English | Telugu

ఇట్లు మీ ‘రిషిధార’.. సెకండ్ పార్ట్ తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తా

గుప్పెడంత మనసు సీరియల్ ఐపోవడం ఆడియన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ‘రిషిధార’ ఫ్యాన్స్ అస్సలు తట్టుకోలేకపోతున్నారు. ఈ సీరియల్ లో రిషి, వసుధార బాగా సెట్ అయ్యారు. దాంతో ఆడియన్స్ కి వాళ్లకు బాగా కనెక్ట్ అయ్యారు. వాళ్ళ నటన చాలా సహజంగా అనిపించేలా ఉంటుంది. ఏదో సీరియల్ చేస్తున్నట్టుగా కాకుండా, ఇంట్లో మనుషుల్లా అనిపిస్తారు వీళ్ళు అందుకే వీళ్ళను ఆడియన్స్ గుండెల్లో పెట్టుకున్నారు.

ఐతే రీసెంట్ గా వీళ్ళు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గుప్పెడంత మనసు సీరియల్ సీక్వెల్‌తో మళ్లీ వస్తానంటూ మాటిచ్చింది వసుధార. సీరియల్ ఐపోవడం తనకు ఎంతో బాధకలిగిస్తోందని చెప్పింది. ఇన్‌స్టాగ్రామ్‌లో అందరికీ అందుబాటులో ఉంటాను అని చెప్పింది. ఈ సీరియల్ అయిపోతుందని తెలిసి తనకు ఒక కేక్ పంపించారట అభిమానులు. దాంతో పాటు ఒక బాక్స్ కూడా ఉందని చెప్పింది. ఐతే ఈ సీరియల్‌లో వసు ఎప్పుడూ నెమలి ఈకలు పుస్తకాల్లో పెట్టుకుని తిరుగుతూ ఉండడం మనం చూసాం. ఐతే చాలా సార్లు ఈ విషయం గురించి తన డైరెక్టర్‌ని అడిగేదాన్ని అని చెప్పింది. ఐతే ఇప్పుడు తన ఫాన్స్ కేక్‌పై కర్చీఫ్, గోలీలు, నెమలి ఈకలు, కాఫీ, పుచ్చకాయ, కొబ్బరి బొండం ఇవన్నీ పెట్టి పంపించారు షూటింగ్ లాస్ట్ డే ఇవన్నీ చూసేసరికి ఆడియన్స్‌కి ఇవన్నీ ఎంత కనెక్ట్ అయ్యాయో తెలిసిందని చెప్పుకొచ్చింది. ఈ సీరియల్ షూటింగ్ ఎప్పుడూ ఎంతో సందడిగా సాగుతూ ఉంటుంది అని చెప్పింది. ఆ సందడి మిస్ అవుతున్నందకు బాధగా ఉంది కానీ మళ్లీ కలుస్తాననే హోప్ ఉంది అంటూ చెప్పింది.


Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.