English | Telugu

గుప్పెడంత మ‌నసు :  జోరు వాన‌లో రిషి.. వ‌సుధార‌

`స్టార్ మా`లో ప్ర‌సారం అవుతున్న ధారావాహిక `గుప్పెడంత మ‌న‌సు`. క‌న్న‌డ న‌టీన‌టులు ముఖేష్ గౌడ‌, అక్ష గౌడ‌, సాయికిర‌ణ్, జ్యోతి రాయ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. గ‌త కొంత కాలంగా ప్ర‌సారం అవుతున్న `గుప్పెడంత మ‌న‌సు` మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. ఈ మంగ‌ళ వారం 293వ ఎపిసోడ్‌లోకి ఎంట‌ర‌వుతోంది. ఈ సంద‌ర్భంగా ప‌లు ర‌స‌వ‌త్త‌ర సంఘ‌ట‌న‌లు చోటు చేసుకోనున్నాయి.

వ‌సుధార‌, రిషిలుగా న‌టిస్తున్న ముఖేష్ గౌడ‌, అక్ష గౌడ‌ల మ‌ధ్య ఈ రోజు ఎపిసోడ్‌లో ర‌స‌వ‌త్త‌ర మ‌లుపులు చోటు చేసుకోబోతున్నాయి. రిషిపై కోపంతో అత‌ని కార్‌ని ఛేజ్ చేసి అడ్డుకున్న వ‌సుధార ఏం చేసింది? .. రిషిని ఏ స్థాయిలో నిల‌దీసింది అన్న‌ది ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. త‌న‌ని అడ్డ‌గించిన వ‌సుధార `మీరు అడ్డ‌దిడ్డంగా నిర్ణ‌యాలు తీసుకుంటే అడిగే అడ్డ‌గించే హ‌క్కు నాకుంది` అంటూ నిల‌దీస్తుంది. యీరు స‌మాధానం చెప్పేవ‌ర‌కు ఇక్క‌డే వుంట‌న‌ని భీష్మిస్తుంది.

నీకు స‌మాధానం చెప్పాల్సిన అవ‌స‌రం నాకు లేద‌ని రిషి అక్క‌డి నుంచి వెళ్లిపోతాడు. అయితే వ‌సుధార మాత్రం అక్క‌డే వుంటుంది. వ‌ర్షం వ‌చ్చేలా వుండ‌టంతో వ‌సుధార కోసం జ‌గ‌తి కంగారు ప‌డుతూ వుంటుంది. కంగారుగా మ‌హేంద్ర .. రిషికి కాల్ చేస్తే క‌ట్ చేసి ఫోన్ స్విచ్ఛాఫ్ చేస్తాడు రిషి. అయితే ధ‌ర‌ణికి ఫోన్ చేసి వ‌సుధార ఎక్క‌డ అని రిషిపై అరుస్తాడు మ‌హేంద్ర‌. దీంతో వ‌సు మాట‌లు గుర్తొచ్చి రిషి త‌న ఫోన్‌ని ధ‌ర‌ణికి ఇచ్చేసి అక్క‌డి నుంచి వ‌సుధార‌ని వెతుక్కుంటూ వెళ్లిపోతాడు. వ‌ర్షంలో త‌డుస్తూ నిలుచున్న వ‌సుధార ఏం చేసింది. రిషి ఎలా వ‌సుధార‌ని ఒప్పించాడు? .. ఈ క్ర‌మంలో ఇద్ద‌రి మ‌ధ్య ఎలాంటి సంభాష‌ణ చోటు చేసుకుంది అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.