చివరి ఓవర్లో వరస సిక్సులు..వరల్డ్ కప్పు వెస్టిండీస్ దే..!
వెస్టిండీస్ ను ఎందుకు ప్రమాదకర టీం అంటారో ఫైనల్లో మరోసారి ప్రూవ్ అయింది. చివరి ఓవర్లో 19 పరుగులు కొట్టాల్సి ఉండగా, వరస నాలుగు సిక్సులు కొట్టి మరో రెండు బంతులు మిగిలుండగానే చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది విండీస్ సేన. దీంతో టి20 వరల్డ్ కప్ రెండు సార్లు అందుకున్న మొదటి టీం గా నిలిచింది.156 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో 85 పరుగులతో నాటౌట్ గా నిలిచిన మార్లోన్ ముఖ్య పాత్ర పోషించాడు. అతనికి బ్రేవో, బ్రాత్ వైట్ నుంచి మాత్రమే సహకారం లభించినా, 156 పరుగుల్ని ఛేదించడానికి అది సరిపోయింది.
విండీస్ విజయానికి ఇరవయ్యవ ఓవర్లో 19 పరుగులు కావాలి. బౌలర్ బ్రాత్ వైట్ క్రీజ్ లో ఉన్నాడు. విండీస్ గెలుస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. కానీ అనూహ్యంగా బెన్ స్టోక్స్ వేసిన ఆ ఓవర్లో తొలి నాలుగు బంతుల్ని, నాలుగు సిక్సర్లుగా మలిచి, విండీస్ కు మరిచిపోలేని విజయాన్ని అందించాడు బ్రాత్ వైట్. చేజేతులా మ్యాచ్ ను ఓడిపోయినందుకు బెన్ స్టోక్స్ మైదానంలో కన్నీళ పర్యంతమయ్యాడు. గేల్ స్కోర్ చేయకపోయినా తాము గెలవగలమని, విండీస్ లో అందరూ మ్యాచ్ విన్నర్లే అని మరోసారి నిరూపించింది ఈ ఫైనల్ మ్యాచ్.అండర్ 19, వుమెన్ టి20 వరల్డ్ కప్, మెన్ వరల్డ్ కప్, ఇలా మూడు ఫార్మాట్లలో ఈ ఏడాది కప్పులు కొట్టి చరిత్ర సృష్టించింది విండీస్.