English | Telugu

య‌ష్, వేద‌కు ఖుషి ఆచూకీ చెప్పిన చిట్టి!

కొంత కాలంగా ఆద్యంతం ఆస‌క్తిక‌ర మ‌లుపుల‌తో సాగుతూ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్న సీరియ‌ల్ 'ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం'. నిరంజ‌న్‌, డెబ్జాని మోడ‌క్ జంట‌గా న‌టిస్తున్నారు. ఇత‌ర పాత్ర‌ల్లో బెంగ‌ళూరు ప‌ద్మ‌, జీడిగుంట శ్రీ‌ధ‌ర్‌, ప్ర‌ణ‌య్ హ‌నుమండ్ల‌, ఆనంద్‌, రాజా శ్రీ‌ధ‌ర్‌, సులోచ‌న త‌దితరులు న‌టిస్తున్నారు. మంగ‌ళ‌వారం ఎపిసోడ్ ఎలాంటి మ‌లుపులు తిర‌గ‌నుందో ఒక‌సారి చూద్దాం. ఖుషీ క‌నిపించ‌క‌పోవ‌డంతో అభిమ‌న్యుపై అనుమానం వ్య‌క్తం చేస్తాడు య‌ష్‌. వెంట‌నే వెళ్లి అభిమ‌న్యుని నిల‌దీస్తాడు.

అభిమ‌న్యు మాత్రం ఖుషీని కిడ్నాప్ చేయాల్సిన అవ‌స‌రం త‌న‌కు లేదంటాడు. అయినా స‌రే య‌ష్ వినిపించుకోకుండా అభిమ‌న్యుపై అరుస్తాడు. దీంతో మాళ‌విక మ‌ధ్య‌లోకి ఎంట‌ర‌వుతుంది. "ఖుషీ నా క‌న్న కూతురు. అలాంటిది త‌న‌ని కిడ్నాప్ చేయాల్సిన అవ‌స‌రం నాకు లేదు. ఖుషీ ఎక్క‌డుందో, ఎక్క‌డికి వెళ్లిందో గంట‌లోగా నాకు చెప్ప‌క‌పోతే మీ ఇద్ద‌రిపై పోలీస్ కంప్లైంట్ ఇస్తా" అంటూ బెదిరిస్తుంది. దీంతో అక్క‌డి నుంచి య‌ష్, వేద ఇంటికి వెళ‌తారు. ఖుషీ ఎక్క‌డికి వెళ్లింద‌ని వేద బాధ‌ప‌డుతూ ఇదంతా త‌న వ‌ల్లే జ‌రిగింది అని ఫీల‌వుతుంటుంది.

నీ త‌ప్పేమీ లేద‌ని ఇదంతా త‌న‌ వ‌ల్లే జ‌రిగింద‌ని య‌ష్ వేద‌ని ఓదారుస్తుంటాడు. ఇంత‌లో పెట్ డాగ్ చిట్టి మెడ‌లో లెట‌ర్ తో ఇద్ద‌రి ముందు ప్ర‌త్య‌క్ష‌మ‌వుతుంది. అది చూసిన య‌ష్‌, వేద ఒక్క‌సారిగా షాక్ అవుతారు. "ఖుషీ ఎక్క‌డ చిట్టీ?" అని అడుగుతారు. చిట్టీ (డాగ్‌) మెడ‌లో వున్నచీటీ తీసి ఇద్ద‌రు చ‌దువుతారు. "ఇద్ద‌రూ విడిపోతే మీకు లైఫ్ లో క‌నిపించ‌ను" అంటూ ఖుషీ అందులో రాస్తుంది. వెంట‌నే చిట్టీ స‌హాయంతో ఖుషీ వున్న చోటుకి య‌ష్, వేద వెళ‌తారు.. ఆ త‌రువాత ఏం జ‌రిగింది?.. ఖుషీ అక్క‌డే వుందా? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.