ప్రత్యూష, రాహుల్ తాగి కొట్టుకునేవారా..?
posted on Apr 2, 2016 @ 4:46PM
చిన్నారి పెళ్లి కూతురు నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె ఆత్మహత్య విషయంలో ఆమె బాయ్ ఫ్రెండ్ రాహుల్ రాజ్ సింగ్ పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు మరోవైపు ఆమె వ్యవహార శైలిపై పలు ఆసక్తికర కథనాలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ ముంబైలోని ఓ డబుల్ బెడ్ రూం ఫ్లాట్ లో ఉంటున్నారు. అయితే ప్రత్యూష, రాహుల్ గురించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వారు వచ్చిన మొదట్లో చాలా అన్యోన్యంగా కనిపించేవారని.. తరువాత ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయని.. వారిద్దరూ తాగి రోజూ కొట్టుకునే వారని వారు చెప్పారు. అంతేకాదు ఆమె నుదుటున సింధూరం ఉన్న వీడియో కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. దీంతో ఆమెకు పెళ్లిందయిదా అనే సందేహాలు వస్తున్నాయి. పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.