పవన్ వస్తారా..? చిన్నారి ప్రాణం నిలబెడతారా..?
posted on Feb 22, 2016 9:19AM
ఇప్పుడు ప్రజెంట్ హాట్ టాపిక్ ఏంటంటే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించే నడుస్తోంది. ఫేస్ బుక్, ట్విట్టర్ లో పవన్ కళ్యాణ్ ని రిక్వెస్ట్ చేస్తూ వచ్చిన న్యూస్ గురించే హాట్ టాపిక్ రన్ అవుతోంది. అది ఏంటంటే..పశ్చిమగోదావరి, భీమవరం పెదపేటకు చెందిన రత్నరాజు, రమాదేవిల కుమార్తె కనకచంద్రదీపిక. ఈ పాపకు బ్లడ్ క్యాన్సర్. అయితే ఈచిన్నారి పవన్ కళ్యాణ్ అంకుల్ నా దగ్గరకి వస్తే చాలు నా జ్వరం పోతుంది అని కోరింది. దీంతో రిక్వెస్ట్ పవన్ చేరుతుందా.. పవన్ కళ్యాణ్ ఆ చిన్నారిని చూడటానికి వస్తారా.. ఆ పాప ప్రాణం నిలబెడతారా..?అని అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉండగా అసలు విషయం ఏంటంటే నా జ్వరం పోతుంది అని చెప్పిన పాపకు.. తనకు క్యాన్సర్ అనే విషయం తెలీదు. తెలిసినా అది ఏంటో అర్ధం చేసుకునే వయసు కూడా కాదు. ఇక ఈ కాన్సర్ వ్యాధి ట్రీట్ మెంట్ కు సుమారు రూ. 20 లక్షల వరకు ఖర్చవుతుందని డాక్టర్స్ తేల్చి చెప్పారు. ఇప్పటికే రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, మెడికల్ హైపవర్ కమిటీ సభ్యుడు డాక్టర్ ఎం.గోవిందరాజ్‌కుమార్ లు స్పందించి వైద్యం నిమిత్తం కొన్ని పరీక్షలను బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో చేయించేలా చర్యలు తీసుకున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో.. పాప చికిత్స నిమిత్తం ఎమన్నా డొనేషన్ ప్రకటిస్తారో లేదో..చూడాలి.