తలసాని రాజీనాపై నాయిని సంచలన వ్యాఖ్య.. ఆయన ఎప్పడు చేశారు

  తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామా పై తెలంగాణ హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ పార్టీ నుండి గెలుపొంది ఆపార్టీలో రాజీనామా చేయకుండానే తరువాత టీఆర్ఎస్ పార్టీ మారి మంత్రి పదవి కొనసాగిస్తున్న తలసానిపై పలువురు రాజకీయ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై టీడీపీ నేతలు గవర్నర్ కు ఫిర్యాదు కూడా చేశారు. ఈ కేసుపై విచారణ జరిపిన హైకోర్టు కూడా ఈ విషయంలో తాము యాక్షన్ తీసుకోవడానికి లేదని.. కాని స్పీక్పర్ ఏదో ఒక చర్య తొందరగా తీసుకోవాలని సూచించింది. ఇదిలా ఉండగా నిన్న తెలంగాణ భవన్ లో నాయిని నర్సింహారెడ్డి, ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రి జగదీశ్వర్ రెడ్డి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా విలేకరులు తలసాని రాజీనామా గురించి, సనత్ నగర్ ఉపఎన్నిక గురించి నాయినిని ప్రశ్నించారు.  దీనికి నాయిని సనత్ నగర్ కు ఉపఎన్నిక ఎందుకు తలసాని ఏమైనా రాజీనామా చేశారా అంటూ వ్యాఖ్యానించడంతో ఇప్పుడు అందరికి పెద్ద చర్చాంశనీయంగా మారింది.

అమరావతికి జగన్ వెళ్తాడా? వెళ్లడా?

నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన మహోత్సవానికి దేశ విదేశీ ప్రతినిధులతోపాటు ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు, అతిరథ మహారథులంతా తరలిరానున్నారు, కానీ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి మాత్రం వెళ్లకూడదదని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది, గతంలో సీఎం చంద్రబాబు ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి కూడా హాజరుకాని జగన్... అమరావతికి కూడా వెళ్లకూడదని డిసైడయ్యారు, దీనికి గుంటూరులో చేపట్టిన దీక్ష ఒక కారణమైతే... పద్ధతి ప్రకారం పిలవకపోవడం మరో కారణమని వైసీపీ నేతలంటున్నారు, ఏదో మొక్కుబడిగా ఓ లెటర్ పంపించారని, అందుకే నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్లకూడదని జగన్ నిర్ణయించుకున్నారని చెబుతున్నారు

పార్టీ మారడం లేదు.. దిగ్విజయ్ కు దానం సలహా

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దానం నాగేందర్ పార్టీ మారుతున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దానంకు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి దిగ్విజయ్ సింగ్ గురువారం ఫోన్ చేసినట్టు తెలుస్తోంది. తన పార్టీ మార్పుపై ఆరా తీసినట్టు.. దీనికి దానం నాగేందర్ తమ పార్టీ మార్పుపై వస్తున్న వార్తల్లో నిజం లేదని.. తనకి పార్టీ మారే ఆలోచన లేదని చేప్పినట్టు సమాచారం. అంతేకాదు ఈ సందర్భంగా ఆయన దిగ్విజయ్ సింగ్ కు ఒక సలహా కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. పార్టీలో పనిచేసే వారికి ప్రాధాన్యత ఇవ్వాలని దానం దిగ్విజయ్‌సింగ్‌ కు సూచించారు.

ఒక్క మాట.. జగన్ ను ఇరకాటంలో పడేసిందా?

అప్పుడప్పుడు ఆవేశంతో మాట్లాడే కొన్ని మాటలు వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితే వైకాపా అధ్యక్షుడు జగన్ కు ఎదురైంది. ప్రస్తుతం జగన్ ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ గుంటూరు దీక్ష చేస్తు బిజీగా ఉన్నారు. అయితే ఈ దీక్షలో ఒక ఆసక్తికర వ్యాఖ్య చేశారు అదేంటంటే తాను ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం పాటుపడుతున్నానని చెప్పారు. ఇప్పుడు ఈ ఒక్క పాయింట్ జగన్ కు ఇబ్బందికరంగా మారనుందా అంటే అవుననే అనుకుంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దీనిలో భాగంగానే ఇప్పుడు అందరి సందేహం ఒక్కటే. అది జగన్ అమరావతి శంకుస్థాపనకు వస్తాడా?రాడా? అని. ఎందుకంటే దసరా రోజు అక్టోబర్ 22న ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది. దీనికి చంద్రబాబు ఎంతో మంది అతిధులను ఆహ్వానించారు. వారితో పాటే ప్రతిపక్షనేత అయిన జగన్ కు కూడా ఆహ్వానం అందింది. అయితే ముందునుండి జగన్ ఏపీ రాజధాని కోసం ప్రభుత్వం చేపట్టిన భూసేకరణను తీవ్రస్థాయిలో విమర్శించారు. అంతేకాదు రైతుల భూములను అన్యాయంగా లాక్కుంటున్నారంటూ.. తాను కనుక పదవిలోకి వస్తే వారి భూములను వారికి ఇచ్చేస్తా అని కూడా అన్నారు. మరి అలాంటి ప్రగల్భాలు పలికిన జగన్ ఇప్పుడు ఈ అమరావతి శంకస్థాపన కార్యక్రమానికి వస్తారా? రారా అని సందేహం. మరి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం తాను పాటుపడుతున్నానని చెప్పిన జగన్ ఈ శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్లకపోతే ప్రజలలో వ్యతిరేక భావం వస్తుంది. అందులో ఏపీ భవిష్యత్తు అయిన..రాజధాని నిర్మాణానికి దూరంగా ఉండటం వల్ల తాను ఏపీ రాజధానికి వ్యతిరేకం అనే రాంగ్ సిగ్నల్స్ పంపించినట్టు ఉంటుంది. అందులోనూ ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ తోపాటు దేశ విదేశాల నుండి ప్రముఖులు వస్తున్న నేపథ్యంలో జగన్ వారికి దూరంగా ఉండటం కూడా నష్టమే. మరి జగన్ ఇన్ని సమస్యల మధ్య అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్తారో లేదో చూడాలి.

హరీష్ రావును కేసీఆర్ సైలెంట్ గా తప్పిస్తున్నాడా?

తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావును చూసి ఇప్పుడు అందరూ జాలీ పడుతున్నారట. ఎందుకంటే ముఖ్యమంత్రి కేసీఆర్ మేనల్లుడైన హరీష్ రావును పదవి నుండి తప్పించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి అది అటో ఇటో అనే విషయం ఒక వారంలో తెలియనుంది. ఇంత సడెన్ గా హరీష్ రావును పదవి నుండి ఎందుకు తప్పిస్తున్నట్టు.. టీఆర్ఎస్ పార్టీలో మంచి వాక్చాతుర్యం ఉండి.. మంచి బలమైన నాయకుడిగా మంచి పేరు ఉన్న హరీశ్ రావును పదవి నుండి తప్పిండానికి గల కారణాలు ఎంటని ఆలోచిస్తున్న అందరికి అంత పెద్ద సమాధానాలు కూడా ఏం కనిపించకపోవచ్చు. ఎందుకంటే అది కేవలం హరీష్ రావు నాయకత్వానికి కేసీఆర్ భయపడటమే అని అర్ధమవుతోంది. గత కొద్దిరోజులుగా కేసీఆర్ కుటుంబానికి.. హరీష్ రావుకు మధ్య అభ్యంతరాలు తలెత్తినట్టు వార్తలు వింటూనే ఉన్నాం. అందుకు కారణం హరీష్ రావుకు బలమైన నాయకత్వం ఉంటబట్టే. ఓ రకంగా చెప్పాలంటే తరువాత కేటీఆర్ కు కాని.. కూతురు కవితకు కాని అంత బలమైన నాయకత్వపు లక్షణాలు లేవు.. కేసీఆర్ తరువాత ఆ స్థానాన్ని ఆక్రమించగల వ్యక్తి హరీష్ రావు. అందుకే ఈ భయంతోనే కేసీఆర్ ఎక్కడ తనను మింగేస్తాడో అని.. తన కొడుకు కేటీఆర్ ప్రభావం హరీశ్ వల్ల ఎప్పుడూ దిగువగానే ఉండటంతో వీటిని దృష్టిలో పెట్టుకొని తాను హరీష్ ను పదవి నుండి తొలగించాలని ఆలోచించినట్టు తెలుస్తోంది. మరి హరీష్ రావును మంత్రి పదవి నుండి తొలగిస్తే తాను ఊరుకుంటాడా.. తను వేరే పార్టీ నిలవగల సత్తా ఉన్న మనిషి. అందుకు కేసీఆర్ చాలా తెలివిగా ఆలోచించి టీఆర్ఎస్ కు ఒక ప్రజా నేత కావాలంటూ.. పార్టీని బలోపేత చేయగల మంచి చరిష్మా ఉన్న నాయకుడు కావాలంటూ.. దానికి హరీశ్ రావు అయితే కరెక్ట్ అని వెన్న పూసినట్టి పదవి నుండి తప్పించి  ప్రధాన కార్యదర్శిగా నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. మంత్రి పదవి కొనసాగిస్తూ ఈ బాధ్యత చేపట్టాలంటే కష్టం..  గ్రామాల్లో విస్తృత పర్యటనలు చేసి అన్ని స్థాయిల్లోనూ కార్యకర్తలకు జవజీవాలు కల్పించాలంటే ఆ పదవిలో ఉంటూ చేయడం కష్టం అందుకే మంత్రి పదవి నుండి తప్పించి ఇలా హరీష్ కు ఐస్ పూస్తున్నారు కేసీఆర్. మొత్తానికి కేసీఆర్ ఎత్తుగడలకు పాపం హరీశ్ కూడా బలైపోతున్నాడని కొంత మంది నేతలు అనుకుంటున్నారు. అయితే రాజకీయంగా ఎన్నో చూసినా హరీష్ రావుకు తన మామ తనపై ప్రయోగించే తంత్రాలను తెలుసుకోలేరు అని కూడా అనుకోలేం. చూద్దాం ఈ వారం రోజుల్లో ఏం జరుగుతుందో.

చంద్రబాబు కాదు ఆయన బాబు తరం కాదు.. రోజా

ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేపట్టిన దీక్ష రెండోరోజుకు చేరింది. ఈ దీక్ష సందర్భంగా ఆపార్టీ ఎమ్మెల్యే రోజా టీడీపీపై మండిపడ్డారు. తమ పార్టీనేత చేపట్టిన దీక్షను చూసి టీడీపీ నేతలు మైండ్ బ్లాక్ అయిందని విమర్శించారు. జగన్ దీక్షను ఆపడం చంద్రబాబు వల్లకాదు కదా ఆయన బాబు వల్ల కూడా కాదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా అంటే అధికార పార్టీకి పచ్చిమిరపకాయలు తిన్నట్టు మంటెక్కిపోతున్నారని.. అందుకే వారు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని.. ఒక్కొక్కరూ కాదు వంద మంది టీడీపీ నేతలు వచ్చి విమర్శించినా... తమ పార్టీ లెక్క చేయదని అన్నారు. అసలు ప్రత్యేక హోదాపై టీడీపీ నేతలు అనుకూలమో లేక వ్యతిరేకమో చెప్పే దమ్ము ధైర్యం లేవన్నారు.

నన్ను అడుగుతున్నారు.. అప్పుడు మీరేం చేశారు.. కేసీఆర్

  రైతు ఆత్మహత్యలపై అసెంబ్లీలో రెండు రోజులపాటు చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ప్రతిపక్షాలు అధికార పార్టీపై విరుచుకపడ్డాయి. అయితే కేసీఆర్ మాత్రం ఈవ్యవహారంపై గత ప్రభుత్వాల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో ఏళ్ల తరువాత తెలంగాణ  రాష్ట్రాన్ని సాధించుకున్నామని.. 58 ఏళ్లపాటు ఉమ్మడి రాష్ట్రంలో అరాచక పాలన చేశారు.. రాష్ట్రాన్ని నాశనం చేశారని.. ఇందుకు కారణం ఎవరని అన్నారు. ఈ 58 ఏళ్లపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్, టీడీపీ హయాంలో తెలంగాణకి నష్టం జరిగిందని.. రైతు సమస్యలపై ఇప్పుడు మాట్లాడుతున్నారు.. వారి పాలన అప్పుడు వారేం చేశారు.. వారు పాలనలో ఉన్నప్పుడు రైతుల ఇళ్లకు బంగారు వాసాలు కట్టించారా? అని ప్రశ్నించారు. ఈ 58 ఏళ్లు రాష్ట్రాన్ని నాశనం చేసి ఇప్పుడు రాష్ట్రానికి ఏం చేశారు అని అంటున్నారు.. ఇన్నేళ్లు రాష్ట్రాన్ని నాశనం చేసిన మీరు ఈ 15 నెలల్లో మీరే చేయలేదని అడిగితే ఎట్లా అని అన్నారు.

ఏపీ టైప్ లో పంజాబ్ లోనూ కాంగ్రెస్ కు దెబ్బ

రాహుల్ గాంధీకి ఇంకా మెచ్యూరిటీ రాలేదంటూ గతంలో సంచలన వ్యాఖ్యలు చేసిన పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అమరీందర్ సింగ్... పార్టీకి గుడ్ బై చెబుతారంటూ వార్తలు వస్తున్నాయి, ప్రస్తుతం లోక్ సభలో కాంగ్రెస్ ఉపనేతగా ఉన్న అమరీందర్... పంజాబ్ వికాస్ పేరుతో కొత్త పార్టీ పెట్టబోతున్నారని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి, అమరీందర్ కొద్దిరోజులుగా కాంగ్రెస్ హైకమాండ్ తో అంటీముట్టనట్లుగా ఉంటున్నారని, ఇటీవల జరిగిన పార్లమెంట్ సెషన్స్ కు కూడా సరిగా హాజరుకాలేదని అంటున్నారు, అయితే అమరీందర్ కొత్త పార్టీ పెడితే... వచ్చే ఎన్నికల్లో తీవ్రంగా నష్టపోతామని గుర్తించిన కాంగ్రెస్ పెద్దలు...నష్ట నివారణ చర్యలకు దిగారు, అమరీందర్ ను బుజ్జగించడానికి రంగంలోకి దిగిన కాంగ్రెస్ సీనియర్లు... ఆయన ఏ కోరిక కోరినా అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు, అమరీందర్ కోరితే పీసీసీ అధ్యక్షుడిగా కూడా నియమిస్తామని కాంగ్రెస్ అధికార ప్రతినిధి షకీల్ అహ్మద్ తెలిపారు. అయితే బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో అమరీందర్ సింగ్ టచ్ లో ఉన్నాడని, కొత్త పార్టీ పెట్టడానికే మొగ్గుచూపుతున్నాడని సన్నిహితులు అంటున్నారు.

బీఫ్ పార్టీ ఇచ్చాడని ఎమ్మెల్యేపై బీజేపీ అటాక్

  బీఫ్ వివాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారుతోంది, అనేక రాష్ట్రాల్లో ఒకరిపై మరొకరు దాడులు చేసుకుంటుంటే, కొన్నిచోట్ల చంపుకునే వరకూ వెళ్తోంది, తాజాగా జమ్మూకాశ్మీర్ అసెంబ్లీలో ఏకంగా ఎమ్మెల్యేపైనే దాడి జరిగింది, బీఫ్ పార్టీ ఇచ్చిన ఇండిపెండెంట్ ఎమ్మెల్యే రషీద్ పై బీజేపీ ఎమ్మెల్యేలు భగత్, రాజీవ్ శర్మలు దాడికి దిగి చితకబాదారు, అసెంబ్లీలో అందరూ చూస్తుండగా, స్పీకర్ ఎదుటే దాడికి పాల్పడటంతో మిగతా ఎమ్మెల్యేలంతా విస్తుపోయారు, బీజేపీ ఎమ్మెల్యేల బారి నుంచి రషీద్ ను కాపాడటానికి విపక్ష సభ్యులు తీవ్రంగా కష్టపడాల్సి వచ్చింది. బీఫ్ ను నిషేధించినా తాను తింటానని చెప్పడమే కాకుండా, బీఫ్ పార్టీ ఇచ్చినందుకే రషీద్ పై బీజేపీ ఎమ్మెల్యేలు దాడి చేసినట్లు తెలుస్తోంది, అయితే ఎమ్మెల్యేపై దాడి చేయడాన్ని విపక్ష నేత ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా ఖండించారు

బ్లాక్ లిస్ట్ లో పెడతామంటూ నిర్మల వార్నింగ్

కేంద్రం ఆదేశాల మేరకు రైతుల నుంచి పొగాకు కొనుగోలు చేయకపోతే వ్యాపారులను బ్లాక్ లిస్ట్ లో పెడతామంటూ కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ హెచ్చరించినట్లు తెలుస్తోంది. కేంద్రం ఆదేశించినా వ్యాపారులు కొనుగోళ్లు జరపక పోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన నిర్మలా సీతారామన్... పొగాకు బోర్డు అధికారులు, వాణిజ్యశాఖ ప్రతినిధులతో అత్యవసరంగా సమావేశమై సమీక్షించారు. రైతుల ఆత్మహత్యలను నివారించేందుకు పొగాకు కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యాపారులు పాటించడం లేదంటూ ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నివేదిక ఇవ్వడంతో నిర్మల సీరియస్ అయ్యారు, కేంద్రం ఆదేశాలను పాటించకపోతే బ్లాక్‌లిస్టులో పెడతామంటూ పొగాకు వ్యాపారులకు హెచ్చరికలు పంపారు.

బాబు సర్కార్ పై పురంధేశ్వరి ఆరోపణలు

చంద్రబాబు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టిసీమ ప్రాజెక్టుపై తనకు అనేక అనుమానాలున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి... మరోసారి కీలక కామెంట్స్ చేశారు, రాష్ట్ర ప్రభుత్వ జాప్యం వల్లే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమవుతోందని ఆమె ఆరోపించారు, టీడీపీ ప్రభుత్వం గడువులోగా నివేదిక పంపకపోవడం వల్లే... కేంద్రం నుంచి నిధుల విడుదలలో జాప్యం జరిగిందన్నారు. జగన్ దీక్షపై కూడా కామెంట్స్ చేసిన పురంధేశ్వరి.... ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఆడతున్న డ్రామా అంటూ విమర్శించారు. విభజన చట్టంలో ప్రత్యేక హోదా గురించి లేకపోయినా, అధిక నిధులు కేటాయిస్తూ ఏపీని కేంద్రం ఆదుకుంటోందని గుర్తుచేశారు.

జగన్మోహన్ రెడ్డిపై రావెల తీవ్ర ఆరోపణలు

ఏపీకి ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ గుంటూరులో దీక్ష చేపట్టడాన్ని మంత్రి రావెల ఎద్దేవా చేశారు, జగన్ కు నిజంగా దమ్ముంటే... దీక్ష గుంటూరులో కాదు ఢిల్లీలో చేయాలని సవాలు విసిరారు, దొంగ దీక్షలు చేసే జగన్మోహన్ రెడ్డి... గుంటూరులో అలజడి సృష్టించాలని చూస్తున్నారని మంత్రి ఆరోపించారు. అమరావతి శంకుస్థాపనకు దేశ విదేశాల నుంచి వచ్చే అతిథులను అడ్డుకోవాలని జగన్ చూస్తున్నారని, జగన్ ప్రవర్తనను చూసి ఆ పార్టీ నేతలే అసహ్యించుకుంటున్నారని రావెల విమర్శించారు, నవ్యాంధ్రప్రదేశ్ ను పునాదుల నుంచి పునర్ నిర్మించడానికి చంద్రబాబు రాత్రీపగలూ కష్టపడుతుంటే, జగన్ అడ్డుపుల్లలు వేస్తూ అభివృద్ధి నిరోధక దీక్ష చేస్తున్నారని విమర్శించారు.

రెండోరోజుకి చేరిన జగన్ ప్రత్యేక దీక్ష

విభజన హామీల మేరకు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి... గుంటూరులో చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష రెండోరోజుకి చేరింది, స్పెషల్ స్టేటస్ పైనే నవ్యాంధ్రప్రదేశ్‌ భవిష్యత్తు ఆధారపడి ఉందని, అందుకోసం ఎంతకైనా తెగించి పోరాడదామని జగన్ పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా వస్తేనే యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్న ఆయన, ప్రతి పనికీ కేంద్రం నుంచి 90 శాతం గ్రాంటు, పది శాతం లోను వస్తాయన్నారు. స్టేటస్ లభిస్తే పరిశ్రమలకు పన్ను, ఎక్సైజ్‌ డ్యూటీలకు మినహాయింపు ఉంటుందని, అంతేకాకుండా ఇరవై ఏళ్లపాటు విద్యుత్‌ చార్జీలు సగం ధరే చెల్లించవచ్చన్నారు.దాంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ముందుకొస్తారని, తద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు,  ఇవన్నీ తెలిసి కూడా చంద్రబాబు ప్రత్యేక హోదాపై నోరు విప్పకపోవడం దౌర్భాగ్యమంటూ జగన్ వ్యాఖ్యానించారు.

కొన్నిటికే ‘ఆధార్‘.. తేల్చిచెప్పిన సుప్రీం

ఆధార్ కార్డుపై సుప్రీంకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు, ఎల్పీజీ గ్యాస్ కు తప్ప అన్నింటికీ ఆధార్ కార్డు తప్పనిసరి కాదంటూ గతంలో తేల్చిచెప్పిన అత్యున్నత ధర్మాసనం... మరోసారి అలాంటి వ్యాఖ్యలనే చేసింది. ప్రతిదానికీ ఆధార్ కార్డు కావాలని కోరడమంటే... అది వ్యక్తిగత స్వేచ్చను హరించడమేనని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అందుకే అన్నిటికీ ఆధార్ కార్డు  తప్పనిసరి కాదని, ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలకు మాత్రమే దాన్ని వినియోగించాలని సూచించింది. ఓటర్ కార్డుకు ఆధార్ ను లింక్ పెట్టడాన్ని కూడా తప్పుబట్టిన సుప్రీం... ఆధార్ కార్డు ఆధారంగా ఓట్లు తొలగించడం సరికాదంది. అయితే ఆధార్ కార్డు విషయంలో కేంద్రం వైఖరికి భిన్నంగా సుప్రీం ఆదేశాలు, సూచనలు ఉండటంతో ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు.

జగన్మోహన్ రెడ్డికి గంటా సవాల్

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రులు గంటా, అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు, భోగాపురం ఎయిర్ పోర్ట్ భూసేకరణకు వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొడుతున్న జగన్... రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శించారు, జగన్ మానసిక స్థితి సరిగా లేదని, అందుకే డెవలప్ మెంట్ కు అడ్డుపడుతున్నాడని ఆరోపించారు, భోగాపురంలో తనకు భూములున్నాయంటూ జగన్ చేసిన విమర్శలను ఖండించిన గంటా.... అక్కడ తనకు ఒక్క ఎకరం ఉందని నిరూపించినా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. వైఎస్ హయాంలో 117 కంపెనీలకు భూములిస్తే తప్పులేదు గానీ, రాష్ట్రాభివృద్ధి కోసం భూములు సేకరిస్తుంటే మాత్రం అడ్డుకుంటున్నారని గంటా మండిపడ్డారు.

కేసీఆర్ ముక్కు నేలకు రాయించేవాడిని.. నాగం

రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వ తీరుపై కేసీఆర్ పై నాగం జనార్ధనరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసెంబ్లీ వర్షాకల సమావేశల నేపథ్యంలో రైతు ఆత్మహత్యలపై చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశాల్లో ప్రతిపక్షాలన్నీ.. అధికార పక్షంపై ముకుమ్మడిగా దాడి చేశాయి. దీనిలో భాగంగా నాగం కేసీఆర్ పై విమర్శలు చేశారు. ఒకవేళ తాను కాని అసెంబ్లీ సమావేశాల్లో ఉండి ఉంటే రైతుల ఆత్మహత్యల విషయంలో.. ప్రభుత్వ వహిస్తున్న నిర్లక్ష్యాన్ని ఎండగట్టే వాడినని.. ముఖ్యమంత్రి కేసీఆర్ ముక్కును నేలకు రాయించేవాడినని ఘాటుగా వ్యాఖ్యానించారు. తనను ప్రశ్నిస్తున్నారని చెప్పి అసెంబ్లీ నుండి ప్రతిపక్షనేతలను సస్పెండ్ చేసి తన నియంతృత్వ పోకడను చూపించారని.. అసలు ప్రతిపక్షాలు లేని అసెంబ్లీ ఏం అసెంబ్లీ అని ఎద్దేవ చేశారు. అంతేకాదు కేసీఆర్ హఠావో.. కిసాన్ బచావో అంటూ సరికొత్త నినాదాన్ని తెరపైకి లేపారు. ఈనినాదంతో ఉద్యమం కూడా చేస్తున్నట్టు ప్రకటించారు. ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చినప్పుడు తెలియదా.. అసాధ్యం అని తెలిసినప్పుడు  ఎందుకు హామీలు ఇచ్చారు అని ప్రశ్నించారు. అంతేకాదు ప్రతిపక్షాలు ఈనెల 10న చేపట్టిన బంద్ కు తన పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు.

తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా

తెలంగాణ అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాలు ముగిశాయి. మొత్తం ఏడు రోజుల్లో 30గంటలపాటు బీఏసీలో నిర్ణయించిన అంశాలపై చర్చించారు, పదో తేదీ వరకూ సభ కొనసాగాల్సి ఉన్నప్పటికీ విపక్షాల సస్పెన్షన్ తో మూడ్రోజుల ముందే నిరవధిక వాయిదా పడింది, అయితే ప్రతిపక్షాలు లేకపోవడంతో చివరి మూడ్రోజులు సభ చప్పగా సాగింది, మొత్తం 30 గంటల 6 నిమిషాలపాటు చర్చ జరగగా, అధికార పార్టీ టీఆర్ఎస్ 18 గంటల 19 నిమిషాలు, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ 3 గంటల 56 నిమిషాలు మాట్లాడాయి. ఇక టీడీపీ 2 గంటల 7 నిమిషాలు, ఎంఐఎం రెండున్నర గంటలు, బీజేపీ గంటా 38 నిమిషాలు, వైసీపీ 42 నిమిషాలు, సీపీఐ 33 నిమిషాలు, సీపీఎం 21 నిమిషాలు మాట్లాడినట్లు స్పీకర్ తెలిపారు.