Hemant Trivedi Collection

ఇండియన్ ఫ్యాషన్ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న వారిలో హేమంత్ త్రివేది ఒకరు. ఈయన ఫ్యాషన్ స్టైలిస్ట్, ఫ్యాషన్ షో కొరియోగ్రాఫర్, ప్రొఫెసర్. ఆస్ట్రేలియా, న్యూయార్క్ లాంటి దేశాల్లో తమ చదువు పూర్తి చేసిన హేమంత్ త్రివేది తన కరియర్ కి మాత్రం ఇండియానే ఎంచుకున్నారు. దాదాపు ఇరవై ఏళ్లుగా S.N.D.T. యూనివర్సిటీ లో ప్రొఫెసర్ గా తమ విలువైన సేవలందిస్తున్న హేమంత్ త్రివేది దానితో పాటు ప్రముఖ శీతల్ గ్రూప్ లో డిజైన్ డైరెక్టర్ గా చేస్తున్నారు. హేమంత్ డిజైన్స్ ఆయన కెరియర్ కే కాదు , అప్పుడప్పుడే మాడలింగ్ రంగంలో పుంజుకుంటున్న ఎందరో మాడల్స్ కి ఎసెట్ అయ్యాయి. 1995, 1998, 2000 లో వరసగా మిస్ వరల్డ్ గా ఎన్నికైన ఐశ్వర్యా రాయ్ , డయానా హేడెన్, ప్రియాంక చోప్రా లే దానికి ఉదాహరణ. ప్రపంచ ప్రఖ్యాతి గడిస్తూ ఇండియన్ ఫ్యాషన్ ఇండస్ట్రీ కే తలమానికంగా ఉన్న ఈ ఇండియన్ ఫ్యాషన్ డిజైనర్ నిజంగా ఇండియన్ ఫ్యాషన్ ఇండస్ట్రీ గర్వించదగ్గ విషయం. త్రివేది డిజైన్ ప్రదర్శనలు ఇండియాలోనే కాదు, U.K, U.S, చైనా, ఈజిప్ట్, మారిషస్, శ్రీలంక, U.A.E. దాదాపు సౌత్ ఈస్ట్ దేశాల్లో తన కీర్తిని చాటుకున్నాడు .  

Fashion always changes..!

  ఫ్యాషన్ మారుతూనే ఉంటుంది... ఫ్యాషన్ అనేది స్థిరంగా ఉండదు. మారుతూనే ఉంటుంది. దీనిమీద ఒక జోక్ కూడా ఉంది. రోమ్ లో ఒకావిడ లేటేస్ట్ ఫ్యాషన్ దుస్తులు తీసుకుని, అక్కడే ట్రయల్ రూం లో వేసుకుంది. బిల్లు చెల్లించిన వెంటనే పరుగుకు లంకించుకుంది. మధ్యలో ఒక స్నేహితురాలు ఎదురై "ఎదైనా ఘోరం జరిగిందా, ఎందుకు పరిగెడుతున్నావు?" అని అడిగింది. "అవును, ఘోరాలే జరుగుతున్నాయి. ఈ నిమిషం ఉన్న ఫ్యాషన్ రెండో నిమిషానికి మారిపోతోంది. అందుకే ఈ దుస్తులు అవుట్ డేటెడ్ కాకముందే కొందరైనా చూడాలని పరుగు తీస్తున్నా" అని చెప్పిందట. నిజంగా ఫ్యాషన్స్ చాలా త్వరగా మారిపోతున్నాయి. కొన్నాళ్ళు పొట్టి చేతులు ఫ్యాషన్. ఇంకొన్నాళ్ళు పొడవు చేతులు ఫ్యాషన్. మరి కొన్నాళ్ళు మోచేతులదాకా ఫ్యాషన్. కొన్నాళ్ళు రిస్టువాచీ దాకా చేతులుంటే ఫ్యాషన్. ఇంకొన్నాళ్ళు మెగా స్లీవ్స్., మరికొన్నాళ్ళు స్లీవ్ లెస్ .. మెడలూ అంతే- రౌండ్ నెక్, వీ నెక్, స్క్వేర్ నెక్, బోట్ నెక్, లో నెక్, హై నెక్.. ఇలా ఎన్ని రకాల నెక్కులో! ప్రతిదీ మారుతుంటుంది. పాతనీళ్ళు పోతుంటాయి, కొత్తనీళ్ళు వచ్చి చేరుతుంటాయి. ఒకసారి టాప్, బాటమ్ కు మాచ్ అయితే ఫ్యాషన్. ఇంకోసారి కాంట్రాస్ట్ గా ఉంటే ఫ్యాషన్. జీన్సులో ఎన్ని ఫ్యాషన్లు లేవు? రంగులు, డిజైన్ల సంగతి అలా ఉంచి వెలిసిపోయి, పాతబడినట్లు ఉండే ఫేడేడ్ జీన్స్, కాలిపోయినట్టు మసిబారినవి, చిరుగులతో ఉండేవి -ఇలా ఎన్ని రకాలో! పాంటుల్లో బెల్ టైపు, న్యారో టైపు, పారలల్సు, డిజైన్ ఉన్నవి, లేకుండా ప్లైయినువి ఇలా పలు రకాలు. కనుక ఫ్యాషన్ చేంజెస్ కు తగ్గట్టు మన దుస్తులను డిజైన్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు ఫ్యాషనబుల్ గా, అధునాతనంగా కనిపిస్తాం.  

Make it special..!

  ఎప్పటికప్పడు స్పెషల్ గా... ఆడపిల్లలు సహజంగా అందానికి, అలంకారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. స్పెషల్ అపియరెన్స్ తో కనిపించాలని కలలు కంటారు. ఆ కలలను నిజం చేసుకునేందుకు కృషి చేస్తారు. అందంగా, ఫ్యాషనబుల్ గా ఉండేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తుంటారు. డ్రెస్ కాన్షస్ బాగా పెరిగింది. కాలేజ్, లేదా ఆఫీసుకి ఏ డ్రెస్ వేసుకోవాలి అని ఆలోచించడం పరిపాటి. ఎవరికి వారు తాము ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటున్నారు. అలాంటి స్పెషల్ అపియరెన్స్ కోసం తపిస్తూ, అందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక పెళ్ళిళ్ళు, పేరంటాల్లాంటి ప్రత్యేక సందర్భాలు వస్తే చెప్పనవసరం లేదు. గంటల తరబడి ఆలోచిస్తారు. పూర్వం పండుగలు, పబ్బాలకు మాత్రమే కొత్త బట్టలు కొనుక్కునేవాళ్ళం. ఇప్పుడలా కాదు. ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడే, పరుగున వెళ్ళి కోనేసుకోవడం. చేతిలో నాలుగు రూపాయలు గలగలలాడితే, చలో షాపింగ్. ఇంట్లో పిల్లి పిల్లల్ని పెట్టిందా, కొత్త బట్టలు కొనుక్కోడానికో సాకు దొరికినట్టే. కుక్క పిల్లను ఇంటికి తెచ్చుకుని వారం రోజులయిందా, కొత్త డ్రెస్ కొనుక్కుని సెలెబ్రేట్ చేసుకోవాల్సిందే. కనుక ఇప్పుడు కొత్త బట్టలు కొనుక్కోడానికి పెద్ద అకేషన్లేం ఉండనక్కర్లా. ఎప్పటికప్పడు స్పెషల్ గా ఉండడమే సిసలైన ఎయిమ్. పూర్వం ఫంక్షన్స్ లో బర్త్ డే బేబీ లేదా పెళ్ళికూతురు మాత్రమే మెరిసిపోయేవాళ్ళు. ఇప్పుడలా కాదు, అసలు వ్యక్తితో పాటు ఆ పార్టీకి వచ్చినవాళ్ళు కూడా చమకాయిస్తున్నారు. అదీ సంగతి. ఎప్పుడో ఓరోజు తళుక్కున మెరవడం కాదు, ప్రతిరోజూ తళతళలాడాలి, తళుకులీనాలి అనుకుంటున్నారు చిన్నాపెద్దా అందరూ.

Indian Fashion Designers

  అమెరికాకు తీసిపోని ఇండియన్ ఫాషన్ డిజైనర్స్ ఈ తరం పిల్లల్ని, పెద్దల్ని ఆకట్టుకుంటున్నవి డిజైనర్ వేర్. ఈమధ్యకాలంలో డ్రెస్ కాన్షస్ బాగా పెరిగింది. మనది పేద దేశమే అయినా అనేకమంది డిజైనర్ వేర్ పట్ల మొగ్గు చూపుతున్నారు. వాటికి అలవాటు పడుతున్నారు. డిజైనర్ దుస్తులు అందంగా, కంఫర్టబుల్ గా ఉంటాయని చెప్తున్నారు. తమ వార్డ్ రోబ్ ను డిజైనర్ వేర్ తో అలంకరిస్తున్నారు. పార్టీలకు, ఫంక్షన్లకే కాకుండా కాజువల్ వేర్ గా కూడా డిజైనర్ క్లోత్స్ వాడుతున్నారు. ఇంతకీ డిజైనర్ వేర్ అంటే ఏమిటి? ఏదో మామూలు టైలర్స్ కత్తిరించి కుట్టినవి కాకుండా ఒక ఫాషన్ డిజైనర్ సరికొత్త తరహాలో ఆలోచించి, రూపొందించినవి. ఫాషనబుల్ గా, క్రియేటివ్ గా, ఎట్రాక్టీవ్ గా, ఎక్స్ట్రార్డినరీగా ఉండే డిజైనర్ క్లోత్స్ చాలా ఎక్స్ పెన్సీవ్ అని తెలుసు కదా. అయినా వీటిని కొంటున్నారు, ఆనందిస్తున్నారు. మన దేశం ఎందులోనూ తీసిపోదని మధురా గార్మెంట్స్, అరవింద్ మిల్స్, ఆదిత్య బిర్లా లాంటి టెక్స్టైల్ కంపెనీలు చాటిచెప్తున్నాయి. పోటీపడి ఎప్పటికప్పుడు వినూత్నంగా ఆకర్షణీయమైన దుస్తులను రూపొందిస్తున్నాయి. ఇతర దేశాలకూ ఎగుమతి చేస్తున్నాయి. హేమంత్ త్రివేది, మనీష్ మల్హోత్రా, రోహిత్ గాంధీ అండ్ రాహుల్ ఖన్నా లాంటి ఫాషన్ డిజైనర్స్ ప్రపంచ ప్రసిద్ధి పొందారు.

Hyderabad Fashion Week 2011

             Hyderabad Fashion Week - 2011            ఫ్యాషన్ వీక్ అనేది వారం రోజుల పాటు ఫ్యాషన్ డిజైనర్స్ తమ  ప్రతిభను    ప్రదర్శించుకోవడానికి  ఒక  మహత్తరమైన వేదిక .              అలాంటి వేదికే హైదరాబాద్ లోని మారియట్ హోటల్ లో జరిగింది. నిదా మహ్మూద్,   షాయ్నా N.C.,  మీరా , ముజాఫర్ అలీ , సోనియా పున్వాని తదితర డిజైనర్లు తమ ప్రదర్శనతో  అలరించారు .                  హైదరాబాద్ మహానగరం మరోసారి ఫ్యాషన్ వెలుగుల్లో మునిగి తేలింది . రెండవ  రోజు  షో అనుకున్న సమయానికి కాస్త ఆలస్యంగా మొదలైనందుకు  కాస్తంత  నిరుత్సాహ పడినా , ప్రఖ్యాత డిజైనర్ల ప్రదర్శనలతో వెలుగు నింపుకుంది . వీటికి తోడు  కామ్నా జేఠ్మలాని , సంజన లాంటి ప్రముఖ నటీమణులు ర్యాంప్ పై క్యాట్ వాక్ చేసి ఫ్యాషన్ షో లో కొత్త ఉత్సహాన్ని నింపారు.                              ఇదిలా ఉంటే నిదా మహ్మూద్ ప్రదర్శించిన డిజైన్లు ఆకర్షణగా నిలిచాయి . హిందీ సినిమాలకు సంబంధించిన కలెక్షన్లు , గబ్బర్ హ్యాండి క్రాఫ్ట్ స్,  షోలే బ్లౌజేస్ , సల్వార్ కమీజ్, 1970 – 80 మధ్య కాలంలో వచ్చిన హిందీ సినిమాలతో  ఇన్స్ పైర్డ్ అయి తయారు చేసిన కలెక్షన్స్ హై లెట్ అయ్యాయి .           హైదరాబాద్ ఫ్యాషన్ షో 2011 మరిన్ని ఫోటోల కోసం ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. http://www.teluguone.com/tmdb/galleries/Hyderabad-Fashion-Week-11th-May-en-709.html