బేగంపేటలో మోడీ కాలినడక

ప్రధాన మంత్రి హోదాలో తొలిసారిగా తెలంగాణ గడ్డపై అడుగుపెట్టారు ప్రధాని నరేంద్రమోడీ. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్న ప్రధానికి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనస్వాగతం పలికారు. ప్రధాని కోమటిబండ చేరుకునేందుకు మూడు ప్రత్యేక హెలికాఫ్టర్లు ఏర్పాటు చేశారు. విమానం దిగిన వెంటనే ఆయన్ను హెలిప్యాడ్ వద్దకు చేర్చేందుకు వాహనాలను ఏర్పాటు చేశారు. అయితే మోడీ ఆ కారు ఎక్కకుండా నడుచుకుంటూ వెళ్లి హెలికాఫ్టర్ ఎక్కారు. దారి పొడవునా నేతలను, కార్యకర్తలను పలకరించుకుంటూ, వారిని ఉత్తేజపరుస్తూ వెళ్లారు.

తెలంగాణకు ప్రధాని మోడీ.. నేతల ఘనస్వాగతం

  ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రానికి చేరుకున్నారు. హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్ర‌యానికి చేరుకున్న ఆయ‌న‌కు కేంద్ర‌మంత్రులు వెంక‌య్య నాయుడు, ద‌త్రాత్రేయతో పాటు గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, ఉప‌ముఖ్య‌మంత్రి మ‌హ‌మూద్ అలీ, హోం మంత్రి నాయిని న‌ర్సింహారెడ్డి, మంత్రులు ప‌ద్మారావు, త‌ల‌సాని, బీజేపీ రాష్ట్ర నేత‌లు ల‌క్ష్మ‌ణ్, కిష‌న్‌రెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్ర‌భాక‌ర్ మోదీకి ఘ‌నస్వాగం ప‌లికారు. అనంతరం అక్కడి నుండి ప్రత్యేక విమానంలో మెదక్ జిల్లా గజ్వేల్ కు చేరుకున్నారు. అక్కడి నుండి కోమటి బండ చేరుకోనున్నారు.

వైష్ణోదేవి భక్తులపై విరిగిపడిన కొండ చరియలు

వైష్ణోదేవి యాత్రలో విషాదం చోటు చేసుకుంది. బంగంగా-అర్థ్‌కువారి రోడ్డులో భక్తులు విశ్రాంతి తీసుకుంటుండగా త్రికూట హిల్స్ నుంచి పెద్ద పెద్ద బండరాళ్లు షెల్టర్‌పై పడ్డాయి. దీంతో షెల్టర్‌లో ఉన్న నలుగురు భక్తులు ప్రాణాలు కోల్పోగా, మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పదేళ్ల చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న సహాయక బృందాలు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించాయి. బండరాళ్లను ఎత్తి రోడ్డును క్లియర్ చేశారు. మృతుల్లో బెంగుళూరుకు చెందిన శశిధర్ కుమార్, ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గాకు చెందిన బిందు షాని, ఆమె ఐదేళ్ల కుమారుడు విశాల్, జమ్మూకశ్మీర్‌లోని మానస తాండకు చెందిన 34 ఏళ్ల పోనీవాలా మొహమ్మద్ సాదిఖ్ ఉన్నారు.

వైష్ణోదేవి భక్తులపై విరిగిపడిన కొండ చరియలు

వైష్ణోదేవి యాత్రలో విషాదం చోటు చేసుకుంది. బంగంగా-అర్థ్‌కువారి రోడ్డులో భక్తులు విశ్రాంతి తీసుకుంటుండగా త్రికూట హిల్స్ నుంచి పెద్ద పెద్ద బండరాళ్లు షెల్టర్‌పై పడ్డాయి. దీంతో షెల్టర్‌లో ఉన్న నలుగురు భక్తులు ప్రాణాలు కోల్పోగా, మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పదేళ్ల చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న సహాయక బృందాలు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించాయి. బండరాళ్లను ఎత్తి రోడ్డును క్లియర్ చేశారు. మృతుల్లో బెంగుళూరుకు చెందిన శశిధర్ కుమార్, ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గాకు చెందిన బిందు షాని, ఆమె ఐదేళ్ల కుమారుడు విశాల్, జమ్మూకశ్మీర్‌లోని మానస తాండకు చెందిన 34 ఏళ్ల పోనీవాలా మొహమ్మద్ సాదిఖ్ ఉన్నారు.

అత్యాచారం చేసినందుకు 51 గుంజీలు..

సాధారణంగా అత్యాచారం చేసినప్పుడు నిందితుడికి జైలు శిక్ష విధిస్తారు. కానీ బీహార్లో మాత్రం చాలా విచిత్రమైన జడ్జిమెంట్ ఇచ్చారు పెద్దలు. వివరాల ప్రకారం.. బీహార్ లోని ఓ గ్రామంలో అశోక్ అనే యువకుడు ఓ దళిత బాలికపై అత్యాచారం చేసి ఆమె గర్భం దాల్చేందుకు కారణమయ్యాడు. అయితే ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బాలికను బెదిరించడంతో.. మొదట భయపడిన బాలిక ఆతరువాత తన తల్లిదండ్రులకు చెప్పింది.విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు యువకుడిని నిలదీస్తే, అబార్షన్ చేయించుకుని వస్తే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో, ఆ మాటలు నమ్మి తమ బిడ్డ గర్భాన్ని తొలగించి తీసుకువచ్చారు. కానీ ఆతరువాత కూడా అశోక్ పెళ్లి చేసుకోనని చెప్పాడు. దీంతో కుటుంబసభ్యులు పంచాయితీని ఆశ్రయించగా.. దీనిపై విచారించిన పంచాయితీ పెద్దలు 51 గుంజీలు తీయాలని శిక్ష వేసి, రూ. 1000 జరిమానాగా చెల్లించాలని తీర్పిచ్చింది. దీనిపై బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో, నిందితుడు, పంచాయతీ పెద్దలపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. మరి అత్యాచారం చేసినందుకు ఇంతటి చిన్న శిక్ష విధించడం చాలా దారుణం..

సారా వ్యతిరేక ఉద్యమకారిణి రోశమ్మ మృతి

సారా మహమ్మారిపై అలుపులేని పోరాటం చేసిన దూబగుంట రోశమ్మ ఇకలేరు. గత రెండేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఇవాళ తుదిశ్వాస విడిచారు. నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలోని తూర్పు దూబగుంట గ్రామానికి చెందిన వర్థినేని రోశమ్మ భర్త తాగుడుకు బలై మరణించడంతో కొడుకులను పెంచడానికి ఆవిడ చాలా కష్టాలు పడ్డారు. తనలాంటి పరిస్థితి ఇంకేవరికి పట్టకూడదని తూర్పు దూబగుంట గ్రామం నుంచే మద్యపాన నిషేధాన్ని డిమాండ్ చేస్తూ ఉద్యమాన్ని ప్రారంభించారు. అది క్రమంగా జిల్లా అంతటా వ్యాపించి..రాష్ట్రం మొత్తానికి పాకింది.   అప్పటి ప్రతిపక్షనేత ఎన్టీఆర్ ఆ ఉద్యమానికి ప్రభావితమై, టీడీపీ అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో ఘనవిజయం సాధించి, ఇచ్చిన హామీని అమలు చేశారు. అయితే వయసు మీదపడటంతో అవిడ అనారోగ్యానికి గురయ్యారు. కిడ్నీలు పాడైపోయిన దశలో డయాలసిస్ చేయించుకునే ఆర్థిక స్థోమత లేకపోవడంతో వైద్యానికి దూరమయ్యారు. ఈ క్రమంలో నిన్న ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో తుదిశ్వాస విడిచారు.

మోడీజీ.. వెల్‌కమ్ టూ తెలంగాణ

తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా రాష్ట్రంలో పర్యటించబోతున్నారు ప్రధాని నరేంద్రమోడీ. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ ప్రాజెక్ట్‌ను ప్రధాని ఇవాళ మెదక్ జిల్లా కోమటిబండలో ప్రారంభించనున్నారు. ప్రధాని హోదాలో మోడీ తొలిసారిగా రాష్ట్రానికి వస్తుండటంతో ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ఢిల్లీ నుంచి ప్రత్యేకవిమానంలో బేగంపేట విమానాశ్రయానికి మధ్యాహ్నం 2.20 గంటలకు ప్రధాని చేరుకుంటారు. అనంతరం గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, కేంద్రమంత్రులతో కలిసి మూడు ప్రత్యేక హెలికాఫ్టర్లలో మెదక్ జిల్లా కోమటిబండకు బయలుదేరుతారు. అక్కడ మిషన్ భగీరథను ప్రారంభించి, ప్రజలనుద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారు. అనంతరం సాయంత్రం ఐదుగంటల సమయంలో హైదరాబాద్‌కు చేరుకుని, ఎల్‌బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బీజేపీ కార్యకర్తల సమ్మేళనంలో పాల్గొని..పార్టీ నేతలు, కార్యకర్తలనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం ఢిల్లీకి తిరుగుపయనమవుతారు.

ట్రంప్ ను భర్త అని హిల్లరీ టంగ్ స్లిప్..

  రాజకీయ నేతలు అప్పుడప్పుడు నోరు జారుతుంటారు అది కామన్. ఇప్పుడు అలాగే టంగ్ స్లిప్ అయ్యారు హిల్లరీ క్లింటన్.. అది కూడా తన ప్రత్యర్ధి అయిన ట్రంప్ విషయంలో. ప్రస్తుతం హిల్లరీ క్లింటన్.. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న సంగతి తెలిసిందే. ఎన్నికల్లో తమ పార్టీల నుంచి అధికారిక అభ్యర్థులుగా ఖరారైన తర్వాత వారు తమ మాటల దాడులను మరింతగా పెంచారు. ఈ నేపథ్యంలో అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో జరిగిన నల్లజాతి, హిస్పానిక్ పాత్రికేయుల జాతీయ సంఘాల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. అయితే ఈ సమావేశంలో ట్రంప్ ను తన ప్రత్యర్ధిగా చెప్పాల్సింది పోయి తన భర్తగా చెప్పింది. ‘‘నా హస్బ్... నా ప్రత్యర్థి మాట్లాడుతున్న దాని గురించి నేను చెప్పేదాన్ని పోల్చి చూస్తారని ఆశిస్తున్నాను’’ అని హిల్లరీ పేర్కొన్నారు. దీంతో తను చేసిన తప్పును తెలుకునేలోపే సభలో అది విని అందరూ నవ్వుకున్నారు. ఇక హిల్లరీ కూడా తన తప్పును తెలుసుకొని వెంటనే సర్దుకున్నారు.

ఆకలితో 500 ఆవులు మృత్యువాత..

  ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 500 ఆవులు ఒకేసారి ఆకలితో చనిపోయాయి. ఈ దారుణమైన ఘటన రాజ‌స్థాన్‌లోని జైపుర్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. రాజస్థాన్ లోని హింగోనియా గోసంరక్షణ శాలలో సుమారు ఎనిమిది వేల ఆవులు ఉంటున్నాయి. అయితే గత కొద్దిరోజుల క్రితం వేతన చెల్లింపుల విషయంలో గోశాల‌లో ప‌నిచేసే కాంట్రాక్టు కార్మికులు ఆందోళన చేపట్టారు. దీంతో వాటిని సరిగా చూసుకునేవారు లేకపోయారు. కనీసం ఆహారం, నీరు అందించే వారు కూడా లేరు. ఇక అక్కడ కురుస్తున్న వర్షాలతో కారణంగా ఆహ  ఆక‌లి బాధ‌తో మృత్యువాత ప‌డ్డాయి. గోశాలంతా బురదమయంగా అయిపోయింది. ఆవుపేడ కూడా కుప్పలుగా పేరుకుపోయింది. ఆ కారణంతో కొంతమంది అక్కడ శుభ్రం చేయడానికి రాగా అసలు విషయం బయటపడింది. ఆవులు అనారోగ్యంతో కాకుండా ఆకలి బాధ‌తోనే మృతి చెందాయని వైద్యులు కూడా స్ప‌ష్టం చేశారు.

ఐసిస్ సానుభూతిపరులకు సహాయం చేసిన వ్యక్తి అరెస్ట్..

  భారత్‌లో ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాద సంస్థ సానుభూతిపరులకు సహకరిస్తున్న వ్యక్తిని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అరెస్ట్ చేసింది. కువైట్ కు చెందిన అబ్దుల్లా హది అబ్దుల్లా రెహ్మాన్ ఎల్ ఎనిజి అనే వ్యక్తి ఉగ్రవాద సంస్ధ సానుభూతిపరులకు నిధులు ఇస్తూ సహకరిస్తున్ననేపథ్యంలో అతనిని కువైట్లో అరెస్ట్ చేశారు.   కాగా  2014లో మహారాష్ట్రకు చెందిన అరీబ్‌ మజీద్‌ అనే వ్యక్తి నలుగురు స్నేహితులతో కలిసి ఐసిస్‌లో చేరేందుకు ముంబయి నుంచి వెళ్లిపోయి తిరిగి నవంబర్‌లో భారత్‌కు వచ్చాడు. అప్పటి నుంచి పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతను చెప్పిన వివరాల ప్రకారం.. తాము ఇరాక్ వెళ్లి అక్కడినుండి సిరియా వెళ్లాలనుకున్నామని.. కానీ డబ్బులు లేకపోవడంతో ఆగిపోయామని.. అప్పుడు ఎల్ ఎనిజి అనే వ్యక్తే తమకు వెయ్యి డాలర్లు ఇచ్చాడని చెప్పాడు. దీంతో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు ఎనిజిని ఆఖరికి కువైట్లో అరెస్ట్ చేశారు.

రాహుల్ గాంధీకి కోర్టు సమన్లు..

  కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి కోర్టు సమన్లు అందాయి. గత ఏడాది డిసెంబర్ లో రాహుల్ గాంధీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్)పై ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆరెస్సెస్ రాహుల్ గాంధీపై కామ్ రూప్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తమ పరువుకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేసిన రాహుల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని సదరు పిటిషన్ లో కోర్టును ఆరెస్సెస్ కోరింది. ఈ పిటిషన్ పై నేటి ఉదయం విచారణ చేపట్టిన కోర్టు... ఈ నెల 29న వ్యక్తిగతంగా తమ ముందు హాజరుకావాలని రాహుల్ ను ఆదేశిస్తూ సమన్లు జారీ చేసింది.