బ్రిట‌న్ లోనూ వ‌ల‌స వ్య‌తిరేక ఉద్య‌మం.. ట్రంప్ కు పట్టపగ్గాలుండవుగా?

ఈ వ‌ల‌స వ్య‌వ‌హారం అమెరికాకే ప‌రిమితం అనుకున్నాం. క‌ట్ చేస్తే ఈ ట్రంప్ ర‌గిల్చిన చిచ్చు మేక్ అమెరికా గ్రేట్ అగైన్.. అనేది యూకేకి కూడా పాకింది. అక్కడ యునైట్ ద కింగ్ డ‌మ్ అంటూ ఒక కొత్త నినాదం పురుడు పోసుకుని లండ‌న్ వీధుల‌ను ముంచెత్తింది.  గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా..  1.5 ల‌క్ష‌ల మంది జ‌నం వ‌ల‌స దారుల‌ను త‌రిమి కొట్టాల్సిందే అన్న నినాదంతో రోడ్లపైకి వచ్చారు.  దీనంత‌టికీ టామీ రాబిన్స‌న్ నాయ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈయ‌న‌కు ఎలాన్ మ‌స్క్ మ‌ద్ద‌తు   ఉంద‌ని అంటున్నారు. మ‌రి ఎలాన్ మ‌స్క్ సైతం ఎక్క‌డో ద‌క్షిణాఫ్రికా నుంచి అమెరికా వచ్చి వ‌చ్చిఅక్క‌డ ట్రిలియ‌న్ డాల‌ర్ల సంప‌ద మూట‌గ‌ట్టుకునే య‌త్నం చేస్తున్నారు. అలాంటి మ‌స్క్ సైతం ఇలాంటి వ‌ల‌స వ్య‌తిరేక ఉద్య‌మాల‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తుంటే ఏం చేయాలో పాలు పోవ‌డం లేదంటారు కొంద‌రు బ్రిట‌న్ వ‌ల‌సదారులు. శ‌నివారంసెప్టెంబర్ 14) సెంట్ర‌ల్ లండ‌న్లో జ‌రిగిన ఈ ర్యాలీ బ్రిట‌న్ చ‌రిత్ర‌లోనే అతి ర్యాలీగా మెట్రో పాలిటన్ పోలీసులు అభివర్ణిస్తున్నారు. వ‌ల‌స‌లు, ఇస్లామీక‌ర‌ణ‌పై పెద్ద ఎత్తున వ్య‌తిరేకిస్తున్న సామాజిక కార్య‌క‌ర్త టామీ నేతృత్వంలో యునైట్ ది కింగ్ డ‌మ్ అనే ఈ ప్ర‌ద‌ర్శ‌న జ‌రిగింది. మ‌రో వైపు జాత్య‌హంకారానికి వ్య‌తిరేకంగా స్టాండ్ అప్‌ టు రేసిజమ్  అనే నిరసన కూడా చేపట్టారు. ఇందులో కేవ‌లం 5వేల మంది మాత్ర‌మే పాల్గొన్నారు.   ఒకరేమో ఇక్క‌డి నుంచి మీరు వెళ్లిపోండ‌ని కోరుతుంటే.. మ‌రొక బృందం స‌మాజంలో స‌మాన‌త్వం, స‌మైక్యత అవ‌స‌రం అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇరు ప‌క్షాల మ‌ధ్య ఎలాంటి గొడ‌వా రాకుండా పోలీసులు పెద్ద ఎత్తున మొహ‌రించారు. నిర‌స‌న కారుల‌ను చెద‌ర‌గొట్టేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నించారు. నిర‌స‌న కారులు సైతం పోలీసుల‌పై నీళ్ల సీసాల వంటి వ‌స్తువుల‌ను విసిరారు. ఈ ఘ‌ట‌న‌ల్లో  ప‌లువురు పోలీసులు గాయ‌ప‌డ్డ‌ట్టు తెలుస్తోంది. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దీంతో పాతిక మందిని అరెస్టు చేశారు పోలీసులు. ఈ అల్లర్లలో పాల్గొన్నవారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని అంటున్నారు. తాజా పరిణామాలను బ్రిటన్‌ అంతర్గత వ్యవహారాల మంత్రి షబానా మహమూద్ తీవ్రంగా ఖండించారు.  ఇందులో మ‌రో విశేషం ఏంటంటే.. ఈ వ‌ల‌స వ్య‌తిరేక ప్ర‌ద‌ర్శ‌న‌ల్లో అమెరికా ఇజ్రాయెల్ జెండాల ప్ర‌ద‌ర్శ‌న‌. వారిని తిరిగి పంపించండి. మా దేశాన్ని తిరిగి మాకివ్వండీ అంటూ బ్రిట‌న్ ప్ర‌ధాని కీర్ స్టార్మ‌ర్ ని డిమాండ్ చేశారు. మ‌రికొంద‌రు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ టోపీలు ధ‌రించి వ‌చ్చారు. దీంతో ట్రంప్ మ‌న‌ల్ని యూకేలో కూడా ఫాలో అవుతున్నారు చూడ‌మంటూ కాల‌రెగ‌రేస్తున్నారు.   ఈ వ‌ల‌స వ్య‌తిరేక ర్యాలీకి స‌పోర్ట్ గా నిలుస్తోన్న మ‌స్క్ సైతం ఏమంత త‌క్కువ‌గా మాట్లాడ్డం లేదు. వ‌ల‌స‌ను వ్య‌తిరేకించి పోరాడండీ లేకుంటే మీరు చ‌నిపోతార‌ని రెచ్చ‌గొట్టుడు ధోర‌ణిలో చేస్తున్న వ్యాఖ్య‌లు సైతం చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి. మ‌స్క్ తో పాటు ఫ్రాన్స్ కి సంబంధించిన ఎరిక్ జెమ్మార్, జ‌ర్మ‌నీకి చెందిన బై స్ట్రోన్ సైతం ఈ ర్యాలీని ఉద్దేశించి ప్ర‌సంగించారు. వీరంతా ఇటీవ‌ల సంభ‌వించిన చార్లీ కిర్క్ ఉదంతాన్ని ప్ర‌స్తావిస్తున్నారు. తెల్ల‌జాతీయుల‌ను వ‌ల‌స‌వాదులు భ‌ర్తీ చేస్తున్నారంటూ త‌మ‌ త‌మ వాద‌న‌లు వినిపిస్తున్నారు.   బ్రిట‌న్ లో ఉండే జ‌నాభా సంఖ్య సుమారు ఆరు కోట్లు మాత్ర‌మే. సంప‌న్న దేశాల్లో ఇది కూడా ఒక‌టి. ఈ మాత్రం వ‌ల‌స జ‌నాభాకు ఇంత పెద్ద ఎత్తున నిర‌స‌న అవ‌స‌ర‌మా? అన్న‌దొక ప్ర‌శ్న. అయితే ఇదంతా ఎందుక‌ని చేశారో చూస్తే.. ఈఏడాది ప‌ది నెల‌లు కూడా గ‌డ‌వ‌క ముందే ఏకంగా 28 వేల మందికి పైగా వ‌ల‌స‌దారులు ప‌డ‌వ‌ల‌పై బ్రిట‌న్ చేరుకున్నారు. ఈ అక్ర‌మ వ‌ల‌స రికార్డు స్థాయికి చేర‌డంతోనే స్థానికుల్లో అసంతృప్తి పెరిగింద‌ని అంటున్నారు. ప్ర‌భుత్వం వీరిని తాత్కాలికంగా హోట‌ళ్ల‌లో ఉంచుతోంద‌ని.. అందుకే ఇదంతా జ‌రుగుతోంద‌ని అంటున్నారు. అందుకే మ‌స్క్  ఈ పార్ల‌మెంటును ర‌ద్దు చేసి మ‌ళ్లీ ఎన్నికల‌కు వెళ్ల‌డం మంచిద‌ని వీరికి   స‌ల‌హా ఇస్తున్నారు.  స్టార్మ‌ర్ ప్ర‌భుత్వం ఏమంత గొప్ప‌గా  లేద‌ని అంటున్నారు వీరు.   వ‌ల‌స‌దారులు దేశ వ‌న‌రుల వాడ‌కంతో పాటు స్థానికుల ఉద్యోగాల‌ను కొల్ల‌గొడుతున్నారని ఆరోపిస్తున్నారు  నిర‌స‌న కారులు. ఇప్ప‌టికే బ్రిట‌న్ ఆర్ధిక వ్య‌వ‌స్థ అంతంత మాత్రం. ఈ అక్ర‌మ వ‌ల‌స కూడా ఇందుకు తోడైతే,  దేశ ఆర్ధిక ప‌రిస్థితి మ‌రింత‌ భారంగా మారే అవ‌కాశ‌ముంద‌ని అంటారు వీరంతా. వీరి వ‌ల్ల త‌మ జాతీయ గుర్తింపు, సాంస్కృతిక వైభ‌వం ప్ర‌మాదంలో ప‌డుతుంద‌న్న ఆందోళ‌న సైతం వ్య‌క్తం చేస్తున్నారు. అయితే ఈ ఆందోళ‌న‌ల‌కు తాము త‌లొగ్గ‌మ‌నీ.. హింస చోటు చేసుకోడాన్ని ఎట్టి ప‌రిస్థితుల్లో చూస్తూ ఊరుకోమ‌న్నారు బ్రిట‌న్ ప్ర‌ధాని కీర్ స్టార్మ‌ర్.   ఈ వ‌ల‌స వ్య‌తిరేక ర్యాలీ వెన‌కున్న టామీ రాబిన్స‌న‌న్ ఎవ‌రంటే.. ఇత‌డి అస‌లు పేరు స్టీఫెన్ యాక్స్ లీ లెన్నాన్. జ‌ర్న‌లిస్టుగా ప‌ని చేసే రాబిన్స‌న‌న్.. యూకే గ‌వ‌ర్న‌మెంటులోని అవినీతి బ‌య‌ట పెడ‌తానంటూ ప‌లు మార్లు హెచ్చ‌రించారు. ఈయ‌న‌కు మ‌స్క్ తో స‌హా ప‌లువురి ప్ర‌ముఖుల మ‌ద్ద‌తుండ‌టంతో.. ఈ మొత్తం గ్యాద‌రింగ్ సాధ్య‌ప‌డిన‌ట్టు తెలుస్తోంది.   ఇటీవ‌ల ఆస్ట్రేలియా, కెన‌డా వంటి దేశాల్లో కూడా ఇలాంటి వ‌ల‌స వ్య‌తిరేక ప్ర‌ద‌ర్శ‌న‌లు జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఇక భార‌త్ లోనూ..  ఎన్నార్సీ వంటి ప్రోగ్రామ్స్ పై కాంగ్రెస్, దాని వెన‌కున్న శ‌క్తులు వ్య‌తిరేకించడం చూస్తూనే  ఉన్నాం అంటారు మ‌రికొంద‌రు. ఇపుడీ వ‌ల‌స వ్య‌తిరేక ఉద్య‌మం ఎక్క‌డి వ‌ర‌కూ వెళ్తుంది?  అమెరికా నుంచి ఇత‌ర దేశాల‌కు పాకుతున్న ఈ యాంటీ ఇమ్మిగ్రెంట్ మూమెంట్ టార్గెట్ ఏమిటి? తేలాల్సి ఉంది.

ఈ నగరానికి ఏమైంది?

  అది నగర జీవన ప్రమాణమే కారణమా? లేక సిటీ కల్చర్ లో పెరుగుతోన్న కక్షలు కార్పణ్యాలే రీజనా? లేక డబ్బు ప్రభావమా? ఓటీటీల ఎఫెక్టా.. ఇదీ అదని చెప్పలేం కానీ.. ఇటీవల హైదరాబాద్‌లో హత్యలు పెరుగుతున్నాయ్. ఎక్కడో డల్లాస్‌లో  ఒక భారతీయుడి తల అమెరికన్ నరికి ఫుట్ బాల్ లా కాలితో తన్ని.. డస్ట్ బిన్ లో పడేశాడని.. ఇదంతా ఒక జాత్యహంకారమనీ భావిస్తున్న మనం.. నగరంలో జరుగుతోన్న హత్యా పరంపర మీద మాత్రం ఏం మాట్లాడాలో అర్ధం కాని పరిస్థితిలో పడిపోయాం. తాజగా కుషాయి గూడకు చెందిన రియల్ ఎస్టేట్, కమ్ ఫైనాన్స్ వ్యాపారి శ్రీకాంత్ రెడ్డి హత్య ఇదే చెబుతోందా? అంటే అదే నిజమని భావించాల్సి ఉంది. శ్రీకాంత్‌ని మర్డర్ చేసింది మరెవరో కాదు ఆయనతో వ్యాపార లావాదేవీలు నెరిపే ధన్ రాజ్. శ్రీకాంత్, ధన్ రాజ్ మధ్య ఎప్పటి నుంచో వ్యాపార పరిచయం. అయితే ఈ మధ్య ఇద్దరి మధ్య విబేధాలు పెరుగుతూ వచ్చాయి. ధన్ రాజ్‌కి ఎలాగైనా సరే శ్రీకాంత్ రెడ్డి అంతు చూడాలన్న కసి. దీంతో శుక్రవారం రాత్రి ఇద్దరూ కలసి మందు సిట్టింగ్ వేసిన టైంలో ముహుర్తం ఫిక్స్ చేశాడు ధన్ రాజ్. ఆపై కావాలనే మాట కలిపి, అది మరింత ముదిరేలా చేసి.. ఇద్దరి మధ్య కొట్లాటకు కారణమైంది.  ఎప్పటి నుంచో శ్రీకాంత్ ని హతమార్చాలన్న ఉద్దేశంతో కత్తి పెట్టుకుని తిరుగుతున్న ధన్ రాజ్.. ఎట్టకేలకు దాన్ని బయటకు తీసి శ్రీకాంత్ పై దాడి చేశాడు. ఇక అతడు చనిపోయాడని తెలిశాక.. పారిపోయాడు. అప్పటికీ స్థానికుల సమాచారంతో.. కుషాయిగూడ పోలీసులకు తెలియడం. ఆపై శ్రీకాంత్ ని గాంధీ ఆస్పత్రికి తరలించడం.. సీపీఆర్ చేసి బతికించాలన్న యత్నం చేయడం.. ఇవన్నీ జరిగాయి. కానీ శ్రీకాంత్ ఆ సరికే ప్రాణాలు కోల్పోయాడని తెలిసి.. ఇక తమ ప్రయత్నాలన్నిటినీ ఆపేశారు. ధన్ రాజ్ శ్రీకాంత్ మధ్య ఆర్ధిక లావాదేవీలే ఈ హత్యకు కారణమని తెలుస్తోంది.  తన భర్త హత్యకు సంబంధించిన వార్త తెలిసిన శ్రీకాంత్ భార్య అపర్ణ కన్నీరు మున్నీరైంది. తాను షాపింగ్ వెళ్దామని అంటే పిల్లలకు పరీక్షలున్నాయని.. అవయ్యాక పోదామని తన భర్త అన్నాడనీ.. ఒక వేళ షాపింగ్ వెళ్లి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని వాపోయిందామె. ఇక కూకట్ పల్లికి చెందిన రేణు అగర్వాల్ హత్య సంగతి సరే సరి.  రేణు ఇంట్లో కేవలం 11 రోజుల క్రితమే పనిలోకి చేరారు జార్ఖండ్ కి చెందిన హర్ష, రోషన్. ఆమెకున్న డబ్బు, గోల్డ్‌పై కన్నేశారు. అదే అదనుగా భావించి ఆమెను హత్య చేసి పారిపోయారు. వీరి ఆనవాళ్లు హఫీజ్ పేట్ వరకూ మాత్రమే కనుగొన్నారు పోలీసులు. ఆపై ఎంతకీ క్లూ జరగడం లేదు. ఇక్కడా డబ్బూ, బంగారానిదే ప్రధాన పాత్ర. ఇదే కూకట్ పల్లిలో సహస్ర హత్య సంగతి ఇందుకు భిన్నమైనది. ఇదైతే ఒక బాలుడు బాలికను హతమార్చిన పరిస్థితి. ఆ కుర్రాడు గత కొంత కాలంగా ఓటీటీల ప్రభావానికి లోనై.. చోరీలు, హత్యలు ఎలా చేయాలన్న స్కెచ్ వేసుకుని.. దాన్ని పేపర్ల పై రాసుకుని మరీ అమలు చేయాలని చూశాడంటే పరిస్థితేంటో ఊహించుకోవచ్చు. మూడింట్లో రెండు ఘటనలు డబ్బు చుట్టూ తిరిగినవి. ఇక బాలుడు మర్డర్ చేయడం ఈ మూడింట్లోకి భిన్నమైనది. దీన్నిబట్టీ చూస్తే మనిషి ఆగ్రహావేశాలకు విచక్షణ కోల్పోడానికి.. అమెరికాలోని డల్లాస్ అయినా తెలంగాణ లోని హైదరాబాద్ అయినా ఒకటే.  అక్కడ జరిగితే దాన్ని జాత్యహంకారంగా భావిస్తున్న మనం.. అదే ఇక్కడ జరిగితే ఆర్ధిక వ్యవహారాల కింద జమ కట్టేస్తున్నాం. ఏమాటకామాట.. ఈ విషయంలో ప్రపంచమంతా ఒకే సింక్ లో ఉంది. దీన్నించి బయట పడ్డానికి మరోదే గట్టి కృషి జరగాల్సి ఉంది.  ఈ విశ్వమానవాళికి ఏదో కౌన్సెలింగ్ అవసరమనిపిస్తోందని అంటారు మానసిక నిపుణులు. మరోవైపు హైదరాబాద్‌లో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి. రోజురోజుకు క్రైమ్ రేటు విపరీతంగా పెరిగుతుంది. రాష్ట్రాన్నికి హొం మంత్రి లేకపోవటం సీఎం రేవంత్ రెడ్డి పర్యవేక్షించాటంతో ముఖ్యమంత్రి బిజీ వల్ల హోం శాఖ దృష్టి పెట్టకపోవడంతో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దెబ్బతిందని చెప్పవచ్చును.

చిన్న దేశాల్లోనే .. చిచ్చుకు కార‌ణ‌మేంటి?

చిన్న కుటుంబం చింతల్లేని  కుటుంబం అని మ‌న‌కు మ‌నం చాలా ఎక్కువ ఫీల‌వుతుంటాం. ఎప్పుడైతే ఉమ్మ‌డి కుటుంబ వ్య‌వ‌స్థ మాయ‌మైందో ఈ చిన్న కుటుంబాల‌కు భారీ స‌పోర్టింగ్ వ‌చ్చింది. దానికి తోడు కుటుంబ నియంత్రణపై కూడా  పెద్ద ఎత్తున ప్రచారం సాగ‌డంతో.. ఆ చిన్న కుటుంబాలు మ‌రింత చిరు కుటుంబాలుగా మారిపోయాయి. ఈ కుటుంబ వ్య‌వ‌స్థ గురించి ఉపోద్ఘాతం ఎందుకంటే.. చిన్న దేశాల విష‌యంలో త‌ర‌చూ ఏవో ఒక వివాదం. ఒక‌ప్పుడు మ‌య‌న్మార్, ఆపై శ్రీలంక‌, బంగ్లాదేశ్ ఇప్పుడు నేపాల్. ఇక పాకిస్థాన్ సంగ‌తి స‌రే స‌రి. అది నిత్య అగ్ని గుండ‌మే. మయ‌న్మార్ అయితే ఆంగ్ సాన్ సూకీ ని జైల్లో బంధించ‌డం.. ఆర్మీ మొత్తం దేశాన్ని శాసించే య‌త్నం చేయ‌డం. ఇది కొన్ని త‌రాలుగా జ‌రుగుతూ వ‌స్తోన్న ఒకానొక ఆర్మీ డామినేటింగ్ హిస్ట‌రీ. ఆ దేశం ఎంత చిన్న‌దైతే.. అక్క‌డ ప్ర‌జాస్వామిక పాల‌న అంతగా ప‌డ‌కేయాల్సిందే. సైన్యం అంత‌గా ప్ర‌తాపం చూపాల్సిందే.  మీరు కావాలంటే చూడండీ పాకిస్థాన్ లో సైన్యం ఎప్పుడెప్పుడు దేశ ప‌రిపాల‌న ఆక్ర‌మిద్దామా? అని చూస్తుంటుంది. ఇప్ప‌టికి  ఎన్నోసార్లు అలా జ‌రిగింది కూడా. ప్ర‌స్తుతం కూడా అక్క‌డ సైన్యాధ్య‌క్షుడిదే హ‌వా. అన్ని విదేశీ అధికారిక కార్య‌క్ర‌మాల‌కు ఆర్మీ చీఫ్ మునీరే హాజ‌ర‌వుతుంటారు. ఇక బంగ్లాదేశ్ సంగ‌తి స‌రేస‌రి. ఇటీవ‌ల అక్క‌డ స‌రిగ్గా నేపాల్ లాంటి  ఉద్య‌మం రావ‌డం.. ఒక ఆర్ధిక వేత్త తిరిగి తాత్కాలికంగా అధికారం చేజిక్కించుకోవ‌డం సంగ‌తి తెలిసిందే. అయితే..  ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డం అనే విష‌యం మీద సైన్యం వ‌ర్సెస్ ప్ర‌భుత్వం గొడ‌వ చెల‌రేగింది. దీంతో తిరిగి నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు మిన్నంటాయి.  స‌రిగ్గా నేపాల్ కి మ‌ల్లే బంగ్లాదేశ్ లోనూ సాదాసీదాగానే మొద‌లైంది మూమెంట్. విద్యార్ధులే కీల‌క పాత్ర పోషించారు. జెన్ జెడ్ అనే ఒక మూముంట్ స్టార్ట్ అయ్యింది. దీంతో సోష‌ల్ మీడియానునిషేధించింది నేపాలీ ప్ర‌భుత్వం. అంతే అగ్గి  రాజుకుంది. అది దేశ పార్ల‌మెంటు, ప్ర‌ధాని, అధ్య‌క్ష, మంత్రుల కార్యాల‌య నివాస ప్రాంతాల‌న్నిటినీ త‌గ‌ల‌బెట్టేసింది. నేపాలీ యువ‌త రాజేసిన ఈ నిర‌స‌న జ్వాల‌కు ప్ర‌స్తుత ప్ర‌భుత్వం  నిలువునా కుప్ప‌కూలింది. ఇక్క‌డా  సైన్యం క‌మాండింగే. మీరు అర్జెంటుగా పీఠం దిగండ‌ని ప్ర‌ధాని ఓలీకి  సైన్యం సూచించ‌డంతో.. ఆయన రాజీనామా చేసి దిగిపోయారు.   ఈ హింసాత్మ‌క నిర‌స‌న‌ల పుణ్య‌మాని ఒక మంత్రి భార్య మ‌ర‌ణించారంటే ప‌రిస్థితి ఏమిటో ఊహించుకోవ‌చ్చు. చిన్న‌దేశం అన‌గానే..  ఏ మాత్రం తేడా వ‌చ్చినా సైన్యం దేశాన్ని త‌న అదుపాజ్ఞ‌ల్లోకి తీసుకుంటుంది. దీంతో ప్ర‌జాస్వామ్యం కాస్తా ప‌క్క‌కు త‌ప్పుకోవ‌ల్సి వ‌స్తుంది. మ‌రి చూడాలి.. నేపాల్లో సాధార‌ణ ప‌రిస్థితి ఎప్పుడు ఏర్ప‌డుతుందో తేలాల్సి ఉంది. చిన్న దేశాలు బాగానే ఉంటాయిగానీ అది ఏదో ఒక అసంతృప్తి ర‌గులుకునే వ‌ర‌కే. ఆపై వాటి లో భారీ ఎత్తున నిర‌స‌న వ్య‌క్త‌మ‌వుతుంది. అది మొత్తం దేశాన్ని త‌గ‌ల‌బెడుతుంద‌ని  అంటారు. ఈ మొత్తం వ్య‌వ‌హార క్ర‌మంలో ప్ర‌ధానంగా క‌నిపించేది సైన్యం పాత్ర‌.

బాబు ఎఫెక్ట్.. ఇండియాకు ఏపీ గ్రోత్ ఇంజిన్!

ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంగా జాతీయ సగటును దాటి వృద్ధి రేటు సాధించింది. 2025-26 తొలి త్రైమాసికంగా ఆంధ్రప్రదేశ్ 10.5 శాతం వృద్ధి రేటును సాధించింది. ఇది జాతీయ సగటు వృద్ధి రేటు కంటే ఎక్కువ. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అతి వేగంగా బలోపేత మౌతోందనడానికి తార్కానంగా ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. జగన్ హయాంలో రాష్ట్రంలో ఆర్థిక అరాచకత్వం రాజ్యమేలింది. దీంతో రాష్ట్రం వృద్ధిలోనే, అభివృద్ధిలోనూ కూడా తిరిగి కోలుకోవడం సాధ్యం కాదనిపించేంతగా దిగజారింది. అయితే ఎప్పుడైతే గత ఏడాది జరిగిన ఎన్నికలలో అద్బుత విజయంతో తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టిందో అప్పటి నుంచీ రాష్ట్రం మళ్లీ అభివృద్ధి పాట పట్టింది. ఎందుకంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన క్షణం నుంచీ పెట్టుబడుల ఆకర్షణ, ఆర్థిక పరిపుష్టి, రైతు ప్రయోజనాలు, ప్రజా సంక్షేమంపైనే దృష్టిపెట్టారు.  రాష్ట్రంలో  ఇన్ ఫ్రాస్ట్రక్చర్, ఐటీ వృద్ధితో పాటు అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలు, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి మెరుగు వంటి అంశాలపై దృష్టి పెట్టారు.  పెట్టుబడిదారులు, పారిశ్రామిక వేత్తలలో రాష్ట్రంపై విశ్వాసం, నమ్మకం పెరిగేలా చేశాయి. అది ఎంతగా అంటే మళ్లీ రాష్ట్రంలో అడుగుపెట్టేదే లేదంటూ తమ వ్యాపారాలు, పరిశ్రమలను ఇతర రాష్ట్రాలకు తరలించేసిన లూలూ వంటి పరిశ్రమలు మళ్లీ రాష్ట్రానికి తిరిగి వచ్చేంతగా.చంద్రబాబు ఈ విధానాలే ఏపీ ఆర్థిక వ్యవస్థ అనూహ్య వేగంతో పుంజుకోవడానికి కారణమైందని ఆర్థిక రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.  బాబు సర్కార్ అవలంబిస్తున్న నూతన విధానాల ఏపీలో డూయింగ్ ఆఫ్ బిజినెస్ సులభతరం కావడానికి దోహదపడటమే కాకుండా.. ప్రజల జీవన ప్రమాణాలు పెరగడానికి కారణమైంది.   ఆంధ్రప్రదేశ్ న దేశంలోనే ఒక మోడల్ రాష్ట్రం అన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్న ఆయన దార్శనికత ఇప్పడు ఫలితాలను అందిస్తోంది. ఆయన ట్రాక్ రికార్డ్ కూడా ప్రపంచం నలుమూలల నుంచీ పెట్టుబడిదారులు, పారిశ్రామిక వేత్తలు రాష్ట్రం వైపు చూసేలా చేస్తున్నాయి. చంద్రబాబు ఆచరణాత్మక దృక్ఫథానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఏపీ అభివృద్ధి దర్పణమని చెప్పవచ్చు.  దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో అభివృద్ధి అనూహ్య వేగంతో ఉండటానికి చంద్రబాబు నాయకత్వంపై విశ్వాసం, ఆయన దార్శనికతపై నమ్మకం కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇదే వేగం, ఇదే ఒరవడి కొనసాగితే ఇండియాకు ఏపీ గ్రోత్ ఇంజిన్ గా మారడం తథ్యమని అంటున్నారు.  

అవినీతి నేపాళం.. చెల్లించాల్సి వచ్చిన మూల్యం!

నేపాల్ అట్టుడుకుతోంది. ఆదేశ పార్లమెంటు, సుప్రీంకోర్టు సహా అధ్యక్షుడు, ప్రధాని నివాసాలతో సహా.. తగలబెట్టేశారు. ప్రధాని రాజీనామా చేసేసి దుబాయ్ లో ఆశ్రయం పొందేందుకు రెడీ అయిపోయారు.  ఒక మంత్రి సతీమణి ఆందోళనకారుల చేతిలో దుర్మరణం పాలయ్యారు. ఆందోళనకలిగిస్తున్న నేపాల్ సంక్షోభానికి కారణం ఏంటి? కేవలం సోషల్ మీడియాపై నిషేధమే పరిస్థితి ఇంతలా అదుపుతప్పేందుకు కారణమైందా?  అంటే.. నేపాల్ పరిస్థితికి కారణం అవినీతి అని చెప్పాల్సి ఉంటుంది.   సోషల్ మీడియా నిషేధానికి వ్యతిరేకంగా ఆందోళనలను మొదలైనా..  అవినీతిపై ప్రజాగ్రహం పట్టరానంతా వెల్లువెత్తింది. అందుకే సోషల్ మీడియాపై నిషేధాన్ని నేపాల్ ప్రభుత్వం ఎత్తివేసినా.. ప్రజల ఆగ్రహం చల్లారలేదు. అవినీతిని అంతమెందించే వరకూ విశ్రమించేది లేదన్నట్లుగా అంతకంతకూ ప్రజ్వరిల్లింది.  ఈ క్రమంలో నేపాల్ మొత్తం ఒక్కసారిగా అట్టుడికింది. అచ్చం బంగ్లాదేశ్ లో ఏ విధంగా పాలన మారిందో.. సరిగ్గా నేపాల్ లోనూ అదే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుత ప్రభుత్వం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ యువత ఆందోళన హింసాత్మక రూపం దాల్చింది.  పార్లమెంటు, సుప్రీంకోర్టు, అధ్యక్షుడు, ప్రధాని నివాసాలతో సహా.. పలువురు మంత్రుల ఇళ్లకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. మంత్రులపై జరిగిన దాడులు నేపాల్ రాజకీయాల్లో  చరిత్రను తిరగరాశాయి. చివరికి పోలీస్టేషన్లు, పార్టీ కార్యాలయాలు, ఆఖరికి  వీరి ఆందోళన, నిరసన కార్యక్యక్రమాలను చూపించే కాంతిపుర్ టీవీ ఆఫీసులపైనా దాడి చేశారంటే పరిస్థితి ఏంటో ఊహించుకోవచ్చు. ఎక్కడి వరకూ వెళ్లిందంటే ఆందోళన హింసా రూపం దాల్చడంతో.. సైన్యం సూచనల మేరకు ప్రధాని కేపీ శర్మ ఓలీ సహా పలువురు మంత్రులు రాజీనామాలు చేసేశారు.  అయినా ఆందోళనలు తగ్గుముఖం పట్టలేదు. ఆందోళనకారులు శాంతించడం లేదు. నేపాల్ రాజధాని నగరం ఖాడ్మండూలో నిరవధిక కర్ఫ్యూ విధించాల్సి వచ్చింది. సైన్యం రంగంలోకి దిగి  పరిస్థితిని అదుపు చేసి శాంతిభద్రతల పరిరక్షించాల్సిన బాధ్యత చేపట్టాల్సి వచ్చింది.  ఆందోళనకారుల హింస కారణంగా కాట్మాండూ త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ మూసేశారు. భారత్ నుంచి వెళ్లే విమానాలను కూడా నిలిపేశారు. సరిహద్దులో భారత ప్రభుత్వం  అలెర్ట్ అయ్యింది. నేపాల్ లోని భారతీయుల రక్షణ కోసం చర్యలకు ఉపక్రమించింది. నేపాల్ ప్రధాని ఓలీ నేతృత్వంలోని ప్రభుత్వం అవినీతిపై  సామాజిక మాధ్యమాల్లో జనరేషన్ జెడ్ చేపట్టిన ఆందోళన, ప్రచారాలను అదుపు చేయడం కోసం నేపాల్  సర్కార్.. రిజిస్ట్రేషన్ సాకుతో సోషల్ మీడియాపై నిషేధం విధించింది. దీంతో యువత భగ్గుమంది. సోమవారం (సెప్టెంబర్ 8)పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగింది. దీంతో  పోలీసులు కాల్పులు జరపగా 19 మంది మరణించారు. పరిస్థితి చేయిదాటి పోవడంతో.. ప్రభుత్వం దిగి రాక తప్పలేదు. సోషల్ మీడియా బ్యాన్ ఎత్తేసింది. ఆయినా పరిస్థితి అదుపులోనికి రాలేదు.  అవినీతి పరమైన నేతలపై నిప్పులు చెరిగారు. కర్ఫ్యూను సైతం లెక్క చేయక కాలంకీ, బనేశ్వర్, చపగాన్, థెకోలలో ఆందోళనకు దిగారు. రాజధానిలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లోకి చొచ్చుకెళ్లారు. విధ్వంసం సృష్టించారు. వందల మంది ఆందోళనకారులు ప్రధాని కార్యాలయంలోకి దూసుకు వెళ్లారు.పార్లమెంటుపై దాడి చేసి నిప్పంటించారు. ఇక అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ ఇంటిపైనా దాడిచేశారు. అంతకు ముందు బాల్ కోట్ లోని ప్రధాని  ఇంటికి నిప్పు పెట్టారు. మాజీ ప్రధాని పుష్పకమాల్ తో పాటు సమాచార మంత్రి పృధ్వీ, మాజీ హోం మంత్రి రమేష్ ఇళ్లపై దాడి చేశారు. బుధానికాంతలోని నేపాలీ కాంగ్రెస్ చీఫ్, మాజీ ప్రధాని షేర్ బహదూర్ ఇంటిని తగులబెట్టారు. ఆయన భార్య అర్జు దేవ్ బా పై వారు దాడి చేసిన వీడియో వైరల్ అయ్యింది. ఈ దాడిలో వారికి స్వల్ప గాయాలయ్యాయి. ఇక దేవ్ బా కుమారుడు జైబీర్ కి చెందిన హిల్టన్ హోటల్ నూ ఆందోళనకారులు తగలబెట్టారు. ఆగ్రహావేశాలతో ఊగిపోయిన ఆర్ధిక మంత్రి బిష్ణు ప్రసాద్ పౌడ్ పై దాడి చేశారు. కొందరు మంత్రిని వీధుల్లోకి పరుగెత్తించారు.  మంత్రులను అధికారిక నివాసాల నుంచి ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా తరలించి ఆర్మీ బ్యారక్స్ లో  ఉంచారు. దల్లులోని మాజీ ప్రధాని ఝూలానాథ్ ఖనాల్ నివాసానికి ఆందోళ నకారులు నిప్పంటించారు. ఈ ఘటనలో ఆయన సతీమణి రాజ్యలక్ష్మి తీవ్ర గాయాలపాలై మరణించారు. ప్రధాని ఓలీ రాజీనామా చేసినందున ఆందోళనకారులు శాంతించాలని, నేపాల్ సైన్యంతో పాటు   భద్రతా సిబ్బంది విజ్ఞప్తి చేశాయి. ఏ సమస్యనైనా చర్చలతో పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చాయి. ప్రధాని   ఓలీ రాజీనామాకు అధ్యక్షుడి ఆమోదం లభించింది. వెంటనే కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై చర్చలు ప్రారంభమయ్యాయి. తదుపరి ప్రధానిగా కాట్మండూ మేయర్ బాలేంద్ర షా పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం నేపాల్ ఆందోళన నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా.. భారతీయులెవరూ నేపాల్‌కు వెళ్లొద్దని అడ్వైజరీ జారీ చేసింది.

టీటీడీ ఈవోగా శ్యామలరావుకు స్థాన చలనం.. మ్యాటరేంటంటే..?

తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా శ్యామలరావును తప్పించి.. ఆయన స్థానంలో అనిల్ కుమార్ సింఘాల్ ను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. టీటీడీ ఈవోగా తప్పించినా శ్యామలరావుకు అంతకంటే ప్రధానమైన, ముఖ్యమైనా.. ఒక రకంగా చెప్పాలంటే పోలిటికల్ గా కీలకమైన జీఏడీ ముఖ్యకార్యదర్శిగా నియమించింది. అయితే ఎంత ముఖ్యమైనదైనా, కీలకమైనదైనా జీఏడీ పదవికి టీటీడీ ఈవోకు ఉన్న క్రేజ్, డిమాండ్ ఉండదు. ఏ ఐఏఎస్ అయినా సరే టీటీడీ ఈవోగా పని చేయడానికి ఎక్కువ మక్కువ చూపుతారు. అటువంటిది రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారపగ్గాలు చేపట్టిన తరువాత ఏరికోరి నియమించుకున్న శ్యామలరావును ఇప్పుడు ఆ పదవి నుంచి తప్పించి మళ్లీ గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పని చేసిన అనిల్ కుమార్ సింఘాల్ ని నియమిస్తూ నిర్ణయం తీసుకోవడం వెనుక కారణాలేంటి?   అనిల్ కుమార్ సింఘాల్ గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో టీటీడీఈవోగా సమర్ధంగా విధులు నిర్వహించారు. ఆ తరువాత వచ్చిన జగన్ సర్కార్ కూడా ఆయనను  అదే పదవిలో  కొంత కాలం కొనసాగించినా, జగన్ కు అత్యంత నమ్మకస్తుడిగా ముద్రపడిన ధర్మారెడ్డి కోసం ఆయనను తప్పించిందని అంటారు. అయితే టీటీడీఈవోగా ఐఏఎస్ అన్న సంప్రదాయాన్ని వెంటనే బ్రేక్ చేయడం ఎందుకు అనుకుందో ఏమో కానీ.. తొలుత ధర్మారెడ్డిని డిప్యూటీ ఈవోగా తీసుకువచ్చింది. మొత్తం పెత్తనం అంతా ఆయనకే కట్టబెట్టి అనిల్ కుమార్ సింఘాల్ ను డమ్మీ చేసింది. అది కూడా ఎక్కువ కాలం కొనసాగనీయలేదు.. అనిల్ కుమార్ సింఘాల్ ను తప్పించి జవహర్ రెడ్డిని తీసుకువచ్చింది. అయితే ఆ వెంటనే ఆయనను సీఎస్ ను చేసి.. ధర్మారెడ్డిని టీటీడీ ఈవోగా నియమించింది.  టీటీడీ చరిత్రలో ఐఏఎస్ కాని వ్యక్తి ఈవో కావడం బహుశా ఇదే తొలిసారి. ఆయన హయాంలో టీటీడీ పవిత్రతకు భంగం వాటిల్లిందన్న  ఆరోపణలు వెల్లువెత్తాయి.  అయితే తెలుగుదేశం కూటమి సర్కార్ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తొలుత తిరుమల ప్రక్షాళనపై దృష్టి సారించారు. టీటీడీ ఈవోగా శ్యామలరావుకు పోస్టింగ్ ఇచ్చారు. తిరుమలలో ప్రక్షాళన ఆరంభమైంది. ప్రస్తుతం తిరుమలలో పవిత్రత, పరిశుభ్రత, ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తున్నాయని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  మరి టీటీడీ ఈవోగా శ్యామలరావును ఎందుకు తప్పించారు. తప్పించారు సరే మళ్లీ అనిల్ కుమార్ సింఘాల్  కే అ పోస్టు ఎందుకు కట్టబెట్టారు... ముందుగా టీటీడీ ఈవోగా శ్యామలరావుకు స్థాన చలనం గురించి చెప్పుకుంటే.. ఆయనకు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడికి మధ్య విభేదాలే శ్యామలరావుకు స్థాన చలనానికి కారణంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇరువురి మధ్యా విభేదాలు తొలి సారి తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం సమయంలోనే బహిర్గతమయ్యాయి. అప్పట్లో జరిగిన తొక్కిసలాటలో భక్తులు మరణించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా సమీక్షకు తిరుమల వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలోనే ఇరువురూ వాగ్వాదానికి దిగారు.  అయితే అప్పట్లో చంద్రబాబు ఇద్దరినీ మందలించి సర్ది చెప్పినా.. విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తిరుపతి గోశాలలో అవుల మృతి వ్యవహారంలో వైసీపీ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఆ అంశాన్ని సరిగా హ్యాండిల్ చేయడంలో శ్యామలరావు విఫలమయ్యారన్న ఆరోపణలు అప్పట్లో వెల్లువెత్తాయి. అంతే కాకుండా తిరుమలలో అన్యమత ప్రచారాన్ని ఆపడంలో కూడా శ్యామలరావు విఫలమయ్యారని, ఈ విషయంలో టీటీడీ చైర్మన్ తో సమన్వయంతో వ్యవహరించకుండా ఏకపక్షంగా వ్యవహరించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక తాజాగా చంద్రగ్రహణం సందర్భంగా టీటీడీ చైర్మన్ నిర్వహించిన  సంప్రదాయక కార్యక్రమానికి టీటీడీ ఈవోగా హాజరు కావలసిన శ్యామలరావు ఉద్దేశపూర్వకంగా డుమ్మా కొట్టడం కూడా ఇరువురి మధ్యా విభేదాలను అద్దంపట్టింది. దీంతో ప్రభుత్వం శ్యామలరావును టీటీడీ ఈవోగా తొలగించాలన్న నిర్ణయానికి వచ్చి ఆయనను బదిలీ చేసింది.   ఇక ఇప్పుడు అనిల్ కుమార్ సింఘాల్ నే టీటీడీ ఈవోగా ప్రభుత్వం నియమించడానికి కారణాలేమిటన్న విషయానికి వస్తే.. టీటీడీఈవోగా గతంలో ఆయన సమర్ధంగా పని చేయడంతో పాటు చంద్రబాబు గుడ్ లుక్స్ లో ఉండటం కూడా ఒక కారణమంటారు. టీటీడీ ఈవో పోస్టు కోసం ఎందరో పోటీ పడుతున్నా.. ఆ పదవి ఆయననే వరించడానికి మరో ప్రధాన కారణంగా కేంద్రం స్థాయిలో ఆయనకు ఉన్న పలుకుబడి, అక్కడ నుంచి వచ్చిన ఒత్తిడీ కూడా కారణంగా చెప్పుకోవచ్చు. 

ఇది ప్ర‌పంచంలోనే అత్యంత అదృష్ట‌వంతుడి బ‌యోగ్ర‌ఫీ!

సాధ‌న‌మున స‌మ‌కూరు పనులు ధ‌ర‌లోన అంటారు. చంద్ర‌బాబు అంటే ఎన్నో గెలుపులకు నిలువెత్తు ఉదాహ‌ర‌ణ మాత్రమే కాదు, ఎన్నో ఓటముల నుంచి ప‌దే ప‌దే కోలుకుని తిరిగి తిరిగి పున‌రుజ్జీవం పొంద‌డంలో నిష్ణాతుడు. ఆయ‌న అదృష్ట‌మ‌ల్లా ఇదే.  ఇదే వైయ‌స్, కేసీఆర్ కుటుంబాల‌ను చూడండి.. ప్ర‌స్తుతం అవి ఎంత దారుణ‌మైన ప‌రిస్థితుల్లోకి దిగ‌జారి పోయాయంటే.. ఇద్ద‌రు పిల్ల‌లుంటే మంచిద‌ని క‌న‌డం అటుంచితే.. వారి ద్వారా ఇప్పుడు ఈ రెండు కుటుంబాలు అనుభ‌విస్తున్న ఆత్మక్షోభ అంతా ఇంతా కాదు. గ‌తంలో వైయ‌స్ఆర్ కుమారుడు, కుమార్తె బ‌జార్న ప‌డ్డం వ‌ల్ల ఆ కుటుంబం ఎంత ఇబ్బందుల పాలైందంటే.. ఏకంగా ఆ త‌ల్లి విజ‌య‌మ్మ మా కుటుంబ గొడ‌వ‌ల‌ను మీ రాజ‌కీయాల‌కు, జ‌ర్న‌లిజాల‌కూ వాడుకోవ‌ద్ద‌ని  మ‌న‌వి చేసేంత‌.  ఆ అన్నా చెల్లెళ్లు.. వాళ్ల‌ల్లో వాళ్లు శ్రీకృష్ణ‌, సుభ‌ద్ర‌ల్లా ఉంటే ఎవ‌రు మాత్రం వారి గురించి చెడుగా రాస్తారు? లోపం త‌న పిల్ల‌ల్లో పెట్టుకున్న ఆమె ఇత‌రుల‌పై నింద వేశారు.  ఇక చూస్తే కేసీఆర్ కి కూడా స‌రిగ్గా వైయ‌స్ఆర్  లాగానే ఇద్ద‌రు పిల్ల‌లు. అచ్చం జ‌గ‌న్, ష‌ర్మిళ‌లా ఒక కుమారుడు, ఒక కుమార్తె.. కేటీఆర్, క‌విత‌.  ప్ర‌స్తుతం క‌విత చేస్తున్న ఆరోప‌ణ‌ల దెబ్బ‌కు ఫామ్ హౌస్ లో గంట‌ల త‌ర‌బ‌డి మంత‌నాలు చేస్తున్నా అవి ఒక కొలిక్కి రావ‌డం లేదు. ఇక కేటీఆర్ అయితే త‌న చెల్లెలి మాట‌ల దెబ్బ‌కు ఫామ్ హౌస్ లో గ‌త కొన్నాళ్లుగా బిక్కు బిక్కుమంటున్నారు. మొద‌ట్లో కేసీఆర్ దేవుడు, ఆపై కేటీఆర్ దెయ్యం అన్న అర్ధ‌మొచ్చేలా కామెంట్ చేసిన ఆమె.. త‌ర్వాత హ‌రీష్‌, రావు సంతోష్ రావు అతి పెద్ద విల‌న్లుగా చిత్రించ‌డంతో.. అది వారి సంగ‌తేమోగానీ ప్ర‌త్య‌ర్ధుల పాలిట అణ్వాయుధంగా మారింది. మీ ఇంటి మ‌నిషే మీరు అతి పెద్ద అవినీతి ప‌రుల‌ని అంత‌లేసి ఆరోప‌ణ‌లు చేస్తుంటే.. మీరు కాళేశ్వ‌రం మీద క‌మిష‌న్ ర‌ద్దు చేయాల‌ని పిటీష‌న్లు ఎలా వేస్తార‌ని నిల‌దీస్తున్నారు ప్ర‌త్య‌ర్ధి పార్టీల వారు.  అందుకసలు మీకు నైతిక హ‌క్కుందా? అన్న కోణంలో వినిపిస్తున్న కామెంట్ల‌తో నేన‌స‌లు  కుమార్తెను కన్నానా?  క‌న్నానా లేక   ప్ర‌త్య‌ర్ధిని క‌ని.. ఇన్నాళ్ల పాటు  న‌ట్టింట తిర‌గ‌నిచ్చానా? అన్న మ‌నోవేద‌న‌తో కుమిలిపోతున్నారు కేసీఆర్. అదే చంద్రబాబు విష‌యానికి వ‌స్తే ఇలాంటి గొడ‌వ‌లేమీ లేవు. ఉన్న‌ది ఒకే ఒక్క‌డు. ఆ ఒక్క‌డు కూడా.. బుద్ధి మంతుడు, చ‌దువుకున్న‌వారు. అన్నింటా ఆరితేరుతున్న‌వారు. భ‌విష్య‌త్ ఆశాకిర‌ణంగా ఎదుగుతున్న వారు. యోధాను యోధుల‌ను మ‌ట్టిక‌రిపించిన మ‌హావీరుడిగా పేరు సాధిస్తున్నవారిగా గుర్తింపు పొందుతున్న వారు.. ఆయనే లోకేష్. బేసిగ్గా రాజ‌కీయ నాయ‌కుల పుత్ర‌ర‌త్నాలు ఎలా ఉంటారు? వారి వారి చుట్టూ ఎన్నేసి అలిగేష‌న్లు, ఇత‌ర‌త్రా గొడ‌వ‌లు వ్య‌వ‌హారాల‌తో అంట‌కాగుతుంటార‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఆ మాట‌కొస్తే వైయ‌స్ కుమారుడు జ‌గ‌న్ అవినీతిలో అతి పెద్ద సామ్రాజ్య నిర్మాత‌గా ప్ర‌పంచ ప్ర‌సిద్ధి. భార‌త న్యాయ సంహిత‌కే స‌వాలు విసురుతున్న వారిగా ప్ర‌ఖ్యాతి.  ఇక కేటీఆర్ సంగ‌తి స‌రే స‌రి. ఆయ‌న ఫామ్ హౌస్ లీల‌లు బ‌య‌ట పెడ‌తామంటూ సాక్షాత్ సొంతింటి  వారే కామెంట్లు చేస్తుంటే ఏం చేయాలో పాలు పోని ప‌రిస్థితి. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఇద్ద‌రు మ‌హానేత‌ల వార‌సులు ఇద్ద‌రికిద్ద‌రే అన్న పేరు వ‌చ్చేసింది. అదే లోకేష్ విష‌యానికి వ‌స్తే.. చిన్న‌ప్ప‌టి  నుంచి స‌రైన చ‌దువు చ‌దువుకోవ‌డం మాత్ర‌మే కాదు.. త‌న టాలెంట్ తో స్టాన్ ఫ‌ర్డ్ స్థాయి చ‌దువు, ఆపై వ‌ర‌ల్డ్ బ్యాంక్, సింగ‌పూర్ సీఎం ఆఫీసుల వంటి వాటిలో కొలువు చేసి.. త‌ల్లిదండ్రుల‌కు అండ‌గా నిల‌వాల‌న్న కోరిక‌తో ఇక్క‌డికి వ‌చ్చి అనుకున్న‌ది అనుకున్న‌ట్టు సాధించ‌డంలో స‌వ్య‌సాచిగా ఎదుగుతున్నారు. పాద‌యాత్ర చేయాల్సి ఉంటుందంటే చేస్తారు. తండ్రి జైలుకెళ్లిన‌పుడు యాత్ర‌ల‌న్నీ ఆపి బెయిలు కోసం ఢిల్లీ వెళ్లి పోరాడారు. ఆపై క‌ష్ట‌సాధ్య‌మైన నియోజ‌క‌వ‌ర్గంలో ఒక సారి ఓడినా వెర‌వ‌క మళ్లీ అక్కడ నుంచే పోటీ చేసి అద్భుత విజయం సాధించారు. ఇప్పుడు చూస్తే విద్యా మంత్రిగా.. విద్యా శాఖ‌లో సంస్క‌ర‌ణ‌లు తీసుకొచ్చి.. అద్భుత‌మైన ఫ‌లితాలను సాధిస్తున్నారు.  ఇక ఐటీ మంత్రిగా ఆయ‌న హ‌యాంలో గూగుల్ విశాఖ‌లో పాతిక వేల మందికి ఉద్యోగాలొచ్చేలాంటి డాటా సెంట‌ర్ పెట్ట‌డానికి ముందుకొచ్చింది. ఇంకా ఎన్నో కంపెనీలు ఏపీ బాట ప‌డుతున్నాయ్. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే విజ‌యాలు. నిజానికి ఇలాంటి కొడుకును క‌న్న తండ్రి అదృష్ట‌మే అదృష్టం క‌దా? అన‌క మాన‌రు ఎవ‌రైనా స‌రే.  ఇక చంద్ర‌బాబుకు త‌న‌యుడే కాదు.. స‌తీమ‌ణి  ద్వారా కూడా  చంద్రబాబు  అదృష్టవంతులనే చెప్పాలి. ఒక స‌మ‌యంలో ఇంటికొక ఐటీ ఎంప్లాయి ఉండాల‌ని నిన‌దించిన చంద్ర‌బాబు, ప్ర‌స్తుతం భువ‌నేశ్వ‌రి స్ఫూర్తితో ఇంటికొక ఎంట‌ర్ ప్రైన్యూర్ ఉండాల‌ని అంటున్నారు. ఈ దిశ‌గా ర‌త‌న్ టాటా హ‌బ్ పెట్టి ప్రోత్స‌హిస్తున్నారు. ఇటు కొడుకును ప్ర‌యోజ‌కుడిగా తీర్చిదిద్ద‌డం మాత్ర‌మే కాదు.. అటు త‌న భ‌ర్త చెప్పింది చెప్పిన‌ట్టు చేసే భార్య క‌లిగి ఉండ‌టం అతి పెద్ద అదృష్టాల్లోకే అతి పెద్ద అదృష్టం. ఇక  ఆయన  సొంత విష‌యానికి వ‌స్తే.. చంద్ర‌బాబు ప‌ని అయిపోయింద‌ని అంద‌రూ అనుకుంటుండ‌గా.. అలాంటిదేం లేదు. కృషి ఉంటే మ‌నుషులు రుషుల‌వుతారు. ఆ కృషి ప‌దే ప‌దే చేస్తూ పోతే మ‌హారుషుల‌వుతారు అన్న మాట‌లకు నిద‌ర్శ‌నంగా.. నిలుస్తున్నారు బాబు. బాబు   చ‌రిత్ర‌గానీ, ట్రాక్ రికార్డ్ కానీ అందుకోవ‌డం సాధ్య‌మేనా? అన్న‌ది  రాజ‌కీయ విశ్లేష‌కుల నుంచి వినిపిస్తోన్న మాట‌. ఒక ఫినిక్స్ ప‌క్షి  త‌న‌కు తాను తిరిగి కోలుకునేలా ఎలా చేస్తుందో అలా చేస్తూ.. ఈ రోజు బాబు 4. 0 పాల‌న అందిస్తూ ముందుకెళ్తున్నారు.  ఒక ర‌కంగా  చెబితే.. ఇది ఒక ప్ర‌పంచంలోనే అత్యంత అదృష్ట‌వంతుడి తాలూకా బ‌యోగ్ర‌ఫీ. ఈ అదృష్టం మ‌హానేత‌లుగా పేరున్న పెద్ద పెద్ద వారికి లేని అదృష్టంగా చెప్పాలంటారు ప‌లువురు విశ్లేష‌కులు. మ‌రి మీరేమంటారు???

చేయాల్సిందంతా చేసి.. ఇప్పుడు బాధ ప‌డి లాభ‌మేంటి ట్రంప్?

ట్రంప్ కి ఎవ‌రైనా అర్జెంటుగా చ‌ద‌రంగం నేర్పించాల్సి ఉంది. కార‌ణం ఏంటంటే ఆయ‌న‌కు తాను వేసే స్టెప్ కి అనుకూలంగానే రిజ‌ల్ట్ వ‌స్తుంద‌న్న పిచ్చి భ్ర‌మ‌ల్లో బ‌తికేస్తున్నారు. ఈ భూ ప్ర‌పంచం మీద ఇలాంటి వ్య‌క్తి  అమెరికా అధ్య‌క్ష పీఠం ఎక్క‌డం బ‌హుశా ఇదే తొలిసారేమో అంటారు ఆ దేశంలోని ఆయ‌న సొంత పార్టీ నేత‌లే. మాములుగా అమెరికా దాని స్వ‌రూప స్వ‌భావాలు ఎలాంటివంటే, ఆ దేశం త‌న ప్ర‌యోజ‌నాల కోసం ఈ ప్ర‌పంచంలో ఉన్న ఖ‌నిజ వ‌న‌రులే కాదు, మాన‌వ వ‌న‌రుల‌ను కూడా భారీ ఎత్తున వాడుకుని వాటి ద్వారా.. అది అద్భుత‌మైన ప్ర‌గ‌తి సాధించింది. ఒక‌ప్పుడు రూపాయ క‌న్నా త‌క్కువ విలువ గ‌ల డాల‌ర్ నేడు.. అంచెలంచెలుగా ఎదిగి రూపాయ‌ను నేడు అత్యంత క‌నిష్ట స్థాయికి ప‌డ‌వేసిందంటే అందుకు కార‌ణం ఈ ఫార్ములానే. ఈ మొత్తం గ్రోత్ లో ఉన్న‌దంతా వ‌లస శ‌క్తి సామ‌ర్ధ్యాలేనంటారు నిపుణులు. మాములుగా ట్రంప్ ఏమంటారంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని. కానీ అది ఇమ్మిగ్రెంట్స్ తో మాత్ర‌మే సాధ్య‌మ‌న్న‌ది ఆయ‌న‌కు తెలియ‌క పోవ‌డం విచార‌క‌రంగా చెప్పుకొస్తారు చాలా మంది. తాను కూడా ఒక  స్టాటిష్ జ‌ర్మ‌న్ మూలాలు గ‌ల వ్య‌క్తిగా ఈ అస‌లు విష‌యం గ్ర‌హించ‌లేక పోతున్నారాయ‌న‌. అమెరిక‌న్లంతా ఎవ‌రంటే ఆయా యురోపియ‌న్ దేశాల నుంచి వ‌ల‌స‌ వ‌చ్చిన వారు. అలాంటి అమెరిక‌న్లు ఫ‌క్తు యూరోపియ‌న్ మైండ్ సెట్ క‌లిగి ఉంటారు. వీరంతా దాదాపు రాయ‌ల్ లైఫ్ లీడ్ చేయాల‌న్న  ఆలోచ‌న ఎక్కువ‌గా క‌లిగి ఉంటారు. ఇప్ప‌టి వ‌ర‌కూ అమెరిక‌న్ ప్రెసిడెంట్లు త‌మ త‌మ ప్ర‌జ‌లను ఒళ్లు కందకుండా చూసుకోవ‌డంతో పాటు.. అన్నీ వారి కాలి ముందుకు వ‌చ్చేలా చేశారు. అదే ట్రంప్ ఏమ‌నుకుంటారంటే.. వీరి ఒళ్లు ఒంచి ప‌ని చేసేలా చేసి.. ఆపై అమెరికాను అగ్ర‌స్థానంలో నిల‌బెట్టాల‌నుకుంటున్నారు. ఇది ఎప్ప‌టికీ సాధ్యం కాని ప‌ని. ఇన్నాళ్ల పాటు ఆయా దేశాల నుంచి నాణ్య‌మైన సేవ‌ల‌ను అందుకుని సుఖ ప‌డ్డ స‌గ‌టు అమెరిక‌న్ ప్ర‌జ‌లు ఇప్ప‌టికిప్పుడు క‌ష్ట‌ప‌డి ప‌ని  చేయాలంటే ఎలా సాధ్యం?? ఈ విష‌యంలో పూర్తిగా బోల్తా కొట్టారు ట్రంప్. మీరు కావాలంటే చూడండి.. ప్ర‌పంచంలోనే అతి పెద్ద దేశాల్లో ఒక‌టైన అమెరికాలో ఎప్పుడు ఖ‌నిజ వ‌న‌రుల కోసం త‌వ్వ‌కాలు జ‌ర‌గ‌వు. అక్క‌డెన్ని నిధి నిక్షేపాలు, చ‌మురు నిల్వ‌లున్నా స‌రే వాటిని విప‌రీతంగా తవ్వి పోయాల‌ని చూడ‌రు. కార‌ణ‌మేంటంటే.. వారి భౌగోళిక స్వ‌రూప స్వ‌భావం పూర్తిగా చెడిపోతుంద‌ని. అంత‌గా ప‌ర్యావ‌ర‌ణ ప్రేమ క‌న‌బ‌రుస్తారు. అదే గ‌ల్ఫ్ త‌దిత‌ర దేశాల నుంచి పెట్రో నిల్వ‌ల‌ను.. ఉక్రెయిన్, చైనాల నుంచి ఖ‌నిజ నిల్వ‌ల‌ను తీసుకుంటారు. ఇక చైనా నుంచి  ప్ర‌తి ప్రోడ‌క్ట్ దిగుమ‌తి చేసుకుంటారు. ఇండియ‌న్స్ నుంచి మేథో ప‌ర‌మైన సేవ‌లు, మెక్సిక‌న్ల నుంచి గొడ్డుచాకిరీ.. ఇలా ప్ర‌తిదీ ఇంపోర్ట్ చేసుకోవ‌ల్సిందే. వాళ్లు  కేవ‌లం పైపై మెరుగుల కార్లు వ‌గైరా మాత్ర‌మే ప్రొడ్యూస్ చేస్తూ త‌మ డాల‌ర్ ని తెలివిగా పెంచి పెద్ద‌ది చేసి.. ఇత‌ర దేశాల‌ను అంత‌కంత‌కూ పిండేసుకుంటూ ఆపై సంప‌న్న దేశంగా అంత‌కంత‌కూ ఎదుగుతుంటారు. అమెరికా దేని మీద ఆధార ప‌డి  బ‌తుకుతూ ఉంటుందంటే అప్పుల మీద‌. క్రెడిట్ లేనిదే అక్క‌డ ఏ డెబిట్ కార్డూ ప‌ని చేయ‌దు. విచ్చ‌ల విడిగా అప్పు చేయ‌డం, ఆపై ప్ర‌భుత్వం ద్వారా రుణ మాఫీ చేయించుకోవ‌డం ఇదే స‌గ‌టు అమెరిక‌న్లు చేసే అస‌లు సిస‌లైన ప‌ని.  ఈ క్ర‌మాన్ని పూర్తిగా మ‌ర‌చి.. భార‌త్ వంటి దేశాల‌ను దూరం చేసుకుని ట్రంప్ సాధించేది ఏటంటే మేక్ అమెరికా డౌన్ అగైన్ త‌ప్ప మ‌రోటి కాదంటారు సామాజిక విశ్లేష‌కులు. దానికి తోడు అమెరిక‌న్ల ప‌ని చేసే వారి  వ‌య‌సు వ్య‌త్యాసం కూడా చాలానే ఉంది. ఇన్నాళ్ల పాటు ఏ కాయ క‌ష్టం చేయ‌ని ఆ శ‌రీరాలు అత్యంత సుఖంగా, కావ‌ల్సినంత ఎక్కువ కాలం జీవించేలాంటి వెస‌లుబాటు క‌లిగి ఉన్నాయి. ఈ క్ర‌మంలో అమెరిక‌న్ల ఆయు ప్ర‌మాణం నానాటికీ  పెరిగుతూ వ‌స్తోంది. స‌రిగ్గా అదే స‌మ‌యంలో.. కుటుంబ వ్య‌వ‌స్థ చిన్నాభిన్నం కావ‌డం వ‌ల్ల‌.. జ‌న‌నాల సంఖ్య అంత‌కంత‌కూ త‌గ్గుతూ వ‌స్తోంది. ఇప్పుడెలాంటి  ప‌రిస్తితి దాపురిస్తోందంటే.. అక్క‌డ స‌హ‌జీవ‌నాల‌ను దాటి పోయి గే, లెస్బియ‌న్ క‌ల్చ‌ర్ పెర‌గ‌టం  మొదలైంది. దీంతో మాన‌వ వ‌న‌రులు క్ర‌మేపీ అడుగంటి పోతున్నాయ్. 1960 త‌ర్వాత యూఎస్ లో వ‌ల‌స రేటు భారీగా త‌గ్గింది. స్టూడెంట్స్. ట్ర‌క్ డ్రైవ‌ర్ల‌తో స‌హా.. చివ‌రికి టూరిస్టుల‌ను కూడా అలౌ చేయ‌డం లేదు. కేవ‌లం భార‌తీయ స్టూడెంట్స్ వ‌ల్ల 25 బిలియ‌న్ డాల‌ర్ల మేర ఏటా ల‌బ్ధి చేకూరుతోంది. అంతెందుకూ ప‌క్క‌నే ఉన్న కెన‌డా  నుంచి వ‌చ్చే ఒక్కో టూరిస్టూ మినిమంలో మినిమం 4 వేల డాల‌ర్ల మేర ఖ‌ర్చు చేస్తారు. చివ‌రికి కెన‌డా మీద కూడా 51వ రాష్ట్రంగా మాలో క‌లిసిపోండంటూ అవాకులు చ‌వాకులు పేలి ట్రంప్ ఎంత చేటు తెచ్చాడంటే, అమెరికాకు, కెన‌డా వారు   విహారంగా రావ‌డ‌ం కూడా మానేసేంతగా.  దీంతో టూరిజం, హోట‌ల్ ఇండ‌స్ట్రీలో ఏకంగా రెండున్న‌ర ల‌క్ష‌ల మేర ఉద్యోగాలు పోయాయని చెబుతున్నాయి స‌రిహ‌ద్దు ప‌ర్యాట‌క గ‌ణాంకాలు. అంతెందుకూ ఇదే విష‌యం మీద ట్రంప్ పై పెద్ద ఎత్తున కేసులు కూడా న‌మోద‌య్యాయి. మీ టారీఫుల కార‌ణంగా దేశానికి విప‌రీత‌మైన ఆర్ధిక న‌ష్టం క‌లుగుతోంద‌ని అప్పీళ్ల కోర్టు  తీర్పునిచ్చింది. కానీ తాను సుప్రీం కోర్టుకెళ్లి పంతం నెగ్గించుకుంటాన‌ని మంకు ప‌ట్టు ప‌డుతున్నారు ట్రంప్. ఇలా చెప్పుకూంటూ పోతే ట్రంప్ అమెరికా అభివృద్ధి పాలిట పిడుగులా ప‌డుతున్నారు. ప్ర‌స్తుతం అమెరికా ఆర్ధిక ప‌టిష్ట‌త వ‌చ్చే రోజుల్లో ఏమంత స‌జావుగా సాగేలా క‌నిపించ‌డం లేదని అంటారు ఆర్ధిక రంగ నిపుణులు. కావాల‌ని యుద్ధాల‌ను పుట్టించి, వాటిని తానే ఆపాన‌ని చెప్పుకుంటూ.. నోబుల్ శాంతి బ‌హుమ‌తి కోసం వెంప‌ర్లాడుతున్న ట్రంప్ కార‌ణంగా.. అమెరికా గ్రేట్ అగైన్ ప‌రిస్థితేమోగానీ ఫేట్ మాత్రం దారుణంగా మారేలా తెలుస్తోందని వాపోతున్నారు స‌గ‌టు అమెరిక‌న్లు. ఒక‌టీ రెండు కాదు అన్నింటా ఆయ‌న తీసుకుంటున్న స్వార్ధ‌పూరిత‌ త‌ప్పుడు నిర్ణ‌యాల కార‌ణంగా  పెద్ద ఎత్తున న‌ష్టం వాటిల్లుతోంది. పాక్ తో కుటుంబ సంస్థ ద్వారా వ్యాపారాల‌ను చేయించాల‌న్న ఆలోచ‌న‌తో ఆ దేశ ఆర్మీచీఫ్ ని ద‌గ్గ‌ర‌కు చేర్చుకోవ‌డంతో భార‌త్ మ‌న‌సు కూడా విరిగిపోయింది. ఇప్పుడు చూస్తే భార‌త్ దూర‌మై పోయింద‌ని బాధ ప‌డుతున్నారు. ప్ర‌స్తుతం అమెరికా అనేది అనేక దేశాల స‌హాయ స‌హ‌కారాల స‌మాహారం. అంతెందుకు ఆయుధాలు, స్పేస్ విష‌యంలోనూ ర‌ష్యాతో పోటీ అనేది ఒక స్ఫూర్తిగా ప‌ని చేసి నేడు ఆయా విభాగాల్లో ఈ స్థాయిలో ఉంది అమెరికా. ఇలా చెప్పుకుంటూ పోతే ఆల్ కంట్రీస్ స్పాన్స‌ర్డ్ కంట్రీగా పేరున్న యూఎస్.. ప్ర‌స్తుతం తానేదో ప్ర‌పంచ  అగ్ర రాజ్యం అని మిడిసిప‌డుతోంది కానీ, గ్లేసియ‌ర్స్ క‌రిగాక కొండ మాత్ర‌మే మిగిలితే ఎలా ఉంటుందో వ‌చ్చే రోజుల్లో యూఎస్ తెలుసుకోవ‌డం ఖాయంగా అంచ‌నా వేస్త‌న్నారు అంత‌ర్జాతీయ దౌత్య వ్య‌వ‌హారాల నిపుణులు.

కేంద్ర, రాష్ట్ర సంబంధాల పటిష్టతలో లోకేష్ కీలకం!

మంత్రి నారా లోకేష్ రూటు  మార్చారు.  రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ కీలకంగా ఎదుగుతున్నారు. ముఖ్యంగా తరచూ కేంద్ర పెద్దలతో  భేటీ అవుతూ రాష్ట్రం, కేంద్రం సంబంధాలు మరింత పటిష్ఠంగా మార్చడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రులకు సైతం అంత తేలికగా దొరకని ప్రధాని మోడీ అప్పాయింట్ మెంట్ లోకేష్ కు అడగకుండానే దొరికేస్తుండటం.. కేంద్రం కూడా ఆయనకు ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనం. ఇప్పటికే తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శిగా  పార్టీ వ్యవహారాలన్నీ ఆయనే చూస్తున్నారు. అదే సమయంలో ప్రభుత్వంలో పైతం ఆయన అత్యంత కాలకంగా ఉన్నారు.   ఐటీ శాఖ మంత్రిగా లోకేష్  ఏపీకి భారీగా ఐటి దిగ్గజ సంస్థలు వచ్చేలా కృషి చేస్తున్నారు.  టిసిఎస్, గూగుల్ వంటి మేటి సంస్థలు ఏపీలో తమ కార్యకలాపాలను ప్రారంభించడం పూర్తిగా ఆయన క్రెడిటేననడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ విషయాన్ని స్వయంగా ఆయా సంస్థల ప్రతినిథులే  చెప్పారు.  తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరిన 15 నెలలలోనే ఈ స్థాయిలో లోకేష్ రాష్ట్రానికి ఐటీ సంస్థలను తీసుకురావడంతో జాతీయ స్థాయిలో సైతం లోకేష్ గురించిన చర్చ జరుగుతోంది.  మరోవైపు ఇటీవల సీఎం చంద్రబాబు సింగపూర్ లో పర్యటించారు.  ఆస్ట్రేలియా ప్రభుత్వం నారా లోకేష్ కు స్పెషల్ విజిట్స్ ప్రోగ్రాం కు ప్రత్యేకంగా ఆహ్వానించింది.  ఈ స్పెషల్ విజిట్స్ ప్రోగ్రాంకు గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నరేంద్రమోడీకి ఆహ్వానం అందింది.  ఇది లోకేష్ వేగంగా ఎదుగుతుండడాన్ని సూచిస్తోందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. ఇక విషయానికి వస్తే.. ప్రధాని నరేంద్రమోడీతో లోకేష్ తాజా భేటీ  అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్ర ప్రయోజనాలతో పాటు.. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, ముఖ్యంగా మద్యం కుంభకోణంలో వెలుగులోనికి వస్తున్న విస్తుపోయే వాస్తవాలను మోడీకి వివరించి.. ఆ కేసులో అంతిమ లబ్థిదారు అరెస్టునకు లైన్ క్లియర్ చేసుసోవడమే లక్ష్యంగా ఈ సారి లోకేష్ హస్తిన పర్యటనకు వెళ్లారన్న వార్తలు రాజకీయ వర్గాలలో వినిపిస్తున్నాయి.   అన్నిటికీ మించి గతంలో అంటే 2014 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, బీజేపీలో పొత్తులో ఉండే పోటీ చేసి విజయం సాధించాయి. అప్పట్లో పవన్ కల్యాణ్ జనసేన ఈ కూటమికి బయటనుంచి మద్దతు ఇచ్చింది. అయితే నాలుగేళ్లు తిరగకుండానే బీజేపీ, తెలుగుదేశం మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. 2018లో తెలుగుదేశం ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చేసింది.  మరో సారి అటువంటి పరిస్థితి రాకుండా లోకేష్ కేంద్రం, రాష్ట్రం సంబంధాలు, అలాగే బీజేపీ, తెలుగుదేశం మైత్రి పటిష్టంగా ఉంచే బాధ్యతలు భుజానికెత్తుకున్నట్లు కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఎందుకంటే గతంలో ఎన్డీయే నుంచి తెలుగుదేశం బయటకు వచ్చిన తరువాత.. తెలుగుదేశం, బీజేపీల మధ్య తీవ్ర స్థాయిలో విమర్శల యుద్ధం జరిగింది. చంద్రబాబు, ప్రధాని మోడీలు కూడా ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకున్నారు. ఈ నేపథ్యంలోనే కూటమి ఐక్యత చెక్కు చెదరకుండా ఉండే బాధ్య తను అటు బీజేపీ పెద్దలూ, ఇటు తెలుగుదేశం అధినేత చంద్రబాబు కూడా లోకేష్ కు అప్పగించారని అంటున్నారు.  2023 సెప్టెంబర్లో అప్పటి జగన్ సర్కార్ అక్రమంగా చంద్రబాబును అరెస్టు చేసి 53 రోజుల పాటు రాజహహేంద్రవరం జైలులో నిర్బంధించిన సమయంలో లోకేష్ ఎంతో పరిణితితో వ్యవహరించిన నేపథ్యంలోనే ఈ గురుతర బాధ్యత ఆయనకు అప్పగించారని చెబుతున్నారు.  

క‌ర్మ ఎవ‌రినీ వ‌దిలి పెట్ట‌దు కేసీఆర్!

గోరు చుట్టు మీద రోక‌టి పోటు ఎలా ఉంటుందో చ‌వి చూస్తున్నారు గులాబీ ద‌ళాధిప‌తి కేసీఆర్. ఇప్పటికే ఉన్న కాళేశ్వ‌రం, టెలిఫోన్ ట్యాపింగ్, ఈ కార్ రేస్ వంటి  కేసుల‌తోనే ప‌డ‌లేక పోతుంటే.. మ‌ధ్య బిడ్డ పోరు ఒక‌టి.  గ‌తంలో కేసీఆర్ ఇదే అధికార కాంగ్రెస్ ను ఎంత అట్టుడికించారంటే.. పార్టీయే ఇక నామ‌రూపాల్లేకుండా పోయేంత‌. కేవ‌లం ఐదుగురంటే ఐదుగురు స‌భ్యులు ఎలాంటి ప్ర‌తిప‌క్ష హోదా ఇవ్వ‌కున్నా స‌రే.. ఇక్క‌డే ఉండి మైకు ఇచ్చినా ఇవ్వ‌కున్నా. త‌మ ప్రాతినిథ్యం వ‌హిస్తూ వ‌చ్చారు. క‌ట్ చేస్తే టీడీపీ. రేవంత్ రెడ్డి చెప్పిన‌ట్టు తెలంగాణ‌లో దాని ఉనికినే లేకుండా చేశారు కేసీఆర్. పాలు తాగి రొమ్ము గుద్ద‌డం, తిన్నింటి వాసాల్లెక్క పెట్ట‌డం వంటి సామెత‌లు గుర్తు తెచ్చారు. ఆ సూర్య చంద్రార్కం ఉండాల్సిన త‌ల్లిలాంటి పార్టీనే ప‌త్తాలేకుండా చేయాల‌ని చూశారు కల్వకుంట్ల చంద్ర‌శేఖ‌రరావు. అంత‌గా త‌నను త‌ల్లిలా ఆద‌రించిన పార్టీ ప‌ట్ల జ‌నాల్లో ఒక వ్య‌తిరేక‌త నూరి పోసి ఆపై.. ఇక్క‌డ ఆ పార్టీ ఉనికినే ప్ర‌శ్నార్ధ‌కం చేశారు. అదే టీడీపీ ఉండి ఉంటే రేవంత్ లాంటి వారు కాంగ్రెస్ పంచ‌న చేర‌క పోయి ఉందురేమో. ఎందుకంటే ఒక నాటికి కాకున్నా మ‌రొక నాటికి పార్టీ  పున‌రుజ్జీవ‌మై ఎంద‌రికో ఆయ‌న అన్న‌ట్టు అవ‌కాశాలు ఇచ్చేది. ఇపుడా అవ‌స్త వ్య‌వ‌స్థ ఎలా ఉందో చ‌వి చూస్తున్నారు కేసీఆర్. బేసిగ్గా కేసీఆర్ వ్యూహం ఏంటంటే తాను తెచ్చిన తెలంగాణ త‌న కొడుకు- బిడ్డ- అల్లుడు వీళ్లే ఏలుకోవాలి త‌ప్ప మ‌రొక‌రికి అవ‌కాశ‌మే లేద‌న్న కోణంలో ఆయ‌న చీమ ఆశ ఇది. చీమ ఆశ అని ఎందుకు అనాల్సి వ‌స్తోందంటే.. చీమ తాను కుట్ట‌గానే చ‌నిపోవాల‌ని ఆ దేవుడ్ని కోరుకుంద‌ట‌.. త‌థాస్తూ అన్నాడ‌ట ఆ దేవుడు కూడా.. అంతే అది మ‌న‌ల్ని కుట్ట‌గానే కొట్టి చంపేస్తుంటాం. ఇదీ అంతే.. కేసీఆర్ త‌న కుచ్చిత స్వ‌భావం కొద్దీ ప‌న్నిన ప‌న్నాగ‌మే ఇదంతా. ఇప్పుడా బాధ అనుభ‌విస్తున్నారాయ‌న‌. అస‌లు తెలంగాణ తెచ్చిన వారు మీరెలా అవుతార‌ని ప్ర‌శ్నిస్తారు కాంగ్రెస్ పార్టీ లీడ‌ర్లు. కాంగ్రెస్ ఇవ్వ‌కుంటే సోనియాగాంధీ ద‌య‌త‌ల‌చ‌కుంటే ఇది సాధ్య‌మేనా? అన్న మాట కూడా నిజ‌మే క‌దా? అంటారు జ‌నం కూడా. ఇక రేవంత్ ని ఆయ‌న కూతురు పెళ్లి ఉంద‌న‌గా కూడా ఎంత మాత్రం ప‌ట్టించుకోకుండా అరెస్టు చేసి నానా హంగామా చేశారు. ఇప్పుడు చూడండి.. కాళేశ్వ‌రం విష‌యంలో.. త‌మ‌ను అరెస్టు చేయ‌రాదంటూ స్టే తెచ్చు కోడానికి హైకోర్టు చుట్టూ తిరుగుతున్నారు కేసీఆర్, హ‌రీష్. ఇదంతా ఆనాడు మీరు చేసిన పాపం పండ‌టం వ‌ల్లే కదా? అన్న మాట వినిపిస్తోంది.  ఆ మాట‌కొస్తే కేసీఆర్ త‌న‌కంటూ ప్ర‌త్యేకించి పేరు అక్క‌ర్లేద‌నీ.. తెలంగాణ తెచ్చిన అనే ఆకాశ‌మంత పేరుంద‌ని అంటారు. మ‌రి ఈ అప్ర‌దిష్టంతా ఏంటి? మీరు క‌ట్టించిన ఒక ప్రాజెక్టు ఇటు కుంగిపోవ‌డ‌మే కాకుండా అటు ఈ ప్రాజెక్టులో ఈఎన్సీలు, ఈఈలుగా ప‌ని చేసిన వారు ఏకంగా వెయ్యి కోట్ల పైగా అవినీతికి పాల్ప‌డ్డం.. బిడ్డే అవినీతి జరిగింద‌ని బ‌జారు కెక్క‌డం.. మీ ఆకాశ‌మంత‌టి  పేరుకు చిల్లుబ‌డ్డ‌ట్టు కాదా? అని ప్ర‌శ్నిస్తున్నారు స‌గ‌టు బీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు. అందుకే అధికారం ఉంది క‌దాని మిడిసి ప‌డితే.. అది పోయాక అవ‌స్థ ప‌డాల్సి వ‌స్తుంద‌న‌డానికి కేసీఆర్ క‌న్నా మించిన నిద‌ర్శ‌నం లేద‌ని అంటున్నారు ప్ర‌తి ఒక్క‌రూ.

క‌విత‌.. ఏంటి క‌థ‌?

తన తండ్రి .. తాను ఆరాధ్య దైవంగా భావించే కేసీఆర్ కు ప్రియమైన కూతురుగా రాసిన లేఖ బ‌య‌ట ప‌డడంతో మొద‌లైంది క‌విత భ‌విత మార్చే క‌థ‌. బీఆర్ఎస్ ఆవిర్భావ పార్టీపై ఆమె త‌న‌దైన శైలిలో ఒక రివ్యూ రాశారు. ప్ర‌స్తుతం ఉన్న కంప్యూట‌ర్ టైపింగ్ జామానాలోలా కాకుండా.. పాత ప‌ద్ధ‌తిలో చేతిరాత‌తో కాగితాల మీద రాశారు. అదెలా బ‌య‌ట ప‌డిందో తెలీదు. కానీ, ఎలాగోలా మీడియాకెక్కింది. ఆ టైంలో ఆమె యూఎస్ లో ఉన్నారు.   క‌విత శంషాబాద్ ఎయిర్ పోర్టులో అడుగు పెట్ట‌డంతోనే ఆమె జాగృతి అభిమాన గ‌ణ‌మంతా వ‌చ్చారు. అప్ప‌టి నుంచి బీఆర్ఎస్ శ్రేణులు క‌విత‌కు దూరంగా ఉంటూ రావ‌డం మొద‌లైంది. ఆ త‌ర్వాత చాలానే ఎపిసోడ్లు న‌డిచాయ్. త‌న తండ్రిని దేవుడంటూనే ఆయ‌న చుట్టుప‌క్క‌ల ఉండేవాళ్లంతా దెయ్యాలంటూ కామెంట్ చేశారు. ఆ కామెంట్లు నేరుగా కేటీఆర్ కి త‌గిలిన‌ట్టుగా భావించారంతా. ఆ త‌ర్వాత జాగృతి త‌ట్టాబుట్టా కింద‌కు దించారామె. ఆపై కార్యాల‌యం మార్చారు. త‌ర్వాత కేసీఆర్ ని ట‌చ్ చేస్తే.. ఎంత మాత్రం స‌హించేది లేద‌న్న హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. ఇక బీఆర్ఎస్ వాయిస్ కి వ్య‌తిరేకంగా బీసీ బిల్లుకు స‌పోర్ట్ చేశారు. అటు పిమ్మ‌ట తీన్మార్ మ‌ల్ల‌న్న‌తో గొడ‌వ‌. ఆపై రాఖీ సంద‌ర్భంగా త‌న అన్న కేటీఆర్ మొహం చాటేయ్య‌డం.. అంత‌క‌న్నా ముందు క‌విత‌ను ఒక ప‌ద్ధ‌తి ప్ర‌కారం సింగ‌రేణి కార్మిక సంఘం గౌర‌వాధ్య‌క్షురాలిగా త‌ప్పించ‌డం. ఆమె కూడా   పెద్దగా  రియాక్ట్ కాక పోవ‌డం. అప్ప‌టి వ‌ర‌కూ క‌విత‌తో ఉన్న కార్మిక వ‌ర్గంలోని కొంద‌రు బ‌య‌ట‌కు రావ‌డంతో ఒక ప‌క్క త‌న స్థానంలో నియ‌మితులైన కొప్పుల ఈశ్వ‌ర్ కి శుభాకాంక్ష‌లు చెబుతూనే,  ఆయ‌న ఎన్నిక కార్మిక చ‌ట్టాల ప్ర‌కారం త‌ప్ప‌ని ఓపెన్ లెట‌ర్ రాయ‌డం. అదే లేఖ‌లో తాను ఇప్ప‌టి వ‌ర‌కూ సింగ‌రేణి కార్మికుల కోసం చేసిన ప‌నుల‌న్నీ ఏక‌ర‌వు పెట్ట‌డం వంటి ఎపిసోడ్లు చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయ్.  ఇప్పుడు చూస్తే హ‌రీష్, సంతోష్ టార్గెట్ గా  వ్యాఖ్య‌లు.  వీరి అవినీతి వ‌ల్ల‌.. ఈ వ‌య‌సులో కేసీఆర్.. ఆయ‌న కాలి గోటికి కూడా స‌రిపోని రేవంత్ చేత తిట్లు తిన‌డం ఏంట‌ని నిల‌దీశారామె. అంతేనా.. ఎలాంటి నిబంధ‌న‌లు పాటించ‌ని పార్టీ ఉంటే ఎంత లేకుంటే ఎంత‌?  అంటూ ఏకంగా త‌న తండ్రి పెట్టిన పార్టీ ఉనికినే ప్ర‌శ్నార్ధ‌కంలో ప‌డేశారు క‌విత‌.  మాములుగా అప్ప‌టి వ‌ర‌కూ ఉన్న సీనేంటంటే.. ఒక ప‌క్క సీఎం రేవంత్, ఆపై మంత్రులు ఉత్త‌మ్, వెంక‌ట్ రెడ్డి, పొంగులేటి, జూప‌ల్లి వంటి వారిని అసెంబ్లీలో ఒంట‌రిగా ఎదుర్కున్న వీరుడు హ‌రీష్ ని చూసి బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున గ‌ర్విస్తున్న వేళ‌.. క‌విత నుంచి ఇలాంటి సంచ‌ల‌న వ్యాఖ్యానం రావ‌డంతో తీవ్రమైన కుదుపుల‌కు లోనైంది బీఆర్ఎస్. ఇటు చూస్తే కాళేశ్వ‌రం వ్య‌వ‌హారంలో తాము వేసిన మ‌ధ్యంత‌ర పిటిష‌న్ కి హైకోర్టు నుంచి సానుకూల స్పంద‌న. అక్టోబ‌ర్ ఏడు వ‌ర‌కూ కేసీఆర్, హ‌రీష్ పై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోరాదంటూ కోర్టు ఉత్త‌ర్వులు ఇవ్వ‌డంతో కాస్తైనా ఊర‌ట ల‌భించింద‌ని అంద‌రూ భావిస్తున్న స‌మ‌యాన‌.. స‌డెన్ గా క‌విత ఎపిసోడ్ మ‌రోమారు హైలెట్ అయ్యింది. ఫైన‌ల్లీ..అంద‌రూ ఊహించిన‌ట్టుగానే క‌విత‌పై స‌స్పెన్ష‌న్ వేటు. పార్టీ నుంచి బ‌హిష్క‌రిస్తూ అధికారిక ఉత్త‌ర్వులు.  ఇక్క‌డ విచిత్ర‌మేంటంటే.. ఎక్క‌డా కూడా ఎవ్వ‌రూ ఎలాంటి వైల్డ్ రియాక్ష‌న్ లేన‌ట్టుగా బిహేవ్ చేయ‌డం. అంతాముందే రాసి పెట్టుకున్న ప్రీప్లాన్డ్ స్క్రీన్ ప్లే లాగా జ‌రిగిపోతూ వ‌చ్చిందని అంటారు చాలా మంది. మ‌ధ్య‌లో క‌విత త‌న కుమారుడితో స‌హా కేసీఆర్ ఉండే ఎర్ర‌వెల్లి ఫామ్ హౌస్ కి వెళ్లారు. కేవ‌లం క‌విత కొడుకును త‌ప్ప ఆమెను అలౌ చేయ‌లేదు కేసీఆర్. ప్ర‌స్తుతం ఫైన‌ల్ గా ఏం జ‌ర‌గ‌నుందంటే.. త‌న తెలంగాణ జాగృతినే ఆమె పార్టీ కింద మ‌లిచేలా క‌నిపిస్తోంది. కార‌ణం త‌న తండ్రి పార్టీ పేరులో వ‌దిలేసిన‌.. తెలంగాణ శ‌బ్ధం గ‌ల ఏకైక సంస్థ ఇదే కాబ‌ట్టి.. ఆమె తిరిగి తెలంగాణ అనే ప‌దాన్ని ఆశ్ర‌యించి.. త‌ద్వారా  త‌న   సొంత బాటలో రాజ‌కీయ ప్ర‌యాణం మొద‌లు పెట్టాల‌ని చూస్తున్నారు.   ఇక క‌విత ప్రొఫైల్ ఏంట‌ని ఒక సారి చూస్తే.. మాజీ ముఖ్య‌మంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శోభ దంప‌తుల‌కు మార్చి 13, 1978 న జ‌న్మించారు.  క‌విత విద్య విష‌యానికి వ‌స్తే.. స్టాన్లీ బాలికల పాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసం, తర్వాత VNR విజ్ఞాన జ్యోతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌లో బీటెక్ పూర్తి చేశారు. 2001లో అమెరికాలోని అమెరికన్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందారు. ఆపై  అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసిన కవిత, 2004లో తెలంగాణ ప్రజల కోసం పని చేయాలనే ఉద్దేశంతో భారత్‌కు రిట‌న్ బ్యాక్ అయ్యారు.  2003లో దేవనపల్లి అనిల్ కుమార్‌ను వివాహం చేసుకున్నారు. అనిల్ మెకానికల్ ఇంజనీర్. క‌విత‌- అనిల్ దంప‌తుల‌కు ఆదిత్య,  ఆర్య అనే ఇద్ద‌రు కుమారులు. కవిత 2006లో తెలంగాణ ఉద్యమం ద్వారా రాజ‌కీయాల్లోకి ప్రవేశించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో మహిళలు, యువత వంటి వర్గాల  మద్దతును సమీకరించడంలో కీలక పాత్ర పోషించారు. 2004లో తెలంగాణ జాగృతి అనే సంస్థ‌ను స్థాపించారు క‌విత‌. గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు, బతుకమ్మ పండుగను పెద్ద ఎత్తున జరపడం, యువతకు ఉపాధి అందించే స్కిల్ సెంటర్లు ఏర్పాటు చేయ‌డం వంటి యాక్టివిటీస్ చేశారు. ఇక ఎంపీగా క‌విత ప్ర‌స్తానం చూస్తే.. 2014-2019 ట‌ర‌మ్ లో నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచిఎంపీగా గెలిచారు.. ఆపై ఓట‌మి త‌ర్వాత 2020లో  నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీ అయ్యారు. ప్ర‌స్తుతం ఈ ఎమ్మెల్సీ ప‌ద‌వి రిజైన్ చేయాల‌న్న డిమాండ్ బీఆర్ఎస్ నుంచి గట్టిగా వినిపిస్తోంది.     ఇక క‌విత రాజ‌కీయంగా ఎదుర్కున్న స‌మ‌స్య‌లేంట‌ని చూస్తే.. ఆమె  ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసును ఫేస్ చేశారు.  2024 ఏప్రిల్ లో  క‌విత‌ను అరెస్ట్ చేసింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్. తీహార్ జైలులో 5 నెలల‌కు పైగా గడిపారు. ఆగస్టు 2024లో బెయిలుపై విడుదలయ్యారు.   ఇక 2025 మే నెల నుంచి క‌విత ఎపిసోడ్ నాన్ స్టాప్ గా న‌డుస్తూనే వ‌స్తోంది. ప్ర‌స్తుత ప‌రిస్థితి వ‌ర‌కూ ఆమె రాజ‌కీయ ప్ర‌స్థానం ర‌క‌ర‌కాల మ‌లుపు తీసుకుంటూనే వ‌స్తోంది. ఒక స‌మ‌యంలో త‌మ పార్టీ వారిని వేధించే వారి పేర్లు పింక్ బుక్ లో రాస్తాన‌ని హెచ్చ‌రించిన క‌విత‌.. తానే పింక్ పార్టీకి దూరమై పోయారు. ఆమే కాదు.. ఆమె ఫాలోయ‌ర్స్ ని కూడా పార్టీలోని క్రియాశీల‌క పాత్ర‌ల నుంచి తొల‌గించేశారు. చివ‌రికి పార్టీ వాట్స‌ప్ గ్రూపుల నుంచి కూడా తొల‌గించేశారు.    ప్ర‌స్తుతం తెలంగాణ రాజ‌కీయ జంక్ష‌న్లో ఉన్నారు.. క‌విత‌. ఆమె నెక్స్ట్ స్టెప్ ఏంట‌న్న‌ది  తెలంగాణ  రాజ‌కీయాల్లోనే అతి పెద్ద చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

యూరియా యుద్ధం వెనుక అసలు రహస్యం

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ భార‌త్ పై యాభై శాతం సుంకాల మోత మోగించ‌డానికి యూఎస్ వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల‌కు భార‌త్ బార్లా త‌లుపులు తెర‌వ‌డం   కూడా ఒక కారణం. అంత అవ‌స‌రం ఏమొచ్చింద‌ని చూస్తే.. అమెరికా రైతాంగం ఓటు బ్యాంకును ఆక‌ట్టుకోడానికే ట్రంప్ ఇదంతా చేస్తున్నార‌ని అంటారు నిపుణులు. దీని వ‌ల్ల వ‌చ్చే లాభ‌న‌ష్టాలేంటి? ఆయ‌న మూడో సారి అధ్య‌క్షుడ‌య్యేదుందా?  అన్న ప్ర‌శ్న వినిపించ‌వ‌చ్చు. కానీ, వారి దృష్టిలో కూడా తాను గొప్ప రైతు ప‌క్ష‌పాతిన‌ని ఎస్టాబ్లిష్ చేసుకోడానికే  ట్రంప్ ఇదంతా చేస్తున్న‌ట్టు  అంటారు.  స‌రే అమెరికా సంగ‌తి వ‌దిలి పెట్టి తెలంగాణ‌కు వ‌ద్దాం. ఇక్క‌డ మొన్న కేటీఆర్ ఒక కామెంట్ చేశారు. ఎవ‌రైతే తెలంగాణ రైతాంగానికి యూరియా కొర‌త లేకుండా చేస్తారో వారి ఉప‌రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్ధికే తమ పార్టీ ఎంపీలు ఓటు వేస్తారని చెప్పారు‌. ఇక్క‌డా అదే లాజిక్.. ఎలాగైనా స‌రే, తెలంగాణ రైతాంగం దృష్టినాక‌ర్షించ‌డ‌మే ల‌క్ష్యం. క‌ట్ చేస్తే.. ఇదే బీఆర్ఎస్ ఒక‌ ప‌క్క కాళేశ్వ‌రంపై అసెంబ్లీలో చ‌ర్చ అన‌గా.. త‌మ పార్టీ వారి చేత రోడ్డుపై యూరియా నిర‌స‌న‌కు తెర‌లేపింది.  ఇక కాంగ్రెస్ త‌ర‌ఫు నుంచి యూరియా యుద్ధం ఎలా సాగిందో చూస్తే.. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలంద‌రూ పార్ల‌మెంటు ఎదుట యూరియా కోసం నిర‌స‌న తెల‌ప‌గా.. ఆ పార్టీ అగ్ర‌నేత ప్రియాంక సైతం వారి ఫ్లెక్సీల‌ను చేప‌ట్ట‌డానికి చేతులు క‌లిపారు. వియ్ వాంట్ యూరియా అంటూ స్లోగ‌న్ కొట్టారు. దీంతో బీజేపీ యాభై వేల ట‌న్నుల యూరియా తెలంగాణ‌కు పంపుతామ‌ని అన‌డంతో.. ఆ ఘ‌న‌త మొత్తం త‌మదేనంటూ ఇక్క‌డి వ్య‌వ‌సాయ మంత్రి తుమ్మ‌ల కామెంట్ చేసిన విధ‌మూ క‌నిపించింది. ఈ విష‌యంలో బీజేపీ వాయిస్ ఎలా ఉందో చూస్తే.. యూరియాకి సంబంధించి త‌ప్పుడు లెక్క‌లు చూపుతోంది రేవంత్ స‌ర్కార్ అంటూ ఆరోపించారు తెలంగాణ‌ బీజేపీ అధ్య‌క్షుడు రామ‌చంద్ర‌రావు. తెలంగాణకు ఖరీఫ్ సీజన్‌కు ఇప్పటివరకు 6.14 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాని కేంద్ర ప్రభుత్వం అందజేసిందని ఆ గ‌ణాంకాల‌న్నిటినీ విడ‌మ‌ర‌చి చెప్పారాయ‌న‌. ఇంకా ఎంత యూరియా కావాలంటే అంత ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కూడా అన్నారు.  రబీ సీజన్ 2024-2025లో 9 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉందని... కానీ తెలంగాణలో 12.5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని ఆ లెక్క‌ల‌న్నీ వ‌ల్లెవేశారు. కానీ ఇక్క‌డ చూస్తే యూరియా లేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని.. రబీలో అదనంగా ఉన్న యూరియా ఇప్పుడు ఎందుకు లేకుండా పోయిందని.. నిల‌దీశారాయ‌న.  ఎందుకు కొరత వచ్చిందో రేవంత్ ప్రభుత్వం పరిశీలించుకోవాలని సూచించారు తెలంగాణ‌ బీజేపీ చీఫ్ రామ‌చంద్ర‌రావు. రాజకీయాల కోసం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని కూడా ధ్వజమెత్తారు. తాను చెప్పింది తప్పయితే పదవికి రాజీనామా చేస్తానని.. మీది తప్పు అయితే మీరు రాజీనామా చేస్తారా? అని తుమ్మలకు సవాల్ చేశారు తెలంగాణ బీజేపీ చీఫ్.  ఇంత‌కీ తెలంగాణ‌లో వ‌చ్చిన యూరియా కొర‌త నిజ‌మైన‌దా? లేక రాజ‌కీయ ప్రేరేపిత‌మా? అన్న‌ది కూడా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. బేసిగ్గా యూరియా ఎవ‌రి చేతుల్లో ఉంటుందో చూస్తే.. అది కేంద్రం చేతుల్లో. కేంద్రం నుంచి స‌ర‌ఫ‌రా లేక పోవ‌డం వ‌ల్లే ఇదంతా అని కాంగ్ర‌ెస్ అంటుంటే.. అలాంటిదేం లేద‌ని బీజేపీ వాదిస్తోంది.   అసలు యూరియా కొరత ఎందుకు వచ్చింది? యూరియా కోసం రైతులు ఎందుకు ఇంతలా ఇబ్బందులు పడుతున్నారు? అని చూస్తే వ‌ర్షాకాలంలో వ‌రి, ప‌త్తి పంట‌ల‌కు యూరియా అవ‌స‌రం పెద్ద మొత్తంలో ఉంటుంది.  2025 సీజన్‌లో ఒక్క తెలంగాణ‌లోనే 1.32 కోట్ల ఎకరాల్లో అన్ని రకాల పంటలు సాగవుతాయని అంటోంది వ్యవసాయ శాఖ. ఇందులో ఆహార ధాన్యాలు 76.14 లక్షల ఎకరాల్లో సాగ‌వుతుండ‌గా.. వీటిలో 62.47 లక్షల ఎకరాల్లో వరి, 48.93 లక్షల ఎకరాల్లో పత్తి, 6.69 లక్షల ఎకరాల్లో కంది, 5.21 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పంటలున్నాయి. మిగిలిన విస్తీర్ణంలో ఇతర ఆహార, వాణిజ్య పంటలున్నాయి. సీజన్ మొదట్లో ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, మహబూబ్ నగర్ వంటి జిల్లాల్లో అక్కడక్కడ యూరియా కొరత కనిపించింది. వ‌ర్షాలు ప‌డి రైతులు పూర్తి స్థాయి సాగుకు సిద్ధ‌ప‌డ్డారు. ఈ లోగా వీరినెత్తిన పిడుగులా వ‌చ్చి ప‌డింది యూరియా కొర‌త. 2 వేల బ‌స్తాలు అవ‌స‌రం ఉన్న చోట కేవ‌లం 500 బ‌స్తాలు మాత్ర‌మే వ‌స్తున్నాయ్. ఏ మాత్రం ఆల‌స్యం అయినా ఆ ఒక‌టీ అరా బ‌స్తాలు కూడా దొర‌క‌వు. దీంతో వ‌ర్షం ప‌డుతున్నా కూడా.. క్యూలైన్లు వ‌ద‌ల‌కుండా బారులు దీరుతోంది రైతాంగం.  తెలంగాణకు ఎంత యూరియా రావాలి.. ఎంత వచ్చింది? అని చూస్తే.. తెలంగాణకు ఈ వ‌ర్షాకాలం సీజన్లో 9.80 లక్షల టన్నుల యూరియా అవసరమని అంచనా వేసింది వ్యవసాయ శాఖ. మాములుగా అయితే ఏటా  ఏప్రిల్ నుంచి యూరియా అవసరం మొదలవుతుంది. త‌ర్వాతి  సీజన్‌కు తగ్గట్టుగా యూరియా నిల్వలు అందుబాటులో ఉంచుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుంది. అయితే, 2022 నుంచి రాష్ట్ర వ్యవసాయ శాఖ వార్షిక ప్రణాళిక విడుదల చేయడంలేదని ఆరోపిస్తున్నారు రైతు సంఘం నాయకులు. పంటల వారీగా వ్యవసాయ ప్రణాళిక వేయాలని ఎన్నోసార్లు అడిగామ‌నీ.. దీన్నిబట్టి ఎరువులను డిమాండుకు తగ్గట్టుగా ఏర్పాటు చేసుకునే వీలుంటుందనీ.. అదే జరగడం లేద‌నీ ఆరోపిస్తారు వీరంతా.   రాష్ట్ర వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం, తెలంగాణలో ఏప్రిల్ నాటికి 1.92 లక్షల టన్నుల యూరియా అందుబాటులో ఉంది. ఇది కాకుండా తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక ప్రకారం కేంద్రం నుంచి వచ్చే నెలవారీ యూరియా కోటాలోనూ కోత పడిన‌ట్టు తెలుస్తోంది. ఏప్రిల్ నుంచి ఆగస్టు నాటికి కేంద్రం నుంచి 8.30 లక్షల టన్నులకుగాను 5.12 లక్షల టన్నుల యూరియానే వచ్చినట్లుగా చెబుతారు  మంత్రి తుమ్మల. ఇదే కాకుండా ఏప్రిల్ నాటికి ఉన్న నిల్వలు కలుపుకొంటే 7.04 లక్షల టన్నుల యూరియా రైతులకు అందుబాటులో ఉంచినట్లు వివరించారాయ‌న‌. కేంద్రం నుంచి రావాల్సిన కేటాయింపుల్లో కోత కారణంగా మొత్తంగా 2.76 లక్షల టన్నుల కొరత ఏర్పడిందని చెబుతారు మంత్రి తుమ్మ‌ల‌. ఈ ఆరోపణలను ఖండించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచంద్ర‌రావు. యూరియా సరఫరాలో ఎక్కడా కేంద్రం నుంచి లోపం జరగలేదని అంటారు. కేంద్ర ప్రభుత్వం 2025 యాసంగి సీజన్ లో తెలంగాణకు అవసరమైన 9.87 లక్షల టన్నుల యూరియా స్థానంలో 12.47 లక్షల టన్నులు సరఫరా చేసిందని వివరించారు రామ‌చంద్ర‌రావు. ఓపెనింగ్ స్టాక్ లెక్కల్లో తేడాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు తెలంగాణ‌ బీజేపీ అధ్య‌క్షుడు.  బీఆర్ఎస్ ఈ విష‌యంలో ఎలాంటి వాద‌న వినిపిస్తుందో చూస్తే.. త‌మ హ‌యాంలో ఆరు నెలల ముందు నుంచే ఎరువుల కోసం ముందస్తు ప్రణాళిక తయారు చేసి తెప్పించామ‌ని అంటారు కేటీఆర్. ప్రణాళికా లోపం కారణంగానే సమస్య ఏర్పడింద‌ని తేల్చి చెబుతారు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్. ఎరువుల కొరతపై శ్వేతపత్రం విడుదల చేయాలని కూడా డిమాండ్ చేశారాయ‌న‌. అయితే, రాష్ట్రానికి అవసరమైన ఎరువుల వివ‌రాలు కేంద్రానికి ముందుగా ఇండెంట్ పంపించామని అంటారు మంత్రి తుమ్మ‌ల.   ఎరువుల పరంగా ఏ రాష్ట్రానికి ఎంత కావాలనే విషయంపై ఆయా రాష్ట్రాల నుంచి డిమాండ్  వెళ్తుంది. ఈ ఇండెంట్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఒక‌ ప్రణాళిక ర‌చించి, ఎరువులు సరఫరా చేస్తుంది. బేసిగ్గా అయితే జిల్లాల అవ‌స‌రాల‌ను బ‌ట్టీ ఎరువులను పంపే బాధ్య‌త వ్య‌వ‌సాయ శాఖ‌పై ఉంటుంది. కానీ మంత్రులు ఎమ్మెల్యేల బ‌లాబ‌లాల‌ను బ‌ట్టీ ఎరువుల‌ను త‌ర‌లిస్తున్న‌ట్టు ఆరోపిస్తున్నారు వ్య‌వ‌సాయ సంఘం నేత‌లు. మొత్తంగా డిమాండ్- కేటాయింపులు- సరఫరా మధ్య 2.76 లక్షల టన్నుల వ్యత్యాసం ఏర్పడింది. దీన్ని అధిగమిస్తేనే, రైతులకు సరిపడా యూరియా అందించే వీలుంటుందని అంటారు నిపుణులు.   ఇక రామ‌గుండం ఎరువుల ఫ్యాక్ట‌రీ వ్య‌వ‌హారం  విష‌యానికి వ‌స్తే.. ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు 145 పని దినాలు ఉంటే 78 రోజులు ఉత్పత్తి నిలిచిపోయిందని ప్ర‌క‌టించింది రేవంత్ స‌ర్కార్. ఇందుకు సాంకేతిక కారణాలు, అమ్మోనియం లీకేజీ కార‌ణంగా చెబుతోంది ఫ్యాక్టరీ యాజమాన్యం. ఈ ప్రభావం కూడా తెలంగాణ రైతాంగం పడుతున్న‌ట్టు చెబుతున్నారు. బేసిగ్గా రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ నుంచి ఉత్పత్తయ్యే యూరియాలో 11శాతం వాటా రాష్ట్రానికి ఉంటుంది. ఆ మేరకు తెలంగాణకు కేటాయించాలి. ఫ్యాక్ట‌రీ ఎరువుల‌ ఉత్ప‌త్తిలో వ‌చ్చిన స‌మ‌స్య కార‌ణంగా కూడా ఈ కొర‌త వ‌చ్చిన‌ట్టు చెబుతారు వ్య‌వ‌సాయ సంఘ  నేత‌లు.   సాధారణంగా వరి, ప‌త్తికి మూడు నుంచి నాలుగుసార్లు యూరియా వేస్తుంటారు రైతులు. పత్తి విత్తనాలు విత్తిన 20 రోజుల నుంచి మూడు లేదా నాలుగుసార్లు యూరియా వేస్తుంటారు. వరికి కలుపు తీసే సమయలోను, తర్వాత నుంచి 20 రోజులకు, 30 రోజులకు, 50 రోజులకోసారి యూరియాను అవసరాన్ని బట్టి వేస్తుంటారు. యూరియా వాడకం ఎక్కువ కావడంతోపాటు పంటల విస్తీర్ణం పెరగడం కొరత ఏర్పడటానికి కారణమైందని చెబుతుంది వ్యవసాయ శాఖ.   యూరియాపై ఎక్కువగా రైతులు ఆధారపడటానికి గ‌ల‌ కారణాలేంట‌ని చూస్తే.. కంపోస్టు ఎరువుల వాడకం తగ్గింది. మాంసకృత్తులతో కూడిన పదార్థాలు పండించే పంటలకు ఎక్కువగా యూరియా అవసరం పడుతోంద‌ని అంటారు అగ్రి రంగ‌ నిపుణులు. అలాగే గాల్లో నత్రజని తీసుకునే బ్యాక్టీరియా పంటపొలాల్లో క్రమంగా తగ్గుతోందని, అవసరమైన నత్రజని అందించేందుకు యూరియాను ఎక్కువగా పంటలకు వేస్తుంటారని అగ్రి వ‌ర్శిటీ  ప్రొఫెస‌ర్లు.   కాదేదీ క‌విత్వానికి అన‌ర్హం అన్న‌ట్టు కాదేదీ రాజ‌కీయాల‌కు అన‌ర్హం. చిన్న సైజు ఉల్లిపాయ కూడా కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను గ‌డ‌గ‌డ‌లాడించ‌గ‌ల‌దు. అలాంటిది యూరియా బ‌స్తా మాత్రం ఆ ప‌ని చేయ‌లేదా? అన్న‌ది కొంద‌రి కామెంట్. యూరియా కొర‌త కూడా ప్ర‌స్తుత రాజ‌కీయాల్లో ఒక భాగంగా మారి.. వారి వారి వాద‌న‌ల‌ను తెర‌పైకి తెస్తోంది. దీనంత‌టి వెన‌క ఉన్న ఒకే ఒక్క లక్ష్యం.. రైతాంగాన్ని ఆకర్షించ‌డ‌మే. మా త‌ర‌ఫున ఈ పార్టీ వాళ్లు గ‌ట్టిగానే పోరాడుతున్నారంటూ.. వారి కంట్లో ప‌డ్డ‌మే ల‌క్ష్యంగా ఈ యూరియా యుద్ధం కొన్నాళ్ల పాటు చూడ‌క త‌ప్పదంటున్నారు వ్య‌వ‌సాయ‌, రాజ‌కీయ రంగ‌ విశ్లేష‌కులు.

ది లీడర్.. ది లెజండరీ, ది స్టేట్స్ మన్.. ఒకే ఒక్కడు నారా చంద్రబాబు

తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు యావత్ భారత దేశానికి కూడా సెప్టెంబర్ 1 ఒక ప్రత్యేకమైన రోజు.. ఎందుకంటే సరిగ్గా 30 ఏళ్ల కిందట.. ఇదే రోజు ఒక దార్శనికుడు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తరువాత ఆయన పాలన, పాలనలో తీసుకువచ్చిన దార్శనికత, అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ఆయన సాగించిన ప్రయాణం ఒక చరిత్ర. దేశంలోని అన్ని రాష్ట్రాలకూ ఆదర్శంగా మారిన చరిత. ఆయనే నారా చంద్రబాబునాయుడు. చంద్రబాబు నాలుగుదశాబ్దాల  రాజకీయ ప్రస్థానంలొ.. సరిగ్గా మూడు దశాబ్దాల కిందట తొలి సారిగా ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నంచి ఆయన ప్రతి అడుగూ ఒక చరిత్రే. విజయం, పరాజయం వంటి వాటితో సంబంధం లేకుండా, ప్రజా ప్రయోజనాలు, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ఆయన వేసిన ప్రతి అడుగూ ఒక చరిత్రే.  తెలుగు దేశం  జాతీయ అధ్యక్షుడు,  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. 30 ఏళ్ల కిందట 1995, సెప్టెబంర్ 1 న తొలి సారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు.  అక్కడ నుంచి ఇప్పటికి నాలుగు సార్లు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రెండు సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, రెండు సార్లు విభజిత ఏపీ సీఎంగా. వాస్తవానికి ఆయన రాజకీయ ప్రవేశం నుంచీ ఆయన ప్రస్తానంలో ప్రతి మలుపూ ఒక సంచలనంగా చరిత్రలో నిలిచిపోతుంది. ప్రస్తుతం ఏడుపదుల వయస్సు పైబడినా ఆయనలో ఎక్కడా వార్ధక్య ఛాయలే కనిపించవు. చంద్రబాబు నాయుడు నడకలో, నడతలో, ఆలోచనలలో అంతా నూతనత్వమే.   1995 సెప్టెంబర్‌ 1న  తొలి సారిగా ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు.. తన విధానాలతో, తన దార్శనికతతో రాష్ట్ర అభివృద్ధే  లక్ష్యంగా అనతి కాలంలోనే ఘన విజయాలను సాధించారు. ఒక ముఖ్యమంత్రి జిల్లా కేంద్రాలకు వెళ్లడమే గగనమనుకునే రోజుల్లో ఆయన గ్రామ గ్రామానికీ చొరవగా వెళ్ళారు. జన్మభూమి, శ్రమదానం, ప్రజల వద్దకు పాలన తదితర కార్యక్రమాలతో నిరంతరం ప్రజల్లోనే ఉన్నారు.  జన్మభూమి కార్యక్రమంతో రాష్ట్రాన్ని ప్రగతి రథం వైపు పరుగులు తీయించారు. ప్రభుత్వ పథకాల లోటుపాట్లను స్వయంగా సమీక్షించేందుకు ఆకస్మిక తనిఖీలను చేపట్టారు. పరిశ్రమలను ప్రోత్సహించేందుకు పారిశ్రామిక బోర్డు  ఏర్పాటు చేశారు. కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సులు, కంప్యూటర్‌ విద్య, మహిళా కండక్టర్లు వంటి ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారు.  దార్శనికతతో ఐటీ రంగాన్ని ప్రోత్సహించి హైదరాబాద్‌ను అంతర్జాతీయ పటంలో అగ్రగామిగా నిలిపారు. అమెరికా వెళ్లి ప్రపంచ ప్రసిద్ధి చెందిన కంపెనీలను హైదరాబాద్‌ తీసుకురాగలిగారు. రాష్ట్రవ్యాప్తంగా యువతకు కళ్లు చెదిరే జీతాలొచ్చాయి. రైతు బిడ్డలను రత్నాలుగా మార్చారు. మారుమూల గ్రామాలకు కూడా ఐటీ రంగాన్ని పరిచయం చేశారు.  ఇక యునైటెడ్‌ ఫ్రంట్ కన్వీనర్‌గా దేవెగౌడ, ఐ.కె.గుజ్రాల్‌లను ప్రధానులుగా చేశారు. 1999లో వాజపేయి నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. లౌకికవాదానికి కట్టుబడి బైట నుండి షరతులతో కూడిన మద్దతు ఇచ్చారు. ముస్లిం వర్గానికి చెందిన ప్రఖ్యాత అణు శాస్త్రవేత్త అబ్దుల్‌ కలాంను రాష్ట్రపతిగా చేయటంలో కీలక పాత్ర పోషించారు. దళిత నేత జిఎంసి బాలయోగిని అత్యున్నత చట్టసభ లోక్‌సభ స్పీకర్‌గా చేశారు.   అధికారంలో ఉన్నా, లేకున్నా నిరంతరం ప్రజా సమస్యలపైనే రాజీలేని పోరాటం చేసిన నాయకత్వం చంద్రబాబుదే.  మీకోసం యాత్ర ద్వారా రాష్ట్రమంతా 117 రోజులు పర్యటించి ప్రజా సమస్యలను దగ్గరుండి తెలుసుకున్నారు. బాబ్లి ప్రాజెక్టు వ్యతిరేకంగా ఉద్యమించి మహారాష్ట్రలో జైలుపాలై ఎనిమిది రోజుల పాటు అన్న పానీయాలు విడిచి  నిరహారదీక్ష చేశారు.  రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్‌ హైకమాండ్‌ రాష్ట్ర విభజన అంశాన్ని వినియోగించుకొని తెలుగుజాతి మధ్య చిచ్చుపెట్టడంపై ఢిల్లీ స్థాయిలో నిలదీశారు. ఏపీ భవన్‌లో ఆరు రోజులపాటు నిరశన దీక్ష చేసి తెలుగు వారి సమస్యలను జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా చేశారు.   దేశ రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా అరవై మూడేళ్ళ వయసులో కాళ్లు బొబ్బలెక్కినా పట్టించుకోకుండా  7 నెలలపాటు దాదాపు 2,817 కిలో మీటర్లు పాదయాత్ర చేసి ప్రజలను చైతన్య పరిచారు.   చంద్రబాబునాయుడి జీవితంలో నేర చరిత్ర లేదని ప్రతిపక్ష నేతలే ఒప్పుకుంటారంటే అతిశయోక్తి కాదు. ఆయనపై అవినీతి మరక అంటించేందుకు ప్రత్యర్థులు కోర్టుల్లో వేసిన కేసులన్నీ నీరుగారిపోయాయి. పార్టీ కార్యకర్తల కోసం సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి ప్రతీ కార్యకర్తకు నూటికి నూరుశాతం సంక్షేమనిధి ద్వారా న్యాయం జరిగేలా చేశారు. జయాపజయాలు రాజకీయ నాయకులకు సహజం. కానీ వాటితో నిమిత్తం లేకుండా ఎప్పుడూ జనంలోనే ఉంటూ వారిలో ఒకడిగా మమేకమయ్యే లక్షణమే చంద్రబాబు నాయుడిని ఈ స్థాయిలో నిలబెట్టింది. అందుకే చంద్రబాబు ... కేవలం రాజకీయ నాయకుడిగానే కాదు, ఒక రాజనీజ్ఞునిగా చరిత్ర పుటల్లో  ఒకే ఒక్కడుగా సుస్థిర స్థానం సంపాదిం చుకున్నారు. ఇప్పడు నవ్యాంధ్రప్రదేశ్ కు రెండో సారి ముఖ్యమంత్రిగా ఆయన రాష్ట్రాన్ని ప్రగతి పథాన నిలిపేందుకు అలుపెరుగని కృషి చేస్తున్నారు. 

కాంగ్రెస్ లో రాజ‌గోపాల రాగం నాన్ స్టాప్!

అజ‌రుద్దీన్ ఎమ్మెల్సీ అయ్యి ఆపై  మంత్రి వ‌ర్గంలో చోటు సంపాదించేలా ఉన్నారు. ఇక ప్రొఫెస‌ర్ కోదండ‌రామ్ సైతం స‌రిగ్గా ఇలాంటి సిట్యువేష‌న్ కి వ‌చ్చేశారు. కానీ ఇప్ప‌టి వ‌ర‌కూ రాజ‌గోపాల్ రెడ్డి కేసు ఎక్క‌డ వేసిన గొంగ‌ళి అక్క‌డే ఉంది. ఎంత‌కీ తెమ‌ల‌డం లేదు. ఆయ‌న కూడా ప్ర‌జ‌లు క‌ష్టాల్లో ఉంటే అసెంబ్లీకి రావ‌డం ఎలా సాధ్య‌మంటూ మారాం చేస్తున్నారు. త‌న నిర‌స‌న మ‌రో ర‌కంగా తెలియ చేస్తున్నారు. అస‌లేంటీ రాజ‌గోపాల్ రెడ్డి స్టోరీ అని చూస్తే.. మరేం లేదు ఇస్తాన‌న్న మంత్రి పదవి ఇవ్వ‌లేదు. మంత్రి ప‌ద‌వి ఎందుకివ్వాలి? ఆయ‌నేమైనా పెద్ద తోపా? ఆ మాట‌కొస్తే ఒకే ఇంట్లో ఇద్ద‌రు మంత్రి ప‌ద‌వులు ఎలా ఇస్తారు? నిన్న‌మొన్న‌టి వ‌ర‌కూ కేసీఆర్ కుటుంబాన్ని ఇలాగే ఆడిపోసుకుని ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే త‌ప్పు చేస్తుందా? అని ప్ర‌శ్నించేవారు ఏకంగా  కాంగ్రెస్ నుంచే పుట్టుకొచ్చినా ఆశ్చ‌ర్యం లేదు.  కానీ రాజ‌గోపాల్ రెడ్డి ఇంత మంకు ప‌ట్ట‌డానికి కూడా రీజన్ ఉంది.   భువ‌న‌గిరి ఎంపీగా చామ‌ల కిర‌ణ్ కుమార్ రెడ్డిని గెలిపిస్తే మీకు మంత్రి ప‌ద‌వి ఖాయ‌మంటూ.. సాక్షాత్ రేవంత్ రెడ్డే హామీ ఇచ్చారు.  నాకిచ్చిన టాస్క్ కంప్లీట్ చేశాను. మ‌రి నాకు ఇవ్వాల్సిన మంత్రి ప‌ద‌వి మీరు ఇవ్వాలిగా అంటూ నిలదీస్తున్నారు రాజ‌గోపాల్ రెడ్డి. మొన్న‌టికి మొన్న ఆరు సీట్ల గ్యాప్ ఉంటే.. అందులో మూడు భ‌ర్తీ చేశారు. మ‌రో మూడింటికి ఇంకా స్కోప్ ఉంది. ఇప్ప‌టికే ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా నుంచి ఎవ్వ‌రూ లేరు కాబ‌ట్టి మాకిచ్చి తీరాల్సిందేన‌ని ఈ జిల్లా వాసులు ప‌ట్టుబ‌డుతున్నారు. ఇక నిజామాబాద్ సంగ‌తి స‌రే స‌రి. సుద‌ర్శ‌న్ రెడ్డికి ఇస్తాం ఇస్తామ‌ని మొండి చేయి చూపించినట్టుగా ఆయ‌న తెగ ఫీల‌వుతున్నారు. ఇలాంటి ప్రాతినిథ్యం లేని జిల్లాలు కొన్ని ఉన్నాయి. వీరంద‌రినీ వారించ‌డానికి ఊరించ‌డానికి మీనాక్షి న‌ట‌రాజ‌న్ వేసిన స్కెచ్ ఈ మిగులుబాటు చ‌ర్య‌లు. వ‌చ్చే స్థానిక ఎన్నిక‌లు, ఉప ఎన్నిక‌ల్లో ఈ ఊరింపు ఉంటేనే ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేలు ఇత‌ర నాయ‌కులు స‌రిగ్గా ప‌ని చేస్తారంటూ ఆమె ఈ స్ట్రాట‌జీ ప్లే  చేశారు.  దీన్నిబ‌ట్టిచూస్తే రాజ‌గోపాల్ రెడ్డికి ఒక అవ‌కాశ‌మైతే ఉంది. కానీ ఇస్తారా? అన్న ద‌గ్గ‌ర అంద‌రి ఆలోచ‌న‌లు ఆగిపోతున్నాయ్. ఎందుకంటే ఆల్రెడీ మంత్రివ‌ర్గంలో అంద‌రిక‌న్నా రెడ్ల సంఖ్యే ఎక్కువ‌. అలాంటిది మ‌రో రెడ్డిని కేబినెట్ లోకి తీసుకోవడం జరిగే పని కాదన్నది అంచనా.  అయితే రాజ‌గోపాల్ రెడ్డి వంటి వ్యాపారుల వ‌ల్ల కాస్త ప్ర‌యోజ‌నం ఉంటుంది. వారి ద్వారా పెట్టుబ‌డిదారులు ముందుకొస్తారు. వారికున్న వ్యాపార సంబంధ బాంధ‌వ్యాలు అలాంటివి. కాబ‌ట్టి..  మంచిదే కానీ అది జ‌రిగే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు.  మ‌రి రాజ‌గోపాల్ రెడ్డి ప‌రిస్థితి ఏంటి? ఆయ‌న కాంగ్రెస్ లోనే ఉంటారా? లేక బీజేపీలోకి వెళ్లిపోతారా? ఆయ‌న్ను మీనాక్షి నటరాజన్ ఎలా బుజ్జ‌గించ‌నున్నారు?  అన్న చ‌ర్చ కూడా న‌డుస్తోంది. అయితే ఇంకేదైనా ప్రాధాన్య‌తా ప‌ద‌వి ఇవ్వ‌డానికి అవ‌కాశ‌ముంది. ఒక వేళ ఉంటే అదెలాంటిదై ఉంటుంది? అన్న ప్ర‌శ్న కూడా త‌లెత్తుతోంది. ప‌రిశ్ర‌మ‌ల‌కు సంబంధించిన ఏదైనా బాధ్య‌త‌లు అప్ప‌గిస్తే బావుంటుంద‌ని అంటున్నారు కొంద‌రు. అవి ఏవై ఉంటాయ‌ని చూస్తే.. ఒక‌టి స్పోర్ట్స్, రెండు మూసీ ప్రాజెక్టు.. రేవంత్ తీస్కున్న ప్రాధాన్య‌తాంశాల్లో ఇవి కీల‌కం. ఇటీవ‌ల క‌పిల్ దేవ్ ని కూడా రేవంత్ అదే పనిగా పిలిచి మరీ సన్మానించారు.  ఇలాంటి బాధ్య‌త‌ల‌ను ఏవైనా అప్ప‌గిస్తే ఏదైనా రాజ‌గోపాల్ రెడ్డి శాంతిస్తారా? అన్న‌ది కూడా తేలాల్సి ఉంది.

గురువింద సామెతను గుర్తు చేస్తున్న భూమన కరుణాకరరెడ్డి తీరు

జగన్ హయాంలో తిరుమలలో జరిగిన అనాచారాలకు అంతే లేదు. జగన్ మోహన్ రెడ్డి హిందూ వ్యతిరేకా, కాదా అన్నది పక్కన పెడితే ఆయన హిందువు అయితే కాదు. ఇందులో ఎటువంటి సందేహాలకూ తావు లేదు. అయితే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దేవుళ్లకు, ఆలయాలకు, హిందూ ధర్మానికి జరిగిన అపచారాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆ సంఘటనలే ఆయన హిందూ వ్యతిరేకా అన్న అనుమానాలు బలపడేలా చేశాయి.   ఒక విధంగా చెప్పాలంటే హిందూ సమాజం వ్యక్తం చేసిన ధర్మాగ్రహమే ఆయనను అధికారం నుంచి దించేసిందని చెప్పవచ్చే. హైందవ ధర్మం పట్ల , మరీ ముఖ్యంగా తిరుమల విషయంలో ఆయన హయాంలో జరిగిన అనాచారాలు, అపచారాలు   జగన్మోహన్ రెడ్డి ప్రియ స్వామీజీ  శారదాపీఠాధిపతి శ్రీ స్వరూపానంద సరస్వతీ స్వామీజీకి సైతం ఆగ్రహం తెప్పించాయి.  జగన్ హయాంలో సింహాచలం చందనోత్సవంలో చోటుచేసుకున్న అవకతవకల పై ఆయన మీడియా ముఖంగా వ్యక్తం చేసిన ఆగ్రహమే అందుకు నిదర్శనం.   జగన్మోహన్ రెడ్డి పాలనలో పనిగట్టుకుని హిందువుల మనోభావాలను దెబ్బ తీసిన సంఘటనకోకొల్లలు. జగన్మోహన రెడ్డి అధికారంలోకి వచ్చింది మొదలు, ఎన్నెన్ని దేవాలయాల మీద దాడులు జరిగాయో, ఎక్కడెక్కడ దేవుని ఆస్తులు అన్యాక్రాంత మయ్యాయో. చివరకు ఏడుకొండల వెంకన్నదేవుని సన్నిధిలో  అన్యమత ప్రచారం మొదలు, ఇంకెన్ని అకృత్యాలు జరిగాయో తెలియంది కాదు.  అంతెందుకు కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే శ్రీ వేంకటేశ్వర స్వామిని నల్లరాతితో పోల్చిన నాస్తికుడు భూమన కరుణాకరరెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ గా నియమించడం ద్వారా జగన్ తన తీరు ఏమిటో? వైఖరి ఏమిటో ఎటువంటి దాపరికం లేకుండా చాటుకున్నారు. టీటీడీ చైర్మన్ గా భూమన ఉన్న కాలంలో వైఖానస ఆగమ శాస్త్రాన్ని, ఆచార వ్యవహారాలను పక్కన పెట్టి టీటీడీ ఇష్టారాజ్యంగా తీసుకుంటున్న నిర్ణయాలు భక్తులను ఆవేదనకు గురి చేశాయి.   ఒక్క మాటలో చెప్పాలంటే హిందూ ధర్మ రక్షణ కోసం ఏర్పడిన టీటీడీ ధర్మ విరుద్ధ చర్యలకు నిలయంగా మారింద విమర్శలు వెల్లువెత్తాయి. అంతే కాదు భూమన టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన తరువాత టీటీడీ ఒక వ్యాపార కేంద్రంగా  మారిపోయిందన్న ఆరోపణలు, విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి.   గోవింద నామ స్మరణ తప్ప మరో పేరు వినిపించడమే అపచారంగా భావించే తిరుమల కొండపైన ఏకంగా రాజకీయ జెండాలు, స్టిక్కర్లు దర్శనం  ఇచ్చాయి.   ఇంతగా తిరుమల పవిత్రతకు భంగం వాటిల్లేలా వ్యవహరించిన భూమన కరుణాకరరెడ్డి ఇప్పుడు హైందవ ధర్మపరిరక్షకుడి అవతారం ఎత్తినట్లుగా...టీటీడీపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాను టీటీడీ చైర్మన్ గా ఉండగా మొదలై, ఆ తరువాత కూడా కొనసాగిన అవకతవకలు, అక్రమాలు, అధర్మాలను... రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తరువాత బాధ్యతలు చేపట్టిన తిరుమల తిరు పతి దేవస్థానం బోర్డు సభ్యులు సరిదిద్దుతూ, తిరుమల పవిత్రత పెంచేలా చర్యలు తీసుకుంటుంటే.. భూమన విమర్శలతో చెలరేగిపోతున్నారు. ఆరోపణలతో రెచ్చిపోతున్నారు.  తప్పులన్నీ తాను చేసి.. ఇప్పుడు భూమన టీటీపై ఆరోపణలతో ఎందుకింతగా రెచ్చిపోతున్నారు? జనం విశ్వసిస్తారని ఎలా భావిస్తున్నారు? అంటే తిరుమలలో వర్షం పడితే... ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తిరుమల శ్రీవారి భక్తులు తడిసి ముద్దౌతారు. తిరుమలలో జరిగే ఏ చిన్న సంఘటన అయినా భక్తులు, హిందూ ధార్మిక సంస్థల దృష్టిని ఆకర్షిస్తుంది. అందుకే.. తనను చుట్టుముడుతున్న కేసుల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి భూమన ఈ రకంగా టీటీడీపై విమర్శల దాడికి దిగుతున్నారు. తద్వారా తాను తిరుమల పవిత్రతను కాపాడటానికి కంకణం కట్టుకున్న వ్యక్తిగా జనం దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారు. తిరుమలకు సంబంధించిన అంశం అంటే మీడియా వాస్తవమా? అవాస్తవమా? అన్న శోధనలోకి పోకుండా ప్రాధాన్యత ఇచ్చి ప్రాచుర్యం కల్పిస్తుందన్న భావనతో భూమన ఇలా రెచ్చిపోతున్నారని పరిశీలకులు అంటున్నారు. అన్నిటికీ మించి జనం మెమరీ చాలా తక్కువ అన్నభ్రమల్లో భూమన తన హయాంలో జరిగిన అపచా రాలను ప్రజలు మరిచిపోయి ఉంటారనుకుంటున్నారు.  ఇపుడున్న తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుల ప్రతిష్టను దెబ్బతీయాలంటే ఇలాంటి ఎదురుదాడే శరణ్యమని భ్రమిస్తున్నారు.  అయితే భూమన రీతి గురివింద చందంగా ఉందన్న అభిప్రాయమే సర్వత్రా వ్యక్తం అవుతోంది. భూమన ప్రతి విమర్శపైనా మీ హయాంలో చేసిందేమిటి? అంటూ జనం చర్చించుకుంటున్నారు. 

రాహుల్ టార్గెట్ గా అరవింద్ విమర్శల వర్షం.. మర్మమేంటంటే?

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముంగిట కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి బిగ్ షాక్ తగిలింది.  బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో విజయాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఓట్ అధికార్ యాత్ర పేరుతో బీహార్ లోనే మకాం వేశారు. కీలక నాయకురాలు, ఆయన సోదరి ప్రియాంక గాంధీ కూడా బీహార్ లో పర్యటిస్తున్నారు. ఓట్ చోర్ అంటూ ప్రధాని మోడీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం బీహార్ పర్యటనలు చేస్తున్నారు. దీంతో బీహార్ ఎన్నికలు కాంగ్రెస్ కు గేమ్ చేంజర్ గా మారనున్నాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది.   జాతీయ మీడియాలో మాత్రం రాహుల్ చేస్తున్న ఓటు అధికార్ యాత్రకు విస్తృత కవరేజ్ అయితే లభిస్తోంది. అంతే కాదు, విశ్లేషకులు కాంగ్రెస్ కూటమికి  బీహార్ ఎన్నికల్లో సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. సర్వేల ఫలితాలు సైతం అదే చెబుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలలో ఐక్యత కనిపిస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ రూపంలో రాహుల్ కు గట్టి షాక్ తగిలింది.  ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకూ ఇండియా కూటమిలోనే ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆ తరువాత బయటకు వచ్చేసింది. ఇప్పుడు బీహార్ ఎన్నికల సమయంలో మరోమారు కాంగ్రెస్ కు, రాహుల్ కు వ్యతిరేకంగా గళమెత్తింది. ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ రాహుల్ పై విమర్శలు గుప్పించారు. గురువారం (ఆగస్టు 28) ఆయన మీడియా సమావేశంలో  బీజేపీ, కాంగ్రెస్ ను ఒకే తాను ముక్కలు, పరిస్థితులను చూస్తుంటే ఇరు పార్టీల మధ్యా పొత్తు ఉందా అనిపిస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీజేపీల పొత్తుకు నేషనల్ హెరాల్డ్ కేసుకు ముడిపెట్టారు.   నేషనల్ హెరాల్డ్ కేసు మూతపడిందా? అన్న అనుమానం వ్యక్తం చేశారు. మద్యం కేసులో తాను అన్యాయంగా జైలుకు వెళ్లాననీ.. కానీ నేషనల్ హెరాల్డ్ కేసులో గాంధీ కుటుంబం నుంచి ఎవరూ జైలుకు వెళ్లలేదన్నారు. దీని వెనుక ఏదో మర్మం ఉందన్న అనుమానం వ్యక్తం చేశారు. అంతే కాదు   2 జి, బొగ్గు కుంభకోణం వంటి స్కాంల కథ ముగిసిపోయినట్లే కనిపిస్తోందన్న అరవింద్ కేజ్రీవాల్   కాంగ్రెస్ రాజీపడటమే ఇందుకు కారణమని ఆరోపించారు. కాంగ్రెస్ అగ్రనేత ఇప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణ అంటూ చేస్తున్న ఆందోళన, యాత్రలూ అన్నీ వ్యక్తిగత రక్షణ కోసమేనని సంచలన వ్యాఖ్యలు చేశారు.  రాహుల్ గాంధీ ఇటీవలి కాలంలో బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఆయన విమర్శలకు జాతీయ స్థాయిలో స్పందన లభించడమే కాకుండా, చర్చకు కూడా కారణమౌతున్నాయి. రాహుల్ విమర్శలతో ఎంత కాదనుకున్నా బీజేపీ డిఫెన్స్ లో పడిందన్న అభిప్రాయమే సర్వత్రా వ్యక్తం అవుతోంది. రాహుల్ దూకుడు కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు కూడా కాంగ్రెస్ వెనుక ర్యాలీ అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అరవింద్ కేజ్రీవాల్ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ లక్ష్యంగా  చేసిన విమర్శలు, వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి.  ఇవి బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో ప్రభావం చూపే అవకాశం ఉందా? అన్న చర్చకు తెరలేచింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో పోటీకి దూరంగా ఉన్న ఆప్.. ఇప్పుడు కాంగ్రెస్ లక్ష్యంగా, రాహుల్ టార్గెట్ గా ఎందుకు గళమెత్తుతోందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  

తీరు మారని ట్రంప్... ప్రపంచ దేశాలకు మళ్లీ యూఎస్ వార్నింగ్

  అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన దూకుడు కొనసాగిస్తూనే ఉన్నారు. తాజా మరోసారి ఆయన ప్రపంచ దేశాలకు వార్నింగ్ ఇచ్చారు. అమెరికా టెక్ సంస్థల నుంచి డిజిటల్ పన్నులు వసూలు చేసే దేశాలకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా గట్టివార్నింగ్ ఇచ్చారు. అమెరికాకు, అమెరికా కంపెనీలకు సముచిత గౌరవం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆయా దేశాలకు అమెరికా నుంచి కంప్యూటర్ చిప్స్ ఎగుమతులపై ఆంక్షలు విధిస్తానని హెచ్చరించారు. ఆల్ఫబెట్, మెటా, అమెజాన్.. వంటి అమెరికా కంపెనీలపై డిజిటల్ పన్నులు, ఇతర ఆంక్షలు పెట్టే దేశాలు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ మేరకు తన సొంత సోషల్ మీడియా ట్రూత్ సోషల్‌లో ఓ పోస్టు పెట్టారు. అమెరికా టెక్ కంపెనీలపై దాడులు చేసే దేశాలకు ఎదురొడ్డి నిలబడతామని అన్నారు. డిజిటల్ ట్యాక్స్‌లు, డిజిటల్ సర్వీస్ చట్టాలు, డిజిటల్ మార్కెట్ నియంత్రణలు అన్నీ అమెరికా కంపెనీలపై వివక్ష చూపించేందుకు రెడీ చేశారని విమర్శించారు. చైనా కంపెనీలకు మాత్రం ఈ దేశాలు ఎలాంటి అడ్డంకులు కల్పించట్లేదని, పద్దతి మార్చుకోవాలని సూచించారు. అలాంటి దేశాలను అప్రమత్తం చేస్తున్నానని, అమెరికా కంపెనీలు మీకు కాళ్లు తుడుచుకునే డోర్ మ్యాట్స్ వంటివి కావని,  అమెరికాకు, అమెరికా కంపెనీలకు సముచిత గౌరవం ఇవ్వండి లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ట్రంప్ ప్రపంచ దేశాలపై మండిపడ్డారు. డిజిటల్ పన్నుల విషయంలో అమెరికా కెనడాపై అగ్గిమీద గుగ్గిలమవుతున్న విషయం తెలిసిందే.  కెనడాతో వాణిజ్య పరంగా తెగదెంపులు చేసుకుంటామని జూన్‌లో గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ఈ అంశాల్లో ఈయూ మాత్రం అమెరికా అనుకూల ధోరణితో ముందుకు వెళుతోంది. ఇలాంటి వాణిజ్య అడ్డంకులు తొలగింపునకు కలిసి పనిచేస్తామని అమెరికా, ఐరోపా సమాఖ్య ఓ సంయుక్త ప్రకటన చేశాయి. ఎలక్ట్రానిక్ ప్రసారాలపై ఎలాంటి కస్టమ్స్ డ్యూటీలు విధించబోమని పేర్కొన్నాయి. నెట్‌వర్క్ యూసేజీ ఫీజులను కూడా విధించబోమని కూడా ఐరోపా సమాఖ్య పేర్కొంది. ప్రస్తుతం అనేక దేశాల ప్రభుత్వాలు అమెరికన్ కంపెనీల నుంచి సగటున 3 శాతం వరకూ పన్ను వసూలు చేస్తున్నాయి. అమెరికా కంపెనీలు ఆయా దేశాల్లో పొందుతున్న ఆదాయంపై ఈ పన్ను విధించాయి. ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ, యూకే వంటి దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి.  

నష్టనివారణా.. జగన్ అరెస్టు ఖాయమన్న సంకేతమా?

జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన లిక్కర్ కుంభకోణం వైసీపీ పునాదులనే కదిల్చేస్తోందా? అంటే.. మిథున్ రెడ్డి అరెస్టు తరువాత ఆ పార్టీలో కనిపిస్తున్న ఖంగారు చూస్తుంటూ ఔననే అనిపిస్తోంది. దాని కంటే ముఖ్యంగా మిథున్ రెడ్డి అరెస్టు తరువాత ఆ పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి వరుసగా మీడియాకు ఇస్తున్న ఇంటర్వ్యూలలో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు వైసీపీ భయాన్ని ఎత్తి చూపుతున్నాయి. మిథున్ రెడ్డి అరెస్టు తరువాత వైసీపీ అంత వరకూ ప్రదర్శిస్తూ వస్తున్న గాంభీర్యం లేదా మేకపోతు గాంభీరం ఒక్కసారిగా పటాపంచలైపోయింది. పొంతన లేని ప్రకటనలతో పార్టీలో నెలకొన్న అయోమయాన్ని బహిర్గతం చేసుకుంటోంది. సరిగ్గా ఇదే సమయంలో సజ్జల బయటకు వచ్చి వైసీపీ అనుకూల మీడియాకు వరుసగా ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఆ ఇంటర్వూల సారాంశం ఏమిటన్న దానిపైనే ఇప్పుడు రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. మిథున్ రెడ్డి అరెస్టు తరువాత నష్టనివారణ, క్యాడర్ లో ధైర్యాన్నినింపడం ఎజెండాగా సజ్జల మాట్లాడిన మాటలు క్యాడర్ లో ధైర్యం నింపడం సంగతి అటుంచి క్యాడర్ ను మరింత గందరగొళంలోకి నెట్టేశాయి. మొత్తంగా సజ్జల మద్యం కుంభకోణం కేసులో జగన్ అరెస్టు అనివార్యం అన్న సంకేతం ఇచ్చారు. జగన్ అరెస్టు కు క్యాడర్ ను సంసిద్ధం చేయడమే ఆయన ఇంటర్వూల సారాంశమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  జగన్ ప్రభుత్వ హయాంలో సజ్జల సకలశాఖల మంత్రిగా చక్రం తిప్పారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా ఆయన నాడు అన్ని శాఖలపైనా తిరుగులేని పెత్తనం చెలాయించారు. ఇప్పుడు అధికారం కోల్పోయిన తరువాత ఈ ఏడాది కాలంలో ఆయనకు పనేమీ లేకుండా పోయింది. అయితే మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డి అరెస్టు తరువాత ఆ అరెస్టును, ప్రభుత్వ తీరును ఖండిస్తూ పార్టీని సమర్ధించుకోవలసిన బాధ్యత ఆయనపై పడింది. ఆ పనిని ఆయన చేయగలిగినంత అస్తవ్యస్తం చేస్తున్నారని వైసీపీ శ్రేణులే అంటున్నారు. మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డి అరెస్టుకే కంగారుపడితే ఎలా? ముందు ముందు జగన్ కూడా ఈ కేసులో కటకటాల వెనక్కు వెడతారు.. అంటే ఆయన పార్టీ క్యాడర్ కు సంకేతాలిస్తున్నారు. ఆధారాలు లేకుండా అరెస్టులు చేస్తున్నారంటూ ఆయన చేస్తున్న ఆరోపణలు కూడా చాలా బలహీనంగా ఉన్నాయి. ఇంతకీ ఆయనేం చెప్పారంటే.. ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి వచ్చి తొలి ఏడాది ఎవరినైనా అరెస్టు చేయడం సులువే.. చంద్రబాబు ఇప్పుడు అదే చేస్తున్నారు అని చెప్పుకొచ్చారు. అదే జగన్ అన్ని ఆధారాలూ సేకరించిన తరువాత తన అధికారం చివరి దశలో చంద్రబాబును అరెస్టు చేశారని గుర్తు చేశారు. అయితే ఇక్కడ సజ్జల ఉద్దేశపూర్వకంగా విస్మరించిన సంగతేంటంటే.. జగన్ ప్రభుత్వం అన్ని ఆధారాలూ సేకరించి చంద్రబాబునున అరెస్టు చేసినట్లైతే.. ఆ ఆధారాలను కోర్టులో ప్రవేశపెట్టడంలో విఫలం ఎందుకైంది? అన్న ప్రశ్నకు సమాధానం. మొత్తంగా నష్టనివారణ అంటూ మీడియా ముందుకు అదీ జగన్ అనుకూల మీడియా ముందుకు వచ్చి సజ్జల చెప్పిందేమిటంటే.. జగన్ మద్యం కేసులో అరెస్టు కాబోతున్నారు అనే.  

గాంధీలు జైలుకు వెడతారా?

అవును. ఇప్పుడు ఈ ప్రశ్న రాజకీయ వర్గాల్లోనే కాదు, సామాన్య ప్రజల్లోనూ ప్రముఖంగా వినిపిస్తోంది. నేషనల్‌ హెరాల్డ్‌  మనీలాండరింగ్‌ కేసులో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన చార్జి షీట్ లో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్, పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ,లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీలను ఎ1,ఎ2గా పేర్కొన్న నేపధ్యంలో  గాంధీలు జైలుకు  వెళతారా? అనే ప్రశ్న దేశంలో ప్రముఖగా వినిపిస్తోంది. మరో వంక ఈ కేసును తెర పైకి తెచ్చిన రాజ్యసభ మాజీ సభ్యుడు సుబ్రమణ్య స్వామి  ఆ ఇద్దరి అరెస్ట్ తప్పదని  పూటకో టీవీ చానల్ లో ప్రవచనం చెప్పినట్లు చెపుతున్నారు. సో..సహజంగానే సోనియా, రాహుల్ గాంధీలను ఈడీ అరెస్ట్  చేస్తుందా? అనే ప్రశ్న కాంగ్రెస్  వర్గాల్లోనే కాదు, సామాన్యులలోనూ  వినిపిస్తోందని అంటున్నారు. అయితే కావచ్చును కాంగ్రెస్  నాయకులు ఆరోపిస్తున్నట్లుగా, కాంగ్రెస్ పార్టీని ముఖ్యంగా ఇటు బీజేపీకి అటు మోదీ నాయకత్వానికి సవాలుగా దూసుకొస్తున్న రాహుల్ గాంధీ దూకుడును అడ్డుకునేందుకే మోదీ ఈడీని ఉసిగొల్పుతున్నది నిజం కావచ్చును. కానీ  కేసు చరిత్రను  చూస్తే అసలు ఏమీ లేకుండానే  పదేళ్లకు పైగా విచారణలో ఉన్న కేసులో ఈడీ ఏ ఆధారాలు లేకుండానే ఛార్జిషీట్‌ దాఖలు చేస్తుందా? అందులోనూ  సోనియా, రాహుల్ గాంధీ పై ఛార్జిషీట్‌ దాఖలు చేసే సాహసం చేస్తుందా? అనే  సందేహాలు కూడా గట్టిగానే వ్యక్తం అవుతున్నాయి. అదలా ఉంటే.. పరిపాలనా దక్షత, అభివృద్ధి లెక్కల విషయంలో ఎలా ఉన్నా..  రాజకీయ లెక్కలు వేయడంలో తప్పుచేయని మోదీ షా జోడీ  కాంగ్రెస్ అగ్ర నేతలు ఇద్దరినీ ఒకే సారి టార్గెట్  చేస్తారా?  ఆ తప్పు మోదీ షా జోడీ చేస్తుందా? అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.  నిజానికి  రాజకీయ నాయకుల అవినీతి బాగోతాలకు సంబందించిన కేసుల్లో చాలా చిక్కు ముళ్ళు ఉంటాయి. ముఖ్యంగా ఈ  ‘స్థాయి’ కేసుల్లో  చాలా పకడ్బందీగా, ఎక్కడా ఏ దర్యాప్తు సంస్థకూ దొరక్కుండా, పక్కా పథకం ప్రకారం పని కానిచ్చేస్తారని  అంటారు. కానీ  నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి చిక్కు ముళ్ళు పెద్దగా లేవు. అంతా  ఓపెన్ సీక్రెట్ , ఖుల్లం ఖుల్లా ..అందరికీ అర్థమయ్యేలా ఉందని  అంటున్నారు.  క్లుప్తంగా కేసు వివరాలోకి వెళితే,మూడు నాలుగు తరాల రాజకీయాలతో ముడిపడిన ఈకేసులో  గొప్పగా చిక్కు ముళ్ళు ఏమీలేవు. నెహ్రూ గాంధీల తొలి తరం నేత, స్వతంత్ర భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ  1935 లో  మరో 5000 మంది వాటాదారులతో కలసి స్వాతంత్ర పోరాటంలో అక్షర ఆయుధంగా పనిచేస్తుందని అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)సంస్థను స్థాపించి, ‘నేషనల్ హెరాల్డ్’ అంగ్ల పత్రికను ప్రారంభించారు. ఆ తర్వాత దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రధానమంత్రి పండిత జవహరలాల్ నెహ్రూ ప్రభుత్వం నేషనల్ హెరాల్డ్  పత్రిక కోసం ఢిల్లీ, లక్నో సహా మరికొన్ని మహానగరాలలో విలువైన స్థలాలను చౌకగా ఇచ్చారు. ఇవి కాక ఏజేఎల్ కంపెనీకి 90 లక్షల దాకా 10 రూ.విలువ గల షేర్స్ ఉన్నాయి. అంటే 9 కోట్ల మూలధనం ఉంది. అంతే కాకుండా నెహ్రూజీ మానస పుత్రికగా ముద్ర వేసుకున్న పత్రికకు  కాంగ్రెస్ ప్రభుత్వాలు విరాళాల రూపంలో,  ప్రకటనల రూపంలో ఆర్థిక సహకారం అందిస్తూ వచ్చాయి. (పత్రిక మూత పడిన తర్వాత కూడా హిమాచల ప్రదేశ్  ప్రభుత్వం, ఈ మధ్యనే రూ. 2.50 కోట్ల  ప్రకటనలు ఇచ్చినట్లు  ఈడీ చార్జి సీట్లో ఉందిట.) అయినా, కంపెనీ 2008 నాటికి, రూ.90 కోట్ల మేర అప్పుల ఊబిలో కూరుకు పోయింది. నేషనల్ హెరాల్డ్ పత్రిక మూత పడింది. ఈ అప్పులు తీర్చడం కోసం  కాంగ్రెస్ పార్టీ నేషనల్ హెరాల్డ్ కి రూ.90 కోట్లు అప్పు ఇచ్చింది.  నేషనల్ హెరాల్డ్  స్టొరీలో ఇదే టర్నింగ్ పాయింట్.  ఎందుకంటే.. ఒక రాజకీయ పార్టీ అప్పులు, ఇచ్చి పుచ్చుకోవదాలను చట్టం అనుమతించదు. అదొకటి అయితే.. పత్రిక మూత పడినా, దేశంలో అనేక నగరాల్లో ఉన్న ఏజేఎల్’ ఆస్తుల విలువ పడిపోలేదు.పెరింగింది.ఇప్పడు ఆస్తుల విలువ రూ. 2000 వేల కోట్ల పైమాటే అంటున్నారు.ఇంకొదరైతే రూ.5000కోట్లు అంటున్నారు. వాస్తవానికి ఈ  ఆస్తులు 2010 వరకు నెహ్రూ కుటుంబ ఆస్తులు కాదు. స్వచ్చంద సంస్థకు చెందిన ఆస్తులు.  కానీ 2010లో  సోనియా గాంధీ, రాహుల్ గాంధీచెరో 38 శాతం వాటాతో, (మిగతా 22 శాతంకు  ఆ స్కార్ ఫెర్నాండేజ్, మోతీలాల్ వోరా  వాటాదారులు) యంగ్ ఇండియా కంపెనీ తెర మీదకు వచ్చింది. అక్కడితో, సీన్ మారిపోయింది. కొత్త కంపెనీ మూలధనం కేవలం రూ.5 లక్షలు మాత్రమే అయినా.. రూ.2000 వేల కోట్ల పైబడిన  ఏజేఎల్ ఆస్తులతో పాటుగా, కంపెనీకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్లు చెపుతున్న రూ.90 కోట్ల అప్పు ఆ నలుగురి మధ్య కుదిరిన ఒప్పందంతో, యంగ్ ఇండియాకు బదిలీ అయిపోయింది.  అక్కడితోనూ  కథ ముగియ లేదు. ఏజేఎల్  ఆస్తులు యంగ్ ఇండియాకు బదిలీ అయిపోయిన వెంటనే  కాంగ్రెస్ ఇచ్చిన రూ.90 కోట్ల అప్పు ను  కాంగ్రెస్ పార్టీ ఉదారంగా..  యంగ్ ఇండియా నుంచి జస్ట్ ఓ రూ.50 లక్షలు తీసుకుని మాఫీ చేసేసింది. మళ్ళీ  యంగ్ ఇండియా కు ఆ రూ. 50 లక్షలు ఎక్కడివంటే..  అది మళ్ళీ మరో భేతాళ కథ.  సో .. మొత్తంగా చూస్తే సామాన్యులకు కూడా అర్థమయ్యే విషయం ఏమంటే..  సోనియా,రాహుల్ గాంధీలలు ప్రధాన షేర్ హోల్డర్లుగా ఉన్న యంగ్ ఇండియా  జస్ట్ ఓ రూ.5 లక్షల పెట్టుబడితో  రూ.2000 కోట్ల పైబడిన ఏజేఎల్ ఆస్తులకు హక్కు దారు అయింది.  సో.. ఇప్పుడు ఇలా నాలుగు గోడల మధ్యా జరిగినట్లు చెపుతున్న  ఒప్పందాలలకు సంభందించి సాగుతున్న విచారణలో భాగంగానే ఈడీ, సోనియా, రాహుల్ గాంధీలను ఎ 1,  ఎ 2 గా పేర్కొంటూ  చార్జిషీట్ దాఖలు చేసింది.   నిజానికి,   2012- 2013లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఈ కేసు వెలుగు చూసింది. సీబీఐ విచారణ చేపట్టింది. ఆ సమయంలోనే  సోనియా, రాహుల్ గాంధీలకు న్యాయస్థానం ముందస్తు బెయిల్ ఇచ్చింది. ఇప్పటివకు వరకూ కూడా గాంధీలు ఇద్దరూ బెయిల్ పైనే ఉన్నారు. అలాగే ఈడీ కూడా గతంలో ఆ ఇద్దరినీ విచారించింది. ఇప్పడు చార్జి షీట్ దాఖలు చేసింది. అయితే, ఈడీ చార్జి షీట్ దాఖలు చేసినంత మాత్రాన వెంటనే అరెస్ట్ చేస్తుందని కాదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్,  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  వెంటనే అరెస్ట్ కాలేదు. అసలు అరెస్ట్ అవసరమా..  కాదా అనేది ఈడీ కాదు.. కోర్టులు నిర్ణయిస్తాయి. సో.. ఇప్పటికి ప్పుడైతే  గాంధీలు అరెస్ట్ అయ్యే అవకాశాలు అంతగా లేవనే అంటున్నారు.  బట్.. చట్టం తన పనితాను చేసుకు పోతుంది .. చట్టానికి సహకరించడం పౌరుల ధర్మం. గాంధీలు అందుకు అతీతులు కాదు. వారికి మినహాయింపూ ఉండదు.