసిన సంగతి తెలిసిందే. అయితే ఏపీ టీడీపీ ఎంపీలు కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యాలకు ఘాటుగానే స్పందించారు. కానీ చంద్రబాబు జోక్యం చేసుకోవడం వల్ల కాస్త నెమ్మదించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని హీరో శివాజీ కూడా గట్టిగానే ప్రయత్నించారు. కానీ ఇది పవన్ కళ్యాణ్‌కు, సినీ నటుడు శివాజీకి మధ్య ప్రచ్ఛన్న యుద్ధంగా మారినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే శివాజీ ఏపీకి ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నా మరోవైపు పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూనే మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ రోడ్డెక్కితే ప్రత్యేక హోదా ఖచ్చితంగా వస్తుందని పవన్ కళ్యాణ్‌పై శివాజీ ఒత్తిడి పెంచుతున్నట్లు కనిపిస్తున్నారు.   ఎందుకంటే డీడీపీ, జనసేన మిత్రపక్షమని అందిరికీ తెలిసిందే. అంతేకాదు పవన్ కళ్యాణ్ బిజెపికి అనుకూలంగా ఉన్నారనే అభిప్రాయం టిడిపి వర్గాల్లో ఉంది. బీజేపీకి టీడీపీ మిత్రపక్షం కాబట్టి ఏం అనలేని పరిస్థితి. మరోవైపు చంద్రబాబు తమంత తాముగా పవన్ కళ్యాణ్‌ను దూరం చేసుకోవడానికి ఇష్టపడడం లేదు. కాబట్టి డైరెక్ట్ గా పవన్ పై ఒత్తిడి తీసుకువస్తే నష్టమని భావిస్తున్న నేతలు ఇలా శివాజీని రంగంలోకి దింపినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రత్యేక హోదా కోసం శివాజీ చేస్తున్న పోరాటాన్ని సమర్తిస్తున్నట్లు చంద్రబాబు గతంలో ఓసారి చెప్పారు. మొత్తానిక పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగితే ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని నేతలు గట్టిగానే నమ్ముతున్నారు. మరి ఆ నమ్మకాన్ని పవన్ కళ్యాణ్ నిలబెట్టుకుంటారో లేదో చూడాలి..

పైసాలేదు.. పనిలేదు

  రెండు రాష్ట్రాల్లో ఉన్న జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌లు పరిస్థితి మరీ అద్వానంగా తయారయాయి. అప్పట్లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నంద మూరి తారకరామారావు హయాంలో గ్రామాల అభివృద్ధే దిశగా.. ప్రజల వద్దకే పాలన లక్ష్యంగా ఏర్పాటు చేసిన స్థానిక సంస్ధలు ఇప్పుడు ఏదో విగ్రహల్లా మారిపోయాయి. ఒకప్పుడు నిధులు, విధులతో కళకళలాడిపోయిన జిల్లా పరిషత్‌లు ఇప్పుడు నిధులు లేక వాటి పరిస్థితి ప్రశ్నార్ధకంగా మారింది. అప్పట్లో ఎన్టీఆర్ గ్రామాల్లోని ప్రజల సమస్యలు, అభివృద్ధికి ఇతోధికంగా నిధులు విడుదల చేశారు.. కానీ కాలక్రమేణా రాష్ట్ర ప్రభుత్వాలు వీటికి నిధులు విడుదల చేయడమే మరిచిపోయినట్టు ఉన్నాయి. అయితే 14వ ఆర్థిక సంఘం ప్రకారం కేంద్ర ప్రభుత్వం మాత్రం నిధులను గ్రామ పంచాయితీలకు కేటాయిస్తుంది కాని మండల, జిల్లా పరిషత్ లకు నిధులు విడుదల చేయకపోవడంతో ఇప్పుడు వీటి పరిస్థితి ఉత్సవ విగ్రహాలుగా మారాయి. అటు దీంతో ఆ కార్యలయాల్లోని అధికారులు పనులు లేక పర్యవేక్షణకు మాత్రమే పరిమితమయ్యారు.   మరోవైపు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌ నుంచి నిధులు కేటాయించాలన్న విషయంపై దృష్టిపెట్టకపోవడంతో కూడా అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. కాగా మరోవైపు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు నిధులు విడుదల చేయాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. ప్రజలచే నేరుగా ఎన్నుకున్న తమకు నిధులు, విధులు లేక ఉత్సవవిగ్రహాలుగా మార్చొద్దని వారు వేడుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ల మనుగడకు నిధులు విడుదల చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ మేరకు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఏ మేరకు చర్యలు తీసుకుంటాయో వేచిచూడాల్సిందేమరీ. ఇప్పటికే అన్ని విషయాల్లో గొడవ పడుతున్న రెండు ప్రభుత్వాలు కొంచెం ఎంపీటీసీలు, జడ్పీటీసీలు పరిస్థితి కూడా కొంచెం ఆలోచిస్తుందే బావుంటుంది.

ఏపీకీ ఎట్టి పరిస్థితిలో అన్యాయం జరగనివ్వం...రాజ్‌నాథ్‌

  ఏపీ ప్రత్యేక హోదాపై పార్లమెంట్ లో ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. అసలే రాష్ట్ర విభజన జరిగి ఆంధ్రప్రదేశ్ ఆర్దిక లోటు భారీగానే ఉంది. అయితే ఏపీకి ప్రత్యేక హోదా తప్పకుండా హామీలు నెరవేర్చుతాం.. దీనిపై చర్చలు జరుగుతున్నాయి అని చెప్పిన నేతలు ఇప్పుడు దేశంలోని ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది తేల్చిచెప్పింది. దీంతో వార్తతో కేంద్రం ఒక్కసారిగా ఏపీపై బాంబు వేసినంత పని చేసింది. ఏపీ ప్రజల ఆశల మీద నీళ్లు జల్లింది. ఇప్పటికే ఏపీలో ఆందోళనలు మొదలయ్యాయి. మరోవైపు పార్లమెంట్ లో కూడా ఈ విషయంపై ఆందోళనకు దిగడంతో ప్రత్యేక హోదా విషయంలో ఏపీకి ఎట్టి పరిస్థితిల్లోనూ ప్రత్యేక హోదా విషయంలో ఏపీకి ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగనివ్వబోమని, కచ్చితంగా న్యాయం చేస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ తమ పార్టీ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడదీసిందని.. కాంగ్రెస్ చేసిన పనికి ఆంధ్రరాష్ట్రం చాలా నష్టపోయిందని ఆందోళన చేశారు. దీంతో పాటు అప్పట్లో ప్రధాన మంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ ఏపీకి ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్పారు.. కానీ బీజేపీ మాత్రం తర్వాత అధికారంలోకి వచ్చేది తామేనని.. ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా కల్పిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆ హామీలను పక్కన నెట్టేసి ప్రత్యేకహోదా ఇవ్వనని చెప్పడం న్యాయం కాదని అన్నారు. అనంతరం, మంత్రి వెంకయ్యనాయుడు జోక్యం చేసుకుని ప్రత్యేక హోదా అంశంపై లోతుగా పరిశీలన జరుగుతోందన్నారు.

జమ్మూలో ఉగ్రవాది దాడి, ఒక బి.యస్.యఫ్. జవాను మృతి

  గత మూడు దశాబ్దాలుగా భారతదేశం మీద పాకిస్తాన్ పరోక్ష యుద్ధం చేస్తూనే ఉంది. అక్కడ శిక్షణ పొందిన ఉగ్రవాదులను భారత్ పైకి పంపిస్తూ అనేక వందల మందిని బలిగొంటోంది. అయినా దాని రక్తదాహం తీరడం లేదు. మళ్ళీ ఈరోజు ఉదయం జమ్ములో ఉదంపూర్ జిల్లాలో శ్రీనగర్ జాతీయ రహదారిపై నరసు నాలా వద్ద సరిహద్దు భద్రతా దళాలు ప్రయాణిస్తున్న వాహనంపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఆ దాడిలో ఒక బి.యస్.యఫ్.జవాను మరణించగా మరో ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే జవాన్లు కూడా ఎదురుదాడి చేసి తమపై దాడికి పాల్పడ్డ ఉగ్రవాదిని మట్టుబెట్టారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రిలో చేర్చి వైద్య చికిత్స అందిస్తున్నారు.   ఈ ఘటనపై స్పందించిన జమ్మూ&కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా “ఈ దాడి జరిగిన జాతీయ రహదారిలో ఉగ్రవాదుల దాడి జరిగి చాలా కాలమే అయ్యింది. ఎందుకంటే ఆ ప్రాంతాల నుండి ఉగ్రవాదులను ఎరివేయబడ్డారు. కానీ మళ్ళీ ఇప్పుడు దాడి జరగడం చాలా ఆందోళన కలిగిస్తోంది,” అని ట్వీట్ మెసేజ్ చేశారు.

మధ్యప్రదేశ్ లో రెండు ఘోర రైలు ప్రమాదాలు

  మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నిన్న రాత్రి 11.45 గంటలకు ఒకేచోట రెండు ఘోర రైలు ప్రమాదాలు జరిగాయి.ముంబై నుండి వారణాశికి వెళుతున్న కామయాని ఎక్స్ ప్రెస్, జబల్ పూర్ నుండి ముంబై వెళుతున్న జనతా ఎక్స్ ప్రెస్ రైళ్ళు హర్దా జిల్లాలో ఖిర్కియా -బిరంగీ రైల్వే స్టేషన్ల మధ్య మాచక్ నదిపై ఉన్న వంతెనను దాటుతుండగా పట్టాలు తప్పి నదిలో పడిపోయాయి.   మొదట కామయాని ఎక్స్ ప్రెస్ రైలు వంతెనపై పట్టాలు తప్పడంతో ఇంజనుతో సహా 6 బోగీలు నదిలో పడిపోయాయి. మరికొన్ని నిమిషాలకి రెండవ వైపు నుండి వస్తున్న జనతా ఎక్స్ ప్రెస్ కూడా అదే వంతెనపైకి రాగానే పట్టాలు తప్పడంతో ఇంజనుతో సహా నాలుగు బోగీలు నదిలో పడిపోయాయి.   మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వానల కారణంగా మాచక్ నదికి వరద వచ్చి పట్టాల క్రింద రాళ్ళు, మట్టి కొట్టుకుపోవడం వలననే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఇంతవరకు 12మంది మరణించగా మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డట్లు సమాచారం. కానీ రెండు రైళ్ళకి చెందిన బోగీలు నదిలో పడిపోవడం వలన ఈ ప్రమాదంలో చాలా మంది చనిపోయి ఉండవచ్చును. నదిలో రెండు రైళ్ళకు చెందిన మొత్తం 15బోగీలు పడిపోయినట్లు స్థానికులు చెపుతున్నారు. అదే నిజమయితే మృతుల సంఖ్య చాలా భారీగా ఉండవచ్చును.   ఈ ప్రమాదం సంగతి తెలియగానే రైల్వే ఉన్నతాధికారులు, సహాయ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకొని సహాయ కార్యక్రమాలు మొదలుపెట్టారు. అర్ధరాత్రి చీకటిలో చాలా జోరుగా వాన కురుస్తున్న సమయంలో ఉదృతంగా ప్రవహిస్తున్న మాచక్ నది మీద ఉన్న రైల్వే వంతెనపై సహాయ కార్యక్రమాలు చేప్పట్టడం చాలా కష్టం అయినప్పటికీ అధికారులు, సహాయ సిబ్బంది, స్థానికులు కలిసి ఇంతవరకు సుమారు 300 మందిని రక్షించగలిగారు. గాయపడినవారిని స్థానిక ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు తరలిస్తున్నారు. జిల్లా కలెక్టరుతో సహా ఉన్నతాధికారులు, పోలీసులు అందరూ ప్రమాద స్థలానికి తరలివచ్చి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఒకవైపు సహాయ కార్యక్రమాలు జరుగుతుండగానే మరోవైపు పోలీసులు దర్యాప్తు కూడా చేస్తున్నారు. ఒకేసారి, ఒకేచోట రెండు రైళ్ళు పట్టాలు తప్పి నదిలో పడిపోవడం వెనుక మరేవయినా కారణాలున్నాయా?అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

ఆయన చేతులూ తినేయడం ఖాయం... మోదీపై వర్మ ట్వీట్లు

  ఇతరులను విమర్శించడం అనేది విమర్శల వర్మ రాంగోపాల్ వర్మకు వెన్నతో పెట్టిన విద్య. ఆయన విమర్శల బాణాలకు ఎవరైనా బలవ్వాల్సిందే. ఆఖరికి ఆయన దేవుడినే వదలలేదు పాపం మనుషులను ఏం వదులుతాడు. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ మీద విమర్సలు విసిరారు. అంటే ప్రత్యక్షంగా ఎక్కడా మోదీ పేరు వినిపించకపోయినా పరోక్షంగా మాత్రం మోదీనే విమర్శించారని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఫోర్న్ సైట్లను నిషేదించిన సంగతి తెలిసిందే. దీనిపై రాంగోపాల్ వర్మ విమర్శిస్తూ ట్వీట్టర్ లో ట్వీట్లు కూడా చేశారు. అయితే ఇప్పుడు మోదీ పై విమర్శలు చేసినట్టు తెలుస్తోంది. సోషల్ మీడియా ద్వారా ఆయన హీరో అయ్యారని.. సోషల్ మీడియా ఆయనను హీరో చేసిందని.. తనకు కూడు పెట్టిన సోషల్ మీడియా చేతులనే ఆయన తినేశారని వర్మ విమర్శించారు. ఇప్పుడు ఇప్పుడు అదే సోషల్ మీడియా ఆయన రెండు చేతులనూ తినేయడం ఖాయమని ఆయన అన్నారు.

పవన్ కళ్యాణ్ గడ్డం సీక్రెట్

  జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన తాజా సినిమాకు సర్ధార్ అనే పేరును ఖరారు చేశారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ సర్దార్ సినిమా తరువాత రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తారని.. రాజకీయ క్షేత్రంలో తడాఖా చూపించడానికి సిద్దమవుతున్నారని ఊహాగానాలు మొదలయ్యాయి. ఎందుకంటే ఎన్టీ రామారావు కూడా సర్దార్ పాపారాయుడు సినిమా తీసిన తరువాతే రాజకీయాల్లోకి వచ్చి ఒక ఊపు ఊపేశారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా అదే తరహాలో సర్దార్ సినిమా తీసిన తరువాత రాజకీయాల్లో ఒక ఊపు ఊపుతారని అంటున్నారు. ఈ చిత్రం కోసమే పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా గడ్డం పెంచారని.. ఈ సినిమాలో పాత్రకు.. సర్దార్ పాపారాయుడు సినిమాలో ఎన్టీఆర్ పాత్రకు దగ్గర పోలికలున్నాయని అంటున్నారు. కాగా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రంగ ప్రవేశం చేసే ముందు సర్దార్ పాపారాయుడు వచ్చింది.. అదే విధంగా సర్దార్ చిత్రం పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి ప్రవేశించడానికి పనికి వస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు.

కేసీఆర్ పాలనను గాలికొదిలేశారు

  ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రతిపక్షనేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. టీడీపీ, కాంగ్రెస్, వామపక్ష నాయకులు వరుసపెట్టి కేసీఆర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ గారు బంగారు తెలంగాణ చేస్తానని మాటలైతే చెప్పారు కాని చేతలు మాత్రం నిల్లని విమర్శిస్తున్నారు. అసలు ఆయన సచివాలయానికే వెళ్లనిది పాలన ఎక్కడ నుండి చేస్తారని.. పాలనను గాలికొదిలేశారని మండిపడ్డారు. మరోవైపు అధికారంలోకి రావడానికి హామీల హామీల మీద ఇచ్చారని.. ఇప్పుడు సరిగా ఒక్కటి కూడా నెరవేర్చట్లేదని అన్నారు. ప్రతి ఒక్క కుటుంబానికి ఒక ఇల్లు కట్టిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి ఏడాది పైన అవుతున్నా ఇంత వరకూ ఒక్క ఇల్లు కూడా కట్టించలేదని ఎద్దేవ చేశారు. సాధ్యం కాని హామీలను ఇచ్చి గద్దెనెక్కారని మండిపడ్డారు. కెసిఆర్ అధికారంలోకి రాకముందు ఓ మాట, వచ్చాక మరో మాట చెబుతున్నారన్నారు. టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ తీర్చాలంటే ఇంకో 25 ఏళ్లు పడుతుందని.. ప్రస్తుతం తెలంగాణ ఖజానా ఖాళీ అయింది ఇంక ఎలా హామీలన్నీ తీర్చుతారని.. కేసీఆర్ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని అన్నారు.

హైకోర్టు కూడా విడిపోవాల్సిందే.. వెంకయ్యనాయుడు

  ప్రస్తుతం రెండు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాల్లో హైకోర్టు వివాదం కూడా ఒకటి. ఈ విషయంపై తెలంగాణ వాదులు వాదనలు జరుపుతూనే ఉన్నారు. దీనిపై టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి కూడా లోక్ సభులో ప్రస్తావించారు. రెండు రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టును తప్పక విభజించాలని.. ఇప్పటికే ఈ విషయంపై చాలాసార్లు కేంద్ర మంత్రులతో చర్చించామని సీఎం కేసీఆర్ కూడా ఇదే విషయాన్ని కేంద్రానికి తెలియజేశారని చెప్పారు. అయినా ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ లో ఏపి సిఎం, సచివాలయం, డిజిపి ఉన్నప్పుడు హైకోర్టు ఉంటే తప్పేంటి అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయినప్పుడు హైకోర్టు కూడా విడిపోవాల్సిందే.. అయితే హైకోర్టు విభజన పై ఇప్పటికే కేంద్రం ప్రయత్నాలు చేస్తుందని.. దీనిపై న్యాయశాఖ కసరత్తు చేస్తోందని చెప్పారు.

గ్రేట్ బాస్.. ఒక్కో ఉద్యోగికి కోటిన్నర బోనస్

  ఒక కంపెనీ ఉన్నత స్థాయికి చేరాలంటే ఆ కంపెనీ యాజమానే కాదు అందులో పనిచేసే ఉద్యోగులది ఎంతో కీలక పాత్ర ఉంటుంది. అందుకే చాలా కంపెనీలు ఉద్యోగులకు బోనస్ లంటూ అప్పుడప్పుడు పార్టీలంటూ ఏర్పాటు చేసి వారిని ఉత్తేజపరుస్తారు. అయితే ఇక్కడ ఓ వ్యాపార వేత్త ఒకటి కాదు రెండు కాదు రెండు లక్షల డాలర్లు అంటే కోటిన్నర రూపాయలు బోనస్ గా ఇచ్చి ఉద్యోగులను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఆ వివరాలు చూద్దాం..   టర్కీకి చెందిన నెవ్‌జాత్ అదియాన్ వ్యక్తికి యెమక్‌సేపతి.కామ్ అనే ఆన్‌లైన్ కంపెనీ ఉంది. అయితే అతను తన కంపెనీని జర్మనీకి చెందిన ‘డెలివరీ హీరో అనే వ్యాపారవేత్తకు ఈ ఏడాది మేలో 589 మిలియన్ డాలర్లకు అమ్మేశాడు. అయితే నెవ్‌జాత్ తన కంపెనీని అమ్మగా వచ్చిన డబ్బులో కొంత డబ్బున ఉద్యోగులకు అందించాలని సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతే తన కంపెనీ ఇంత పైకి రావడానికి తన ఉద్యోగులే కారణమని అందులోనే 27 మిలియన్ డాలర్లు అంటే 173 కోట్లను ఉద్యోగులకు కేటాయించాడు. దీంతో ఆ కంపెనీలు పని చేసిన ఒక్కో ఉద్యోగీ దాదాపు కోటిన్నర దక్కించుకున్నారు. ఇంకేముంది తన యాజమాని చేసిన ఈ పనికి ఉద్యోగులు ఉబ్బితబ్బిబయ్యారంట. కొంతమందైతే ఆనందంతో ఏడ్చేశారంట కూడా. ఇలాంటి బాస్ అందరికి ఉంటే ఎంత బావుండో..

తెలుగు రాష్ట్రాల ఎంపీలకు వెంకయ్య మద్ధతు

  దేశంలోని ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రమంత్రి ఇంద్రజిత్ సింగ్ చెప్పిన సంగతి తేలిసిందే. దీనిపై ఏపీలో కూడా నిరసనలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఏంపీలు కూడా పార్లమెంట్ లో ఆందోళనకు దిగారు. దీనిలో భాగంగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రత్యేక హోదా పై మంగళవారం పార్లమెంట్ లో వివరణ ఇచ్చారు. ప్రత్యేక హోదా చాలా సున్నితమైన అంశమని.. ఇది విభజన చట్టంలో లేదని.. కాని దీనిపై ఆర్ధిక శాఖ చర్చలు జరుపుతుందని.. ఇచ్చిన హామీ నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తామని తెలిపారు. అంతేకాక ప్రత్యేక హోదా విషయంపై తెలుగు రాష్ట్రాల ఎంపీలు చేసే ఆందోళనలో అర్ధం ఉందని ఎంపీలకు మద్దతుగా నిలిచారు.

ఆడవాళ్లు అర్ధ్రరాత్రి తిరగాలంటే.. ఆప్ ఎమ్మెల్యే

  ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటివరకూ పలువురు నాయకులు పలు వివాదాల్లో చిక్కుకొని జైలుకు ఆఖరికి పదవులు కూడా పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు కొత్తగా సోమనాథ్ భారతి చేసిన వ్యాఖ్యలు పార్టీకి తలనొప్పిగా మారాయి. గతంలో ఒకసారి ఈ ఎమ్మెల్యే మీద తన భార్య గృహహింస చట్టం కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈయన గాంధీ తరహాలో వ్యాఖ్యానించినా అది పలు విమర్శలకు దారితీసింది. అయితే గాంధీ గారు అర్ధ్రరాత్రి ఆడవాళ్లు ఒంటరిగా తిరగగలిగినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్టు అని చెపితే ఈ ఎమ్మెల్యేగారు దాని కాస్త కొంచం వ్యంగ్యంగా అందమైన అమ్మాయిలు అర్ధ్రరాత్రి స్వేచ్ఛగా తిరగాలంటే పోలీసు వ్యవస్థ ఆప్ చేతిలో ఉండాలని అసెంబ్లీలో వ్యాఖ్యానించారు దీంతో సోమనాథ్ భారతి చేసిన వ్యాఖ్యలపై విమర్శలు చెలరేగాయి. ఈ వ్యాఖ్యలకు కాంగ్రెస్ నాయకురాలు స్పందించి సోమనాథ్ వ్యాఖ్యలు వికారం తెప్పిస్తున్నాయని.. ప్రతి అక్షరం మహిళను అగౌరపరిచేదిగా ఉందని విమర్శించారు. అటు బీజేపీ కూడా సోమనాథ్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.   ఇదిలా ఉండగా ఈ విమర్శలకు స్పందించిన సోమనాథ్ పోలీసు వ్యవస్థ మా చేతిలో ఉంటే మహిళలకు పూర్తి భద్రత కల్పిస్తామని.. ఓ మహిళ ఒంటినిండా నగలు ధరించి నడిరాత్రి స్వేచ్ఛగా బయట తిరగడం మహిళా రక్షణకు సంబంధించినంతవరకూ గొప్ప విషయం కాదా.. అలాంటి భద్రతే మేం కల్పిస్తామని చెపుతున్నామని.. పైగా అదే తన ఉద్దేశమని తన వ్యాఖ్యలను కప్పిపుచ్చుకున్నా

కాంగ్రెస్ నేతల సస్పెన్షన్.. నల్లబ్యాడ్జీలతో నిరసన

  పార్లమెంట్ వర్షాకల సమావేశాలు ప్రారంభమైన రోజు నుండి ఆందోళనలతో పార్లమెంట్ అట్టుడిపోతున్న సంగతి తెలిసిందే. అసలు ఈ సమావేశాలకు ముందే ప్రధాని మోడీ అఖిల పక్ష భేటీ నిర్వహించిన నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు తమ డిమాండ్ లు వినకపోతే సభ సజావుగా సాగనివ్వబోమని అప్పుడే తేల్చి చెప్పారు. వారు చెప్పినట్టుగానే మాటనిలబెట్టుకుంటున్నారు ఇప్పుడు సభను సజావుగా సాగనివ్వకుండా ఆందోళనలు చేస్తున్నారు. ముఖ్యంగా లలిత్ మోదీ వ్యవహారంపై సుష్మాస్వరాజ్, వసుంధరా రాజేలు రాజీనామా చేయాలని పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలోనే సోమవారం కూడా ఆందోళనలు చేపట్టారు.. స్పీకర్ సభ సజావుగా సాగాలని.. దానికి సహకరించాలని కోరినా వినకపోవడంతో కాంగ్రెస్ 27 మంది ఎంపీలను 5 రోజులపాటు సస్పెండ్ చేసింది.   ఇప్పుడు స్పీకర్ కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేయడంపై ఆపార్టీ నేతలు దర్నాకు దిగారు. పార్లమెంట్ ఆవరణలో మహాత్మాగాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహులు గాంధీ, మాజీ ప్రదాని మన్మోహన్ సింగ్ లు, గులాం నబీ అజాద్ లు ధర్నా చేపట్టారు. వీరంతా నల్ల బాడ్జీలు ధరించి తమ నిరసన తెలియచేశారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఈ ధర్నాకు సమాజవాది పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, జెడి యు, వామపక్షాలు మొదలగు పలు ఇతరపార్టీలు సంఘీభావం తెలిపాయి. ఈ సందర్భంగా సోనియాగాంధీ మాట్లాడుతూ కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్ న్యాయసమ్మతమైనది కాదని.. ఇది ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడేమని అన్నారు.

రెండు రాష్ట్రాల మధ్య చదువుల రగడ

    రెండు రాష్ట్రాల మధ్య ఇప్పటికే ఉద్యోగుల రిలీవింగ్ పై వాదనలు జరుగుతూనే ఉన్నాయి. అది ఒక కొలిక్కి రాలేదు.. ఇప్పుడు మళ్లీ రెండు రాష్ట్రాల మధ్యం చదువుల వివాదం మరింత పెరిగిపోయింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పరిధి వరకే అడ్మిషన్లు జారీ చేసేందుకు నోటీఫికేషన్ తయారుచేయనుంది. అయితే ఈ విషయంలో గతంలో గవర్నర్ జోక్యం చేసుకున్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం అవేమి పట్టించుకోకుండా ఏపీ విధ్యార్దులకు అడ్మిషన్లను నిలిపివేసింది. దీంతో పదో షెడ్యూల్‌ పరిధిలోని యూనివర్సిటీల్లో ఏపీ విద్యార్థులకు ఈ ఏడాది ప్రవేశాలు నిలిచిపోయాయి. తెలంగాణ యూనివర్సిటీ అయితే ఏకంగా ఒక మెట్టక్కి ఆ యూనివర్శిటీలో పని చేసే ఏపీ ఉద్యోగులకు ఈ నెల నుండి జీతాలు కూడా నిలిపివేస్తున్నట్టు తెలిపింది.   అసలు ఏటా ఏపీకీ చెందిన అనేక మంది విద్యార్ధులు యూనివర్శిటీల నుండి లక్షల సంఖ్యలో చదువుకుంటారు. ఓపెన్‌ వర్సిటీ, జవహర్‌లాల్‌ నెహ్రూ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీలు ప్రధానమైన కోర్సులను అందిస్తుండడంతో అనేక మంది వస్తుంటారు. ఒక్క అంబేద్కర్‌ ఓపెన్‌ వర్సిటీలో వివిధ కోర్సుల్లో 70వేల మంది ఏపీ విద్యార్థులు అడ్మిషన్లు తీసుకుంటారు. అలాంటిది ఇప్పుడు తాము కూడా కేవలం తెలంగాణ వరకే అడ్మిషన్లు ఇస్తున్నామని తెలిపింది. దీంతో ఏపీ ప్రభుత్వం గవర్నర్ కు ఫిర్యాదు చేయడంతో గవర్నర్ తెలంగాణ ముఖ్యకార్యదర్శిని కలిసి ఎవరికీ అన్యాయం జరగకుండా చూడాలని సూచించారు.   మరోవైపు ఇదే విషయంపై హైకోర్టు తెలంగాణ ప్రభుత్వం పై మండిపడింది. ఏ చట్టాన్ని అనుసరించి ఏపీ విద్యార్ధులకు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ(బీఆర్‌ఏఓయు) అందిస్తున్న సేవలను నిలిపి వేశారని ప్రశ్నించింది. అలా నిలిపివేయాలని ఏ చట్టంలో ఉందో చూపాలని మండిపడింది. ఒక రాష్ట్రంలో ఉన్న యూనివర్శిటిలో ఆ రాష్ట్ర విద్యార్ధులే చదవాలని లేదు.. దేశంలోని ఏ రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీలో విద్యార్ధులు చదువుకునే అవకాశం ఉందని.. అందులోనూ అదీ ఓపెన్‌ వర్సిటీలో ఇలాంటి ఆంక్షలేంటి? అని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దిలీప్‌ బీ భోసాలే, జస్టిస్‌ ఎస్‌వీ భట్‌లతో కూడిన ధర్మాసనం వర్సిటీ తరపు న్యాయవాదిని నిలదీసింది. దీనిపై వివరణ ఇచ్చేందుకు వర్సిటీ రిజిస్ర్టార్‌ను కోర్టుకు హాజరవ్వాలని ఆదేశిస్తామని హెచ్చరించింది.

ఏసీబీ కోర్టులో రేవంత్.. రోజూ సంతకం చేస్తున్నా వేధిస్తున్నారు

  ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ఈ రోజు ఏసీబీ కోర్టులో హజరయ్యారు. అయితే గతంలోనే రేవంత్ రెడ్డి ఏసీబీ కోర్టులో హాజరవ్వాలి కానీ హైకోర్టు రేవంత్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ ఇవ్వడంతో కోర్టుకు హాజరుకాలేకపోయారు. ఇదే విషయాన్నిరేవంత్ రెడ్డి కూడా తెలయజేశారు. తనను కోర్టు తన నియోజకవర్గం అయిన కొడంగల్ నుండి ఎక్కడికి వెళ్లొద్దని చెప్పిన నేపథ్యంలో తాను కోర్టుకు హాజరుకాలేదని తెలియజేశారు. అయితే తదుపరి విచారణకు మాత్రం తప్పనిసరిగా హాజరుకావాలని న్యాయమూర్తి చెప్పడంతో ఈరోజు రేవంత్ రెడ్డి ఇంకా ఈ కేసులో నిందితులుగా ఉన్న సెబాస్టియన్, ఉదయ్ సింహాలు కూడా కోర్టుక హాజరయ్యారు. అయితే చార్జిషీట్ విచారణ తర్వాత కోర్టుకు హాజరుకావాలని చెప్పినా ఎందుకు వచ్చారంటూ న్యాయమూర్తి వారిని ప్రశ్నించగా ఏసీబీ అధికారులు ముందు విచారణకు హాజరుకావాలని... కోర్టుకు వెళ్లాలని సూచించడంతో కోర్టుకు వచ్చామని చెప్పారు. కాగా.. రోజూ ఏసీబీ అధికారుల దగ్గరకు వెళ్లి సంతకం చేస్తున్నా వారు వేధింపులకు గురిచేస్తున్నారని ఉదయసింహా న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. న్యాయమూర్తి తదుపరి విచారణను ఈనెల 14వ తేదికి వాయిదా వేశారు.

ఆధార్ అనుసంధానం.. ఓటు తొలగించం

  ఓటరు కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేస్తున్నామని.. ఒకవేళ ఓటర్ కార్డుతో ఆధార్ అనుసంధానం లేకపోయినంత మాత్రాన ఓటు తొలగించబోమని తెలుగు రాష్ట్రాల ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ అన్నారు. కరీంనగర్ లోని మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండు రాష్ట్రాల్లోనూ ఓటర్ కార్డుతో ఆధార్ అనుసంధానం పూర్తిచేస్తామని.. ఆగష్ట్ 15 లోపు ఈ అనుసంధానం పూర్తి చేస్తామని తెలిపారు. తెలంగాణలో తెలంగాణలో ఇప్పటికి వరకు 80శాతం అనుసంధాన ప్రక్రియ పూర్తి చేశామని నిజామాబాద్‌ జిల్లాలో వందశాతం అనుసంధానం పూర్తయిందని భన్వర్‌లాల్‌ తెలిపారు. ఆధార్ అనుసంధానం మొబైల్‌పాయింట్ల ద్వారా చేసుకోవచ్చని ఆయన వివరించాడు.