English | Telugu

హైప‌ర్ ఆదికి ల‌వ్‌ ప్ర‌పోజల్‌.. చెంప ప‌గ‌ల‌గొట్టిన ర‌ష్మీ!

జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షోతో పాపుల‌ర్ అయిన వారు సుడిగాలి సుధీర్‌, ర‌ష్మీ గౌత‌మ్‌, ఆటో రామ్ ప్ర‌సాద్‌, హైప‌ర్‌ ఆది, గెట‌ప్ శ్రీ‌ను. వీళ్ల‌తో పాటు వ‌ర్ష‌, ఇమ్మానుయేల్‌, తాగుబోతు ర‌మేష్‌, రాకింగ్ రాకేష్.. ఇలా చాలా మందే వున్నారు. వీళ్ల‌లో సుడిగాలి సుధీర్ కంప్లీట్ గా ఈ షోని వ‌దిలేశాడు. ర‌ష్మీ గౌత‌మ్‌, ఆటో రామ్ ప్ర‌సాద్ తో పాటు కొంత మంది వున్నారు. ఈ షో నుంచి బ‌య‌టికి వెళ్లిన సుడిగాలి సుధీర్ ఈటీవీ ఛాన‌ల్ లో ప్ర‌సారం అవుతున్న మ‌రో షో `శ్రీ‌దేవి డ్రామా కంపెనీ`కి యాంక‌ర్ గా, టీమ్ లీడ‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు.

అయితే గ‌త కొన్ని వారాలుగా సుడిగాలి సుధీర్ ఈ షోలోనూ క‌నిపించ‌డం లేదు. అత‌ని స్థానంలో కొత్త‌గా ర‌ష్మీ గౌత‌మ్ షోలోకి ఎంట్రీ ఇచ్చేసింది. ఇక్క‌డ కూడా ఆటో రామ్‌ప్ర‌సాద్‌, హైప‌ర్ ఆది అండ్ కోతో క‌లిసి స్కిట్ ల‌లో పాల్గొంటూ మ‌ధ్య మ‌ధ్య‌లో యాంక‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తోంది ర‌ష్మి. ఈ షోకు పూర్ణ జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఇంద్ర‌జ లేక‌పోవ‌డంతో జ‌డ్జిగా పూర్ణ‌ని రంగంలోకి దించేశారు. తాజాగా ఆదివారం ప్ర‌సార‌మైన ఎపిసోడ్ లో ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న చోటు చేసుకుంది. స్టేజ్ పై క‌ళ్లు తిరిగిప‌డిపోయిన‌ట్టుగా యాక్ష‌న్ చేసి అంద‌రిని హ‌డ‌లెత్తించిన ర‌ష్మీ.. ఏమైంది అని అంతా అడిగితే స్టంటు అంటూ న‌వ్వేసింది.

ఇక ఆ త‌రువాత 'నువ్వు ఎవ‌రిని ల‌వ్ చేస్తున్నావో తెలుసుకోవ‌చ్చా?' అని నూక‌రాజు యంగ్ బ్యూటీ రీతూ చౌద‌రిని అడిగితే `నాకు ఒక‌త‌నంటే ఇష్టం.. అది అత‌నికి కూడా తెలుసు. అత‌ను ఇక్క‌డే వున్నా'డంటూ హైప‌ర్ ఆదిని స్టేజ్ పైకి తీసుకెళ్లి 'ఐ ల‌వ్ యూ' అంటూ షాకిచ్చింది. ఏం జ‌రుగుతోందో తెలుసుకోలేక హైప‌ర్ ఆది షాక్ లో వుండిపోయాడు. 'త‌ను చెప్పింది మ‌రి నీ స‌మాధానం ఏంటీ?' అని పూర్ణ .. హైప‌ర్ ఆదిని అడిగింది. 'నాకు నిజంగా అలాంటి ఉద్దేశ్యం లేదు' అని చెప్ప‌గానే రీతూ స్టేజ్ దిగి సీరియ‌స్ గా వెళ్లిపోయింది.

ఆ వెంట‌నే ఆది ద‌గ్గ‌రికి వ‌చ్చిన ర‌ష్మీ చెంప ఛెళ్లుమ‌నిపించేసింది. 'ఒక‌మ్మాయి మ‌న‌సుని విర‌గ్గొట్టావు నువ్వు మ‌నిషివా ప‌శువువా?' అని ర‌ష్మీ .. ఆది పై ఫైర్ అయింది. `ఇదే మాట‌ బాబు (సుధీర్‌)ని అడుగుతావా?' అని హైప‌ర్ ఆది అన‌డంతో న‌వ్వులు విరిశాయి. ర‌ష్మీ, ఆదిని కొట్ట‌డం అనేది ఓ డ్రామా అని తేలిపోవ‌డంతో అక్క‌డున్న‌వారంతా న‌వ్వుల్లో మునిగిపోయారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.