మా అమ్మా నేనూ
మా అమ్మా నేనూ
నాకు అంతా బాగా గుర్తు లేదు కానీ ఆరోజు పెరట్లో కెళ్ళగానే కాకర పాదుకు పూసిన పసుపు పచ్చని పూలు చూసి , "అమ్మా! కాకరపూలు చూడవే భలే ఉన్నాయ్ పసుపురంగు " అంటూ పెద్దగా కేకేశాను. అమ్మ నవ్వుతూ నా కోసం పాల గ్లాసు పట్టు కుని వచ్చింది."ఇంకేం కావాల్సినన్ని కాకర కాయలు.నీకూ నాన్నగారికీనీ" అంటూ కాకరపుల కేసి చూసి, " తమాషా అన్నీ పిందె పూలే!" అంది. " అంటే !"అన్న నామాటలకు అర్ధం వివరించింది. పిందె ఉండి పూసేవి మాత్రమే కాయలవు తాయని, ఉత్తిపూలూ కాయలుకావనీనీ.అలా రోజూ ఆ కాకర పూలనూ, పిందెలనూ, కాయలనూ, చూస్తూ వాటి మీద మమకారం పెంచుకున్నట్లున్నాను. అమ్మ షుమారుగా మూడు వారాల తర్వాత చేసి నా కంచంలో పెట్టిన కాకరకాయ కాకరపు కాయ కూర లొట్ట లేసుకుంటూ తిన్నగుర్తుంది. అప్పుడు నాకు ఏడెని మిదేళ్ళుండవచ్చు.అలా కాకరకాయ కూరం టే నాకు ఇష్టం ఏర్పడింది.
మా నాన్నగారికీ మా అమ్మ చేసే ఈ కూర చాలా ఇష్టం. ఆకూర తింటూంటే నాన్న గుర్తువచ్చేవారు. నాన్న హార్ట్ ఎటాక్ తో చనిపోయారు. అలా ఆ ఆకూర మీద ఇష్టం తగ్గిపోయింది. ఇద్దరం కల్సి ఆ కూర తినే వాళ్ళం . మా అమ్మ కాకరకాయను చాలా విధాలుగా చేసేది. కాయను నాల్గుగా చీల్చి గుత్తొంకాయలా కారం పెట్టి చేసేది . చిన్నముక్క లుగా చేసి బాగా వేపి కరకర కాకర కూర చేసేది.ఉల్లికారం పెట్టి వేపేకూర మరొకటి. పండు కాకర కాయలతోనూ ఆమె కమ్మగా కూర చేసేవారు.మజ్జిగ పోసి ఉడికించి మసాలా వేసి చేసేకూర ఒకటి. అన్నిట్లోకీ నాకు, నాన్నగారికీ ఇష్టమైనది కారపు కాకర కాయ కూర.
చదువు ,పెళ్ళి, భర్త ,పిల్లలూ నా సంసార సాగరంలో పడి ఈదుకోసాగాను. అమ్మతన ఇంట్లో వంటరిగా ఉండేది.నాకూ, మా వారికీ అదే టౌన్ లో ఉద్యోగాలు కావటాన అక్కడే స్వంత గూడొకటి కట్టుకుని ఉండేవారం. ఆరోజు ఇంట్లో కూరలు తగినన్నిలేక పిల్లలకు టమోటా కూర చేసి లంచ్ బాక్సుల్లో పెట్టిచ్చాను. మావారికి ఉత్తి పప్పూ , చింత పండు పచ్చిపులుసు , ఆవకాయా, అప్పడం ఉంటే చాలు.స్కూల్ కు టైమవు తుందని గబ గబా వంట ముగించి బయల్దేరాను. నేను స్కూల్ కె ళ్ళాక H.M ని కావటాన క్లాసులూ , ఆఫీస్ వర్కూ, నెలాఖరు కనుక పంపాల్సిన పేబిల్స్ , క్లర్క్ తో పూర్తి చేయించి చెక్ చేసుకుని , పంపేసరికి స్కూల్ టైమై అంతా లంచ్ కెళ్ళిపోయారు .మార్చి ఎండ మండుతున్నది. గొడుగేసుకుని పదడు లేశానో లేదో స్టూడెంట్ ఒకడు పరుగు పరుగున వచ్చి నాచేతికి ఒక చిన్న క్యారీబ్యాగ్ ఇచ్చాడు.
" ఏంటిరా ఇది?" అని అడుగు తుండగానే , వాడు స్కూల్ గేటు వైపు చూపాడు. అక్కడ ఎండలో చెపటలు కక్కుతూ ,ఆయాస పడుతూ అమ్మ నిల్చుని ఉంది. నేను వెనక్కు వచ్చి "ఏంటమ్మా! ఇది? ఇంత ఎండ లో వచ్చావ్?" అని అడిగాను. "మన పెరట్లో కాచిన కాకరకాయలు, నీకు ఇష్టమని కారపు కాయ చేసి తెచ్చాను" అంది.
అమ్మ ఇంట్లో పెద్దపెరడు, జామ, సపోటా, మూడు మామిడి చెట్లు , నిమ్మ, బత్తాయి, దానిమ్మ చెట్లు వెనక ఉండగా ముందం తా కూరపాదులూ, 4,5 రకాల గులాబీ మొక్కలూ, ఇంట్లోకి వెళ్ళేదార్లో బాటకిరు వైపులా వేసి పోషించేది అమ్మ.ఇక ముద్ద మందారం, రెక్కమందారం, మూడురకాల గుట్ట మల్లెలూ, జాజి,లిల్లీ లకు కొదవ లేదు. చేమంతి , మరువం తొట్లోలో వేసి నిండుగా పూయించేది. బాటకిరు వైపులా కనుల పండువుగా పూల బాలల పరకరింపులే! ఇవికాక దొండ, కాకర, చిక్కుడు పాదులూ, ఉండేవి. ఇల్లంతా పంట లక్ష్మీ కళతో కళాకళలాడుతూ ఉండేది.ఏసీజన్ లో ఆపండ్లు మోసుకుని మాఇంటికి వచ్చేది 3 కి.మీటర్లూ నడుచు కుంటూ ఆయాసంతో రొప్పుకుంటూనూ." అమ్మా!ఎందుకూ ఇంతెండలో వచ్చావ్, గొడుగైనా లేకుండా ? సాయంకాలం తెస్తే సరి పోనుకదా!" అన్నాను. " నువ్వు రాత్రులు భోజనం చేయవుకదా !అందుకనే వేడివేడిగా తింటావని తెచ్చాను." అంది ముఖానికి పట్టిన చెమట తుడు చు కుంటూ. ఏమీ అనలేక ” ఈగొడుగు తీసుకెళ్ళు “ అంటూ చేతిలో గొడుగుఇవ్వబోతే , " నీవు మళ్ళా ఎండలో పడి నడిచి రావాలి కదా!వద్దు లే నీవే వేసుకెళ్ళు, కొంగుకప్పుకుపోతాన్లే, నీవుపద మళ్ళా అన్నం తినేసి రావాలికదా! వస్తా" అంటూ వెనక్కు తిరిగి నడిచి వెళ్ళింది.
నేనూ నడుచు కుంటూ ఒకటిన్నరకిలో మీటర్ల దూరంలో ఉన్న మాఇంటికెళ్ళి, ఆరోజు లంచ్ లోకి కూర లేకుండా వంటచేసిన నాకు, నాకు ఇష్టమైన కాకరకాయ కూర తింటుంటే కళ్ళ నిండుగా నీరువచ్చింది. ఒకపాత సంఘటన గురొచ్చొ మనస్సు పిండేసి నట్లైంది ,ఒకమారు నాన్నగారుపోయాక, అమ్మ కు రావల్సిన పెన్షన్ పేపర్స్ సంతకాలుచేసి పోస్ట్ చేయవలసి వచ్చి, అమ్మ కబురుచేసింది, అప్పటికింకా ల్యాండ్ ఫోన్స్ కూడా రాలేదు."ఈపేపర్స్ తీసుకెళ్ళి పోస్త్ ఎచేయిస్తావా? " అని.అప్పుడు నాకు టెంత్ పరీక్షలు దగ్గరపడి తీరికేలేకుండా ఉన్నాను." నేను చాలా బిజీగ ఔన్నానమ్మ! నీవే ఎలాగో తంటాలుపడు." అని కబురంపాను. పాపం అమ్మ తనే ఎండలో ప్[ఓస్తాఫీస్ కెళ్ళి పనిముగించుకుని వచ్చింది.ఆరోజు సాయంకాలం మా అబ్బాయి తనస్కూల్ షూ పాడైపోయిందనీ కొత్తది కొనమని గొడవచేస్తే , స్కూల్ నుంచీ షాపుకెళ్ళి కొనిచ్చాను. అమ్మపని పక్కకు నెట్టి , బిడ్డపనిమాత్రం చేసిన ఆసంఘటన గుర్తువచ్చి కళ్ళలోనీరు తిరిగింది. నామీద నాకే ఏహ్యం కలిగింది.
అమ్మకు నామీద ఉన్నప్రేమదేనితోనూ వెలకట్టలేనిది.మరో రోజు సాయంకాలం శలవు లవటాన పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. H.Mస్ మీటింగ్ నుంచీ రాగానే మాపిల్లలు " అమ్మా! నీకోసం అమ్మమ్మ ఈ స్వీట్ ప్యాకెట్ ఇచ్చి వెళ్ళింది " అంటూ నాకో ప్యాకెట్ అందించారు. అది సింగ్ స్వీట్ షాపుది.లోపల జిలేబీ, కాజూ బర్ఫీ, పకోడీ ఉన్నాయి. అమ్మ యింటికి 3కిలో మీటర్ల దూరంలోని సింగ్ స్వీట్ షాపుకెళ్ళి కొని , మళ్ళా ఒకటి న్నర కిలో మీటర్ల దూరంలోని మాయింటికి నడిచొచ్చి ఇచ్చి మళ్ళా అంతదూరం నడిచి వెళ్ళింది.
అమ్మప్రేమకు దూరం, కాలం, ఎండ, శ్రమ అడ్దురావు. అమ్మకు నేనేం చేశాను? కనీసం నాన్నగారు పోయాక వెళ్ళికొంత కాలమైనా ఆమెదగ్గర ఉన్నానా ?నా ఇల్లు, నా పిల్లలు , నా ఉద్యోగం అని తపన పడు తున్నానే తప్ప అమ్మకోసం ఏం చేశాను.అనుకుంటూ స్వీట్స్ వైపుచూస్తుంటే " అమ్మా! నీవు టీ తాగాక ఇక రాత్రికి ఏమీ తినవుకదా! అందుకే అమ్మమ్మ’ ఇప్పుడే తిని టీ తాగమని మీ అమ్మకు చెప్పండి , అమ్మతిన్నాకే మీరు తినండి’ , ‘మీరు అన్నీ తినేయకండి, అమ్మ వచ్చాకే ప్యాకెట్ విప్పండి ' అని కూడా అమ్మమ్మ చెప్పి ఇచ్చి వెళ్ళింది, ఏదీ నీవు తిని మాకూ ఇవ్వు , ‘అని. ‘మీ అమ్మకు నీవంటే ఎంత ప్రేమ! “ చిన్న పాపాయ్ ఏదీ నోరుతెరిచి తినమ్మా! " అంటూ పిల్లలు నన్ను ఆట పట్టించి నానోట్లో బర్ఫీముక్క పెట్టి, వారూ తినసాగారు. అమ్మ తన ఇష్టం కన్నా బిడ్డల ఇష్టం గమనిస్తుందని మరోమారు రుజువుచేసింది మా అమ్మ. నేను అమ్మ నైనా అమ్మ నే నింకా చిన్న పిల్లనే అనుకుంటుంది, పిల్లలకు తీసుకోడం తప్పమళ్ళా తిరిగి ఇవ్వడం రాదా! అనే భావనతో, నేను అమ్మకేం చేశాను?’ అనే ఆలోచన మరీ మరీ వేధించసాగింది . ఆలోచిస్తూ కూర్చున్నాను. ఇంతలో మా పిల్ల లు " హేపీ మదర్స్ డే అమ్మా!" అంటూ ఒకపూల బొకే ఒక కార్డ్ ఇచ్చారు. వాళ్ళకు థాంక్స్ చెప్పి"పిల్లలూ! పదండి అందరం వెళ్ళి అమ్మమ్మ కు ‘మరర్స్ డే చెప్పి, గ్రీట్ చేసి వద్దాం." అంటూ బయల్దే రాను.
ఆదూరి .హైమావతి