భూమా రావడాన్ని వ్యతిరేకిస్తున్నాం..

  భూమా నాగిరెడ్డి టీడీపీలోకి రావడాన్ని వ్యతిరేకిస్తున్నామని శిల్పా సోదరులు అన్నారు. భూమా చేరితే మా కార్యకర్తలు ఇబ్బంది పడతారని..కార్యకర్తలకు సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత మాపై ఉందని.. అందుకే భూమా నాగిరెడ్డి చేరికను వ్యతిరేకిస్తున్నామని అన్నారు. అంతేకాదు భూమాతో విబేధాలు ఉన్న మాట వాస్తవమే.. దీనిపై గతంలో కూడా సీఎం చంద్రబాబుతో మాట్లాడాం.. అప్పుడు మేం వ్యతిరేకించాం.. ఇప్పుడు మరోసారి మాట్లాడటానికి రమ్మన్నారు.. అన్ని ఆలోచించే నిర్ణయం తీసుకుంటారని అశిస్తున్నాం అని తెలిపారు. మరోవైపు వైసీపీలోకి మేము వెళ్తున్నట్టు తప్పుడు ప్రచారం జరుగుతోంది.. మేం టీడీపీని వీడే ప్రసక్తే లేదు అని అన్నారు.

నాగబాబు కూతురు నిహారిపై మెంటల్ హరాస్మెంట్ కేసు..!

  నాగబాబు కూతురు నిహారిపై మెంటల్ హరాస్మెంట్ కేసు వేస్తారంట. నిహారిక అంతలా ఎవరిని హెరస్ చేసింది.. ఎవరు నిహారికపై కేసు పెడతానన్నారు అనే కదా సందేహం.. అసలు సంగతేంటంటే నిహారిక.. ఢీ జూనియర్స్ ప్రోగ్రామ్ ద్వారా ముందు బుల్లి తెరకు పరిచయమై మంచి పేరు సంపాదించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె హీరోయిన్ గా కూడా ఎంట్రీ అవ్వబోతుంది. అయితే ఇక్కడి వరకూ బానే ఉన్నా ఇప్పుడు నిహారిక ప్రధాన పాత్రలో ‘ముద్ద పప్పు ఆవకాయ్' అనే వెబ్ సీరీస్ యూట్యూబులో ప్రసారం అవుతున్న నేపథ్యంలో దానికి వస్తున్న రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్' పేరుతో సొంత ప్రొడక్షన్ మొదలు పెట్టిన నిహారిక..  ‘ముద్ద పప్పు ఆవకాయ్' లో మాత్రం తన నటనతో అందరిని కట్టిపడేస్తుంది. ఇప్పటికీ నాలుగు ఎపిసోడ్స్ రాగా.. ఎపిసోడ్ ఎపిసోడ్ కి తరువాత ఏం జరుగుతుందా అనే ఆసక్తిని రేపుతున్నాయి. దీనిలో భాగంగానే కొందరు వ్యూవర్స్ చేస్తున్న కామెంట్స్ చాలా ఫన్నీగా ఉన్నాయి. నెక్ట్స్ ఎపిసోడ్ రిలీజ్ చేయడం లేటయితే మెంటల్ హరాస్మెంట్ కేసు వేస్తాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి నిహారిక ముద్ద పప్పు ఆవకాయ్ మంచి పేరునే సొంత చేసుకుంది.

పీఏసి పదవికి భూమా రాజీనామా.. కారెక్కి నేరుగా చంద్రబాబు దగ్గరికి..!

  భూమా నాగిరెడ్డి వైసీపీ కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాకే ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే భూమా వైసీపీ లో ఉంటారా.. లేక టీడీపీలో ఉంటారా అన్న డైలమాలో ఉండగా.. దీనికి మరింత వేడి పుట్టించేలా.. భూమా నాగిరెడ్డి తన పీఏసి పదవికి రాజీనామా చేశారు. దీంతో ఇప్పుడు ఈ వ్యవహారం ఇంకా ఆసక్తికరంగా మారింది. రాజీనామా చేసి బయటకు వస్తున్న ఆయన్న పార్టీ మారుతున్నారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా దానికి ఆయన మీ సస్పెన్సుకు తెర దించుతాను. గంటల్లోనో, రోజుల్లోనో మీడియా ముందు చెప్పాల్సింది చెప్పేస్తాను అని చెప్పారు.  అంతేకాదు అక్కడ నుండి ఆయన నేరగా కారులో చంద్రబాబు దగ్గరకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ఈరోజో రేపే ఆయన టీడీపీ ఎంట్రీ గురించి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది.

జాట్లు రక్షకులే కానీ.. సెహ్వాగ్.. యువరాజ్

  తమకు రిజర్వేషన్లు కల్పించాలని హర్యానాలో జాట్లు ఆందోళనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా వీరు విధ్వంసం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు దీనిపై క్రికెటర్స్ వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్ స్పందించారు. 'జాట్లు రక్షకులేగానీ, విధ్వంసకారులు' కాదని.. రాజ్యాంగ బద్ధంగా నడుచుకుంటూ రిజర్వేషన్ల అంశంపై తమ డిమాండ్లను వ్యక్తపరచాలని విజ్ఞప్తి చేస్తూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. క్రీడలు, ఆర్మీ, తమకు ఇష్టమున్న రంగాల్లో మన సత్తాచాటి దేశం గర్వపడేలా చేయాలని హింసాత్మక పనులు చేయవద్దంటూ  సెహ్వాగ్ కోరాడు. కాగా  మాజీ క్రికెటర్ సెహ్వాగ్ స్వతహాగా జాట్ వర్గానికి చెందిన వాడు.

ఫ్రీడమ్ 251పై రూ 31 లాభం.. నేనేం తప్పు చేశాను..

ఫ్రీడమ్ 251 స్మార్ట్ ఫోన్ పై ఇప్పటికే పలు విమర్శలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై రింగింగ్ బెల్స్ డైరెక్టర్ మోహిత్ గోయల్ స్పందిస్తూ .. నన్నెందుకు ఇలా చుట్టుముడుతున్నారు..? నేనేం తప్పు చేశాను..? నేను కానీ.. నా కంపెనీ కానీ ఎప్పుడైనా టాక్స్ ఎగ్గొట్టిన సందర్భాలు ఉన్నాయా..? నాపైన పోలీసు కేసులు ఎమైనా ఉన్నాయా..? అంటు పలు ప్రశ్నలు సంధించారు. అంతేకాదు.. నా వ్యాపార ప్రణాళికలు నాదగ్గర ఉన్నాయి.. ఇప్పటివరకూ మొత్తం 7 కోట్ల రిజిస్ట్రేషన్లు వచ్చాయి.. మొదటి విడతలో 25 లక్షల స్మార్ట్ ఫోన్లు విడుదల చేస్తామని తరువాత మరో 25 లక్షల స్మార్ట్ ఫోన్లు విడుదల చేస్తామని తెలిపారు. ఇంకా ఒక్కో హ్యాండ్ సెట్ పై తనకు 31 రూపాయలు కూడా లాభం వస్తుందని ఆయన వివరించారు. మరి ఇదంతా ఎంత వరకూ నిజమో ఆ ఫోన్లు బయటకు వస్తే కాని తెలియదు.

బంగ్లాదేశ్‌లో పూజారి హత్య

  బంగ్లాదేశ్‌లో ఉన్న అల్ప సంఖ్యాలకులను భయభ్రాంతులను చేసేందుకు దాడులు కొనసాగుతున్నాయి. గత అయిదు నెలలో ఇలా మూడు సంఘటనలు చోటుచేసుకున్నాయి. తాజాగా జోగేశ్వర్‌ అనే పూజారిని నిన్న కొందరు గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపేశారు. బంగ్లాదేశ్‌లోని  పంచఘర్‌ అనే జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గౌరీ అమ్మవారి గుడిలో పూజారిగా ఉన్న జోగేశ్వర్‌ ఉదయం వేళ పూజలకు సిద్ధపడుతుండగా ఈ దారుణం సంభవించింది. ఈ సమయంలో ఒక్కసారిగా గుడిలోకి చొచ్చుకువచ్చిన ఆగంతకులు గుడి మీద బాంబులు వేసి పూజారిని పొడిచి చంపేశారు. జోగేశ్వర్‌ అరుపులు విని ఆయనను కాపాడేందుకు వచ్చిన మరో భక్తుని కూడా తీవ్రంగా గాయపరిచారు.

భూమా చేరికపై డైలమా.. శిల్పా సోదరులకు ఫోన్..

వైసీపీలో కీలకమైన నేత, ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆయన కూతురు భూమా అఖిల ప్రియ టీడీపీలో చేరుతున్నట్టు వార్తుల వస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి చేరికపై హైడ్రామానే నడుస్తోంది. అయితే మరోపక్క భూమా చేరికపై టీడీపీ నుండి శిల్పా సోదరులు.. పార్టీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణి, మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డిలు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే తక్షణం విజయవాడ రావాలని ఈరోజు శిల్పా సోదరులకు సీఎం కార్యాలయం నుండి ఫోన్ వచ్చినట్టు సమాచారం. ఈ సందర్భంగా చంద్రబాబు భూమా చేరికపై శిల్పా సోదరులతో చర్చించనున్నట్టు తెలుస్తోంది.

ఢిల్లీకి శుభవార్త అంటున్న కేజ్రీవాల్..

హర్యానాలో రిజర్వేషన్లు కోరుతూ జాట్లు నిరసలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నిరసనల వల్ల ఢిల్లీ ప్రజలకు నీటి కొరత ఏర్పడింది. అదెలా అంటే.. ఆందోళనలో భాగంగా హర్యానా నుండి ఢిల్లీకి వచ్చే కాలువను జాట్లు అడ్డుకోవడంతో ఢిల్లీకి నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రజలు నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. అయితే దీనిపై ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్పందిస్తూ ఢిల్లీ ప్రజలు వాడుకునేందుకు చుక్క నీరు లేక బాధపడుతున్నారు. తక్షణం కేంద్రం చర్యలు తీసుకోవాలి అంటూ ట్వీట్టర్ ద్వారా పోస్ట్ చేశారు. అయితే ఆయన ట్వీట్ చేసిన గంటకే మరో ట్వీట్ చేశారు. ఢిల్లీకి శుభవార్త.. మునాక్ కాలువ గేట్లు తెరుచుకున్నారు. ఇంక ఢిల్లీకి నీరు ఎంత సేపట్లో చేరుతుందో.. ఎప్పుడు నీటి సరఫరా మొదలవుతుందో తరువాత వెల్లడిస్తా అని ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు.

జెఎన్ యూ హైటెన్షన్.. కొట్టి చంపేస్తారనే పారిపోయాం..

జెఎన్ యూ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అప్జల్ గురు ఉరిశిక్షను నిరసిస్తూ చేపట్టిన ర్యాలీలో దేశ వ్యతిరేక నినాదాలు చేసినందుకు గాను ఆరుగురు విద్యార్ధులపై రాజద్రోహం క్రింద కేసు నమోదుచేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఆరుగురిలో విద్యార్ధి సంఘ నేత అయిన కన్హయ్య కుమార్ ను పోలిసులు అదుపులోకి తీసుకోగానే మిగిలిన వారు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో పోలీసులు వీరిపై లుక్‌అవుట్‌ నోటీసులను సైతం జారీ చేయడం జరిగింది. అయితే పారిపోయిన ఐదుగురు ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్య, రామ నాగ, అశుతోశ్ కుమార్, అనంత్ ప్రకాశ్ లు నిన్న సడెన్ గా విశ్వవిద్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. దీంతో పోలీసులు ఖంగుతిన్నారు. ఈ సందర్బంగా వారు ఎందుకు పారిపోయారో అని చెప్పారు. ఈ కేసులో జరుగుతున్న దర్యాప్తుకు సహకరించేందుకే వచ్చామని.. ఈ కేసులో భాగంగా బయటకు వచ్చిన వీడియో అసలది కాదు.. అది నఖిలీదని తెలిపారు. అంతేకాదు ఆ వీడియోను చూసిన తరువాత విద్యార్దులు తమను ఎక్కడ కొట్టి చంపేస్తారో అని భయపడే పారిపోయామని చెప్పుకొచ్చారు

కూల్ కెప్టెన్ ధోనికే కోపం తెప్పించిన ప్రశ్న.. ఏంటది..?

ఎంత టెన్షన్ ఉన్నా కాని గ్రౌండ్లో తన కూల్ వ్యూహాలతో.. కూల్ కెప్టన్ పేరు పొందిన క్రికెటర్ ఎవరంటే వెంటనే ధోని గుర్తొస్తాడు. అలాంటి ధోనికి ఒక్కసారిగా కోపమొచ్చిందట. ఇంతకీ ధోనికి అంతలా కోపం తెప్పించింది ఏవరనుకుంటున్నారా.. అది వ్యక్తి కాదు ధోనికి ఎదురైన ప్రశ్న.. అసలు సంగతేంటంటే.. ధోని రిటైర్మెంట్ పై ఎప్పుడూ ఏదో ఒక వార్త వింటూనే ఉంటాం.. ధోని టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన అసలు టోటల్ క్రికెట్ కే వీడ్కోలు పలకనున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనిలో భాగంగానే.. ఆయన ఆసియా కప్ కోసం బంగ్లాదేశ్ పయనమవుతున్న సందర్బంగా జరిగిన మీడియా సమావేశంలో ఓ విలేకరి ధోని రిటైర్మెంట్ గురించి ప్రస్తావించాడు. అంతే ధోని ఒక్కసారిగా కోపం వచ్చేసింది. ఎప్పుడూ ఆ ప్రశ్నలు తప్ప వేరే ప్రశ్నలుండవా అంటూ అతనిపై అంతెత్తున ఎగిరిపడ్డాడు. అంతేకాదు అసలు ఇప్పుడప్పుడే రిటైర్ కాబోయేది లేదని ఘాటుగానే సమాధానం చెప్పాడంట. మొత్తానికి ఎప్పుడూ కూల్ గా ఉండే ధోనికి కూడా కోపం తెప్పించారు.

పవన్ వస్తారా..? చిన్నారి ప్రాణం నిలబెడతారా..?

ఇప్పుడు ప్రజెంట్ హాట్ టాపిక్ ఏంటంటే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించే నడుస్తోంది. ఫేస్ బుక్, ట్విట్టర్ లో పవన్ కళ్యాణ్ ని రిక్వెస్ట్ చేస్తూ వచ్చిన న్యూస్ గురించే హాట్ టాపిక్ రన్ అవుతోంది. అది ఏంటంటే..పశ్చిమగోదావరి, భీమవరం పెదపేటకు చెందిన రత్నరాజు, రమాదేవిల కుమార్తె  కనకచంద్రదీపిక. ఈ పాపకు బ్లడ్ క్యాన్సర్. అయితే ఈచిన్నారి పవన్ కళ్యాణ్ అంకుల్ నా దగ్గరకి వస్తే చాలు నా జ్వరం పోతుంది అని కోరింది. దీంతో రిక్వెస్ట్ పవన్ చేరుతుందా.. పవన్ కళ్యాణ్ ఆ చిన్నారిని చూడటానికి వస్తారా.. ఆ పాప ప్రాణం నిలబెడతారా..?అని అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా అసలు విషయం ఏంటంటే నా జ్వరం పోతుంది అని చెప్పిన పాపకు.. తనకు క్యాన్సర్ అనే విషయం తెలీదు. తెలిసినా అది ఏంటో అర్ధం చేసుకునే వయసు కూడా కాదు.  ఇక ఈ కాన్సర్ వ్యాధి ట్రీట్ మెంట్ కు సుమారు రూ. 20 లక్షల వరకు ఖర్చవుతుందని డాక్టర్స్ తేల్చి చెప్పారు. ఇప్పటికే రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, మెడికల్‌ హైపవర్‌ కమిటీ సభ్యుడు డాక్టర్‌ ఎం.గోవిందరాజ్‌కుమార్‌ లు స్పందించి వైద్యం నిమిత్తం కొన్ని పరీక్షలను బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రిలో చేయించేలా చర్యలు తీసుకున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో.. పాప చికిత్స నిమిత్తం ఎమన్నా డొనేషన్ ప్రకటిస్తారో లేదో..చూడాలి.

అమ్మాయిలు ఫోన్ మాట్లాడితే జరిమానా...!!

  టెక్నాలజీ పెరిగింది. చదువుకున్నా, చదువుకోకపోయినా, అందరూ స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. ఫేస్ బుక్, ట్విట్టర్ ఇలా ప్రతీదీ స్మార్ట్ ఫోన్ సాయంతో చేతిలో ఉంటుంది. కానీ ఆ ఊళ్లో మాత్రం, పెళ్లికాని అమ్మాయిలు ఫోన్ మాట్లాడితే చాలు జరిమానా విధిస్తారు. ఆ సమాచారాన్ని అందించిన వాళ్లకు బహుమతి ఇస్తారు.   గుజరాత్ లోని సూరజ్ అనే ఊళ్లో ఈ వింత ఆచారాన్ని మొదలెట్టారు. ఎప్పటినుంచో కట్టుబాట్ల మధ్య ఉన్న ఆ ఊరు మొబైల్ ఫోన్లు వచ్చాక స్పీడ్ అయిపోయింది. ప్రేమ దోమ అంటూ కుర్రకారు మొబైల్ ఫోన్లను దుర్వినియోగం చేస్తున్నారని భావించిన ఊరిపెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నారు. కేవలం పెళ్లి కాని అమ్మాయిలకు మాత్రమే ఈ కండిషన్. ఒకవేళ ఫోన్ మాట్లాడుతూ దొరికిపోతే, రెండు వేల వరకూ జరిమానా పడుతుంది.   ఇదేం వింత ఆచారంరా బాబూ అనుకుంటున్నారా..? అమాయకురాళ్లైన ఆడపిల్లల్ని, కుర్రాళ్లు ఫోన్లలో మాట్లాడే బుట్టలో వేసుకుంటున్నారు. అలా మాట్లాడే వాళ్లలో పెళ్లి చేసుకునే వాళ్లు చాలా తక్కువ మందే ఉంటున్నారు. అందుకే ఆడపిల్లలు మోసపోకూడదనే ఇలా చేశాం అని గ్రామపెద్దలు సమాధానం చెబుతున్నారు. ఫోన్ అనేది ఉపయోగం కంటే వ్యసనంగా మారిపోయిందని, త్వరలోనే పిల్లలకు కూడా ఈ రూల్ పెట్టబోతున్నామని చెబుతున్నారు. నరేంద్రమోడీ సొంత ఊరికి, ఈ ఊరు చాలా దగ్గర్లోనే ఉండటం విశేషం.

విమానాలకు రెక్కలు : జాట్ ఎఫెక్ట్

హర్యానా జాట్ ఉద్యమం ఉత్తరభారతంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. రోడ్డు, రైలు రవాణా వ్యవస్థల్ని ఆందోళనకారులు స్తంభింపచేయడంతో విమాన టిక్కెట్ ధరలకు రెక్కలొచ్చాయి. పంజాబ్, రాజస్థాన్ లకు ఛార్జీలు గతంలో ఎన్నడూ లేనంత పెరిగిపోయాయి. ఛండీగఢ్ నుంచి ఢిల్లీకి మూడు నుంచి ఆరు వేల మధ్యలో ఉండే ఛార్జీలు, ఇప్పుడు 27 వేల దాకా ఉన్నాయి. జైపూర్ ఢిల్లీ మధ్య ప్లేన్ ఛార్జీ 24 వేల వరకూ వెళ్లింది. దొరికిందే అవకాశమని, జెట్, ఎయిర్ ఇండియా లాంటి విమాన సంస్థలన్నీ కూడా ఎగస్ట్రా సర్వీసుల్ని నడుపుతున్నాయి. దాదాపు వెయ్యికి పైగా రైళ్ల రాకపోకలు ఆగిపోవడంతో, అక్కడి ప్రజలు తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు. లను స్తంభింపజేశారు.

ఫాస్టెస్ట్ టెస్ట్ సెంచరీ ఎవరు బద్ధలుగొడతారో తెలుసా..?

క్రికెటర్ కు నిజమైన పరీక్ష టెస్ట్ మ్యాచ్. ఓపికతో, కంటికి, చేతికి సమన్వయంతో, గంటల తరబడి అలిసిపోకుండా క్రీజు లో నుంచుని, జాగ్రత్తగా గోడ కట్టినంత అందంగా ఇన్నింగ్స్ నిర్మించడమంటే మాటలు కాదు. అందుకే బ్యాట్స్ మెన్ గొప్పోడో కాదో నన్నది, టెస్ట్ మ్యాచ్ ల బట్టి నిర్ణయిస్తారు క్రికెట్ పండితులు. కానీ ఈ సూత్రాలు కొంత మందికి వర్తించవు. వివియన్ రిచర్డ్స్, క్రిస్ గేల్, ఎబీ డివిలియర్స్, బ్రెండన్ మెక్ కల్లం, సెహ్వాగ్ లాంటి వాళ్లెవ్వరూ ఇలా గోడ కట్టినట్టు ఇన్నింగ్స్ నిర్మించరు. వీళ్లందరూ ఆత్మరక్షణ కంటే, ప్రత్యర్ధి గోడను బద్ధలుగొట్టే ప్రయత్నం చేస్తారు. అందుకే వీళ్లకు బౌలింగ్ చేయడానికి ప్రపంచంలోని ఏ బౌలర్ అయినా భయపడేవాడు, భయపడతాడు.   లేటెస్ట్ గా తన చివరి టెస్ట్ లో మెక్ కల్లమ్ వీర బాదుడు బాది, వివియన్ రిచర్డ్స్ మీదున్న రికార్డును తను లాగేసుకున్నాడు. కేవలం 54 బంతుల్లోనే శతకబాదాడు. రికార్డ్స్ ఉన్నవి బద్ధలవడానికే. మరి నెక్స్ట్ మెక్ కల్లమ్ రికార్డ్ ను బద్ధలు గొట్టే వీరుడెవరు..? ఇదే విషయాన్ని రైనాను అడిగితే, భారతీయుడే బద్ధలు గొట్టాలని కోరుకుంటున్నానన్నాడు. మరి మన టీంలో ఆ రికార్డ్ బద్ధలు గొట్టే అవకాశం ఎవరికుందో తెలుసా..?   రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్..ప్రస్తుతం ఇండియన్ బ్యాటింగ్ లైనప్ లో ఈ ముగ్గరికే ఆ రికార్డును కొట్టే అవకాశం ఉంది. రైనా టెస్టుల్లో లేడు. ఇప్పుడు అండర్ 19 మ్యాచ్ ల్లో ఇరగదీస్తున్న కుర్రాళ్లలో భవిష్యత్ టెస్ట్ ప్లేయర్ గా మారే ఎవరికైనా కూడా ఆ ఛాన్స్ లేకపోలేదు. టి 20 క్రికెట్ రాజ్యమేలుతున్న ఈ కాలంలో, ఆ రికార్డు ఎంతో కాలం నిలిచి ఉండదనేది మాత్రం వాస్తవం.

అల్లుడి హత్యకు ప్లాన్ చేసిన పోలీస్

  ఆయన ఒక పోలీసాఫీసర్. కూతురు ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఒక పాప కూడా పుట్టింది. మామూలుగా ఏ తండ్రైనా, జరిగిందేదో జరిగిందిలే అని కూతురిని అక్కున చేర్చుకుంటాడు. లేదా, దూరంగా ఉన్న సుఖంగా ఉండాలని కోరుకుంటాడు. కానీ పోలీసాయనకు మాత్రం మనసు బండబారింది. ఏకంగా కూతురి భర్తను హత్య చేయించాలనుకున్నాడు. హత్య చేయమని రౌడీ షీటర్లకు సుపారీ ఇచ్చాడు. చివరికి దొరికిపోయి కటకటాలపాలయ్యాడు.   విషయంలోకి వెళ్తే సిటీ పోలీస్ కమిషనరేట్ లో ఏఎస్ఐగా చేస్తున్నాడు ఆంబోతుల రామారావు. 2014లో రామారావు కూతురు వెల్డింగ్ పనులు చేసే వ్యక్తిని లవ్ చేసి పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లి ఇష్టం లేని రామారావు, అల్లుణ్ని హత్య చేసి కూతురికి మరో పెళ్లి చేయాలనుకున్నాడు. అందుకోసం ముగ్గురు రౌడీషీటర్లను కలిసి ఒకటిన్నర లక్షలు అడ్వాన్స్ గా ఇచ్చాడు. రౌడీషీటర్లలో ఒకరు తాగిన స్నేహితుడితో ప్లాన్ అంతా చెప్పడం వలన, ఈ కుట్ర వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సమాజాన్ని కాపాడాల్సిన పోలీసులే ఇలాంటి ఘోరాలకు ఒడిగట్టడం అందర్నీ విస్మయానికి గురి చేస్తోంది.

రింగింగ్ బెల్స్ కు మోగిన ఐటీ బెల్స్

  అతి తక్కువ ధర గల ఫోన్ అని చెప్పి గత కొద్దిరోజులుగా వివాదాల్లో నలుగుతున్న కంపెనీ రింగింగ్ బెల్స్. ఫ్రీడం 251 పేరుతో 251 రూపాయలకే స్మార్ట్ ఫోన్ ను ఇస్తున్నామని ఈ కంపెనీ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఐటీ, ఎక్సైజ్ శాఖల అధికారులు ఈ కంపెనీపై దృష్టి సారించారు. ఇంత తక్కువ ధరకు ఫోన్ ను తయారుచేయడం అసాధ్యమని, ఒకవేళ తయారుచేస్తే కంపెనీకి ఎలాంటి లాభం ఉండదంటూ బిజెపీ ఎంపీ కిరీట్ సోమయ్య కేంద్రానికి లేఖ రాశారు.   ఆయన లేఖకు స్పందనగా రింగింగ్ బెల్స్ కంపెనీ పై విచారణ చేయాలని టెలికాం శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ ఆదేశించారు. మరో వైపు కేవలం మార్గదర్శకాలు సూచించడం కోసమే ఐటీ శాఖ వచ్చిందని కంపెనీ ప్రెసిడెంట్ అశోక్ చద్ధా చెబుతున్నారు. ఫోన్ కు బుకింగ్స్ భారీగా రావడంతో, కంపెనీ శనివారం నుంచి బుక్సింగ్ ను నిలిపేసింది. తొలి రోజున 3.7 కోట్లు, రెండో రోజు 2.47 కోట్లు రిజిస్ట్రేషన్లు జరగడం విశేషం..

పవన్ అంకుల్ వస్తే జ్వరం తగ్గిపోతుంది

ఆ పాపకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. తనకు జ్వరం అని పెద్దవాళ్లు చెప్పడంతో, పవన్ అంకుల్ ఒక్కసారి ఒక్కసారి తనను చూస్తే జ్వరం తగ్గిపోతుందని చెబుతోంది. కానీ ఆ చిట్టి తల్లికి తెలియదు తాను భయంకర మహమ్మారి క్యాన్సర్ తో బాధపడతున్నానని. భీమవరానికి చెందిన రత్నరాజు, రమాదేవిల ఆరేళ్ల పాప నూకల కనకచంద్రదీపిక. ఈ మధ్య నీరసంగా ఉంటోందని పాపను డాక్టర్ల దగ్గరకు తీసుకెళ్లారు. పరీక్షల్లో, చిన్నారికి బ్లడ్ క్యాన్సర్ అని తేలింది. ట్రీట్ మెంట్ కు 20 లక్షల వరకూ ఖర్చు అవుతుంది.   ఉన్న ఒక్క ఇంటినీ, తనఖా పెట్టి డబ్బు తీసుకొచ్చి చికిత్స చేయిస్తున్నారు ఆ తల్లిదండ్రులు. ఇంకా డబ్బు అవసరం ఉండటంతో, దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ విషయాన్ని సిఏం దృష్టికి తీసుకెళ్తామని చెబుతున్నారు ఎంపీ తోట సీతారామలక్ష్మి. ఈ విషయాలేవీ తెలియని ఆ చిన్నారి అమాయకంగా చెబుతున్న మాటలు, వినేవారి కళ్లలో నీళ్లు తెప్పిస్తున్నాయి. తన గది నిండా పవన్ ఫోటోలతో నింపేయడం బట్టి దీపికకు పవన్ అంటే ఇంత ఇష్టమో అర్ధమవుతోంది. మరి పవన్ ఈ పాపను చూడటానికి వస్తారా లేదా అన్నది చూడాలి..