నన్ను పాకనివ్వమ్మా.. ప్లీజ్...

  నన్ను పాకనివ్వమ్మా.. ప్లీజ్...   పసి పిల్లల ఎదుగుదల క్రమంలో ప్రతీ దశ ముఖ్యమైనదే. ఏ వయసుకు ఆ వయసుకు తగ్గట్టుగా వుండే పిల్లల ఆటపాటలు వారి శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో సహాయపడతాయి అంటున్నారు పిల్లల ఆరోగ్య నిపుణులు. అయితే పిల్లల మీద ప్రేమతో, అలాగే వారికి హాని కలుగుతుందేమోననే భయంతో తల్లిదండ్రులు వారిని ఆ ఆటపాటలకి దూరం చేస్తే ఆ ప్రభావం తప్పకుండా పిల్లల శారీరక ఆరోగ్యంపై వుంటుందని హెచ్చరిస్తున్నారు వీరు. ఉదాహరణకి పారాడే పాపాయి అప్పుడప్పుడు చిన్న చిన్న దెబ్బలు తగిలించుకోవడం మామూలే. కానీ, అది చూసిన తల్లి కింద పాకుతుంటే దెబ్బలు తగిలించుకుంటోందంటూ ఎప్పుడూ ఎత్తుకు తిరగడం లేదా వాకర్‌లో వేయడం చేస్తుంది. అయితే ఇది ఎంతో తప్పు అంటున్నారు నిపుణులు. పిల్లల్ని పాకనివ్వకపోవడం పాపం... చంటి పిల్లల్ని అటూ ఇటూ తిరగకుండా వాకర్లలో కూర్చోబెట్టడం, ఉయ్యాల్లో పడుకోబెట్టడం, ఎప్పుడూ ఎత్తుకుని ఉండటం కన్నా వారు నేలంతా పారాడుతూ అటూ ఇటూ తిరుగుతుండటమే మంచిదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే, పిల్లలు తమ పొట్టపై తక్కువగా గడపటం వల్ల పాకే సామర్థ్యం తగ్గిపోతుందిట. 339 మంది చిన్నారులపై చేపట్టిన ఒక అధ్యయనంలో నేలమీద పారాడే అలవాటు అస్సలు లేని పిల్లల్లో 48 శాతం మందిలో శారీకర సమతౌల్యం లోపించడం, అవయవాల మధ్య సమన్వయం లేకపోవడం వంటి సమస్యలు కనిపించాయిట.  అలాగే పాకే వయసు పిల్లల్ని ఎప్పుడూ వాకర్లలో కూర్చోబెట్టడం వల్ల నష్టం ఉందని కూడా అంటున్నారు. అవయవాల అభివృద్ధిని ఆపకండి... పాకే వయసు పిల్లల్ని ఆపకుండా ఎప్పుడూ వాళ్ళు హాయిగా ఇల్లంతా పాకే అవకాశం కల్పించడం మంచిదిట. వాళ్ళని ఆపి ఒకేచోట కూర్చోబెట్టడం, అందులోనూ వాకర్లలో వేసి వుంచడం వల్ల ఎదిగే దశలో అవసరమైన అభివృద్ధినీ, నైపుణ్యాల్నీ పెంపొందించుకోలేరని గుర్తించారు నిపుణులు. ఇలాంటి పిల్లల్లో తలభాగాన్ని నియంత్రించుకోవడం, మెడ, శరీర పైభాగం బలిష్టమవటం వంటివన్నీ సమస్యగా మారే ప్రమాదముందిట. ఫలితంగా సమతౌల్యం లోపించడం, శరీరాకృతి సరిగా ఉండకపోవడం, కళ్ళ కదలికల్లో నియంత్రణ లేకపోవడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం వుందిట. ఎదుగుదల క్రమపద్ధతిలో వుండాలంటే... పసిపిల్లలు ముందుగా పొట్టపై, ఆ తర్వాత చేతులపై, ఆ తర్వాత మోకాళ్ళ సాయంతో పాకడం చేస్తుంటారు. ఇలా ఒకదాని వెంట ఒకటిగా సాగే ప్రక్రియ ఎదుగుదలకి సహాయపడుతుంది. ఇలా అన్ని దశలను దాటిన పిల్లల ఆరోగ్యం చక్కగా వుంటుందిట. వారిలో ఎదుగుదల క్రమపద్ధతిలో జరిగి, సంపూర్ణంగా వుంటుందని చెబుతున్నారు పరిశోధకులు. కాబట్టి పిల్లలు నేలపై పాకితే గాయాలయిపోతాయని, అవీ  ఇవీ నోట్లో పెట్టుకుంటారని భయపడకుండా వారిని స్వేచ్ఛగా పారాడనిస్తే వారి శారీరక ఎదుగుదలకి సహాయపడినవారం అవుతామని కూడా వీరు స్పష్టం చేస్తున్నారు. చిన్నచిన్న దెబ్బల్ని లైట్ తీసుకోండి... పిల్లలపై మన ప్రేమ వారికి హాని చేసే విధంగా వుండకూడదు. అందుకని ఈసారి మీ పసిపాప నేలపై పాకుతూ పడి చిన్న చిన్న దెబ్బలు తగిలించుకున్న తనని ఓదార్చి మళ్ళీ నేలపై వదిలిపెట్టండి. ముఖ్యంగా పరిశోధకులు చెప్పిన విషయం గమనించారు కదా. అలా పొట్టతో, ఆ తర్వాత చేతులతో, మోకాళ్ళతో పాకడం వల్ల వారి కళ్ళ, మెడ ఎదుగుదలలో సమతౌల్యం వుంటుంది. పారాడే పిల్లలని ఆపడం కన్నా వారికి అనువుగా ఇంటి పరిసరాలని మార్చడం మంచిది. క్రిందన వారికి అందేవిధంగా ఏవీ వుంచకుండా చూడాలి. ఇకప్పుడు ఏ భయం లేకుండా పిల్లల్ని హాయిగా ఇల్లంతా తిరగనివ్వొచ్చు. -రమ

పిల్లల్లో ఒత్తిడిని చిత్తు చేయండిలా

పిల్లల్లో ఒత్తిడిని చిత్తు చేయండిలా...        ఉరుకుల, పరుగుల జీవితం పెద్దలకే కాదు... పిల్లలకీ తప్పడం లేదు ఈ రోజుల్లో. నిద్రకళ్ళతోనే స్కూలు బస్సు ఎక్కే పిల్లలు ఎందరో. ఇక సాయంత్రం ఇంటికి వస్తూనే హోం వర్కులు, ప్రాజెక్టు వర్కులూ... ఊపిరి తీసుకునే సమయం కూడా వుండటం లేదు వారికి. ‘‘ఏం చేస్తాం... ఇదంతా ఇప్పటి కాంపిటీటివ్ ప్రపంచంలో తప్పవు’’ అనే పేరెంట్స్‌ని కాస్త ఆలోచించమంటున్నారు మానసిక నిపుణులు. చిన్నతనం నుంచే విపరీతమైన ఒత్తిడికి లోనయ్యే పిల్లల్లో చురుకుదనం, జ్ఞాపకశక్తి, సృజనాత్మకత, ఏకాగ్రత తగ్గే అవకాశం చాలా ఎక్కువ. ‘‘ఎంత ఒత్తిడికి గురయితే అంత బాగా నైపుణ్యాలు సొంతమవుతాయనే భ్రమ వద్దు’’. ఒత్తిడి పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. వారి నైపుణ్యాలపై కూడా ఆ ప్రభావం పడుతుంది. కాబట్టి పిల్లలు ఒత్తిడికి గురికాకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే అంటున్నారు. బాగా ఆడించండి మీరు కరెక్టే చదివారు. ఎంత శారీరక అలసట వుంటే అంత ఒత్తిడి తగ్గుతుంది. పిల్లలకి ఆ అలసట ఆటల్లో దొరుకుంతుంది. రోజుకి కనీసం రెండు గంటలపాటు బాగా అలసిపోయేలా ఆరుబయట ఆడించాలి. అది వారిని శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా వుంచుతుంది. ఒత్తిడిని దూరం చేస్తుంది. పిల్లల్లో ఎన్నో నైపుణ్యాలకి సానపట్టేవి ఆటలే. పదిమందితో కలవటం, ఓడటం, గెలవటం, సర్దుకుపోవడటం అన్నీ వస్తాయి. మానసికంగా బలంగా తయారవుతారు. దాని నుంచి రోజువారీ ఎదురయ్యే ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో కూడా నేర్చుకుంటారు. ఇలా పిల్లలకి అన్ని విధాలా ఆటలు మేలు చేస్తాయి. అలాగే వారిని ఉల్లాసంగా ఉంచుతాయి. కాబట్టి ఓ గంటసేపయినా పనులు పక్కనపెట్టి పిల్లల ఆటల్లో భాగం కండి. ఆరకంగా మీరూ మీ ఒత్తిడి నుంచి ఉపశమనం పొందచ్చు. ప్లానింగ్ నేర్పించాలి ఒత్తిడికి మరో కారణం- టైమ్ చూసుకుంటూ పరుగులు పెట్టడం. ఆ ఒత్తిడి తగ్గాలంటే ప్రణాళికతో రోజుని ఎలా ప్రారంభించాలో పిల్లలకి నేర్పాలి. ముందురోజే స్కూలు బ్యాగు సర్దుకోవడం నుంచి రోజు ఓ అరగంట ముందు లేచి రిలాక్స్‌గా తయారవ్వటం దాకా అన్నీ ముఖ్యమే. ‘‘టైమ్ అయిపోయింది’’, ‘‘టైమ్ లేదు’’ లాంటి మాటల నుంచి విముక్తి దొరికితే పిల్లలు సీతాకోక చిలుకల్లా ఆనందంగా వుంటారు. కాబట్టి కాస్త కష్టమైనా టైమ్ మేనేజ్‌మెంట్‌ని ఇంట్లో పెద్దలు ఆచరిస్తే పిల్లలు అనుసరిస్తారు. కొంచెం కబుర్లు పిల్లలంటేనే వసపిట్టలు. అన్ని విషయాలనీ అనర్గళంగా చెబుతూనే వుంటారు. అందులోనూ రకరకాల భావావేశాలతో. వారి ఆ మాటల ప్రవాహానికి అడ్డుకట్ట వేయద్దు. సాధారణ విషయాలతోపాటు వారిలోని భయాలు, ఆందోళనల వంటివి కూడా బయటకి వచ్చేందుకు ఆ కబుర్లే సాధనం. ‘‘మాట్లాడకుండా చదువుకో’’ అన్న ఒక్క మాట పిల్లల ఉత్సాహాన్ని నీరుగార్చేస్తుంది. పిల్లలని మాట్లాడనివ్వండి. మీరూ మాట్లాడండి. ఉదయం నిద్రలేచి ఎవరి దారిన వారు పరుగులు పెట్టేముందు కుటుంబ సభ్యులతో ఫ్యామిలీ టైమ్ అంటూ ఓ పది నిమిషాలు ఒకచోట కూర్చుని కబుర్లతో రోజుని ప్రారంభించి చూడండి. అలానే రాత్రి నిద్రకి ముందు  ఓ నాలుగు కబుర్లు చెప్పకుంటే అందరి ఒత్తిడి ఎగిరిపోతుంది. అనుబంధాలు బలపడతాయి. పిల్లలకు భరోసాగా వుంటుంది. వారిలో ఉత్సాహం నిండుతుంది. పిల్లలకి ప్రత్యేకంగా మనం ఏమీ నేర్పించక్కర్లేదు. మనం ఆచరించి చూపిస్తే చాలు పిల్లలు వాటినే ఫాలో అవుతారు. ఒత్తిడితో క్రుంగిపోతూ రోజులని బరువుగా వెళ్ళదీయడం కాదు. ‘‘ఎంత ఒత్తిడినైనా దరిచేరనివ్వకుండా నవ్వుతూ, తుళ్ళుతూ సాగిపోవడమే జీవితం’’ అన్న విషయం పిల్లలకి అర్థమైతే చాలు - ఎప్పటికీ ఆనందంగా వుంటారు. -రమ

చక్కని చేతిరాత భవిష్యత్తుకు బంగారు బాట

చక్కని చేతిరాత - భవిష్యత్తుకు బంగారు బాట     పిల్లల చదువు విషయంలో తల్లిదండ్రులు మునుపటి కంటే ఇప్పుడు ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సి వస్తోంది. పోటీ అవనీయండి, పెరుగుతున్న సిలబస్ అవనీయండి పిల్లలతోపాటు తల్లిదండ్రులకూ పరీక్ష పెడుతున్నాయి. అందుకే పిల్లల చదువు విషయంలో తల్లిదండ్రుల పాత్ర ఎలా వుండాలి? ఎంతవరకు వుండాలి? వంటి విషయాలు ఈమధ్యకాలంలో ఎంతో చర్చనీయాంశాలుగా మారాయి. మన పరిధి దాటిన సమస్యల పరిష్కారానికి మనం ఆయా రంగంలోని నిపుణుల సలహాల కోసం చూస్తుంటాం. అలా పిల్లల చదువులు, తల్లిదండ్రుల పాత్ర అన్న విషయంపై ఈమధ్య అమెరికాలోని వాండర్ బిల్డ్ యూనివర్సిటీకి చెందిన నిపుణులు కొన్ని స్కూల్స్‌లో ఓ ఏడాదిపాటు వివిధ అధ్యయనాలు చేశారు. అందులో వారు కనుక్కొన్న విషయం ఏమిటంటే, చక్కటి దస్తూరి కలిగి వుండటం అనేది కేవలం ఓ ప్రత్యేక నైపుణ్యం మాత్రమే కాదు, అభ్యసన ప్రక్రియలో అదెంతో కీలకమైనదని కూడా గుర్తించారు. మంచి చేతిరాత కలిగి వుండటం ఎంతో ముఖ్యం. పిల్లలకు మంచి చేతిరాత నేర్పించడమంటే దానర్థం అభ్యసన ప్రక్రియను, భావ వ్యక్తీకరణను సమర్థవంతంగా నేర్పించడమే అంటున్నారు వాండర్ బిల్డ్ యూనివర్సిటీ పరిశోధకులు. చేతిరాత చక్కగా నేర్చుకునే క్రమంలో పిల్లలు తాము రాసే అక్షరాలపై ఎంతో శ్రద్ధ పెడతారుట. చిన్నతనంలో ఇలా అక్షరాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి రాయడం అలవాటైన పిల్లలు ఆ తరువాత కూడా అదే శ్రద్ధ, ఏకాగ్రత కనపరుస్తారట తమ చదువు విషయంలో. అలాగే మొదటిసారి అక్షరాలు నేర్చుకున్నప్పుడే పిల్లల దస్తూరి విషయంలో కొద్దిపాటి శ్రద్ధ పెట్టేలా ప్రోత్సహిస్తే అది వారికి అలవాటుగా కూడా మారుతుందని అంటున్నారు పరిశోధకులు. ఈమధ్యకాలంలో ‘గ్రాఫాలజీ’ ఎంతో ఆదరణ పొందటం మనం చూస్తున్నాం. చేతిరాత బట్టి పిల్లల మానసిక స్థితి, వారి ఏకాగ్రత వంటివి అంచనా వేయొచ్చని చెబుతున్నారు నిపుణులు.  అలాగే చేతిరాతని కుదురుగా వుండేలా రాయడం నేర్చుకున్నాక పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరగటం కూడా గమనించామని అంటున్నారు పరిశోధకులు. అలాగే అక్షరాలని గుర్తించడంలో దస్తూరి బాగున్న పిల్లలు పొరపాట్లు పడటం తక్కువని కూడా గుర్తించారు వీరు. ఒక్కమాటలో చెప్పాలంటే మంచి చేతిరాత కలిగివుండటం అంటే పిల్లల్లో తగినంత శ్రద్ధ, ఏకాగ్రత, ఆత్మ విశ్వాసం కలిగి వున్నట్టు అర్థమని అంటున్నారు పరిశోధకులు. కాపీరైటింగ్ అంటూ చిన్నప్పుడు పిల్లలతో రాయిం చి ఆ తరువాత తరువాత వారి చదువు, మార్కులపై శ్రద్ధ పెట్టి చేతిరాత విషయంలో అంత శ్రద్ధపెట్టరు తల్లిదండ్రులు.  కానీ, ఎప్పటికప్పుడు పిల్లల చేతిరాత కుదురుగా వుండేలా ప్రోత్సహిస్తూ, ఆ విషయంగా తనకి కావలసిన సహాయం చేయడం ఎంతో ముఖ్యమని చెబుతున్న పరిశోధకులు మనకు చేస్తున్న సూచన ఒకటే... పిల్లల చక్కని మార్కులకు, వారి వ్యక్తిత్వ వికాసానికి, మానసిక ఆరోగ్యానికి చక్కటి చేతిరాత ఎంతో ముఖ్యం.   -రమ    

పెద్దలకు ఇది పెద్దబాలశిక్ష

పెద్దలకు ఇది పెద్దబాలశిక్ష   పిల్లల్ని ‘పిల్లలు’ అంటూ తేలిగ్గా తీసుకోవడానికి లేదు. రెండేళ్ళ సిసింద్రీ నుంచి ఇష్టాలు, అయిష్టాలు, కోపం, విసుగు అన్నీ ప్రదర్శిస్తూ వుంటారు. మన స్పందన బట్టి వాళ్ళ ప్రవర్తన కూడా మారిపోతూ వుంటుంది. చాలాసార్లు మీరు గమనించే వుంటారు.. మూడు నాలుగేళ్ళ పిల్లలు ఏదన్నా కావాలంటే గట్టిగా డిమాండ్ చేస్తున్నట్టు అడుగుతారు. మనకి కోపం వచ్చేస్తుంది అది చూసి. వేలెడంత లేవు - ఏదన్నా కావాలంటే నెమ్మదిగా అడగకూడదా.. నామీదే అరుస్తావా అంటూ పిల్లాడిని కోప్పడతాం.కానీ నిజానికి ‘మాన్యుపులేషన్’ ఇంకా అలవాటు కాని వయసది. నెమ్మదిగా బతిమాలితేనే బావుంటుందని వాళ్ళింకా నేర్చుకోని అమాయకత్వం మరి. ఇంకా చెప్పాలంటే వాళ్ళు మనల్ని అనుకరించడమే కరెక్టు అనుకునే సందర్భమది. మనం పిల్లలకి ఏదన్నా చెప్పాలంటే గొంతు పెంచి అరిచేకదా చెబుతాం. వాళ్ళూ అదే చేస్తున్నారు. కానీ, దానికి మనకి కోపం వస్తుంది. అయితే ఇక్కడే మని వాళ్ళని పెద్ద కన్ఫ్యూజన్‌లో పడేస్తాం. అమ్మ అరిస్తే తప్పులేదుగానీ, నేను అరిస్తే తప్పేంటి? అలాగే కదా చెప్పాలి? అని ఆ పసిపాపల మనసులు ఆలోచనలో పడిపోతాయి. పెద్దల్లాగే పిల్లలూనూ:  ఒక్కొక్కరిది ఒక్కో తీరు. అందుకే వారిని పెంచడానికి మనం ఎన్నో కొత్త విషయాలు తెలుసుకుంటూ వుండాల్సి వస్తుంది. ఎప్పటికప్పుడు సాధారణంగా పిల్లల ప్రవర్తనను అంచనా వేసే విషయంలో మనం చేసే కొన్ని పొరపాట్లు, చేసుకోవాల్సిన సర్దుబాట్లు కొన్ని ఉన్నాయంటూ పిల్లల మనస్తత్వాన్ని విశ్లేషిస్తూ నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. ‘‘వాటికి మొండితనం చాలా ఎక్కువ’’ అంటూ మనం పిల్లల్ని పదేపదే అంటుంటాం కదా, ఆ విషయంపై నిపుణులు ఏమంటున్నారో తెలుసా? కొంతమంది పిల్లలు ప్రతీ పనిని చాలా చక్కగా చేయాలని తాపత్రయపడతారు. ఎక్కడా రాజీపడరు. అలాగే వాళ్ళ పనులన్నీ కూడా మనం అలా పద్ధతిగా చేయాలని ఆశిస్తారు. దాంతో మొండిగా ప్రవర్తిస్తున్నట్టు మనకి అనిపిస్తుంది. ఆ ప్రత్యేక గుణాన్ని గుర్తించండి:  మనం పిల్లల్ని నిందించే ముందు వారిలో వున్న ఆ ప్రత్యేక గుణాన్ని గుర్తించాలి. దానిని సరైన దారిలోకి మళ్ళించాలి. ‘‘రాజీలేని మనస్తత్వం’’ ఎన్నో అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది. కావల్సిందల్లా పట్టు విడుపులు నేర్చుకోవడమే. పిల్లలకు ఆ విషయంపై క్లాసు తీసుకుంటే వాళ్ళకేం అర్థం కాదు. అలాకాక ప్రాక్టికల్‌గా ఆ మనస్తత్వాన్ని వాళ్ళకి వాళ్ళే ఎలా గుర్తించాలో, మనసుని ఎలా మలచుకోవాలో నేర్పించాలి. ఉదాహరణకి స్కూలులో ఇచ్చిన ఏదో ప్రాజెక్టు పనిని ఎంత చేసినా సరిగా రాలేదంటూ పిల్లలు విసుగు పడుతుంటే లేదా మిమ్మల్ని విసుగెత్తిస్తుంటే తేలిగ్గా తీసుకుని కొట్టిపారేయకూడదు. సమస్యపై పనిచేయడం నేర్పాలి:  పిల్లల దగ్గరకి వెళ్ళి కూర్చుని ఇది కొంచెం కష్టమే కానీ, నువ్వు చేయగలవు - ఎటొచ్చీ నువ్వు కాస్త టెన్షన్ పడకుండా చేయాలి. ఓ అరగంట విశ్రాంతి తీసుకుని మళ్ళీ మొదలుపెట్టావనుకో చురుగ్గా చేయగలవు.... ఇలా చెప్పి చూడండి. అలాగే, పిల్లలు ఏదన్నా కావాలని మొండిపట్టు పడితే ‘‘నేను ఇవ్వను’’ అని కచ్చితంగా చెప్పకుండా ‘‘తప్పకుండా ఇస్తాను. కానీ ఇప్పుడు కాదు.. అది ఎందుకు అవసరం... ఇప్పుడే ఎందుకు కావాలి... ఆలోచించి నాకు చెప్పు’’ అనాలిట. ఇలా చేయడం వలన సమస్యపై పనిచేయడం నేర్చుకుంటారుట పిల్లలు. అంటే, రాజీలేని మనస్తత్వం మంచిది కాదు - అది మొండితనమని మనం విమర్శించటం లేదు - కానీ అలా రాజీ పడలేనప్పుడు దానిని ఎలా హ్యాండిల్ చేయాలో నేర్పిస్తున్నాం. అలాగే తన ప్రవర్తనకి కారణాన్ని తానే ఆలోచించుకునేలా చేస్తున్నాం. మనవంతు సహకారం చాలా ముఖ్యం:  పిల్లలు ఎదుగుతూ, చుట్టూ పరిశీలిస్తూ తమ అనుభవాలని సమీక్షించుకుంటూ ఎన్నో నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ వుంటారు. ఆ ప్రయత్నానికి మన వంతు సహకారం అందిస్తే చక్కటి వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటుంది. అలాకాక పిల్లల ప్రతి చర్యనీ విమర్శిస్తూ, అతిగా స్పందిస్తూ, వారిని నిందిస్తూ వుంటే అది క్రమశిక్షణ అని మనం అనుకున్నా, అది పిల్లల సహజ నైజాన్ని, వ్యక్తిత్వాన్ని చిదిమేయడమే అవుతుంది. అందుకే వారిని విమర్శించేముందు, ఎలా సరిచేయొచ్చో ఆలోచించమంటున్నారు నిపుణులు.  -రమ

Easy art by your child

Easy art by your child     You want to keep your child busy, sametime, you want to cherish the messy work your child did !!!! Yes, it can be possible...just take a canvas or a white poster chart, a plastic sheet to cover the floor, few non-toxic water or acrylic colors, cotton balls, small cup of water,  a small plate to mix colors.  On the blank canvas or a poster, if you really want any particular name or design untouched, all you have to do is cover that area with painter's tape, so that after the painting is finished and dry, once you remove the tape, you can see the letters or design you covered in bold white and stunning. Painter's tape does not allow any color seepage.         To start the painting process, Put the first color you want on the plate, mix a little water and ask your child to dab a cotton ball in the color...let your child take free action now. Dab, dab and dab wherever you want...follow with the other colors too....all you have to do is monitor your child's dabbing action, let them follow your instructions on where to dab more and where less...then Stop your child when the whole art is looking good...if you dont stop them there, your child might proceed to spoil the fun...so convince your child to stop painting and hide it from them...the next day, the fantastic artwork is ready to be displayed and you are already proud !!!!! You can make your child finger paint or use plastic hair combs dipped in color to paint on the canvas, just make sure the colors are non-toxic ( not harmful to those tiny hands).   

వేలు వదిలితే చాలు... పిల్లలకి అదే పదివేలు

వేలు వదిలితే చాలు... పిల్లలకి అదే పదివేలు!   ‘‘పిల్లలు ఆత్మవిశ్వాసంతో పెరగాలంటే ప్రత్యేకంగా ఏం చేయక్కర్లేదు.. మీరు గట్టిగా పట్టుకున్న వారి వేలుని వదిలేయండి చాలు’’ ఈ మాటలు అన్నది 12 ఏళ్ళపాటు సుదీర్ఘంగా తల్లిదండ్రులు, పిల్లలపై అధ్యయనం చేసిన ఓ యూనివర్సీటీ బృంద సభ్యులు.పిల్లల్లో ఆత్మవిశ్వాసం అన్న అంశంపై వీరి అధ్యయనం సాగింది. అందులో పిల్లల ఆత్మవిశ్వాసంపై ప్రభావం చూపే అంశాలను పరిశీలించారు. అందులో తల్లిదండ్రుల అతి జాగ్రత్త, ప్రేమ కూడా కారణమని తేలింది. సాధారణంగా పిల్లల మీద ప్రేమకొద్దీ వారికి సంబంధించిన ప్రతి చిన్న విషయంలోనూ జోక్యం చేసుకుంటారు పేరెంట్స్. వారికి తెలీదని, చేతకాదని అంటూ దగ్గరుండి అన్నీ చేస్తారు. సలహాలు, సూచనలు, నీకేం తెలీదనే అదిలింపులు సరేసరి. అయితే ఇది సరికాదని, పిల్లలు పెరుగుతున్న కొద్దీ వారిని నెమ్మది నెమ్మదిగా స్వతంత్రంగా పనులు చేసేలా, ఆలోచించేలా వారికి అవకాశం ఇవ్వాలని అంటున్నారు నిపుణులు. పొరపాట్లు జరిగితే వాటిని సరిదిద్దుకుని తిరిగి ప్రయత్నించమనాలి. పిల్లలు చేసే పొరపాట్లు వారి ఎదుగుదలలో ఓ తప్పనిసరి ప్రాసెస్ అని పేరెంట్స్ అర్థం చేసుకోవాలి. వారు సలహా అడిగితేనే ఇవ్వాలి అంటున్నారు వీరు. ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లల ప్రయత్నాన్ని, తప్పొప్పులని విమర్శించకూడదట. నీవల్ల కాదులే అని చొరబడి వారి పని కూడా చేయకూడదట. అది మూడేళ్ళవాడు కావొచ్చు.. పదమూడేళ్ళవాడు కావొచ్చు.. వాడి పరిధిలో వాడి పనేదో వాడికి చేతనైనట్టు చేయనివ్వాలి. అప్పుడే వారు ‘ఆత్మవిశ్వాసం’ అనే కవచాన్ని పొందగలరు అని గట్టిగా చెబుతున్నారు నిపుణులు. పిల్లల ఎదుగుదల క్రమమంతా ఓ చక్కటి ఆట. ఆ ఆటలో వారు ఒకసారి గెలుస్తారు. మరోసారి ఓడిపోతారు. ఆ ఓటమిలోనే మళ్ళీ ఎలా గెలవాలో వాళ్ళే నేర్చుకుంటారు. తల్లిదండ్రులుగా ఆ ఆటని చూస్తూ ఆనందించడమే మనం వారికివ్వగలిగే అమూల్యమైన బహుమతి. ఏమంటారు? - రమ

Mothers’ Milk must for Premature Babies

Mothers’ Milk must for Premature Babies   Mothers Milk for Premature Baby growth: A recent study which appeared in the Journal of Pediatrics stressed the need for Mothers’ milk for the health and growth of premature babies. Incorporating human milk fat supplement into premature infants' diets improves their growth outcomes in the neonatal intensive care unit (NICUand for premature babies who weigh less than a kg, one of the problems is that their lungs and other organs are still developing when they are born," said Amy Hair, an assistant professor at Baylor College of Medicine in the US. "If the infant gains weight and increases in length at a good rate while in the NICU, this helps improve their (growth) outcomes," Hair added. Previous research has shown that an exclusive human milk diet protects the intestines of premature infants and supports their growth. This diet consists of mothers' own breast milk or donor human milk, as well as a fortifier consisting of protein and minerals made from the donor milk. In this study, researchers sought a way to optimise growth in infants who weigh between 750 and 1,250 grams and need additional calories. As infants are already receiving enough protein from the fortifier, another way to help them grow is by giving them fat. One of the byproducts of pasteurising donor milk is milk fat, also referred to as a cream supplement. They found that infants in the cream group had better growth outcomes in terms of weight and length than infants in the control group.

What not to eat when Breastfeeding

What not to eat when Breastfeeding   Tips for healthy breast feeding: The lucky moms who have no issue can eat whatever they like and their babies enjoy their moms milk. Some babies enjoy the spice if you are fond of spicy food , but if the spice gets a bit too much you know what happens Down under the baby’s bottoms… The first and foremost tip when it comes to proper breast feeding would be to find out on your own as to what suits your baby. Careful examination of what you eat directly affects the baby’s bowels. If the baby feels gassy check on the protein content you are eating. Some babies are allergic to heavy doses of protein which come from meat, poultry and lentils. Mothers report that babies most often object to chocolate, spices (cinnamon, garlic, curry, chili pepper); citrus fruits and their juices, like oranges, lemons, limes, and grapefruit; strawberries; kiwifruit; pineapple; the gassy veggies (onion, cabbage, garlic, cauliflower, broccoli, cucumbers, and peppers); and fruits with a laxative effect, such as cherries and prunes. So eating these in moderation would be the best option. One or two cups of coffee is allowed but too much caffeine can interfere with your baby's sleep or make him/her fussy. Avoid sodas, teas and beverages as they also contain moderate amounts of caffeine. NO alcohol please and if you think you really can’t do without one, go for those mild drinks which have less alcohol content in them. Alcohol increases your blood alcohol level to the point that the alcohol gets into your milk. Some babies are known to be allergic to cows' milk , soya, wheat, egg, nuts, and corn or corn syrup. So if you think that these are causing the baby to go colic its best to avoid them.   Talk to your pediatrician before you stop any foods from your diet if the food causes any allergy. If avoiding foods like dairy products, you may need to see a nutritionist for advice on substituting other foods or taking nutritional supplements. Take your prenatal vitamins as long as you are  breastfeeding  to cover any gaps in your own diet.

The Art of Brushing Baby Teeth

The Art of Brushing Baby Teeth   Teaching toddlers to brush: It’s either a nightmare for some or a pleasant task for some parents whose children totally love the brushing routine. So what should the parents who are facing the task of teaching their child to brush the right way. 1.First and foremost stay Calm - Children have the uncanny ability to detect agitation in the parents. So when you start the first round of brushing session stay calm, use all the tactics you know to distract the child and brush their teeth. 2.Use the latest brushing equipment including the finger brushes so that your finger doesn’t get bitten. 3.Make your child choose his/her own dental supplies, the fancy brushes, sweet toothpastes with cartoon characters and rotary brushes in the super market. 4.Since brushing twice is the order of the day make him/her brush on his own at least once a day so that they get the hang of it. You could brush the teeth and massage the gums the other time so that you can compensate for inadequate brushing. 5.Want them to brush! Then brush along with them. This way they get into the habit and learn while brushing. 6.Make a trip to the dentist so that they feel important and make the dentist talk to them personally and explain oral hygiene. 7.As they grow older make it a point to check on them once in a while and also show them how to floss their teeth. 8.You could figure your own special way to help your children brush their teeth and this could pave way for better oral hygiene in the future.

Pocket money boosts your childs Self worth

Pocket money boosts your childs Self worth   How much pocket money should I give my Child: A Western concept which has picked up pace in India and other Asian countries, giving pocket money to ones child varies from family to family and their earning capabilities. The chores given to the child and the earning capabilities of the parent are the deciding factors of giving pocket money to the child. Another aspect is why do you want to give your child pocket money? Giving pocket money has several benefits other than just helping him/her buy toys or chocolates.   Teaches the value of money and money management at a young age. You can start teaching them the value of money at the earliest, say like from 5 years onwards. This helps the child to plan his/her future finances also. Nothing comes for free! As a parent you earn to take care of your family, so teach your child that money doesn’t come for free, you have to earn it. The concept of saving for a rainy day also can be taught. The child should be encouraged to save money and with banks offering savings accounts for children you could open one for him/her and help them save their pocket money. The child also learns to live within the pocket money s/he earns. If the money is spent quickly s/he will have to wait till the next month. So to spend wisely and appropriately is inculcated. Teaching the child to keep heads of account for the expenditure is another important benefit. S/he will understand the difference when money is spent on entertainment, games, stationery etc. And the most important aspect of Pocket money as reward for work done , is that it develops a healthy self worth and attitude in the child – a wonderful attribute which will be a part of their character- lifelong !

Handling growing pains in Older Children

Handling growing pains in older children A common phenomenon faced by many parents, growing pains are a normal occurrence in about 25 to 40 % of children worldwide. It occurs mostly in the age groups of 3 to 5 year olds and later in 8 to 12 year olds. Sometimes even through all the growing years. It does get a bit bothersome if you have to wake up in the middle of the night and massage your child’s leg, but there is no respite as he/she won’t be able to sleep properly. Why does it happen ? Blame it on the growth of bones or excessive playing, jumping and running around they do during the day; the actual cause is yet to be identified. You would probably notice that the pain is more when they have had a sports day or marathon. How can soothe pain in my child’s legs? 1. Medication like pain relievers should be used a last resort and if it is a chronic problem you could check with the doctor.Calcium supplements should be taken under doctors supervision only. 2. Massage the area with good OTC pain relieving creams, Ayurvedic pain relieving oils or gel for relief. You will need to massage till the child sleeps. 3. If it’s a minor pain , make the child stretch his/her legs and hold the stretch for some time. 4. If you have a heating pad or hot water bottle you could place that on the area which is paining. 5. Another home remedy is to take a tub full of hot water and put a handful of rock salt and soak the child feet. This is an excellent remedy when compared to massaging. Only to do it in the middle of the night could be a bit tiring!