పవన్ అంకుల్ వస్తే జ్వరం తగ్గిపోతుంది
ఆ పాపకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. తనకు జ్వరం అని పెద్దవాళ్లు చెప్పడంతో, పవన్ అంకుల్ ఒక్కసారి ఒక్కసారి తనను చూస్తే జ్వరం తగ్గిపోతుందని చెబుతోంది. కానీ ఆ చిట్టి తల్లికి తెలియదు తాను భయంకర మహమ్మారి క్యాన్సర్ తో బాధపడతున్నానని. భీమవరానికి చెందిన రత్నరాజు, రమాదేవిల ఆరేళ్ల పాప నూకల కనకచంద్రదీపిక. ఈ మధ్య నీరసంగా ఉంటోందని పాపను డాక్టర్ల దగ్గరకు తీసుకెళ్లారు. పరీక్షల్లో, చిన్నారికి బ్లడ్ క్యాన్సర్ అని తేలింది. ట్రీట్ మెంట్ కు 20 లక్షల వరకూ ఖర్చు అవుతుంది.
ఉన్న ఒక్క ఇంటినీ, తనఖా పెట్టి డబ్బు తీసుకొచ్చి చికిత్స చేయిస్తున్నారు ఆ తల్లిదండ్రులు. ఇంకా డబ్బు అవసరం ఉండటంతో, దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ విషయాన్ని సిఏం దృష్టికి తీసుకెళ్తామని చెబుతున్నారు ఎంపీ తోట సీతారామలక్ష్మి. ఈ విషయాలేవీ తెలియని ఆ చిన్నారి అమాయకంగా చెబుతున్న మాటలు, వినేవారి కళ్లలో నీళ్లు తెప్పిస్తున్నాయి. తన గది నిండా పవన్ ఫోటోలతో నింపేయడం బట్టి దీపికకు పవన్ అంటే ఇంత ఇష్టమో అర్ధమవుతోంది. మరి పవన్ ఈ పాపను చూడటానికి వస్తారా లేదా అన్నది చూడాలి..