ప్రతిపక్షాల బంద్.. విఫలమైందన్న మంత్రులు
రైతు రుణమాఫీలను ఒకేసారి మాఫీ చేయాలని.. రైతుల ఆత్మహత్యలపై ప్రభుత్వ వైఖరికి ప్రతిపక్షపార్టీలన్నీ కలిసి ఒకేసారి మూకుమ్మడిగా అధికార పార్టీకి వ్యతిరేకంగా నిన్న తెలంగాణ రాష్ట్ర బంద్ ను చేపట్టారు. అయితే ప్రతిపక్షపార్టీలు చేసిన బంద్ ను అధికార పార్టీ మంత్రులు ఎండగట్టారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ మంత్రులు మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీని కావాలసిన విమర్శిస్తూ.. పార్టీకి వ్యతిరేకంగా అందరూ కలిసిన బంద్ విఫలం అయిందని అన్నారు. వారు రైతుల కోసం చేసిన బంద్ కు కనీసం రైతలే మద్దతు పలుకలేదన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ఓ వైపు ప్రశంసలు లభిస్తుండగా, మరోవైపు విపక్షాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని పోచారం అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే రూ.8,836 కోట్లు చెల్లించామని, మిగతా మొత్తాన్ని కూడా వడ్డీతో సహా చెల్లించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అన్నారు. ఆంధ్రాలో అయితే మొత్తం రూ.24వేల కోట్ల పంట రుణాలకు గాను కేవలం రూ.3,400 కోట్లు మాత్రమే చెల్లించింది మరి అక్కడ మాట్లాడని నేతలు ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. అసలు గత ప్రభుత్వాలు ప్రాజెక్టులు నిర్మించి వుంటే ప్రస్తుత పరిస్థితి ఎదురయ్యేది కాదని విపక్షాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యానించారు.