పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం..
నేటి నుండి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ సెంట్రల్ హాలులో ఉదయం 11 గంటలకు ప్రసంగించనున్నారు. ఈ సమావేశాల్లో ముఖ్యంగా కీలక జీఎస్టీ బిల్లును ఆమోదింపజేసుకోవాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దీనిలో భాగంగానే జీఎస్టీ బిల్లు ఆమోదం కోసం పార్టీలతో ప్రభుత్వం చర్చలు జరుపుతుంది. ఈ బిల్లుతో పాటు రియల్ ఎస్టేట్ బిల్లు, ప్రైవేటు కంపెనీల దివాళా బిల్లు, యాంటీ హైజాకింగ్ బిల్లు, ఎయిర్ క్యారేజీ బిల్లు, ఇన్‌లాండ్ వాటర్‌వేస్ బిల్లు తదితరాలన్నింటిపై చర్చలు జరిపి ఆమోదం పొందాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇదిలా ఉండగా సమావేశాలు సజావుగా సాగే అవకాశం కనిపించడంలేదని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.