ఇంగ్లండ్‌తో సిరీస్.. భారత జట్టు ఎంపిక
న్యూజిలాండ్ తో ఇండియా టెస్ట్ సిరీస్, వన్డే మ్యాచ్ ల సిరీస్ ముగిసిన సంగతి తెలిసిందే. ఇక ఇంగ్లడ్ తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టెస్టు సిరీస్ కోసం బీసీసీఐ సెలక్షన్ కమిటీ జట్టును ఎంపిక చేసింది. విరాట్ కోహ్లి సారథ్యంలోని 15మంది జట్టు సభ్యుల బృందాన్ని మొదటి రెండు టెస్టులకు ఎంపిక చేసింది.
మొదటి రెండు టెస్టులకు ఎంపికైన జట్టు: విరాట్ కోహ్లీ, రహానె, ఇషాంత్ శర్మ, చటేశ్వర పూజారా, గౌతమ్ గంభీర్, జయంత్ యాదవ్, అమిత్ మిశ్రా, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, వర్దమాన్ సాహా, కరుణ్ నాయర్, మురళీ విజయ్, మహ్మద్ షమి, ఉమేష్ యాదవ్, హార్దిక్ పాండ్య.