English | Telugu

బాలయ్య 'అన్ స్టాపబుల్'కు చిన్న బ్రేక్!

ఓటీటీ వేదిక ఆహాలో 'అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే' పేరుతో నటసింహం నందమూరి బాలకృష్ణ టాక్ షో చేస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య మొదటిసారి హోస్ట్ చేస్తున్న ఈ షోకి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఫస్ట్ ఎపిసోడ్ కి మోహన్ బాబు, సెకండ్ ఎపిసోడ్ కి నాని గెస్ట్ లుగా వచ్చారు. ఈ రెండు ఎపిసోడ్స్ ప్రేక్షకులను బాగా అలరించాయి. దీంతో మూడో ఎపిసోడ్ ఎప్పుడొస్తుందా? అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే 'అన్ స్టాపబుల్' ఫ్యాన్స్ కి ఓ బ్యాడ్ న్యూస్. ఈ షోకి చిన్న బ్రేక్ వచ్చిందని, మూడో ఎపిసోడ్ రావడానికి టైం పడుతుందని న్యూస్ వినిపిస్తోంది. అందుకే ఇంతవరకు మూడో ఎపిసోడ్ ప్రోమో విడుదల కాలేదని తెలుస్తోంది.

'అన్ స్టాపబుల్' షో మూడో ఎపిసోడ్ గెస్ట్ గా హాస్యబ్రహ్మ బ్రహ్మానందం వస్తారని మొదట ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ పేరు వినిపిస్తోంది. 'అన్ స్టాపబుల్' మూడో ఎపిసోడ్ ని విజయ్ తో ప్లాన్ చేశారట షో నిర్వాహకులు. అయితే బాలయ్య చేతికి చిన్న సర్జరీ జరగడంతో షూటింగ్ వాయిదా పడిందట. మళ్ళీ షూట్ ప్లాన్ చేద్దామనుకున్న టైంలో 'లైగర్' మూవీ షూటింగ్ కోసం విజయ్ అమెరికా వెళ్ళడంతో.. 'అన్ స్టాపబుల్'కి చిన్న బ్రేక్ వచ్చిందట. విజయ్ అమెరికా నుంచి రాగానే 'అన్ స్టాపబుల్' షోలో పాల్గొంటాడని, కాస్త ఆలస్యమైనా గత రెండు ఎపిసోడ్స్ ని మించేలా ఈ ఎపిసోడ్ లో ఎంటర్టైన్మెంట్ ఉంటుందని అంటున్నారు.

బాలయ్య షోకి విజయ్ రానున్నాడన్న న్యూస్ తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. వీరిద్దరూ కలిస్తే ఎంటర్టైన్మెంట్ మాములుగా ఉండదని ఎగ్జైట్ అవుతున్నారు. ఈ న్యూస్ నిజమైతే ఆ ఎపిసోడ్ నిజంగానే 'అన్ స్టాపబుల్' ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది అనడంలో సందేహం లేదు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.