వేసవిలో వేడిగా అనిపించకుండా ఉంచే సూపర్ శారీస్!

వేసవిలో వేడిగా అనిపించకుండా ఉంచే సూపర్ శారీస్! కాలం మారినప్పుడు దుస్తుల ఎంపిక కూడా మార్చాల్సి వస్తుంది.  చలికాలంలో వెచ్చగా ఉండటం కోసం ఎలాగైతే దుస్తులు ఎంచుకుంటారో.. అలాగే వేసవి కాలంలో వేడి బాధించకుండా,  చెమట వల్ల ఇబ్బంది పడకుండా ఉండేలా మంచి వస్త్రధారణ ఉండాలని అనుకుంటారు. అయితే..అనుకోవడమే కానీ చాలామందికి సెలక్షన్ తెలియదు. అయితే మరేం ఫర్వాలేదు..  ఫ్యాషన్ గురించి సరిగా తెలియని వారికి,  ఏ సీజన్ లో ఎలాంటి వాతావరణంలో ఎలాంటి దుస్తులు ధరించాలో తెలియని వారికి.. ఏకంగా ఫ్యాషన్ నిపుణులే సూచనలు, సలహాలు ఇస్తున్నారు. వేసవిలో చెమట వల్ల ఇబ్బంది లేకుండా,  వేడిగా అనిపించకుండా ఉండాలంటే ఎలాంటి చీరలు ఎంపిక చేసుకోవాలో.. ఫ్యాషన్ నిపుణులు ఏం చెప్తున్నారో తెలుసుకుంటే.. లైట్ వెయిట్.. వేసవిలో కాటన్, లినెన్, ఖాదీ వంటి చీరలు మంచి ఎంపికలు అవుతాయి.  ఇవి గాలిని లోపలికి వెళ్ళనిస్తాయి, చెమట త్వరగా ఆరిపోతుంది , ఈ ఫ్యాబ్రిక్ చీరల్లో  చాలా సేపటి వరకు సౌకర్యంగా ఉంటారు. ఇది కాకుండా, ఈ వస్త్రాలు తేలికగా ఉంటాయి, దీనివల్ల చీరను రోజంతా సులభంగా హ్యాండిల్ చేయవచ్చు. లైట్, పాస్టెల్ రంగులు.. వేసవిలో తెలుపు, లేత రంగులు, లేత పసుపు, పుదీనా ఆకుపచ్చ వంటి రంగులు ధరించడం మంచిది. ఈ రంగులు సూర్యుని వేడిని తగ్గించి, చల్లదనాన్ని ఇస్తాయి. ముదురుగా,  ప్రకాశవంతమైన రంగులు వేసవిలో వేడిని పెంచుతాయి. అందుకే వీటిని దూరం పెట్టాలి. కొంగు కహానీ.. కొంగు మరీ ఎక్కువగా వేలాడకుండా చూసుకోవాలి. బెంగాలీ డ్రేప్, మరాఠీ డ్రేప్ లేదా స్ట్రెయిట్ స్టైల్ వంటి సులభమైన , హ్యాండిల్ చేయగల స్టైల్స్ లో చీరలు ధరించడం చాలా బాగుంటుంది. ఇది సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా కొత్త లుక్ ఇస్తుంది. యాక్సెసరీలు.. వేసవిలో బరువైన ఆభరణాలు ధరించడం మానుకోవాలి. తేలికపాటి ఆభరణాలు, చిన్న స్టడ్స్ లేదా మినిమలిస్ట్ నెక్లెస్ ధరించాలి.  ఈ సింపుల్ లుక్ చాలా  స్టైలిష్‌గా కనిపించేలా చేస్తుంది , వేడిలో  అసౌకర్యంగా అనిపించదు. బ్లౌజ్ ఎంపిక.. గాలి ఆడే, తేలికైన బ్లౌజును ఎంచుకోవాలి.   కాటన్ లేదా లినెన్ బ్లౌజులు వేసవిలో సౌకర్యవంతంగా ఉండి, చెమట పట్టకుండా నివారిస్తాయి. చెప్పులు.. హైహీల్స్ ధరించడం మానుకోవాలి. నడకను సులభతరం చేస్తూ, చెమటను తగ్గించే ఫ్లాట్ చెప్పులు, స్లిప్-ఆన్‌లు లేదా బూట్లు ధరించాలి. పైన చెప్పుకున్నవి ధరిస్తే.. వేసవిలో శారీస్ కట్టుకుని సింపుల్ గా ఉంటూనే ఫ్యాషన్ గా కనిపిస్తూ తళుక్కున మెరిసిపోవచ్చు.                              *రూపశ్రీ.

హాట్ సమ్మర్ లో కూల్ కలర్స్.. ఈ రంగు దుస్తులు ధరిస్తే ఫ్యాషన్‌గా ఉంటూనే కూల్‌గా కనిపిస్తారు!

హాట్ సమ్మర్ లో కూల్ కలర్స్.. ఈ రంగు దుస్తులు ధరిస్తే ఫ్యాషన్‌గా ఉంటూనే కూల్‌గా కనిపిస్తారు!  దుస్తుల రంగు  శరీర ఉష్ణోగ్రతను నేరుగా ప్రభావితం చేస్తుందని చాలామందికి తెలియదు. ముదురు రంగులు సూర్యుని వేడిని ఎక్కువగా గ్రహించగా, లేత , మృదువైన రంగులు వేడిని పరావర్తనం చెందించి,  చల్లగా ఉండేలా చేస్తాయి. అందుకే వేసవిలో లేత రంగుల దుస్తులు ధరించమని సిఫార్సు చేస్తారు. కేవలం వేసవి అనే కాదు.. సాధారణ రోజుల్లో కూడా కొందరికి నలుపు రంగులు దుస్తులు ధరిస్తే.. ఒంట్లో బాగోకపోవడం,  శరీరం అసౌకర్యంగా అనిపించడం వెనుక కూడా ఇదే కారణం ఉంటుంది.  ఇకపోతే.. ఈ వేసవి సీజన్‌లో  స్టైలిష్‌గా, చల్లగా ఉండాలనుకుంటే శరీరాన్ని కూల్ గా ఉంచే రంగులను ధరించడం చాలా ముఖ్యం.  అటు ఫ్యాషన్ గా కనిపించేలా చేస్తూనే.. ఇటు శరీరాన్ని కూల్ గా ఉంచే కలర్స్ గురించి తెలుసుకుంటే.. సమ్మర్ లో కూల్ గా ఉంచే రంగులు.. తెలుపు.. తెలుపు వేసవిలో అందరికీ ఇష్టమైన రంగు. ఇది సూర్యకిరణాలను ప్రతిబింబించి శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. అంతేకాకుండా, ఇది అన్ని రకాల రంగుల  వారికి అందంగా కనిపిస్తుంది. లేత నీలం.. లేత నీలం రంగు కళ్ళకు ఆహ్లాదకరంగా ఉండి, వేసవిలో ఉల్లాసకరమైన లుక్  ఇస్తుంది. ఇది ఆఫీసుకు వేసుకోవడానికి అయినా లేదా  సాధారణంగా వేసుకోవడానికి అయినా.. ఇలా రెండింటికీ బాగా నప్పుతుంది. లేత గులాబీ రంగు.. లేత గులాబీ రంగు చాలా మృదువుగా సాప్ట్ లుక్ ఇస్తుంది.  అంతేకాకుండా చాలా  స్టైలిష్ లుక్ కూడా ఇస్తుంది.  ఇవి సమ్మర్ లో చాలా మంచి లుక్ ఇస్తుంది.   అందువల్ల ఇది బయటకు వెళ్ళడానికి లేదా బ్రంచ్ కోసం ఒక గొప్ప ఎంపిక. పుదీనా ఆకుపచ్చ లేదా మెంట్ గ్రీన్.. మింట్ గ్రీన్ రంగు ట్రెండీగా ఉండటమే కాకుండా, చల్లదనాన్ని కూడా ఇస్తుంది. ఈ రంగు కళ్ళకు ఆహ్లాదకరంగా ఉండి, వేసవిలో కూలింగ్  అనుభూతిని కలిగిస్తుంది. నిమ్మ పసుపు.. నిమ్మ పసుపు అనేది ప్రకాశవంతమైన  లేత రంగు, ఇది వేసవిలో ఎనర్జీని,  రిఫ్రెషింగ్ లుక్ ను ఇస్తుంది. ముఖ్యమైన చిట్కా.. వేసవిలో తేలికైన, కాటన్ వస్త్రాలను ఎంచుకోవడం చాలా ముఖ్యం. పగటిపూట బిగుతుగా ఉండే దుస్తులు , ముదురు రంగులను ధరించడం మానుకోవాలి. వదులుగా ఉన్న లేత రంగు కాటన్ దుస్తులు ధరిస్తే చాలా సౌకర్యవంతంగా ఉంటాయి.                                   *రూపశ్రీ.

వేసవి పెళ్లిళ్లలో చెమటకు ఇలా చెక్ పెట్టండి!

వేసవి పెళ్లిళ్లలో చెమటకు ఇలా చెక్ పెట్టండి! పెళ్లి అంటే చాలా గొప్ప వేడుక. భారతీయులు తమ జీవితంలో అత్యంత వైభవంగా పెళ్లి చేసుకుంటారు.  పెళ్లిలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి ఈవెంట్ కు ప్రత్యేకంగా తయారవ్వాలని అనుకుంటారు. అమ్మాయిలు అయితే పెళ్లి అందం, హడావిడి మొత్తం తమ చుట్టూ ఉండాలని కోరుకుంటారు. కానీ వేసవి కాలం దీనికి చాలా పరీక్షలు పెడుతుంది. ఎంత బాగా ముస్తాబైనా సరే..  విపరీతమైన వేడి కారణంగా ఆ అలంకరణ అంతా పాడైపోతూ ఉంటుంది.  వేసవి చెమట అసలు ఇబ్బంది పెట్టకుండా ఉండేలా తయారవ్వడం ఒకటే దీనికి మార్గం.  అసలు వేసవి వేడి, చెమట ఇబ్బంది పెట్టకుండా పెళ్లిళ్లకు రెడీ కావడం ఎలా? ముఖ్యంగా పెళ్లికి హాజరయ్యే అతిథులు,  బంధువులను పక్కన పెడితే.. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకుకు మాత్రం ఇది పెద్ద విషమ పరీక్షే.. కానీ వేసవి ఇబ్బంది పెట్టకుండా తయారు అవ్వవచ్చు.  అదెలాగో  తెలుసుకుంటే.. సరైన దుస్తుల ఎంపిక.. వేసవిలో, ఆర్గాంజా, షిఫాన్ , జార్జెట్ వంటి తేలికైన , గాలి ప్రసరించే వస్త్రాలను ఎంచుకోవాలి.  బరువైన వెల్వెట్ లేదా మందపాటి పట్టును వాడకూడదు. పీచ్, పింక్, మింట్ గ్రీన్ , లావెండర్ వంటి లేత రంగులు వేసవి వివాహానికి చాలా బాగుంటాయి.  ఇవి ట్రెండీగా కనిపించడమే కాకుండా,  సరికొత్త లుక్ ను  కూడా అందిస్తాయి. మేకప్ ఇలా ఉండాలి.. వేసవిలో భారీ మేకప్ త్వరగా కరిగిపోతుంది, కాబట్టి వాటర్‌ప్రూఫ్ , మ్యాట్ ప్రోడక్ట్ ను వాడాలి.  బేస్ లైట్ ఉంచి,  నేచురల్ లైటింగ్ పై దృష్టి పెట్టాలి. మేకప్ ఎక్కువసేపు నిలిచి ఉండాలంటే, సెట్టింగ్ స్ప్రేను తప్పకుండా వాడాలి. జ్యువెలరీ, హెయిర్ స్టైల్.. బరువైన ఆభరణాలకు బదులుగా, తేలికైన , సొగసైన వాటిని ఎంచుకోవాలి. వేడిని తగ్గించడానికి  జుట్టును బన్‌గా లేదా జడగా వేసుకోవాలి. జుట్టును వదిలేస్తే ఉక్కపోత ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. చెమట కూడా బాగా పడుతుంది. కాబట్టి జుట్టు వదులుగా ఉన్న హెయిర్ స్టైల్ నివారించాలి.  తాజా పువ్వులను ఉపయోగించడం వల్ల  లుక్ మరింత అందంగా మారుతుంది. ఈ టిప్స్ చాలా హెల్ప్ అవుతాయి.. బ్లాటింగ్ పేపర్లు , ఫేస్ మిస్ట్ తీసుకువెళ్ళాలి.  తేలికైన , చల్లదనాన్నిచ్చే పెర్ఫ్యూమ్  వాడాలి.  శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలి.  డీహేడ్రేషన్ కు గురికాకుండా  నీళ్ళు తాగుతూ ఉండాలి. కంఫర్ట్ గా ఉండే  పాదరక్షలను ఎంచుకోవాలి. స్కిన్ కేర్, అట్రాక్షన్ లుక్.. పెళ్లికి ముందు డైలీ స్కిన్ కేర్ రొటీన్ ను  పాటించాలి. తప్పకుండా సన్‌స్క్రీన్ వాడాలి. సహజమైన ఫేస్ ప్యాక్‌లను వాడాలి.  ఇది  చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా కనిపించేలా చేస్తుంది.                             *రూపశ్రీ.

పెర్ఫ్యూమ్ ఎక్కువసేపు సువాసన రావాలంటే.. శరీరంలో ఇక్కడ రాసుకోండి!

పెర్ఫ్యూమ్ ఎక్కువసేపు సువాసన రావాలంటే.. శరీరంలో ఇక్కడ రాసుకోండి! చక్కగా ముస్తాబయ్యి ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా పెర్ఫ్యూమ్ అప్లై చేసుకోవడం నేటికాలంలో కామన్ అయిపోయింది. ఇక చెమటతో ఇబ్బంది పడేవారు ఎలాగో తప్పనిసరిగా పెర్ఫ్యూమ్ వాడుతుంటారు.  అయితే.. ఈ వేసవికాలంలో వచ్చే చెమట కారణంగా పెర్ఫ్యూమ్ వాసన తొందరగా పోతుంది. కానీ ఇలా పెర్ఫ్యూమ్ స్మెల్ తొందరగా పోకుండా.. ఎక్కువ సేపు నిలిచి ఉండటానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి.  పెర్ప్యూన్ ను అప్లై చేసుకునే విధానమే అది తొందరగా వాసన కోల్పోవడానికి కారణం అవుతుంది. ఎంత ఖరీదైన పెర్ఫ్యూమ్ వాడినా అది బూడిదలో పోసిన పన్నీరవుతుంది.  పెర్ఫ్యూమ్ వాసన ఎక్కువ సేపు సువాసన వెదజల్లుతూ ఉండాలంటే శరీరంలో ఎక్కడ అప్లై చేయాలో ఫ్యాషన్ నిపుణులు ఏం చెప్తున్నారో తెలుసుకుంటే.. బట్టలమీద కాదు.. చాలా మందికి బట్టలకు పెర్ఫ్యూమ్ రాసుకునే అలవాటు ఉంటుంది, కానీ ఈ పద్ధతి సరైనది కాదు. బట్టలకు పెర్ఫ్యూమ్ రాసుకుంటే దాని సువాసన నిలవదు. అంతేకాకుండా కొన్ని పెర్ఫ్యూమ్‌లు బట్టలపై మరకలుగా మారతాయి. అందువల్ల పెర్ఫ్యూమ్‌ను నేరుగా చర్మానికి, ముఖ్యంగా శరీర ఉష్ణోగ్రత కొద్దిగా వెచ్చగా ఉండే ప్రదేశాలలో రాసుకోవాలి. పెర్ఫ్యూమ్ గురించి మంచి అవగాహన ఉన్న ఫ్యాషన్ నిపుణులు మాత్రం పెర్ప్యూమ్ ను మణికట్టుకు  రాసుకోవడం చాలా మంచి పద్దతి అని, ఇది చాలా ప్రభావవంతమైన పద్ధతి అని చెబుతున్నారు. ఇక్కడ నరాలు చర్మానికి దగ్గరగా ఉంటాయి, ఇది కొద్దిగా  వెచ్చదనాన్ని నిలుపుకొని, సువాసన ఎక్కువసేపు నిలిచి ఉండేలా చేస్తుంది. మెడకు , చెవుల వెనుక పెర్ఫ్యూమ్ రాసుకోవడం కూడా  సరైన విధానం. నాడీ ప్రదేశాలలో పెర్ఫ్యూమ్.. ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఛాతీకి కొద్దిగా పెర్ఫ్యూమ్ రాసుకోవడం వల్ల దాని సువాసన పైకి వ్యాపించి, రోజంతా చాలా ఆహ్లాదకరమైన పరిమళాన్ని అందిస్తుంది. ఎక్కువ సేపు తాజాగా ఉండాలనుకునే వారికి ఇది చాలా మంచి ఛాయిస్. ఈ ప్రాంతాలలో రక్త ప్రసరణ ఎక్కువగా ఉంటుంది,,  మోచేతుల లోపలి భాగం, మోకాళ్ల వెనుక భాగం,  చీలమండల వంటి ప్రదేశాలలో పెర్ఫ్యూమ్ బాగా అప్లై అయ్యి, దాని సువాసనను నెమ్మదిగా విడుదల చేస్తూ ఎక్కువసేపు నిలిచి ఉంటుంది. చాలా మంది పెర్ఫ్యూమ్ రాసుకున్న తర్వాత దానిని రుద్దుకుంటారు, కానీ ఇది కరెక్ట్ కాదు..  ఇలా చేయడం వల్ల పెర్ఫ్యూమ్ సువాసన  విచ్ఛిన్నమై దాని ప్రభావం తగ్గుతుంది. పొట్ట చుట్టూ పెర్ఫ్యూమ్ రాసుకోవడం చాలా మందికి తెలియదు, కానీ ఇది కూడా సువాసన ఎక్కువసేపు నిలిచి ఉండటానికి సహాయపడుతుంది. శరీర వేడి ఈ ప్రాంతంలో నిలిచి ఉండి, పెర్ఫ్యూమ్ ప్రభావాన్ని మరింత పెంచుతుంది. పెర్ఫ్యూమ్ ఎక్కడ పూయకూడదంటే.. అధికంగా చెమట పట్టే ప్రదేశాలు లేదా బాగా పొడిబారిన చర్మం వంటి కొన్ని ప్రాంతాలలో పెర్ఫ్యూమ్‌ను వాడకూడదు. చెమట సువాసనను త్వరగా ఆవిరి చేస్తుంది, అదే సమయంలో పొడి చర్మంపై పెర్ఫ్యూమ్ ఎక్కువసేపు నిలవదు. అందువల్ల పెర్ఫ్యూమ్ వేసుకునే ముందు తేలికపాటి మాయిశ్చరైజర్‌ను రాసుకోవడం చాలా మంచిది. సరైన ప్రదేశంలో, సరైన పద్ధతిలో రాసుకున్నప్పుడు మాత్రమే దాని సువాసన ఎక్కువసేపు నిలిచి ఉంటుంది. దీని వల్ల రోజంతా రిఫ్రెషింగ్ గా ఉండవచ్చు.                                     *రూపశ్రీ.

ఒకే కుర్తీతో 5 డిఫరెంట్ లుక్స్.. ఇదిగో ఇలా ట్రై చేయండి!

ఒకే కుర్తీతో 5 డిఫరెంట్ లుక్స్.. ఇదిగో ఇలా ట్రై చేయండి! ఇది వేసవి కాలం. చాలా మంది అమ్మాయిలు సౌకర్యవంతమైన, వేడి నుండి ఉపశమనం కలిగించే దుస్తులను ఇష్టపడతారు. అందువల్ల వేసవిలో కుర్తీలు ట్రెండీగా మారిపోతాయి. ప్రతి అమ్మాయి వార్డ్‌రోబ్‌లో ఒక సింపుల్ కుర్తీ ఉంటుంది, కానీ తరచుగా అదే కుర్తీని పదేపదే ధరించడం విసుగు తెప్పిస్తుంది. కానీ ఆ ఒక్క సాధారణ కుర్తీతోనే  ఐదు డిఫరెంట్ లుక్స్ ను,  స్టైల్స్‌ను క్రియేట్ చేయవచ్చు.  చాలామంది అమ్మాయిలు అందంగా కనబడాలంటే దుస్తులు చాలా ఉండాలి అనుకుంటారు. కానీ ఇది చాలా తప్పు.. ఫ్యాషన్ ను ఫాలో అయితే.. ఒక కుర్తీ తోనే డిఫరెంట్ లుక్స్ ను క్రియేట్ చేయవచ్చు. ఇందుకోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు.  కేవలం సింపుల్ టిప్స్ తోనే ఇది సాద్యమవుతుంది.  సాధారణ కుర్తీని స్టైల్ చేయడానికి ఐదు అధిరిపోయే చిట్కాలు తెలుసుకుంటే.. కుర్తీ, జీన్స్.. మోకాళ్ల వరకు ఉండే కుర్తీ ఉంటే, దానిని స్కిన్నీ లేదా స్ట్రెయిట్ జీన్స్‌తో జత చేయాలి. స్నీకర్లు లేదా ఫ్లాట్స్ ఈ లుక్‌ను పూర్తి చేస్తాయి. ఇది క్యాజువల్ చిక్ లుక్‌ను అందిస్తుంది. ఈ అవుట్‌ఫిట్ కాలేజీకి ,  నార్మల్ ఔటింగ్  ప్రయాణాలకు చాలా బాగుంటుంది. కుర్తీ, ప్లాజో.. స్టైల్‌తో పాటు సౌకర్యం కోసం, మీ కుర్తీని ప్లాజోలతో జత చేయవచ్చు.  వేసవిలో వదులుగా ఉండే ప్లాజోలతో కూడిన కుర్తీ చాలా కంఫర్ట్ గా కనిపిస్తుంది.  పైగా  ట్రెండీగా కూడా ఉంటుంది. ఈ ఔట్ ఫిట్ లో జ్యువెలరీ తక్కువగా ఉండాలి. కుర్తీ, స్కర్ట్.. ఫ్యూజన్ లుక్ కోసం  సింపుల్ కుర్తీని , స్కర్ట్‌తో జత చేయవచ్చు. బోహో జ్యువెలరీ ఇలాంటి కుర్తీ , స్కర్ట్‌ను మరింత ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తుంది. ఇది పండుగలకు , ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడానికి చాలా మంచి లుక్ ఇస్తుంది. కుర్తీ, షరారా.. సాంప్రదాయంగా కనిపించడం కోసం, పొట్టి కుర్తీ , షరారా ధరించవచ్చు. దానికి దుపట్టాను జోడించాలి. ఈ శైలి వేడుకలకు , పెళ్లిళ్లకు చాలా బాగుంటుంది. కుర్తీ, ధోతి ప్యాంట్.. ఇండో-వెస్ట్రన్ శైలి కోసం, కుర్తీని ధోతీ ప్యాంట్లతో జత చేసి ధరించవచ్చు. స్టేట్‌మెంట్ చెవిపోగులతో ఈ లుక్ ను పూర్తి చేస్తే అధిరిపోతుంది. ఇది చాలా స్పెషల్ గా ,  న్యూ లుక్ ను ఇస్తుంది. మెరుపు చిట్కాలు.. బెల్ట్ జత చేయడం  ద్వారా కుర్తీకి కొత్త లుక్  ఇవ్వవచ్చు. లేయరింగ్ కోసం ఒక జాకెట్ లేదా ష్రగ్ జోడించవచ్చు. ధరించే పాద రక్షలు కూడా లుక్ ను పూర్తీగా మార్చేస్తాయి. కాబట్టి పాద రక్షలు ఎంచుకోవడంలో కూడా జాగ్రత్త తీసుకుంటే సూపర్ గా ఉంటుంది.                                   *రూపశ్రీ.

వేసవిలో కూల్ గా స్టైలిష్ గా ఉంచే ఫ్యాషన్ చిట్కాలు..!

వేసవిలో కూల్ గా స్టైలిష్ గా ఉంచే ఫ్యాషన్ చిట్కాలు..! వేసవి అనగానే చిరాకు భావన పుడుతుంది చాలా మందికి. ముఖ్యంగా వస్త్రధారణ,  బయటకు వెళ్లడం, ప్రయాణాలు, ఉక్కపోతలో పనిచేయడం.. ఇవన్నీ గుర్తుకు వస్తే వేసవి అంటే ఎక్కడలేని కోపం వచ్చేస్తుంది. వేసవిలో చెమట, జిగటగా ఉండటం, సౌకర్యం అనేవి ప్రధాన సమస్యలు. సరైన దుస్తులు ఎంచుకోవడం ద్వారా  రోజును సౌకర్యవంతంగా , కూల్ గా,  స్టైలిష్‌గా మార్చుకోవచ్చు. వేసవికి తేలికైన, గాలి ప్రసరించే , చెమటను పీల్చుకునే దుస్తులు ఉత్తమమైనవి. వేసవి కాలంలో ఎలాంటి దుస్తులు ధరించాలో,  ఏ రకమైన దుస్తులు ఎలాంటి సౌకర్యాన్ని ఇస్తాయో..   సమ్మర్ లోనూ కూల్ గా,  స్టైలిష్‌గా ఉండటానికి సులభమైన చిట్కాలు ఏంటో తెలుసుకుంటే.. కాటన్.. వేసవిలో కాటన్  అత్యంత ప్రజాదరణ పొందిన వస్త్రం. ఇది తేలికగా, మృదువుగా , చెమటను పీల్చుకునే గుణాన్ని కలిగి ఉంటుంది, అందువల్ల రోజువారీ  ధరించడానికి  ఇది చాలా అనువైనది. వేసవి ప్రారంభం కాగానే, పత్తి వస్త్రాలు మార్కెట్‌ను ముంచెత్తుతాయి.  వార్డ్‌రోబ్‌లో కుర్తీలు, షర్టులు , టాప్‌లతో సహా అనేక రకాల కాటన్  వస్త్రాలు ఉంటే వేసవిలో ఆహ్లాదంగా గడిపేయవచ్చు. లినెన్.. లినెన్ చాలా గాలి ఆడే, చల్లని వస్త్రం. ఇది ఆఫీసుకు , బయటి ప్రయాణాలకు రెండింటికీ అనువైనది. ఈ సీజన్‌లో లినెన్ షర్టులు అత్యంత సౌకర్యవంతమైన , స్టైలిష్ రూపాన్ని అందిస్తాయి. రేయాన్..  వేసవి కలెక్షన్‌లో రేయాన్ వస్త్రాలను చేర్చాలి.  రేయాన్ స్టైలిష్‌గా , తేలికగా ఉంటుంది, కాబట్టి ఇది పార్టీలకు , క్యాజువల్ వేర్‌కు చాలా అనువైనది. ఖాదీ.. ఖద్దరు అనేది వేసవి వేడిలో చల్లదనాన్ని అందించే ఒక సహజమైన వస్త్రం. జాతిపరమైన , సాంప్రదాయ  లుక కు  ఖద్దరు వస్త్రం చాలా అనువైనదిగా పరిగణించబడుతుంది. ఖద్దరు వస్త్రం అనేక రకాల డిజైన్ ఎంపికలను కూడా అందిస్తుంది. షిపాన్.. షిఫాన్ అనేది తేలికైన , గాలికి రెపరెపలాడే వస్త్రం, ఇది  స్టైలిష్ రూపాన్ని ఇస్తుంది. ఈ వస్త్రం వేసవి పార్టీలు ,ఫంక్షన్లకు చాలా అనువైనది. షిఫాన్ అనేక రకాల ఆకర్షణీయమైన , అందమైన చీరలను అందిస్తుంది, ఇవి సౌకర్యవంతంగా ఉండి, ఏ మీటింగ్స్ లో అయినా క్లాసీ రూపాన్ని ఇస్తాయి. జార్జెట్.. జార్జెట్ తేలికైన , గాలి ప్రసరించే వస్త్రం . ఇది ట్రెండీ, న్యూ లుక్స్ కూడా  చాలా అనువైనది. జార్జెట్‌లో ఇండో-వెస్ట్రన్ దుస్తులు, పలాజో సెట్లు, కుర్తాలు లేదా చీరలతో సహా అనేక రకాల ఛాయిస్ మార్కెట్లో ఉంటాయి.                                         *రూపశ్రీ.

సమ్మర్‌లోనూ ఫ్రెష్ లుక్‌తో కనిపించాలంటే.. ఈ డ్రెస్సింగ్ టిప్స్ ఫాలో అవ్వండి..!

సమ్మర్‌లోనూ ఫ్రెష్ లుక్‌తో కనిపించాలంటే.. ఈ డ్రెస్సింగ్ టిప్స్ ఫాలో అవ్వండి..! వేసవి వచ్చేసింది, ఉష్ణోగ్రతలు రోజురోజుకూ క్రమంగా పెరుగుతున్నాయి. మండుతున్న ఎండ, చెమట మధ్య కూల్ గా ప్రొఫెషనల్‌గా ఎలా ఉండాలనేది వర్క్ చేసే వారికి అతి పెద్ద ఛాలెంజ్.  తరచుగా హెవీ ఫార్మల్స్,  ముదురు రంగులు వేసవిలో వేడిని పీల్చుకోవడమే కాకుండా, రోజంతా అసౌకర్యాన్ని, బద్ధకాన్ని కలిగిస్తాయి. నేటి కొత్త ఫ్యాషన్ ట్రెండ్‌ల ప్రకారం, ఆఫీస్ దుస్తులలో ఇప్పుడు సౌకర్యానికి ప్రాధాన్యత ఇవ్వబడుతోంది. వేసవిలో సరైన దుస్తులను ఎంచుకోవడం  ఆత్మవిశ్వాసాన్ని,  సామర్థ్యాన్ని  ప్రభావితం చేస్తుంది. వేసవి దుస్తులు.. వేసవిలో కాటన్, లినెన్,  ఖాదీ వంటి సహజ దుస్తులు  ఉపయోగించడం ఉత్తమ ఎంపిక అని నిపుణులు అంటున్నారు, ఎందుకంటే అవి చర్మాన్ని గాలి పీల్చుకోవడానికి,  శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడతాయి. ఇంకా, పాస్టెల్,  లేత రంగులను ఎంచుకోవడం కళ్ళకు ఉపశమనం కలిగించడమే కాకుండా సూర్య కిరణాలను ప్రతిబింబించడం ద్వారా  శరీరాన్ని చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది. రంగుల ఎంపికలు.. వేసవిలో ఆఫీసు దుస్తులకు లినెన్,  కాటన్ బట్టలు ఉత్తమం.  ఎందుకంటే అవి చెమటను త్వరగా గ్రహిస్తాయి. ముదురు నలుపు లేదా నేవీ బ్లూకు బదులుగా,  స్కై బ్లూ, లైట్ పింక్, పుదీనా ఆకుపచ్చ,  ఆఫ్-వైట్ వంటి రంగులను ఆఫీసుకు ధరించవచ్చు.  లేత రంగులు మీకు తక్కువ వేడిని కలిగించడమే కాకుండా, ప్రొఫెషనల్ వాతావరణంలో  ఇమేజ్‌ను డీసెంట్‌గా కనిపించేలా చేస్తాయి. స్టైలిష్ ఎంపికలు.. కాటన్ కుర్తీలు, లినెన్ ప్యాంటు,  ఫ్లేర్డ్ స్కర్టులు ఉద్యోగస్తులకు గొప్ప ఎంపికలు. ఈ సీజన్‌లో టైట్ జీన్స్‌కు బదులుగా, పలాజోలు లేదా స్ట్రెయిట్-కట్ ప్యాంటు ధరించడం బాగుంటుంది, ఇవి స్టైలిష్‌గా,  సౌకర్యంగా ఉంటాయి. దుపట్టా లేదా స్కార్ఫ్ కోసం, షిఫాన్ లేదా మస్లిన్ ఫాబ్రిక్ ఉపయోగించాలి.  ఇది బరువు తక్కువగా,  సౌకర్యవంతంగా ఉంటుంది. కాంబినేషన్స్.. లుక్ ని కంప్లీట్ గా పిక్స్ చేయడానికి పాదాలకు  లోఫర్లు లేదా బాలేరినాస్ వంటి తేలికపాటి పాదరక్షలను ఎంచుకోవాలి.  అయితే ఎక్కువ సేపు వీటిని ఇలాగే ధరించే పరిస్థితి ఉంటే వీటిని ఈ వేసవిలో పాదాలకు గాలి తగలక లోపల ఫంగస్, బ్యాక్టీరియా పెరిగి కాళ్ళ చర్మం దెబ్బతినే అవకాశం ఉంటుంది.  కాబట్టి పాదాలకు గాలి తగిలేలా ఉండే పుట్ వేర్ ఎంచుకోవాలి. బరువైన ఆభరణాలు  లెదర్ బెల్టులకు బదులుగా, చెమట కారణంగా చర్మాన్ని చికాకు పెట్టని  వాటిని ఉపయోగించాలి. ఎల్లప్పుడూ సన్ గ్లాసెస్,  వాటర్ బాటిల్ వెంట తీసుకెళ్లాలి.                                    *రూపశ్రీ.

పొడవాటి జుట్టు ఉందా.. ఈ హెయిర్ స్టైల్స్ ట్రై చేస్తే సెలబ్రిటీలలా కనిపిస్తారు..!

పొడవాటి జుట్టు ఉందా..  ఈ హెయిర్ స్టైల్స్ ట్రై చేస్తే సెలబ్రిటీలలా కనిపిస్తారు..!  పెళ్లిళ్ల సీజన్ దగ్గర పడే  కొద్దీ ప్రతి అమ్మాయి ప్రతి ఈవెంట్‌లో తాను అందంగా, స్టైలిష్‌గా కనిపించాలని కోరుకుంటుంది. డ్రెస్సింగ్,  మేకప్ ఎంత ముఖ్యమో, హెయిర్ స్టైల్స్ కూడా అంతే కీలకం. ముఖ్యంగా  పొడవాటి,  మందపాటి జుట్టు ఉన్నవారికి హెయిర్ స్టైల్ అదనపు అందాన్ని తెచ్చిపెడతాయి. నేటికాలంలో హెయిర్ స్టైల్స్ లో చాలా మెరుగుదల కనపిస్తోంది. అయితే వేసుకునే దుస్తులకు,  ముఖ ఆకృతికి సరిపోయే హెయిర్ స్టైల్ ఎంచుకోవడం వల్ల మరింత అందంగా, ఇంకా చెప్పాలంటే సెలబ్రిటీలలా కనిపిస్తారు.  అలాంటి కొన్ని స్పెషల్ హెయిర్ స్టైల్స్ గురించి తెలుసుకుంటే.. ఓపెన్ కర్లింగ్ హెయిర్ స్టైల్.. వదిలేసిన జుట్టు మీద మృదువైన అలలు చాలా అద్బుతంగా కనిపించేలా చేస్తాయి.  ఇది చాలా సాధారణంగా కనిపించినప్పటికీ,  అద్బుతంగా కనిపించేలా చేస్తుంది. ముఖ్యంగా హల్ది, మెహందీ లేదా సంగీత్ ఫంక్షన్లకు చాలా బాగుంటుంది.   కావాలనుకుంటే  మిడ్-పార్టింగ్‌ను కూడా ఉపయోగించవచ్చు.  జుట్టుకు టిక్కా లేదా స్టోన్ పిన్‌ను అటాచ్ చేస్తే బాగుంటుంది. గజ్రా ఫిష్ టైల్ జడ.. తెలుపు లేదా రంగురంగుల చైన్స్ తో  ఫిష్‌టెయిల్ జడను చుట్టడం ద్వారా అటు  సాంప్రదాయంగానూ ఇటు ఆధునిక రూపాన్ని అందంగా ప్రెజెంట్ చేయవచ్చు. ఈ హెయిర్ స్టైల్ చీరలు,  లెహంగాలు రెండింటికీ చాలా బాగుంటుంది. షార్ట్ సైజ్ బన్.. తక్కువ ఎత్తులో ఉండే బన్  ఒక క్లాసిక్ హెయిర్ స్టైల్, దీనిని  పెర్ల్ పిన్స్ లేదా స్టోన్ క్లిప్స్ తో అలంకరించవచ్చు. ఈ లుక్ రిసెప్షన్ లేదా సాయంత్రం ఫంక్షన్ కి సరిగ్గా సరిపోతుంది. హాఫ్ అప్- హాఫ్ డౌన్ హెయిర్ స్టైల్.. జుట్టు ఓపెన్ గా వదిలేసినట్టు ఉండాలి, అలా అని జుట్టు స్టైలిష్ గానూ ఉండాలి అనుకునేవారికి ఈ స్టైల్ సరైనది. పై భాగాన్ని ట్విస్ట్ చేయాలి లేదా జడ వేసి క్లిప్ వేయాలి. ఆపై దిగువ భాగాన్ని లూజ్ గా  వదిలేయాలి,  కింద వెంట్రుకలను కర్లింగ్ చేయాలి. గజ్రాతో ట్రెడిషనల్ జడ.. భారతీయ వివాహాల్లో గజ్రాకు దాని స్పెషల్ ఇంపార్టెన్స్   ఉంటుంది. స్ట్రైయిట్ గా లేదా  గజిబిజిగా ఉన్న బన్ను గజ్రాతో అలంకరించాలి. ఇది రాయల్ లుక్ ను,  సంప్రదాయ లుక్ ను కూడా ప్రెజెంట్ చేస్తుంది.                                      *రూపశ్రీ.

బనారస్ రంగ్ కట్ చీరల ప్రత్యేకత తెలుసా!

బనారస్ రంగ్ కట్ చీరల ప్రత్యేకత తెలుసా! భారతీయ వస్త్రధారణ చాలా  ప్రత్యేకమైనది. ముఖ్యంగా భారతీయ చీర ప్రత్యేకత వర్ణనాతీతం. ప్రపంచవ్యాప్తంగా మహిళలు చాలామంది భారతీయ చీరల మీద మనసు పడతారు,  ఈ చీరలను కట్టుకుని తమను తాము అందంగా చూసుకుని మైమరిచిపోతారు. ముఖ్యంగా కొంతమంది మహిళలు కట్టే చీరలు చాలా అద్బుతంగా ఉంటాయి.  ఈ క్రెడిట్ అంతా  చీరలు తయారు చేయడంలోనే ఉంటుంది. ఈ కళకు సలాం కొట్టాల్సిందే. అయితే కొన్ని చీరలు అందరూ కొనుగోలు చేసే విధంగా ఉండవు. వాటి ధర నుండి వాటి శైలి వరకు అన్ని చాలా విభిన్నంగా ఉంటాయి. ఇలాంటి వాటిలో అంబానీ భార్య నీతా అంబానీ కట్టే చీర చాలా విశిష్టం.  ఆమె ధరించే బనారస్ రంగ్ కట్ చీర చాలా ప్రత్యేకం.  ఈ చీర గురించి చెప్పినా, ఈ చీరను చూసినా మహిళల కళ్లు మెరుస్తాయి. అందరూ రంగ్‌కట్ చీరను తయారు చేయలేరు, అలాగే అందరూ దాని ధరను భరించలేరు. రంగ్‌కట్ చీర సాధారణమైన దుస్తులు కాదు. దీనిని బనారసి చీరలలో క్వీన్ అని కూడా పిలుస్తారు. దీనిని తయారు చేయడం చాలా కష్టం.  అందుకే  దీని ప్రజాదరణ అంత బలంగా లేదు. రంగ్‌కట్ చీర గురించి ప్రత్యేకతలు,  వాస్తవాలను తెలుసుకుంటే.. రంగ్ కట్ చీరలు ఎక్కడ తయారు చేస్తారంటే.. బనారస్‌లో చేతితో నేసే చీరలలో రంగ్‌కట్ చీర ఒకటి. దీనిని  దుస్తులలో భాగంగా కాకుండా విలాసవంతమైన వస్తువుగా పరిగణస్తారు. రంగ్‌కట్  యొక్క రంగులు దానిని ప్రత్యేకంగా చేస్తాయి. సాధారణ చీరలా కాకుండా రంగులు విడివిడిగా కాకుండా ఒకదానిలో ఒకటి సజావుగా కలిసిపోతాయి. చీర ప్రవహిస్తున్నట్లు కనిపిస్తుంది. రంగ్ కట్ చీర అర్థం.. ప్రతి చీర పేరుకు ఒక అర్థం ఉంటుంది. రంగ్‌కట్ అంటే రంగుల వార్ప్ అని అర్థం. ఇది నేయడానికి ముందు వార్ప్‌పై వివిధ రంగులను దారంతో అల్లే క్లిష్టమైన ప్రక్రియను ఉంటుంది. ఈ చీరలను చేతి వృత్తులవారు పగలు రాత్రి పనిచేస్తూ చేతితో తయారు చేస్తారు. అందుకే వాటికి ప్రత్యేకమైన మెరుపు,  ఇతర చీరల కంటే ఎక్కువ ధర ఉంటుంది. రంగ్ కట్ చీర అందరూ కొనలేరు.. నీతా అంబానీ లాంటి సెలబ్రిటీలు తమ దుస్తుల కోసం ఎంత డబ్బు అయినా ఖర్చు చేయగలుగుతారు. అయితే సగటు వ్యక్తి  ఇంత మొత్తంలో డబ్బు ఖర్చు చేయడం కష్టం. అందువల్ల రంగ్‌కట్ చీర రాజ కుటుంబాలతో ముడిపడి ఉంది. ఒకప్పుడు ఈ చీర వధువు కట్నంలో భాగంగా ఉండేది. అమ్మాయిలు రంగ్‌కట్ చీరను పెళ్లిలో ధరించేవారు. రంగ్ కట్ తయారీకి పట్టే సమయం.. రంగ్‌కట్ చీరను తయారు చేయడం అంత సులభం కాదు. వివిధ రంగుల పట్టు దారాలను వార్ప్, వెఫ్ట్‌లో నేయడం ద్వారా దీనిని తయారు చేస్తారు. డిజైన్‌లు ఎల్లప్పుడూ వేర్వేరు కోాలలో ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉంటాయి. నిజమైన బంగారు తీగను అలంకరణ కోసం కూడా ఉపయోగిస్తారు. ఇది ఫాబ్రిక్‌కు మెరిసే,  రాయల్ లుక్ ను   ఇస్తుంది. రంగ్‌కట్ చీర పూర్తి కావడానికి మూడు నెలల నుండి చాలా సంవత్సరాల వరకు పట్టవచ్చు. ఇది డిజైన్‌ను బట్టి ఉంటుంది. నీతా అంబానీ చీర.. నీతా అంబానీ రంగ్‌కట్ చీర వైరల్‌గా మారింది. ఈ 28 చదరపు  రంగ్‌కట్ చీరను మనీష్ మల్హోత్రా రూపొందించారు. దీనిలో పూలు,  మోటిఫ్ వర్క్ ఉన్నాయి. చీరపై బంగారు దారం కూడా అలంకరించబడింది. బనారస్ నుండి ఎంపిక చేసిన నేత కార్మికులు నీతా అంబానీ కోసం ఈ చీరను రూపొందించడానికి ఆరు నెలలు పట్టింది.                       *రూపశ్రీ.

ఇలాంటి దుస్తులతో జాగ్రత్త.. వీటిని ధరిస్తే ఇంకా లావుగా కనిపిస్తారట..!

ఇలాంటి దుస్తులతో జాగ్రత్త.. వీటిని ధరిస్తే ఇంకా లావుగా కనిపిస్తారట..! ఇప్పటి తరం వారు ప్రతి ఒకటి పర్పెక్ట్ గా ఉండాలని కోరుకుంటారు. అది తినే ఆహారం అయినా, ధరించే దుస్తులు అయినా, వేరే ఏ ఇతర విషయం అయినా..  ముఖ్యంగా ఫ్యాషన్ లో భాగంగా.. ప్రధానంగా ఉండేవి  దుస్తులు.  దుస్తులను ఎంచుకోవడంలో అమ్మాయిలు చాలా సమయం గడుపుతారు. అయితే అమ్మాయిలు ఎంచుకునే దుస్తులు వారి అందాన్ని మెరుగుపరుస్తే సంతోషమే.. కానీ వారి ఎంపిక బెడిసి కొడితే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. చాలా మంది కంటికి నచ్చిన దుస్తులను ఎంచుకుంటారు. కానీ అందరూ చేయాల్సింది ఏంటంటే.. కంటికి నచ్చింది సెలెక్ట్ చేసుకోవడం కాదు.. శరీర ఆకృతిని బట్టి దుస్తులను సెలెక్ట్ చేసుకోవాలని అంటున్నారు ఫ్యాషన్ నిపుణులు.  కొన్ని రకాల దుస్తులు వేసుకుంటే ఉన్న దానికంటే ఎక్కువ లావుగా కనిపిస్తారట.  ఆ దుస్తులు ఏంటో.. తెలుసుకుంటే.. చాలా టైట్,  లూజ్.. చాలా బిగుతుగా ఉండే దుస్తులు కొన్ని శరీర భాగాలను హైలైట్ చేస్తాయి, అలాగే  చాలా వదులుగా ఉండే దుస్తులు ఆ శరీరాన్ని ఇంకా ఎక్కువ లావుగా  కనిపించేలా చేస్తాయి. మీడియం-ఫిట్ అవుట్‌ఫిట్ లేదా "పర్ఫెక్ట్ ఫిట్" అనేది మంచి ఎంపిక. ఇది లుక్‌లో బాలెన్సింగ్ ను  కాపాడుతుంది. ఫిట్ గా,  బాలెన్స్డ్ గా.. సరైన కత్తిరింపు, మంచి ఆకృతిలో కుట్టిన దుస్తులు బాగా  ఫిట్ గా ఉన్న దుస్తులు శరీరానికి సరైన ఆకృతిని ఇస్తాయి. సరైన సైజులో ధరించడం వల్ల  చక్కగా, స్మార్ట్‌గా కనిపిస్తారు. నిజానికి వస్త్రధారణ బాగుంటే మనిషిలో ఆత్మవిశ్వాసం కూడా మెరుగ్గా ఉంటుంది. రంగులు.. ముదురుగా ఉన్న రంగులు,  చాలా స్ట్రాంగ్  రంగులు అయిన నేవీ బ్లూ, నలుపు, ముదురు ఆకుపచ్చ లేదా మెరూన్ వంటివి లుక్ పరంగా  శరీరాన్ని బాలెన్స్ చేస్తాయి. ఈ రంగులు చూడటానికి ముచ్చటగా ఉండేలా చేయడంతో పాటు శరీరాన్ని కూడా సన్నగా కనిపించేలా  చేయడంలో సహాయపడతాయి. తేలిక.. కాటన్, రేయాన్, జార్జెట్ లేదా లినెన్ వంటి తేలికైన బట్టలు శరీరంపై భారంగా అనిపించవు. ఈ బట్టలు ధరించడం కూడా సులభంగా ఉంటుంది. లుక్ సహజంగా,  సౌకర్యవంతంగా ఉంటుంది. డిజైన్లు.. నిలువు చారలు లేదా లైనింగ్‌లతో కూడిన దుస్తులు పొడవుగా కనిపించేలా చేస్తాయి. దీని వల్ల శరీరం బాలెన్స్డ్ గా కనిపిస్తుంది. సింపుల్ గా ఉన్న  డిజైన్లు అతిగా హెవీగా ఉండే  ప్రింట్ల కంటే మరింత క్లాసీ లుక్‌ను ఇస్తాయి. ముఖ్యమైన విషయం.. ఫ్యాషన్ లో ఉండే  అతి ముఖ్యమైన నియమం సౌకర్యం,  ఆత్మవిశ్వాసం.  ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చే..  మనుసుకు హాయిని,  సంతోషాన్ని ఇచ్చే  దుస్తులు చాలా మంచి దుస్తులు.  కాబట్టి ఏదైనా బాగుంది అనిపిస్తే  దానిని  సంకోచం లేకుండా ధరించవచ్చు. అయితే ఇతరుల మాటల గురించి,  ఇతర విషయాల గురించి పట్టించుకోకుండా, ఆలోచించకుండా ఉండేలా అయితేనే ఇది సంతోషాన్ని ఇస్తుంది. లేకపోతే మనశ్శాంతి లేకుండా చేస్తుంది.                                  *రూపశ్రీ.

బనారస్ చీరలు.. ఎన్ని తరాలు మారినా చెక్కుచెదరకూడదంటే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే..!

బనారస్ చీరలు.. ఎన్ని తరాలు మారినా చెక్కుచెదరకూడదంటే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే..! భారతదేశం గుర్తింపు ఎక్కువగా వస్త్రధారణ లోనే ఉంటుంది. ముఖ్యంగా మహిళలు కట్టుకునే చీరలు ప్రాంతాల వారీగా ప్రసిద్ధి చెందాయి. పట్టు చీరలు భారతీయ సంప్రదాయాన్ని, సంస్కృతిని ప్రతిబంబిస్తాయి. అలాంటి చీరలలో బనారస్ చీరలు కూడా ప్రముఖమైనవి. మహిళలు తమ వార్డ్ రోబ్ బనారస్ చీరలు ఉండాలని కోరుకుంటారు.  వారణాసిని బనారస్ అని  పిలిచేవారు.  వారణాసిలో తయారయ్యే చేనేత చీరలను బనారస్ చీరలు అంటారు. ఈ చీరలు చాలా విలాసవంతమైనవి.  వీటిని నేయడానికి ఎంతో నాణ్యమైన పట్టు,  బంగారం, వెండి జరీలు ఉపయోగిస్తారు. ఎంతో అందమైన డిజైన్లు బనారస్ చీరలకు మరింత  రాయల్ లుక్ ఇస్తాయి.  అయితే బనారస్ చీరలను కొనడమే కాదు.. వాటిని మెయింటైన్ చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. భారతీయులు చాలా వరకు తమ తల్లి, అమ్మమ్మ, నాన్నమ్మల చీరలను కూడా తమ వార్డ్ రోబ్ లో ఉంచుకుంటారు.  తరాలు మారినా చీరలు చెక్కుచెదరకూడదు అంటే.. బనారస్ చీరల విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పక పాటించాలి. అవేంటో తెలుసుకుంటే.. హ్యాంగ్ చేయద్దు.. చీరలను స్టైల్ గా వార్డ్ రోబ్ లో హ్యాంగర్ కు వేలాడదీయడం చాలా మందికి అలవాటు ఉంటుంది. అయితే బనారస్ చీరలు మాత్రం అలా వేలాడదీయకూడదు. ఇలా చేయడం వల్ల చీర బరువు జరీని సాగదీస్తుంది.  దీని వల్ల ఫాబ్రిక్ చిరిగిపోయేలా చేస్తుంది.  ముఖ్యంగా అంచుల వద్ద చిరిగిపోయే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. బనారస్ చీరలను చదునుగా ఉన్న ప్లేస్ లలో మాత్రమే భద్రపరచాలి.  ఇది జరీకి నష్టం జరగకుండా చీర సాగకుండా జాగ్రత్తగా ఉండేందుకు సహాయపడుతుంది. చీర మడతలు.. సాధారణంగా ఖరీదైన చీరలు చాలా ప్రత్యేక సందర్భాలలో లేదా శుభ కార్యాలలో మాత్రమే కడుతుంటారు.  అందుకే ఈ చీరలను ఒకసారి మడత పెట్టి భద్రపరుస్తే నెలల పాటు అలాగే పెట్టేస్తుంటారు. కొన్నిసార్లు సంవత్సరాల పాటు అలాగే ఉంచుతారు కూడా. అయితే ఈ చీరలను కనీసం మూడు లేదా నాలుగు నెలలకు ఒకసారి బయటకు తీసి వీటిని మడతలు మారుస్తూ ఉండాలి.  ఒకే మడత మీద ఎక్కువ కాలం అలాగే ఉంచితే ఈ చీరలు చిరిగిపోయే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. చీరలు మడత పెట్టేటప్పుడు జాగ్రత్తగా మడతపెట్టాలి. వేగంగా మడత పెడుతూ లోపల  ముడుతలు  ఉండిపోతే అది ఫాబ్రిక్ ను దెబ్బతీస్తుంది. మస్లిన్ క్లాత్.. బనారస్ చీరలు ఎక్కువ కాలం మన్నికగా ఉండాలంటే వాటిని తెల్లని మస్లిన్ క్లాత్ లో చుట్టి భద్రపరచాలి. చీరకు ఉన్న జరీ రంగు నల్లగా కాకుండా ఇది సహాయపడుతుంది. ప్లాస్టిక్ కవర్లలో ఎప్పుడూ చీరలు భద్రపరచకూడదు.  ఇది తేమను లాక్ చేస్తుంది. దీనివల్ల బనారస్ చీరల్లో ఉండే జరీ త్వరగా నల్లగా అవుతుంది. అందుకే చీరను భద్రపరచడానికి కాగితపు సంచులు బెస్ట్ గా ఉంటాయి. అంతేకాదు.. రంగురంగుల బట్టలతో చీరలను చుట్టకూడదు. దీని వల్ల వేరే చీరల రంగు బనారస్ చీరలకు ట్రాన్స్పర్ అయ్యే అవకాశం ఉంటుంది. తేమ.. చీరలను పాడు చేసే వాటిలో తేమ కూడా ఒకటి.  బనారస్ చీరలు పాడుకాకుండా ఉండటానికి వాటిని వెంటిలేషన్ ఉన్న ప్రాంతంలో అలాగే పొడిగా ఉన్న ప్రాంతంలో,  చల్లని వాతావరణం ఉన్న ప్రాంతంలో భద్రపరచాలి.  అంతేకాదు.. చీరలు పెట్టిన ప్రాంతంలో సిలికా జెల్ పౌచ్ లు లేదా బియ్యాన్ని ఒక ప్యాకెట్ లో వేసి దాన్ని ఉంచాలి. ఎండ, ఘాటైన వాసనలు.. చీరను ఎప్పుడూ డైరెక్ట్ సన్ లైట్ కు గురయ్యేలా ఉంచకూడదు. అలాగే పెర్ఫ్యూమ్ లేదా ఘాటైన వాసనలు చీరకు పూయకూడదు. దీని వల్ల రంగు మసకబారుతుంది. కర్పూరం.. చాలామంది చీరలు దుర్వాసన రాకుండా ఉండేందుకు కర్పూరాన్ని చీరలున్న అల్మారలో పెడుతుంటారు. కానీ కర్పూరం ప్యాబ్రిక్ ను దెబ్బతీస్తుంది.  అందుకే కర్పూరాన్ని చీరలకు తాకనివ్వకూడదు. స్టాకింగ్.. చీరలు ఎక్కువగా ఉన్నప్పుడు వాటిని జాగ్రత్తగా మడత పెట్టి ఒకదాని మీద ఒకటి పెడుతుంచారు. దీనివల్ల చీరల ఆకృతి మారిపోతుంది. బరువు కారణంగా చీరల జరీ కుదించి చీర ఆకృతి దెబ్బతింటుంది.                          *రూపశ్రీ.

పార్టీకి వెళ్లే ప్రతి అమ్మాయి బ్యాగ్ లో ఉండాల్సిన మేకప్ వస్తువులు ఇవి!

పార్టీకి వెళ్లే ప్రతి అమ్మాయి బ్యాగ్ లో ఉండాల్సిన మేకప్ వస్తువులు ఇవి..! పార్టీలు నేటికాలంలో చాలా కామన్. పుట్టిన రోజు నుండి చిన్నచిన్న విజయాల వరకు, స్పెషల్ డేస్ ను కూడా వదలకుండా ప్రతి మూమెంట్ ను పార్టీగా ఎంజాయ్ చేస్తారు నేటి తరం.  ఇప్పట్లో పార్టీ అంటే అమ్మాయిలు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు.  పార్టీలకు వెళ్ళాలంటే అమ్మాయిలు చాలా కసరత్తు చేస్తారు. డ్రస్సింగ్ నుండి దానికి ప్రతిదీ మ్యాచింగ్ ఉండేలా చూసుకోవడమే కాకుండా మంచి  మేకప్ వేసుకోవడానికి కూడా ప్రయత్నిస్తారు. అయితే ఇంటి వద్ద మేకప్ వేసుకోవడమే కాకుండా.. పార్టీకి వెళ్లే ప్రతి అమ్మాయి తప్పకుండా 5 మేకప్ వస్తువులను తన వెంట బ్యాగ్ లో తీసుకెళ్లాలని ఫ్యాషన్ నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ 5 మేకప్ వస్తువులు ఏంటో.. అవి ఎందుకు అంత ముఖ్యమూ తెలుసుకుంటే.. కాంపాక్ట్ పౌడర్.. పార్టీలలో డ్యాన్స్ చేయడం,  పరిగెత్తడం వల్ల పదే పదే  చెమట పడుతూ చర్మం జిడ్డుగా మారుతుంది.  దీని వలన  మేకప్ ప్యాచ్ లు గా  కనిపిస్తుంది. కాంపాక్ట్ పౌడర్  వెంట తీసుకెళ్తే అది వెంటనే   ముఖానికి మ్యాట్,  ఫ్రెష్ లుక్ ఇస్తుంది. ఇది  స్కిన్ టోన్‌ను సమం చేస్తుంది.  ఎక్కువ మేకప్ వేయకుండానే  ముఖాన్ని శుభ్రంగా,  దోషరహితంగా కనిపించేలా చేస్తుంది. ఇది T-జోన్ ప్రాంతానికి ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. లిప్ స్టిక్, లిప్ టెంట్.. పార్టీలలో  తినేటప్పుడు లేదా త్రాగేటప్పుడు లిప్‌స్టిక్ చెదిరిపోతూ ఉంటుంది. వీటి వల్ల  పెదాలను అందంగా ఉంచే లిప్‌స్టిక్ ఎక్కువ సేపు ఉండదు.  అందుకే ఎక్కువ సేపు ఉంటూ చెదిరిపోకుండా ఉండే లిప్ స్టిక్ వేసుకోవాలి.  లేదా   హ్యాండ్ బ్యాగ్ లో ఒకమంచి లిప్ స్టిక్ తప్పనిసరిగా ఉండాలి. ఇది  మొత్తం లుక్‌ను అప్పటికప్పుడే  రిఫ్రెష్ చేస్తుంది. ఏ పార్టీ లుక్‌కైనా న్యూడ్ లేదా ఎరుపు రంగు బాగుంటుంది. కాజల్, ఐలైనర్..  మేకప్‌లో కళ్ళు అతి ముఖ్యమైన భాగం.  మస్కారాను పూయడం లేదా  ఐలైనర్‌ను రంగు మార్చడం వల్ల  మొత్తం లుక్ దెబ్బతింటుంది. బ్యాగ్ లో మస్కారా లేదా ఐ లైనర్ లేదా కాజల్ తప్పని సరిగా ఉంచుకోవాలి.  అలా ఉంచుకుంటే  అవి లుక్‌ను మళ్లీ షార్ప్‌గా  ఆకర్షణీయంగా మార్చుకోవడానికి సహాయపడతాయి. బ్లాటింగ్ పేపర్..  ఎక్కువ మేకప్ వేసుకోకూడదనుకుంటే బ్లాటింగ్ పేపర్లు ఒక గొప్ప ఛాయిస్. అవి  ముఖం నుండి అదనపు నూనెను గ్రహిస్తాయి,  మేకప్‌ను పాడుచేయవు. ఇది జిడ్డు చర్మం ఉన్నవారికి మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. సెట్టింగ్ స్ప్రే.. పార్టీ-టైమ్స్ ఎక్కువసేపు ఉంటాయి.  మేకప్ త్వరగా మసకబారుతుంది. మేకప్ సెట్టింగ్ స్ప్రే మేకప్‌ను లాక్ చేసి ఎక్కువసేపు తాజాగా కనిపించేలా చేస్తుంది. ఇది పగుళ్లను నివారిస్తుంది,  సహజమైన మెరుపును ఇస్తుంది. పైన చెప్పుకున్న వస్తువులు పార్టీకి వెళ్లే ప్రతి అమ్మాయి బ్యాగ్ లో తప్పనిసరిగా ఉంచుకుంటే పార్టీ పూర్తయ్యే వరకు మేకప్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా హాయిగా గడిచిపోతుంది.                                 *రూపశ్రీ.

స్కార్ఫ్ ధరించడంలోనూ ఫ్యాషన్ ఉండాలండోయ్.. ఇలా ట్రై చేస్తే అదిరిపోతారు..!

స్కార్ఫ్ ధరించడంలోనూ ఫ్యాషన్ ఉండాలండోయ్.. ఇలా ట్రై చేస్తే అదిరిపోతారు..! స్కార్ఫ్ లు అమ్మాయిల వస్త్రాధారణలో ప్రధానంగా ఉంటాయి. ఇవి అమ్మాయిలను అటు స్టైలిష్ గా కనిపించేలా చేస్తూ మరొక వైపు చలి నుండి రక్షణ ఇస్తాయి. ఇంకా డీప్ గా ఆలోచిస్తే ఆడిపిల్లలకు చున్నీ లాగా స్కార్ఫ్ లు కాస్త సేఫ్టీ కల్పిస్తాయి. ప్రస్తుతం వణికిస్తున్న చలిలో స్కార్ఫ్ తప్పనిసరిగా ధరించాల్సిందే.  ముఖ్యంగా డ్రైవింగ్ లో ఉన్నప్పుడూ లేదా ప్రయాణాల్లో ఉన్నప్పుడూ స్కార్ఫ్ వాడటం తప్పనిసరి.  అయితే దీన్ని సౌకర్యం కోసమే కాకుండా స్ట్రైల్ గా కూడా కనిపించడానికి చాలా రకాలుగా ధరించవచ్చు. చాలా కాజువల్ గా ఉండే డ్రస్సులకు కూడా మంచి లుక్ ను ఇవ్వడంలో స్కార్ఫ్ లు బాగా సహాయపడతాయి. స్కార్ఫ్ లు ధరించడానికి కొన్ని స్టైల్స్ ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే.. క్లాసిక్ డ్రేప్.. ఇది చాలా సులభమైన పద్దతి, అంతే కాదు  ఇది సీజన్ కు తగ్గట్టు కూడా చాలా సౌకర్యంగా ఉంటుంది.  మెడ చుట్టూ స్కార్ఫ్‌ను ఉంచి, రెండు చివరలను ముందు భాగంలో వదులుగా వేలాడదీయాలి. ఈ స్టైల్ ఉన్ని కోట్లు,  బ్లేజర్‌లతో చాలా బాగుంటుంది. ఇది  సౌకర్యాన్నే కాకుండా ట్రెండీగా కనిపించేలా చేస్తుంది. అలాగే చలిలో వెచ్చగా కూడా ఉంచుతుంది. ది స్నగ్ ర్యాప్.. ఈ స్టైల్ ఫాలో అవ్వడానికి మొదట జాకెట్ ధరించి ఉండాలి. స్కార్ఫ్ ని  మెడ చుట్టూ ఒకసారి చుట్టుకుని, చివరలను  జాకెట్ లోపల పెట్టుకోవాలి. ఈ స్టైల్  వెచ్చగా ఉంచుతుంది.  అలాగే  చాలా చక్కగా కనిపిస్తుంది.  ఆఫీసుకి వెళ్లడానికి,  లాంగ్ జర్నీలో ఉన్నప్పుడు ఇది చాలా బాగుంటుంది. పారిసియన్ లూప్.. ఇండియన్  లుక్ కి కాస్త యూరోపియన్ ఫ్లెయిర్ జోడించాలనుకుంటే ఈ స్టైల్ ఫాలో కావచ్చు. స్కార్ఫ్ ని సగానికి మడిచి మెడ చుట్టూ చుట్టుకుని, లూప్ ద్వారా వదులుగా ఉండే చివరలను లూప్ చేయాలి. ఈ స్టైల్ చాలా అందంగా ఉంటుంది.  అలాగే  ఫార్మల్ వింటర్ వేర్ లేదా స్ట్రక్చర్డ్ కోట్స్ తో బాగా సెట్ అవుతుంది. ది ర్యాప్ -అరౌండ్.. ఈ స్టైల్ పెద్దగా  మృదువుగా ఉన్న స్కార్ఫ్‌లకు అనువుగా ఉంటుంది. స్కార్ఫ్‌ను  మెడ చుట్టూ రెండు లేదా మూడు సార్లు లూజ్ గా  చుట్టాలి. వీకెండ్స్ లో లేదా నార్మల్ గా టూర్స్ కు అలా వెళ్లినప్పుడు పెద్ద కోటు లేదా మందపాటి స్వెటర్ ధరించినప్పుడు ఇది బాగా సెట్ అవుతుంది. ది బెల్టెడ్ డ్రేప్.. స్టైలిష్ గా ఉంటూ  "స్ట్రీట్-స్టైల్" లుక్  కావాలి అంటే స్కార్ఫ్‌ను నేరుగా ముందు భాగంలోకి వంచి నడుము వద్ద బెల్ట్‌తో భద్రపరచాలి. ఇది చాలా స్పెషల్  లేయర్డ్ ఎఫెక్ట్‌ను కనిపించేలా చేస్తుంది. ఈ స్టైల్ లాంగ్ కోట్లు,  మంచి  రంగులో ఉన్న దుస్తులతో బాగా  కనిపిస్తుంది. లూజ్ త్రో-ఆన్స్.. క్యాజువల్,  రిలాక్స్డ్ లుక్ కోసం, స్కార్ఫ్‌ను  భుజాలపై శాలువా లాగా కప్పుకోవాలి. ఇది కేఫ్ డేట్‌లకు, రద్దీ లేకుండా ఉండే  ఆఫీస్ డేస్ లో  లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి  సరైనది. ఈ స్టైల్ స్కార్ఫ్  ఆకృతిని  వింటర్ కలర్స్ కు బాగా హైలెట్ చేస్తుంది. టక్డ్-ఇన్ లుక్.. స్కార్ఫ్‌ను  మెడ చుట్టూ ఒకసారి చుట్టి, చివరలను  కోటు లేదా జంపర్ కింద చక్కగా అమర్చాలి. ఇది  రోజంతా చక్కగా చెదిరిపోకుండా ఉండి చాలా కంఫర్ట్ గా ఉంటుంది. ఈ శీతాకాలంలో మంచి ఛాయిస్ అవుతుంది.                                               *రూపశ్రీ.

ఆఫీసులో క్మిస్మస్ పార్టీ.. ఇదిగో సూపర్ ఔట్ ఫిట్ డిటైల్స్..!

ఆఫీసులో క్మిస్మస్ పార్టీ.. ఇదిగో సూపర్ ఔట్ ఫిట్ డిటైల్స్..! ప్రతి సంవత్సరం డిసెంబర్ 25న క్రిస్మస్ జరుపుకుంటారు. ఈ పండుగ కోసం  ఏడాది పొడవునా ఎదురు చూసేవారు ఉన్నారంటే ఆశ్చర్యం లేదు. ముఖ్యంగా కార్పోరేట్ కంపెనీలు విదేశాలకు చెందినవి కావడంతో చాలా కార్పోరేట్ ఆఫీసులలో క్రిస్మస్ సెలబ్రేషన్ చాలా గ్రాండ్ గా జరుగుతుంటుంది.  సీక్రెట్ శాంటా పేరుతో గిఫ్ట్ లు ఇచ్చుకోవడం నుండి కేక్ కటింగ్,  గేమ్స్, పార్టీ.. ఇలా చాలా జరుగుతుంది.   ఈ సందర్భంగా చాలా అందంగా కనిపించాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. ఇంటి దగ్గర పండుగ జరుపుకున్నట్టు కాకుండా ఆపీసులో పార్టీ కావడంతో  అటు అందం చెదరకూడదు, ఇటు హుందాగా కూడా ఉండాలి. ఇలాంటి ఔట్ పిట్ కోసం చాలా ఎదురు చూస్తారు.  సౌకర్యంగా ఉంటూ అందంగా, ఆకర్షణీయంగా అందరి దృష్టిని ఆకర్షించాలంటే కింద చెప్పుకునే ఔట్ ఫిట్ లు ట్రై చేయవచ్చు. అలాగే ఎంచుకునే రంగులు కూడా కీలక పాత్ర పోషిస్తాయి.  ఇంతకీ ఆ ఔట్ ఫిట్ లు ఏంటో తెలుసుకుంటే.. రెడ్-గ్రీన్ షేడ్స్.. క్రిస్మస్ పండుగకు కేటాయించిన  రంగులు ఎరుపు, ఆకుపచ్చ. ఈ రంగుల దుస్తులు, చొక్కాలు లేదా చీరలు ధరించవచ్చు.  క్యాజువల్ పార్టీకి అటెండ్ అవుతుంటే ఎరుపు రంగు స్వెటర్,  డెనిమ్‌తో కూల్‌గా కనిపించవచ్చు.  దుస్తులలో ఎరుపు, ఆకుపచ్చ లేదా తెలుపు రంగులు ఉండేలా చూసుకుంటే పార్టీకి న్యాయం చేసినట్టే. షైనింగ్ దుస్తులు..  పార్టీ కొంచెం గ్లామరస్ గా ఉంటే బంగారు లేదా వెండి గ్లిట్టర్ డ్రెస్  మంచి ఎంపిక అవుతుంది. ఇది పార్టీలో జిగేలు రాణి లాంటి లుక్ ఇస్తుంది. ఈ లుక్  పార్టీకి స్టార్ గా మార్చేస్తుంది. అయితే  ఆఫీసుకి గ్లిట్టర్ డ్రెస్ రెగ్యులర్ గా వేసుకునేవారు పార్టీలో కూడా అదే వేసుకుంటే ప్లాన్ బెడిసికొట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి డైలీ వేర్ లో గ్లిట్టర్ వాడేవారు దీన్ని పార్టీలో అవాయిడ్ చేయాలి. చీర.. క్రిస్మస్ పార్టీకి సాంప్రదాయ లుక్ కావాలంటే ఎరుపు లేదా ఆకుపచ్చ చీర ధరించడం బెస్ట్. భారతీయ సంప్రదాయ దుస్తులలో చీర అగ్రస్థానంలో ఉంటుంది. అలాంటి దుస్తులను క్రిస్మస్ పార్టీకి జోడిస్తే మరింత ప్రత్యేకంగా కనిపిస్తారు. ఆల్-బ్లాక్ లుక్.. సింపుల్ గా గ్రాడ్ లుక్ కావాలి అంటే  మంచి నలుపు రంగు దుస్తులను ఎంచుకోవాలి. నల్లటి దుస్తులతో జత చేసిన రెట్రో-శైలి ఆభరణాలు చాలా  ఆకర్షణీయంగా కనిపిస్తాయి. పూర్తిగా నల్లటి లుక్ చాలా అందంగా, మెస్మరైజ్ చేస్తూ  క్లాసీగా కనిపిస్తుంది. యాక్ససరీస్..  క్రిస్మస్ పార్టీలో దుస్తులతో పాటు లుక్ మొత్తం సూపర్ గా కనిపించడానకి స్టైలిష్ బెల్ట్, నగలు లేదా  ట్రెండీ గా ఉండే   హ్యాండ్‌బ్యాగ్ వంటి కొన్ని మంచి  యాక్ససరిస్ ను  ఎంచుకోండి. వీటిని  ఎంచుకొనేటప్పుడు అవి ఓవర్ గా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే సింపుల్ గా ఉంటూనే సూపర్ గా, పార్టీకి అట్రాక్షన్ గా కనిపిస్తారు.                               *రూపశ్రీ.

చలికాలంలో పార్టీస్.. ఈ డ్రెస్సులతో ధూమ్ ధామ్ లుక్ వచ్చేస్తుంది..!

చలికాలంలో పార్టీస్.. ఈ డ్రెస్సులతో ధూమ్ ధామ్ లుక్ వచ్చేస్తుంది..! వేసవికాలంలో ఎండలు మండినట్టు చలికాలంలో చలి వణికిస్తుంది.  వద్దనుకున్నంత మాత్రాన ఇవన్నీ మాయమైపోవు. వాతావరణానికి తగ్గట్టు మనుషులే మారాలి.  ఆహారం,  వస్త్రధారణ అలవాట్లు మార్చుకోవాలి. అయితే ఇంట్లో ఉన్నప్పుడు ఎలాంటి డ్రస్సులు వేసుకున్నా  చెల్లుతుంది. కానీ పార్టీలు, ఫంక్షన్లకు చాలా అందంగా తయారై వెళ్లాలి. చలి కారణంగా అందంగా, అట్రాక్షన్ గా తయారవ్వడం కాసింత కష్టం అనిపిస్తుంది.  కానీ అమ్మాయిలు ఈ చలికాలంలో అందంగా, ఆకర్షణగా కనిపించడానికి కొన్ని డ్రస్సులు ఉన్నాయి.  వాటిని ధరిస్తే పార్టీలో సెంటరాప్ అట్రాక్షన్ గా ధూమ్ ధామ్ లుక్ లో కనిపిస్తారు. ఆ డ్రస్సులేంటో ఒక లుక్కేస్తే.. కో ఆర్డర్ సెట్.. పార్టీస్ లో అట్రాక్షన్ గా కనిపించడానికి కో ఆర్డర్ సెట్ చాలా బాగుంటుంది.  వెచ్చని క్రాప్ టాప్ తో అటాచ్ చేయాలి. పైన  బ్లేజర్ వేసుకోవడం వల్ల చాలా అట్రాక్షన్ వచ్చేస్తుంది.  క్యాజువల్ అమ్మయి అనే ట్యాగ్ పక్కన పెట్టి లేడీ బాస్ టైప్ ట్యాగ్ ఇచ్చేస్తారు.  ఈ డ్రెస్ వేసుకున్నప్పుడు పోనీ టైల్ వేస్తే ఇంకా అధిరిపోతుంది. లాంగ్ స్టైల్.. లేయరింగ్ ఇష్టపడే అమ్మాయిలు లాంగ్ డ్రెస్ లను నల్లటి స్కివ్వీస్ తో జత చేసి వేసుకోవచ్చు.  ఈ డ్రెస్ లో హీల్స్ ధరిస్తే క్లాసీ లుక్ వచ్చేస్తుంది.  దీనికి ఐ మేకప్ మరింత అట్రాక్షన్ తెస్తుంది. హెయిర్ ను అలా లూస్ గా వదిలేస్తే అదిరిపోతుంది. బాడీకాన్ తో భలే.. రంగు ఏదైనా సరే.. బాడీకాన్ డ్రెస్ లు చాలా బాగుంటాయి. అమ్మాయిలకు ఈ డ్రెస్ ఇచ్చే ఆకర్షణ అంతా ఇంతా కాదు. ఇలాంటి డ్రెస్ కు ఫ్లీస్ లెగ్గింగ్స్ జతచేయాలి. డ్రెస్ పైన స్టూల్ లేదా బ్లేజర్ ధరిస్తే కంప్లీట్ లుక్ సొంతమైనట్టే.  ఇది పార్టీకి బిగ్గెస్ట్ అట్రాక్షన్ అవుతుంది.  నార్మల్ లుక్ ను కూడా చాలా బాగా మెరుగుపరుస్తుంది. కంఫర్ట్ లుక్.. దుస్తులను వివిధ రకాలుగా ధరించడం వల్ల లుక్ అయితే బాగుంటుంది కానీ కొన్ని సార్లు అవి అసౌకర్యాన్ని కలిగిస్తుంటాయి. అలా కాకుండా కంఫర్ట్ గా ఉంటూ పార్టీస్ కు అటెండ్ అయ్యి  అట్రాక్షన్ గా నిలవాలంటే ఒక మంచి టాప్,  దానితో ఫిట్టెడ్ జీన్స్ ధరించాలి.  టాప్ పైన మంచి జాకెట్ ఒకటి ధరించాలి.  హెయిర్ ను లూస్ గా వదిలేసి తలకు  ఒక మంచి క్యాప్ ధరించాలి. ఈ డ్రెస్ కు హై లెంగ్త్ బూట్ లు వేసుకుంటే భలే కనిపిస్తారు.   ]పైన చెప్పుకున్నవే కాకుండా దుస్తుల పట్ల మంచి అభిరుచి ఉన్నవారు తమ దగ్గరున్న దుస్తులనే కాంబినేషన్ మారుస్తూ మంచి ఔట్ ఫిట్ ను రెఢీ చేసుకోవచ్చు. కొత్త ఫ్యాషన్ ను క్రియేట్ చేయవచ్చు.    *రూపశ్రీ. 

న్యూ ఇయర్, క్రిస్టమస్ హడావిడిలో మిమ్మల్ని తళుక్కున మెరిపించే చిట్కాలు..!

న్యూ ఇయర్, క్రిస్టమస్ హడావిడిలో మిమ్మల్ని తళుక్కున మెరిపించే చిట్కాలు..!   డిసెంబర్ నెలను పార్టీ సీజన్ అని చెప్పవచ్చు.  ఒకవైపు క్రిస్మస్ వేడకలు,  మరొకవైపు న్యూ ఇయర్ వేడుకలు.. ఈ పార్టీ సీజన్ దగ్గరకు వచ్చే కొద్దీ ప్రతి అమ్మాయి ప్రతి చోట చాలా ఆకర్షణీయంగా, అందంగా కనిపించాలని కోరుకుంటుంది.  అది ఫ్రెండ్  పార్టీ అయినా, ఆఫీస్ పార్టీ అయినా, లేదా ఫ్యామిలీ మీట్ అయినా ప్రతి ఒక్కరూ తమ ఎంట్రీ  స్టైలిష్‌గా,  రాయల్ గా  కనిపించాలని కోరుకుంటారు. అయితే వీటికి అటెండ్ అవ్వడానికి  ఖరీదైన మేకప్ ఉత్పత్తులు, బ్యూటీ ట్రీట్మెంట్ ఉండాలని  అనుకుంటూ ఉంటారు.  కానీ నిజమేంటంటే అలాంటివి అవసరం లేదు. స్మార్ట్ స్కిన్ కేర్, సరైన మేకప్ చిట్కాలు,  గ్లో ట్రిక్స్‌తో.. ఇంట్లోనే పర్పెక్ట్ పార్టీ లుక్స్ ను మీ సొంతం చేసుకోవచ్చు. ఇందుకోసం ఏం చేయాలో తెలుసుకుంటే.. అందాన్ని పెంచే సులభమైన గ్లో చిట్కాలు.. పార్టీకి ముందు..   ఏదైనా మేకప్‌కి బలమైన బేస్ అవసరం.  ఇందుకోసం  చర్మం ప్రిపేర్ కాకపోతే,  మేకప్ ఎంత బాగున్నప్పటికీ, అది అంత బాగా కనిపించదు. పార్టీకి ముందు  చర్మాన్ని పూర్తిగా శుభ్రం చేసుకోవాలి. చర్మ రంధ్రాలను క్లియర్ చేయడానికి,   చర్మాన్ని మృదువుగా చేయడానికి టోనర్‌ను అప్లై చేయాలి. దీని తర్వాత తేలికపాటి మాయిశ్చరైజర్‌ను వాడాలి. ఇది  చర్మాన్ని హైడ్రేట్ చేయడమే కాకుండా మేకప్ ఎక్కువసేపు ఉండటానికి కూడా సహాయపడుతుంది. బేస్ మేకప్..  బేస్ మేకప్‌లో ఫస్ట్ స్టెప్ ప్రైమర్ అప్లై చేయడం. ప్రైమర్  ఫౌండేషన్ సజావుగా కలపడానికి, క్రాక్స్   నివారించడానికి సహాయపడుతుంది. చర్మపు రంగుకు సరిపోయే ఫౌండేషన్‌ను ఎంచుకుని, దానిని పూర్తిగా బ్లెండ్ చేయాలి.  నల్లటి మచ్చలు లేదా పిగ్మెంటేషన్ ఉంటే వాటిని తేలికపాటి కన్సీలర్‌తో కప్పాలి. ఇది  ముఖాన్ని తాజాగా,  కంప్లీట్ గా  కనిపించేలా చేస్తుంది. ఐ మేకప్.. పార్టీ లుక్ కోసం ఐ మేకప్ చాలా ముఖ్యం.  కళ్ళకు మెరుపు,  కళ్ల సైజ్, కళ్లు అట్రాక్షన్ గా కనిపించడానికి  ఐషాడోను ఉపయోగించవచ్చు.  ఐలైనర్ అంచులుగా ఉండేలా చేసి,  హెవీ మస్కారాను అప్లై చేయడం  ద్వారా  కంటి మేకప్‌కు గ్లామర్‌ను జోడించవచ్చు. కావాలనుకుంటే లుక్‌ను డ్రామాటిక్ గా,  పార్టీకి తగ్గట్టు మరింత హైలెట్ చేయడానికి   ఐ లాషెస్ కూడా పెట్టుకోవచ్చు. మెరిసే లుక్ కోసం.. చర్మం సహజంగా,  తాజాగా మెరిసిపోవాలంటే హైలైటర్, బ్లష్,  డ్యూయ్ ఫినిష్ సెట్టింగ్ స్ప్రే చాలా ముఖ్యం.  చెంప ఎముకలు, ముక్కు,  గడ్డంపై తేలికపాటి హైలైటర్‌ను అప్లై చేయాలి. ఇది  ముఖాన్ని మెరిసేలా చేయడమే కాకుండా పార్టీ లైట్లలో షైనింగ్ ఇస్తుంది.  లుక్‌ను తాజాగా,  యవ్వనంగా ఉంచడానికి  బ్లష్‌ను లైట్ గా, నాచురల్ గా   ఉంచాలి.  మేకప్ ఎక్కువ సేపు ఉండాలంటే.. మేకప్ వేసుకున్న తర్వాత సెట్టింగ్ స్ప్రే వేయడం చాలా అవసరం. ఇది  లుక్‌ను తాజాగా ఉంచుతుంది,  అలాగే తొందరగా చెదిరిపోకుండా  ప్రొటెక్ట్ చేస్తుంది.  పార్టీ సమయంలో  ముఖాన్ని పదే పదే తాకకుండా ఉండటం చాలా ముఖ్యం.  ఇది  మేకప్‌ ఎక్కువసేపు  చెదిరిపోకుండా ఉండటంలో సహాయపడుతుంది.                            *రూపశ్రీ.

శీతాకాలంలో కూడా స్ట్రైలిష్ గా కనిపించాలంటే.. ఈ టిప్స్ ట్రై చేయండి..!

శీతాకాలంలో కూడా స్ట్రైలిష్ గా కనిపించాలంటే.. ఈ టిప్స్ ట్రై చేయండి..! చలికాలం వచ్చేసింది.  చలి అనగానే అమ్మాయిలు చర్మం గురించి చాలా భయపడతారు. ఒకవైపు చర్మాన్ని సంరక్షించుకుంటూనే మరొకవైపు స్టైలిష్ గా కూడా  కనిపించాలని అనుకుంటారు.  మరీ ముఖ్యంగా కాలేజ్,  ఆఫీస్ లకు వెళ్లే అమ్మాయిలు, మహిళలు, వ్యాపారం చేసే మహిళలు చాలా అందంగా కనిపించడం కూడా చాలా ముఖ్యం.  ఈ శీతాకాలంలో అటు చర్మాన్ని కాపాడుకుంటూ  ఇటు ఫ్యాషన్ గా, స్టైల్ గా కనిపించాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. అవేంటో తెలుసుకుంటే.. స్మార్ట్ లేయరింగ్.. శీతాకాలంలో స్టైలిష్ గా కనిపించడానికి మంచి మార్గం స్మార్ట్ లేయరింగ్. బాగా మందంగా ఉన్న దుస్తులకు బదులుగా తేలికైన, ఫిట్టెడ్ లేయర్‌లను ఎంచుకోవాలి. కింద చొక్కా లేదా టర్టిల్‌నెక్ ధరించి, దానిపై బ్లేజర్ లేదా లాంగ్ కోటు వేసుకోవాలి. ఇది  సూపర్ లుక్ క్రియేట్ చేస్తుంది. అలాగే  శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది.   రంగులు.. ఆఫీసులో ప్రొఫెషనల్ లుక్  కంటిన్యూ కావాలంటే లేత గోధుమరంగు, బూడిద రంగు, గోధుమ రంగు,  నలుపు వంటి  టోన్‌లను ఎంచుకోవాలి. ఈ రంగులు హైలేట్ గా  కనిపించడమే కాకుండా ఇతర ఏ కాంబినేషన్  రంగుకైనా సులభంగా సరిపోతాయి. ముఖ్యంగా  బ్లేజర్ కొంటుంటే పైన చెప్పుకున్న రంగులను ఎంచుకోవడం మేలు. స్కార్ఫ్ లు,  శాలువాలు.. స్కార్ఫ్‌లు,  శాలువాలు శీతాకాలంలో వెచ్చగా ఉండటానికి మాత్రమే కాదు..  మొత్తం లుక్‌కి సెంటరాఫ్ అట్రాక్షన్ గా కూడా ఉంటాయి.   దుస్తులకు స్టైల్ జోడించడానికి సిల్క్ లేదా ఉన్ని ఫాబ్రిక్‌తో ప్రింటెడ్ స్కార్ఫ్‌ను ఎంచుకోవాలి. శాలువాను మంచి ఫ్యాషన్ స్టైల్స్ లో ధరించడం వల్ల  మార్గాల్లో  ఫ్యాషన్ సెన్స్ పెరుగుతుంది. క్లాసిక్ పుట్ వేర్.. ఆఫీసు లుక్‌లో ఫుట్‌వేర్ ఒక ముఖ్యమైన భాగం. శీతాకాలంలో లెదర్ బూట్లు, లోఫర్‌లు లేదా క్లోజ్డ్ హీల్స్ స్టైలిష్‌గా ఉండటమే కాకుండా ట్రెండీగా  కూడా ఉంటాయి. నలుపు లేదా లేత గోధుమ రంగు ఫుట్‌వేర్ ప్రతి దుస్తులకు సరిపోతుంది.  లుక్‌ కంప్లీట్ గా సూపర్ గా కనిపించడానికి బూట్లు శుభ్రంగా,  పాలిష్ చేసుకుని ధరిస్తే సూపర్ గా కంప్లీట్ లుక్ సొంతమవుతుంది. మేకప్, జ్యువెలరీ.. ఆఫీసులో భారీ మేకప్ లేదా అతిగా జ్యువెలరీ  వేసుకోకూడదు. అతిగా వెళ్లే బదులు లైట్ గా  ఫౌండేషన్, న్యూడ్ లిప్‌స్టిక్,  కొద్దిగా మస్కారా సరిపోతుంది. జ్యువెలరీ అయితే  చిన్న స్టడ్‌లు, వాచ్ లేదా సన్నని గొలుసును ఎంచుకోవాలి. ఇది  లుక్‌ను ప్రొఫెషనల్‌గా,  అట్రాక్షన్ గా  ఉంచుతుంది.                                  *రూపశ్రీ.

ఎలాంటి పరికరాలు వాడకుండా రింగుల జుట్టు కావాలా...ఇదిగో ఇలా చేయండి..!

ఎలాంటి పరికరాలు వాడకుండా రింగుల జుట్టు కావాలా...ఇదిగో ఇలా చేయండి..!   హెయిర్ స్టైల్స్ అంటే అమ్మాయిలకు చాలా క్రేజీ.. ఒక్కో శుభకార్యానికి ఒకో విధమైన హెయిర్ స్టైల్ లో,  డ్రస్సింగ్ ను బట్టి హెయిర్ స్టైల్స్ మారుస్తూ చాలా అట్రాక్షన్ గా కనపడాలి అనుకుంటారు.  ముఖ్యంగా కర్లింగ్ హెయిర్ కు చాలా డిమాండ్ ఉంది.  చాలామంది కర్లింగ్ హెయిర్ కోసం మార్కెట్ లో లభించే హెయిర్ స్ట్రైయిటర్,  హెయిర్ కర్లర్ వాడుతూ ఉంటారు.  ఇవి వేడి కారణంగా జుట్టును స్ట్రైయిట్ గా చేయడం లేదా జుట్టును రింగురింగులుగా మార్చడం చేస్తాయి. అయితే ఈ పరికరాలతో పని లేకుండా సాధారణంగానే హెయిర్ కర్లింగ్ చేసుకోవడం ఎలాగో తెలుసుకుంటే.. షాంపూ తర్వాత.. షాంపూతో తలస్నానం చేసిన తర్వాత జుట్టును కంప్లీట్ గా ఆరబెట్టకూడదు.  లైట్ గా ఆరబెట్టిన తర్వాత జుట్టుకు డ్యామేజ్ కాకుండా మెల్లిగా దువ్వాలి.  చిక్కులు లేకుండా జుట్టును దువ్విన తర్వాత చెవుల కింద నుండి మొదలు పెట్టి జుట్టును పాయలు తీసుకుంటూ తల చుట్టూ గట్టిగా చుట్టాలి. రోలర్స్ వాడటం.. రోలర్స్ ఉపయోగించి జుట్టును కర్ల్ చేయవచ్చు.  కొద్దిగా తడిగా ఉన్న జుట్టుకు లీవ్ ఇన్ కండిషనర్,  మూస్ ను అప్లై చేయాలి.  జుట్టును పెద్ద భాగాలుగా డివైడ్ చేసి వాటిపై వెల్క్రో రోలర్లను ఉంచాలి.  ఇవి జుట్టును కర్ల్ చేయడంలో సహాయపడతాయి. రబ్బర్ బ్యాండ్స్ తో.. తలస్నానం తర్వాత కొద్దిగా తడిగా ఉన్న జుట్టును చిక్కులు తీసి పోనీ టైల్ కట్టాలి.  పోనీ టైల్ పొడవునా మృదువైన హెయిర్ టైలు లేదా రబ్బరు బ్యాండ్ లను ఉంచాలి.  జుట్టు పూర్తీగా ఆరగానే జుట్టు కర్ల్స్ చూడొచ్చు.                                                 *రూపశ్రీ.

గోళ్లు అందంగా...పొడవుగా పెరగాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!

గోళ్లు అందంగా...పొడవుగా పెరగాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి! అందమైన వేళ్లు..వాటికి పొడవాటి గోళ్లు పెంచుకోవడం ప్రతి అమ్మాయి కల. వాటిని అందంగా కనిపించేలా నెయిల్ పాలిష్ లతో, నెయిల్ ఆర్ట్ వేసి...ఇంకా ఆకర్షణీయంగా రెడీ చేస్తారు. గోళ్లను పొడవుగా అందంగా పెంచండం ఒకరోజుల్లో అయ్యేది కాదు. వాటికోసం అతివలు..నెలల తరబడి శ్రమిస్తుంటారు. విరగకుండా జాగ్రత్త వహిస్తుంటారు. అయినా కూడా కాస్త పొడవు పెరిగిన తర్వాత విరిగిపోతుంటాయి. ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి. స్టైలీష్ హెయిర్‌ కట్, గ్లోయింగ్ స్కిన్‌, ఎట్రాక్ట్ చేసే గోళ్లతో ఇలా అందంగా కనిపించాలని చాలా మంది అమ్మాయిలు కోరుకుంటారు.  జుట్టు సంరక్షణ, స్కిన్‌ కేర్ వీటి గురించి పక్కన పెడితే.. గోళ్లు పెంచడం అంత సులభం కాదు.  మనం రోజులో 90 శాతం పనులు చేతితోనే చేస్తుంటాం. ఈ సమయంలో గోళ్లు విరిగిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. మరి అమ్మయిలకు అందమైన పొడవాటి గోళ్ల కల నెలవేరడం ఎలా?గోళ్లు పెంచడం గొప్ప విషయమేమీ కాదనుకోండి. కానీ కొన్ని టిప్స్ ఫాలో అయితే అందమైన గోళ్లు పెంచడం చాలా సులభం. ఈ టిప్స్ ఫాలో అయితే...అందంగా, బలంగా మారుతాయి. ఉప్పునీరు: గోర్లు పెరగడానికి ఉప్పునీరు వాడటం గురించి వినే ఉంటారు. అయితే ఇది ఎంత వరకు నిజమో తెలియదు. ఉప్పు నీరు నేరుగా గోళ్ల పెరుగుదలను ప్రోత్సహించదు కానీ అది మీ గోళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కాబట్టి మీ గోళ్ల పెరుగుదలకు ఇది మంచిదని వైద్యనిపుణులు అంటున్నారు. ఉప్పు మీ గోళ్ల ఆరోగ్యానికి దోహదపడుతుంది, తద్వారా మీ గోర్లు నిరంతరం పెరగడానికి సహాయపడుతుంది. ఒక గోరు నెలలో ఎన్ని అంగుళాలు పెరుగుతుంది? వేలుగోళ్లు నెలకు 0.14 అంగుళాలు, కాలిగోళ్లు 0.063 అంగుళాలు పెరుగుతాయి. వేలుగోళ్లు పూర్తిగా తిరిగి పెరగడానికి 3 నుండి 6 నెలల సమయం పడుతుంది, అయితే గోళ్ళకు 12 నుండి 18 నెలల సమయం పడుతుంది. గోరు పెరుగుదల ఆహారం, ఆరోగ్య స్థితిపై ఆధారపడి ఉంటుంది. వయస్సు, లింగం, జన్యుపరమైన అంశాలు ఇందులో పాత్ర పోషిస్తాయి. గోళ్లపై పసుపు రంగును ఎలా తొలగించాలి? మీ గోళ్ళపై మరకలను వదిలించుకోవడానికి మీరు బేకింగ్ సోడా, నిమ్మరసంతో ఉప్పు నీటిని ఉపయోగించవచ్చు. ఒక గిన్నెలో 1.5 కప్పుల వెచ్చని నీరు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా , 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం కలపండి. కొద్దిగా పేస్ట్ చేసి, మిశ్రమాన్ని మీ గోళ్లపై అప్లై చేసి, 10 నిమిషాల తర్వాత మృదువైన బ్రష్‌తో మీ గోళ్లను సున్నితంగా స్క్రబ్ చేయండి.  మీ చేతులు, గోళ్లను నీటితో శుభ్రం చేసుకోండి.

పండుగల సమయంలో మీరు ప్రత్యేకంగా కనిపించాలంటే.. ఈ 5 రకాల దుస్తులు సిద్దం చేసుకుంటే సరి..!

పండుగల సమయంలో మీరు ప్రత్యేకంగా కనిపించాలంటే.. ఈ 5 రకాల దుస్తులు సిద్దం చేసుకుంటే సరి..! పండుగ సీజన్ సమీపిస్తున్న కొద్దీ అమ్మాయిలు అయినా.. కాస్త పెద్ద వయసు వారైనా సరే..  తాము సాధారణ రోజుల కంటే స్పెషల్ గా కనిపించాలని అనుకుంటారు. ఇంట్లో అయినా లేదా ఆఫీసులు లేదా కాలేజీలు.. ఇలా ఎక్కడైనా సరే..   ప్రత్యేకంగా,  స్టైలిష్‌గా ఉండాలని అనుకుంటారు. సాంప్రదాయ లుక్స్ ఎప్పుడూ ట్రెండ్‌లో ఉంటాయి. కానీ  ప్రతి సారి ఒకే విదంగా కాకుండా సంప్రదాయంలో కూడా మరికాస్త భిన్నంగా ఉండాలని కోరుకునే వారు ఉంటారు. అలాంటి వారు తప్పనిసరిగా ఈ కింద చెప్పుకునే దుస్తులను ట్రై చేయవచ్చు.  ఎలాగో నవరాత్రులు ప్రారంభం అయ్యాయి.  నవరాత్రులతో పాటు మళ్లీ దీపావళి హడావిడి కూడా ఉంటుంది. ప్రతి సంవత్సరం ఒకే రకమైన సూట్, చీర లేదా లెహంగా ధరించే బదులు, ఈసారి  కొన్ని కొత్త ట్రెండ్‌లను ఫాలో అవ్వడం ద్వారా  లుక్‌ను పూర్తిగా రాయల్‌గా,  ప్రత్యేకంగా మార్చుకోవచ్చు. ఎలాగంటే.. చీరల్లో విభిన్నత.. చీర కట్టుకోవడం  బోరింగ్ గా లేకపోతే, దానిని రెగ్యులర్ బ్లౌజ్ కు బదులుగా క్రాప్ టాప్ లేదా కార్సెట్ స్టైల్ బ్లౌజ్ తో జత చేయవచ్చు. ఈ స్టైల్ ఈ రోజుల్లో బాలీవుడ్ సెలబ్రిటీలలో కూడా బాగా ప్రాచుర్యం పొందింది. ఈ రకమైన దుస్తులు రాత్రి వేడుకలకు, ముఖ్యంగా  దీపావళి,   డిన్నర్  పార్టీలకు అనుకూలంగా ఉంటాయి. ధోతీ స్టైల్ చీర.. ఇది చాలా అందంగా కనిపిస్తుంది.  చీరను  ప్రత్యేకమైన స్టైల్ లో ధరించడం కోసం చూస్తున్నట్లయితే, ఇలాంటి ధోతీ-శైలి చీర మంచి ఎంపిక అవుతుంది. దీన్ని బెల్ట్ లేదా జాకెట్‌తో జత చేయడం వల్ల లుక్ మరింత పెరుగుతుంది. నవమి నుండి దీపావళి పార్టీలు, కుటుంబ ఫంక్షన్ల వరకు దేనికైనా ధోతీ-శైలి చీరను ధరించవచ్చు. హై హీల్స్,  స్టేట్‌మెంట్ చెవిపోగులతో దీన్ని ధరించవచ్చు. ఫ్యూజన్ లెహెంగా  లెహంగా ధరించడంలో ఏదైనా విసుగు ఉంటే.. దాన్ని సాంప్రదాయకమైన దానికి బదులుగా లాంగ్ ష్రగ్ లేదా ఇండో-వెస్ట్రన్ జాకెట్‌తో జత చేస్తే సూపర్ ఉంటుంది. ఇది ఒక ప్రత్యేకమైన  రాయల్ లుక్‌ను సృష్టిస్తుంది. ఈ రకమైన ఫ్యూజన్ లెహంగాను దుర్గా పూజ  లేదా రాత్రి పూజకు  ధరించవచ్చు.  జాకెట్ లేదా ష్రగ్ కోసం కాంట్రాస్టింగ్ రంగును ఎంచుకుని, దానికి సరిపోయే జ్యువెలరీ ధరిస్తే మరింత అధిరిపోతుంది. షరారా.. షరారా సూట్లు సర్వసాధారణం. కానీ వాటిని నెట్ లేదా సిల్క్ కేప్‌తో జత చేయడం వల్ల లుక్  ట్రెండీగా ఉంటుంది. కుర్తా ధరించడానికి బదులుగా  దానిని క్రాప్ టాప్‌తో జత చేయాలి. ఈ ఇండో-వెస్ట్రన్ లుక్ యూత్ చేసుకునే సెలబ్రేషన్స్ లో  అద్భుతంగా కనిపిస్తుంది. బ్లేజర్ తో ధోతీ.. ఈ లుక్ బాస్ లేడీ వైబ్ ని ఇస్తుంది. కాబట్టి ఈ స్టైల్ దుస్తులను కూడా ఎంచుకోవచ్చు. దీని కోసం, స్కర్ట్ లేదా రెడీమేడ్ ధోతీని బ్లేజర్ తో జత చేయాలి. ఈ దుస్తులు ఆఫీసు పూజలు, ఇంటి పూజలకు అద్భుతంగా కనిపిస్తాయి. స్టిలెట్టోస్,  వెండి ఆభరణాలతో లుక్ ఇంకా బాగుంటుంది.                            *రూపశ్రీ.