English | Telugu

వేద‌కు య‌ష్ అస‌లు నిజం చెప్పేస్తాడా?

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైన‌ర్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం`. రీసెంట్ గానే స్టార్ మా లో ప్రారంభ‌మైన ఈ సీరియ‌ల్ అన‌తి కాలంలోనే వీక్ష‌కుల మ‌న్న‌న‌లు అందుకుంటూ విజ‌య‌వంతంగా ప్ర‌సారం అవుతోంది. నిరంజ‌న్‌, డెబ్జాని మోడ‌క్ ప్ర‌ధాన జంట‌గా న‌టించారు. బెంగ‌ళూరు ప‌ద్మ‌, జీడిగుంట శ్రీ‌ధ‌ర్‌, అనంద్‌, మిన్ను నైనిక‌, ప్ర‌ణ‌య్ హ‌నుమండ్ల త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. పిల్ల‌లే పుట్ట‌ర‌ని తెలిసిన ఓ డాక్ట‌ర్‌, త‌ల్లి ప్రేమే తెలియ‌ని ఓ పాప క‌థ నేప‌థ్యంలో ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా ఈ సీరియ‌ల్ సాగుతోంది.

ఎలాగైనా య‌శోధ‌ర్ ని ఓడించాల‌ని, త‌న నుంచి ఖుషీని ద‌క్కించుకోవాల‌ని ప్లాన్ చేసిన అభిమ‌న్యు చివరికి నీచ‌మైన ప‌నికి సిద్ధ‌మ‌వుతాడు. త‌న‌కు సంబంధం లేని ఖుషీ త‌న‌కే పుట్టింద‌ని అబ‌ద్దం చెప్పి య‌ష్ ని న‌మ్మించ‌డం మొద‌లుపెడ‌తాడు. అ విష‌యం ఎవ‌రికీ చెప్ప‌లేక త‌న మ‌న‌సులో దాచుకోలేక య‌ష్ న‌ర‌కం చూస్తుంటాడు. ఒక ద‌శ‌లో న‌మ్మి డీఎన్ ఏ టెస్ట్ కు సిద్ధ మ‌వుతాడు. త‌న స్నేహితులు డాక్ట‌ర్ కావ‌డంతో డీఎన్ ఏ టెస్ట్ కు రెడీ అవుతాడు. కానీ చివ‌రి నిమిషంలో త‌ను చేస్తుంది త‌ప్ప‌ని గ్ర‌హించిన విర‌మించుకుంటాడు.

చివ‌రికి ప‌ట్ట‌లేని కోపంతో మాళ‌విక ద‌గ్గ‌రి కి వెళ్లి నిజం చెబుతావా ? హ‌త్య చేయ‌మంటావా? అంటూ బెదిరించి నానా హంగామా చేస్తాడు. అయితే మాళ‌విక తెలివిగా త‌న‌ని వెతుక్కుంటూ నీ మొగ‌డు వ‌చ్చాడ‌ని, నా బెడ్రూమ్ లో దూరి నాతో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తిస్తున్నాడ‌ని వేద‌కు ఫోన్ చేసి అబ‌ద్దాలు చెబుతుంది. అది విని షాక్ కు గురైన వేద వెంట‌నే మాళ‌విక ఇంటికి వెళ్లి య‌ష్ ని తీసుకెళుతుంది. మ‌ధ్య‌లో అస‌లు ఏం జ‌రుగుతోంది? .. మీ బాధ వెన‌కున్న అస‌లు కార‌ణం ఏంటీ? అని య‌ష్ ని నిల‌దీస్తుంది. య‌ష్ అస‌లు నిజం చెప్పేస్తాడా? .. అది విని వేద ఎలా రియాక్ట్ అయింది? .. అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.


Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.