ఎన్డీటీవీ నిషేదంపై వెంకయ్యనాయుడు..

  హిందీ న్యూస్ ఛానెల్ ఎన్డీటీవీ పై ఒకరోజు నిషేదం విధించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు దీన్ని కేంద్ర ప్రభుత్వం సమర్థించుకుంటుంది. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. ‘ దేశ భద్రత, ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొనే ఆ చానెల్‌ను ఒకరోజు ప్రసారాలు నిలిపివేయాల్సిందిగా ఆదేశించాం’ అని స్పష్టం చేశారు. పఠాన్‌కోట్‌ ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాదుల దాడి సందర్భంగా దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని ప్రసారం చేశారంటూ.. అందుకు శిక్షగా వచ్చే బుధవారం ఒకరోజుపాటు ప్రసారాలు నిలిపివేయాలని ఎన్టీటీవీని కేంద్రం ఆదేశించింది. 2008 ముంబై దాడుల నేపథ్యంలో దేశభద్రతను ఉద్దేశించి ఈ నిర్ణయం తీసుకున్నామని, ఇదివరకే ఉన్న నియమనిబంధనలు, సూత్రాల ఆధారంగా తీసుకున్న నిర్ణయమే కానీ, ఇది కొత్తగా తమ ప్రభుత్వం చేపడుతున్న చర్య కాదని వెంకయ్య అన్నారు.

పాక్ కు చావుదెబ్బ... 20 మంది సైనికులు హతం

  పాక్ కు చావుదెబ్బ... 20 మంది సైనికులు హతం పాక్ బలగాలు తరచూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు కాల్పులు జరిపిన పాక్ కు భారత్ సైన్యం కూడా అదే రేంజ్ లో సమాధానం చెబుతుంది. ఇప్పటికే పాక్ పై సర్జికల్ దాడులు జరిపి బుద్ది చెప్పిన భారత సైన్యం ఇప్పుడు మరోసారి పాక్ ను చావుదెబ్బ కొట్టింది. నియంత్రణ రేఖ వెంబడి ఉన్న పాక్ పోస్టులపై విరుచుకుపడిన భారత సైన్యం.. నాలుగు శిబిరాలను ధ్వంసం చేసి 20 మంది పాక్ సైనికులను హతమార్చింది. అయితే ఈ ఘటన గతనెల 29న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉత్తర కశ్మీర్‌లోని కుప్వారా జిల్లా మచ్చిల్ సెక్టార్‌లో ఇటీవల ఉగ్రవాదులు నియంత్రణ రేఖ దాటి వచ్చి భారత సైనికుడి తల నరికిన సంగతి తెలిసిందే. దీంతో ప్రతీకారం కోసం ఎదురుచూస్తున్న భారత బలగాలు గత నెల 29న పాక్ బలగాలపై విరుచుకుపడ్డాయి. భారత్ కాల్పుల్లో నాలుగు పాక్ సైనిక శిబిరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఆర్మీ పోస్ట్ హెడ్ క్వార్టర్ నేలమట్టమైంది. ఈ ఘటనలో 20 మంది శత్రుదేశ సైనికులు హతమయ్యారు.

పటాన్‌కోఠ్‌ ఉగ్రదాడి.. ఎన్‌ఎస్జీ కమాండోకు రూ.10లక్షల సాయం

  పంజాబ్ పఠాన్ కోట్ లో ఉగ్రవాదులు చొరబడి విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు పటాన్‌కోఠ్‌ ఉగ్రదాడిలో గాయపడ్డ శ్రీకాకుళం జిల్లా ఎన్‌ఎస్జీ కమాండో శ్రీరాములుకు ఏపీ ప్రభుత్వం సాయం అందించింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా శ్రీరాములని అతని నివాసంలో కలిసి రూ.10లక్షల చెక్ ను అందజేశారు. సీఎంఓలో అధికారులు, కుటుంబ సభ్యులతో వచ్చి సీఎం చంద్రబాబును శ్రీరాములు కలిశారు. శ్రీరాములు పరిస్థితి చూసి చలించిన సీఎం.. అప్పటికప్పుడు రూ.10లక్షల సహాయం ప్రకటించి ఇంటి స్థలం మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కాగా గత జనవరిలో పఠాన్‌కోట్‌ ఎయిర్‌బేస్‌లో పాక్‌ ఉగ్రవాదుల దాడి తర్వాత బాంబు నిర్వీర్యం చేస్తుండగా ప్రమాదవశాత్తూ పేలడంతో శ్రీరాములు తీవ్రంగా గాయపడ్డారు. కోమాలోకి వెళ్లిన ఆయన ఇటీవలే కోలుకున్నారు.

తల్లి ప్రేమకు లొంగిపోయిన ఉగ్రవాది..

  ఓ తల్లి ప్రేమ ఉగ్రవాది మనసునే మార్చి వేసింది. ఆఖరికి పోలీసులకి సైతం లొంగిపోయేలా చేసింది. ఈ ఘటన జమ్మూకాశ్మీర్ లో చోటుచేసుకుంది. అసలు సంగతేంటంటే..జమ్మూకశ్మీర్ లోని బారాముల్లా జిల్లా సోపోర్ ప్రాంతంలో లష్కరే తాయిబాకు చెందిన ఉగ్రవాది ఉమర్ ఖలిక్ మిర్ ఓ ఇంట్లో దాక్కున్నాడని సమాచారం అందింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన సైన్యం వెంటనే లొంగిపోవాలంటూ హెచ్చరికలు జారీ చేసింది. ఈ విషయాన్ని సైనికాధికారులు మిర్ తల్లిదండ్రులకు తెలియజేశారు.  వారి కుమారుడు లొంగిపోయేలా చేయాలని..అతడికి పెద్ద శిక్ష పడకుండా తాము చూసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో మిర్ తల్లిని అతడు దాక్కున్న ఇంటిలోకి పంపంగా.. ఆమె పోలీసులకు లొంగిపోవాలని..  నాకు కడుపుకోత మిగల్చకురా అంటూ ఆమె కన్నీరు పెట్టుకోగా... ఆమె కన్నీటిని చూసి మిర్ కరిగిపోయాడు. బయటకు వచ్చి సైన్యానికి లొంగిపోయాడు. అంతేకాదు, తన వద్ద ఉన్న రైఫిల్, బుల్లెట్స్, గ్రేనేడ్స్, రేడియో సెట్ ను అధికారులకు అప్పగించాడు. మొత్తానికి తల్లి ప్రేమకు ఈ ప్రపంచంలో మరేదీ సాటి రాదనే విషయం మరోసారి నిరూపితమైంది.

కోతి చెప్పిన జోస్యం.. ట్రంపే గెలుస్తాడు..

అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈ నెల 8వ తేదీన జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల కోసం ప్రపంచమంతా ఉత్కంఠంగా ఎదురుచూస్తుంది. అంత కంటే ముఖ్యంగా ఎన్నికల్లో ఎవరు గెలుస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పటి వరకూ పలు సర్వేలు నిర్వహించగా కొన్ని హిల్లరీకి అనుకూలంగా వస్తే.. మరికొన్ని ట్రంప్ కు అనుకూలంగా వచ్చాయి. అయితే ఇప్పుడు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపెవరిదో ఓ కోతి కూడా జోస్యం చెబుతుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా... అసలు సంగతేంటంటే... 'గెడా' అనే కోతి  అమెరికాకు కాబోయే అధ్యక్షుడు ఎవరో జోస్యం చెప్పింది. అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్, డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ల కటౌట్లను గెడా ముందు ఉంచారు. ఇద్దరి కటౌట్లను కాసేపు చాలా తీక్షణంగా చూసిన గెడా... చివరకు ట్రంప్ కటౌట్ ను కౌగిలించుకుని, ఆయనకు ముద్దు పెట్టింది. ఈ రకంగా, ట్రంపే అంతిమ విజేత అని తేల్చేసింది. ఈ ఏడాది జరిగిన యూరోపియన్ సాకర్ ఛాంపియన్ షిప్ లో కూడా విజేత ఎవరో గెడా ముందుగానే చెప్పింది. ఛాంపియన్ గా పోర్చుగల్ గెలుస్తుందని గెడా చెప్పిన జోస్యం నిజమైంది. దీంతో అందరూ గెలుపు ట్రంప్ దే అని అంటున్నారు. మరి చూద్దాం గెడా చెప్పినట్టు ట్రంప్ గెలుస్తారా.. లేక హిల్లరీ గెలుస్తారా..?

ఢిల్లీ కాలుష్యం..1800 స్కూళ్ల‌కు సెల‌వు..

  దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కాలుష్యాన్ని నివారించడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అవి మాత్రం వర్కవుట్ కావట్లేదు. గత కొద్ది రోజుల నుండి ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలో ఉందన్న విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఢిల్లీలో కాలుష్యం నమోదైంది. కాలుష్యంలో పీఎం స్థాయి 1200 మైక్రోగ్రామ్స్ దాట‌డంతో ప్ర‌భుత్వం స్కూళ్ల మూసివేత‌కు ఆదేశాలు జారీ చేసింది. సుర‌క్షిత స్థాయి కంటే 13 రేట్లు ఎక్కువ‌గా కాలుష్యం ఉన్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. ఈ నేపథ్యంలో ప్ర‌భుత్వం తగు జాగ్రత్తలు తీసుకుంటుంది. దీనిలో భాగంగానే.. ఢిల్లీలో ఉన్న 1800 ప్రైమ‌రీ స్కూళ్ల‌కు ఇవాళ సెల‌వును ప్ర‌క‌టించారు. దీని వ‌ల్ల సుమారు 9 ల‌క్ష‌ల మంది చిన్నారులు స్కూల్‌కు దూరంకానున్నారు.

99 సార్లు కాల్పులకు తెగబడ్డ పాక్..

జమ్ము కాశ్మీర్ సరిహద్దులో పాక్ బలగాలు తరుచూ కాల్పులకు తెగబడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుటికే పలుమార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్ సైన్యం.. సర్జికల్ దాడులు జరిగిన దగ్గర నుండి ఇప్పటి వరకూ 99 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టు తెలుస్తోంది. జమ్ములోని నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) వెంబడి ఉన్న 16వ కోర్ ఏరియా పరిధిలో 83 సార్లు, కశ్మీర్‌లోని ఎల్‌వోసీ వెంట ఉన్న 15వ కోర్ ఏరియా పరిధిలో 16 సార్లు పాకిస్థాన్ దళాలు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచాయని ఆర్మీ సీనియర్ అధికారులు శుక్రవారం తెలిపారు. దీనికి భారత బలగాలు దీటుగా స్పందించి 14 పాక్ పోస్టులను ధ్వంసం చేశాయని, ఇద్దరు రేంజర్లను హతమార్చాయని వివరించారు.

సింగరేణి వారసత్వ ఉద్యోగాలు గ్రీన్ సిగ్నల్..

  గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న సింగరేణి ఉద్యోగుల విషయంలో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్(ఎస్సీసీఎల్) సంచలన నిర్ణయం తీసుకుంది.  సింగరేణి బోర్డు  నుంచి ఆఫ్‌ డైరెక్టర్స్‌ సమావేశంలోవారసత్వ ఉద్యోగాలు పొందేందుకుగల అర్హతలు, ఇతర బెనిఫిట్స్‌పై కీలకనిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా సింగరేణి భవన్‌లో సంస్థ సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశాలమేరకు సింగరేణి కాలరీస్ కంపెనీలో వారసత్వ ఉద్యోగాలకు అంగీకారం తెలిపామని, ఎంతోకాలంగా కార్మికులు కోరుతోన్న ఈ అంశంపై శుక్రవారం జరిగిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం.. * సింగరేణిలో ప్రస్తుతం పనిచేస్తోన్న కార్మికుల్లో దసరాకు, అంటే 2016 అక్టోబర్ 11 నాటికి 48 నుంచి 59 సంవత్సరాల వయసు మధ్య గలవారు ఈ వారసత్వ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. * ఉద్యోగికి సంబంధించి కొడుకు లేదా అల్లుడు లేదా తమ్ముడు వారసత్వ ఉద్యోగం పొందేందుకు అర్హులు. వారి వయసు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

వ్యభిచారంలోకి ప్రత్యూష బెనర్జీ..

  బాలిక వధు నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసు పెద్ద సంచలనమే సృష్టించింది. ఈ కేసులో భాగంగా ఆమె ప్రియుడు రాహుల్‌రాజ్‌ను పోలీసులు అరెస్ట్ చేసినా ఆ తర్వాత అతను బెయిల్‌పై విడుదలయ్యాడు. అయితే మొదట్లో ఈ కేసులో పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.. కానీ గత రోజులుగా ఈ విషయం మరుగునపడిపోయింది. అయితే ఇప్పుడు మరోసారి ఈ వ్యవహారం తెరపైకి వచ్చింది. అదేంటంటే..  ప్రత్యూష చనిపోవడానికి ముందు రాహుల్‌కి ఫోన్‌ చేసి మూడు నిమిషాల పాటు మాట్లాడిన సంభాషణ బయటకు వచ్చింది. ‘నీచుడా... నా జీవితంలో అన్నింటికీ చాలా కష్టపడాల్సి వచ్చింది. నన్ను నేను అమ్ముకోవడానికి ఇక్కడికి రాలేదు. నా కెరీర్‌ కోసం.. నటించడానికి వచ్చాను. కానీ నువ్వు నన్ను వ్యభిచారిని చేశావ్‌. రాహుల్‌.. నువ్వు చేసిన పనికి నేనెంత బాధపడుతున్నానో నీకు తెలీదు. నువ్వు స్వార్థపరుడివి. నా పేరు చెడగొట్టావ్‌. నా గరించి, నా తల్లిదండ్రుల గురించి సమాజం చెడుగా మాట్లాడుకుంటోంది. అంతా అయిపోయింది. నా పని అయిపోయింది.. నేనిక లేను’’ అని ప్రత్యూష మాట్లాడినట్లు తెలుస్తోంది. దీనికి రాహుల్‌.. ఎలాంటి అఘాయిత్యం చేసుకోవద్దని అరగంటలో వస్తున్నానని చెప్పి ఫోన్‌ పెట్టేసినట్లు తెలిసింది. దీంతో ఇప్పుడు రాహుల్‌ ప్రత్యూషని వ్యభిచారంలోకి దించడానికి ప్రయత్నించాడని స్పష్టంగా తెలుస్తోందని లాయర్‌ నీరజ్‌ గుప్తా తెలిపారు. ఈ కేసు విషయమై మళ్లీ విచారణ జరపాల్సిందిగా పిటిషన్‌ వేస్తున్నట్లు పేర్కొన్నారు.

జయలలిత పూర్తిగా కోలుకున్నారు..హాస్ప‌ిట‌ల్ చైర్మ‌న్

  తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను క్రిటికల్ కేరు యూనిట్(సీసీయూ) నుండి వేరే గదిలోకి మార్చుతున్నామని.. ఆమె ఆరోగ్యం కుదుపపడిందని అన్నాడీఎంకే నేతలు చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె ఆరోగ్యం మరింత క్లారిటీ వచ్చింది. జ‌య‌ల‌లిత పూర్తిగా కోలుకున్నార‌ని అపోలో హాస్ప‌ిట‌ల్ చైర్మ‌న్ ప్ర‌తాప్ రెడ్డి తెలిపారు. చెన్నైలో జరిగిన పుస్త‌కావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఆయ‌న మాట్లాడుతూ జయన ఆరోగ్యంపై స్పందిస్తూ.. పైవిధంగా వ్యాఖ్యానించారు. జ‌య పూర్తిగా స్పృహ‌లోకి వ‌చ్చార‌ని, త‌న చుట్టు జ‌రుగుతున్న విష‌యాలు ఆమె గ్ర‌హించ‌గ‌లుతున్నారని ఆయ‌న చెప్పారు. త‌న‌కు కావాల్సిన వాటిని ఆమె అడుగుతున్నార‌ని ప్ర‌తాప్ రెడ్డి తెలిపారు. పూర్తిగా కోలుకున్న జ‌య‌ల‌లిత‌ను త్వ‌ర‌లోనే క్రిటిక‌ల్ కేర్ యూనిట్ నుంచి త‌ర‌లించే అవ‌కాశాలున్నాయి. కాగా జయలలిత గత కొద్ది కాలంగా చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.

ముఖేష్‌ అంబానీకి భారీ షాక్.. 10 వేల కోట్లు జరిమానా..

  రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ అధినేత ముఖేష్‌ అంబానీకి భారీ షాక్ తగిలింది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారీ నజరానా విధించింది. ఎన్‌జీసీ-రిలయెన్స్ సంస్థల‌కు చెందిన కేజీ- డీ 6 బ్లాక్ పై కొంత‌కాలంగా గ్యాస్ వివాదం చెల‌రేగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం.. 10,312 కోట్ల రూపాయ‌లు కట్టాలని ఆదేశించింది. ఓకృష్ణా గోదావరి (కేజీ) బేసిన్‌లో రిల‌య‌న్స్‌కు చెందిన బావుల పక్కనే ఉన్న ఓఎన్‌జీసీ బావుల నుంచి గ్యాస్‌ను తోడివేసిందన్న నేపథ్యంలో  కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఓఎన్‌జీసీ గ్యాస్‌ను ఆర్‌ఐఎల్ ఉత్పత్తి చేసినందున అందుకు పరిహారంగా చెల్లించాల్సిన మొత్తాన్ని చమురు మంత్రిత్వ శాఖకు చెందిన డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ (డీజీహెచ్)1 బిలియన్ డార్లుగా ( సుమారు రూ. ​6652.75 కోట్లుగా)  లెక్క కట్టడంతో.. 1.55 బిలియన్ డాలర్లు( దాదాపు 10,312 కోట్ల రూపాయ‌లు) జరిమానా క‌ట్టాల‌ని కేంద్ర స‌ర్కారు పేర్కొంది.