స్త్రీల వేళ్లకు హంగులు... కాక్ టెయిల్ రింగులు

 స్త్రీల వేళ్లకు హంగులు... కాక్ టెయిల్ రింగులు ఆడవాళ్ల చేతివేళ్లు చూడటానికి చాలా మృదువుగా అందంగా ఉంటాయి. అలాంటి చేతివేళ్లు ఇంకా అందంగా కనిపించాలంటే వాటికి నెయిల్ పాలిష్ వేసుకోవడమో, రింగులు పెట్టుకోవడమో చేస్తాం. ఇంకా కొంచెం మోడ్రన్ గా కనిపించాలంటే... ఇప్పుడు కాక్ టెయిల్ రింగులు దొరుకుతున్నాయి. ఇవి స్టోన్స్ తో ఉండి చాలా అందంగా ఉంటాయి. వివిధ రంగుల్లో, ఆకారాల్లో  దొరుకుతున్నాయి. ఇవి ఆకారంలో పెద్దగా ఉండి కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి.ఈ రింగులు ట్రెడిషనల్ వేర్ గా కంటే పార్టీ వేర్ కి చాలా బాగా నప్పుతాయి. స్టోన్స్ తో పెద్దగా ఉండటం వలన మధ్య వేలుకి ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది. అందరిలో ప్రత్యేకంగా కనిపిస్తారు. ఇవి పూర్వం ఎప్పటినుంచో ఉన్నా ఇప్పుడు మళ్లీ కొత్తగా వివిధ హంగులతో మార్కెట్ లోకి వచ్చాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.  

చక్కనైన ముఖానికి ఐకానిక్ మేకప్ ఇదిగో…

చక్కనైన ముఖానికి ఐకానిక్ మేకప్ ఇదిగో… చక్కనైన ముఖాకృతి అందరు అమ్మాయిలకూ ఒక కల. ఈ కాలంలో ముఖాకృతి అనేది ముఖంలో సరిగా స్పష్టంగా లేకపోయినా దాన్ని మేకప్ సహయంతో తీసుకొస్తున్నారు. అయితే మఖం చక్కని ఆకృతిలో కనిపించడానికి వేసే మేకప్ ను ఫాషన్ పరిభాషలో కాంటూరింగ్ అని అంటారు. కాంటూరింగ్ అందరికీ సాధ్యం కాదు. అందులో ఫెయిల్ అయ్యేవారే ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే ముఖం చక్కని ఆకృతి రావడానికి మేకప్ వేయడంలో దేన్ని ఎంత మోతాదులో తీసుకోవాలి?? ముఖం మీద ఏ ప్రాంతంలో ఎలాంటి షేడ్ వాడాలి?? ఎక్కడ ముఖ చర్మాన్ని సమర్థవంతంగా కవర్ చేయాలి?? వంటి విషయాలు తెలిసి ఉండాలి. ఈ ట్రిక్స్ తెలియకపోతే ఎంత ఖరీదైన మేకప్ సామాగ్రి ఉన్నా అది వ్యర్థమే.  కొందరికి ముక్కు, మరికొందరికి బుగ్గలు, ఇంకొందరికి గడ్డం ఇలా ఒక్కొక్కరికి ఒకో ప్రాంతంలో ముఖం అందాన్ని పాడుచేసేలా ఉంటుంది. అయితే దాన్ని మేకప్ సహాయంతో సవరించడం వల్ల ముఖం మొత్తం చక్కని అకృతిలోకి మారుతుంది. మరీ ముఖ్యంగా బొటాక్స్ లిఫ్ట్ షేప్ అనేది చాలామంది ఫాలో అవుతున్నారు. దీన్ని పొందడానికి చాలామంది ప్రయత్నాలు చేసి విఫలం అవుతున్నారు. మేకప్ వేయడంలో ఎంతో పట్టు ఉంటే తప్ప దాన్ని సరైన క్రమంలో వేయలేరు అని ఎంతో మంది అంటూ ఉంటారు. అయితే ఇలాంటివి సులువు చేయడానికి కొన్ని ట్రిక్స్ ఉంటాయి.  ముఖాన్ని చక్కని ఆకృతిలో తీసుకురావడానికి ట్రేండింగ్ లో ఉన్నది టేప్ ట్రిక్:- టేప్ ముక్కని ముఖం మీద  నిర్ణీత ప్రాంతంలో అతికించి మేకప్ వేయడం ద్వారా చక్కని ఆకృతి తీసుకురాగలుగుతారు. ఇది ఎలా వేయాలంటే… బొటాక్స్ లిఫ్ట్ షేప్ కోసం మొదట టేప్ ను తీసుకోవాలి. ఈ టేప్ ను కుడివైపు చెవి దగ్గర మొదలు పెట్టి దాన్ని క్రాస్ గా తీసుకుని పెదవుల మూలల మీదుగా అంటే టేప్ కాస్త పెదవుల లోపలికి వెళ్ళాలి. ఇలా కొనసాగించి దాన్ని మళ్ళీ ఎడమ చెవి వైపుకు తీసుకెళ్లాలి. ఇలా చేయడం వల్ల టేప్ ఎడమ చెవి నుండి పెదవుల మీదుగా కుడి చెవి వరకు పరచుకుంటుంది. ఇవి రెండు వైపులా ఓకేవిధంగా ఉండేలా చూసుకోవాలి. ఏ వైపు అయినా కాస్త వంకరగా ఉందంటే మేకప్ తరువాత షేప్ కూడా వంకరగా కనిపించే అవకాశం ఉంటుంది.  టేప్ ను సరిగ్గా సెట్ చేసిన తరువాత బుగ్గల మీద  కాంటూర్ క్రీమ్ ను అప్లై చేయాలి.  ఇలా అప్లై చేసేటప్పుడు ఆ క్రీమ్ పొరపాటున కూడా టేప్ కిందుగా వెళ్లకుండా చూసుకోవాలి. కాంటూర్ క్రీమ్ అప్లై చేసుకున్న తరువాత  టేప్ ను మెల్లగా తొలగించాలి. ఇప్పుడు టేప్ తీసివేసి రివర్స్ లో మేకప్ వేయాలి. సాధారణంగా ఉపయోగించే బ్లష్,  పౌడర్, హైలెట్ మొదలైన వాటిని ఉపయోగించవచ్చు.  సీక్రెట్ టిప్:- ఈ కాంటూరింగ్ మేకప్ వేసేటప్పుడు మెఙ్ఖమ్ మీద టేప్ అప్లై చేయడానికి రెండు రకాల టిప్స్ వాడచ్చు. ఒకటి కుడి చెవి నుండి ఎడమ చెవి వరకు నోటి భాగం లోకి టేప్ జోప్పిస్తూ టేప్ అతికించడం. టేప్ నోట్లోకి వెళ్లడం ఇష్టం లేనివారు టేప్ ను చెవి నుండి పెదవి మూలల  వరకు ఒకటి, ఆ తరువాత రెండు భాగం వైపు కూడా అలాగే రెండవ ముక్కను అతికించవచ్చు. ఈ టేప్ జిగురు ఇబ్బంది పెట్టకుండా మాశ్చరైజర్ రాయవచ్చు.                                          ◆నిశ్శబ్ద.

వేసవిని బీట్ చేయాలంటే ఈ లిప్స్టిక్ రంగులు బెస్ట్ ఆప్షన్!

వేసవిని బీట్ చేయాలంటే ఈ లిప్స్టిక్ రంగులు బెస్ట్ ఆప్షన్! సమ్మర్ కాస్తా హమ్మర్ తో మోదుతున్నట్టు ఉంది. ఇటువంటి పరిస్థితిలో ప్రతి ఒక్కరు ఎవరి స్థాయికి తగ్గట్టు వారు తేలికగా, సౌకర్యవంతంగా ఉండే బట్టలు వేసుకోవాడనికి ప్రయత్నం చేస్తారు. చాలామంది సమ్మర్ షాపింగ్ అంటూ కాటన్ దుస్తులు కొనుగోలు చేస్తారు. వేసవికి తగ్గట్టు ఫేస్ వాష్ దగ్గర నుండి ఎన్నెన్నో మార్పులు వస్తాయి. అమ్మయిలలో దుస్తులతో పాటు మేకప్ కూడా సీజన్‌కు అనుగుణంగా మారే ముఖ్యమైన అంశం. ఈ సీజన్‌లో మేకప్ ఎక్కువ కాలం నిలువదు. అందుకే ఛేంజెస్ చేసుకుంటారు. ఈ మేకప్ కిట్ లో ఏదున్నా లేకపోయినా లిప్స్టిక్ మాత్రం కచ్చితంగా వాడతారు అమ్మాయిలు. సింపుల్ గా ఉండాలి అనుకునేవారు కూడా లిప్స్టిక్, కాజల్ తో సరిపెట్టుకుంటారు.  అయితే వేసవి సీజన్లో ఏ కలర్  లిప్స్టిక్ బాగుంటుంది అనే విషయం మీకు తెలుసా?? అమ్మాయిలు అందంగా కనిపించాలి అని, వాతావరణం కు తగ్గట్టు మార్పులు కూడా చేసుకుంటారు. కానీ లిప్స్టిక్ కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకోకపోతే ఎంత బాగా తయారైనా లుక్ మొత్తం పాడైపోతుంది. వేసవిని బీట్ చేయడానికి అద్భుతమైన లిప్స్టిక్ రంగులు ఏవో తెలుసుకుంటే.. పీచ్ కలర్ పీచ్ కలర్ దాదాపు ప్రతి అమ్మాయికి ఇష్టం. ఈ సమ్మర్ సీజన్‌లో ఈ కలర్ లిప్‌స్టిక్‌ను అప్లై చేయడం వల్ల మీ ముఖం వెలిగిపోతుంది. బయటకు వెళ్ళేటప్పుడు ముదురు రంగు దుస్తులు వేసుకునేట్టు అయితే తో పీచ్ కలర్ లిప్స్టిక్ను భలేగా ఉంటుంది. న్యూడ్ కలర్ న్యూడ్ కలర్ ఈ రోజుల్లో ట్రెండ్ లో ఉంది. మెటాలిక్ దుస్తులలో బయటకు వెళ్ళడానికి  సిద్ధంగా ఉంటే, ఖచ్చితంగా న్యూడ్ కలర్ లిప్స్టిక్ ను అప్లై చేయండి.  ఈ రంగు చాలా అందంగా, ఆకర్షణగా ఉంటూ సహజత్వంగా కూడా అనిపిస్తుంది.  బ్రౌన్ కలర్ ఈ కలర్ లిప్ స్టిక్ అన్ని రకాల స్కిన్ టోన్ ఉన్న అమ్మాయిలు అప్లై చేయవచ్చు. అయితే దీన్ని అప్లై చెయ్యడానికి కొందరు ఇష్టపడరు. కానీ సమ్మర్ లో ఇది చాలా బాగుంటుంది. ఎక్కువ సమయం నిలిచి ఉంటుంది.  అందుకే వేసవిలో ఈ రంగు బెస్టు. ప్లం కలర్  ప్లం కలర్ నిజంగా అద్బుతమైనది. ఈ రంగు లిప్స్టిక్ ను విదేశీ దుస్తుల నుండి భారతీయ వస్త్రధారణ వరకు  అన్నిటికీ అనువుగా అట్రాక్షన్ గా ఉంటుంది.  పింక్ షేడ్ కొన్ని లిప్స్టిక్ రంగులు చిన్నవారికి బాగుంటే, మరికొన్ని పెద్దవారికి నప్పుతాయి. అయితే పింక్ షేడ్ లిప్ స్టిక్ అన్ని వయసుల మహిళలు అప్లై చేయవచ్చు. దీన్ని అప్లై చేయడం వల్ల ముఖం గ్లో సాధారణం కంటే ఎక్కువ పెరుగుతుంది. లిప్స్టిక్ అలవాటు ఉన్న వారు ఈ సమ్మర్ ను బీట్ చేయడానికి ఈ రంగులు ఎంచుకుంటే ఎండలో కూడా అదరహో అనిపిస్తారు.                                     ◆నిశ్శబ్ద.

పెళ్లిళ్లు, ఫంక్షన్ల సమయంలో కలిగే ఇబ్బందులకు భలే పరిష్కారాలు!

పెళ్లిళ్లు, ఫంక్షన్ల సమయంలో కలిగే ఇబ్బందులకు భలే పరిష్కారాలు! ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. నిజం చెప్పాలి అంటే పెళ్లిళ్లలో సందడి అంతా ఎక్కువ భాగం అమ్మాయిలదే.. ఈ పెళ్లిళ్ల సీజన్‌లో అమ్మాయిలు దగ్గరి బంధువులు, క్లోజ్ ఫ్రెండ్స్ పెళ్లిళ్లకు తప్పనిసరిగా వెళతారు. ఇక పెళ్లిలో అట్రాక్షన్ గా కనబడటానికి చేయని ప్రయత్నాలు ఉండవు. పెళ్లికూతురుని తలదన్నేలా తయారయ్యే అతివలు ఎందరో.. ఇందుకోసం ముందుగానే దుస్తుల నుండి నెయిల్ పాలిష్ వరకు ప్రతిదీ కొనిపెట్టుకుంటారు. అయితే కొన్నిసార్లు డిజప్పాయింట్ అవ్వాల్సి ఉంటుంది. దుస్తులకున్న జిప్పులు ఇరుక్కుపోవడం,  బట్టలు మీద ఏదైనా పడటం, వేసుకునే చెప్పుల వల్ల అసౌకర్యం ఏర్పడటం జరుగుతాయి. దీనివల్ల మూడ్ మొత్తం ఖరాబ్ అవుతుంది. అయితే కొన్ని టిప్స్ ఉపయోగించడం వల్ల ఈ టెన్సన్స్ ను సులువుగా అధిగమించవచ్చు. దుస్తుల జిప్ లు ఇరుక్కుపోయినప్పుడు.. పెళ్లి సమయంలో చివరిగా డ్రస్సప్ అయ్యేటప్పుడు ఒక్కోసారి దుస్తులకున్న జిప్పులు  ఇరుక్కుపోతుంటాయి. అలాంటి సమయంలో ఒక్కసారిగా కోపం పెరిగిపోతుంది. ఆ కోపంతో జిప్పును పదేపదే గట్టిగా లాగడానికి ప్రయత్నం చేస్తుంటారు. అలా చేస్తే జిప్ ఊడొచ్చే ప్రమాదం ఉంది. ఆ తరువాత ఏమీ చేయలేము. అందుకే అలాంటి సమయాల్లో జిప్ లాగకుండా కొవ్వొత్తి తీసుకుని జిప్ మీద రుద్దాలి. దీనివల్ల జిప్ స్మూత్ గా అవుతుంది. దీంతో జిప్ మూవ్ అవుతుంది.  బట్టలపై నూనె చిమ్మితే..  బట్టలపై నూనె చిమ్మితే వచ్చే సావు అంతా ఇంతా కాదు. జిడ్డు తగిలిన దుస్తులు వేసుకుని తిరగడం చాలా ఇబ్బంది. నూనె పడగానే దాన్ని రబ్ చేసి, సోప్ వేసి వాష్ చేయడానికి ప్రయత్నించకూడదు. నూనె పడగానే దానిమీద టాల్కమ్ పౌడర్ చల్లి పది నిమిషాల పాటు అలాగే ఉంచాలి. పౌడర్ పొడి బట్టల నుండి నూనెను పీల్చుకుంటుంది. ఆరిన తర్వాత దులిపేస్తే పౌడర్ తో పాటు జిడ్డు పోతుంది.  జుట్టు పలుచగా ఉందని బెంగా.. కొంతమందికి జుట్టు మరీ పలుచగా ఉంటుంది. తలమీద పాపిడి,  మాడు ఎత్తినట్టు కనిపిస్తుంటాయి. నిజం చెప్పాలంటే దీన్ని మహిళల్లో బట్టతల సమస్యగా చెప్పొచ్చు.  దీనికోసం మాట్ ఐషాడో బాగా పనిచేస్తుంది. జుట్టుకు దీన్ని అప్లై చేయడం వల్ల . జుట్టు ఒత్తుగా కనబడుతుంది. హైహీల్స్ తో తంటాలా.. హైహీల్స్ అంటే అమ్మయిలకు ఇష్టం. అవి వేసుకుని హొయలు పోతుంటే పెళ్లి వేడుక అంతా హైలైట్ అవుతుంది. కానీ అటు ఇటు బాగా తిరుగుతున్నప్పుడు మడమలు లాగేస్తాయి. ఈ సమస్య నుండి ఉపశమనం పొందడానికి కాలి వేళ్లపై స్ప్రేని చల్లుకోవచ్చు. ఇది చాలా ఉపశమనం కలిగిస్తుంది. పాదాలకు ఎక్కువగా చెమట పట్టినట్లయితే ఇప్పట్లో ఉన్న ఫ్యాషన్ చెప్పులు బోలెడు. వీటిలో పాదాలు కవర్ అయ్యేలా ఉన్నవి ఉంటయై. ఇవి వేసుకున్నప్పుడు వేళ్ళ మధ్య చెమట పడుతుంది. దీనివల్ల చర్మ సంబంధ సమస్యలు ఎదురవుతాయి.   ఇలాంటి చెప్పులుధరించే ముందు కాలి వేళ్లపై పౌడర్‌ను చల్లుకోవాలి. ఇలా చేస్తే సమస్య తొలగిపోతుంది.                                      ◆నిశ్శబ్ద.

పొట్టిగా ఉన్న అమ్మాయిలు డ్రెస్సింగ్ విషయంలో చేసే తప్పులివే!

పొట్టిగా ఉన్న అమ్మాయిలు డ్రెస్సింగ్ విషయంలో చేసే తప్పులివే! ఇప్పటికాలం అమ్మయిలలో పొట్టి వాళ్లకు ఉన్న కష్టాలు మరెవ్వరికీ ఉండవు. ట్రెండీగా, ఫాషన్ గా ఉండాలని అనుకుంటారా?? దుస్తుల దగ్గర నుండి ఎన్నో విషయాలు వారి పొట్టిదనాన్ని మరింత ఎత్తినట్టు చూపిస్తుంటాయి. ఇది అందరికీ జరుగుతుందా అంటే ఉహు లేదు. అవగాహన లేకపోవడం వల్ల కొందరి విషయంలో మాత్రమే ఇలా జరుగుతుంది. పొట్టిగా ఉన్న అమ్మాయిలు హీల్స్ వేసుకుంటే పొడుగ్గా కనిపించవచ్చు అనుకుంటారు. కానీ హీల్స్ వేసుకోవడమే పరిష్కారం కాదు. దుస్తుల సెలక్షన్ లో చేసే పొరపాట్లు గమనించుకోవాలి. పొట్టిగా ఉన్న అమ్మాయిలు పొరపాటున కూడా ఈ కింద చెప్పే విధంగా దుస్తులు ధరించకూడదు. చాలా వదులుగా ఉన్న దుస్తులు నేటి కాలం ఫ్యాషన్ లో భాగం. అయితే ఇలాంటి దుస్తులకు పొట్టిగా ఉన్న అమ్మాయిలు దూరంగా ఉండటమే మంచిది. బాగా వదులుగా ఉన్న దుస్తుల్లో అమ్మాయిలు చిన్న పిల్లల్లా కనబడతారు. స్కర్టులు వేసుకోవడానికి అమ్మాయిలు బాగా ఇష్టపడతారు. కానీ పొట్టిగా ఉన్న అమ్మాయిలు మోకాళ్ళ వరకు ఉన్న స్కర్టులు వేసుకుంటే మరింత పొట్టిగా కనిపిస్తారు. కేవలం ఇవే కాదండోయ్ మోకాలి కంటే కాస్త పొడవునా దుస్తులను ధరించినా ఇదే సమస్య ఎదురవుతుంది.  పొట్టిగా ఉన్న అమ్మాయిలకు ఉన్న మరొక  ముప్పు లోవెయిస్ట్ జీన్స్. ఇలాంటి జీన్స్ వేసుకుంటే  ఎంత పొడవున్నారో కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఈ కారణంగా పొట్టిదనం ఎక్కువగా అప్పియర్ అవుతుంది. కార్గో ప్యాంట్లు కూడా అమ్మాయిల పాలిట శత్రువులనే చెప్పవచ్చు. ఇవి వదులుగా ఉండటం వల్ల పొడవు తక్కువగా కనబడేలా చేస్తాయి.  పొడవుగా కనబడాలనే ఆలోచనతో హై హీల్స్ వేసుకున్నా పైన చెప్పిన దుస్తులను సెలెక్ట్ చేసుకుంటే మాత్రం ఎంత ఎత్తు చెప్పులేసినా పొడవు కనబడకపోగా.. మరింత పొట్టిగా కనిపిస్తారు.                           ◆నిశ్శబ్ద.

హై హీల్స్ తో ఇబ్బందా.. ఇవి తెలుసుకుంటే సమస్య దూరం!

హై హీల్స్ తో ఇబ్బందా.. ఇవి తెలుసుకుంటే సమస్య దూరం! ఫ్యాషన్ ప్రపంచం చాలా పెద్దది. వెతుక్కున్నంత కొత్తదనం అందులో ఉంటుంది. ప్రతి అమ్మాయి హైహీల్స్ ధరించడానికి ఇష్టపడుతుంది. వీటిని ధరించడం వల్ల అమ్మాయిలకు తాము ప్రత్యేకం అనే భావం కలగడమే కాకుండా ఫ్యాషన్‌గా కనిపిస్తారు. అమ్మాయిలు పొడవున్నారా లేదా పొట్టిగా ఉన్నారా అనే  విషయంతో సంబంధం లేకుండా హీల్స్ ధరించడానికి ఇష్టపడతారు.  అయితే ఎంత స్టైలిష్ గా ఉన్న అమ్మాయిలు  అయినా హీల్స్ వేసుకోవడం కచ్చితంగా కష్టమే. బయటకు కనిపించే అందం, ఆనందం లోపల ఉండదు. హీల్స్ ధరించడం వల్ల పాదాలలో నొప్పి వస్తుంది. మరోవైపు, శరీరానికి అనుగుణంగా ఉన్న హీల్స్ ధరించకపోతే, ఈ సమస్య మరింత పెరుగుతుంది. చాలామంది అమ్మయిలకు హీల్స్ వేసుకున్నప్పుడు నొప్పి ఎందుకు వస్తుందంటే.. రోజూ హీల్స్ వేసుకోకపోవటం వల్ల హైహీల్స్ వేసుకోవడం అలవాటు చేసుకోకపోవటం చాలామందిలో కనిపిస్తుంది. అంటే ప్రత్యేక సందర్భాల్లో, పార్టీలకు వెళ్ళాల్సినప్పుడు మాత్రమే హీల్స్. వేసుకుంటూ ఉంటారు. ఇలాంటి అలవాటు ఉన్నవారు  హైహీల్స్ ధరించడం వల్ల, పాదాలు నొప్పి పుడతాయి. పాదాలు  సాగదీసినట్టుగా అనిపిస్తాయి. దీని కారణంగా అమ్మాయిలు అప్పుడప్పుడు హై హీల్స్ వేసుకున్నప్పుడు  చాలా అసౌకర్యంగా ఫీలవుతారు.  మరికొందరు హైహీల్స్ ధరించడానికి దూరంగా ఉంటారు. ఇలా కాకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ పాటించాలిమ్ అప్పుడు హీల్స్ వేసుకోవడం ఎంతో ఈజీ.. హీల్స్  కొనుగోలు చేసేటప్పుడు మడమల పరిమాణాన్ని గుర్తుంచుకోండి హీల్స్ కొనుగోలు చేసేటప్పుడు దాని పరిమాణాన్ని గుర్తుంచుకోండి. హీల్స్ వదులుగా ఉంటే.. కాలు మళ్లీ మళ్లీ తిరగడం ప్రారంభమవుతుంది. మరోవైపు, మడమలు గట్టిగా ఉంటే, అసౌకర్యానికి గురవుతారు. కాబట్టి కాలి మడమలకు సరిగ్గా సరిపోయేలా హీల్స్ ఉండాలి. మడమ ప్రాంతాల్లో మెత్తగా ఉండే హీల్స్ కొనుగోలుచేయాలి.  ముందుగానే ప్రాక్టీస్ బెస్ట్.. ఏదైనా ఈవెంట్ కు వెళ్లాలని అనుకున్నప్పుడు ఈవెంట్‌కు ముందే  హీల్స్ ధరించడం, నడవడం ప్రాక్టీస్ చేయాలి. దీనివల్ల ఈవెంట్ సమయానికి బాగా నడవడం అలవాటు అయిపోతుంది.  అలాగే హీల్స్ వేసుకున్నప్పుడు పాదాలలో నొప్పి ఉంటే, ఖచ్చితంగా ఫుట్ వ్యాయామాలు చేయాలి. బ్లాక్ హీల్స్‌తో మొదలు... ఇప్పటి వరకు ఎప్పుడూ హీల్స్ ధరించకపోతే, ముందుగా బ్లాక్ హీల్స్ ప్రయత్నించాలి. ఇవి పూర్తిగా బ్యాలెన్స్ ఇవ్వడానికి సపోర్ట్ అవుతాయి.  మొదటిసారి పెన్సిల్ హీల్స్ ధరించకూడదు. పంప్ హీల్స్ ప్రయత్నించవచ్చు. పెన్సిల్ హీల్స్ ధరించకూడదనుకుంటే, పంప్ హీల్స్ ధరించడంతో ప్రారంభించడం మంచిది. . 2-3 అంగుళాల పొడవైన హీల్స్ కంటే పొడవైనవి మొదట్లోనే ఉపయోగించద్దు.   ఇవి పాటిస్తే.. హీల్స్ వేసుకున్నప్పుడు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. మీరూ చక్కగా మోడల్ లాగా వాక్ చేయొచ్చు.                                        ◆నిశ్శబ్ద.

మేకప్ బ్రష్ వాడే ప్రతి ఒక్కరూ ఈ విషయం తెలుసుకోవాలి!

మేకప్ బ్రష్ వాడే ప్రతి ఒక్కరూ ఈ విషయం తెలుసుకోవాలి! ఇప్పటికాలం అమ్మాయిలకు మేకప్ సర్వసాధారణం అయిపోయింది. బయటకు వెళ్లాలంటే కచ్చితంగా మేకప్ వేసుకునే వెళ్ళాలి. ఒకప్పటిలా కాసింత పౌడర్ చేతుల్లో వేసుకుని ముఖానికి రుద్దుకుని వెళ్లే కాలం కాదిది. మేకప్ యుగంలో మేకప్ వేసుకోవాడనికి చాలా మేకప్  ప్రొడక్ట్స్, మేకప్ బ్రష్ లు వాడుతూ ఉంటారు.  అయితే ప్రొడక్ట్స్ కొనుగోలు చేయడం, వాటిని వాడటం ఒక ఎత్తు అయితే మేకప్ బ్రష్ లను శుభ్రపరచం  మరొక ఎత్తు. మేకప్  బ్రష్ లను కనీసం వారానికి ఒకసారి శుభ్రపరుస్తూ ఉండాలట. లేకపోతే యాక్… చీ.. అంటున్నారు. ఇంతకూ అసహ్యించుకోవలసినంత దారుణం అందులో ఏముంది తెలుసుకుంటే..  ముఖానికి మేకప్ వేసుకునే అమ్మాయిలు వాటిని ఎన్ని సార్లు ఎప్పుడు శుభ్రం చేస్తారో వారికే ఎరుక. మేకప్ వేసుకుని తరువాత అలా వదిలేస్తే.. ఆ బ్రష్ లలో దారుణమైన క్రిములు చేరిపోతాయట. పరిశోధనల ప్రకారం టాయిలెట్ సీట్ లో ఉన్నంత దారుణమైన బాక్టీరియా మేకప్ బ్రషులో కూడా ఉంటుందని, వాటిని రోజుల తరబడి శుభ్రం చేయకుండా వదిలేస్తే అంతకంటే ఎక్కువ దారుణంగానే ఉంటాయని తెలిసింది. మేకప్ బ్రష్ గురించి పరిశోధనలు చేసినవారు మేకప్ బ్రష్ శుభ్రం చేయకపోతే.. ఎన్నోరోజుల పాటు శుభ్రం చేయకుండా వదిలేసిన టాయిలెట్ సీట్ అంత దారుణంగా ఉంటుందట. ఈ మేకప్ బ్రష్ ల ద్వారా బాక్టీరియా, మృతచర్మం తాలూకూ కణాలు, బ్రష్ లో పేరుకుపోయిన నూనెలు మేకప్ తో పాటు ముఖాన్ని ఆవరించి చాలా తొందరగా ముఖాన్ని పాడుచేస్తాయని తెలిసింది. చాలామంది అమ్మాయిలకు ముఖం మీది చర్మం ఇన్ఫెక్షన్లు, మొటిమలు, దద్దుర్లు వంటివి రావడం వెనుక ఈ మేకప్ బ్రష్లు శుభ్రంగా లేకపోవడం కూడా ఒక కారణం అని అంటున్నారు. ఈ సమస్య నుండి దూరంగా ఉండాలంటే.. వారానికి ఒకసారి తప్పకుండా మేకప్ బ్రష్ లు శుభ్రం చేసుకోవాలి.  కాబట్టి మేకప్ వేసుకునే మగువలు మేకప్ సెలక్షన్, బ్రష్ ల సెలక్షన్, మేకప్ తొలగించడం వీటి గురించి మాత్రమే కాదు. కాస్త ఆ బ్రష్ గురించి కూడా పట్టించుకుంటూ ఉండాలి.                                   ◆నిశ్శబ్ద.

జీన్స్ తో పోటీ పడుతున్న ధోతీ

  జీన్స్ తో పోటీ పడుతున్న ధోతీ  రోజులు ఏలా మారుతున్నాయో దానికి తగ్గట్టు ఫ్యాషన్ పోకడలు కూడా రోజురోజుకూ మారిపోతున్నాయి. నిన్న చూసిన మోడల్ ఈ రోజు ఉండదు.. ఈరోజు చూసిన మోడల్ రేపు ఉంటుందన్న గ్యారెంటీ లేదు. ఈ ఫ్యాషన్ రంగంలో రోజుకో రకం వస్తూనే ఉంటుంది. ముఖ్యంగా డ్రెస్సింగ్.. యూత్ ని ఆకట్టుకోవడానికి ఎన్నో రకాల మోడల్స్ వస్తున్నాయి. ఇప్పటి వరకూ జీన్స్ ప్యాంట్ల్లు వాటిలోనే వేరే మోడల్స్ వచ్చాయి.. అయితే ఇప్పుడు వాటికి చెక్ పెట్టి వాటితో పోటీపడే ధోతి ప్యాంట్లు వచ్చేశాయి. రకరకాల డిజైన్లలో ఈ ధోతి ప్యాంట్లు మార్కెట్ల్ హడావుడి చేస్తున్నాయి. సెలబ్రిటీల దగ్గర నుండి కాలేజ్ గాళ్స్ వరకూ వీటికి అందరూ ఇష్టపడుతున్నారు. మీరూ ఒకసారి ట్రైచేయండి.. ఫ్యాషన్ పోకడను అనుసరించండి..    

What to Wear with Jeans

What to Wear with Jeans   How to Wear Jeans, Wear with Jeans, Fashion Jeans How with Wear: Dressing up jeans to create a smart casual look can be created quickly and easily with basics and accessories. Keeping the whole look simple and sleek ups the ante of jeans Try one of the following: * Crisp white button-down shirt. A classic shirt is a staple in every woman's closet, fitted with room to move and shape through the waist. A black shirt is more casual for this look. * A fitted white tee and cardigan. A take on the classic twinset, the tee adds a modern feel to the combination and provides a great blank canvas for adding punches of colour with cardigans and accessories. A dark cardigan (think navy, bottle green, chocolate, deep red) is a smarter colour, while lighter ones (pale blues and pinks, soft greens and muted shades) are on the more casual end. * A fitted white tee and a blazer. There are so many fabulous blazers available for all budgets and sizes. Black is always an easy classic, while navy pinstripe, darker colours and luxurious fabrics are sophisticated options. Velvet, corduroy, tweed, preppy knits, satin or even leather can make dark wash jeans smart. Weekend * Sheer chiffon, silk, or tissue-thin cotton tops, either sleeveless or elbow length, in a v-neck or pussy-bow tie instantly up the smartness factor of a pair of jeans. Layer with black or nude camis for a refined take. If this look seems to dressy, adding a vest or blazer over the top can take the look down a few notches. * A trench coat in cooler weather teamed with jeans is an outfit in itself. Quick and simple, this combination can go from grocery shopping to doing the school-run to the movies. * Wearing a heel elevates the status of jeans from straight casual to smart casual. Leave the sky-high stilettos at home and choose a classic one- to two-inch pump in a dark colour for a long-legged look. Black is always a simple staple and lets the rest of the outfit shine. Work Out * Peep-toes are a go-to option when dressing up jeans. A hint of foot is sexy - keep the feet in mint condition with a pedicure and a coat of polish. T-straps, embellished D'Orsays, sleek platforms and boots are great options. * When wearing flats for a smart casual look, keep the hem of the jeans just above the ground and covering the foot. Closed-in shoes (like ballet flats) are more sophisticated for this look than a pair of sandals or flip flops/thongs. * With this look, a bold accessory looks great. Chunky cocktail rings, beaded necklaces or statement earrings pull the look together. * Remember the rule of thumb - either a necklace or earrings, a ring or bangle. * Layering multiple necklaces in similar lengths and styles is fashion-forward and shows discreet personality * A mid-sized bag complements the outfit, and a handheld tote or slouchy hobo is casual, but when added to classic separates, the look becomes smart casual. An oversized bag or evening clutch would look out of place. Evening Out

Kids Dresses in Cute Birdie Prints

  Kids Dresses in Cute Birdie Prints     Spring Summer fashion and Birds are the trend of the season. In bright colors and birdie prints, kids dresses make a statement that is fresh everytime they are worn. Be it a birthday party to attend or for a playdate, these cheerful prints are attractive....buy one such dress for your little girl and ask us when people dont compliment! You can look for a flock of birds or just one big bird printed or knitted on the dress, paired up with a matching skirt or leggings, or even a single piece frock. You may find these prints mostly on cotton fabrics as birds are symbolic to cool and breezy looks in hot weather.     If you are looking for these bird patterns in muticolors printed on a plain tshirt or dress then there are tons of options in the market, sametime, released this year are the black and white, contrast color looks too in just double-color theme. Mommy can pair it up with a birdie print blouse for her single contrst color saree and Daddy gets similar looking shirts and tshirts of his size too. These prints come for baby dresses also, with cute bibs and matching socks.     The Owl prints are in this year again...gone are the days when Owls were considered not so lucky...fashion has changed it all. Owls have been trendy in kids clothing range. Even home decor has gotten inspired with Owl patterns. Cute little owls to the naughty ones appear on baby dresses and boys tshirts. One for the collection and another for the album...all for the memories, make these bird patterns yours and your kids' this summer.   ..Prathyusha

Brasso sarees make you feel like a princess

  Brasso sarees collection   Brasso sarees are sure to make you stand apart in any crowd. Over the last decade brasso sarees have gained immense popularity throughout the country. A perfect saree is unique in design and is destined to make the wearer feel herself like a princess. The fall and drape of Barsso sarees is such that it flatters women of any figure. Here are a beautiful collection of Brasso sarees, have a look.    Watchet Blue Brasso Saree - Brasso Sarees Code : GC1613A Description Watchet blue brasso georgette saree with blouse. Saree is stylized with resham and patch work. The design and work of the saree is making saree look beautiful. Matching blouse is available with this.   Light Yellow Brasso Saree with Blouse - Brasso Sarees Code : GC316 Description Look sensational with this light yellow brasso saree. It is delicately adorned with sequins, resham and patch work. Net pallu is enhancing the beauty of the saree. Rich embroidered patch around the border is showing its exclusivity. Paired with a matching blouse that completes the look.   Melanic Black Brasso Saree - Brasso Sarees Code: GC1607A Desription : Melanic black brasso saree with blouse. Saree is stylized with sequins, resham and patch work. The design and work of the saree is making saree look beautiful. Matching blouse is available with this.   Refined Brasso Saree with Blouse - Brasso Sarees Code:OSS426 Description  Refined brasso and jacquard saree with blouse. Color - Sea Green. Work - Sequins. Pallu and Border. Embroidery - Antique Embroidery. Paired with a matching blouse piece.   ink Brasso Saree with Blouse - Brasso Sarees Code: YDW515 Description Pink and grey brasso saree is outrageous. This saree is embellished with Resham, stone and sequins work.     Pink Brasso Saree with Blouse - Brasso Sarees  code: GC308 Description    Create a stunning impact with this princess pink and green brasso saree. It is intricately embellished with sequins, resham and patch work. Rich embroidered patch around the border is showing its exclusivity. Paired with a matching blouse that completes the look.    

2023లో అదిరిపోయే జ్యువెలరీ ఇదే…

2023లో అదిరిపోయే జ్యువెలరీ ఇదే… న్యూ ఇయర్ వచ్చేసింది.. వారం రోజులు అలా దొర్లుకుంటూ వెళ్లిపోయాయి. కొత్తదనంలో ఉన్న కిక్కును మెల్లిగా పాతబరుస్తూ కాలం వెక్కిరిస్తుంది. కానీ కాలం వెక్కిరిస్తుంటే అలా చూస్తూ ఊరుకుండిపోతామా?? మరీ ముఖ్యంగా ఫాషన్ కు అడ్డాగా నిలిచే అమ్మాయిలు ఊరుకుంటే ఫ్యాషన్ ప్రపంచం చిన్నబోదూ… కొత్త సంవత్సరానికి కొత్తగా  ఫ్యాషన్ ను జోడించాలి. అప్పుడూ.. ఇప్పుడూ.. ఎప్పుడూ.. తగ్గేది లేదనట్టు ఉండాలి ఫ్యాషన్ ప్రపంచంలో ఆడవారి హవా.. మరి కొత్త సంవత్సరంలో ఫాషన్ ను ఎలా స్టార్ట్ చేస్తారు?? ఇదిగో ఇలా… కఫ్ బ్రాస్లెట్!! కొన్ని ఫ్యాషన్ లు కాలం మారినంత తొందరగా పాతబడవు. వాటిలో ఈ కఫ్ బ్రాస్లెట్ కూడా ఒకటి. బంగారం, వెండి, ఇతర రాళ్లు పొదిగిన దగ్గర నుండి వివిధ రకాల డిజైన్ల వరకు ఈ కఫ్ బ్రాస్లెట్లు చాలా అద్భుతంగా ఉంటాయి. ప్రస్తుతం ట్రెండ్ లో ఉన్న బ్రాస్లెట్లు ఇవే… వీటిని షర్ట్, టీ షర్ట్ వంటి ఫ్యాషన్ దుస్తుల నుండి గౌన్ లు, స్కర్ట్ లు వంటి దుస్తుల వరకు ప్రతిదానికి సెట్ అవుతాయి. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఏ సమయంలో అయినా సాధారణ ఔటింగ్ కి అయినా పార్టీస్ కు అయినా నప్పుతాయి. కాబట్టి వీటికి మీ ఫ్యాషన్ లో చోటిస్తే మిమ్మల్ని రెడ్ కార్పెట్ మీద దర్జాగా నడిపిస్తాయివి. లింక్ చైన్స్.. భారతీయులకు మెడలో ధరించే గొలుసులకు ఉన్న అటాచ్మెంట్ ఈనాటిది కాదు. అయితే కాలంతో పాటు ఈ గొలుసుల డైజైన్లు కూడా మారిపోతూ వస్తుంటాయి. ప్రస్తుతం 2023లో హాట్ హాట్ ఫ్యాషన్ గా నిలిచే చైన్స్ లో లింక్డ్ చైన్స్ చాలా ప్రముఖమైనవి. ఇవి కేవలం చైన్స్ లా మాత్రమే కాకుండా బ్రాస్లెట్ తో కలిపి జతగా వస్తాయి. పెద్ద పరిమాణంలో ఉన్న ఈ చైన్స్ ను చిన్న చిన్న వాటితో అటాచ్ గా లింక్ చేయడం వాటిని ధరించినప్పుడు ఒకదాని తరువాత ఒకటి స్టెప్ బై స్టెప్ కనిపిస్తూ కనువిందు చేయడం భలేగా ఉంటుంది. కొత్తగా అట్రాక్ట్ అవ్వాలంటే ఈ లింక్డ్ చైన్స్ మీ ఖాతాలో ఉండాల్సిందే.. ముత్యాల మెరుపులు.. వజ్రం ఎప్పటికీ నిలిచి ఉంటుంది అనేది ఒక జ్యువెలరీ సంస్థ యాడ్. వజ్రం గురించి ఏమో కానీ ముత్యాలు మాత్రం ఎప్పటికీ నిలిచి ఉంటాయి. ఎన్ని తరాలు మారినా కూడా ముత్యానికి ఉన్న ప్రాధాన్యత, వాటికి ఉన్న ప్రత్యేకత తగ్గదు. మహిళలు తమ నగల జాబితాలో బంగారం, వెండి వంటి నగలకు ఎంత చోటు ఇచ్చినా ముత్యం పేరు వింటే బంగారం, వెండిని పక్కన పెట్టి మరీ ముత్యానికి ఓటేస్తారు. ముఖ్యంగా బంగారం, వెండి లోకి ముత్యాలు ఎంతో పొందిగ్గా ఒదిగిపోతాయి. పెద్దగా ఉన్న చెవి పోగులలో ముత్యాలు పొదిగినవి స్పెషల్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉంటాయి. అందుకే ముత్యాలు ఎవర్గ్రీన్ అనుకోవచ్చు. ఓల్డ్ ఈజ్ గోల్డ్.. 2022-2023 సంవత్సరంలో గడిచిన ఫ్యాషన్ ను ఒకసారి గమనిస్తే 80-90 మధ్య కాలంలో ఫ్యాషన్ ను రి క్రియేట్ చేసారని బాగా అర్థమవుతుంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే మాటను నిజం చేస్తూ పాతతరం ఆభరణాలకు ఫ్యాషన్ నిపుణులు  కొత్త మెరుగులు దిద్దారు. వాటి కోవలోనే మెడలో ధరించే ఆభరణాలను తలమీద ధరించడం, కడియం టైప్ గాజులు ధరించడం, చంకీలు ఇంకా చోకర్ శైలి ఆభరణాలు ట్రెండ్ గా మారాయి. 2023 లో కూడా ఇదే హవా కొనసాగుతుందని ఫ్యాషన్ నిపుణులు చెబుతున్నారు.  భలే ఇయర్ బటన్స్… ఒకప్పుడు మన పెద్దవాళ్ళు ముఖాన రూపాయి కాసంత బొట్టు పెట్టి, ముక్కులో ఓ.. మోస్తరు ముక్కు పుడక, చెవులకు రాళ్లు పొదిగిన బటన్ కమ్మలు పెట్టుకునేవారు. అయితే అప్పుడు వారిని చాదస్తం అన్నవాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడో.. నాటి కాలంవారి ట్రెండ్ నయా రూపం దాల్చింది. కేవలం నవరత్నాలతో సరిపెట్టకుండా ఎన్నో రకాల రాళ్లను కొత్తకొత్తగా ఇయర్ బటన్స్ తో జతచేస్తున్నారు. సెలెబ్రిటీస్ సైతం మంచి చీరకట్టు, హెయిర్ బన్ వేసి ఈ తరహా ఇయర్ బటన్స్ పెట్టి ఎక్కడ లేని హుందాతనాన్ని ఫ్యాషన్ లో మేళవిస్తున్నారు.  ఇలా పాత ఫ్యాషన్ మొత్తం కొత్తదనంతో కొత్త సంవత్సరంలో  కొత్తగా మెరుస్తుంది. మిమ్మల్ని కూడా మెరిపిస్తుంది.                                       ◆నిశ్శబ్ద.

Tulle looks for Baby Portraits

  Tulle looks for Baby Portraits     Baby portraits are the cutest photographs one could display at home or on any wall ! Dressing up babies for a portrait picture is a tough job but not a long task to achieve...which color or what material is the question, if the answer is found then the actual job is short, just one piece of a dress..similar to their cute little size ! As we spoke about Crochet dresses in our earlier article, today its the Tulle's turn ! Netted materials flaunt a fairy kinda look and give a photograph a cute appeal..and the baby looks the cutest in it too...usually the pastel shades look good but the brightest of the colors dont spoil it either. Specially, Easter occasional portraits canbe the best shot in Tulle looks.     A simple little skirt can make it stand out. Tulle materials are available at most fabric or craft stores, in India and America too. Just buy a metre fabric and sew into a skirt with a soft elastic band or a satin ribbon to tie around, your desired look is so easy. What background the photographer arranges is not your headache, just find out which color fabric suits the baby the best in the portrait and you get the dress ready and one or two accesories for a little girl...boys dont need even those. All this homework and these looks concern is for girls..i wonder how Tulle can be used for a little Boy's portrait atall !     The more you spend, the softer the material. Some come in shimmery looks and self prints or embroidery designs. You can even think of Tulle skirts and Lehengas for her First Birthday...it gives such a Grand Princess kinda look...coordinate it with a Tulle Bow head band and you are done..your picture album is a perfect one !! Tulle can even decorate a Child's Nursery room as a Window Half curtain or a Crib skirt. Just give your creativity some sharpness and tell Tulle to work its majic !! ...Prathyusha

స్టైలిష్ ఇండియన్ డ్రెసెస్

  స్టైలిష్ ఇండియన్ డ్రెసెస్ ఫాషన్ ప్రపంచం రోజురోజుకూ విస్తరిస్తోంది. కొత్త కొత్త డిజైన్లు, వింత వింత ఫాషన్లు వస్తున్నాయి. వాటిల్లో బోల్డంత రమ్యత్వం, కావలసినంత దివ్యత్వం. ఎన్నో వెరైటీస్, ఎన్నెన్నో కలర్ కాంబినేషన్స్! గాగ్రా, చుడీదార్ లాంటి ఇండియన్ డ్రెసెస్ ఇండియన్ కల్చర్ ను చాటుతూనే ఫాషన్ ప్రపంచంలో స్థానం సంపాదించుకున్నాయి. ఈ విస్తారమైన ఫాషన్ కాన్వాస్ మీద ఇండియన్ వేర్ తనదైన ముద్ర వేసుకుంది. గాగ్రా, చుడీదార్ లాంటి ఇండియన్ డ్రెసెస్ మరింత స్టైలిష్ గా రూపొందుతున్నాయి. ఇది అతిశయోక్తి కాదు. వెయ్యి రకాల వెస్ట్రన్ వేర్ పక్కన ఇండియన్ డ్రెస్ స్పష్టంగా తెలిసిపోతుంది. స్ట్రైకింగ్ గా నిలబడుతుంది. అందంగా కనిపిస్తుంది. ఆకర్షణీయంగా మురిపిస్తుంది. గాగ్రా, చుడీదార్ లాంటి ఇండియన్ వేర్ ఎలిగేంట్ గా ఉంటాయని మనవాళ్ళే కాకుండా ఫారినర్లూ అంటున్నారు. గ్లామరస్ డ్రెస్ కు డెఫినిషన్ చెప్తాయి. స్టయిలిష్ గా ఉంటూనే డీసెంట్ గా ఉంటాయి. గ్రేట్ లుక్ తో గ్రేస్పుల్ గా ఉంటాయి. సర్ ప్రైజింగా, షాకింగా, ప్రెటీగా ఉంటాయి. రిచ్ గా, రాయల్ గా కనిపిస్తూ మనసులు దోచుకుంటాయి. గాగ్రా, చుడీదార్ లాంటి ఇండియన్ డ్రెసెస్ చూపులకు అందంగా ఉండటమే కాదు, సుఖంగా ఉంటాయి. సౌఖ్యం కలిగిస్తాయి. డ్రెస్ స్టయిలిష్ గా ఉన్నప్పటికీ కంఫర్టబుల్ గా లేకపోతే ధరించడం ఇబ్బందే కదా! డిజైన్లో నవ్యత కనిపిస్తుంది. వింత శోభతో మెరుస్తాయి. ఇలా అందమైన, అద్వితీయమైన ఫాషన్ వేర్ రూపొందించడంలో ఫాషన్ డిజైనర్ల పనితనం, క్రాఫ్టు అర్ధమౌతాయి. మన కల్చర్ ను ప్రతిఫలిస్తూనే, వైడ్ కాన్వాస్ పై ఒక ప్రత్యేక ముద్ర వేయడం అంటే మాటలు కాదు కదా!

జంప్ సూట్స్ కి జంప్ అవుతారా?

జంప్ సూట్స్ కి జంప్ అవుతారా? పై నుండి కింద దాకా ఒకే రకమైన డిజైన్ తో ఒకే క్లాత్ తో తయారయ్యే వస్త్రాలను జంప్ సూట్స్ అని అంటారు. ఈ జంప్ సూట్స్ ప్రస్తుతం ఉన్న మహిళల ఫ్యాషన్ ప్రపంచంలో తమదైన హవా సాగిస్తున్నాయి. పెద్ద పెద్ద సెలెబ్రిటీస్ జంప్ సూట్స్ తో దర్శనమిస్తూ జోష్ కనబరుస్తున్నారు. స్లీవ్ లెస్, ఫుల్ స్లీవ్, హాఫ్ స్లీవ్ తో అందుబాటులో ఉండే ఈ జుంపింగ్ సూట్ లు సాధారణ సమయాల్లో కంటే వింటర్ లో భలే బాగుంటాయి.  ఏంటి వీటి ప్రత్యేకత అంటే.. సుధారణంగా మహిళలు ధరించే టాప్, ప్యాంట్ వేరు వేరుగా ఉంటాయి. అయితే ఈ జంప్ సూట్ లో ఇవి రెండూ కలిపి ఉంటాయి. దీనివల్ల ఈ దుస్తులు శరీరం మొత్తాన్ని కవర్ చేసినట్టు అనిపిస్తుంది.  సెలెబ్రిటీస్ అయితే ఈ జంప్ సూట్ లను విభిన్న రకాలు ధరించి హొయలు పోతుంటారు. అయితే ఈ జంప్ సూట్స్ మొదటి నుండి ఫ్యాషన్ లో భాగం కాదట. ఈ మాట వినగానే అందరికీ ఆశ్చర్యం వేస్తుంది. కానీ అంతకంటే ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే…. ఈ జంప్ సూట్స్ మొట్టమొదట పారచుట్ వినియోగించేవారు ధరించే దుస్తుల్లో భాగమట. ఆ తరువాత వీటిని మంచు ప్రాంతాల్లో ట్రెక్కింగ్ కోసం, చలిని భరించడానికి తగినట్టుగా రూపొందించారట.  స్పోర్ట్స్ లోనూ, సాహసకృత్యాలలోనూ వీటిని ధరించడం భాగంగా ఉండేది. ఆ తరువాత 2002 సంవత్సరం నుండి ఈ జంప్ సూట్స్ ను ఫ్యాషన్ లో భాగంగా తీసుకురావడం మొదలుపెట్టారు. మరీ ముఖ్యంగా అమ్మాయిలకు ఇవి చాలా బాగా సెట్ అయిపోయాయి. ప్రస్తుత కాలంలో అన్ని రకాలుగానూ అన్ని ఫాబ్రిక్ తోనూ ఈ జంప్ సూట్స్ కనువిందు చేస్తున్నాయి.  ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు అప్పుడెప్పుడో పుట్టిన ఈ రకపు వస్త్రాధారణ ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతోందనే చెప్పాలి. ఫ్యాషన్ నిపుణులు వీటిని మలుస్తున్న తీరు అమ్మాయిలకు వెర్రెక్కిస్తుంటాయి. అటు ఫ్యాషన్ గానూ, ఇటు చలికి శరీరాన్ని రక్షిస్తూనూ ఒకేసారి రెండు ప్రయోజనాలు చేకూర్చడం వీటిలో ఉన్న ప్రత్యేకత. ఫ్యాషన్ లో ఓలలాడే వనితలు ఈ జంప్ సూట్స్ ను తమ వార్డ్ రోబ్ లో కనీసం ఒక్కటైనా ఉంచుకోవాలి. లేకపోతే ఫ్యాషన్ కు కాస్త అర్థం తగ్గినట్టే…                                    ◆నిశ్శబ్ద.

ఈ చీరలతో పెట్టుకుంటే ఫ్యాషన్ షేక్ అయిపోద్ది!

ఈ చీరలతో పెట్టుకుంటే ఫ్యాషన్ షేక్ అయిపోద్ది! ఫ్యాషన్ కి కేరాఫ్ అడ్రస్ అమ్మాయిలే. ముఖానికి పెట్టుకునే బొట్టు బిళ్ళ నుండి వేసుకునే చెప్పుల వరకు దేంట్లోనూ తగ్గం అనేలా ఉంటాయి మహిళల ఫ్యాషన్ తీరూ తెన్నులు. అయితే ఈ ఫ్యాషన్ లో కూడా దుస్తులకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. అదిరేటి డ్రెస్సు మెవేస్తే.. బెదిరేటి లుక్కు మీరిస్తే దడ ఆ మీకూ… దడ… అనే పాటే గుర్తొస్తుంది మహిళల ఫ్యాషన్ చూసినప్పుడు. అయితే ఈ దుస్తులలో కూడా మహిళలకు ఎన్ని రకాలు వచ్చినా చీర కట్టులో ఉన్నంత అందం, హుందాతనం మరెందులోనూ ఉండదు అంటే నమ్మండి.  అయితే చీరకట్టు పాత టేస్టు అవన్నీ ఎలాగబ్బా?? వంటి ఫీలింగ్ లో ఉన్నవాళ్లు ఒకటి తెలుసుకోవాలి. మన తెలుగువైపు మాత్రమే కాదు బాలీవుడ్ లో అదిరిపోయే అందాల భామలు అయిన దీపికా పదుకొనె నుండి కియారా అద్వానీ వరకు ఎంతోమంది చీరకట్టును ఎంచుకుని వహ్వా అనిపిస్తున్నారు. బోలెడు రకాల డిజైన్లలో అందరినీ ఉక్కిరిబిక్కిరి చేసే చీరల్లో ఆరు అద్భుతమైన శారీస్ మీకోసం… ఈ చీరకట్టులు సాంప్రదాయంగానూ.. ఫాషన్ తోనూ జతకలిసి భలే అనిపిస్తాయ్.  రఫ్లడ్ శారీ… ఈ రకమైన చీర సన్నని మడతలు కలిగి కాస్త రఫ్ గా కనిపిస్తుంది. కొద్దిపాటి మందం కూడా కలిగి ఉంటుంది. ఫాబ్రిక్ విషయంలో ఇది మందంగా, మృదువుగా ఉన్నా దీనికి ఉన్న చిన్న మడతల వల్ల రఫ్ గా అనిపిస్తుంది. పింక్ కలర్ నుండి లావెండర్ వరకు లేత రంగులు ఈ చీరలకు అద్భుతమైన లుక్ ఇస్తాయి. ఈ చలికాలంలో జరిగే పార్టీలు, ఫంక్షన్ లకు ఈ చీరలు మంచి ఫ్యాషన్ లుక్ ఇవ్వడంతో పాటు వెచ్చదనాన్ని కూడా ఇస్తాయి. బెల్ట్ శారీస్.. బెల్ట్ శారీస్ ఇప్పట్లో చెప్పలేనంత ఫ్యాషన్. సాధారణ చీరలు తగినట్టుగా మంచి బెల్ట్ ఎంపిక చేసి వాటిని శారీ లుక్ కు జతచేస్తే బెల్ట్ శారీ రెడి అయినట్టే. క్లాసిక్ లుక్ ఇచ్చే ఈ బెల్ట్ శారీ ఫ్యాషన్ వీక్స్ నుండి పార్టీ ల వరకు పర్ఫెక్ట్ గా సరిపోతుంది. పైపెచ్చు ఈ డ్రెస్సింగ్ స్టయిల్ లో వెళితే అందరినీ డామినేషన్ చేసేట్టు ఉంటుంది. అట్రాక్ట్ చేస్తుంది. మిర్రర్ వర్క్ శారీస్.. మిర్రర్ వర్క్ అనేది కేవలం ఒక ఫాబ్రిక్ కు మాత్రమే సెట్ అయ్యే అంశం కాదు. కాటన్ నుండి, షిఫాన్, సిల్క్ వంటి ఫాబ్రిక్ లకు కూడా బెస్ట్ గా నప్పుతుంది. పైగా ఈ మిర్రర్ వర్క్ కోసం ఉపయోగించే దారాలు కూడా గోల్డ్, సిల్వర్ ఇతర రంగులతో చాలా ఆకర్షణగా ఉంటాయి. ట్రెడిషల్ నుండి పార్టీస్ వరకు ప్రతి ఈవెంట్ లో అట్రాక్షన్ గా ఈ రకమైన డిజైన్ కలిగిన శారీస్ ఆకర్షణగా నిలుస్తాయి. చూపు తిప్పుకొనివ్వని చీరల మెరుపులతో పాయింట్ ఆఫ్ అట్రాక్షన్ గా మీరు నిలవడం ఖాయం. సీక్వెన్ శారీస్.. ఈ రకమైన శారీస్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తాయని చెప్పడంలో సందేహమే లేదు. కాకపోతే వీటిని ధరించినప్పుడు వీటికి జతగా ధరించే జ్యువెలరీ, మేకప్ మొదలైనవి దీని అట్రాక్షన్ ను పెంచేలా వేసుకుంటే దీనికి మించినది ఇంకేది ఉండదు. అదే నప్పని జ్యువెలరీ, మేకప్ వేసుకుంటే మాత్రం దీనికి ఉన్న లుక్ మొత్తం పాడు చేసి పడేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటే క్వీన్ తరహా లుక్ సొంతం చేసుకోవచ్చు. కేప్ శారీస్ ట్రెడిషనల్ శారీస్ కి కూడా ఫ్యాషన్ లుక్ ఇవ్వడం కేప్ డిజైన్లకు ఉన్న ప్రత్యేకత. ఇవి చీరలకు మెరుపును తీసుకొస్తాయ్. దీని వల్ల చీరలు ఎంతో ఆకర్షణగా కనబడతాయి.  ఈ చీరలకు తగ్గట్టు బ్లౌజ్ డిజైన్ చేయించుకుంటే అదిరిపోయే లుక్ సొంతమవుతుంది.  చికంకారి శారీస్.. సాధారణ శారీస్ ను కూడా స్పెషల్ గా చూపెట్టడం ఈ చికంకారి వర్క్ ప్రత్యేకత. దీనికోసం ఉపయోగించే డిజైన్లు  చాలా విలక్షణంగా ఉంటాయి. తెలుపు నుండి నలుపు వరకు పాస్టెల్ కలర్ నుండి విభిన్న రంగుల వరకు ఇవి విభిన్నతను కలిగి ఉంటాయి. వీటికి ఉపయోగించే ఎంబ్రాయిండరి టెక్నిక్ షాడో డిజైన్ అని పిలవబడుతుంది. ఇది చాలా సున్నితంగా ఉంటుంది. జార్జిట్, షిఫాన్, కాటన్ సహా ఇంకా చాలా ఫాబ్రిక్ మీద ఈ రకమైన చీరలు అద్భుతమైన లుక్ సంతరించుకుంటాయి.  ఇవండీ అదిరిపోయే ఆరు రకాల చీరలు. ఇవన్నీ మార్కెట్ లలో లభ్యమయ్యేవే.. మీకు కాసింత ఫ్యాషన్ మీద అవగాహన ఉంటే రంగులు, బ్లౌజ్ ల డిజైన్ లలో వైవిధ్యం చూపిస్తే ఇంకా ఎక్కువ అట్రాక్షన్ తీసుకురావచ్చు. చీరకట్టులో కూడా సూపర్ అనిపించేలా రెడి అవ్వడమొక్కటే మీ వంతు ఇక..                                       ◆నిశ్శబ్ద.

గాజుంగరం.. పేరు విన్నారా..?

గాజుంగరం.. పేరు విన్నారా..?   సాధారణంగా మగవారి కంటే ఆడవారికే ఎక్కువ ఫ్యాషన్ ఐటమ్స్ కావాలి. చెవి రింగులు, ముక్కు పుడకలు, చేతికి గాజులు, కాళ్లకు పట్టీలు.. ఇలా అన్నీ పెట్టుకోవాల్సిందే. అయితే ఇప్పుడు ముంజేతిని మాత్రం అలా ఖాళీగా ఎందుకు వదిలేయాలి అనుకున్నారేమో కాని.. మన డిజైనర్లు వాటికి కూడా ఆభరణాలు కనిపెట్టేశారు. వాటినే మార్కెట్లో పామ్ బ్రేస్ లెట్ల పేరుతో అమ్ముతున్నారు. అయితే ఈ పామ్ బ్రేస్ లెట్లు జారిపోకుండా కూడా చాలా తెలివిగా వేళ్లను చుట్టుకుని ఉండేలా మరో కొత్త మోడల్ ని తీసుకొచ్చారు. దీంతో ఒకే దెబ్బకి రెండు పిట్టలు అన్న టైప్ లో అటు పామ్ తో పాటు.. వేలికి ఉంగరాలు పెట్టుకునే పని కూడా ఉండదు. మంచి పార్టీలకు వెళ్లినప్పుడు ఇవి పెట్టుకుంటే చాలా స్టైలిష్ గా ఉంటాయి. మీరూ ఒకసారి ట్రై చేయండి..  

లేటెస్ట్ ఫ్యాషన్ - రంగ్ రేజ్ డిజైన్స్

లేటెస్ట్ ఫ్యాషన్ - రంగ్ రేజ్ డిజైన్స్ ఈ రోజుల్లో ఏం చేసినా ఫ్యాషనే. రోజుకో కొత్త ఫ్యాషన్ వస్తుంటే ఏది సెలెక్ట్ చేసుకోవాలో కూడా తెలియట్లేదు. అన్ని రకాల ఫ్యాషన్ ఐటమ్స్ లో, భారతీయ హస్తకళలు ఉట్టిపడేలా హ్యాండ్ పెయింటెడ్ జీన్స్ ఇంకా టీ షర్ట్స్ మార్కెట్ లో సంచలనం సృష్టిస్తున్నాయని తెలిస్తే ఆశ్చర్యంగా ఉంది కదూ. చేతితో వేసే ఏ పెయింట్ అయినా అందంగానే ఉంటుంది. అదే పెయింట్ ని మనం వేసుకునే బట్టల మీద చూసుకుంటే ఇంకా ఇంకా బాగుంటుంది. హస్తకళల సౌందర్యం కళ్ళకు కట్టినట్టు చూపిస్తూ మార్కెట్ లో బోలెడన్ని డిజైన్స్ తో హాట్ కేక్స్ లా అమ్ముడుపోతున్నాయి ఈ రంగ్ రేజ్ జీన్స్ అండ్ టీ షర్ట్స్.        చేతితో వేసిన కథాకళి ముఖం ఉన్న ఈ టీ షర్ట్స్ కాలేజీ కి వెళ్ళే అమ్మాయిలకి చాల బాగా నప్పుతాయి. ఎప్పుడు మాములు టీ షర్ట్స్ వేసుకుని వెళుతూ ఒక్కోసారి ఈ రకం హ్యాండ్ ప్రింట్ వి వేసుకుంటే చాలా చేంజ్ కనిపిస్తుంది.   వైట్ కలర్ ప్లెయిన్ టీ షర్టు మీద పురి విప్పిన నెమలిని ఎంతో అందంగా చిత్రీకరించారు. సాయంత్రాలప్పుడు బయటకి వేసుకెళ్ళటానికి బాగుంటుంది. ఎప్పుడూ వేసుకునే బట్టల కన్నా కాస్త వెరైటీగా కనిపిస్తుంది. ఆరంజ్ కలర్ టీ షర్ట్ మీద కలశం నెత్తి మీద పెట్టుకున్న అమ్మాయి పెయింటింగ్ మనకి నిర్మలా పెయింటింగ్స్ ని గుర్తుచేస్తుంది. చూడటానికి ముదురు రంగులతో నిండి ఉన్న ఈ చిత్రం చూపరులని కూడా ఎంతగానో ఆకర్షిస్తోంది. నటరాజు నాట్యమాడుతున్నడా అని అనిపించేలా ఉన్న ఈ టీ షర్ట్ చాలా సింపుల్ అండ్ స్వీట్ గా కనిపిస్తుంది. అందరిలో మనం కొంచం ఎట్రాక్టివ్ గా కనపడాలంటే ఇలాంటిది  ఎన్నుకోవాల్సిందే.   జీన్స్ లో కూడా వెరైటీ డిజైన్స్ యువతను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఎప్పుడూ ప్లెయిన్ గా కనపడే జీన్స్ మీద కూడా రకరకాల పెయింటింగ్స్ ఉండడంతో ఇవి ఫాషన్ కి మారుపేరుగా మారుతున్నాయి. నెమలిపింఛమ్ పెయింటింగ్ ఉన్న జీన్స్ ఎక్కువగా సేల్ అవుతోందని ఒక టాక్.   రొటీన్ కి భిన్నంగా కనిపించే ఇలాంటి పెయింటింగ్స్ చేసిన జీన్స్ ని ఎవరు కోరుకోకుండా ఉంటారు. అందుకే ఇవి మార్కెట్లో తమ సత్తాని చాటుతున్నాయి.  కేవలం అమ్మాయిలకి మాత్రమే కాదు అబ్బాయిలకి కూడా ఎన్నో రకాల డిజైన్స్ తో మార్కెట్ లోకి వస్తున్నాయి ఈ రంగ్ రేజ్ కలెక్షన్స్. వయోలిన్ పెయింటింగ్, శివుడు ధ్యానం చేస్తున్నటుగా ఉన్న పెయింటింగ్, రకరకాల ఆకారాల్లో ఉన్న కట్టడాలు చిత్రించిన టీ షర్ట్స్ ఇంకా ఎన్నోరకాల సరికొత్త తరహా కలెక్షన్స్ ఉన్నాయి. మరి మీరు కూడా ట్రెండ్ కి తగ్గట్టు మీ స్టైల్ ని మార్చాలనుకుంటే ఇలాంటి లేటెస్ట్ కలెక్షన్స్ వైపు ఒక చూపు వెయ్యాల్సిందే.  - కళ్యాణి