అబ్దుల్ కలాం అయినా ఓ అమ్మ కొడుకే

  అబ్దుల్ కలాం అయినా ఓ అమ్మ కొడుకే   అబ్దుల్ క‌లామ్ జీవిత చ‌రిత్ర‌ను త‌ర‌చి చూస్తే, త‌ల్లి ఆషియ‌మ్మ‌తో ఆయ‌న‌కు ఉన్న అనుబంధానికి క‌ళ్లు చెమ్మ‌గిల్లుతాయి. త‌న ఆత్మ‌క‌థ ప్రారంభంలోనే, త‌ల్లిని పాఠ‌కుల‌కు ప‌రిచ‌యం చేస్తారు క‌లాం. పేద‌రికంలో మ‌గ్గుతున్న‌ప్ప‌టికీ, త‌న త‌ల్లి ఇంటికి వ‌చ్చిన అతిథుల భోజ‌న మ‌ర్యాద‌ల‌కి ఏమాత్రం లోటురాకుండే చూసేద‌ని చెబుతారు. బ‌హ‌దూర్ అనే గొప్ప బిరుదు సాధించిన వంశంలోంచి త‌న త‌ల్లి వ‌చ్చింద‌ని ఒకింత గ‌ర్వ‌ప‌డ‌తారు. త‌న తండ్రి నుంచి క్ర‌మ‌శిక్ష‌ణ‌, నిబ‌ద్ధ‌త నేర్చుకున్న‌ప్ప‌టికీ... మంచిత‌నం, జాలి, క‌రుణ లాంటి స‌ద్గుణాలు త‌న త‌ల్లి నుంచే అల‌వడ్డాయంటారు. ఆమె నోటి నుంచి మ‌హ‌మ్మ‌ద్ ప్ర‌వ‌క్తకి చెందిన క‌థ‌ల‌తో పాటు రాముని వీర‌గాథ‌లు విన్న క‌లాం ప‌ర‌మ‌త స‌హ‌నాన్ని అల‌వ‌ర్చుకున్నారు.  ఆమె చెప్పిన క‌థ‌ల్లోని తాత్విక‌తా, విచ‌క్ష‌ణ‌లు జీవితంలో ఎన్నో స‌మ‌స్య‌ల‌ను నిబ్బ‌రంగా ప‌రిష్క‌రించేందుకు తోడ్ప‌డ్డాయి. ఆ రోజుల్లో రెండో ప్ర‌పంచ యుద్ధం జ‌రుగుతోంది. మ‌రోప‌క్క క‌లాం ఇంట్లోని ఆర్థిక ప‌రిస్థ‌తులు బాగోలేవు... అయినా హైస్కూల్‌ చ‌దువుల కోసం రామ‌నాధ‌పురానికి చేరుకున్నాడు క‌లాం. చ‌దువుకోవాల‌ని మ‌న‌సులో ఎంతగా త‌ప‌న ఉన్నా... త‌న త‌ల్లినీ, ఆమె చేతి వంట‌నూ మ‌ర్చిపోలేక‌పోయేవాడు. ఎప్ప‌డు వీలు చిక్కుతుందా, ఎప్పుడు అమ్మ ఒడిలో వాలిపోయి ఆమె చేసే పిండివంట‌లు తిందామా అని ఉబ‌లాటప‌డిపోయేవాడ‌ట! క‌లాం తుంబా (కేర‌ళ‌)లో శాస్త్ర‌వేత్త‌గా విజ‌యాల సాధిస్తుండ‌గా ఆయ‌న తండ్రి చ‌నిపోయారు. అయినా క‌లాంతోపాటు తుంబాకు వెళ్ల‌కుండా, త‌న చివ‌రి శ్వాస వ‌ర‌కు రామేశ్వ‌రంలోనే ఉండేందుకు నిశ్చ‌యించుకున్నారు ఆషియ‌మ్మ‌. అన్న‌ట్లుగానే మ‌రికొద్ది రోజుల‌కి ఆమె చ‌నిపోయారు. ఆ విష‌యం తెలిసి ప‌రుగులెత్తుకుంటూ రామేశ్వ‌రాన్ని చేరుకున్నారు క‌లాం. త‌న తల్లి ఎడ‌బాటు క‌లాంకు భ‌రింప‌రానిద‌య్యింది. ఆ బాధ‌ని మ‌ర్చిపోయేందుకు, మ‌ర్నాడు మ‌సీదుకి వెళ్లారు. అక్క‌డ త‌న త‌ల్లితండ్రుల‌ గురించి ఆ భ‌గ‌వంతుని ప్రార్థిస్తుండ‌గా... `నేను వారికి నియ‌మించిన బాధ్య‌త‌ల‌ను వారు ఎంతో శ్ర‌ద్ధ‌తో, నిజాయితీతో, నిబ‌ద్ధ‌త‌తోనూ నిర్వ‌ర్తించి తిరిగి న‌న్ను చేరుకున్నారు. వాళ్లు ఇంత అద్భుత‌మైన విజ‌యాన్ని సాధించిన ఈ సంద‌ర్భంలో నువ్వు బాధ‌ప‌డుతున్నావెందుక‌ని?  నీ ముందున్న బాధ్య‌త‌ల‌ను చ‌క్క‌గా నిర్వ‌ర్తించి నా మ‌హిమ‌ను లోకానికి తెలియ‌చేయి` అన్న మాట‌లు వినిపించాయంటారు క‌లాం. వినిపించిన మాట‌లు భ్ర‌మ కావ‌చ్చునేమో కానీ వాటిలో వాస్త‌వం లేక‌పోలేదు క‌దా! త‌ల్లి ప్ర‌భావం క‌లాం మీద గాఢంగానే ఉన్న‌ట్లు తోస్తుంది. 2013లో హైద‌రాబాదులో చేసిన దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ స్మార‌క ఉప‌న్యాసంలో `స్త్రీలు సాధికార‌త‌ని సాధించిన‌ప్ప‌డు కుటుంబ‌మూ, స‌మాజ‌మూ, దేశ‌మూ అభివృద్ధి చెందుతాయి. స్త్రీ సంతోషంగా ఉంటేనే, కుటుంబం సంతోషంగా ఉంటుంది. కుటుంబం సంతోషంగా ఉంటేనే స‌మాజ‌మూ, స‌మాజం సంతోషంగా ఉంటే రాష్ట్ర‌మూ, రాష్ట్రం సంతోషంగా ఉంటే దేశ‌మూ సుభిక్షంగా ఉంటుంది.`అని చెప్పారు. రాష్ట్ర‌ప‌తిగా ఉన్న కాలంలో కూడా క‌లాం, స్త్రీల‌కు సంబంధించి ఓ సాహ‌సోపేత‌మైన నిర్ణ‌యాన్ని తీసుకున్నారు. బెంగాల్‌కు చెందిన ధ‌నుంజ‌య్ ఛ‌టర్జీ అనే వ్య‌క్తి ఒక ఆడ‌పిల్ల‌ని అత్యాచారం చేసి చంపేశాడు. ఆ కేసులో అత‌నికి ఉన్న‌త న్యాయ‌స్థానం ఉరిశిక్ష‌ను ఖ‌రారు చేసింది. త‌న‌కు క్ష‌మాభిక్ష‌ను ప్ర‌సాదించ‌మ‌ని ధ‌నుంజ‌య్, క‌లాంను వేడుకున్నారు. సున్నిత మ‌న‌స్కుడైన క‌లాం, ఆ శిక్ష‌ను ర‌ద్దు చేస్తార‌నుకున్నారంతా! క‌నీసం ఆ ఉత్త‌ర్వును తాత్కాలికంగా నిలుపుద‌ల చేస్తార‌నుకున్నారు. కానీ ఆయ‌న నిర్ద్వంద్వంగా ఆ క్ష‌మాభిక్ష‌ను తిర‌స్క‌రించారు. ఎన్నో ఏళ్ల క్రిత‌మే త‌న త‌ల్లికి దూర‌మైన‌ప్ప‌టికీ, ఆమె అనురాగానికి దూరం కాలేదు క‌లాం. త‌న‌కు ప‌ద్మ‌భూష‌న్ వ‌చ్చింద‌న్న వార్త తెలియ‌గానే, త‌న గ‌దిని బిస్మిల్లాఖాన్ సంగీతంతో నింపివేశారు. ఆ సంగీతం త‌న‌ని వేరే లోకానికి తీసుకువెళ్లింద‌ని చెబుతారు క‌లాం! ఆ లోకంలో క‌లాం త‌ల్లిని హ‌త్తుకుని ఉన్నారు. క‌లాం తండ్రి త‌న మునివేళ్ల‌తో ప్రేమ‌గా క‌లాం జ‌త్తుని స్పృశిస్తున్నారు. క‌లాం గురువైన జ‌లాలుద్దీన్ ఈ క‌బురుని న‌లుగురితో పంచుకునేందుకు హ‌డావుడి ప‌డుతున్నాడు... దేశంలోని ప్ర‌జ‌లంతా జేజేలు ప‌లుకుతున్నారు.  క‌లాం ఊహించిన ఈ క‌ల ఇప్ప‌డు నిజ‌మైంది. స్వ‌ర్గ‌మ‌నేది ఉంటే అందులో అల‌సిసొల‌సిన అబ్దుల్ క‌లాం త‌న త‌ల్లిదండ్రుల చెంత సేద‌తీరుతూ ఉండి ఉంటారు. కాక‌పోతే తేడా అల్లా ఇప్ప‌డు దేశంలోని ప్ర‌జ‌లంతా బాధ‌లో మునిగి ఉన్నారు. -nirjara

Become Attractive

Become Attractive There were days where kids in the family used to be so scared of Father and their whole communication with him used to happen through Mother only. Later it changed to an extent, where Father was happy in giving little bit access to daughters as they get married and go to some other family; however Fathers maintained (May be they were asked to behave so) little distance with boys till the time they cross teenage. This could be due to the fear that, if you pamper your kid, that leads to indiscipline which may spoil the child. But was this formula working for the parents, especially dads? May be yes, may be no, only sometimes or only for few. This means, every child is different and unique so as your parenting skills. Parents need to upgrade themselves in terms of their abilities in upbringing children and this has to happen depending upon child’s psychology. For example, if elder child is responding to one parenting model it is not compulsory that this model is workable for the second kid as well. To be precise, “Parenting” is an art and one has to master it to win your child’s heart. They are so many techniques owned by people since ages and still lot of Research work is going on this; nevertheless, “Being friendly with your child” is the most tested and trusted method so far as it transformed the whole idea of Parenting. The kind of bond developed between parents and kids now, is the result of this change only. Creating a strong friendship with your child does wonders in your relationship than trying to be superior or boss to your child. Once, I heard very beautiful lines from a “ Sadguru” that, “Parents should never sit on a higher pedestal and tell the child what they should do. Rather, they should place themselves below the child so that it’s easy for them to talk”. In, most of the families, we see parents telling kids that they should respect mother and father. We also use various adjectives to address fathers but mothers are exempted from this to some extent. It so happen that, in few families, mothers are blamed if child, is not addressing their father in a respective way. But remember, respect is not something you seek from your child. Since parents are older or they have come to this planet few years early than their kids, they have no right to demand respect from child. Rather, parents must invest their time in loving their kids as much as possible and try to become child’s first priority, whenever kid wants to share any kind of information or experience he/she comes across. In current scenario, child has so many attractive things like TV, Internet, Friends, different life style and many more. Instead of stopping child from getting attracted to these things, parents should become a joyous, wonderful, enthusiastic and interesting human beings so that child won’t seek any company outside but gets attracted to their parents only. If parents genuinely want to bring up their children with values, then instead of striving for bringing change in child, parents should first transform in to a peaceful and loving persons. - Bhavana 

నాన్నకి పిల్లలకి అనుబంధం పెరగాలంటే

నాన్న పాత్ర మారిపోయింది..ఒకప్పుడు గంబీరంగా ..ఇంటి పెద్ద అనే పాత్రలో నిలబడిన నాన్న , ఈ రోజు అమ్మలా లాలించటం నుంచి స్నేహితుడుగా పక్కన నిలిచే దాక తన పాత్ర పోషణ ఎంతో మారిపోయింది. మారిన జీవన శైలి నాన్ ని అమ్మ పాత్రలోకి తెస్తే, అమ్మా, నాన్న పాత్రల సమన్వయంలో నాన్న కొంచె౦ ఇబ్బంది పడుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకు కారణం అమ్మలు అని కూడా గోషిస్తున్నాయి .    తను పిల్లలకి దగ్గరగా లేని సమయం లో పిల్లల ఆలనా పాలన భర్త కి అప్పచెప్పి నప్పుడు ఆ పనులు అతని వీలుగా చేయనివ్వకుండా ,  పిల్లలకి ప్రతి ఒక్కటి తను చేసి నట్టే , అతను కూడా చేయాలనీ, వాళ్ళని తను డీల్ చేసినట్టే చేయాలని కోరుకోవటం, అతనికి పదే పదే అదే చెప్పటం తో అటు తండ్రిగా పిల్లలతో కొంచం గట్టిగా ఉంటూనే, తల్లిగా మారి వారితో అనుబందం కొనసాగించే క్రమం లో వత్తిడి కి గురి అవుతున్నట్టు చెబుతున్నారు అద్యయన కర్తలు.   అందుకే అమ్మలకి ఒక సూచన చేస్తున్నారు. నాన్నలని , నాన్నలుగా వుండ నివ్వండి, మీరు చేసే పనులు చేసినా , అది వారి స్టైల్ లో వారు చేస్తే ..అమ్మకి , నాన్నకి వుండే తేడా పిల్లలు చక్కగా అర్ధం చేసుకుంటారు. లేదంటే పాత్ర పోషణలో నాన్న వత్తిడి ప్రభావం పిల్లల మీద కూడా పడే అవకాసం వుంది. అది తండ్రి, పిల్లల అనుబంధాన్ని ప్రబావితం చేస్తుంది. అంటున్నారు వారు.    అమ్మలూ ...నాన్న కి పిల్లలకి మద్య ఏ మాత్రం వెళ్ళకుండా , వారిని అలా వదిలేయటమే వారిమధ్య అనుబందం పెరగటానికి మీరు చేయవలసిన పని . అని ముక్త కంఠం తో చెబుతున్నారు అద్యయన కర్తలు. సో Happy Father's Day రోజున మీ శ్రీవారికి తండ్రిగా స్వేచ ని బహుమతి గా ఇచ్చేయండి. .......రమ

నిత్య నేర్పిన జీవిత పాఠం

నిత్య నేర్పిన జీవిత పాఠం   1) మొన్న మా పక్కింటి పాపాయి నుంచి నేనో మంచి విషయం నేర్చుకున్నానండి. ఏడేళ్ళు వుంటాయి 2వ తరగతి చదువుతోంది- వాళ్ళ క్లాసు వాళ్ళని పిక్నిక్ కి తీసుకువెళ్తున్నారని పదిరోజుల ముందు నుంచి అపార్ట్ మెంట్ అంతా తిరిగి అందరికి చెప్పింది. అరోజు తేసుకువెళ్ళటానికి కొత్త బ్యాగు,లంచ్ బాక్సు వంటివి వాళ్ళమ్మతో కొనిపించుకుంది. తీరా పిక్నిక్ ఒకరోజు ముందు తనకి విపరీతమైన జ్వరం. మర్నాటికి ఏమాత్రం తగ్గినా పంపిచేస్తానంది వాళ్ళ అమ్మ. కాని పాపం తగ్గలేదు. మర్నాడు ఉదయం 6 గంటలకి తను స్కూలు దగ్గరకి వెళ్ళాలి. వెళ్ళుతుందో, లేదో,తనకి ఎలా వుందో కనుక్కుందామని వాళ్ళంటికి వెళ్ళాను. అప్పటికే లేచి సోఫాలో కుర్చుని వుంది. ఇంకా జ్వరం తగ్గలేదు, నాకు చాలా బాదేసింది. పాపం ఎప్పటినుంచో సరదా పడుతోంది కదా అనిపించింది. 2)  మా పక్కింటి నిత్య వాళ్ళ అమ్మ కళ్ళల్లో అయితే కన్నీళ్ళు ఆగటం లేదు. ఎంత సరదా పడిందో, ఇప్పుడే రావాలా ఈ జ్వరం. లాస్ట్ ఇయర్ నేనే చిన్నదని పంపించలేదు. ఈ సంవత్సరం ఇలా అయ్యింది పాపం. అంటూ ఆమె కన్నీళ్ళు పెట్టుకోగానే ఆ సిసింద్రీ టక్కున లేచి వాళ్ళమ్మ మెడచుట్టూ చేతులు వేసి ఏమందో తెలుసా "అమ్మ నా ఫ్రెండ్స్ తో పిక్నిక్ కి వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకన్నాను. కాని కుదరలేదు కదా ఈరోజు అమ్మతో పిక్నిక్ చేసుకుంటాను. ఏముంది అందులో. " నేనూ, వాళ్ళమ్మ ఒక్క నిమిషం అలా నిలబడిపోయాం. ఎక్కడ అది ఏడ్చి గోల చేస్తుందో అని నేనూ ఎంత భయపడ్డానో, అలాంటిది అంత తేలికగా తను అలా అనేసరికి భలే ఆశ్చర్యపోయాను. అనటమే కాదు తను అరోజుంతా వాళ్ళమ్మతో ఎంచక్కా ఎంజాయ్ చేసింది కూడా. 3) ఒకోసారి పిల్లలు మనకి జీవితపాటాలని నేర్పిస్తారు. తను కోరుకున్నది జరగకపోయినా తను ఆనందంగా ఉండగలనని చెప్పకనే చెప్పింది మా నిత్య. తను కొనుక్కున కొత్త బ్యాగులో బిస్కెట్లు, చాక్లెట్లు, చిప్స్ వంటివి పెట్టుకుని వచ్చి వాళ్ళమ్మని కూడా బాగా తయారవ్వమని వాళ్ళ బాల్కనీలో పాటలు పెట్టుకుని అక్కడే టిఫిన్, భోజనం చేసి వాళ్ళమ్మతో రకరకాల గేమ్స్ అడుకుందట సాయంత్రం దాకా.  పైగా ఫొటోలు కూడా తీయమందట, మర్నాడు వాళ్ళమ్మగారు ఈ విశేషాలన్ని చెబుతూ, నా కూతురుతో నాకు ఇది ఓ మంచి అనుభవం. ఎంత ఎంజాయ్ చేసానో చెప్పలేను. తన ప్రవర్తన చూసి గర్వపడుతున్నాను అని చెప్పరు. 4) ఎన్నోసార్లు మనం కోరుకున్నవి, కోరుకున్నట్టు జరగకపోతే ఎంతో మదనపడిపోతాం. వెంటనే చిరాకు, కోపం వచ్చేస్తాయి. ఎప్పుడూ ఇంతే అంటూ మన జీవితాన్ని, కాలాన్ని నిందిస్తాం. కాని పోనిలే కోరుకున్న విధంగా జరగ పోతేనేం, జరుగుతున్న దానిని ఆనందంగా స్వీకరిద్దాం అని ఆలోచించం. నిత్య ఇంట్లో ఉన్న సమయాన్ని ఏడుస్తూ గడపలేదు. తనుకున్న అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకుంది. వాళ్ళమ్మతో కలసి ఓ రోజంతా హాయిగా గడపచ్చు అనుకుంది. అలాగే చేసింది కూడా ఆరోజు తన దృష్టిలో ఆనందంగా గడిపినట్టే. తను ముందు నుంచి కోరుకున్నట్టు కాకపోయినా సరే ఆరోజు ఓ మంచి జ్ఞాపకంగా మిగుల్చుకోగలిగింది. 5) మన జీవితపు ప్రయత్నంలో అన్ని అనుకున్నట్టు, మనం ఆశించినట్టు జరగవు ఒక్కోసారి. అంతమాత్రాన చిన్నబుచ్చుకుని, మనసుని కష్టపెట్టుకోనక్కర్లేదు. జరగని విషయాన్ని పదే పదే గుర్తుచేసుకుంటే  వేరే దారులు కనిపించవు ఎప్పటికి, సరే ఈ దారి పూర్తిగా మూసుకుపోయింది, మరి వేరే దారి ఉందేమో చూద్దాం అనుకుంటే తప్పకుండా వేరే దారి కనిపించక మానదు. మనం గట్టిగ కళ్ళుమూసుకుని దారులన్ని ముసుకుపోయాయినుకుంటే ఎప్పటికీ మూసుకునే వుంటాయి. మన అడుగుల వడిని అపే అడ్డంకి ఏదైనా ఎదురయితే మరింత ఉత్సహంగా వేరే దారి వైపు వడివడిగా అడుగులు వేయగలిగితే మనకి " జీవించటం" వచ్చినట్టే. -రమ

బోసినవ్వులే బలం

బోసినవ్వులే బలం 1) పసిపిల్లలు ఉన్న ఇంట్లో ఒకటే సందడిగా ఉంటుంది. పిల్లల అల్లరి సరే దానితో సమానంగా పెద్దలు  పిల్లలతో అడే అటలు, పాటలతో ఇల్లంతా సందడిగా ఉంటుంది. ఈ సందడి పిల్లలని ఉత్సాహపరచటమే కాదు వారి శారీరక, మానసిక అరోగ్యానికి ఎంతో అవసరమట కూడా. లల్లాయి పాటలు పాడుతూ పసిబిడ్డను కొద్దిగా అటు, ఇటు ఊపి చూడండి. వెంటనే అ పసి ముఖం మీద బోసినవ్వు మెరుస్తుంది. ఒకోసారి మన ఆటలకి నోరారా నవ్వుతారు. పక పకమని నవ్వేవారి నవ్వు చక్కటి ఆరోగ్యాన్ని అందిస్తుందట. అందుకే వీలయినంత ఎక్కువగా పిల్లల్ని ఆటపాటలతో మురిపించటం ఎంతో మంచిది అంటున్నారు, ఫ్లోరిడా అట్లాంటిక్ యూనివర్సిటీ పరిశోధకులు. 2) పసి పిల్లల్ని ఎత్తుకుని పైకి ఎగరేస్తూ ఆడటం, అలాగే ఒళ్లో కూర్చో పెట్టుకుని తారంగం తారంగం అంటూ ముందుకీ వెనక్కి ఊపుతూ ఆడించటం, వంటి వన్నీ పిల్లలకి కేవలం ఆటలగా సరదాగా అనిపిస్తాయి. కానీ, నిజానికి  బిడ్డల్ని అలా అటూ, ఇటూ ఊపుతుండటం వాళ్ళ ఎంతో లాభం ఉందని గుర్తించారు పరిశోధకులు. వీటివల్ల వారి మెదడులో గణనీయమైన పెరుగుదల ఉంటుందని గుర్తించారు కూడా. బిడ్డలకు సంగీతాన్ని వినిపిస్తూ ఇలా లయబద్ధంగా ఊపటం వల్ల వారి మెదడులో" సెన్సరీ వ్యవస్థ" చక్కగా బలపడుతోందని, దీనివల్ల నాడీకణాల మధ్య అనుసంధాయక సంబంధాలు అంటే న్యూరాల్ నెట్వర్క్స్ మెరుగై, మెదడు మరింత చురుగ్గా అభివృద్ధి చెందుతోందని పరిశోధకులు గుర్తించారు. 3) పసిపిల్లల్ని అడించేటప్పుడు అల్లి బిల్లి పాటలు పాడటం, అందుకు తగ్గట్టు లయాత్మకంగా ఊపటం అన్ని సమాజాలల్లోనూ, అన్ని సంస్కృతుల్లోనూ ఉంది. అలాగే లాలి పాటలు పాడుతూ ఒళ్లో వేసి ఊపుతూ జో కొట్టటం కూడా. వీటి ప్రభావం పిల్లల ఎదుగుదలపై ఎలా ఉంటుందన్న దాని మీద " ఫ్లోరిడా అట్లాంటిక్ యునివర్సిటీ " పరిశోధకులు ఇటీవల విస్తృతంగా పరిశోధనలు చేసారు, అ పరిశోధనల్లో తెలిసీ, తెలియక మనం ఆడించే ఈ ఆటల వల్ల పిల్లల మెదడుకి ఎంతో మేలు కులుగుతోందని తేలింది. 4)  చిట్టి పొట్టి గీతాలు, పాటలు పిల్లలకి చిన్నితనం నుంచే వినిపిస్తుండటం వల్ల వారిలో రకరకాల సామర్ధ్యాలు చురుకుగా అభివృద్ధి చెందటం గమనించారు. భాషాపరిజ్ఞానం, జ్ఞాపక శక్తీ వంటివే కాదు పంచేంద్రియాలు అంటే సెన్సస్ చురుకుగా తయారై మెదడు మరింత చురుకుగా వృద్ధి చెందుతుందని వీరు చెబుతున్నారు. మనం ఏదైనా అనుభూతి పొందుతున్నామంటే, దాని వెనుక ఏకకాలంలో రకరకాల జ్ఞానేంద్రియాలు పనిచేస్తున్నాయని అర్ధం. ఎదుగుదలలో భాగంగా పిల్లలకు ఈ భిన్నత్వం అలవాటు అయ్యేందుకు మన అటా- పాటా బాగా ఉపకరిస్తాయి అంటున్నారు ఈ పరిశోధన చేసిన " లుకోవిట్జ్". 5)  పిల్లల్ని ఒకచోట ఉంచి, రకరకాల బొమ్మల్ని చూపిస్తూ అడించిన దాని కన్నా, పిల్లల్ని ఒక బొమ్మగా ఆడించి , ఊపుతూ కదపటం, వారు కిలకిల నవ్వేలా చేయటం వంటివి తప్పకుండా వారి మెదడులోని నాడీకణాల మధ్య అనుసంధాయక సంబంధాలు మెరుగు పడటానికి ఉపయోగపడుతుందట. కాబట్టి తారంగం , తారంగం వంటి అటపాటలతో, లాలి పాటలతో లయబద్ధంగా పిల్లల్ని ఊపుతూ అడించటం ఎంతో మంచిది అంటున్నారు పరిశోధకులు. -రమ

మీది ఏ స్టైలో తెలుసుకోండి

మీది ఏ స్టైలో చూసుకోండి 1) పిల్లలతో మనం ప్రేమగా ఉన్నామా లేదా ? మన పేరెంటింగ్ స్టైల్ ఏంటి ? ఈ ప్రశ్నలకి ఎవరైనా సమాధానం చెబితే బావుంటుంది అనిపిస్తోంది కదా ! పోస్టర్ క్లైన్, జిమ్ఫే అనే ఇద్దరు చైల్డ్ సైకాలజిస్టులు ఈ విషయంపై పరిశోధన చేసి తల్లిదండ్రులు పిల్లలతో వ్యవహరించే తీరు బట్టి వారి పెరెంటింగ్ స్టైల్ నిర్ణయించటం ఎలాగో చెప్పారు. సో మన పేరెంటింగ్ స్టైల్ ఏంటో తెలుసుకుని, దాని పర్యవసానం ఏలా వుంటుందో గుర్తించి తీసుకోవాల్సిన జాగ్రతలు గురించి అలోచించి తీరాలట. అలా పోస్టర్ క్లైన్, జిమ్ఫే ఇద్దరూ, 3 రకాల పేరెంటింగ్ స్టైల్స్ ని  గురించి చెబుతున్నారు అవే డ్రిల్ సార్జంట్ పేరెంట్, హెలికాఫ్టర్ పేరంట్స్ , కోచింగ్ పేరంట్స్ పేర్లు వెరైటీగా ఉన్నాయి కదా ! 2)  డ్రిల్ సార్జంట్ పేరెంట్స్ పేరు వింటుంటే అర్ధమయి పోతోంది కదా! ఈ పేరంట్స్ పిల్లలతో కమాండింగ్ గా వ్యవహరిస్తారు. ఏం చెప్పినా అర్డర్ లా వుంటుంది. పిల్లల అల్లరి, వాళ్ళు చేసే చిన్న చిన్న పొరపాట్లుని వీళ్ళు సహించరు. చిన్నతనంలో కంట్రోల్ లో పెట్టకపొతే పిల్లలు పెద్దయ్యాక కంట్రోల్ కారని నమ్ముతారు వీళ్ళు. పిల్లలు చిన్న పొరపాటు చేసినా, పెద్ద పొరపాటు చేసినంత హంగామా చేస్తారు. పనిష్మెంట్లు, బెదిరింపులు, సహజంగా ఉంటాయి. ఈ పేరంట్స్ పెంపకంలో పిల్లలను బెదిరించో, బహుమతుల ఆశా చూపో దారిలో పెట్టాలని ప్రయత్నిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే డ్రిల్ మాస్టర్లులా ఎప్పుడూ బెదిరించిన చూపులతో కఠినంగా వ్యవహరిస్తారు. నిజానికి ఈ పేరంట్స్ కి పిల్లలంటే  ప్రేమ లేక కాదు, కాని క్రమశిక్షణ పేరుతొ వీళ్ళు కాస్త కఠినంగా వ్యవహరిస్తారు. మరి ఇలాంటి తల్లిదండ్రుల పెంపకంలో పెరిగిన పిల్లలు ఎలా వుంటారు అంటే నిపుణల సమాధానం ఏంటో తెలుసా ? తిరగాబాడటానికి అలవాటు పడతారట పిల్లలు, ఎదురు చెప్పటం, అబద్ధాలు చెప్పటం, అతిగా భయపడటం, తనపై తనకి నమ్మకం లేకపోవటం వంటి లక్షణాలు పిల్లల్లో కనిపిస్తే పేరెంట్స్ తన ప్రవర్తన తీరు ఎలావుందో చెక్ చేసుకోవాలి. 3)   డ్రిల్ సార్జంట్ పేరంట్స్ ప్రవర్తన తీరు, పిల్లలపై దాని ప్రభావం గురించి చెప్పుకున్నం కదా,  రెండో రకం పేరంట్స్ ' హెలికాఫ్టర్ పేరంట్స్ '. వీళ్ళకి పిల్లలే లోకం, పిల్లల ప్రతీ అవసరాన్ని ముందుగా గుర్తించి తీర్చటానికి ప్రయత్నిస్తారు.  అంతే కాదు పిల్లలకి ఏం ఇబ్బంది కలగకూడదని భావించి ప్రతీ విషయంలో సలహాలు, సూచనలు ఇస్తుంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే పిల్లల్ని ప్రతినిమిషం వేలుపెట్టుకుని నడిపించటానికి ప్రయత్నిస్తారని చెప్పచ్చు.  ఈ హెలికాఫ్టర్ పేరెంట్స్ పిల్లలని అతిగా ప్రేమించటం, వాళ్ళే లోకంగా భావించటం, వాళ్ళని కళ్ళలో పెట్టుకుని చూడటం వీరి లక్షణాలు. ఈ తరహ పేరంట్స్ పెంపకంలో పెరిగిన పిల్లల్లో ఆత్మవిశ్వాసం పాళ్ళు కాస్త తక్కువే వుంటాయి అని చెప్పచ్చు. పైగా  ప్రతి విషయానికి ఆధారపడటం అలవాటయి పోతుంది వీళ్ళకి. కొత్త చాలెంజ్లని ధైర్యంగా ఎదుర్కోలేరు. సరైన నిర్ణయాలు తీసుకోవటం ఇబ్బందిగా వుంటుంది ఈ పిల్లలకి. 4)   పిల్లలని అతి క్రమశిక్షణతో పెంచటం, లేదా అతి గారాబం చేసి అన్ని తానై చూసుకోవటం ఈ రెండింటికి మధ్యస్థంగా పిల్లలతో వ్యవహరించే తీరులో ప్రేమ, గౌరవం, నమ్మకం చూపిస్తూ వారి వ్యక్తిత్వాన్ని గౌరవిస్తూ నేర్చుకుంటూ ఎదిగేలా పిల్లల్ని ప్రోత్సహించే పేరంట్స్ ని " కోచింగ్ పేరంట్స్" అంటారు. ఈ పేరంట్స్ పిల్లల నిర్ణయాన్ని గౌరవిస్తారు. పిల్లలకి ఆప్షన్స్ ,చాయిస్ ఇచ్చి నిర్ణయం పిల్లల మీదే  వదిలేస్తారు. పిల్లలు తీసుకునే నిర్ణయం ఏదైనా దాని నుంచి వచ్చే ఫలితాలకి పిల్లలు బాధ్యత వహించటం నేర్పుతారు. పిల్లలు ఎదుగుతూ నేర్చుకుంటారు, నేర్చుకుంటూ ఎదుగుతారు. వీరి పెంపకంలో పెరిగిన పిల్లలు  అత్మవిశ్వాసంతో, నిండైన వక్తిత్వంతో కనిపిస్తారు. ఆ పిల్లలని చూడగానే వాళ్ళ తల్లిదండ్రుల పెరంటింగ్ స్టైల్ ఏంటో ఇట్టే చెప్పెయ్యచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే చరిత్ర సృష్టించే విజయాలు సాధించటం ఈ తరహా పేరంట్స్ పెంపకంలో పెరిగిన పిల్లలకి ఎంతో సులువు. 5)   మన పెరెంటిగ్ స్టైల్ ఎలా వుండాలో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర లేదు కదా ! మన పిల్లలు ఎలా పెరగాలో కోరుకునేటప్పుడు అందుకు మన ప్రవర్తన తీరు ఎలావుండాలో చూసుకోవాలి. అంటే ' ఫలితం' ఒకటి కోరుకుని ప్రయత్నం ఇంకోటి చేయకూడదు. మనం కమాండింగ్ గా వుంటూ పిల్లలు మనతో ప్రేమగా ఉండాలని కోరుకోవటం కరెక్టు కాదు. మన పిల్లలు మనపై ప్రతి విషయానికి ఆధారపడేలా చేస్తూ వారు అత్మవిశ్వాసంతో ఉండాలని కోరుకోకూడదు. అంటే పిల్లలు ఎలా ఎదగాలో వారి వ్యక్తిత్వం ఎలా వుండాలో కోరుకునేటప్పుడు మనల్ని మనం చెక్ చేసుకు తీరాలి, మనం నాటే విత్తు బట్టే మొక్క కాదంటారా ! -రమ

వాళ్ల ఫిర్యాదులు పట్టించుకోండి

వాళ్ల ఫిర్యాదులు పట్టించుకోండి 1)  పిల్లల విషయంలో తల్లిదండ్రులు ప్రతి చిన్నా అంశాన్ని ఎంతో సునిశితంగా గమనించాల్సి వుంటుంది. అ ఏముంది? మామూలే కదా అని పెద్దవాళ్ళుతీసిపారేసే విషయాలు పిల్లలకి పెద్ద సమస్యలుగా కనిపిస్తాయి. వాటిని పదే పదే చెబుతుంటారు దానికి పెద్దవాళ్ళు ఉరికే సతాయించకంటూ విసుక్కుంటారు. ఇలా ఓ రెండు మూడు సార్లు జరిగాక ఇక పిల్లలు తల్లిదండ్రులుతో ఏ విషయాలు చెప్పరు. ఇక్కడితో పెద్దవాళ్ళు సమస్య తీరిపోయింది. కాని మరి పిల్లలకో ! సమస్య ఇంకా పెద్దదయ్యింది. తనకి తానుగా దానిని ఎదుర్కోవాలి,  ఎలా ! ఈ ప్రశ్న పిల్లల వ్యక్తిత్వంపై రకరకాలుగా ప్రభావాన్ని చూచిస్తుందిట. కొంత మందిలో ధైర్యాన్ని, మొండితనాన్ని కలిగిస్తే, మరికొందరిలో అధైర్యాన్ని, భయన్ని కలిగిస్తుందిట. 2)  పిల్లలున్న ప్రతీ ఇంట్లో అమ్మలు సాధారణంగా ఎన్నో ఫిర్యాదులు వింటుంటారు. పక్కపిల్లాడు కొట్టాడనో, తన బెంచీలో కూర్చునే అబ్బాయి పుస్తకం చింపాడనో, స్నేహితులు తనని ఆడించటం లేదనో, లేదా క్లాసులో పిల్లలు తనని ఏడిపిస్తున్నారనో, ఇలా ఎన్నో రకాలుగా ఉంటాయి పిల్లల ఫిర్యాదులు. ఇవన్ని విన్నప్పుడు మీరెలా రియాక్ట్ అయ్యారో ఒకసారి గుర్తుచేసుకోండి. అ ఏముంది పిల్లలు, పిల్లలు చూసుకుంటారు. చిన్నతనంలో ఇవన్ని మామూలే అని కొట్టిపారేసి "ఊరికే అందరి మీద చాడీలు చెప్పకు" అని కొంతమంది తల్లిదండ్రులు పిల్లల మాటల్ని తేలికగా తీసుకుంటే, మరికొందరు ఇలా చెయ్యి, అలా చెయ్యి అంటూ ఎదురుతిరగమని పిల్లలకి చెబుతారు, మరికొందరు వాళ్ళే స్వయంగా రంగంలోకి దిగి ఏడ్పించే పిల్లలని బెదిరిస్తారు. ఈ రియాక్చన్స్ అన్ని మన స్థాయిలో, మనం తెసుకునే నిర్ణయాలు, కాని పిల్లల వైపు నుంచి ఆలోచిస్తే!  అసలు వాళ్ళా సమస్యకి పరిష్కారం ఏమనుకుంటున్నారు!  మన దగ్గర నుంచి వాళ్ళేం  ఆశిస్తున్నారు? వాళ్లకేం కావాలి? అని ఎవరైనా అడుగుతారా? 3) పిల్లల ప్రపంచంలో వాళ్లకుండే సమస్యల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. మొదట మనం చెప్పుకున్నట్టు. మనకి పిల్లలు చెప్పే సమస్యలు చాలా చిన్నవిగా, అసలు సమస్యలే కానట్టుగా కనిపిస్తాయి. కాని వాటిని ఎలా ఎదుర్కోవాలో, పక్కపిల్లాడు తనని ఏడిపిస్తుంటే,  అ ఉడుకుమోతు తనాన్ని ఎలా దాచుకోవాలో, తనని బెదిరించే పిల్లల నుంచి భయపడకుండా ఉండటం ఎలాగో వాళ్లకి తెలీదు. దాంతో ఆ ఒత్తిడంతా వారి వ్యక్తిత్వంపై పడుతుంది. వాళ్ళ ప్రవర్తనలో మార్పులు కనిపిస్తే, వయసుతో పాటు వచ్చే మార్పులనుకుని మనం తేలికగా తెసుకుంటాం. కాని వాళ్ళు  అ సమస్యలకి వాళ్లకి తోచినట్టుగా పరిష్కారాలు వెదుక్కునే తీరులో భాగమది అని గుర్తించం. అందుకే చైల్డ్ సైకాలజిస్టు 'డాక్టర్ పీటర్ హుక్'  ఓమాట చెబుతున్నారు, ప్రతీ రియాక్షన్ కి ముందు ఓ యాక్షన్ లాగా పిల్లల ప్రవర్తనలో వచ్చే ప్రతీ మార్పుకి ఓ కారణం వుంటుంది. అది గమనించాల్సిన భాద్యత తల్లిదండ్రులదే అంటారు ఈయన. 4)  మరి అసల పిల్లలు అలాంటి ఫిర్యాదులు చేసినపుడు తల్లిదండ్రులుగా మనం ఏంచేయాలి? ఈ ప్రశ్నకి సమాధానంగా చైల్డ్ సైకాలజిస్టులు ఏమంటున్నారంటే ముందు పిల్లలు చెప్పే ఏ విషయాన్ని అయినా కొట్టి పారెయ్యకూడదు వినాలి. మనం పిల్లలు చెప్పేవి వింటామన్న నమ్మకం కలగాలి వాళ్లకి, అది వాళ్లకి ధైర్యాన్ని ఇస్తుందిట. ఇక అతర్వాత ఇప్పుడు ఏం చేద్దాం ? ఈ ప్రశ్న వాళ్ళనడగగానే వాళ్ళు రకరకాల సమాధానాలు చెబుతారు,  అప్పుడు ప్రశంతంగా వినాలి. అ తర్వాత ఈ సారికి ఇలా చేద్దాం అంటూ మనం ఏమనుకుంటున్నామో చెప్పాలి,  వినటానికి ఇదంతా సిల్లీగా అనిపించినా ' పెరంటింగ్'  అంటే ఇదే అంటున్నారు సైకాలజిస్టులు. -రమ

సమ్మర్ ని స్పెషల్ గా మారుద్దాం

సమ్మర్ ని స్పెషల్ గా మారుద్దాం 1) ఈ శెలవులు పిల్లలకి మంచి జ్ఞాపకంగా మిగిలి పోవటానికి, ఆ జ్ఞాపకాలు వచ్చే సంవత్సరమంత వాళ్ళని ఆనందంగా ఉంచేలా చేయటానికి ఏమేం చేయెచ్చో మనం చెప్పుకుంటూనే ఉన్నాం. ఈ రోజు పిల్లలతో తప్పకుండా చేయించి తీరాల్సిన మరో చిన్న పని గురించి చెప్పుకుందాం. కథలు పుస్తకాలూ చదివించి ఉంటారు కదా . అ కధలలోని ముఖ్యమైన విషయం లేదా పిల్లల్ని ఆకర్షించిన అంశం గురించి ఒక పుస్తకంలో రాయమనాలి. పెద్దగా అక్కర్లేదు ఒకటి రెండు లైన్లు అయినా చాలు. అలాగే అవే పాత్రలతో మరో కధ అల్లి రాయమనాలి. మొదట్లో పిల్లలు నాకు రాదంటూ తప్పించుకుంటారు. కాని మనమే కొన్ని సుచనలూ చేస్తూ, సహాయం చేస్తే వాళ్ళు రాయచ్చు. కనీసం కొత్త అలోచన చేస్తారు. 2) పిల్లలు చదివితే సరే కాని, లేకపోయినా కూడా పెద్దవాళ్ళు చదివి వినిపించి తీరాల్సిన పుస్తకాలు కొన్ని ఉన్నాయి. అవే జీవిత చరిత్రలు. పెద్ద పెద్ద గ్రంధాలు అక్కర్లేదు. పిల్లల కోసం వారికి అర్ధమయ్యేరీతిలో ఇప్పుడు చాలా పుస్తకాలు వస్తున్నాయి. మహాత్ముల జీవిత చరిత్రలు చదివాక అందులో వాళ్ళని ఆకర్షించిన విషయాలను ఓ పుస్తకంలో రాయమనలి.  మొత్తం చదివాక ఏ అంశం వాళ్ళని ప్రభావితం చేసిందో చూడాలి. దీనివల్ల పిల్లల గ్రాహణశక్తిని అంచనా వేయచ్చు. వాళ్ళు వ్యక్తిత్వంలోని మార్పలును ఇట్టే పసిగట్టచ్చు. మరో విషయం ఏంటంటే ఓ విషయం గురించి చదవటం, దానిని అర్ధం చేసుకోవటం, తిరిగి రాసి పెట్టుకోవటం ఇవన్ని కూడా అ విషయం పిల్లలు మనసుల్లో ముద్రించుకునేలా చేస్తాయి. గాంధీ గారి సత్యం పలకటం అన్న విషయం కావచ్చు, శివాజీ ధైర్యసాహసాలు కావచ్చు. రాజారామోహన్ సంఘసేవ కావచ్చు. చిన్నతనంలోనే పిల్లల మనస్సులో ముద్రించుకుంటే ఆ విషయాలని ప్రత్యేకంగా మనం మళ్ళి నేర్పించక్కర్లలేదు. అవి వారి వ్యక్తిత్వంలో భాగంగా మారి పోతాయి. అందుకు చరిత్రలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. 3) పిల్లలు చిన్న చిన్న బొమ్మలు వేయిటం, వస్తువులు తయారు చేయటం వంటివి చేస్తారు, అవి గొప్పగా ఉన్నాయా లేవా అని కాదు. అవి పిల్లల్లోని సృజనాత్మకతకి అద్దం పడతాయి. అలా వాళ్ళు వేసిన బొమ్మలు, తయారుచేసిన బొమ్మలు, వస్తువులు లాంటివి అన్నింటిని కలిపి ఓ చిన్న ఎగ్జిబిషన్ లా ఏర్పాటు చేసి .హాలులో ప్రదర్శనకు పెట్టి, అపార్టుమెంటు వాళ్ళని, ఫ్రెండ్స్ ని పిలిస్తే అందరిలో తన ప్రతిభకి లభించే గుర్తింపు, పిల్లల్ని ఉత్సాహ పరుస్తుంది. అ ఉత్సాహం మరిన్ని విషయాలలో తను మనసుపెట్టి కష్టపడేలా చేస్తుంది. పిల్లల్లో కుదురు, ఏకాగ్రత, చేసే పని పట్ల ఇష్టం లాంటివి చెబితే వచ్చేవి కాదు. వాళ్ళ ప్రవర్తనలో ఓ భాగంగా అవి మారిపోవాలి. అందకు పైన చెప్పుకున్న విషయాల వంటివి సహాయపడతాయి. 4 పిల్లల్లో ఉహాశక్తికి పదును పెట్టే యాక్టివిటీస్ వారిని చురుకుగా ఉంచుతాయి. ఓ విషయాన్ని వినగానే గ్రహించి, తిరిగి దానికి ఓ రుపం ఇవ్వగలిగితే అది వారిలోని భాషానైపుణ్యాన్ని, భావవ్యక్తీకరణ నైపుణ్యానికి పదునుపెట్టినట్టే. ఉదాహరణకి ఆవు, పులి కథని పిల్లలకి చెప్పి అందులో ఆవు, పులి ,దూడ పాత్రలతో పిల్లలని ఓ చిన్న నాటికలా వేయమంటే .. వాళ్ళంతట వాళ్ళే సంభాషణలని ఉహించుకుని చెబుతారు. ఇది పిల్లలకి సరదాగా ఉంటుంది. నిజానికి అది వారిలోని ఉహాశక్తి పదునుపెట్టటమే. ఇలాగే వీర శివాజీ పాత్ర, సుభాష్ చంద్రబోస్ పాత్ర వంటివి కూడా చేయించవచ్చు. వారి గురించి చెప్పి చరిత్రలోని ఓ సంఘటనని పిల్లలకి వివరించి, ఆ సమయంలో ఆ వ్యక్తుల స్పందన ఎలా ఉంటుందో చెప్పమనాలి. ఏకపాత్రాభినయం అంటారు కదా. అదే ఇలా చేయటం వాల్ల పిల్లల్లోబిడియం కూడా పోతుంది. 5) ఇవన్నీ కూడా పిల్లలని ఉత్సాహంగా ఉంచేవే. ఆడుతూ, పాడుతూ పిల్లల వ్యక్తిత్వాన్ని రూపుదిద్దే చిన్న ప్రయత్నాలు. ఇంకా ఇటువంటివి ఎన్నో ఉండవచ్చు. ఆలోచిస్తే పిల్లల్ని కదిలిస్తే బోల్డన్ని అంశాలు కనిపిస్తాయి. కావాల్సిందల్లా అమ్మకి కాస్త తీరిక, ఓపిక అంతే ఏమంటారు. -రమ

అనుబంధంతో అల్లుకోండి

అనుబంధంతో అల్లుకోండి పిల్లలతో మంచి అనుబంధం పెంచుకోవాలంటే ఏం చేయాలి..? అమ్మలందరి ప్రశ్న అదే... ఎందుకంటే వాళ్ళని బెదిరించి, బయపెట్టి మాట వినేలా చేసే రోజులు పోయాయి. చిన్నతనంలో అమ్మ ఏం చెబితే అదే వేదం. అమ్మ చెంగుపట్టుకు తిరుగుతూ, అమ్మ చెప్పే కథలు వింటూ.. అమ్మే లోకంగా వుంటారు పిల్లలు. ఆ సమయంలో నయాన్నో, భయాన్నో వాళ్ళు చెప్పినట్టు వినేలా చేయచ్చు. కాని కాస్త పెరిగి ప్రిటీన్స్ లోకి వచ్చాకా, ఎదురుతిర గటాలు, అలకలు, అబ్బో అమ్మకి బోల్డంత ఓపిక కావాలి. కానీ ఆ పేచీలు లేకుండా చేయటానికి కొన్ని చిట్కాలు వున్నాయి. వాటితో పిల్లలతో అనుబంధం కూడా పెరుగుతుంది.. దాంతో పేచీలు తగ్గుతాయి అంటున్నారు నిపుణులు.. నిజానికి అమ్మలందరికి ఈ చిట్కా తెలిసే వుంటుంది. కాని పని కుదరదనో, ఇంకేదో కారణాలు చెప్పి తప్పించుకుంటారు. అలా కాకుండా... అది చాలా ముఖ్యమైనది అని గుర్తించి పాటిస్తే మాత్రం మంచి ఫలితాలు వస్తాయి... అని భరోసా ఇస్తున్నారు నిపుణులు. మరి వారు సూచిస్తున్న ఆ సూత్రాలు ఏంటో చెప్పనా ... పిల్లలతో సమయం గడపటం : ఈ మాట చెప్పగానే... రోజు చేసేది అదే కదా అంటారని తెలుసు...కాని సమయం గడపటం అంటే... రోజూ వారి పనుల మద్య వాళ్ళతో మాట్లాడటం కాదు.. అచ్చంగా వాళ్ళతో మాత్రమే గడపటం. దానికి అమ్మ కొన్ని సమయాలని ఫిక్స్ చేసుకోవాలి. సాధారణంగా ఉదయాన్నే నిద్రలేపేటప్పుడు.. హడావుడిగా టైం అయిపోయింది అంటూ పిల్లలని లేపుతుంటారు.. అలా కాకుండా, ఓ పది నిమిషాల ముందు పిల్లలని లేపండి. పక్కన కూర్చుని ఓ నాలుగు మాటలు సరదాగా మాట్లాడండి, అప్పుడు చూడండి చక, చకా ఎలా రెడీ అవుతారో... అలాగే ఉదయం వాళ్ళు వెళ్ళేదాకా వాళ్ళతో అవి, ఇవి మాట్లాడుతూ వుండాలి. అవి చాలా సాధారణ విషయాలు.. పేపర్ లో న్యూస్ గురించో, ఇంట్లో మొక్కల గురించో, వాళ్ళ ఫ్రెండ్స్ గురించో చాలా, చాలా క్యాజ్యువల్ టాక్ జరగాలి.  ఇక వీలైతే కాకుండా, వీలు చేసుకుని మరీ పిల్లలతో ఆడిపాడాలి. ఆటలు పిల్లలతోనా? అనద్దు.. క్రికెట్ నుంచి షటిల్ దాకా, అలాగే కారమ్స్, యూనో ఇలా ఎన్నో గేమ్స్ వున్నాయి .. వాటిలో ఏదో ఒకటి ఆడండి. మ్యూజిక్ వినటం ఇష్టంగా వుంటుంది పిల్లలకి. వాళ్ళతో కలసి పాటలు వినటం, వాళ్ళు డాన్స్ చేస్తుంటే చేయలేకపోయినా చూడటం అన్నా చేయాలి. ఇక రంగులంటే పిల్లలతో పాటు మనకి ఇష్టమేగా.. డ్రాయింగ్, కలరింగ్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఇలా పిల్లలతో కలసి ఏమేం చేయచ్చో అన్నీ చేయటమే. సింపుల్ గా చెప్పాలంటే వాళ్ళకి ఓ ఫ్రెండ్ లా వాళ్ళ అల్లరిలో భాగం కావాలి. దీని వల్ల లాభం ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఒక్కసారి చేసి చూడండి.. పిల్లలు ఎలా అమ్మా, అమ్మా అంటూ చుట్టూ తిరుగుతారో చూడండి. వాళ్ళకి కావాల్సింది ఓ ఫ్రెండ్ లాంటి అమ్మ. ఎప్పుడూ ప్రశ్నలు వేస్తూ, జాగ్రత్తలు చెబుతూ, అప్పుడప్పుడు కోప్పడుతూ, అమ్మ వాళ్ళకి పరాయిగా కనిపిస్తుంది. అర్ధం చేసుకోదు అనుకుంటారు. కాదు బంగారం నీతోనే నేనూ.. నీలా ఆడిపాడి అల్లరి చేస్తాను.. అని వాళ్ళకి తెలిసేలా చేస్తే చాలు... పసివాళ్ళుగా మారిపోయి గారాబాలు పోతారు. ఎంతయినా, ఎన్ని వున్నా వాళ్ళకి కావాల్సింది అమ్మే. ఆ అమ్మ పెద్దయ్యారు అంటూ మీ పనులు మీరు చేసుకోండి, మీ ఆటలు మీరు ఆడుకోండి అంటుంటే, అమ్మ కావాలి అని బయటకి చెప్పటం ఎలాగో తెలియక మొండికేస్తుంటారు. అది పోవాలంటే మళ్ళీ చిన్న పిల్లలప్పుడు పిల్లలతో ఎలా ఎలా ఆడిపాడారో అలా చేయటమే. -రమ

జ్ఞాపకాన్ని బహుమతిగా ఇద్దాం..

జ్ఞాపకాన్ని బహుమతిగా ఇద్దాం.. పిల్లలకి ఎన్నో మంచి బహుమతులు ఇస్తుంటారు పేరెంట్స్. వాళ్ళు అడిగినవి, అడగనివి కూడా ఇచ్చి, పిల్లల కళ్ళలో కనిపించే సంతోషాన్ని చూసి పొంగిపోతారు. ఆ బహుమతులు ఏంతో అపురూపంగా చూసుకుంటారు పిల్లలు. అయితే బహుమతి ఎప్పుడూ వస్తువుల రూపంలోనే ఉండక్కరలేదు. జ్ఞాపకాలుగా కూడా ఇవ్వచ్చు. అలా జ్ఞాపకాలుగా ఇచ్చిన బహుమతి ఎన్నో ఏళ్ళు పిల్లల మనసులలో చెరగని ముద్ర వేసుకు కూర్చుంటుంది. ముఖ్యంగా తల్లితండ్రులు, పిల్లలకి మధ్య మంచి అనుభందం ఏర్పడటానికి దారితీస్తుంది. జ్ఞాపకాలని బహుమతిగా ఇవ్వటం అంటే ఎలా అంటే ...నిజానికి పేరెంట్స్ అందరూ  దానిని పాటిస్తూనే వుంటారు. కానీ ప్రత్యేకంగా దానిని గుర్తించరు అంతే.  మన చిన్నతనాన్ని గుర్తుచేసుకుంటే చాలు ఒకసారి, విషయం అర్ధం అయిపోతుంది . * "నాన్న కొని ఇచ్చిన పెన్ను, పెన్సిల్ వంటివి కంటే నాన్న రోజు ఆఫీస్ నుంచి రాగానే ఒకసారి నన్ను అలా స్కూటర్ మీద తిప్పి తెచ్చేవారు. ఏ రోజు మిస్ చేసే వారు కాదు", * " సెలవులు అనగానే తప్పకుండా ఓ ట్రిప్ ప్లాన్ చేసి తీసుకు వెళ్ళేవారు ".  * " మా పరీక్షలు మొదలు అయ్యేరోజు అమ్మ తప్పకుండా స్వీట్ చేసి పెట్టేది." * " నా పుట్టిన రోజున అమ్మ రోజంతా ఓ పండగలా చేసేది. ఆ రోజు ఓ ఫోటో తీయించేది. నా మొదటి పుట్టిన రోజునించి, వరసగా అన్ని పుట్టిన రోజు ఫోటోలు ఒక ఆల్బం చేసింది. " ఇలా మనలో చాలామందికి, ఇలాంటివే ఎన్నో జ్ఞాపకాలు, తీపిగా గుర్తుండిపోయి వుంటాయి. అవి ఎప్పుడు గుర్తుకు వచ్చినా ..ఆనందం తన్నుకు వచ్చేస్తుంది. పసిపాపగా మారిపోయి అమ్మా, నాన్నల చుట్టూ మన మనసు పరిగెడుతుంది. అదిగో అదే నేను చెప్పే బహుమతి. ఎన్ని ఏళ్ళు అయినా పాడవని బహుమతి. ఎప్పటికి మనతో వుండే బహుమతి. మనం కూడా అలాంటి బహుమతి పిల్లలకి ఇస్తే చాలు. అందుకు మనం చేయాల్సిందల్లా కొంచెం శ్రద్దగా ఆలోచించి ఆ బహుమతుల్ని నిర్ణయించుకోవటం . ఉదాహరణకి కొన్ని చెబుతా ..మీరు ఇంకా అలోచించి మంచి బహుమతుల్ని సిద్దం చేయండి మీ పిల్లలకి. 1. పిల్లల పుట్టిన రోజుని ఎంత ప్రత్యేకంగా చేస్తామో కదా. అయితే పిల్లల చిన్నప్పటి నుంచి ఆ పుట్టిన రోజున పాటించే కొన్ని విధానాలని నిర్ణయించుకుని ఎప్పటికి, వాటిని తుచ తప్పక పాటించాలి. ఆ రోజు ఉదయాన్నే నిద్ర లేపే ముందు వాళ్ళ మంచం నిండా  బెలూన్లు వుంచటం. వాళ్ళకి కొన్న బహుమతుల్ని అక్కడక్కడా దాచి వెతుక్కోమనటం, ఇలా ...చిన్న చిన్న విషయాలనే చాలా ముఖ్యమైనవిగా ప్రతి సంవత్సరం పాటించటమే మనం పిల్లలకి ఇచ్చే బహుమతి. అంటే ఓ ఆచారం అంటారు చూసారా, తప్పక పాటించి తీరేది అలా వుండాలి కొన్ని కొన్ని . 2. పుట్టిన రోజున పిల్లలకి ఏంతో ప్రత్యేకం గా వుంటుంది. ఎందుకంటే వాళ్ళకి నచ్చిన బహుమతులు, ఇంకా మనం చేసే హడావుడి .ఇవన్నీ ఆ రోజుని ప్రత్యేకమైనవిగా మారుస్తాయి. అలాంటి రోజులు ఇంకో రెండు అయినా వుండాలి. పిల్లలు స్కూల్ మొదలయ్యే రోజు. అలాగే పెద్ద పరీక్షలు అయిపోయిన ఆఖరి రోజు. పరీక్షలు అయిపోయే ఆఖరి రోజున పిల్లల స్కూల్ కి వెళ్లి, వాళ్ళ ఫ్రెండ్స్, టీచర్స్ తో పిల్లల కి ఫోటో లు తీయటం, ఫ్రెండ్స్ అందరికి వీళ్ళతో చిన్న చిన్న బహుమతులు, లేదా చాక్లెట్స్ ఇప్పించటం. అలాగే ఆ రోజున వాళ్ళని బయటకి తీసుకు వెళ్ళటం. ఎగ్జామ్స్ కి బాగా చదివారని గిఫ్ట్స్ ఇవ్వటం. ఇవన్నీ ఆ రోజుని ప్రత్యేకం గా మారుస్తాయి. పిల్లలు ఆ రోజు కోసం ఎదురు చూసేలా చేస్తాయి. అదే మనం పిల్లలకి ఇచ్చే విలువైన బహుమతి. " జ్ఞాపకాలు. " 3. అలాంటి జ్ఞాపకాలు పిల్లలకి ఇంకా ఎన్నో ఇవ్వచ్చు. రోజు వారి జీవితం లో కూడా. ఒక్కసారి అలోచించి చూడండి. పిల్లలని నిద్రలేపటం నుంచి, రాత్రి పడుకునే ముందు కథ చెప్పటం దాకా.. ఒకరోజు చేసి, ఒక రోజు చేయక కాదు. పిల్లలకి తెలియాలి, అమ్మ ఇప్పడు ఇలా చేస్తుంది అని. దాని కోసం వాళ్ళు ఎదురు చూడాలి. " ఈ రోజు ఆదివారం, అంటే నాన్న నాకు అన్నం తినిపిస్తాడు. " అనే చిన్న జ్ఞాపకం పిల్లలకి ఎంతో ప్రత్యేకం గా వుంటుంది. ఇలా ఎన్నో, ఎన్నో... మన కంటి పాపలకి మనం ఇవ్వగలిగే అపురూప మైన బహుమతులు  శ్రమ లేనివి, ఖర్చు లేనివి.. కాని ఎంతో విలువైనవి. ప్రేమని ఓ బహుమతి గా మార్చి ఇద్దాం. అది జ్ఞాపకం గా వారి గుండెల్లో నిలిచిపోయి వారికి జీవితాంతం సంతోషాన్ని అందిస్తుంది. అమ్మ, నాన్నలుగా మనం కోరుకునేది కూడా అదేగా. ఎప్పటికి మన పిల్లలకి సంతోషాన్ని ఇవ్వగలగాలి, మన జ్ఞాపకాలు వారికి బరోసా కావాలి. పసితనం వారి గుండెల్లో బంది కావాలి. అందుకే జ్ఞాపకాలని బహుమతిగా అందిద్దాం. మన ప్రేమని చేతలలో చూపిద్దాం. -రమ

అమ్మ తింటే పిల్లలూ తిన్నట్టే

అమ్మ తింటే పిల్లలూ తిన్నట్టే అమ్మకి పెద్ద ఛాలెంజింగ్ ఏమిటీ అని అడిగితే ఎవరైనా టక్కున చెప్పే సమాధానం ‘‘పిల్లలకి తినిపించడం’’ అనే. మనం ఏదైనా పెట్టబోతున్నాం అని తెలిస్తే చాలు పెదాలు రెండూ మూసి వద్దు అంటారు. కుక్కబోతే కెవ్వుమంటారు. ఆ సమయంలో ఎంత కోపం వస్తుందో అమ్మకి. తిని, ఎంత ఎంతైనా అల్లరి చేయరా బాబూ అని బతిమాలుతుంది అమ్మ. అసలు వాళ్ళ ఆకలికి ఎలా ఆగగలుగుతున్నారో తెలిస్తే బావుండును... మనమూ డైటింగ్ చేయచ్చు అనిపిస్తుంది. ఇలా పిల్లలకి తినిపించడంలో ఇబ్బందులు ఎదుర్కునే అమ్మలు పిల్లల చిన్నతనంలోనే జాగ్రత్తపడాలి అంటున్నారు ఇటీవల ఈ విషయంపై అధ్యయనం చేసిన నిపుణులు. పిల్లలు అన్నిరకాల పళ్ళు, కూరగాయలు తినాలంటే, అన్ని రుచులని ఇష్టపడాలంటే అమ్మ తను గర్భంతో వుండగా వాటిని ఎక్కువగా తినాలిట. అలాగే పిల్లలు పుట్టాక, పాలు ఇస్తున్నప్పుడు కూడా ఆ పళ్ళని, ఆకు కూరల్ని ఎక్కువసార్లు తీసుకుంటూ వుండాలిట. ఇదేం లింకు అంటారా? బిడ్డకి పాలిచ్చే తల్లి తినే ఆహారంలోని రుచి పాల ద్వారా పిల్లలకి చేరుతుందిట. ఇలా తల్లి ఎక్కువగా తినే పళ్ళు, కూరగాయల రుచికి పిల్లలు త్వరగానే అలవాటు పడిపోతారుట. ఈ విషయాన్ని అధ్యయనం చేయటానికి నాలుగు నుంచి ఎనిమిది నెలల మధ్య ఉండే 45 మంది పిల్లలని తీసుకుని వారిలో 20 మందికి వాళ్ళ అమ్మలు ఎక్కువగా తీసుకునే ఆహారాన్ని ఇచ్చినప్పుడు వెంటనే తినటానికి ఇష్టపడటం గుర్తించారు. అలాగే వేరే కొత్త రుచులు  ఇవ్వటానికి ప్రయత్నిస్తే మొహం చిట్లించి చక్కగా ఉమ్మేసారుట ఆ పిల్లలు. ఇంకో విషయం కూడా తెల్సిందండోయ్. ఈ అధ్యయనంలో కొంతమంది పిల్లలకి వాళ్ళు వద్దంటున్నా రోజూ అదే ఆహారాన్ని ఇవ్వటానికి ప్రయత్నిస్తూ వుంటే ఓ 15 రోజులకి నెమ్మదిగా వారు ఆ ఆహారాన్ని, ఆ రుచిని ఒప్పుకోవడం గమనించారు నిపుణులు. అంటే పిల్లలు ఇష్టపడటం లేదంటూ పెట్టడం మానెయ్యకుండా రోజూ ప్రయత్నిస్తూ వుంటే వాళ్ళు తప్పకుండా ఆ రుచిని ఇష్టపడటం మొదలుపెడతారుట. కాబట్టి పిల్లాడికి నచ్చదంటూ పళ్ళు, కూరగాయలని పక్కన పెట్టేసి, ఇష్టం అంటూ ఏ పెరుగు అన్నాన్నో పెట్టే తల్లులు ఇక పట్టువదలని విక్రమార్కుల్లా పిల్లల వెంట పడాల్సిందే. పళ్ళు, కూరగాయల వంటివి ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెల్సిందే. పిల్లలు పాలు మానేసి ఘనాహారానికి మారినప్పుడే అన్ని కూరగాయలని, పళ్ళని పిల్లలకి రుచి చూపించాలిట. చిన్నతనంలోనే పిల్లలని అన్ని రుచులకి అలవాటు చేయటం సులువుగా వుంటుందిట. పెద్దయినకొద్దీ రకరకాల రుచులకి అలవాటుపడి తొందరగా దేనినీ ఇష్టపడరు. ఈ విషయంలో నిపుణులు చేసే సూచన పిల్లలకి ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా ఆరోగ్యకర ఆహారాన్ని అలవాటు చేయండి. పిల్లలకి నచ్చదంటూ ఏ ఆహారాన్నీ ఇవ్వటం మానెయ్యవద్దు. మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తే వాళ్ళు తప్పకుండా ఇష్టపడతారు.  పాలిచ్చే తల్లులు అన్ని రుచుల ఆహారాన్ని తప్పకుండా తినాలి. ఇవండీ పిల్లలు సులువుగా అన్నీ తినాలంటే నిపుణులు సూచించిన మార్గాలు. పిల్లలని ఆరోగ్యవంతులుగా మార్చడం అమ్మ చేతిలోనే వుంది... ప్రయత్నించండి. -రమ

Dealing with Insecurity in Children

  Dealing with Insecurity in Children   Your child plays well with friends of older age and of the same age...you thought your child is a friendly-natured person, and that he/she will make you proud when others tell you that your child plays well with other children, with no toy wars. As long as your child was meeting the same old friends, he/she got used to, it was pretty fine...but things changed when you brought your little one to a different city or to your family abroad, and there they meet the younger cousins.....the first few days go smoothly, you all will be so mesmerised to see the love and bonding between the kids...but one fine day, the elder cousin hits the younger and the tension kicks off. Day by day, they become adamant, if the younger cousin is a toddler, he/she will retaliate and the fight begins. They even bite eachother, they push eachother...what not...leave aside spending happy moments with family, one of you has to sit watching over the kids, every minute. Turn to others and things will worsen here, such busy will the kids keep you. You may find yourselves disappointed by your child for hitting and biting the other little one so often, you will sit frustrated and irate with the situation, thinking you have become a Mom who shouts and scolds her own child so often. Where did it go wrong?   We as  new and first time parents may not expect this strange behaviour in our toddlers and 3 yr olds, but it is obvious when they find someone younger, grabbing more attention from all. They feel so insecure when everyone around pays more attention to the younger sibling or younger cousin. Specially, when they find their own parents caring for the younger one, its even worse. That feeling of not-cared-for forces the innocent child to hurt the younger sibling or cousin. You cant find fault with them...make sure to treat both equally, not giving instructions to the elder one always such as 'dont touch him', 'dont take her toys', 'be careful', 'why did you snatch his treats' etc....and always make sure to introduce children of every playful age to your child inorder to make them aware of how to deal with other kids, this will prepare your child for a younger sibling or a memorable sweet time with a younger cousin. - Prathyusha Talluri

పిల్లలకు బాధ్యత నేర్పడం పెద్దల బాధ్యత

  పిల్లలకు బాధ్యత నేర్పడం పెద్దల బాధ్యత ‘‘నీకస్సలు బాధ్యత తెలియదు’’... మనం తరచుగా పిల్లలతో అనే మాట ఇది. మనం అలా అనగానే ఏం చేయాలో తెలియక బిక్కమొహం వేస్తారు పిల్లలు. ఆ పదానికి అర్థంకాని, అలా మనం అనకుండా ఉండాలో ఏం చేయాలో కానీ తెలియని వయసు వారిది. అందుకే ‘బాధ్యత’ లాంటి  పెద్ద పదాలు వాడకుండా ఆ విషయాన్ని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పటం అలవాటు చేసుకోండి అంటున్నారు పిల్లల మానసిక నిపుణులు. అందుకు వారు చేస్తున్న కొన్ని సూచనలు ఇవే. 1. పిల్లలకి తల్లిదండ్రులే రోల్ మోడల్స్ కాబట్టి ఉపన్యాసాలు ఇవ్వడం మానేసి పిల్లల నుంచి ఏం ఆశిస్తున్నారో దాన్ని మీరు ఆచరణలో పెట్టండి అంటున్నారు నిపుణులు. మీరు పదేపదే చెప్పినదానికన్నా, చేసినది పిల్లల మనసులపై ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. దారు దానిని తెలియకుండానే అనుసరిస్తారు అంటున్నారు వీరు. 2. పిల్లలు ఓ పనిని పూర్తి బాధ్యతతో చేయాలని మీరు ఆశిస్తే మొదట వారితో కలసి ఆ పనిని మీరూ చేయండి. ఉదాహరణకి రోజూ ఈ సమయం నుంచి ఈ సమయం దాకా చదువుకోవాలి. అని పిల్లలకి చెప్పినప్పుడు ఆ సమయంలో వారితోపాటు మీరూ పక్కన కూర్చుని చదివించండి. అది వారికి అలవాటుగా మారేదాకా అలా చేయాల్సిందే. ఒకవేళ అలా వారు చెప్పిన సమయానికి చదువుకోకపోతే మీరెలా స్పందిస్తారన్న విషయాన్ని కూడా వారికి ముందే చెప్పాలి. అయితే ఒక్కమాట... అది బెదిరింపులా వుండకూడదు. 3. ఇక పిల్లలకి చిన్నచిన్న పనులు చెప్పడం, వారి పనులు వారే చేసుకునేలా ప్రోత్సహించడం, వాటిని తేలిగ్గా ఎలా చేసుకోవచ్చో చెప్పడం... ఇవన్నీ పిల్లలకి బాధ్యతగా వుండటం ఎలాగో చెప్పడంలో భాగమే. ఉదయం స్కూలుకి టైంకి వెళ్ళాలంటే రాత్రే బ్యాగు సర్దుకోవడం, యూనీఫాం రెడీ చేసుకోవడం, షూ పాలిష్ వేసుకోవడం... ఇవన్నీ ఓ క్రమపద్ధతిలో ప్రతిరోజూ చేసుకునేలా పిల్లలకి అలవాటు చేయాలి. 4. పిల్లలు వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలని మనం ఆశించడంలో తప్పేం లేదు. కానీ, ఏ వయసు పిల్లల నుంచి ఎంత బాధ్యతాయుత ప్రవర్తనని ఆశించవచ్చు అన్న అవగాహన వుండాలి మనకు. పిల్లల వయసును బట్టి వారికి పనులు చెప్పాలి. 5. పిల్లలు ఒక్కోసారి మర్చిపోయో, లేకపోతే చిన్నతనం వల్ల ఆ పనులని తేలిగ్గా తీసుకోవడమో చేస్తారు. అలాంటప్పుడు చాలా ఘోరమైన తప్పు చేసినట్టుగా పిల్లలని నిందించకుండా మొదట్లో మనమే గుర్తుచేసి చేయించాలి. అలా ఎన్నిసార్లు  అన్న లెక్క లేదు. వాళ్ళు ఆ పనిని బాధ్యతగా ఫీల్ అయ్యి చేసేదాకా గుర్తుచేయడమే. 6. పిల్లలకి బాధ్యతగా వుండటం నేర్పించడంలో ఉన్న ఒక ముఖ్యమైన కిటుకు... మెచ్చుకోవటం. అదే పిల్లలకి హుషారునిచ్చే టానిక్. ‘అరె భలే చేశావే... మర్చిపోకుండా చేస్తున్నావ్’ లాంటి పదాలు వాడితే... ఆ మెప్పు దేనికోసమే వాళ్ళకి క్లియర్‌గా అర్థమవుతుంది. మళ్ళీ, మళ్ళీ ఆ మెప్పు మననుంచి పొందటానికి ప్రయత్నిస్తారు. బాధ్యత అనేది ఓ క్రమశిక్షణ. ఒక పనిని స్వంతంగా తన తీరుతో చేయటం. అవీ ఓ పద్ధతిలో. ఒక్కచోట ఆ పద్ధతి అలవాటు అయితే అది జీవితంలో అన్నిచోట్లా కనిపిస్తుంది. ఓ వ్యక్తి ఉన్నతంగా ఎదగడానికి అది చాలా అవసరం. మరి అంత ముఖ్యమైన విషయాన్ని పిల్లలకి నేర్పించేటప్పుడు తల్లిదండ్రులు ఎంత ఓపిగ్గా ఉండాలో ఆలోచించండి. మనం కూడా బాద్యతగా మన పిల్లలకి బాధ్యత నేర్పిద్దాం. -రమ

Say 'No' to pleasing Children with Treats

  Say 'No' to pleasing Children with Treats   Why do people force children to try a new food? Is it good or bad? Tricky questions...sometimes the answer is Positive, at times Negative and Harmful too....when i say 'People', i mean every other person except Parents..parents know best about their own chuldren and their health. Whether the child has any food allergy or not, it is best to let the parents decide about introducing a new kind of food item. My child was perfectly fine with no food reactions, she was not so delicate with trying new food items. I had total control on her food intake, etc...i brought my 3 year old toddler to India for a 3-month trip. I had my own worries about Climate, as it was end of winter...but i never expected i had to see my child facing a major Food poisoning episode just 2weeks of our arrival. It all started with family members bringing all store bought food items to please my child, they even teased me that i dont pamper her. she was given 3-4 chocolates every day, and i was asked not to stop her.....she ate sweets and every other artificial foods. One morning, she woke up vomiting 8 times, i realised she had eaten a red colored strawberry kind of sweet. The following 2 weeks she struggled to take medicines galore to relieve her food poisoned tummy. I remember i strictly told my family not to give her those sweets, they were careless..... Why was i so helpless...those family members were my husband's parents. I couldnot argue with them and so my child suffered. One month passed and even today they offer sweets and savory to her......my own parents dont do that, they care for my thoughts and my child. Why the difference and the negligence? Should we be assertive and create a drama ( according to others) for just a silly food item or keep quiet and make sure our children are safe?! Because parents are strict and careful, these overly- smart kids go to grandparents and others tricking them for treats!! How to handle this tough and strangely troublesome situation?! - Prathyusha Talluri

ఇలా ఎత్తుకోండి.. హత్తుకోండి..

   ఇలా ఎత్తుకోండి.. హత్తుకోండి..   అమ్మ కాగానే అమ్మాయి మనసులో కలిగే భయాలు, వచ్చే సందేహాలు ఎన్నో! క్రితంసారి అందులో కొన్నిటికి నిపుణులు చెప్పే సలహాలు ఏంటో తెలుసుకున్నాం కదా. ఈరోజు మరికొన్ని ముఖ్యమైన విషయాల గురించి చెప్పుకుందాం. పాపాయిని ఎలా ఎత్తుకోవాలి? చంటి పాపాయిని చూస్తే ఆనందంగానే వుంటుంది. కానీ, ఎత్తుకోవాలంటే భయం వేస్తుంటుంది. ఎక్కడ తనకి ఇబ్బంది కలుగుతుందో అని. కొంచెం చిన్న చిన్న జాగ్రత్తలు  తీసుకుంటే అప్పుడే పుట్టిన పాపాయిని ఎత్తుకోవటం కష్టం కాదు. చంటి వాళ్ళని ఎత్తుకునేటప్పుడు ఒక చేయి  తన మెడని సపోర్ట్ చేస్తూ వుండాలి ఎప్పుడూ.  ఇంకో చేయి నడుము కింద  వుండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే " T " ఆకారంలో వుండాలి మన చేతులు పాపాయిని ఎత్తుకునేటప్పుడు. మెడ కింద చేయి అడ్డంగా, నడుము కింద చేయి నిలువుగా... రెండు చేతులూ అడ్డంగా పెట్టి నప్పుడు పూర్తి గ్రిప్ వుండదు . అప్పుడు గుండెలకి దగ్గరగా పెట్టి పట్టుకోవాలి సపోర్ట్ కోసం. పాపాయిని చేతులలోకి తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం. సున్నితంగా వుండే పాపాయి మెడ కింద మొదట చెయ్యి వేసి అప్పుడు పైకి లేపాలి. సాధారణంగా పాపాయితో పాటు కింద బట్టని కూడా పట్టుకుని ఎత్తుకుంటారు చాలా మంది. అలాంటప్పుడు కొంచెం జాగ్రత్త అవసరం. స్నానం చేయించాక, మాలిష్ చేసాక... ఇలాంటి సందర్భాలలో పాపాయిని ఎత్తుకునే  ముందు మన చేతులు పొడిగా ఉండేలా చూసుకోవాలి. నూనె చేతులతో ఎత్తుకోవటం మంచిది కాదు . అలాగే ఎత్తుకుని నడిచేటప్పుడు మన ఎడమ మోచేతి మడతలో పాపాయి మెడ వుండాలి, కుడి చేయి తల వరకు అడ్డంగా సపోర్ట్ చేస్తూ పట్టుకోవాలి.  పాపాయికి గాలి తగులుతోందా, లేదా. అలాగే ముక్కు నొక్కుకుందా  వంటివి చూసుకుంటూ వుండాలి. అన్నిటి కంటే ముఖ్యం... చంటి పిల్లలని ఎత్తుకునే  ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవడం మర్చిపోవద్దు. ఈ చిన్న, చిన్న జాగ్రత్తలతో  ముద్దుగారే చంటి పాపాయిని దగ్గరకు తీసుకుని ఆ ఆనందాన్ని మనసు నిండా ఆస్వాదించండి. -రమ