వెరైటీ సాక్స్ ల లుక్కే వేరు

వెరైటీ సాక్స్ ల లుక్కే వేరు సాక్స్ లంటే స్కూల్ పిల్లలు వేసుకునే వన్న అభిప్రాయం ఎప్పుడో పోయింది. షూస్ తోనే కాదు చెప్పులతో కూడా ఇవి ఎప్పుడో జతకట్టాయి. చిన్న పిల్లల నుంచి టీనేజ్ అమ్మాయిలు, అమ్మలు, చివరికి బామ్మలు కూడా ఈ సాక్స్ వేసుకోవటానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే వారి వారి అవసరాలకి, ఫాషన్ కి తగ్గట్ట్టు వాటిని రూపొందిస్తున్నారు కాబట్టి... కేవలం రంగు రంగులే కాదు పువ్వులు, పక్షులు, జంతువులు, ఫన్ని మెస్సేజులు తో ఎన్నో రకాల సాక్స్ లు... మార్కెట్ లో దొరుకుతున్నాయి. 1. అలాగే టో సాక్స్ లని, ఏ వేలికా వేలు విడివిడిగా కదిలించేందుకు వీలుగా రూపొందించారు. ఇవి కాలేజీ అమ్మాయిలకి ఎంతో నచ్చే వెరైటీ. 2. రిఫ్లేక్సాలజి సాక్స్ ల గురించి విన్నారా ?...ఇవి వేసుకుంటే మసాజ్ చేసుకోవటం సులువు.  మడమలో ఒకో ప్రాంతం శరీరంలోని ఒకో భాగానికి ప్రతీకలుగా నిలుస్తుంది. ఆ ప్రాంతాలని సులువుగా గుర్తించేందుకు ఈ సాక్సులు ఉపయోగ పడతాయి. 3. అందంగా కనిపించే లేస్ తో చేసిన సాక్స్ లు, వేసే డ్రెస్ బట్టి డిజిటల్ ప్రింట్స్ తో ఆకర్షణీయం గా కనిపించే ఎన్నో రకాల సాక్స్ లుని ఇప్పుడు అమ్మాయిలు ఇష్టపడుతున్నారు. 4. ఇప్పుడు లేటెస్ట్ గా మెసేజ్ సాక్స్ లు దొరుకుతున్నాయి. వీటి ద్వారా డిఫరెంట్ లుక్ తో పాటు మెసేజ్ కూడా ఇచ్చినట్టుంటుంది. మరి మీరు కూడా ఓపిగ్గా షాపింగ్ చేసి ఈ వెరైటీ సాక్స్ లని కోనేయండి... -రమ

మారండి సరికొత్తగా

 మారండి సరికొత్తగా సరికొత్తగా కనిపించాలంటే ఒకోసారి చిన్న చిన్న మార్పులు చేస్తే సరిపోతుంది. రెగ్యులర్ గా ఉండే డ్రస్ పేట్రన్ ని మార్చటం, వాడే హ్యాండ్ బ్యాగ్ నుంచి యాక్ససరీస్ వరకు అన్నిటిని అప్పటి వరకు వాడే వాటికి భిన్నంగా ఉండేలా సెలక్ట్ చేసుకుంటే 'వావ్' అనే పొగడ్త పొందడం కష్టమే కాదు. గ్రూమింగ్ ఎక్స్ పర్ట్స్ ఈ విషయంలో చేస్తున్న కొన్ని సూచనలు మీ కోసం 1. మీరు టీవి సీరియల్స్ చూస్తారా? అయితే ఒక విషయాన్ని గమనించే ఉంటారు. సంవత్సరాలపాటు నడిచే డైలీ సీరియల్స్ లో మీకు బాగా నచ్చిన హీరోయిన్, ఇతర లేడీ క్యారక్టర్స్ కొన్నాళ్లు పోయేసరికి వాళ్లు వాడుకునే బట్టలు నుంచి నగలు దాకా అన్నిటిలో భారీ మార్పుని చూపిస్తారు. అంటే అప్పటిదాకా చీర కట్టుకుని తల మీద ముసుగేసుకున్న హీరోయిన్ డ్రస్సులు వేయడం మొదలు పెడుతుంది. భారీ నగల స్థానంలో సన్నటి చైన్లు వేస్తుంది. ఇలా జనాలకి ఆ క్యారక్టర్ బోర్ కొట్టకుండా ఉండటానికి ఆ మార్పు తెస్తారు. మనం మరీ అంతగా కాకపోయినా ఎంతో కొంత చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా అప్పటిదాకా ఉన్న ఇమేజ్ ని నెమ్మదిగా మార్చుకోవచ్చు. 2. ఇప్పటిదాకా అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ ని వాడుంటారు. ఈసారి ఒకే రకమైన ఫ్యాబ్రిక్ ని సెలక్ట్ చేసుకోండి. అందులోనే చుడీదార్స్, చీరలు డ్రస్ టాప్స్ వంటివి ఎంచుకోండి. ఉదాహరణకి కంప్లీట్ హ్యాండ్లూమ్స్ తో వాడ్ రోబ్ ని నింపండి. అదీ బోర్ కొట్టకుండా ఉండేలా కాస్త ఓపిక చేసుకొని షాపింగ్ చేయండి. రకరకాల డిజైన్లు, కలర్స్ ని ఎంచుకుంటే సరికొత్తగా కనిపిస్తారు. 3. హై హీల్స్ అలవాటా? ఈసారి ఫ్లొరల్ డిజైన్స్ చెప్పల్స్ కొనండి. అన్ని డ్రస్సులకి మ్యాచయ్యే ఓ నాలుగు కలర్స్ కొనండి లేదా హాఫ్ షూస్ లో కూడా ఫ్లోరల్ డిజైన్స్ వస్తున్నాయి. అవి సెలక్ట్ చేసుకోండి. 4. హ్యాండ్ బ్యాగులలో కూడా ఇప్పుడు బోల్టన్ని వెరైటీలు వాటిలో మీకు సూట్ అయ్యే, నచ్చే పేట్రన్ బ్యాగును సెలక్ట్ చేసుకోండి. ఫంకీ కలర్స్ బ్యాగులు సరికొత్త లుక్ ఇస్తాయి. 5. మల్టీ కలర్డ్ బీడ్స్ తో గొలుసులు, నియాన్ కలర్ వాచులు, కాక్ టెయిల్ రింగ్స్ కలర్ ఫుల్ బెల్ట్స్ ఇలా అన్నిటిలో సరికొత్త ట్రెండ్ ని సృష్టించేలా ఉండాలి మీ సెలక్షన్, కలక్షన్. అందుకు కావలసిందల్లా కాస్త ఓపిక అంతే.. అన్నీ ఒక్కచోట దొరకవు, ఒక్కసారే దొరకవు. కాబట్టి ఓపిగ్గా షాపింగ్ చేసి సరికొత్తగా మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకోండి. - రమ

కార్వింగ్ స్టోన్స్ తో స్పెషల్ లుక్

కార్వింగ్ స్టోన్స్ తో స్పెషల్ లుక్ సహజంగా ఫుడ్ ఐటమ్స్ అందంగా కనిపించడానికి మనం కార్వింగ్ చేస్తాం. మరి మనం అందంగా కనిపించాలంటే... సాధారణంగా ఆడవాళ్లు చెప్పులు, గాజులు, చెవిరింగులు వంటి వాటిపైన ఆసక్తి చూపిస్తారు. కానీ మెడలో వేసుకొనే వాటిపైన ఎక్కువ దృష్టి పెట్టరు. రోజూ ఒకే మోడల్ చైన్ వేసుకుంటే ఏం బావుంటుంది. అప్పడప్పుడు ఫ్యాషన్ కు తగట్టు మారుస్తూ ఉండాలి. అలా ఫ్యాషన్ గా ఉండే చైన్స్ లో కార్వింగ్ స్టోన్ డిజైన్ చైన్స్ మార్కెట్లో దొరుకుతున్నాయి. ఇవి చాలా ఫ్యాషనబుల్ గా ఉంటాయి. రకరకాల ఆకారాలలో రంగు రాళ్లతో చెక్కే ఈ డిజైన్స్ జీన్స్, డ్రస్ ల పైకే కాదు చీరల పైన కూడా వేసుకోవచ్చు. మోడ్రన్ గా ఉండే కాలేజ్ స్టూడెంట్స్ కి అయితే బాగా నప్పుతాయి. నలుగురిలో ప్రత్యేకంగా కనపడతారు. అయితే మీరు కూడా అలా కనిపించాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి. -పావని గాదం

ఫ్లవర్ జీన్స్... కూల్ కూల్..

  ఫ్లవర్ జీన్స్... కూల్ కూల్..   జీన్స్ అమ్మాయిల ఆల్ టైం ఫేవరేట్... సీజన్ ఏది అయినా జీన్స్ మాత్రం వేయాల్సిందే. మరి ఈ సమ్మర్ సీజన్లో ఎలాంటి జీన్స్ వేస్తే ఫ్యాషనబుల్‌గా వుంటారు అంటే... ఫ్లోరల్ డిజైన్స్‌కే మా ఓటు అంటున్నారు అమ్మాయిలు. జీన్ ప్యాంటు పువ్వులద్దుకుని చాలా కాలం అయినా, ఇప్పుడిప్పుడే విరివిగా అందరూ వాడటం మొదలుపెట్టారు. అమ్మాయిలకి, పువ్వులకి అనుబంధంఎక్కువ. కాబట్టి నచ్చిన పూల డిజైన్‌తో ఓ జీన్స్ కొని ట్రై చేయండి. ట్రెండీగా వుంటారు... అలాగే సమ్మర్ వేడికి.. పువ్వుల చల్లదనాన్ని అందించిన వారు అవుతారు. లైట్ కలర్స్‌లో ఎక్కువగా దొరుకుతాయి. పెద్ద ప్రింట్స్ కూడా చక్కగా వుంటాయి. కాస్త ఎత్తు తక్కువ వున్న వాళ్ళు చిన్న ప్రింట్స్ తీసుకుంటే బావుంటుంది. పొడవుగా వున్నవాళ్ళు పెద్ద ప్రింట్స్ వేసుకున్నా బావుంటుంది. ఇదిగో మీకోసం కొన్ని డిజైన్లు ఇక్కడ ఇస్తున్నాం... షాపింగ్ మొదలుపెట్టండి ఇక. -రమ

ఈకలతో ఈకాలం ఫ్యాషన్

  ఈకలతో ఈకాలం ఫ్యాషన్ అమ్మాయిల అందం పెంచడంలో చెవి రింగులకు ప్రాధాన్యత చాలా ఉంటుంది. అలాంటి చెవి రింగులు రోజూ ఒకటే తరహావి పెట్టుకుంటే ఏం బావుటుంది. అప్పుడప్పుడు కొత్తవి కూడా ట్రై చేస్తూ ఉండాలి. ప్రస్తుతం ఉన్న ఫ్యాషన్ కు తగ్గట్టు మన చెవి రింగులు ఎంపికచేసుకోవాలి. అలాంటి మోడల్స్ లో ఒకటే ఈ ఫెదర్ ఇయర్ రింగ్స్. మోడ్రన్ గా కనిపించడానికి ఇవి చాలా ఉపయోగపడతాయి. పక్షి ఈకలతో తయారుచేసే ఈ ఫెదర్ ఇయర్ రింగ్స్ ఇప్పుడు మార్కెట్లో చాలా రకాలు దొరుకుతున్నాయి. ఇవి మోడ్రన్ దుస్తుల మీదకి అయితే బాగా నప్పుతాయి. మామూలు చుడీదార్స్ మీదకి కూడా బావుంటాయి. కానీ... చుడీదార్స్ మీదకి ఈ రింగులు కొంచం జాగ్రత్తగా ఎంపికచేసుకోవాలి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మోడ్రన్ గా కనిపించండి...

Beat The Heat In Style

    Beat The Heat In Style!   The weather is catching up on heat very quickly and you need some tips to prevent the heat from bothering you? There’s not much you can do about the weather but you can change your attire to stay cool. Let me use the bottom to top approach to help you decide on your summer look. Not many of us pay attention to the trouble our feet undergo during the summer months. Did you know that your feet swell up a little during the summer season? If you were unaware of this fact then you have been troubling your feet a lot, all these years. Your regular footwear makes your swollen feet very uncomfortable. You may be unaware of it immediately, but soon you will start experiencing discomfort. So what can be done for the poor swollen feet? The trick is to buy a pair of shoes/sandals of a slightly larger size than your regular preference. This will give your feet the much needed comfort in summer. Natural leather and known to expand so make a wise choice when you go shopping. Coming to your cloths, the fabric is what you need to choose correctly. I’m sure you know what not to wear, but do you know what to wear? If you are confused about that, let me clear your confusion with suggestions of simple dressing styles. You would be thinking that cotton will be my first suggestion. Let me improve your knowledge about fabrics. It is said that Linen will be a better choice over cotton in the summer months. Why? Simply because it is cooling. But, everything comes with a side effect. Linen is a fabric that requires frequent cleaning when you sweat into it. If you don’t mind that, then enjoy your summer with Linen on you. If this is not something you want to do then stick to the traditional cotton wear. Its not enough to choose the fabric, your choice of the color and style of your outfit also needs to be apt. Choose light colors that don't allow the heat to stay within. Coming to the style, you might have to do some summer shopping. Fortunately, this is not the only option. You can give a new look to your old cloths to make a perfect summer outfit. Make sure you have great tailor, because only the best can give the best. Take your cloths to the tailor and see if he or she can crop your skirts and blazers to make them summer fit. Also remember to allow your skin to breathe. Don’t suffocate it with extremely tight cloths. What about make up? I’m sure you know a million ways to present yourself beautifully. What you may not know is how to take care of your make up kit. Cosmetics too are intolerant to heat. They may melt and become unusable if you don’t protect them from the angry sun. The protection process of your make up kit begins with, placing a zip lock bag in the refrigerator and letting it remain there overnight. When you step out to conquer the world next morning, carry your make up kit in that cold bag. This will keep the heat from attacking your lipstick or foundation at least until you find a cool place to put it in. Try these tricks and enjoy summer! Kruti Beesam

పండుగ రోజున కొత్త ఫ్యాషన్...

  పండుగ రోజున కొత్త ఫ్యాషన్...   పండుగ అంటే కొత్త బట్టలు... వాటితోపాటు గాజులు, గొలుసులు, చెవి పోగులు లాంటివి కూడా కొత్తవి అయితే బావుంటుంది కదా. వన్ గ్రామ్ నగలు బంగారు నగలతో పోటీ పడుతూ ఎన్నెన్నో రకరకాల డిజైన్లతో దొరుకుతున్నాయి. మరీ మెరుపులతో నగలు వద్దు అనుకునే వారి కోసం మార్కెట్లో మ్యాటిగోల్డ్ నగలు దొరుకుతున్నాయి. ఇవి చూడటానికి అందంగా వుంటాయి. తక్కువ మెరుపుతో వుంటాయి. పట్టుచీరలు, పట్టు లంగాల వంటివి వేసుకున్నప్పుడు ఇవి పెట్టుకుంటే బావుంటుంది. అంతేకాదు కాలేజీకి వెళ్ళే అమ్మాయిలు వీటిని పెట్టుకుంటే... సింపుల్‌గా వుండి బావుంటుంది. -రమ

పారదర్శక నగలు

  పారదర్శక నగలు మోడ్రన్ డ్రస్సు లలో ఎన్నెన్నో వెరైటీలు వస్తున్నాయి. మరి అందుకు తగ్గట్టు ధరించే నగలలో రాకపోతే ఎలా?  అందులోనూ ఇప్పటి అమ్మాయిలు  సింపుల్‌గా, మోడ్రెన్‌గా, చూడగానే ఇట్టే ఆకర్షించేలా వుండే ఆభరణాలనే ఇష్టపడుతున్నారు . అలా అమ్మాయిల మనసుకి అద్దం పడుతూ, వారిని అలరిస్తున్నాయి "లూసైట్ " తరహా ఆభరణాలు. గాజు నగల మాదిరిగా  రెండు వైపులా పారదర్శకంగా వుండి, మధ్యలో రకరకాల డిజైన్లు ఉండటమే వీటి ప్రత్యేకత. రకరకాల రంగులలో దొరకటం, పైగా ఇయర్ టాప్స్ నుంచి బ్రేస్‌లెట్దాకా అన్ని రకాల యాక్ససరీస్ ఇందులో లభిస్తాయి. ఈసారి షాపింగ్‌కి వెళ్ళినప్పుడు మర్చిపోకుండా ఈ పారదర్శక నగలని కొనుక్కోండి.   -రమ