చరిత్ర సృష్టించిన అసామాన్యడు.. మోదీ @75
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం (సెప్టెంబర్17) 75 వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సహా దేశ విదేశీ ప్రముఖులు అనేక మంది మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియ చేస్తున్నారు. మోదీ 75వ జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ దేశ వ్యాప్తంగా వారం రోజుల పాటు వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
మోడీ పుట్టింది పేద కుటుంబంలో
ప్రధానమంత్రి మోదీ సెప్టెంబర్ 17, 1950న గుజరాత్‌లోని మెహసానా జిల్లాలోని వాద్‌నగర్ పట్టణంలో జన్మించారు. ఆయన పూర్తి పేరు నరేంద్ర దామోదర్‌దాస్ మోదీ. పుట్టింది, పెరిగింది అతి సామాన్య కుటుంబం. ఇంకా సపష్టంగా చెప్పాలంటే.. అత్యంత నిరు పేద కుటుంబంలో మోదీ జన్మించారు. బాల్యం నుంచే పేదరికాన్ని రుచి చూశారు. అయినా.. జీవితంలో ఎక్కడా అధైర్య పడలేదు. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. అదే ఆత్మవిశ్వాసంతో, ఒక సారి కాదు, రెండు సార్లు కాదు, వరసగా మూడు సార్లు దేశ ప్రధాని, బాధ్యతలు చేపట్టారు. దేశ ప్రధాన సేవకుడిగా, దేశానికి సేవలు అందిస్తున్నారు. స్వతంత్ర భారత చరిత్రలో అత్యంత ప్రభావమంతమైన నాయకుడిగా గుర్తింపు, గౌరవం సొంతం చేసుకున్నారు. స్వాతంత్య్రానంతరం జన్మించన తొలి ప్రధానిగానే, కాకుండా.. వరసగా మూడు సార్లు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన కాంగ్రెసేతర తొలి ప్రధానిగానూ చరిత్ర పుటల్లో స్థానం సంపాదించుకున్నారు. నిజానికి స్వతంత్ర భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తర్వాత వరసగా మూడుసార్లు ప్రధాని పదవిని చెపట్టిన ప్రదానిగానూ మోదీ చరిత్ర పుటల్లో ఇందిరాగాంధీ కంటే ఒకమెట్టు పైన నిలిచారు.
వరసగా మూడు సార్లు ప్రధాని పదవిని అలంకరించిన మోదీ.. దేశంలో తిరుగులేని నేతగా నిలవడమే కాదు, ప్రపంచ దేశాల్లో భారత దేశ ఖ్యాతిని ఇనుమడింప చేశారు. చేస్తున్నారు. ప్రపంచ నాయకుల్లో అత్యంత ప్రభావమంతమైన నాయకుడిగా కితాబు నందుకున్నారు. ఈ రోజుకు కూడా, 75 శాతం ప్రజమోదంతో మోదీ ప్రపంచ దేశాలు అత్యంత ప్రభావంతమైన నాయకులలో ప్రప్రధముడిగా నిలిచారు. అతేకాదు, ఇంతవరకు భారత ప్రధాని ఎవరూ అందుకోనన్ని, ప్రపంచ దేశాల అత్యున్నత పౌర పురస్కారాలను అందుకున్నారు. ఇంతవరకు 18 దేశాలు తమ దేశ అత్యున్నత పౌర పురస్కారాలతో భారత ప్రధానమంత్రి, ప్రథమ సేవకుడు మోదీని సత్కరించాయి. భారత దేశం పూర్వ వైభవాన్ని, విశ్వగురు స్థానాన్ని తిరిగి పొందడమే లక్ష్యంగా.. 75 ఏళ్ల యువకుడిగా వడివడిగా అడుగులు వేస్తున్న మోదీ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. వయసు కారణంగా ఆయన శరీరంపై ముడతలు కనిపించినా.. ఆయన గుండె నిబ్బరం ఎక్కడా చెక్కు చెదరలేదు. ఎక్కడా ముడతలు, మడతలూ లేవు. ఒకటే గమ్యం.. ఒకటే లక్ష్యం అన్నట్లుగా ముందుకు సాగుతున్నారు. అందుకే, 75 సంవత్సరాల వయోపరిమితి రేఖ ఆయన ప్రస్థానానికి అడ్డు కాలేదు. సర్వామోదంతో ఆయన ప్రధాన మంత్రిగా, ప్రధాన సేవకుడిగా కొనసాగుతున్నారు.
బాల్యం నుంచే
1950 సెప్టెంబర్ 17న గుజరాత్‌లోని వడ్‌నగర్‌లో సామాన్య కుటుంబంలో జన్మించిన నరేంద్ర దామోదర్‌దాస్ మోదీ.. ఎనిమిదేళ్ల వయసులో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)లో చేరారు.ఇక అక్కడి నుంచి ఆయన జీవితంలో ఎన్ని మార్పులు వచ్చినా, చిరుప్రాయంలో పడిన సైద్ధాంతిక పునాదుల ఆధారంగానే మోదీ జీవన ప్రస్థానం సాగింది.
హై స్కూల్ చదువు పూర్తయిన తర్వాత ఆధ్యాత్మిక జీవితం వైపు మొగ్గు చూపిన మోదీ.. ఇల్లు వదిలి కొంత కాలం రామకృష్ణ మఠంలో, ఆ తర్వాత హిమలయా పర్వతాలలో గురువులు, సాధు సంతుల మార్గదర్శకత్వంలో ఆద్యాత్మిక జీవిత ప్రస్థానం సాగించారు. అయితే, ఆ తర్వాత కాలంలో గురువులు, సాధుసంతుల ఆదేశం మేరకు, తన జీవితాన్ని దేశ సేవకు అంకితం చేయాలనే నిర్ణయానికి కొచ్చారు. ఆర్ఎస్ఎస్ లో క్రియాశీల కార్యకర్తగా ప్రవేశించి.. కొద్ది కాలానికే ప్రచారక్ (పూర్తి సమయ కార్యకర్త) గా బాధ్యతలు స్వీకరించారు. సుమారు 15 సంవత్సరాలు వివిధ రాష్ట్రాలు, వివిధ ప్రాంతాల్లో, సంఘ్ ప్రచారక్ గా పనిచేశారు. ఈ 15 సంవత్సరాల కాలంలో మోదీ దేశ సామాజిక స్థితి గతులను,సమూలంగా అధ్యయనం చేశారు.
ఆ తర్వాత సంఘ్ ఆదేశాల మేరకు బీజేపీలో వివిధ బాధ్యతలు నిర్వహించారు. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ బాధ్యతలు స్వీకరించారు. 2014 వరకు మూడుసార్లు ఆ పదవిలో కొనసాగారు. ఆయన పాలనలో గుజరాత్ ఆర్థిక అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనలో గణనీయమైన పురోగతి సాధించింది. పారిశ్రామిక అభివృద్ధికి ఆయన ఇచ్చిన ప్రాధాన్యంతో గుజరాత్ మోడల్ జాతీయ స్థాయిలో ప్రచారం పొందింది. ముఖ్యమంత్రిగా ఆయన పాలన దేశానికి ఒక ఉదాహరణగా మారింది. మోదీ సారథ్యంలో బీజేపీ గుజరాత్ లో ఆరోజు నుంచి ఈరోజు వరకు ఏనాడూ ఓటమిని చూడలేదు. 2014 మే 26న బీజేపీ లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో ఆయన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ఆయన నాయకత్వంలో బీజేపీ ఆ తరువాత 2019, 2024 ఎన్నికల్లో కూడా విజయం సాధించింది.ఇది ఆయన జనాదరణ, నాయకత్వ పటిమను స్పష్టం చేస్తుంది.
ఇంచుమించుగా పుష్కర కాలంగా సాగుతున్న మోదీ పాలనలో దేశం కొవిడ్ మహమ్మారి సహా ఎన్నో సవాళ్ళను ఎదుర్కున్నది. మైలు రాళ్ళను దాటింది. ఆర్థిక రంగంలో అనూహ్య ప్రగతిని సాధించింది. 2014 లో తొమ్మిది, పది స్థానాల్లో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థ.. ఈరోజు ప్రపంచంలో నాల్గవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. అలాగే.. సైనిక సామర్ధ్యంలో మన దేశం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. అందుకే,మోదీ తిరుగులేని నేతగా నిలిచారు. నవ భారత నిర్మాతగా గుర్తింపు, గౌరవాన్ని పొందుతున్నారు.